విశ్వరూప దర్శనము
240
నా(Bhagavan Vishweshwarayya) పాపపు చర్య
సరైన ఆలోచనా విధానం లేక నేను చేసిన ఒక పాపపు చర్య మీకు చెప్పడానికి ఇష్టపడతాను. దీనికి కూడ స్పర్శతో సంబంధం ఉంది. నా అనుభవంతో నేను మీ అందరికీ దీని గురించి హెచ్చరిక చేయాలని ఉంది.
ఒకసారి, నేను ముంబాయి వెళ్ళినపుడు శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శించాను. స్నేహితులము అంతా ఉన్నాము. మా కామపు కళ్ళు అక్కడ పూలు అమ్ముకునే అమ్మాయిలపై పడ్డాయి. వారందరూ అందంగా ఉన్నారు. (కామానికి అందం, అందవికారం అనే తేడా తెలియదు). అమ్మాయిలు మమ్మల్ని పిలుస్తూ, ఈ పూలు బాగున్నాయి అని చెప్పుతున్నారు. వారి పిలుపులో మమ్మల్ని మేము మరచి పోయాము. మేము ఒక అమ్మాయి వద్దకు వెళ్ళాము. ఆమె చాలా అందంగా ఉండి ఉంటుందనుకుంటున్నాము, ఎందుకంటే, మేము ముగ్గురం ఆమె వద్దకే వెళ్ళాము. ఆమెకు దగ్గరగా ఉండటం మాకందరికి సంతోషంగా ఉంది. నాకు ఆమెను నేను మాత్రం అనుభవించాలి అన్పించింది. (మిగత వారి గురించి నాకు తెలియదు). నా స్నేహితులే నాకు శత్రువులుగా కన్పించటం మొదలు పెట్టారు. మనం పాపం చేసేవరకు, ఒక పాపం ఇంకొక పాపాన్ని వెంబడించే ఉంటుంది. నా ముఖంలో చాలా ఆకట్టుకొనే భావం చూపిస్తూ ఆమెతో" నాకు రెండు అణాలకు పూలు ఇవ్వు” అని అడిగాను. ఆమె పూలను ఆకులో చుట్టి అందించే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఆమె చేతిని తాకాలని ఉన్నది. ఆమె చేతిని పట్టుకొన్నాను. ఆ కొద్ది క్షణాల్లోనే నన్ను నేను మర్చిపోయి ఆలోచనలలో మునిగి పోయాను. నా శరీరం మొత్తం ఒక విద్యుత్రాగా ప్రవహించింది. నా చుట్టూ వున్న ప్రపంచానికి నేను చచ్చిపోయాను. ఆమె, నేను మాత్రమే ఉన్నాము. ఆమె అందాన్ని పొగుడుతూ నిలుచుండి పోయాను. ముంబాయిలో పూలు అమ్ముకునే వారు సామాన్యంగా
విశ్వరూప దర్శనము
242
వేశ్యలుగా ఉంటారు. వాళ్ళుపూలు అమ్ముకుంటూ వాళ్ళ ఖాతా దారులను వెతుక్కుంటారు. ఈ విషయం నాకు నా అనుభవం తర్వాత తెలిసినది. బహుశ ఆమె అలాంటిదే అయిఉండవచ్చు. కాకుంటే నాలో ఆమె అంత బలమైన భావాలు ఎలా కల్పిస్తుంది?
