Saturday, February 28, 2026

******స్వతంత్రం పేరిట బంధాలు

స్వతంత్రం పేరిట బంధాలు

 ఎవరి మనస్సు పరిశుద్ధంగా ఉండదో వారికి 'స్పర్శ' అనుదానికి చాలా అర్థాలు వస్తాయి. ఋష్యశృంగుని పెళ్లికి ఇదియే కారణము. తపస్సు చేయువారిని కూడ ఇది కలతపరుస్తుంది. దీనికి అహల్యగాధకూడా ఒక ఉదాహరణ. పాశ్చాత్యుల కరచాలనం ఎన్నో పతనాలకు కారణం కావచ్చు. దానిని మనము స్వాతంత్య్రం, స్వేచ్చ అంటు న్నాము. వాస్తవానికి స్వాతంత్ర్యానికి, అస్వాతంత్య్రానికి గల భేదాన్ని తెలుసుకోలేక పతనం అవుతున్నాం. వాక్ స్వాతంత్ర్యము అని దేనినంటాము, వీక్షణా స్వాతంత్ర్యము, సాంగత్య స్వాతంత్య్రం, స్పర్శ స్వాతంత్య్రము, అలంకార స్వాతంత్య్రం అనేవి నిజమైన స్వాతంత్ర్యాలు కావు. ఈ స్వాతంత్ర్యాల వల్ల వచ్చిన ఫలితం స్త్రీ పురుషుల మధ్య సాన్నిహిత్యన్ని వృద్ధి చేసింది. స్త్రీ పురుషులు వేచివుంటే అది ఆధారపడడమా? లేక స్వాతంత్ర్యమా? తర్వాత ఎప్పుడో ఒకరు తృప్తినిచ్చు వరకు వేచి ఉండడం కాదా? ఇది స్వాతంత్ర్యమా? మీరు కామపుగూడులో ఇరుక్కున్నారు. దానివల్ల బాధపడు తున్నారు. ఇది ఆధారపడుటయా లేక స్వాతంత్య్రమా? ఒకడు మనస్సును నియంత్రిoచ లేకపోతే అతడు దాని బాధితుడవుతాడు. అది ఆధారపడడమా లేక స్వాతంత్ర్యమా? ఇతరుల శరీర, మనోవాంఛలకై మనం కోరి మన శరీరాన్ని మనస్సును బాధపెట్టుచున్నాము. ఇది ఆధారపడటమా లేక స్వాతంత్ర్యమా? నీవు ఇంకొకరి చేతిలో కీలుబొమ్మ అయినావు. స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి - ఇది స్వాతంత్ర్యమా? దీనిని విశ్లేషించండి, మనమెంత మూర్ఖులమో తెలుస్తుంది!

మన దేశములో ఒక ప్రముఖ వ్యక్తికి తెలియదు. అతని భార్య ఇంకొకరితో ఆనంద ముగా నుండడం. ఇది ధనవంతుల ఇండ్లలో చాలా సాధారణ విషయము. ఒక బీదవాడు లేక బీదరాలు ఈ సమాజం ఏమంటుందో అని భయపడుతుంది.

బీదవారు, తమ తప్పులను దాచలేరు. కారణం వారు బీదవారు కనుక. ధనవంతులలో దేనికైనను అవకాశము, అనుమతి ఉంది. భర్త తానుకూడ క్లబ్బులలో త్రాగుతూ, వ్యభిచారులతో కలిసి తిరుగుతూ ఉండవచ్చు. ఒక స్త్రీ తన దారిన తాను ఆనందింపవచ్చు. ఒక పురుషుడు స్వేచ్ఛను ఆశిస్తే, స్త్రీ కూడ అదే ఆశిస్తుంది. దీనికి అంతటికిని కారణం సంపద.

Sekarana from Book: Vishwaroopa Darshanamu



No comments:

Post a Comment