Friday, February 27, 2026

ఈ ఒక్క రహస్యం తెలిస్తే ఇక నీకు తిరుగులేదు | Ramana Maharshi's Secret to Happiness | Satyagrahi

ఈ ఒక్క రహస్యం తెలిస్తే ఇక నీకు తిరుగులేదు | Ramana Maharshi's Secret to Happiness | Satyagrahi

Author Name:Satyagrahi

Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0RXd_QD5IEk



Transcript:
(00:00) ఎవడైనా నిన్ను ఎదవ అని తిడితే కోప్పడకుండా బాధపడకుండా జస్ట్ ఒక చిన్న నవ్వు నవ్వి థాంక్స్ చెప్పి అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చేయండి. ఎందుకంటే ఎదుటివాడు అన్న ఆ ఒక్క మాటకు మీరు రియాక్ట్ అయ్యి వాడితో గొడవపడి మీరోజంతా పాడు చేసుకున్నారంటే మీ రిమోట్ కంట్రోల్ మీ చేతిలో ఉన్నట్లా లేక తిట్టిన వాడి చేతిలో ఉన్నట్లా ఈ రోజుల్లో మనందరికీ అతి పెద్ద సమస్య ఇదే.
(00:25) ఎవరో ఏదో అన్నారని మన గురించి నెగిటివ్ గా మాట్లాడారని గంటల తరబడి కొన్నిసార్లు రోజులు తడబడి కుంగిపోతాం. ఆఫీస్ లో బాస్ అన్న మాటలు కావచ్చు, ఫ్రెండ్ వేసిన జోక్ కావచ్చు లేదా సోషల్ మీడియాలో మన పోస్ట్ కి ఎవరో పెట్టిన కామెంట్ కూడా కావచ్చు అవన్నీ మనల్ని చాలా బాధకు గురి చేస్తాయి. అంతేకాకుండా నన్ను అలా ఎలా అంటారు? నా రేంజ్ ఏంటి? వాడెంత అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలతో మన ప్రశాంతతని మనమే తగలబెట్టేసుకుంటున్నాం.
(00:51) మీరు గమనించారో లేదో వేరే వాళ్ళ విమర్శల వల్ల కలిగే నొప్పి కంటే ఆ విమర్శల గురించి మనం పదే పదే ఆలోచించడం వల్ల కలిగే నొప్పే చాలా ఎక్కువగా ఉంటుంది. పాపం ఈ విషయం చాలా మందికి తెలియదు. అందులోనూ ఈ సమస్య మనల్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా? మనం ఎందుకు అంతలా రియాక్ట్ అవుతాం. ఎందుకు వేరే వాళ్ళ మాటలకి అంత వాల్యూ ఇస్తాం. దీనికి కారణం మనలో ఉన్న అభద్రత భావం.
(01:13) అందులోనూ అవతలు ఇవ్వాలేదని అంటే ఒకవేళ నిజమేమో అందులో నన్ను ఎలా అంటాడు వాడు అని చెప్పేసి మీ మీద మీకు డౌట్ కూడా రావచ్చు. సో రమణ మర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. నిన్ను ఎవరైనా విమర్శించినప్పుడు లేదా తిట్టినప్పుడు ఆ మాటలు పడేది నీ దేహానికో లేదా నీ పేరుకు మాత్రమే కానీ నీ ఆత్మకి కాదు. కానీ మనం ఏం చేస్తాం ఆ మాటల్ని చాలా సీరియస్ గా తీసుకుంటాం.
(01:37) వేరే వాళ్ళ మాటలకు మీరు రియాక్ట్ అవుతున్నారంటే మీ జీవితాన్ని వాళ్ళ కంట్రోల్ లోకి ఇచ్చేస్తున్నారు అని అర్థం వాడు మిమ్మల్ని నవ్వించాలన్న వాడి ఇష్టం ఈడిపించాలన్న వాడి ఇష్టం అన్నట్లుగా మీరు తయారైపోతున్నారు. దీనివల్ల మీ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మీరు చేయాల్సిన పనుల మీద ఫోకస్ పోతుంది. మీలో నెగిటివిటీ పెరిగిపోయి అది మీ ఆరోగ్యం మీద మీ ప్రొడక్టివిటీ మీద అంతఎందుకండి మీ జీవితం మీద కూడా ప్రభావిత్వం చూపిస్తుంది.
(02:00) ఒకటి గుర్తుంచుకోండి మీ ప్రశాంతతని ఎవర వచ్చి కాపాడరు. అది మీ బాధ్యత. మీ ప్రశాంతతని మీరే కాపాడుకోవాలి. వేరే వాళ్ళ నోటికి తాళం వేయటం మన వల్ల కాదు కదా ఎంతమందిన నాపుతాం మనం చెప్పండి మనల్ని విమర్శించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్లి అలా కాదండి ఇలా కాదని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం అనుకోండి వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడుతారు.
