Friday, September 3, 2021

అబ్రహాం లింకన్ తన కుమారుడి టీచర్ కి రాసిన ఉత్తరం..!!

+++

అబ్రహాం లింకన్ తన కుమారుడి టీచర్ కి రాసిన ఉత్తరం..!!
------------------------------------------------------

1 . ఈ ప్రపంచం లో అందరూ ధర్మాత్ములు కారని చెప్పండి.
అయితే, ప్రతి స్వార్దపరుడికీ ఒక నిస్వార్ధపరుడైన నాయకుడు ఉంటాడని చెప్పండి.

2 . ప్రతి శత్రువుకు ఒక మిత్రుడున్నాడని చెప్పండి.

3 . ప్రతి అబద్ధాలకోరుకూ ఒక నిజాయతిపరుడుంటాడని చెప్పండి.

4 . ద్వేషాన్ని వాడి దరి చేరనీయకండి.

5 . హాయిగా మనసునిండా నవ్వుకోవటంలోనే దైవత్వం వుందని చెప్పండి.

6 . పుస్తకాలలో లభించే విజ్ఞాన ఖని గురించి అతడిని ప్రేరేపించండి.

7 . అదే సమయం లో ఆకాశం లో ఎగిరే పక్షులు, ప్రకృతిలో పరుగులు పెట్టె తుమ్మెదలు , సుగంధ భరిత పుష్పాలు, గంభీరంగా వుండే పర్వతాలు గురించి అనుభవించి, ఆలోచించేలా చేయండి.

8 . మోసం చేసి గెలవటం కంటే, సన్మార్గం లో పరాజయం పొందటం మేలని చెప్పండి.

9 . తన ఆలోచనలపై గట్టి నమ్మకాన్ని పెంపొందించుకోనేలా అతడిని ప్రోత్సహించండి.

10 . ఎంతమంది ఎదురైనా తను మంచి అనుకున్నది సాధించేంతవరకు విశ్రమించవద్దని చెప్పండి

11 . మృదువైన వారితో పుష్పంలా, కటినమైన వారితో వజ్రంలా ప్రవర్తించమని బోధించండి.

12 . అందరు ఒక గుంపుగా ప్రవాహంలో పడిపోతుంటే వారిని అనుకరించకుండా, అలోచించి తన మార్గం ఎంచుకోనేలా ప్రోత్సహించండి.

13 . ఎవరేం చెప్పినా సహనంగా వినమని, అయితే విన్నదాన్ని సత్యం అనే ఫిల్టర్ లో వడగట్టి వచ్చిన మంచిని మాత్రమే స్వీకరించమని చెప్పండి.

14 . మీరు చెప్పగలిగితే అతడు విచారంగా వున్నప్పుడు ఎలా నవ్వుకోవాలో నేర్పించండి.

15 . కన్నీళ్లు పెట్టటం సిగ్గుపడే విషయం కాదని చెప్పండి.

16 . నిత్యశంకితుల పట్ల, అతి వినయం చూపే వారి పట్ల, అవసరాన్ని మించి తియ్యగా మాట్లాడేవారి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పండి.

17 . తన శ్రమను, మేధస్సును ఎక్కువ ధరకు అమ్మమని చెప్పండి, అయితే తన హృదయానికి, ఆత్మకు వెల కట్టవద్దని చెప్పండి.

18 . అసత్యాన్ని సత్యంగా మార్చటం కోసం ఎలుగెత్తి అరిచే స్వార్థపరుల మద్య ధైర్యంగా నిలబడి తను నమ్మిన సిద్దాంతాన్ని ధైర్యంగా చెప్పే పోరాటపటిమని రగిలించండి.

19 . అతనిని జాగ్రత్తగా చూడండి కాని సున్నితంగా ఉంచకండి.

20 . అవసరమైనప్పుడు అసహనంతో కూడిన సాహసాన్ని, సహనంతో కూడిన ధైర్యాన్ని కలిగి ఉండేలా తీర్చిదిద్దండి.

21 . అన్ని వేళల్లోనూ వాడి మీద వాడికి నమ్మకం ఉండేలా ప్రోత్సహించండి.

+++

Source - Whatsapp Message

No comments:

Post a Comment