Monday, June 2, 2025

 ఈరోజుల్లో చాలా పెళ్లిళ్లలో భోజనాలు 
******************************

ఒకప్పటి పెళ్లి వేరూ. 
అక్కడ వడ్డించిన పెళ్లిభోజనాలూ వేరు !! 
ఆకాలంతో.. ఇప్పటికాలాల పెళ్లిళ్లు భోజనాలు ఎందుకు పోలుస్తారు అనుకుంటారేమో! .. 

పేళ్ళిళ్ళైనా... భోజనాలైనా.... అప్పుడు ఇప్పుడూ ఒకేలాగే ఉండాలిగా !.. ఉండవంటారా ?.. నిజమే !

ఈ రోజుల్లో పెళ్లిళ్ల లో (ఒక సామాన్యజీవి ) పెట్టె భోజనాల విషయం మాత్రమే ఇక్కడ ప్రస్తావించి చూద్దాం!!

నేటి పెళ్లిళ్లలో మనందరమూ #నాతో సహా చూసే హడావిడి ఈవిధంగా ఉంటుంది...

పెళ్లి మొదలవుతుందో  లేదో #కాటరింగ్ వాడు వాడి పనివాళ్ళచేత వాడి #విద్యను ప్రదర్శించడం మొదలెడతాడు ... 

పనీర్ టిక్కా ....కట్ మిర్చీ...., టమాటో సూప్.... , లేదా లేమన్,ఆరెంజ్ లాంటి కృత్రిమ జూస్ లతో కడుపు నింపేస్తాడు .. 

ఒకప్పుడు పెళ్లికొచ్చినవారికి అందరికీ ఆడ మగ తేడా లేకుండా చేతికి ఓ #గులాభీ పువ్వు,చేతిలో #నాణేలు లాంఛనముగా అందిస్తూ  ఆడవారికి ప్రత్యేకముగా  #చందన లేపనాలు కాళ్లకు #పారాణీ ,అందరికీ అత్తరు జల్లులు కురిపిస్తూ... #ఆహ్వానం పలికేవారు ... 

ఇప్పుడంతా #ఫాషన్ షో ... ప్చ్ ,,,,   

ఇప్పుడు .....పెళ్లి జరిగింది ,
పెళ్లి జరిపించిన  పెద్దలు వచ్చి వధూవరులను #ఆశీర్వదించమనడం  లేదు ... 

పెళ్లికొచ్చిన జనాలు బంధువర్గం తమకుతామే బారులుదీరి #సినిమాటిక్కెట్టు క్యూ లైనుల్లో నిలబడి విసుక్కుంటూ....ముందుకు నడుస్తుంటారు.

మనసంతా వధూవరులను ఆశీర్వదిద్దామన్న ధ్యాసే మరిచే సన్నివేశాలు చోటు చేసుకుంటూ  ... 

ముఖాలపై బలవంతపు ప్లాస్టిక్ చిరునవ్వులతో అలా అలా

కార్యం జరగకముందే
పందిరి ముందున్న జనం మొత్తం #మాయమయ్యి భోజనాల "బఫె" దగ్గర గుంపులు గుంపులుగా గుమి గూడతారు. గుంపులో గోవిందా అనీ. 

అసలు అక్కడ  వడ్డించబోయే  కూరలేంటో,
వాటి పేర్లేమిటో  కూడా వచ్చినవాడికెవ్వడికీ  అర్థం కావు .
చిత్రవిచిత్రమైన వంటకాలతో #రంజిపజేసేస్తారు .  

ఒకపక్కన .. 
దోస, పెసరట్టు , ధై వడా పానీపూరి ,చాట్ ,బజ్జీలు 
మరొపక్కన .. అది శుభకార్యమో లేక టిఫిన్ సెంటరో అర్ధం కాదాయే🤣

ఎనిమిది,పది రకాల మిఠాయిలు,ఐస్ క్రీములు 
ఇంకోపక్కన ... పనస ,నారింజ, మామిడి ,జామ ,అంగూర అబ్బో ఒక్కటేమిటి !

ఇక అన్నం పెట్టె వరుసకు వచ్చి నిలబడితే ... 
మూడు రకాల అన్నం ,

చేతిలో #చిప్పలు పట్టుకుని...
అడుక్కు తినే వాళ్ళలాగా వెళ్ళాలి ..అమ్మా అన్నం పెట్టమ్మా అనే అరుపులొక్కటే ఉండవక్కడ

ఆ భోజనాలు వండిన'వాడెవడో తెలియదు ,
వడ్డించేవాడు మాత్రం ఒక డ్రెస్సు /బూట్లు వేసుకొని నిలబడి ఉంటారు...

వాడు వేసే వడ్డీoపుకీ... నాలుగు సార్లు వడ్డించిన వారి దగ్గరకు ఆకలయ్యి  వెళితే...

వాడు కిందమీదకి మనలను పరికించి  చూస్తారు.

ఐదు రకాల పచ్చళ్ళు , 
30 రకాల వంటకాలు  సరే!.. 
ఎలాగూ వచ్చాము కదా అనీ కలిపి ముద్ద నోట్లో పెడితే!...
ఏదీ ...   ముద్ద లోనికి దిగదే ?

వంటల్లో సరియైన ఉప్పు ఉండదు! .
కారమూ, మసాలా దినుసులు సరైన పాళ్లలో ఉండవూ ,
రుచీ ఉండదో... పాడూ ఉండదూ😢  ...

దప్పికయ్యి నీటి కోసం చూస్తే...అక్కడ ఇచ్చేవాడుండడు..

ఓ 100,200 అడుగులెయ్యాలి నీటి కోసం
ఈమధ్య చిన్న చిన్న నీటి బాటిల్స్ వరద భాదితులకు ఇచ్చినట్టుగా ఇస్తున్నారనుకోండీ .

ఆఖరున చూస్తే ... 
కడుపు తరుక్కు పోతుంది ... ప్లేట్ లలో ఆశ ,ఆగడు తో పెట్టుకున్న పదార్ధాలు...  తినేది 30% శాతం....  అలాగే వ్యర్థంగా పడేసేదీ 70% శాతం

1} ఏది ఎలా ఉన్నా ... పెళ్లిళ్లు చేసే వారు ... ఆ పెళ్ళికి వచ్చినవారు తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చి కూర్చొని వధూవరులను #ఆశీర్వదించి వెళ్లేవిధంగా చూడాలి  .

2) పదులు,వందల రకాల వంటలు లేకున్నా ... 
రెండు మూడు రకాలు పెట్టినా సరే .. రుచిగా ,శుచిగా #వచ్చిన_అతిధులకు #కడుపు_నిండా_భోజనం_పెట్టి పంపితే .. వాళ్ళు మనసారా మిమ్ముల  #దీవిస్తారు !!

3) అసలు #పెళ్లిభోజనం అంటే #పప్పన్నం  అన్న మాట .. 
ఎప్పుడో చాలామంది మరిచిపోయారు.

No comments:

Post a Comment