(02:21) కానీ వాళ్ళ మాటల్ని మనం పట్టించుకోకుండా అసలు వాళ్ళనే పట్టించుకోకుండా మన పని మనం చేసుకునేంత అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు? మీరు అనుకోవచ్చు మరి ఈ సమస్య నుంచి మనం ఎలా బయటపడాలి అని చెప్పేసి మీకు కనుక నిజంగా డౌట్ వస్తే మాత్రం రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన ఏమన్నారంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో మీరు ఎవరో మీకు తెలిసినప్పుడు ఎదుటివాడు మిమ్మల్ని ఏమని పిలిచినా మీకు అనవసరం.
(02:47) ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. ఎవరో మిమ్మల్ని ఒక మాట అన్నారు. ఆ మాటలో నిజం ఉందనుకోండి అప్పుడు బాధపడటం ఎందుకు వాడు మీకు మీ తప్పును ఉచితంగా చూపించాడు. కాబట్టి దాన్ని సరిదిద్దుకోండి. ఒకవేళ వాడు అన్న మాటల్లో అస్సలు నిజం లేదనుకోండి అది అబద్ధం అయినప్పుడు ఇంకఎందుకు బాధపడటం అది మీకు సంబంధం లేని విషయం అని చెప్పేసి వదిలేయండి.
(03:06) మీ అహంకారాన్ని పక్కన పెట్టండి. ఎవరైనా విమర్శించినప్పుడు కోపానికి బదులు నిశశబ్దాన్ని ఆయుధంగా వాడండి. ఎదుటివాడు మిమ్మల్ని రెచ్చగొట్టాలని చెప్పేసి చూసినప్పుడు మీరు నవ్వుతూ మీ అభిప్రాయాన్ని ధన్యవాదాలు అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేయండి. అది వాడికి ఇచ్చే అతి పెద్ద షాక్ అన్నమాట. వాడికే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే వీడేంటరా బాబు ఏమన్నా సరే నవ్వుతున్నాడు అని చెప్పేసి వాడు మిమ్మల్ని అనాలన్నా కూడా ఆలోచిస్తాడు.
(03:31) అందులోనూ మీ ప్రశాంతత ఎంత విలువైందో మీకు తెలిస్తే చిన్న చిన్న మనుషులనే మాటల కోసం దాన్ని అస్సలు వదులుకోరు. మీ క్యారెక్టర్ ఏంటో మీకు తెలుసు. మీ కష్టం ఏంటో మీకు తెలుసు. ఇంకెవరో ఇచ్చే సర్టిఫికెట్ మీకెందుకు అందులోనూ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు మన గురించి మాట్లాడితే బాధపడాలి. అసలు క్యారెక్టరే లేని వాడి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఒకవేళ నిజంగా వాళ్ళకి క్యారెక్టరే ఉంటే మన దగ్గరికి వచ్చి బాబు నువ్వు ఇలా తప్పు చేశవు సాటి మనిషిగా చెప్తున్నాను ఆ తప్పును సరిదిద్దుకో ఇంకోసారి రిపీట్ చేసుకో మాకు ఎందుకంటే నీకంటూ ఒక జీవితం ఉంది బాబు అని చెప్తే కచ్చితంగా మనం ఆలోచించాలి. అలా కాకుండా
(04:03) డైరెక్ట్ గా మనల్ని విమర్శిస్తుంటే మనం ఎందుకు పట్టించుకోవాలి కాబట్టి ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. కానీ మీతో ఎవరైతే ప్రేమగా ఉంటూ మీ తప్పుల్ని ఎవరైతే మీకు దగ్గరగా ఉంటూ చెప్తూ ఉంటారో వాళ్ళ మాటలు పట్టించుకోండి ఎందుకంటే తిట్టడానికి తిట్టకుండా ఒక పనిని చెప్పి మరి చేపించడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మీ తప్పులు మీరు గ్రహించండి.
(04:24) అవతలు వాళ్ళు చెప్తే చూసి నేర్చుకోండి. అందులోని విమర్శిస్తే చక్కగా ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోండి. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ నవ్వేసి వెళ్ళిపోవడం నా వల్ల కావట్లేదు. నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మరి నేను కూడా ఎవడనా వచ్చి నన్ను విమర్శిస్తే ఫస్ట్ ఒక నవ్వు నవ్వి ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎలా అని చెప్పేసి మీరు అడిగితే ఈ రోజు నుంచి ఒక కొత్త నిర్ణయం తీసుకోండి.
