Wednesday, March 26, 2025

 *పూర్వ జన్మల వాసనలు బట్టి త్రిగుణాల సమ్మేళనం ఉంటుంది. దాని నిష్పత్తి మారుతూ ఉంటుంది, మరి ఈ జన్మలో మంచి సంస్కారం అబ్బ లేదు. పోయిన జన్మలో మంచి కర్మ, పుణ్యకార్యం చేయ లేదు.*

*కావున ఈ జన్మలో మంచి బుద్ధి రాలేదు. మంచి రాత రాలేదు...* 

*మంచి సంస్కారం లేదు కాబట్టి, ఈ జన్మలో కూడా మంచి పని చేయడానికి బుద్ధి రాదు, మనసు రాదు... కాబట్టి వచ్చే జన్మలో కూడా మంచి సంస్కారం రాదు.*

*ఇది ఇలాగే కొనసాగిపోతుంది... మరి ఎలాగా? ఉద్దతి ఎలాగా ఈ జీవికి? బాగు పడడానికి మార్గం లేదా? ఉన్నది... సత్ స్సాంగత్యం... మహా పురుషుల మాటలు బలవంతంగానైనా విని తీరాలి. ఎందుకంటే మన మనస్సు వినదు మంచి మాటలు. గురువులు చెప్పే ప్రవచనాలు వినదు.!* 

*పైగా దేవుడు ఉన్నాడా? అని ప్రశ్నిస్తుంది? పైశాచిక సిద్ధాంతాన్ని లేవదీస్తుంది, వితండవాదం చేస్తుంది, అంతా చాదస్తం, మూఢ నమ్మకాలు అని మన చేత అనిపిస్తుంది. దేవుడిని, ధర్మాన్ని నమ్మదు. గురువుల మాట చెవికెక్కించుకోదు. ఒక గుడికి పోదామని ఉండదు. మంచి మాటలు తలకెక్కవు..* 

*ఇక్కడే జాగ్రత్తగా వుండాలి.* 

*ఇక్కడే మనకు మన పురాణాలు, వేద వాంజ్ఞ్మయం అక్కరకు వస్తుంది. మన పెద్దలు, గురువులు ఆచరించి చేసి చూపించారు. కళ్లు మూసుకొని గుడ్డిగా వారి మార్గంలో బలవంతంగానైనా సరే మనసు మార్చుకొని నడవడమే.*

*నీ తల్లి నీకు చెడు చెప్పదు. నీ తండ్రి నీకు అబద్ధం చెప్పడు.* 

*నీ గురువులు నీకు అధర్మం బోధించరు. మరి నీకు ఎందుకు అప నమ్మకం.* 

*అనుసరించు భక్తి మార్గంలో పెద్దలు చెప్పినట్లు.* 

*సత్ స్సాంగత్యం ఏర్పర్చుకో. మహా పురుషులు పుట్టిన నేల ఇది. మహా వాక్యములు విను, ప్రవచనాలు విను, రామాయణ, మహాభారతాది గ్రంథములను చదువు, ఈ జన్మలో నీ బాట మార్చుకో నీ మార్గం మార్చుకో, సన్మార్గంలో నడువు, వచ్చే జన్మకు నీ వాసనలు మార్చుకో. అంతే మంచి సంస్కారం, మంచి పుట్టుక, మంచి బుద్ధులు, మంచి తలరాత లభిస్తుంది. కావలసినది నిన్ను అరిచి తగవులాడి, నాలుగు తన్ని నీ మార్గాన్ని మార్చే గురువు కావాలి.*

*నీ పాపాన్ని హరించి వేసే గురు దేవుళ్లు కావాలి అంతే.* 

*పరమ భాగవత్తోత్తములు పుట్టిన నేల. గొంతు చించుకొని కష్టపడి అరిచి, ప్రాణం అడ్డుగా పెట్టి ప్రవచించే పరమ గురువులు, ఆది గురువులు పుట్టిన నేల ఇది. చేయవలసినదంతా వారి అడుగు జాడలలో నడవడమే.*
 

*┈┉┅━❀꧁ హరి ఓం ꧂❀━┅┉┈*
       *ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🌹🪷🌹 🌷🙇🌷 🌹🪷🌹

No comments:

Post a Comment