🙏 *రమణోదయం* 🙏
*సంతుష్టే మన స్వరూపం. ఇది తెలియక తృప్తి కొరకే తాను భుజిస్తున్నానని భావించి దానిపై అనురక్తుడైతే, ఆ అన్నమే అతనిని కబళించి, తీరని అసంతృప్తికి వశుని చేస్తుంది.*
వివరణ: *అన్నం అంటే కేవలం పోషకాహారమే కాకుండా, అనుభవించడానికి దొరకే పంచేంద్రియాహారాలనబడే భోగాలను కూడా సూచిస్తుంది. మనకి అన్యమైన విషయ భోగాలని (ఆహారాన్ని) ఆశిస్తే, అదే మనలని అసంతృప్తులను చేసి, కబళించి తీరని వేదనలకు గురిచేస్తుందని భావం.*
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో -సం.590)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె
పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి
యరుణాచలమిది*||
🌹🌹🙏🙏 🌹🌹
No comments:
Post a Comment