Wednesday, March 26, 2025

 Be ready for the silent war! 
ఇప్పుడు మనం ఇతర మతాల వారితో ఫైటింగులు చెయ్యాల్సిన పనిలేదు, వాళ్ళ గ్రంధాలలో తప్పులు చూపించి, వాదించాల్సిన పనీ లేదు! జస్ట్ "మన గ్రామంలోని రాలయాలలో నిత్యం సాయంత్రం ప్రజల సమక్షంలో చక్కగా తెలుగు చదవగలిగిన వారితో,మైకులో రామాయణం చదివించడం మరియు ఆదివారం ఉదయం అక్కడ భగవద్గీత నేర్పించడం, క్లాసు పూర్తయ్యాక ఇక్కడ జరిగే కార్యక్రమంలో ప్రజలందరినీ పాల్గొనమని పిలుపునిచ్చే  బేనర్లను పట్టుకొని, జై శ్రీ రాం నినాదంతో నగర సంకీర్తన చేస్తూ వాకింగ్ చెయ్యడం" అనే కార్యక్రమంతో మన వారిని చైతన్యవంతులను చేస్తే చాలు, మనం చాలా తేలికగా ఈ యుద్ధం గెలవగలం! కానీ ఇప్పుడు మనం  తేలికగా గెలవగలిగే ఈ కార్యక్రమం (యుద్ధం) చెయ్యడం మానివేస్తే, మన గ్రామాలలో క్రమంగా వాళ్ళ డామినేషన్ పెరిగి, చివరికి మనల్ని కనీసం నిలబడి నీళ్ళు కూడా త్రాగనివ్వరు! అప్పుడు అక్కడ మనం బ్రతకాలంటే చచ్చినట్లు  వాళ్ళ మతానికి మనం మారి తీరాల్సిన పరిస్థితిని సృష్టిస్తారు! తేలికగా యుద్ధం గెలిచే అవకాశం వచ్చినప్పుడు కూడా చేయకుండా చేతులు పిసుక్కుని కూర్చుని, ఆనక బాధలు అనుభవించే వాడిని "చవట సన్నాసి" అనే అంటారు! 
ఈ ఉద్యమాన్ని "Silent War" అని ఎందుకు అంటున్నానంటే, రామాయణం చదువుకోవద్దని గానీ, జై శ్రీరాం నినాదంతో నగర సంకీర్తన చెయ్యవద్దని గానీ రాజ్యాంగంలో లేదు! కానీ ఈ కార్యక్రమంతో తప్పకుండా అన్య మతాల విస్తరణకు బ్రేకులు పడతాయి! త్వరలోనే మత మార్పిడితో అన్య మతానికి మారిన వాళ్ళు సైతం తిరిగి స్వధర్మానికి చేరుకుంటారు!అలాగే మన వాళ్ళలోనూ మన గ్రంథాల పట్ల అవగాహన పెరుగుతుంది, మంచి లక్షణాలు అలవడతాయి, దేవాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా మారతాయి, ఇలా "ఒక్క దెబ్బకు వంద పిట్టలు" అన్నట్లు "ఒక్క కార్యక్రమంతో వంద ప్రయోజనాలు"! కాబట్టి  "Be ready for this silent war"! .... మీ సకురు అప్పారావు, కవి, హోమియో డాక్టర్!

No comments:

Post a Comment