Friday, February 16, 2024

దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనమైపోతుంది♪. ఎవరూ ఉండరు♪.

 దేహాభిమానం లేకపోతే ఇదంతా కూడా సర్వనాశనమైపోతుంది♪. ఎవరూ ఉండరు♪.

🪷 “దేహాభిమానం చెడ్డది కదా♪!" అని ఎవరైనా అడుగవచ్చు♪. జ్ఞానానికీ, మోక్షానికీ వెళ్ళే దారిలో దానిని వదిలిపెట్టమన్నారు గానీ, అది లేకుండా జీవితంలో సంచరించడమే సాధ్యంకాదు♪. అది లేకుండా సంచరిస్తే, మనుష్యుడు - త్రాగినవాడు, పిచ్చివాడివలె - తనను ఏ స్తంభానికో వేసి కొట్టుకుంటాడు♪. దేంట్లోనో పడి చచ్చిపోతాడు♪. అలా ఉంటుంది దేహసంరక్షణ♪! “ఈ దేహం నాది. దీనిని సంరక్షించి ఉంచుకుంటాను” అనేటటువంటి వివేకం ఒకటి జీవలక్షణంలో సహజంగా ఉండాలి♪. అట్టి జీవలక్షణము అయిన భావానికి అధిపతి గణపతి♪. వారి దయలేకుండా మనం ఇలా ఉండనే ఉండము♪.

🪷 అప్పుడు ఆ గణపతిని బ్రహ్మదేవుడు తన ముందర ఆవాహన చేసుకున్నాడు♪. ఆ గణపతి బ్రహ్మదేవునికంటే పూర్వుడు♪. _*'బ్రహ్మణాం బ్రహ్మణస్పతి'*_ అని మంత్రం చదువుతాం మనం♪. ఆయన ఎంతటి పూర్వుడంటే... సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు, రాక్షసులతో అమ్మవారు యుద్ధం చేస్తున్నది♪. ఇంకా మనుష్యులే పుట్టకముందుమాట♪. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది♪. ఆయన అక్కడ ఉన్నారు♪. వారి ఇద్దరి చూపులు కలసినవి♪. ఆ చూపుల కలయికలో నుండి విఘ్నేశ్వరుడు పుట్టాడు♪. ఆయన పేరు మహాగణపతి♪. అంతటి పూర్వుడాయన♪. ఆ గణపతి యొక్క అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పం లోనూ పూజిస్తున్నాం♪.

🪷 బ్రహ్మదేవుడు, ఆ మహాగణపతిని తలచుకున్న తర్వాత ఆయన ప్రత్యక్షమై, _*“మూలాధారమనే చక్రాన్ని సృష్టించు, అక్కడినుండి సహస్రార కమలందాకా నిర్మాణం చెయ్యి. ఆ మూలాధార చక్రంలో నేను అధిష్ఠాన దైవంగా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను ప్రసాదించి, వాళ్ళ ఆత్మసంరక్షణోపాయంలో వాళ్ళు ఉండేటట్లు, అన్నవస్త్రాలను సంపాదించుకుని బ్రతకాలనే కోరిక వాళ్ళలో కలిగేటట్లుగా చేసి, ఆ కోరికలో నుండి సంతానమందు వాళ్ళకు ఇచ్ఛ కలుగజేసి సృష్టిని కలుగజేస్తాను. నీవు సృష్టించు, నేను ఈ పనిని చేస్తాను”*_ అన్నాడు♪. 

🪷 కాబట్టి, ఆ మహాగణపతి జీవులలోకి ప్రవేశించగానే, ఆయన అనుగ్రహంచేత వాళ్ళకు దేహాత్మభావన కలిగింది♪. దేహాభిమానం కూడా కలిగింది♪. అటువంటి గణపతి అనుగ్రహం చేత, తరువాత సృష్టి సక్రమంగా జరిగింది♪.

🪷 ఈ సృష్టిరహస్యము యావత్తు, సమస్త జీవకోటియొక్క జీవలక్షణమూ అంతా సంపూర్ణంగా అర్థంచేసుకుని, “బ్రహ్మ ఎవరు? ఆత్మ ఎక్కడ? పదార్థం అంటే ఏమిటి? పంచభూతములు ఎలా వచ్చాయి? ఈశ్వరుడు అంటే ఎవరు? ఆయన యొక్క స్వరూపస్వభావాలు ఎలా ఉన్నాయి?" - ఇన్ని విషయాలూ తెలిసి, ఈ జగత్తు యొక్క భవిష్యత్తు తెలిసి, జీవులకు ఏది క్షేమకరమో అది తెలిసినవారు మహర్షులు♪. ఆద్యంతమూ సృష్టికథ అంతా తెలిసి, వాళ్ళ కర్తవ్యమే గాక, మన కర్తవ్యము, భవిష్యత్తులో పుట్టబోయే వారియొక్క యోగక్షేమాలూ కూడా ఆలోచించ గలిగినవారు మహర్షులు♪. అట్లాంటి మహర్షులు అనేకమంది ఆర్య సంస్కృతిని రక్షించి జీవకోటిని ఉద్ధరించారు♪. వారిని గూర్చి తెలుసుకోవడం మనకు ప్రధాన కర్తవ్యం♪.

       ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ*
꧁☆•┉┅━•••❀🕉️❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment