అరటిపండ్ల వ్యాపారి పగలంతా పళ్ళు అమ్మి, రాత్రికి ఇంటికి వెళ్లే ముందు మిగిలిన సరుకులు లో నుండి పాడైనవి , కుళ్ళిపోయినవి తీసేస్తాడు. నాణ్యమైనవి మాత్రమే భద్రంగా దాస్తాడు.
మరునాడు అందులోంచి కొన్ని కుళ్ళిపోవచ్చు. వాటినీ నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. 'అయ్యో! పడేస్తున్నాననే బాధ ఉండదు. వాటిపై మమకారం ఉండి పాడైనవి తీయకపోతే, మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది.
జీవితానుభవాలు అంతే. *బాధ కలిగించే ఆలోచనలను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే జ్ఞాపకాలను , మనసులోంచి తీసేయాలి*.
*ఏరోజు చిట్టాపద్దులు ఆరోజే పూర్తి చేయాలి. క్షమించాల్సిన వాటిని క్షమించాలి . సానుభూతి చూపాల్సిన వారిపై, సానుభూతి చూపాలి. విస్మరించిన వాళ్లను, విస్మరించాలి. ప్రశంసించిన వాళ్లను, ప్రశంసించాలి.*
*మంచి అనుభూతులను చక్కని జ్ఞాపకాలను మాత్రమే మరుసటి రోజు ఖాతాలోకి బదిలీ చేయాలి*.
*చెత్త వెళ్లిపోయాక బుర్రలో బోలెడంత ఖాళీ ఏర్పడుతుంది. దాన్ని మంచి ఆలోచనలతో నింపితే ఆనందం పెరుగుతుంది. చిరునవ్వు, ఆనందం కవల పిల్లలు. ఒకటి లేకుండా మరొకటి లేదు*.
Happy life,
Happy weekend 😀
No comments:
Post a Comment