🕊️ గౌతమబుద్ధుడు 🕊️
ఒకసారి గౌతమబుద్ధుడు ఒక ముసలి వ్యక్తి ని, రోగిని, మరణం ను చూసిన తర్వాత
దుఃఖానికి కారణం తెలుసుకోవడానికి అడవికి బయలు దేరెను.
గౌతమబుద్ధుడు ఎంతోమంది గురువుల దగ్గరకు వెళ్ళాడు. అలారకలముడు, ఉద్ధకరామభద్రుడు, ఇంకా ఎంతోమంది! “మంత్రమే గురువు” అనీ, మరొకరు “ఆహారం లేకుండా ఉండు .. అదే నీ గురువు అవుతుంది” అనీ, “ఉపనిషతులు చెప్పిందే మననం చేస్తూండు” అనీ, “ముక్కు బిగపట్టుకుని ఉండు .. చక్రాల మీద మనస్సును ఏకాగ్రం చెయ్యి .. భృకుటి మధ్యలో మనస్సును లగ్నం చెయ్యి” అనీ రకరకాల గురువులు రకరకాలుగా బుద్ధుడికి బోధించారు.
అన్నింటినీ త్రికరణశుద్ధిగా అభ్యసించి తాను నేర్చుకున్నవన్నీ ఒక్కొక్కటిగా .. “అది తప్పు”, “ఇది తప్పు” అని తేల్చుకోవడానికి ఐదున్నర సంవత్సరాలు పట్టింది!
చివరికి సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న తన శ్వాస మీదే .. ఏ కుంభకమూ లేని .. కేవల సహజ పూరక శ్వాస ధార మీదే తన ధ్యాస ధారను లగ్నం చేసి ” ఆనాపానసతి ” చేశాడు.
బుద్ధుడు ఒకసారి అడవిలో సాథన చెయ్యగా దివ్యదృష్టి ఓపెన్ అయ్యి తన గత జన్మలు అన్ని చూసుకొన్నాడు. అంతటా ఉన్న దుఖానికి కారణం కనుక్కొన్నాడు. తర్వాత ఇంత సాథన చేస్తే నాకు దివ్యదృష్టి తెరుచుకుని జ్ఞానం కలిగింది. ఇది అందరికీ కలగాలంటే నేను ఏం చెయ్యాలి అని ప్రశ్న వేసుకొని దివ్యదృష్టి ద్వారా చూస్తే అప్పుడు
" ఆనాపాన సతి- శ్వాస మీద ధ్యాస "అని పాళి భాష లో అక్షరాలు కనిపించాయి. తర్వాత అందరికీ ధ్యానం బోధించారు ;
“ ఆనాపానసతి ” అన్నది సుమారు 2500 సం|| క్రితం గౌతమబుద్ధుడు ఉపయోగించిన పాళీ భాష కు చెందిన పదం. పాళీ భాషలో..
‘ ఆన ’ అంటే ‘ ఉచ్ఛ్వాస ’
‘ అపాన ’ అంటే ‘ నిశ్వాస ’
‘ సతి ’ అంటే ‘ కూడుకుని వుండడం ’
“ ఆనాపానసతి ” అంటే మన శ్వాసతో మనం కూడుకుని వుండడం “; దీనినే మనం “శ్వాస మీద ధ్యాస” అని చెప్పుకుంటున్నాం. “ఆనాపానసతి” అన్నది ప్రపంచానికి సకల ఋషులు, సకల యోగులు అందరూ కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం !

No comments:
Post a Comment