40 రోజులు గాయత్రి మంత్రం బ్రహ్మ ముహూర్తం లో జపం చేస్తే ఏమవుతుంది.... జరిగే అద్భుతం... మన జీవితంలో.
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e5CCj2dDW24
Transcript:
(00:00) ఏ మంత్రం చదివితే మనిషి మెదడు చుట్టూ లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయో అదే గాయత్రి మంత్రం గాయత్రీ మంత్రం అన్ని మంత్రాల కల్లా అత్యంత శక్తివంతమైనది ఇప్పటి తరానికి ఇప్పుడున్న జనరేషన్ కి గాయత్రీ మంత్రం గురించి తెలియదు. ఒకవేళ తెలిసినా అది జపించరు. మంత్రాలు పనిచేస్తాయా ఏముందిలే అనుకుంటారు కానీ దాని పవర్ మాత్రం జపించిన వాడికి మాత్రమే అర్థంవుతుంది.
(00:32) గాయత్రీ మంత్రాన్ని విశ్వామిత్ర మహర్షి దర్శించి రాశారు. ఇది ఋగ్వేదం మూడవ మండలంలో ఉంటుంది. ఇది ఎవరో కూర్చొని రాసిన పోయం అయితే కాదు ధ్యానంలో దర్శించిన మంత్రం ఇది. మంత్రాన్ని కొన్ని మంత్రాలని రచించరు దర్శిస్తారు ధ్యానంలో కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ఆ తపస్సులో వాళ్ళు దర్శించి రాసిన మంత్రాలు ఇది సూర్యునికి సంబంధించిన మంత్రం దీనికి దేవత గాయత్రీ మాత అంటారు దేవమాత అని పిలుస్తారు.
(01:06) సూర్యుని సవిత అని కూడా అంటారు. ఓంకారాన్ని నేను వందనం చేస్తూ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్న సూర్యతేజమైన సవితను నేను ఉపాసిస్తున్నాను అని ఈ మంత్రానికి అర్థం వస్తుంది. ఈ మంత్రాన్ని చదివేటప్పుడు ఐదు చోట్ల కాస్త ఆగి చదవాలన్నమాట. అలా స్లోగా చదివేయకూడదు. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ఇది గాయత్రి మంత్రం ఓం అనేది ప్రణవం ప్రణవ బీజాక్షర మంత్రం ఓం అనే దాంట్లో అకారం ఉకారం మకారం అనేది ఉంటాయి. ఒకానొక సమయంలో పార్వతీ
(01:53) దేవికి పేరు పెట్టేటప్పుడు ఆ ఉ మ ఈ మూడింటిని కలిపి ఉమా గా పేరు పెట్టారు. అందుకే ఓం అనేది అంత శక్తివంతమైన బీజాక్షరం మనలో మూడు అవస్థలు ఉంటాయి. జాగృత్ స్వప్న శుషుప్తి అవస్థ ఓంకారంలో ఆ ఉ మ ఉంటాయి కదా అకారం ఉకారం మకారం అకారం అనేది జాగృత అవస్థ ఉకారం అనేది స్వప్నవస్థ మకారం అనేది శుషుప్తి అవస్థ ఓం అని చెప్పేసిన తర్వాత వచ్చే నిశశబ్దం ఓం అయిపోయిన తర్వాత ఒక నిశశబ్దం ఉంటుంది కదా ఇక్కడే ఇది ఆ ఉ మ అయిపోయాక ఒక చిన్న నిశశబ్దం ఉంటుంది.
(02:38) అక్కడ శబ్దం లేదు ఆలోచన లేదు నిద్ర కూడా లేదు ఇది తురియా అవస్థ అన్నమాట అంటే జాగృతవస్థ కాదు స్వప్నావస్థ కాదు శుషుప్తి కూడా కాదు కానీ అన్నింటికీ సాక్షి ఈ నిశబ్దం మెదడులో అత్యంత లోతైన సమతుల్యం నాడులు పూర్తిగా సమన్వయం అయిన స్టేట్ అన్నమాట ఇది ఇది ఒక కాన్షియస్నెస్ అందుకే ఇక్కడ ఋషులు ఎప్పుడు ఇక్కడే ఉంటారు. మంత్రాలు ఈ స్టేట్ నుండినే పుడతాయన్నమాట.
