*శివా.....*
*శివా... స్వాధీనవల్లభా... అన్న నామములతో వైభవలహరి ప్రారంభము అవుతుంది. పరమ శివుని పేరు శివ. అమ్మవారి పేరు శివా. శివ అన్నప్పుడు ఏ అర్థము వస్తుందో శివా అన్నప్పుడు అదే అర్థము వస్తుంది. మంగళములలో కెల్లా పెద్ద మంగళము శరీరములో ప్రాణము ఉండటము. ఈశ్వర శాసనము చేత శరీరము పడిపోతుంది. ఏ శాసనము చేత పడిపోతున్నదని అంగీకరిస్తారో అదే శాసనము చేత నిలబడుతున్నదని కూడా అంగీకరించాలి. పది వాయువుల రూపములో శరీరములో జరిగే సమస్త వ్యాపారములను చక్కపెడుతూ ఉంటాడు. అలా నిర్వహించే వాడు కంటికి కనపడాలని ఏమీ లేదు. కంటికి కనపడాలి అంటే జ్ఞాననేత్రము విచ్చుకోవాలి.*
*లోకములో మంగళప్రదమైన తత్త్వము ఏది ఉన్నదో దాని పేరు శివ. ఆయన భార్యగా ఆవిడ కూడా ‘శివా’ మంగళప్రదురాలు. శివా శివునిలో అంతర్భాగము. అమ్మా... అంటే పలికే అమ్మ శివునిలో నుంచి పలుకుతుంది. ఆ అమ్మతనము శివుడిలోనే ఉన్నది. శివునిలోనే ఉండి* *శివుడు సహకరించడము శివ శివా అవ్వడము. అపర శివావతారమయిన శంకర భగవత్పాదులు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి. శివా అనేది శివునిలో స్పందనను కలగ చేస్తుంది అన్నారు. స్పందన మనసుకి సంబంధించినది.*
*'శివా విశ్వస్య భేషజీ’ ‘శివా రుద్రస్య భేషజీ’ ఏ స్పందన శివుని ప్రసన్నమూర్తిని, కారుణ్యమూర్తిని చేసేది శివుని యందు ఉన్న మంగళప్రదురాలైన శివా. శివునిలో అమ్మతనము కనపడాలి. అమ్మకాళ్ళు పట్టుకోకపోతే బ్రతుకు లేదన్నది సనాతన ధర్మము. అమ్మవారికి వేదములో ‘శివతను’ అని ఒక చమత్కారమైన పేరు పెట్టారు. శివుడు శరీరముతో కనపడటమే శివా లేకపోతే ఆయన దక్షిణామూర్తిగా ఆత్మ అయి ఉంటాడు. అమ్మవారే ఆయనను ఒక రూపముతో తీసుకు వచ్చి కూర్చోపెట్టింది. శివ శరీరమే శివా. ఇది అమ్మకు సంబంధించిన పరమోత్కృష్టమైన నామము...*
*┈┉┅━❀꧁ శివోహం ꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మికం బ్రహ్మానందం*
🪸⚜️🪸 🙏🕉️🙏 🪸⚜️🪸
No comments:
Post a Comment