నేను నిన్ను శపిస్తున్నాను వాసుదేవా!
ఈనాడు ఈ విధంగా కురుకుల సంహారం జరిగిందో...
సరిగ్గా 36 సంవత్సరాలకు యాదవ కులం కూడా పరస్పరం సంహరించుకొని పూర్తిగా నాశనం అవుతుంది.
-కుంతి
అంతేనా ....
మాకు మీరు విధించే శిక్ష ఇంతేనా ...
యాదవులు తమ సామర్ధ్యాన్ని చూసి తామే గర్వపడుతుంటారు
వారు ఆ దారిలో వెళ్లకుంటేనే ఎక్కువ ఆశ్చర్యపోవాలి
మీ శాపం ఒక రకంగా దీవెన
దాన్ని నేను స్వీకరిస్తున్నాను మాతా
- శ్రీకృష్ణుడు
********
మహాభారత యుద్దానంతరం 36 సంవత్సరాల తరువాత యదువంశం నశించింది; యిది అన్ని గ్రంధాల్లోను పేర్కొనబడిన వాస్తవం.
ఈ కాలమంతా శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు. ఈ వ్యవధి అయన చేసిన ఏదైనా విశేష కార్యం కానీ మనకు ఎక్కడా కనిపించదు.
అంతే కాదు, ఈ సుదీర్ఘ కాలంలో అయన ద్వారక దాటి హస్తినాపురానికి గానీ వెళ్ళినట్లు గానీ, తన ప్రియసఖుడైన అర్జునుణ్ణి కలిసినట్లుగానీ మనకు కనిపించదు.
సుదీర్ఘ కాలం జీవించాక, ఆఖరి ఘడియలు ఓ కుటుంబ పెద్దలాగా, నిర్వికారభావంతో గడిపినట్లు, శ్రీకృష్ణుడు జీవించి ఉంటాడని అనిపిస్తుంది.
ఈ ముప్పైఆరు సంవత్సరాల కాలానికి సంబంధించి దొరికిన వివరాల ఆధారంగా వీటికో కధారూపం యిచ్చే ప్రయత్నం చేశాను.
- దినకర్ జోషి
No comments:
Post a Comment