(03:10) మన బ్రెయిన్ అనేది మాటలు అర్థం చేసుకోదు. అది వైబ్రేషన్స్ ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. అందుకే మనం ఎప్పుడైనా ఒక మంచి మ్యూజిక్ విన్నాం అనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది ఆటోమేటిక్ గా మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన బ్రెయిన్ అనేది వేవ్స్ మీద పనిచేస్తాయి. మన మెథడులో నాలుగు ప్రధాన వేవ్స్ ఉంటాయి బీటా వేవ్స్ ఆల్ఫా వేవ్స్ తీటా వేవ్స్ డెల్టా వేవ్స్ బీటా వేవ్స్ అంటే టెన్షన్ కోపం చిరాకు కామం ఇవి బీటా వేవ్స్ ఆల్ఫా వేవ్స్ అంటే ప్రశాంతంగా ఉండటం ఫోకస్ ఇవన్నీ ఆల్ఫా తీటా అంటే ధ్యానం సృజన ధ్యానంలో ఉన్నప్పుడు మన బ్రెయిన్ తీటా వేవ్ లో ఉంటుంది. డెల్టా వేవ్ మనం నైట్
(03:53) నిద్రపోతాం కదా లోతైన నిద్రలో ఉన్నప్పుడు డెల్టా వేవ్ లో ఉంటుంది మన బ్రెయిన్ ఒక నెల రోజులు బ్రహ్మ ముహూర్తంలో గాయత్రి మంత్రాన్ని మనం జపించినట్టయితే మన జీవితంలో అద్భుతాలు అయితే జరుగుతాయి. ఎందుకంటే మన శరీరంలో 72వ000 నాడులు ఉంటే అందులో ముఖ్యమైనవి ఇడా పింగల సుషుమ్న నాడీలు ఆ ఎక్కువగా మనం ఒక నాడి లోనే ఉంటాం అయితే ఇడా నాడిలో ఉంటాం లేకపోతే పింగలా నాడిలో ఉంటాం ఈ రెండు బ్యాలెన్స్ గా ఉంటే మాత్రమే మనం కరెక్ట్ డిసిషన్స్ మన లైఫ్ కరెక్ట్ గా ఉంటుంది.
(04:32) ఎప్పుడైతే గాయత్రి మంత్రాన్ని రిపీటెడ్ గా 108 టైమ్స్ బ్రహ్మ ముహూర్తంలో జపిస్తామో ఇడా నాడి పింగలా నాడి అనేది యాక్టివ్ అవుతాయి మన శరీరంలో ఎప్పుడైతే ఇవి యాక్టివ్ అవుతాయో మనస్సు మనశ్శశాంతిగా ఉంటుంది నిలుస్తుంది. కోరికలు శాంతిస్తాయి బుద్ధి సక్రమంగా పనిచేస్తుందన్నమాట. గాయత్రి మంత్రాన్ని ఎప్పుడు ఫ్లోగా చదివేయకూడదు నెమ్మదిగా శ్వాసతో కలిసి రిథంలో జపం చేయాలి మనసుతో జపం చేయాలి.
(05:03) నువ్వు మనసులో గాయత్రి మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ జపాన్ని నువ్వే వినాలి అంటే అంత ఫోకస్ గా జపం చేయాలన్నమాట. 40 డేస్ బ్రహ్మ ముహూర్తంలో గాయత్రి జపం చేసిన వాళ్ళకి ఆలోచనలు చాలా క్లియర్ అవుతాయి అయోమయం తగ్గిపోతుంది బుద్ధి శుద్ధిగా మారుతుంది. కామం కోపం క్రమంగా కంట్రోల్ లోకి వస్తాయి. మనలో శక్తి యాక్టివేట్ అవుతుంది.
(05:32) మనలో శక్తి యాక్టివేట్ అయినప్పుడు సరైన వ్యక్తులు సరైన డిసిషన్స్ సరైన దారులు మనము ఆటోమేటిక్ గా మన జీవితంలోకి వస్తాయి. ఎలా అంటే మీకు అర్థం అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఒక ఇనుప ముక్కని ఇసుకలో పేపర్ తో చుట్టి ఇలా అంటే దానికి ఇనుపు ముక్కలు అనేటివి అట్రాక్ట్ అవుతాయి కదా ఇనుముకి ఇనుము ముక్కలే అట్రాక్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనము గాయత్రీ మంత్రాన్ని రిపిటేషన్ గా బ్రహ్మ ముహూర్తంలో జపిస్తామో మన కర్మలన్నీ డిజల్వ్ అవుతాయి.
