Friday, May 15, 2020

జ్ఞానం ఒక జీవ నది

⚛️✴️⚛️✴️⚛️✴️⚛️జ్ఞానం ఒక జీవ నది💚

ఎవ్వరికి అన్ని ముందే తెలియవు.

పుట్టినప్పుటినుండి మనకి ఉహ వచ్చే వరకు తల్లి చాలా విషయాలు చెబుతుంది. అలా చెప్పింది తెలుసుకోవడం జ్ఞానం.

కొంచం పెద్దయ్యాక తండ్రి చాలా భౌతిక విషయములు, ఎవ్వరితో ఎలా ఉండాలో చెబుతారు, ఇదొక జ్ఞానం.

స్కూల్లో చేరంగానే, ప్రాదిమిక జ్ఞానం నుండి (అక్షర జ్ఞానం దగ్గరనుండి అనేక విషయాలు నేర్పుతారు) ఉపాధ్యాయులు ఎన్నో విషయాలు చెబుతారు. ఇదొక జ్ఞానం.

తరువాత మిత్రులు, బాల్య మిత్రులు, కళాశాల మిత్రులు, ఉద్యోగ మిత్రులు, ఇలా మిత్రులు మనకి అనేక తెలియని విషయాలు చెబుతారు. ఇదొక జ్ఞానం.

వార్తాపత్రికలు, పుస్తకాలు, గ్రంధాలు కొంత జ్ఞానం నేర్పుతాయి.

నేర్చుకునే నైపుణ్యం ఉంటే మన అనుభవాలు కొంత జ్ఞానం నేర్పుతాయి.

ఇలా జ్ఞానం, ఏమి తెలియని మనకి, ఎందరో, తల్లి మొదలుకొని, అనుభావాల వరకు మనకి జ్ఞానం అందిస్తున్న వారే.

అది గురువు దత్తాత్రేయ స్వామి కూడా తాను 24 గురువుల దగ్గర నేర్చుకొన్నారు అని చెప్పారు.

ఇలా జ్ఞానం తెలిపే వారు గురువులు, తెలుసుకునే వారు శిష్యులు.

అయితే ఇదంతా భౌతిక జ్ఞానం వరకు.

ఆధ్యాత్మిక జ్ఞానం కోసం మనకి సద్గురువు అవసరం. ఆయన ఆ జ్ఞానాన్ని సాధన చేసి అనుభవ పూర్వకంగా తెలుసుకొని, ఆ సాధన ఇతరులతో చేయించ గలిగిన నైపుణ్యం కలవారై ఉంటారు.

మన అంతరంగము నిష్కామ కర్మలతో, స్వార్ధం లేకుండా, మమకారం లేకుండా శుద్ధమైతే, అప్పుడు పరమాత్మ ఒక సద్గురు రూపంలో మన వద్దకు వచ్చి, సాధన మార్గం ఉపదేశించి మనతో సాధన చేయిస్తారు.

ఇది జ్ఞానం వచ్చే విధానము.

అయితే జ్ఞానం కావాలి అంటే కొన్ని అర్హతలు కావాలి
అవి

1) అన్ని "నాకే తెలుసు" అన్న భావం ఉండకపోవడము.

2) మనకి జ్ఞానం నేర్పే వ్యక్తి పట్ల విశ్వాసం ఉండాలి. "ఆ వీడి మొహం వీడికి ఎం తెలుసు", "పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు" అనుకుంటే జ్ఞానం రాదు.

3) తెలుసుకునే జ్ఞానం పట్ల శ్రద్ధ భక్తి

4) జ్ఞానం ఒక నిరంతరంగా ప్రవహించే జీవ నది, అని అది తనకు తన గురువు ద్వారా, తన నుండి తనని నమ్మే వారికి వెళుతుంది అని తెలుసుకోవాలి.

5) జ్ఞానంకి "పేటెంట్ రైట్స్" ఉండవు. ఇది "నా జ్ఞానం", "నా అనుమతి లేకుండా" ఇతరులకి చెప్పకూడదు అనుకోవడం మూర్ఖత్వం.

6) ప్రతి ఒక్కరు వారికి తెలిసింది, విన్నది ఇంకొకరికి చెప్పి (గురువు కావాలని వారికి ఉండదు) వారిచే మెప్పుదల పొందాలి అనే ఆశ ఉంటుంది. భుజం తట్టి శెభాష్ అనిపించుకోవాలి అని ఉంటుంది

సరే అయితే

ఈ సోది అంతా ఎందుకు అంటే!!

ఈ మధ్య సామాజిక మధ్యామాల ద్వారా ( ముఖ పుస్తకము, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా) జ్ఞాన వితరణ జరుగుతొంది. ఇందులో ఖచ్చితంగా ఇతరుల సామాజిక మాధ్యామాలలో వచ్చిన విషయం వారి మాద్యామం ద్వారా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తారు.

ఇవి కొన్ని షేరింగ్ (భాగస్వామ్యం) కొన్ని కాపీ పేస్ట్ గా ఉంటాయి.

షేరింగ్ పోస్ట్ లో అయితే, అది వారికి, ఎవ్వరి ద్వారా వచ్చిందో తెలుస్తుంది. అయితే ఇలా షేరింగ్ పోస్టులలో అసలు పోస్ట్ అందుబాటులో రాకపోవచ్చు.

కాపీ పేస్ట్ పోస్టులలో ఒక్కొక్కసారి అది ఎవ్వరి ద్వారా వచ్చిందో తెలపడము కష్టం. దానిని మొదటి సారి ఎవ్వరు రాశారో తెలియదు.

అందుకని జ్ఞాన సముపార్జన ముఖ్యం. మనకి నచ్చితే ఒకటికి రెండు సార్లు చదవడం, ఆచరణలో పెట్టడం చేస్తాము. నచ్చకపోతే జస్ట్ స్క్రోల్ చేసి ఉపేక్ష వహిస్తాం. అంటే హంస ఎలాగైతే పాలు నీరు కలిసిన దాంట్లో పాలు మాత్రం గ్రహించి, నీటిని వదిలినట్టు, మనం కూడా ఈ మాధ్యమాలు ద్వారా వచ్చిన జ్ఞానమును, మనకి పనికి వచ్చే వాటిని పాల లాగా స్వీకరించి, పనికిరాని వాటిని నీరులాగా వదిలేయాలి.

అలాగే ఈ మద్యమాలలో ఎవ్వరి ద్వారా అయిన పోస్ట్ కాబడ్డ జ్ఞానం, వేరే వారు షేరింగ్ చేస్తే అందులో వారి పేరు లేకపోతె, "దుర్వాస మహర్షి" కానక్కర లేదు. అనవసరంగా మన మనస్సు పాడుచేసుకొని, ఆ షేరింగ్ చేసిన వాడి మనస్సు పాడు చేయాల్సిన అవసరము లేదు.

జ్ఞానం ఒకరినుండి ఇంకొకరికి వెళ్ళిపోతుంది అని గ్రహించాలి. జ్ఞానం ఒక జీవ నది లాంటిది అని తెలుసుకోవాలి.

ఏమంటారు.

No comments:

Post a Comment