Thursday, September 9, 2021

ఎవరి కోసం ఈ టీచర్స్ డే?మనదా? మనవాద బ్రాహ్మణ ఆధిపత్యం కోసమా..!?

ఎవరి కోసం ఈ టీచర్స్ డే?
మనదా? మనవాద బ్రాహ్మణ ఆధిపత్యం కోసమా..!?

డా. సర్వేపల్లి రాధా కృష్ణన్ అనే అయన జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. వాటిలోని నిజాలు మీ కోసం...

డా.సర్వేపల్లి కి ముందే విద్య యొక్క విలువలు తెలిపింది జ్యోతిరావు పూలే కుటుంబం..?!

స్త్రీ విద్యను పోషించిన ఘనత పూలేదే..!?
ఆయన భార్యకు చదువు చెప్పి ఉపాధ్యాయురాలు చేసిన ఘనత పూలేదే...!?
మనవాద సాంస్కృతికి చమర గీతం పాడిన ఆద్యుడు.... పూలే
అంబేద్కర్ తన స్ఫూర్తి దాత అని కొనియాడడంటే పూలే గొప్పదనం తెలుసుకోండి.
పూలే రాసిన గ్రంధాలన్ని పేద, బడుగుల కోసమే..
వారి జీవితాలు మొత్తం జాతికి అంకితం చేసిన పూలే కుటుంభం.
మొట్ట మొదలు మహాత్మా అనే బిరుదు పూలేదే...
బడుగు,వితంతు బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్న పూలే
స్వంతంగా విద్యాలయాలు నిర్మించిన పూలే
సతి సహగ మనం వ్యతిరేకిస్తూ, వితంతు వివాహాలు జరిపింది..పూలే
తనను హత్య చేసేందుకు వచ్చిన వారికి హితోపదేశం చెప్పి ఇంట్లో భోజనం పెట్టి క్షమించింది పూలే

మరి టీచర్స్ డే జరుపుకోనేతంతటి గొప్ప వ్యక్తా? సర్వేపల్లి రాధా కృష్ణన్?
అయన గొప్పతనం ఏమిటని ఆయన కొడుకు రాసిన పుస్తకాలను చూడండి...

ఆయన ఉపాధ్యాయుని స్తాయి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాడు. అది ఆయన వ్యక్తిగత ఎదుగుదలకు ఆ సామాజిక అంశం మాత్రం దోహదపడింది. ఇక ఈయన సమాజానికి బడుగు బలహీన వర్గాలకు ఏదన్న సేవచేశారంటే అది శూన్యం...

దేశంలో అవిద్యపై ఎమన్నా సంస్కరణలు చేశారా? విద్యాభివృద్ధికి ఏమైనా పాటు పడిన దాఖలాలు లేవు. అయన జీవిత చరిత్రను మొత్తం అధ్యయనం చేసిన లేదనే చెప్పాలి...
బడుగు బలహీన వర్గాలకు సంబందించిన అంశాల్ని పక్కకు పెడితే అయన సొంత భార్య శివకమ్మనే చదువుకునేల ప్రోత్సహించలేదు. కాగా ఆయన జీవిత చరిత్ర మొత్తం పరిశీలిస్తే అయన సొంత కుమారుడు సర్వేపల్లి గోపాల్ రాసిన పుస్తకం లైఫ్ హిస్టరీ అఫ్ సర్వేపల్లి రాధాక్రిషణ్ పుస్తకాన్ని పరిశీలిస్తే అయన ఎంత స్త్రీలోలుడో అర్థం అవుతుంది. పనిచేసే చోట స్త్రీలను వేదించెవడని సొంత కొడుకే ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో రాశాడు. ఆయన వేదింపులకు తట్టుకోలేక స్త్రీలు తమ బంధువులను తీసుకొని వారి ఇంటి మీదికి వెళ్లి గొడవ చేసేవారని రాశాడు. ఇంకా డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన పుస్తకాలన్నీ సమాజా వికాసానికి సంబందించినవి కావు. అన్ని శృంగారానికి సంబందించినవి, సాధారణ పుస్తకాలే...?! బ్రాహ్మణ ఆధిపత్యంలోని ప్రభుత్వాలు అయన బ్రాహ్మణుడు కాబట్టి అయన జయంతిని టీచర్స్ డే డేగా ప్రచారం చేస్తున్నాయి. దాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత, చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది.

మరి ఎవరి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలి?
అసలు విద్య గురించి మాట్లాడాల్సి వస్తే బడుగు బలహీన వర్గాలు మహాత్మా జ్యోతి రావు ఫులే సతీమణి అమ్మ సావిత్రి బాయి ఫులే జయంతిని అయిన జనవరి 3ను ఉపాధ్యాయ దినొత్సవముగ జరుపుకోవాలి. శుద్రకులం లో పుట్టి వేల సంవత్సరాలుగా విద్యకు దూరమైనా బడుగు, బలహీన వర్గాలకు విధ్యనందించి వారికోసం మొట్ట మొదటిసారిగా పాఠశాలలు స్థాపించిన వారు పూలే కుటుంభం. పెళ్ళైన తోలి రాత్రి రోజు మహాత్మా ఫులే సావిత్రి బాయికి పలక మీద అ..ఆ లు దిద్దించిన మహావ్యక్తులు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి బాయి పూలేలే...

దేశంలో శూద్రులు అంటరాని వారు చైతన్యం అవుతుంటే చూడలేని బ్రాహ్మణులు సావిత్రి బాయి పూలెను ఆమె చదువు చెప్పడానికి వెళ్తున్న క్రమంలో రాళ్ళతో దాడి చేశారు. ఆమె తల పగలగొట్టారు, ఆమెను రాళ్ళతో కర్రలతో కొట్టారు పెండ బురద నీళ్ళు ఆమె మీద చల్లారు, బాలికల కోసం స్త్రీలకోసం, వితంతువుల పునర్వివాహాలు జరపుకోరాదనే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించి పునర్వివాహాలు చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే, సమాజమే తమ పిల్లలు అని పిల్లలు పుట్టకుండా పసరు మందు తాగి పిల్లలు కనకుండా నిరాడంబర, సాధారణ జీవితం గడిపిన పూలే దంపతులు.

కాని వారి చరిత్ర మనకు తెలుసు అంటే మేధావులు సైతం తెలియదు అనటం.. యాంత్రిక, భోగ లాలస జీవితాలకు అలవాటు పడ్డారు. ప్రభుత్వాలు సైతం మహనీయులు చరిత్రలను దాస్తు సామాజిక వివక్షను చూపుతున్నారు. ఎందుకంటే మన వారు ఎవరు చరిత్ర పుస్తకాలు చూడరు..చదివారు..!?

దయచేసి అందరికి షేర్ చేయండి...
జై పూలే...జై బహుజన..
జై భారత్...
చరిత్ర తెలియని వారేవరు నూతన చరిత్రను నిర్మించలేరు. ఎవరైతే తమ చరిత్రను తెలుసుకోరో ఎవరైతే చరిత్ర నుంచి గుణ పాఠం నేర్చుకోరో వారికి చరిత్రనే గుణ పాఠం నేర్పుతుంది.... అంబేద్కర్.
సింహాలు తమ చరిత్రను తెలుసుకోలేనంత కాలం వేటగాడు చెప్పిందే అవుతుంది.......
డి.వై.గిరి
జై భీమ్... జై మూల నివాసి...
జై బుద్ధ... జై ద్రావిడ...



Source - Whatsapp Message

No comments:

Post a Comment