40 ప్లస్...* ----
ఇటీవలే ఓ సర్వేలో తేలిన విషయాలు.. 11% శాతమే 60 దాటుతున్నారు .. 7% శాతం మాత్రమే 65 దాటి 70కి రీచ్ కాగలుగుతున్నారు.. 5% శాతం మాత్రమే 80కి రీచ్ కాగలుగుతున్నారు.. 3% శాతం మాత్రమే 80 దాటగలుగు తున్నారు. అధిక మరణాల సంఖ్య 70-80 మధ్యనే ఉంటోంది. 50-55 దాటినవారు కూడా ఈ డేటాని గమనించాలి. ఐనా.. వర్రీ ఫ్రీ & టెన్షన్ ఫ్రీ లైఫ్ కి ఈ సింపుల్ సూత్రాలు పాటించండి..
1) సంతోషమే సగం బలం.. ఎప్పుడూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి..
2) కోపం, ద్వేషం, ఆవేశం, అహంకారం.. ఈ దుష్టచతుష్టయాన్ని వదిలేయండి..
3) స్వీట్ & సాల్ట్ బాగా తగ్గించేయండి..
4) ఇంటి ఇలవేలుపు, ఇష్ట దైవం పై నమ్మకం పెంచుకోండి..
5) కడుపులో ఎప్పుడూ మంచి నీరు ఉండేలా చూసుకోండి. యూరినేషన్ ఐన తరువాత ఓ అరగ్లాసు మంచి నీళ్ళు తాగడం మరువకండి..
6) వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్.. సమయం క్రమం తప్పకుండా వీటిలో ఒకటి రెండు చేస్తుండండి.
. 7) అరగంట కోసారి కదలిక ఉండేలా చూసుకోండి..
8) ఈట్ టు లివ్. పిండి పదార్థాలు తగ్గించి ప్రొటీన్లు విటమిన్లు ఎక్కువగా తీసుకోండి..
9) కాఫీ ఐనా టీ ఐనా రోజుకి మూడు సార్లు మించకుండా తీసుకోండి అలవాటు ఉంటే..
10) మోహాలు, వ్యామోహాలు వదిలేయండి.. మీ ఆనందమే ముఖ్యం
11) ఆరోగ్యం సహకరించినంత వరకు సంవత్సరానికి రెండుసార్లు ఊళ్ళకి యాత్రలకి వెళుతుండండి. ఫారిన్ టూర్స్ తగ్గించండి..
12) ఎవరినీ విమర్శించకండి ద్వేషించకండి..
13) పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు గనుక వారి విషయంలో జోక్యం చేసుకోకండి. అడిగితేనే సలహాలు సూచనలు ఇవ్వండి..
14) అందుబాటులో ధ్యాన కేంద్రాలు ఉంటే వెళుతుండండి..
15) బిగుసుగా ఉండే బట్టలు వేసుకోకండి..
16) ఉన్న అభిరుచులను (హాబీలు) పెంచుకోండి. మెదడుకు పదును పెట్టే క్రాస్ వర్డ్ పజిల్స్, సుడోకు, చేస్తుండండి..
17) మనసుకు నచ్చిన పుస్తకాలు చూడండి/చదవండి..
18). ఫ్యామిలీ, ప్రెండ్స్ ముఖ్యం.
19) హెల్త్ చెకప్స్ క్రమం తప్పకుండా చేసుకుంటూ వైద్యుల సలహాలు పాటిస్తుండండి..
20) ఓల్డ్ మెమోరీస్ గుర్తు చేసుకుంటూ మీ వయసువారితో షేర్ చేసుకుంటుండండి..
21) చివరిగా ఎప్పుడూ పాజిటివ్ దృక్పథం తోనే ఉండండి..
No comments:
Post a Comment