Pasupula Pullarao...8919291603.
గౌతమ బుద్ధుని కి జ్ఞానోదయం అయింది శ్వాస గమనం ద్వారానే..
దానినే ఆనాపానసతి సతి మార్గంగా ప్రచారాలు చేస్తూ అష్టాంగ మార్గం గురించి కూడా చెప్పడం జరిగింది.
అలాగే పత్రీజీ గురువు గారు కూడా ఆనాపానసతి మార్గాన్నే శ్వాస మీద ధ్యాస అనే సాధన మార్గాన్ని విస్తృతంగా ప్రచారం చేసి అందరికీ అందించడం జరిగింది.
అందుకే సాధకులు అందరూ సరైన సాధన చేస్తూ ధ్యాన ప్రచారాలు కూడా ఆసక్తి ఉన్నవారు చేయవచ్చు, చేస్తున్నారు కూడా.
సరైన సాధన ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు మిగతా కార్యక్రమాలు అన్ని అధ్బుతమైన పాజిటివ్ ఆలోచనలు ద్వారా చేయవచ్చు... అదియే కదా మాటే మంత్రంగా పని చేస్తుంది.
ఉరుకులు పరుగులు లేకుండా నిదానంగా ఉన్న చోటనే కొంత సమయం ధ్యాన సాధన కోసం కేటాయించాలి.
బెల్లం చుట్టూ ఈగల్లా కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతి అధ్యాత్మిక రంగంలో కూడా ముందుగా ప్రవేశించి మూలమైన సాధన మీద నివురు గప్పుతారు.
అందుకే గురువులు చెప్పిన ఎరుక విషయంలో జాగర్త గా ఉండాలి.
మనం ధ్యానం చేసేదే నిప్పు మీద కప్పబడిన నివురును తొలగించడం కొరకు మాత్రమే.
No comments:
Post a Comment