. *మనసు మనుగడకు ఇరుసు*
****************************
ఆలోచనకు అనువు మనసు.
మనిషి బ్రతుకు తెరువు కిరుసు.
మనిషి జన్మ శ్రేష్ఠమిలలొ.
చెడు తలపకు కలలొనైన.
ఎవరు ఎవరి కిలలొ మనము ?!
చెలిమి వలనె ఒకరి కొకరం !
కలసి ఉంటె కలదు సుఖం !
అందుకు సద్గుణమె సుముఖం !
దేవుడు కలడందురు కొందరు.
లేడందురు మరికొందరు.
దేవుడున్న లేకున్నా
గౌరవ భావనలె మేలు.
అపుడె సుగతి ప్రగతి మనకు.
దుర్గుణ జీవనము వలదు.
సద్గుణ సోపానమ్ములె
ఆత్మీయత నలవరచును.
ఆత్మీయత వలనె మనము
ఒకటను భావన కలుగును.
కలిసి ఉన్న కాపురాలు
స్వర్గ దుర్గ గోపురాలు.
మణి మాణిక్యాలెందుకు ?
అయొ మంచి మవసు లేక ఉంటె.
పగ సెగ తగవులె ఎపుడు
ఒకరి కొకరు కాని యపుడు.
తగవుల మయమవ కూడదు
మన జీవన ప్రయాణము.
కలిసుండెడి జీవనముననె
సుఖమనుభవ సోపానము.
సంతృప్తికర జీవనమున
శుభకామన సోపానము.
సత్కీర్తి ప్రతిష్ఠ తిష్ట
అలరారెడి శుభసదనము.
అందరమిల
చక్కగుంటె
మన బ్రతుకులు
బాగుండవ !!
***************
రచన :---- రుద్ర మాణిక్యం (✍️కవి రత్న)
రిటైర్డ్ టీచర్. జగిత్యాల (జిల్లా).
*************************************
No comments:
Post a Comment