Thursday, April 22, 2021

ప్రోత్సాహమే ఉత్సాహం

ప్రోత్సాహమే ఉత్సాహం
అది బెంగళూరుకు వెళ్తున్న రైలు. రద్దీగా ఉంది. సెకండ్ క్లాస్ బోగీలో టీసీ చెక్ చేస్తుండగా ఓ పదమూడేళ్ళమ్మాయి పట్టుబడింది. ఆ పిల్లను ఆనాల్సిన నాలుగు మాటలూ అని మరికాసేపట్లో వచ్చే స్టేషన్లో దిగిపొమ్మని కటువుగా చెప్పాడు టీసీ.
ఆ మాటలకు బిక్క మొహం వేసుకుందా పిల్ల.

ఇంతలో అదే బోగీలో ప్రయాణిస్తున్న సుధామూర్తి (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తిగారి భార్య) ఈ సన్నివేశాన్ని చూశారు. ఆమె టీసీతో "అంతా చూస్తూనే ఉన్నానండి. ఉన్నట్టుండి ఇలా మధ్యలో ఆ పిల్లను దిగిపొమ్మంటే ఎలా చెప్పండి. ఈ రైలు ఎక్కడి వరకూ వెళ్తుందో అక్కడిదాకా ఈ పిల్లకు టిక్కెట్ ఇవ్వండి. జరిమానాతోపాటు డబ్బు
నేనిస్తాను" అన్నారు.

"వద్దండి. ఇలాంటి వాళ్ళకు సాయం చేయకండి. ఇలా మీరు చేశారని తెలిస్తే మరొకరిలా టిక్కెట్ లేకుండా ఎక్కుతారండి. ఇలాంటి వాళ్ళ పట్ల జాలి , దయా వంటివి చూపకూడదు" అని టీసీ గట్టిగా అంటున్నాడు.

అయినా ఆమె అవన్నీ పట్టించుకోకుండా ఆ అమ్మాయికి టిక్కెట్ తీసిచ్చారు.

ఆ తర్వాత సుధామూర్తి ఆ పిల్లను చేరదీసి ఆడిగారు ఎక్కడి నుంచి వస్తున్నావని. ఎవరూ ఏమిటి అనే వివరాలు అడిగారు.

ఆ అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది.

ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చింది. ఆమె తండ్రి తన తల్లి చనిపోవడంతో మరో పెళ్ళి చేసుకున్నాడు. ఆయన కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. తండ్రి ఉన్నంత కాలం సవతి తల్లి ఈ అమ్మాయిని బాగానే చూసుకుంది. తండ్రి పోయిన తర్వాత ఆ సవతితల్లి నానా మాటలు అనడం, కొట్టడం చేస్తోంది. దాంతో ఆ నరకయాతన భరించలేక ఈ అమ్మాయి పారిపోయి ఈ రైలెక్కింది. లక్ష్యం లేని దారీ తెన్నూ తెలియని జీవన ప్రయాణం ఆమెది.

సుధామూర్తి ఆమె చెప్పిందంతా విన్నాది.

బెంగుళూరూ స్టేషన్లో రైలు ఆగింది.

ప్రయాణికులు దిగిపోతున్నారు. సుధామూర్తి కూడా దిగిపోయారు. ఆమెకోసం కారు ఆగి ఉంది. ఆ కారులో ఎక్కబోతున్న సుధామూర్తి కళ్ళు ఆ అమ్మాయికోసం చూశాయి. ఆ పిల్ల అక్కడే ఓ మూల నిల్చునుంది. ఆమె దగ్గర ఏమీ లేదు. కట్టుబట్టలతో వచ్చిన పిల్ల.

సుధామూర్తి దగ్గరకెళ్ళి ఆ పిల్లను చేయి పట్టుకుని తనతో కారులో ఎక్కించుకున్నారు.

దార్లో తన మిత్రుడు నడుపుతున్న అనాథాశ్రమానికి కారును మళ్ళించింది. అక్కడ మిత్రుడితో ఆమ్మాయి విషయం చెప్పారు సుధామూర్తి.
ఆ తర్వాత ఆమె మిత్రుడికి థాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు.

ఆ మిత్రుడు ఆ అమ్మాయిని తన హోమ్ లో చేర్చుకున్నాడు. అమ్మాయికి చదివించారు. ఆమెకు ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం వస్తుంది. కంపెనీ వాళ్ళే ఆ పిల్లను అమెరికా పంపించారు. ఈ కాలమంతా గిర్రున తిరిగింది.

అమెరికాలో ఉన్న కన్నడం వాళ్ళు ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సుధామూర్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆమె ఆ కార్యక్రమం కోసం అమెరికా వెళ్ళారు. అక్కడ ఒక అమ్మాయి దగ్గరుండి సుధామూర్తికి అవసరమైన ఏర్పాట్లన్నీ చూసారు. అంతేకాదు ఆఖరిరోజు సుధామూర్తి లాడ్జింగుకి కట్టాల్సిన బిల్లు కోసం కౌంటర్ కి వెళ్ళారు. అయితే కౌంటర్లోని వారు "వద్దండి. మీ బిల్లంతా ఓ అమ్మాయి కట్టాశారండి" అన్నారు.

"ఎవరా అమ్మాయి? చెప్పగలరా? " అని సుధామూర్తి అడగ్గా ఓ రెండు మూడు అడుగులు వెనకే ఉన్న అమ్మాయిని చూపించారు.

"మీరెందుకమ్మా నా ఖర్చుకి pay చేశారు" అని అడగ్గా ఆ అమ్మాయి ఒక్కసారి రైల్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తూ టీసీకి దొరికిపోయిన దగ్గర్నించి ఇప్పుడు బిల్లు పే చెయ్యడం దాకా తన జీవితంలో జరిగిన సంఘటనలను చెప్తూ ఆ పిల్ల తానేనని అంది.

"మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కనీసం నాకు ఈ ఒక్క చిన్ని అవకాశమైనా కలిగింది....మీ బిల్లు నేను pay చెయ్యడం చాలా చిన్నది. నావల్ల అయిందిదే" అంటూ ఆ పిల్ల సుధామూర్తి కాళ్ళకు దణ్ణం పెడుతుంది.

ఆ పిల్లను చూసి సుధామూర్తి ఆశ్చర్యపోయారు. ఆమెను గట్టిగా హత్తుకున్నారు. ఇద్దరి కళ్ళల్లోనూ అప్రమేయంగా కన్నీళ్ళు కారాయి..
అందుకే సహాయం చెయ్యాలి.. ఒక వేళ వారు మోసం చేస్తే వాళ్ళు ఏనాటికైనా ఖర్మ అనుభవిస్తారు.. నిజంగా వారి అవసరత నిజమైతే ఒక జీవితమే మన వల్ల ఆనందిస్తుంది.

మర్రి విత్తనం కాస్త మహావృక్షం అయినట్లు, పిల్లల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తే భావి భారత దేశానికి వెన్ను ముక్కల,మార్గ నిర్దేశకులు గా మారి దేశ భవిష్యత్తును బంగారుమయం చేయగల శక్తి సంపన్నులు వారు కేవలం మనం చేయవలసిన పని వెన్నుతట్టి ప్రోత్సహించే డమే.

మల్లె తీగకు పందిరి వేస్తే అది పొదరిల్లు గా మారి పూలు పూసినట్లు, పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగి సత్ఫలితాలను
తిరిగి మనకు అందిస్తారు.

రొట్టె ముక్క కు కూడా ఇబ్బందిపడ్డా ఏపీజే అబ్దుల్ కలాం గొప్ప శాస్త్రవేత్త గా ఎదిగడమే కాక మనసున్న రాష్ట్రపతిగా మన అందరి మన్నలను పొందాడు.టీ గ్లాస్ కడిగిన చిన్న బాలుడే నేడు ప్రపంచంలో అత్యంత బలమైన ప్రధానిగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆయనే మన నరేంద్ర మోడీ, ఒకనాడు వీధుల వెంబడి తిరిగి గాలి బుడగలు అమ్ముకున్న వ్యక్తి కాస్తా ఎమ్ ఆర్ ఎఫ్ టైర్ కంపెనీ కి అధినేత కాగాలిగాడు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరా ఇద్దరా ఎందరో మహానుభావులు వీరందరూ కూడా ఒకప్పటి లేలేత కుసుమలే.

కృష్ణ నామాన్ని జపించు కుచేలుడు ఆ జగన్నాటక సూత్రధారి చే కాళ్ళు కడిగించికునే మహోన్నతమైన భాగ్యాన్ని పొందగలిగాడు. బోయవాడు కాస్త వాల్మీకిగా మరి రామాయణం రచించాడు. పంది ని సైతం వరాహస్వామి గా పూజలు అందుకుంటుంది.

పడ్డవాడు ఎప్పుడూ చెడ్డ వాడు కాదు చెడ్డవాడు ఎప్పుడూ దుర్మార్గుడు కాదు అలాంటిది పసివారని నిందిస్తూ నీరాదారిస్తే వాడు సమాజం పై చెడు అభిప్రాయాన్ని ఏర్పరుచుకుంటే అది ప్రపంచ వినాశనానికి దారి తీస్తుంది.

ఈ సృష్టిలో మొక్క అయినా జంతువైన మరేదైన
ప్రాణి అయినా పర్వాలేదు ప్రోత్సహిద్దాం అందరూ మన పిల్లలలే కానవసరం లేదు.
కానీ వారు రేపటి తరానికి మార్గదర్శకులు అని మాత్రం
మనం మరువకూడదు.


Source - Whatsapp Message

No comments:

Post a Comment