ఇంతలో నా స్నేహితుడు “హేయ్ ” ఎందుకు ఇలా నిలబడి పోయావు? నీవు గుడి లోపలికి రావడం లేదా?" అని అడిగాడు. నా స్నేహితుని గొంతు నాకు ఒక కాకి అరుపులాగా వినిపించింది!! అది నన్ను నా ఊహాలోకాల నుండి బయటకి తీసుకు వచ్చింది. నేను ఉలిక్కిపడ్డాను! నా చుట్టూ జనం ఉన్నారు!! ఇది ఒక పవిత్రమైన ప్రదేశం !! నా భావావేశాన్ని ఎవరైనా గమనించారేమో నాకు తెలియదు !! ఎవరైనా సాధువులు, సంత్లు, భక్తులు, దేవుని లాంటి మనుషులు చూస్తే నా పరిస్థితి ఏమిటి? వెంటనే నాకు భయం, అవమానం అన్పించింది. (అప్పటి వరకు ఆ భావం లేదు). దొంగను కాబోలు, నా తలను కిందకు వంచుకున్నాను. నేను ఆ గుడిని, చుట్టూ వున్న ప్రదేశాన్ని చూడలేకపోయాను !! నేను ఆ భగవంతుని విగ్రహం వద్దకు నడిచాను. కానీ ఆ విగ్రహంలో కూడ నాకు ఆ పూలు అమ్మే అమ్మాయి మాత్రమే కన్పించింది. నేను తర్వాత ఏమి చేయాలో ఆలోచించాను? ఆ భావమే నన్ను చాలా భయపెట్టింది.
నేను కొంచెం ముందుకు జరిగాక వేరొక సంఘటన జరిగింది. పూజారి (చొక్కా ధరించి ఉన్నారు) అందరి నుదుట కుంకుమ పెడుతున్నారు. నాకు అనిపించింది. నేను ఆ పూజారినైతే నేను కూడా కుంకుమ పెట్టవచ్చునని అనిపించింది.
మేము దేవస్థానం నుండి బయటకు వచ్చాము. నా కళ్ళు ఆమె కోసం వెతికాయి. నా శరీరం కదులుతూంది. కాని నా కళ్ళు ఆమెకోసం గాలిస్తూనే ఉన్నాయి. నా ఇద్దరు స్నేహితులు నాతో “నీవు మంచివాడివి అనుకున్నాం! రా కదులు'' అని అన్నారు. మొత్తం దారిలో మా ఇంటికి చేరేవరకు ఆమె గురించి మాట్లాడుతూనే ఉన్నాము.
నా పాపాన్ని కన్నీటితో కడిగాను
243
నా పాపాన్ని కన్నీటితో కడిగాను
తిరిగి వచ్చాక, నాకు ఆకలి లేదు, నా మంచం మీద అలా పడుకున్నాను. నాకు నిద్ర రాలేదు. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. అపుడు నాలోని అంతరాత్మ మాట్లాడింది. ''నీవు ఒక విద్యార్థిని! ఒక విద్యార్థికి సౌకర్యం, నిద్ర వుండకూడదు. మీవాళ్ళు నిన్ను ఇంతదూరం చదువుకోసం పంపించారు. ఈ విద్యవలన నీవు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. నీ సోదరి, సోదరుడు నిన్ను చదివించడం కోసం అన్నీ త్యాగం చేశారు. వారు నీమీద ఎంతో డబ్బు, శ్రమను ఖర్చుపెడుతున్నారు. చూడు నువ్వు ఎంత పెద్ద పాపం చేశావో. నీవు ద్రోహివి, నీవు పాపాత్ముడివి! నీవు పాపాత్ముడివి!!
నా అంతరాత్మ నాకు నఖశిఖ పర్యంతం వినిపిస్తూనే ఉన్నది. నా గుండె కొట్టుకోవడం పెరిగింది. రక్త ప్రవాహం వేగంగా అయింది. నా ఆగని కన్నీటితో నా పాపపు పనివలన జరిగిన నేరం కడిగి వేయబడింది.
