మనదేశం కుక్కలతో నిండి ఉంది, ఈ కుక్కలు ఏ నాయకులైతే సామాన్య మానవులు సమస్యలతో రావటానికి ఇష్టపడరో వారి ఇంటికి కాపలా కాస్తున్నాయి. ఈ అధికారం కోసం ప్రాకులాటలో మన దేశం వెనక్కు నెట్టబడింది. మనం పాశ్చాత్యులనుండి నున్నగా క్షవరం చేసుకోవటం, పౌడరు, లిప్ స్టిక్, స్నోలు రాయటం నేర్చుకున్నాము. వారినుండి లోతు మెడ డ్రెస్సులు, చేతులు లేని డ్రస్సులు వేసుకోవటం నేర్చుకున్నాము. గోళ్లరంగు వేసుకోవటం నేర్చుకున్నాము. వీటిని ఎంత ఖచ్చితంగా నేర్చుకున్నామో, అంత ఖచ్చితంగా వారినుండి దేశభక్తి, నిస్వార్థపు సాంఘికసేవ నేర్చుకొని వుండాలి. గురుభక్తి అనేది మనకు లేదు. గురుభక్తి లేకుండా నేర్చుకోవడమనేది నేర్చుకోవడమే కాదు. కట్టుబాటు అనేది లేకుండా ఏది నేర్చుకున్నా అది వృధాయే. మనకు బ్రిటీషువారి నుండి కట్టుబాటు గురించి చెప్పుకునే అర్హత వున్నదా? మన పూర్వీకులు (జ్ఞానులు) పెట్టిన నియమాలను అనుసరించి పరిపాలకులు మనను పరిపాలిస్తారా? ఈ మూర్ఖులు, అధికార కాంక్షగల నాయులు గద్దె దిగేవరకు ఈ దేశానికి భవిష్యత్తు లేదు.
మన దేశానికి మళ్ళీ పూర్వవైభవం ఎప్పుడు వస్తుంది? కనీసం నేటి పిల్లల్లోనైనా ఈ దేశాభివృద్ధికి సత్ప్రవర్తన పెంపొందించాలి. దేశంలోని మూలమూలలకు జ్ఞానజ్యోతి వ్యాపించాలి. ఆధ్యాత్మతేజం అనేది మన దేశ సంపద. ఈ బలము వలననే మన దేశానికి ఇతరులు తలవంచుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ పరిష్కారం కోసం భారతదేశం వైపు చూస్తాయి.
ఈ గ్రంధాన్ని చదివే పాఠకులకు నాదొక విన్నపం, జ్ఞాన సంపదను ప్రపంచదేశాలు ఎలా గుర్తించాయో చూడండి.

No comments:
Post a Comment