Friday, May 2, 2025

 *శ్రీ గురుభ్యోనమః* 

      *ఓం నమో భగవతే శ్రీరమణాయ*
                      *నేను ఎవరు ?*

*11.  'నేను ఎవడను'   అను  తలపును  సదా  అవలంబించి  యుండుటకు  ఉపాయమేమి ?*

*జ.*  ఇతర  తలపులు  ఎన్ని  లేచినా  వాటిని  పూర్తి  చేయుటకు  ప్రయత్నించక  *అవి  కలిగినది  ఎవరికి?*  అని  విచారణ  చేయవలెను.  ఎన్ని  తలపులు  పుడితేనేం,  జాగ్రత్తగా  ఒక్కొక్క  తలంపు  పుట్టగానే  *ఇది  ఎవరికి  కలిగింది?*  అని  విచారించాలి.  *'నాకు'*  అని  తోస్తుంది.  అప్పుడు  *నేనెవడనని*  శోధిస్తే  మనస్సు  తన  పుట్టుక  స్థానానికి  మరలుతుంది.  పుట్టిన  తలపు  కూడా  అణగిపోతుంది.  ఈ అభ్యాసం  చేయగా  చేయగా,  మనస్సుకు  తన  జన్మస్థానంలో  నిలిచి  ఉండే  శక్తి  అధికమౌతుంది. 

సూక్ష్మమైన  మనస్సు  మెదడు,  ఇంద్రియాల  ద్వారా  బయటకు  పోయినప్పుడు  స్థూలమైన  నామరూపాలు  అనుభవమౌతాయి.  మనస్సు  స్వస్థానమైన  హృదయంలో  నిలకడ  చెంది  ఉండునప్పుడు  నామరూపాలు  మరుగున  పడుతున్నాయి.  మనస్సును  బయటకు  పోనీయక  హృదయాన  నిలిపి  ఉంచుటకే  *'అహం  ముఖము'  లేక  'అంతర్ముఖము'  అని  పేరు.  హృదయం  నుంచి  దానిని  వెలుపలికి  పోనిచ్చుటను  'బహిర్ముఖము'*  అంటారు.  

ఈ విధంగా  మనస్సు  హృదయంలో  కుదురుకుంటే  అన్ని  తలపులకు  మూలకారణమైన  *'నేను'*  అనేది  పోయి,  సదా  ఉండే  *'తాను'*  మాత్రము  తెలియబడుతుంది.  ఏది  చేసినను  *నేనను*  అహంకారము  లేకయే  చేయవలెను.  ఆ విధముగ  చేసినచో  సర్వము  శివస్వరూపముగ  తోచును.  
            
*"భగవాన్ శ్రీ రమణ మహర్షి"*

                🙏🌷🙏

No comments:

Post a Comment