(06:06) మనలో పాజిటివ్ వైబ్రేషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్ పెరుగుతుందో మనకి మన లైఫ్ లో పాజిటివ్ వ్యక్తులు మాత్రమే తారస పడతారు నెగిటివ్ వ్యక్తులు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. ఆ ఇంకొంతమంది అయితే ప్లేసెస్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వైబ్రేషన్ మారిపోయి ఉంటుంది. వాళ్ళ కర్మలన్నీ తగ్గిపోతూ ఉంటాయి.
(06:30) ఎప్పుడైతే కర్మలు తగ్గిపోతూ ఉంటాయో నీ పాజిటివ్ వైబు నీ ఆరా అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే నీ శక్తి అనేది పెరుగుతుందో నువ్వు బాధల్ని తట్టుకునే స్థాయి తట్టుకునే స్థాయికి వస్తావు బాధలు కష్టాలు ఇవి నీకు పెద్ద ఇదిలా అనిపించవు నీ శక్తి పెరిగే కొద్దీ నీ కష్టాలు మాయమైపోతూ ఉంటాయి. గాయత్రి మంత్ర జపానికి గురువు అవసరం లేదా కొంతమందికి ఈ డౌట్ వస్తుంది.
(06:59) ఆ లోతుగా వెళ్ళాలంటే గురువు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఆ శక్తి ఎగిసిపోతూ ఉంటుంది మనము మంత్రం ఎంత ఎక్కువ సార్లు రిపిటేషన్ చేసే కొద్దీ అంత శక్తి మనలో యాక్టివేట్ అవుతుంది. శక్తి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో మనసు మారుతుంది చాలా అహంకారం కూడా వస్తుంది. అప్పుడు గురువు లేకపోతే మనం దారి తప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే గాయత్రి జపం సరిగ్గా చేస్తే సరైన సమయంలో సరైన గురువు మన జీవితంలోకి వస్తాడు.
(07:34) డైలీ 108 టైమ్స్ చేసిన వాళ్ళకి గురువు అవసరం లేదు స్టార్టింగ్ లో కానీ డెప్త్ గా లోతుగా వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం గురువు ఖచ్చితంగా కావాల్సిందే. ఎవరైతే గాయత్రి మంత్రాన్ని నియమ నిష్టలతో భక్తి శ్రద్ధతో జపిస్తారో ఎన్నో రిజల్ట్స్ ని వాళ్ళు పొందుతారు శారీరకంగా గాని మానసికంగా గాని ఎన్నో కష్టాలని ఎదుర్కొనే శక్తిని వాళ్ళు పొందుతారు. అందుకే ఇప్పటికీ గాయత్రీ మంత్రాన్ని జపించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
(08:04) ఎవరైతే గాయత్రి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళ మెదడులో నిరంతరం కొన్ని ప్రకంపనాలని వాళ్ళు అనుభవం పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే మనము గాయత్రిని ఆ పురాణాల్లో సూచించిన విధంగా లయబద్ధంగా ఒక రితంగా గాయత్రి మంత్రాన్ని జపిస్తామో అప్పుడు మన చుట్టూ లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి. అది గాయత్రి మంత్రానికి ఉన్న శక్తి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు అంటారు అన్ని మంత్రాల్లోకెల్లా నేను గాయత్రిని అని అంటే వాటికి అర్థం చేసుకోవాలి గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమైనదో అని గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైన వాడిగా ధైర్యవంతుడిగా చేస్తుంది. ఎంతో పాజిటివ్ ఎనర్జీని మనం
(08:49) గెయిన్ చేయొచ్చు. అంతేకానీ ఇప్పుడు మనం మ్యూజిక్ టోన్స్ లో గాని సెల్ ఫోన్ రింగ్ గా గాని వింటే మాత్రం ఎలాంటి శక్తి రాదు దోషం కూడా వస్తుంది. సో దాని బీ కేర్ఫుల్ గా ఉండాలి ఈ విషయంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి
No comments:
Post a Comment