Wednesday, July 3, 2024

_నేటి మాట_* *ఆశ*

             *_నేటి మాట_*

                     *ఆశ*
ఆశాయాః యే దాసాః , తే దాసాః సర్వ లోకస్య ।
ఆశా యేషాం దాసీ,  తేషాం దాశాయతే లోకః ॥

_భావం:_
ఆశకి ఎవరైతే దాసులో వారు సమస్త లోకానికీ దాసులు, ఆశ ఎవరికైతే దాసియో అటువంటి వారికి సమస్త లోకమూ దాసియే!

ఆశ మనిషికి సహజం, అదే ఆశ మితిమీరితే, అత్యాశ లేక దురాశ అవుతుంది. 
      స్థూలంగా దీనినే ఆశ అంటూ ఉంటారు.  
ఈ ఆశే, అది మనిషిని తన బానిసని చేసుకుంటుంది!!...
     ధన వ్యామోహము ఒక ఆశ,  విపరీతమైన ధన వ్యామోహము లేదా దానిమీద విపరీతమైన కోరిక లేక మమకారం అనేకమైన విపరీతాలకి దారి తీస్తుంది.
       విపరీత  ధనకాంక్షతో మనిషి ఉచ్చ నీచాలు కూడా మరచిపోయి ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడు.
        మద్యపానమూ, జూదమూ, వ్యభిచారమూ, చౌర్యమూ, మాదకద్రవ్య సేవనమూ, హత్యలూ, మాన భంగాలూ  ఇవన్నియూ తీవ్రమైన కోరికల పర్యవసానములు. 
      అవే వ్యసనాలుగా పరిగణిమిస్తాయి. 
       ఇటువంటి కోరికలకి ఎవరైతే దాసులో, వారు ప్రపంచానికే దాసులు, వారి ప్రవర్తనని సమాజం ఏవగించుకుంటుంది. 
వారు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికీ చులకనైపోతారు, వారిని ఎవరూ గౌరవించరు, ఎవరూ లక్ష్య పెట్టరు. 
       
        చివరకి సమాజవిద్రోహకులుగా ముద్రవేయబడి తీవ్రమైన శిక్షాపాత్రులు అవుతారు.

       అటువంటి కోరిక ఎవరికైతే దాసీయో వారికి ప్రపంచమే దాసోహం అంటుంది. 
        అనగా, కోరికలని అదుపులో ఉంచుకుని, వాటిని అధిగమించిన వారు, ఉన్నతమైన లక్ష్యాలని ఏర్పరుచుకుని, జీవితములో అనేక విజయాలు సాధించ గలుగుతారు. 
సమాజ శ్రేయస్సుకై పాటుపడతారు, అట్టి వారికి ప్రపంచమంతా దాసోహం అంటుంది. 
వేనోళ్ళ కొనియాడుతుంది, ప్రశంసిస్తుంది, వారు చిరస్మరణీయులౌతారు, సత్సమాజానిర్మాణానికై, సమాజ అభివృద్ధికై ఇటువంటి వారు ఎంతైనా అవసరం.

               *_🌺శుభమస్తు.🌺_*
 *🙏సమస్త లోకా: సుఖినోభవంతు.🙏*

No comments:

Post a Comment