Sunday, March 2, 2025

 *🔊UPI payments: యూపీఐ... చెల్లింపుల్లో జాగ్రత్త*

*🍥నిత్య జీవితంలో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఒక విడదీయరాని బంధంగా మారింది. రూపాయి చెల్లించాలన్నా.. అలా ఫోన్‌ తీసి, క్యూఆర్‌ స్కాన్‌ చేసేస్తున్నాం. గత నెలలో దాదాపు రూ.23.48 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఇదే సమయంలో దీనికి సంబంధించిన మోసాలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీఐ ఆధారంగా చేసే మోసాల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి.*

*➡️బ్యాంకు ప్రతినిధులుగా చెప్పి ఫోన్లు వస్తుంటాయి. డెబిట్‌ కార్డులో చివరి నాలుగు అంకెలు చెప్పి, యూపీఐ పిన్‌ లేదా ఓటీపీలాంటివి చెప్పాలని అడుగుతుంటారు. బ్యాంకు నుంచి వచ్చినట్లు మోసపూరిత ఇ-మెయిళ్లు పంపించి, లింకులను క్లిక్‌  చేసి, వివరాలను పూర్తి చేయాలని అంటారు. ఇలాంటి వాటికి ఎప్పుడూ స్పందించకూడదు.*
    
*➡️కొన్నిసార్లు కొత్త యూపీఐ యాప్‌ వచ్చింది, డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా సందేశాలు వస్తుంటాయి. వీటిని నమ్మి వివరాలు ఇచ్చాం అనుకోండి. మన ఖాతాను ఖాళీ చేసేందుకు అవతలి వారు సిద్ధంగా ఉంటారు.*
    
*➡️ఏదో ఒక వస్తువు కొన్నందుకు మీకు నగదు వాపసు వచ్చిందని, దీన్ని స్వీకరించేందుకు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి, పిన్‌ నమోదు చేయాల్సిందిగా సూచిస్తుంటారు. గుర్తుంచుకోండి... డబ్బు పంపేందుకే మీరు క్యూఆర్‌ స్కాన్‌ చేసి, పిన్‌ను నమోదు చేయాలి.*
    
*➡️సంక్షిప్త సందేశాల రూపంలో సైబర్‌ మోసగాళ్లు ఏదో లింక్‌ను పంపిస్తారు. దీనిపై అసలు అనుమానం రాకుండా ఏదో విషయం ఉంటుంది. దీన్ని క్లిక్‌ చేస్తే వెంటనే యూపీఐ యాప్‌లకు వెళ్లడం, పిన్‌ ఎంటర్‌ చేయమని అడిగేస్తాయి. ఏమరుపాటుగా ఉన్నామా.. ఖాతా ఖాళీ అయినట్లే.*
    
*➡️ఇప్పుడు కొత్తగా కొన్ని మోసపూరిత ఉద్యోగ ప్రకటనలు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు యూపీఐ ద్వారా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించాలని అడుగుతారు. అలా చెల్లిస్తేనే దరఖాస్తు చేసేందుకు వీలవుతుందని చెబుతారు. ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకున్నాకే ఇలాంటి వాటికి స్పందించాలి.*
     
*➡️అనుకోకుండా మీ నంబరుకు డబ్బు పంపించాం. ఇదిగో స్క్రీన్‌షాట్‌ అంటూ ఫోన్లు వస్తుంటాయి. తిరిగి మా డబ్బు మాకు పంపించాల్సిందిగా అడుగుతుంటారు. ఖాతాలో నిజంగా ఆ డబ్బు జమ అయ్యిందా లేదా అనేది చూసుకోకుండా వారికి తిరిగి డబ్బు పంపిస్తుంటాం. ఇలాంటి విషయాల్లో ఏమరుపాటు పనికిరాదు. పొరపాటుగా డబ్బులు వచ్చాయని చెప్పినా.. ఆ విషయాన్ని మీ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాకే స్పందించాలి.*
    
*➡️సామాజిక వేదికల్లో వచ్చే విక్రేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి వారికి యూపీఐ ద్వారా డబ్బు పంపి, వస్తువు కొనుగోలు చేస్తుంటారు చాలామంది. ఇందులో ఎవరు మోసపూరిత వ్యక్తులో మనకు తెలియదు. కాబట్టి, పూర్తి వివరాలు తెలుసుకున్నాకే, ఇంటికి వస్తువు వచ్చాకే చెల్లించే వీలున్నప్పుడే కొనుగోలు చేయండి.*

No comments:

Post a Comment