‘జీవిత లక్ష్యం ఏమిటి’?? అని ఎప్పుడైనా ఓ ప్రశ్న వేసుకుంటే, మనలో చాలామందికి ఒకటే సమాధానం వస్తుంది- ‘ జీవించడం ’ అని. కాని- జీవించడం కంటే ముఖ్యమైనది, విలువైనది ఏమైనా ఉందా అని ఎంతమందికి అనిపిస్తుంది?
👉 తినడం, తిరగడం, నిద్రపోవడం, చేసిన పనులే చెయ్యడం- ఇంతకు మించి జీవితంలో ఇంకేమీ కనిపించడం లేదు.
👉 అలాంటప్పుడు ‘ఈ జీవితంలో గొప్పతనం ఏముంది’ అని చాలా అరుదుగా, అతి తక్కువమంది వ్యక్తులకు అనిపిస్తుంటుంది.
👉 మనిషి జీవించక తప్పదు. కాని జీవిస్తూనే మనిషి తన గురించి తాను తెలుసుకోవాలి.
👉 మామూలుగా జీవించాలని మనం అనుకోవడం లేదు.
👉 సంపాదన అనే ఆశయం కోసమే జీవించాలను కుంటున్నాం.
👉 అలా జీవించడమే మన పరమావధిగా ఉంది.
👉 దాన్నే ఓ లక్ష్యంగా మార్చుకోవాలని అనుకుంటున్నాం.
👉 ఆశయాల కోసం తీస్తున్న పరుగులే అంతటినీ విషపూరితం చేస్తున్నాయి.
👉 అనేక ఆశయాల కోసం పెడుతున్న ఉరకలు పరుగులు చివరికి మానవ జీవిత లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నాయి.
👉 ఓ ఆశయం పెట్టుకుంటే, జీవితంతో మనం ‘యుద్ధం’ చెయ్యాలి. ఘర్షణ పడాలి.
👉 అవసరమైతే సుఖశాంతులు వదులుకోవాలి.
👉 ఒక బరువు మోసినంతగా జీవితయాత్ర సాగించాలి.
👉 జీవితంలో అనేక సంఘటనలు, మార్పులు సంభవిస్తుంటాయి.
👉 మనిషి వాటిని గమనిస్తుండాలి. అన్ని ఆందోళనల్నీ విడిచిపెట్టాలి.
👉 జీవిత ప్రవాహ గమనాన్ని ధ్యాన సాధనలో సాక్షిగా గమనించాలి.
👉 ఆ విధమైన సాక్షిత్వం అతడికి కచ్చితంగా బ్రహ్మానందాన్ని రుచి చూపిస్తుంది.
👉 జీవితం కేవలం జీవించడానికే ఉంది. ఇది ఎవరి కోసమో కాదు. దేని కోసమో కాదు. ఎందుకోసమో కాదు.
👉 వాస్తవంలో ఉండే వ్యక్తే నిజంగా జీవిస్తున్నవాడు.
👉 అతడే జీవితసత్యం గ్రహించగలడు.
👉 జీవిత లక్ష్యాన్ని అందుకునేదీ గ్రహించ గలిగిన ఆ మనిషే.
👉 సముద్రంమీదకు వెళ్లేముందే, తీరాన కట్టి ఉన్న నావకు కట్టు విప్పాలని ప్రతి నావికుడికీ తెలుసు.
👉 అదేవిధంగా మానవుడూ ‘పరిపూర్ణత్వ కాంతి సాగరం’లోకి తన జీవితపు పడవ ప్రయాణం ప్రారంభించే ముందు ధ్యాన సాధనచేత మనస్సు అనే ఆ పడవ కట్టు విప్పాలి. కోరికల గొలుసుల్ని, ఆశయాల ముడుల్ని అతడు విప్పి తీరాలి. ఆ తరవాత తెడ్డు వేయాల్సిన అవసరం అతడికి రాదు.
👉 శ్రీరామకృష్ణ పరమహంస ‘జీవితయానంలో నావ లంగరును ఎత్తి ఉంచు. తెరచాపల్ని లేపి సిద్ధపరచు. దివ్యమైన అనుకూల పవనాలు అనుక్షణం నీ జీవితాన్ని నడిపించేందుకు సంసిద్ధంగా ఉన్నాయి’ అనేవారు.
👉 కేవలం పట్టాలమీదనే నడిచే రైలుబండి కాదు జీవితం. జీవితం అంటే ఎత్తుగా ఉండే పర్వతాల నడుమ సాగుతూ, పరవళ్లు తొక్కుతూ, సాగరం వైపు పరుగులు పెట్టే నదిలాంటిది.
👉 పారే నదికి ఎత్తు పల్లాలు; కొండలుకోనలు; వంకరటింకరలు; పడుతూ లేస్తూ; ఇలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన గమ్యమైన సాగరం వైపు తన ప్రయాణం సాగిస్తుంది.
👉 మానవ జీవితంలో కస్టం- సుఖః - కలిమి- లేమి- మానం- అవమానం ఇలా ఎన్నో వడిదుడకులను ఎదుర్కొంటూ ధ్యాన సాధనచేత తన గమ్యమైన ఆత్మ లో లీలమవడమే నిజమైన జీవితం ఇదే సత్యం.
👉 ఓషో అన్నట్లు- రాత్రిపూట నక్షత్రాలతో ఆకాశం నిండి ఉన్నప్పుడు, మరేమీ ఆలోచించకుండా మనిషి కేవలం వాటిని మాత్రమే దర్శించాలి. విశాలమైన కడలిమీద అలలు నాట్యాలు చేస్తున్నప్పుడు, ఏ విధమైన ఆలోచనలూ అతడు చేయకూడదు. ఆ నాట్యాన్ని తిలకిస్తూ ఉంటే చాలు. అదియే ధ్యానం అని.
👉 ఓ మొగ్గ... పువ్వుగా విచ్చుకుంటున్నప్పుడు, ఎటువంటి ఆలోచనలూ చేయక, పూర్తిగా అటువైపు చూస్తూనే ఉండాలి. సరిగ్గా అప్పుడే ఓ మహా రహస్యం వెల్లడవుతుంది.
👉 ప్రకృతి ద్వారం నుంచి ప్రవేశించే అనుమతి ధ్యానం చేసే ఆ మనిషికి లభించి, దివ్య మర్మం అవగతమవుతుంది. ఆదియే జ్ఞాన ద్వారం.
👉 ‘ప్రకృతి అనేది దైవాన్ని ఆవరించి ఉన్న ఓ ఆచ్ఛాదన.
👉 అంతే తప్ప, అది మరొకటి కానే కాదు. దాన్ని ధ్యాన సాధనచేత పక్కకు తొలగించే విధానం తెలుసుకున్న వారు జీవితసత్యంతో పరిచయం పెంచుకుంటారు’
అంటారు ఓషో!
🙏🙏🙏🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment