Story Gate : వామ్మో! అల్యూమినియం ఇంత డేంజరా!! | Danger Aluminium -TV9
అల్యూమినియం తో మనిషికి విడదీయరాని సంబంధం ఏర్పడింది అల్యూమినియం పాత్ర లేని ఇల్లు లేదు అంతగా మన జీవితాల్లో నిండిపోయింది ఈ లోహం మరి అల్యూమినియం పాత్రలే ఇప్పుడు మనిషి ఆరోగ్యానికి చెక్ పెడుతున్నాయా ఎలాగంటారా ఈ స్టోరీ [సంగీతం] చూసేయండి 200 ఏళ్ల క్రితం డెన్మార్క్ శాస్త్రవేత్త హన్స్ క్రిస్టియన్ ఆర్స్టెడ్ ఈ లోహాన్ని కనిపెట్టాడు అప్పట్లో ఇది బంగారం కంటే ఎక్కువ ఎక్కువ ధర పలికింది ఎప్పుడైతే పారిశ్రామికంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించారో ఈ లోహం ధర తగ్గిపోయింది ఎంతగా అంటే అల్యూమినియం దెబ్బకి మట్టి ఇత్తడి కంచు రాగి పాత్రలు కనుమరుగయ్యాయి భూమిలో విస్తారంగా లభించే లోహాల్లో అల్యూమినియం మూడో స్థానంలో ఉంది [సంగీతం] భారత్ లో అల్యూమినియం ఉత్పాదన ఇండియన్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ 1938 లో ప్రారంభించింది అప్పటి నుంచి ఈ లోహంతో తయారైన పాత్ర వాడకం విస్తృతమైంది దేశంలో ఈ లోహంతో చేసిన పాత్రలు సామాన్యుల వంట పాత్రగా పేరుపొందాయి ప్రస్తుతం అల్యూమినియం తో తయారైన ఏదో ఒక పాత్ర ఉండని ఇల్లు లేదు ఈ పాత్రలో వండిన ఆహారంలోకి అతి సూక్ష్మ మోతాదుల్లో అల్యూమినియం చేరిపోతోంది తరుచుగా ఈ ఆహార పాత్రలో వండిన ఆహారం తిన్న వారి శరీరాల్లోకి ఈ లోహం ప్రవేశించి అనారోగ్యం కలిగిస్తోంది సపోజ్ పారాసిటమాల్ ఉంటది 10 ఒక 500 mg డైలీ తీసుకుంటున్నాం సేమ్ ఒక నెల తీసుకుంటే ఏం కాదు బట్ 60 టాబ్లెట్స్ వన్ సడన్ తీసుకొని చేసుకుంటే ఏమైతది కష్టమైతది సో దిస్ ఇస్ ద అక్యూములేటివ్ ప్రాసెస్ అన్నమాట బాడీలో బాడీ కెనాట్ హ్యాండిల్ దట్ అందరూ చెప్పారు ఇంతనే ఉంది కదా ఇంత ఇంత ఇంత ఇంత కలిసి సముద్రం అవుతుంది ఈ లోహం ప్రత్యక్షంగా కానీ శరీర నిర్మాణ పోషణ ప్రక్రియలో కానీ ఏ విధంగా ఉపకరించదు కడుపులోకి వెళ్ళిన అల్యూమినియం లో 001% నుంచి 1% వరకు జీర్ణ కోసంలోకి చేరుతుంది శరీరంలో పేరుకుపోయిన ఈ లోహం మూత్రపిండాలు మూత్ర విసర్జనలో తొలగించబడతాయి బ్రిటిషర్స్ మన భారతీయుల మీద మీద ఎక్కువ హింస చేయడానికి ఏమి మందుగుండు లేకుండా ఎలాంటిది లేకుండా చంపడానికి అల్యూమినియం పాత్రలో వంట వండి ఖైదీలకు దాంట్లో పెట్టేవాళ్ళు అదే ఇప్పటికీ జైలులో కూడా ఆచరిస్తున్నారు అల్యూమినియం పాత్రలోనే వండుతున్నారు అది చాలా హానికరమైనటువంటిది అంటే రోజు ఇంత రోజు ఇంత విషమిస్తూ పోతే విషకన్యలు ఎట్లా తయారవుతున్నారో ఆ విధంగా మనిషి లోపల ఫ్రస్ట్రేషన్ కోపము ద్వేషము ఇతరులను చూస్తేనే ఓర్చుకోలేనితనము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అల్యూమినియంలో తింటే కాబట్టి ఇటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం మంచిది గవర్నమెంట్ కూడా అల్యూమినియం పాత్రలు కాకుండా ఇత్తడికి రాయికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వంట పాత్రలకు వాటికి గృహిణులందరూ వెళ్లేసి తీసుకుంటారు మనిషి వారానికి వారి శరీర బరువులో అల్యూమినియం ప్రతి కిలోకి రెండు మిల్లీ గ్రాములు మించవద్దని ఐక్యరాజ్య సమితి సంస్థ ఎఫ్ ఏఓ వెల్లడించింది పరిమితిని మించి ఈ లోహం శరీరంలోకి ప్రవేశిస్తే ఆరోగ్యానికి భంగకరమే అంటుంది అల్యూమినియం లోహానికి శరీర కణజాల్లో పేరుకునే స్వభావం ఉండటంతో ఎముకలు మెదడు వంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ముఖ్యంగా కిడ్నీ జబ్బుతో బాధపడే వారిలో ఈ లోహం విసర్జన పూర్తి స్థాయిలో జరగదు మనకి యుబిక్విటస్ అంటే అన్ని చోట్ల ఉండింది మనము గాలిలో నీటిలో మనం వాడే పదార్థాలలో తినే తిండిలో ఈవెన్ మనం వేసుకునే డ్రగ్స్ లో కూడా ఈ యొక్క అల్యూమినియం అనేది చాలా విరివిగా అవైలబుల్ ఉండింది యాక్చువల్ గా ఎఫ్ డిఏ కూడా దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు ఈ పర్టికులర్ మెటల్ వల్ల అని రికగ్నైజ్ చేసింది సో దాని వల్ల దీన్ని ఏంటంటే చానా విరివిగా అవసరం ఉన్న ప్రతి చోటు చోట వాడుతున్నారు కాబట్టి ఏమవుతుందంటే ఇది మన యొక్క డే ఇన్ అండ్ డే అవుట్ లో అల్యూమినియం కూడా ఒక మనతో పాటే నడుస్తుంది సో ఈ మధ్య మనం తెలుసుకుంటుంది ఏందంటే ఎక్కువగా అల్యూమినియం యూస్ చేయడం వల్ల కొన్ని రకాల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి అనే విషయం మనకి ఈ మధ్య రీసెర్చ్ లో బయటపడింది ఎలా అని అంటే ఈ అల్యూమినియం మన బాడీలో ఉండాల్సిన మోతాదు కన్నా చాలా ఎక్కువగా ఉంటుందని ఆ ఎక్కువగా ఉన్న మోతాదుల వల్ల ఆ బాడీలో ఉన్న పలు ఆర్గాన్స్ ని అది ఎఫెక్ట్ చేస్తుందనే విషయం తెలుస్తుంది అల్యూమినియం పాత్రలో టమాటా నిమ్మ చింతపండు వంటి పుల్లటి పదార్థాలతో చేసే వంటకాల్లో ఈ లోహం తేలిగ్గా కరిగిపోతుంది ఇనుము మెగ్నీషియం కాల్షియం వంటి మూలకాలు శరీర నిర్మాణ ప్రక్రియకి అవసరం శరీరంలో పేరుకుపోయిన అల్యూమినియం దేహానికి అవసరమైన మూలకాలను నిరోధిస్తుంది ఫలితంగా రక్తహీనత ఎముకల మెత్తబడటం డయాలిసిస్ ఎన్ కెఫ్లోపతి అనే నాడి మండల వ్యాధికి కారణం అవుతుంది జనరల్ గా మనకి మాక్సిమం ఉండాల్సిన మోతాదు మన బ్లడ్ లో 10 మైక్రో గ్రామ్స్ పర్ లీ లీటర్ ఉండాలి కానీ అది ఒకవేళ గనక 100 మైక్రో గ్రామ్స్ పర్ లీటర్ కన్నా ఎక్కువగా అవుతే దాన్ని మనము విషతుల్యమైంది అని అనుకుంటాం సో అది ఇమ్మీడియట్ గా దాన్ని బాడీ నుంచి బయటకు పంపించాలి మామూలుగా రీసెర్చ్ లో తెలిసింది ఏందంటే అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే మన బాడీలో డిఫరెంట్ డిసీజెస్ ని కాస్ చేస్తుంది పులుసు కూరలు లాంటివి వండినప్పుడు ఎక్కువ సేపు ఆ పాత్రతో ఇంటరాక్ట్ అవుతుంది కాబట్టి అల్యూమినియం ఆ కూరల్లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది సో కాబట్టి ఎక్కువ సేపు వండేటివి కాకుండా త్వరగా అయిపోయేటివి ఫ్రై కర్రీ లాంటివి డ్రై గా ఉండేటివి పులుసు కూరలు కాకుండా డ్రై గా ఉండేటి కూరలు చేసేసుకోవడం చాలా ఉత్తమం కానీ అన్ని విధాలుగా చెప్పాలి అని