Saturday, July 18, 2020

కర్మలే కారణం ..!!

కర్మలే కారణం ..!!


🤔మన జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు కారణం ఎవరు ?ఏమిటి ?
కష్టాలకు ,సుఖాలకు ,లాభాలకు ,నష్టాలకు ,ఎదుగుదలకు ,తరుగుదలకు,కారణం ఎవరు ?
మన తెలివి తేటలా?
స్వయం కృషా?
మన తలరాతా?
మన కర్మా?
దైవ శక్తా ?
ఏది కారణం ? అనే ప్రశ్నలు చాలా మందికి వస్తాయికానీ,
ఈ ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానం దొరకదు.కానీ ఓ ప్రయత్నం చేద్దాం !

మనం ఇప్పుడు అనుభవించే ప్రతి ఫలితానికి, గతంలో అనుభవించిన ప్రతి ఫలితానికి కారణం వేరెవరో కాదు.మనం చేసిన కర్మలు ,ఆలోచనలే .
భగవంతుడు మన కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు.అవే మన సుఖాలు ,దుఖాలు .
అదృష్టం -దురదృష్టం అనేవి కూడా కర్మలో ఒక భాగమే.
గత జన్మ కర్మలతో మాత్రమే మన ఈ జీవితం పూర్తిగా నడవటం లేదు .
మనిషి కి కొన్ని అవకాశాలు కూడా కల్పించాడు.దాన్నే స్వయం కృతం అంటారు.ఈ స్వయం కృతం ద్వారా బాగు పడొచ్చు లేక చెడి పోవచ్చు .అది వాళ్ళిష్టం.

భగవంతుడు మనకు నోరు ఇచ్చాడు.దానితో మనం ఏం చేస్తున్నాము?
కొంత మంది మంత్రం చదువుతున్నారు.కొంతమంది పారాయణాలు,భజనలు చేస్తున్నారు.కొంతమంది మంచి విషయాలు మాట్లాడుతున్నారు.కొంత మంది అబధ్ధాలాడుతూ ,చెడు మాట్లాడుతూ మోసాలు చేస్తూ వున్నారు.ఇవే స్వయంకృతాలంటే.వీటిని బట్టి భగవంతుడు ఫలితాలు ఇస్తాడు.మంచికి మంచి ఫలితం .చెడుకి చెడు ఫలితం .
అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత ఫలితం అన్నారు.
సక్సెస్ అయినా ,ఫెయిల్ అయినా కారణాలు మూడు చెబుతారు .

1.పూర్వ జన్మ సుకృతం.

2.భగవదనుగ్రహం.

3.ఈ జన్మ ప్రయత్నం .🙏



Source - Whatsapp Message

No comments:

Post a Comment