Tuesday, April 20, 2021

ఏ సాధనా చేయకుండా జీవితంలో ఎదో అద్భుతం జరగాలంటే జరగదు...

ఏ సాధనా చేయకుండా జీవితంలో
ఎదో అద్భుతం జరగాలంటే జరగదు...

సాధనమున పనులు సమకూరు ధరలోన
అన్నారు గదా.....వేమన

ఒక్కరోజులో తేనెటీగ తేనె పట్టును తయారు
చేయలేదు.....ఎన్నో ప్రయాణాలు,,ఎన్నో
పూల మకరందాలను సేకరించాలి ఎంతో సమయం కావాలి,,
ఎంతో కృషి కావాలి,,,పట్టుదల కావాలి....

తినగ తినగ వేము తియ్యనుండు...
ఈ రోజు సంగీతం మొదలు పెడితే
రేపటికి సంగీత విద్వా0సుడు కాలేడు....
చేస్తూ,,,,చేస్తూ,,,ఉంటే అందులో పరిపక్వత వస్తుంది....

ఈ రోజు ABCD లు మొదలు పెడితే
రేపటికి ఇంగ్లీష్ professer కాలేవు....

అమ్మ పప్పు ఎలా చేయాలో నేర్పినప్పుడు ఉప్పు ఎంత వేయాలో మొదటిసారి తడబాటుగా వేస్తాం...
రాను రాను ,,రాను రాను,, ఎవరితోనో మాట్లాడుకుంటూ కూడా ,,ఎక్కడో మళ్లుకొని కూడా ఉప్పు కరెక్టుగా వేస్తాం..
దీన్నే "పరిపక్వత" అంటారు....ఎలా వచ్చింది
వేయంగా....వేయంగా,,,,వచ్చింది

ధ్యానం మొదలు పెట్టగానే
మొదట శరీర శుద్ధి జరగాలి,,,
మనస్సు శుద్ధి జరగాలి,,,,
బుద్ది శుద్ధి జరగాలి,,,,,,,,,
అనేక లోకాల ప్రయాణం చెయ్యాలి,,,,
ఎందరినో సూక్ష్మ లోక గురువులను కలవాలి,,,,
ప్రతి డైమెన్షన్ లోనూ,,,నీతో నీవే కలుసుకుంటూ,,,,
ప్రతి డైమెన్షన్ లోనూ నీవే ఉన్నావని తెలుసుకుంటూ,,,
ప్రతి డైమెన్షన్ ను కూడా నువ్వే సృష్టించావని తెలుసుకుంటూ,,,,,,వెళితే,,,

నిదానంగా నీకు" ఒకటి "
అర్థంమవుతూ వస్తుంది....
ఉన్నదంతా చైతన్య పదార్థమే,,,,
చైతన్య పదార్థమే ఈ "నేను "..అని.

భౌతిక పదార్థం అనేది
చైతన్య0 లేదా ఆత్మ యొక్క ఘనీభవ రూపం....
అనితెలుసుకుంటాం....
మంచు( శరీరం ) అనేది నీటి (ఆత్మ) యొక్క
ఘనీభవ రూపం.
మంచు వేడి అనే మరణం కిందికి వెళితే
మళ్లీ ఆత్మ అనే నీటి రూపం దాలుస్తుంది...

మళ్లీ ఈ నీరు ఏ తల్లి గర్భంలోనో మళ్లీ
ఘనీభవిస్తుంది.....మళ్లీ నీతిరూపం దాలుస్తుంది
అని అనుభవ రూపకంగా తెలుసుకున్నప్పుడు
జనన మరణాలను దాటుతాం....

అప్పుడు ద్వంద్వ0 నుండి విడిపడతాం
నాకు ఏదీ భిన్నంగా లేదు అన్న స్థితికి చేరుకుంటాం...
దీన్నే " యోగ సాధన" అంటారు....

సచిన్ క్రికెట్ బ్యాటు పట్టుకున్న తొలిరోజే
సెంచరీ కొట్టలేదు,,,
బిస్మిల్లాహ్ ఖాన్ షెహనాయ్ పట్టుకున్న రోజే
హిందోల్ గత్ రాగం రాలేదు,,,,
NTR గారు మొదటి చిత్ర0తోనే
నటసార్వభౌముడు కాలేదు...

నిక్షిప్తమై ఉన్న విద్యను వెలికితీయడానికి
అందరికీ సాధన అవసరమైంది

అలాగే నిక్షిప్తమై ఉన్న ఆత్మజ్ఞానాన్ని వెలికి
తీయాలంటే సాధన అవసరమౌతుంది....
అన్న శాస్త్రీయ దృక్పద0 రావాలి..

సాధన.....సాధన....సాధన
ధ్యానం,.....సత్సంగం,,,,స్వాధ్యాయం,,
.....
సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment