Wednesday, March 5, 2025

 *`భార్యభర్తల బంధం అంటే ఒకే వ్యక్తితో ప్రతి రోజు  ప్రేమలో పడటం..`*

*భోజనం చేసేటప్పడు ఏమండీ.. అని పిలిచింది అంటే భోజనం టేస్ట్ గురించి అడిగింది అని అర్ధం..*

*అద్దం ముందు నిలబడి ఏమండీ.. అని పిలిచింది అంటే చీరలో తనేలా ఉంది అని చెప్పమని అర్ధం...*

*నడిచేటప్పుడు ఏమండీ.. అని పిలిచింది ఆంటే వేలు పెట్టుకుని  నడవమని అర్ధం...*

*హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు ఏమండీ.. అని పిలిచింది అంటే డాక్టర్ తో మీరు మాట్లాడటానికి రండి అని అర్ధం..*

*కల్యాణ మండపంలో ఏమండీ.. అని పిలిచింది అంటే ఎవరో తెలిసినవారు వచ్చారు అని అర్ధం...*

*బట్టలు షాపులో ఏమండీ... అని పిలిచింది అంటే తనకు నచ్చిన చీర దొరికుంది అని అర్ధం..*

*బండిలో వెళ్ళేటప్పుడు ఏమండీ... అని పిలిచింది అంటే పూలు కొనమని  అర్ధం...*

*రెస్టారెంట్ లో తిన్నాక ఏమండీ.. అని పిలిచింది అంటే బిల్లు కట్టమని అర్ధం...*

*నీవు చివరి శ్వాస తీసుకునేటప్పుడు ఏమండీ... అని పిలిచింది అంటే నీతోపాటు నన్ను తీసుకెళ్ళు అని అర్ధం..*

*👇అను నిత్యం👇*

*ఏమండీ...అంటూ చంపేస్తుంది అని అపార్ధం చేసుకోవడం కాదు. అర్ధం చేసుకుని మసలుకోవడంలోనే అనంతమైన ఆనందం ఉందని గుర్తిస్తే జీవితం సంతోషమయం అవుతుంది. ప్రపంచం మొత్తం ఒకవైపు నీవు మాత్రమే ఒకవైపు, నిన్నే ప్రపంచంగా బ్రతుకుతుంది..!!*

No comments:

Post a Comment