Sunday, May 10, 2020

నిత్య జీవితంలో జాగ్రత్తలు తప్పనిసరి వైద్య నిపుణులు సూచిస్తున్న మార్గాలివి..

💠😷ఇక మనదే బాధ్యత

🔒లాక్‌డౌన్‌తో ఇన్నాళ్లూ కాపాడిన ప్రభుత్వాలు..

🌀సడలింపుతో మారిన పరిస్థితి

🛵భారీగా రోడ్ల మీదకు వస్తున్న ప్రజలు

🦠కరోనాతో కలిసి బతకాల్సిందేనన్న నేతలు

⏰మరింత అప్రమత్తం కావాల్సిన సమయం

✴️నిత్య జీవితంలో జాగ్రత్తలు తప్పనిసరి

😷కనీసం మరో 6 నెలల నుంచి ఏడాదిపాటు, వీలైతే ఆ తర్వాత కూడా మాస్కులను తప్పనిసరిగా ధరించండి. మీ వల్ల ఇతరులకు, ఇతరుల వల్ల మీకు వైరస్‌ రాకుండా కాపాడే ప్రధాన మార్గమిది. మాస్కు వల్ల వైరస్‌ నుంచి పది రెట్లు ఎక్కువ రక్షణ లభిస్తుంది.


🍚రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోండి. డి విటమిన్‌ లోపం ఉన్నవారిలో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. కాబట్టి.. రోజూ సూర్యోదయ వేళలో ఎండ తగిలేలా చూసుకుంటే మంచిది. లేదా వైద్యుల సిఫారసుతో డి-విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోండి.

👮‍♂️బయటికొచ్చినవాళ్లని కారణం కూడా అడక్కుండా కొట్టిన పోలీసులు.. ఇప్పుడు రోడ్లకు అడ్డంగా పెట్టిన బారికేడ్ల దగ్గర నిర్లిప్తంగా నిలబడి వచ్చిపోయే వాహనాలను చూస్తున్నారు! మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి మొన్నటిదాకా నిర్మానుష్యంగా ఉన్న రోడ్లన్నీ మళ్లీ జనంతో రద్దీగా మారుతున్నాయి!! సరి-బేసి.. విధానమేదైనాగానీ తెరుచుకున్న షాపుల్లో గిరాకీ పెరుగుతోంది! ఆంక్షల సడలింపుతో భారీగా రోడ్ల మీదకు వచ్చినవారిని పోలీసులు ఆపినా.. ఏ స్ర్కూ కోసమో, మద్యం కోసమో వచ్చామని చెప్తే వదలక తప్పని పరిస్థితి. మరోవైపు.. కరోనా వైరస్‌ ఇంతకు ముందు లేని ప్రాంతాల్లో కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. వైరస్‌ బారిన పడకుండా మనని, మన కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత మనచేతుల్లోనే ఉంది. అందుకు వైద్య నిపుణులు సూచిస్తున్న మార్గాలివి..👇


🟡మొట్టమొదటి విషయం.. కరోనాను అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఏ జ్వరం మాత్రో వేసుకుంటే తగ్గిపోతుందని అనుకోవద్దు. ‘వైరస్‌ వస్తుంది.. పోతుంది’ అని చులకనగా చూడొద్దు. ‘కనీసం ఇంకో రెండేళ్లపాటు వైరస్‌ కలిసి జీవించాల్సిందే’ అని రాజీపడిపోయో.. ‘వైరస్‌ మననేం చేస్తుంది’ అనే నిర్లక్ష్య ధోరణితోనో.. మాస్కుల రక్షణ లేకుండా రోడ్లపైకి రావొద్దు. ఎందుకంటే.. ఈ వైరస్‌ ప్రభావం ఎవరిలో ఎలా ఉంటుందో శాస్త్రజ్ఞులే చెప్పలేకపోతున్నారు. వైరస్‌ సోకినా కొందరిలో అసలు లక్షణాలే కనిపించట్లేదు. మరికొందరిలో కొద్దిపాటి లక్షణాలే ఉంటున్నాయి. ఇంకొందరిలో తీవ్ర లక్షణాలు కనిపించినా.. బతికి బయటపడుతున్నారు. కొద్దిమంది మాత్రం ఏం చేసినా బతకట్లేదు. శరీరంలో వైరల్‌ లోడ్‌ అధికమై.. శ్వాస కూడా పీల్చుకోలేక నరకయాతన అనుభవిస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి ఆ వైరస్‌ అసలు సోకకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆ జాగ్రత్తల్లో ముఖ్యమైనవి.. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, బయటకు వెళ్లొచ్చినప్పుడల్లా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఇంటిపట్టునే ఉండడం.


