శ్రీమద్రామాయణము.
(215 వ ఎపిసోడ్),
"" లోకములో సమస్త కార్యాలు సిధ్దించాలంటే కొన్ని ఉపాయాలని ఆశ్రయించాలి""
కబంధుని సంహరించి అతని దేహానికి అంతిమ సంస్కారాలు జరపగా కబంధుడు చితిజ్వాలలనుండి దివ్యదేహముతో బయటికి వచ్చి రామ లక్ష్మణులకి సుగ్రీవునితో మైత్రి చేయమని ఉపదేశిస్తు ఇలా చెప్తాడు.
"" షడ్యుక్తయః"" (ఆరు ఉపాయములు),
సంధివిగ్రహయానాసన ద్వైధీభావ సమాశ్రయాః.-షడ్యుక్తయః,
శత్రువులతో ఒడంబడిక చేసుకొనుట సంధి,రిపు విరోధము విగ్రహము,అదనుచూసుకొని శత్రువుమీదకి దండెత్తుట యానము,అనుకూలమైన కాలము కొరకు నిరీక్షించుట ఆసనము,బలవంతులు బలహీనులైన శత్రువులిద్దరితోను మాటలతో మంచిగా వ్యవహరించుట ద్వైధీభావము,బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయములను గమనించాలని
సీతాదేవి లభించెడి ఉపాయములు చెప్పుతూ ఈ ఆరు ఉపాయములు గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు.
"" రామా! షడ్యుక్తయో లోకే
యాభిః సర్వం విమృశ్యతే,
పరిమృష్టో దశాంతేన
దశభాగేన సేవతే."""(అరణ్యకాండం-72-08)
ఓ రామ ప్రభూ లోకములో ఎవ్వరికైనా సరే సర్వ కార్యములు సాధ్యము కావాలంటే ఆరు ఉపాయములు గలవు.అవి పాటిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అవే సంధి,విగ్రహము,యానము,ఆసనము,ద్వైధీభావముమరియు సమాశ్రయము ఈ ఆరింటిని ఆశ్రయించి (సుగ్రీవుని ఆశ్రయించి) సీతాన్వేషణలో విజయము సాధించమని హితవు చెప్తు,
"" భవితవ్యం హి యచ్ఛాపి న తచ్చక్య మిహాన్యథా!,
కర్తుమిక్ష్వాకుశార్థూల! కాలో శోకే మనః కృథాః|,, (72-16),
రామా విధి నిర్ణయానికి తిరుగు లేదు.దానిని ఎవ్వరు అతిక్రమించజాలరు.కనుక ఈ మీ దురవస్థ విధి నిర్ణయమని ఎరింగి ధైర్యముగ యుండమని ఉపదేశిస్తాడు.
కనుక రామాయణము విధినిర్ణయాన్ని ఎవ్వరు ఎదిరించలేరని చెప్పే విధానాన్ని గమనించుకొని ధైర్యముగ యుండమని రామాయణము మనకి తెలియచేస్తున్నది.
జైశ్రీరామ్.
No comments:
Post a Comment