64లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది.
అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది.
ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే.
ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది.
రూపాన్ని పొందుతుంది.
కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి.
ఏమి చేసినా భరించాలి.
క్రమంగా దేహం పెరుగుతుంది.
దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనె అంటాం.
కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా!
ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా!
ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా!
ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా!
ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?
ఎందుకంటే ఈ దేహం నీది కాదు.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే.
నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు.
శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు.
ఈ సృష్టి యొక్క అర్థం అని తెలుసుకొ..
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు.
నీకు తల్లిదండ్రులు ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.
రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం అమ్మ నాన్న లు ఇచ్చిన ఒ అద్భుత వరం.
కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యడమే మానవ ధర్మం.
ఈ దేహం లో నువ్వు వుండగానే ఆ నువ్వు ఏవరో తెలుసుకుంటే మనసు శాంతి అది తెలియకుంటే మిగిలేది అశాంతి.
ఇదే జీవిత రహస్యం, ఇది నీకు, నాకు, అందరికీ తెలుసు
అందులో నుంచి బయటకి వచ్చిన వారు మహర్షులు.
అందులో వుండి భయంతో
మెలుగుతున్న వారు మహానుభావులు.
ఇవేమీ పట్టించుకోకుండా
ఇహలోకం లోని సుఖాల వెంట పరిగెడుతూ కష్టాలను, కన్నీళ్లను, కొనితెచ్చుకుంటున్న వారు మానవులు.
వీరు మళ్లీ మళ్లీ జన్మిస్తూ
ఈ పాప కూపం లోనుంచి
ఎప్పటికీ బయటికి రాలేక జనన మరణాల మధ్య
ప్రయాణం సాగిస్తూ ఉంటారు.
కష్టాలు వచ్చినప్పుడు ఇది నా పూర్వజన్మ కర్మ అనుకోవడం తప్ప,దాని వదిలించుకునే ప్రయత్నం చేయడం లేదు
అందుకే మనషి మనసుకు మనశ్శాంతి లేకుండా పోతున్నది.

No comments:
Post a Comment