🙏 *రమణోదయం* 🙏
*సత్తుగా ప్రకాశిస్తున్న తన ఆత్మను వదలి, ఆకాశంలోని నీలిరంగులాగ, లేని అసత్య విషయ వస్తువులను దోష దృష్టితో చూసి మనస్సు భ్రాంతి చెందుతుంది. ఆ మనస్సే భ్రాంతితో కూడిన మహాసంసారం.*
'నేను చేస్తున్నాను' అనే భావనే అవరోధము.
'ఎవరు చేస్తున్నారు'? అని నిన్ను నీవు ప్రశ్నించుకో.
ఏది నిర్ణయించబడియున్నదో అది జరుగుతుంది.
నీవు పనిచేయకూడదు అని నిర్ణయించబడివుంటే
నీ వెంత ప్రాకులాడినా ఆ పని నీవు చేయలేవు.
అదే నీవు చేయాలి అని వ్రాసి ఉంటే
నీవు దానిని తప్పించుకోలేవు.
నీ వెంత చేయకూడదు అనుకున్న
చేసే తీరాల్సి వస్తుంది.
కాబట్టి, అంతా ఆ పరమాత్మ శక్తికే వదలివేయి.
నీకు నీవు ఏదీ వదలలేవు,
ఇష్ట ప్రకారము నిలుపుకోనూ లేవు.
ఏదో తెలియని శక్తి తనను కాపాడుతున్నదని
ఒక నిజమైన భక్తుడికి తెలుస్తుంది.
అటువంటి నిజమైన భక్తుడిలోనే
ఈశ్వరుడు కొలువై ఉంటాడు.🙏
అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..
అరుణాచలా!🌹🙏
*భగవాన్ శ్రీరమణ మహర్షి*
(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.614)
సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి
🪷🪷🦚🦚🪷🪷
*స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |
*కరుణామృత జలధి యరుణాచలమిది*||
No comments:
Post a Comment