🟡ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించింది కదాని విచ్చలవిడిగా తిరిగితే.. అది మీకు, మీ కుటుంబానికే కాక సమాజానికి ప్రమాదం. గత నెలన్నరగా ఉన్నట్టుగానే.. వీలైనంత వరకూ ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. నిత్యావసరాల పేరుతో తరచుగా బయటకు రావడం మంచిది కాదు. వెళ్లే ముందే కావాల్సిన సరుకుల జాబితా రాసుకుని చకచకా కొనుగోలు చేసి ఇంటికి చేరుకోండి. మీరు అనవసరంగా బయట ఉండే ప్రతి క్షణమూ ప్రమాదమే.


🟡బయటకు వెళ్లినప్పుడు ఇతరుల నుంచి 6 అడుగుల దూరాన్ని కచ్చితంగా పాటించండి. మాస్కు ఉంటే ఒక అడుగు అటూ ఇటూ అయినా పర్వాలేదుగానీ.. మాస్కు లేకపోతే మాత్రం ఈ నిబంధనను తూచా తప్పకుండా అమలు చేయాల్సిందే. బయటకు వెళ్లి ఇంటికి రాగానే చేతుల్ని 30 సెకన్లపాటు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడాన్ని అలవాటుగా మార్చుకోండి. బయటకు వెళ్లొస్తే.. ఇంట్లో వృద్ధులు, పిల్లలకు వీలైనంతవరకూ దూరంగా ఉండండి. మరీ అత్యవసరమైతే తప్ప వారిని తాకొద్దు. బయటకు వెళ్లొచ్చాక చెప్పులను గుమ్మానికి దూరంగా, ఎండ తగిలే చోట విడవండి.

🟡లిఫ్టు బటన్లు నొక్కడానికి, తలుపులు తెరవడానికి, పంపు తిప్పడానికి.. చేతుల్ని ఉపయోగించే అలవాటు మార్చుకోవాలి. లిఫ్టు బటన్లు నొక్కడానికి, తలుపు తెరవడానికి మీ బండి తాళం చెవిని ఉపయోగించండి. తలుపులు తెరవడానికి మీ భుజాన్ని ఉపయోగించండి. స్విచ్‌ వేయడానికి మోచేతిని లేదా మణికట్టును ఉపయోగించొచ్చు.

🟡ఫోన్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దు. ఇంటికి వచ్చాక చేతులు కడుక్కోవడంతో పాటు.. ఫోన్‌ను కూడా డిస్‌ ఇన్ఫెక్టింగ్‌ వైప్స్‌తోగానీ, శానిటైజర్లతో గానీ శుభ్రం చేయండి.

🟡కర్చీఫ్‌ వాడే అలవాటుంటే.. దానికి బదులుగా డిసిన్ఫెక్టెంట్‌ వైప్స్‌ను వాడండి. శానిటైజర్‌ను దగ్గరే పెట్టుకోండి. ఎక్కడికైనా వెళ్లినప్పుడు చేతిని వాడాల్సి వస్తే శానిటైజర్‌తో వాడి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయండి.

🟡కరోనా అనుమానిత లక్షణాలతో ఉన్నవారికి సన్నిహితంగా మెలిగితే.. ఇంటికి వెళ్లాక వేడివేడి నీళ్లతో తలస్నానం చేయండి. వివాహాల వంటి శుభకార్యాలకు ఇప్పటికే ముహూర్తం నిర్ణయించినా.. వీలైతే వాటిని ఒక ఏడాది పాటు వాయిదా వేసుకోండి.

🟡కనీసం ఏడాదిపాటు.. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దు...లాక్‌డౌన్‌ ఉన్నా లేకున్నా.. వీటన్నింటినీ పాటిస్తే కరోనా గండాన్ని తప్పించుకోవచ్చు.

No comments:

Post a Comment