నా తల్లి యొక్క రూపం నా కళ్ళముందు కనిపించింది. ఆమె గొంతు నన్ను నరుకు తున్నట్లు అన్పించింది. “నేను, నీవు ఈ ప్రపంచాన్ని జయించాలి అని అనుకున్నా ను. నువ్వు ఒక చిన్న ఆలోచనను నిగ్రహించుకో లేకపోయావు. నేను 'నచికేతుని' గురించి చెప్పటం, నా ఉపదేశాలకు అర్థం ఏమివున్నది? నా తల్లిని క్షమించమని వేడుకున్నాను. నాముందు నా సోదరుని రూపం నిలిచింది. ఎవరైతే నన్ను విద్యావంతుడను చేయాలని అనుకున్నారో, ఎవరికి విద్య విలువ తెలుసో, తను నాకు చెప్తున్నట్లు అనిపించింది, ‘‘నీవు దూరప్రదేశానికి విద్యకోసం వెళ్ళావు, కాని ఆ చదువు పేరుతో నీ కుటుంబంలోని సభ్యుల కళ్ళల్లోనే బురద చల్లుతున్నావు...''.
244
నేను సోదరుడిని కూడా క్షమించమని కోరాను. “నాకు మళ్ళీ ఇలాంటి అనుభవం ఎదురుకాకుండా ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం ఉంటే, ఖచ్చితముగా నన్ను నేను నియంత్రించుకుంటాను. ఇలాంటి పాపపు పని మళ్ళీ చేయను''.
ఒకరి తర్వాత ఒకరుగా, నా కుటుంబ సభ్యులందరికీ నేను సమాధానం చెపుతూనే ఉన్నాను. ఇంక నేను తృప్తి పొందలేదు. నేను లేచాను. అందరు నిద్రపోతున్నారు. నా టార్చి తీసుకొని నా పెట్టె వద్దకు చేరాను. నా తల్లి నాకు ఇచ్చిన దేవుని పటం చేతిలోకి తీసుకున్నాను. నేను, నా అంతరాత్మ ఒకటిగా చెప్పాము, “భగవంతుడా, నేను మళ్ళీ ఎలాంటి ఆకర్షణకు లొంగకుండా చూడు", ఇలా నా పాపపు పనియొక్క నేరాన్ని కన్నీటితో కడిగాక నిద్రకు ఉపక్రమించాను. శాశ్వతమైన అందాన్ని ( భగవంతుని అందం) అనుభవించే బదులు తాత్కాలిక అందం కోసం వెంబడించాను. ఈ భావాలు అన్నీ పూర్తి అయ్యాక నేను నా మామూలు స్థితికి వచ్చాను. నాలో ఒక కృతజ్ఞతా భావం వచ్చింది. నన్ను నేను ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలతో మోసం చేసుకోను అని నమ్మకం ఏర్పడింది. అపుడు నేను గాఢ నిద్రలోకి వెళ్ళాను. ఆశీస్సుల అనుభవం పొందాను.
నా స్నేహితుడు వెంకటేశ్, రాత్రి అంతా “రా ప్రియా! నన్ను కౌగలించుకో, నీ కోసం ఏమైనా చేస్తాను'' అని కలవరిస్తూనే ఉన్నాడు.
ఇదంతా స్పర్శ అనే చర్యవలన, ఈ తాకటం అనేది ఎన్నో భావాలను ప్రేరేపించింది. దీని తర్వాత నేను ఎవ్వరిని అంటుకున్నా ఎప్పుడూ కలతపడలేదు. నాకు నా తల్లిని అంటుకున్నట్లు అన్పించేది.
దృష్టి, స్పర్శ అనేవి ఎప్పుడు బాధించలేదు. ఈ నిదర్శనలు నన్సు బాధితుల బాధ వినేదానికి, ఈ భూమి మీద ఉన్న పేదప్రజలకు సేవ చేయడానికి ప్రేరేపించినది. ఇంకొక సంఘటన నన్ను మన దేశంలోని స్త్రీలను వాళ్ళు వుండే దయనీయమైన స్థితినుండి బయటకు తీసుకురావడానికి ప్రేరేపించినది.
Sekarana from book - Vishwaroopa Darshanamu





No comments:
Post a Comment