అంటే మట్టి పాత్రల్లో వండుకొని తినడం అన్ని విధాలా శ్రేయస్కరం అల్యూమినియం మోతాదికి మించి శరీరంలో పేరుకుపోతే డయాలిసిస్ ఎన్కెఫ్లోపతి లేదా డయాలిసిస్ డిమెన్షియా అనే వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు వైద్యులు ఈ స్థితికి చేరిన వ్యక్తికి మాట తడబడటం జ్ఞాపక శక్తి తగ్గడం శరీర కదలికల్లో మార్పు ప్రవర్తనలో మార్పులు వంటి దుష్ప్రభావాలకు లోనవుతారు అల్జీమర్స్ వ్యాధి రొమ్ము క్యాన్సర్ ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా గురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు అల్యూమినియం అంటే ఇప్పుడు సిల్వర్ లో వెనకటి రోజులలో కుండల్లో ఉండేవి మటికలు అనేటివి ఉండేటివి మటికలలో ఉండేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు సిల్వర్ ఎందుకంటే అది తక్కువ రేటులో ఉంటుంది కాస్ట్లీ అంటే పెట్టి తీసుకోలేము మనం ఇత్తడి ఉంది కానీ అంత రేటు పెట్టి వాళ్ళు వంట చేసుకొని తినేంత పరిస్థితి లేదు ఈ రోజుల్లో అయితే రైస్ కుక్కర్ లో వచ్చాయి ప్లస్ ఇప్పుడు సిల్వర్ అంటే ఇక దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వాటిలలోనే వండుకొని తింటున్నాం అదే అనుకూలంగా అంటే అదే ఉంది ఇప్పుడు మనకి అంత రేట్లు పెట్టలేము కదా ఇత్తడి గాని రాగి గాని అలాంటి పాత్రలలో వండుకునే వాళ్ళు ఇప్పుడు అసలు చాలా తక్కువ ఇక ఈజీగా అంటే మనకి ఒకటి దొరికింది ఏంటంటే మా రైస్ కుక్కర్ ఇక వాటితోనే చేయగలుగుతాం కానీ వేరే ఏమీ లేదండి వంట పాత్రల నుంచి సైలెంట్ గా మనిషి శరీరంలోకి చేరుతున్న ఈ లోహం గురించి ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో వైద్యుల సలహాలు చాలా వరకు ఉపయోగపడతాయి దీని ఉప ఉత్పత్తులైన రసాయన మూలకాలు మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తున్నప్పటికీ నేరుగా ఈ లోహం శరీరంలోకి చేరితే ప్రమాదం అంటున్నారు వైద్యులు ఈ లోహంతో తయారైన వంట పాత్రల్ని దీర్ఘకాలం వాడకుండా ఉంటే మంచిది అంటున్నారు మన భారతదేశంలో చూసుకుంటే వంటింట్లో మాత్రం అల్యూమినియం పాత్రలే ఒక భాగంగా మారిపోయాయి కానీ వైద్యులు మాత్రం అల్యూమినియం పాత్రలు వండిన వంట తింటే మాత్రం తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు ఎందుకంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లి తీసుకున్న ఆహారం ద్వారానే తల్లి గర్భంలో శిశువుకి ఈ అల్యూమినియం అనే స్థాయి వెళ్తుంది అప్పటి నుంచి కూడా మానవ శరీరంలో అల్యూమినియం అనేది ఇప్పటి వరకు కూడా చేరుతుండడం వల్ల మానవులకు ముఖ్యంగా అల్యూమినియం అనేది మన మానవ శరీరంలో అధిక మోతాదులో ఉండడం వల్ల ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా అల్యూమినియం లో వండిన వంట పదార్థాలను తినకపోవడమే ఉత్తమని వైద్యులు హెచ్చరిస్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్ తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్
No comments:
Post a Comment