(04:48) మీ జీవితం మీ రూల్స్ మీద నడవాలి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా విమర్శించినా అది వాళ్ళ సంస్కారం. కానీ దానికి రియాక్ట్ అవ్వకపోవడం మీ సంస్కారం. రమణ మహర్షి గారు అన్నట్లు ప్రపంచం ఒక అర్థం లాంటిది. మీరు ఏది ఇస్తే అది మీకు తిరిగిస్తుంది. సో మీరు శాంతిని ఇస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అవతలవాడు మనల్ని తిట్టాడు బానే ఉంది.
(05:09) కానీ దానికి మనం కూడా 50% కారణం అవ్వకూడదు కదా మనం వెళ్లి వాడిని తిడితే వాడు వచ్చి మనల్ని తిడతాడు. అందులోనూ ఒకడిని మనం తిట్టాల్సిన అవసరం లేదు ఇంకొకడు మనల్ని తిడితే పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఫస్ట్ అఫ్ ఆల్ మీరు మీ రూల్స్ మీద నడవాలి. అంటే ముందు మీరు రూల్స్ పెట్టుకోవాలి. నేను ఇలా ఉంటాను నేను ఈ పని చేసుకుంటాను.
(05:31) నేను నా జీవితంలో ప్రశాంతంగా ఉంటాను. ఇలా మీకు మీరు రూల్స్ పెట్టుకోండి. అలా కాకుండా దిగిపోయిన గాలిపటంలో ఇటుపడిదట వెళ్ళిపోతాను అంటే మాత్రం అది మీకే నష్టం మీ పని మీది, మీ లక్ష్యం మీది, మీ దృష్టి మీది దేనిపైన మీరు దృష్టి పెడితే మీ జీవితం అలా ఉంటుంది. సో మీ లక్ష్యం మీద దృష్టి పెట్టండి. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు.
(05:51) మీరు సక్సెస్ అయినా అంటారు, ఫెయిల్ అయినా అంటారు. కాబట్టి వాళ్ళ కోసం మీ ప్రయాణాన్ని ఆపకండి. రేపు పొద్దున్న మీరు గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు ఈరోజు మిమ్మల్ని అన్న మాటలే మీకు రేపు మెట్లుగా మారతాయి. కాబట్టి అన్న ప్రతి వాన్ని కౌంట్ చేసుకుంటారా ఆ మాటలన్నీ పక్కన పెట్టేసి మీ లక్ష్యం కోసం మీరు పోరాడతారా పట్టించుకుంటే మీ లక్ష్యం దూరమైపోతుంది.
(06:11) మీరు మీ లక్ష్యాన్ని పట్టించుకుంటే మిమ్మల్ని మాటలు అనే వాళ్ళు మీకు అసలు కనిపించరు వాళ్ళ మాటలు అసలు మీకు వినిపించవు. కాబట్టి మీకు గుర్తు రావాల్సింది కేవలం మీ లక్ష్యం మాత్రమే. అందులోనే చాలా మందికి డౌట్ రావచ్చు. నాకంటూ ఒక లక్ష్యం ఉందండి. దాని మీద నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు.
(06:29) వాళ్ళకి నేను చెప్పొచ్చేది ఏంటంటే ముందు మీకంటూ ఒక జీవిత లక్ష్యం ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఎందుకంటే మీకు లక్ష్యం ఉన్నప్పుడే మీరు ఫిక్స్ అయిపోవాలి. నేను లక్ష్యాన్ని చేదించేశను. లేకపోతే నా లక్ష్యానికి దగ్గర అయపోయాను అని చెప్పేసి అలా అనుకున్నప్పుడే మీ మీద మీకు గౌరవం పెరుగుతుంది. నేను ఓడిపోతాను నా వల్ల కాదు అన్న ప్రతి ఒక్క మాటను పట్టించుకుంటాను అనుకుంటే మాత్రం మీలో కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది మీకు సాధించేంత సత్త ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి.
(06:57) మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. వేరే వాళ్ళ మాటలకి ఇచ్చే వాల్యూని తగ్గించి మీ అంతరాత్మ చెప్పే మాటలకి వాల్యూ ఇవ్వండి. అంతరత్వం మనక ఏమని చెప్తుంది నువ్వు కచ్చితంగా సాధిస్తావు సాధిస్తావ అనే కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదా నీకంటే ఒక లక్ష్యం పెట్టుకుంది నీకు ఏ కాన్ఫిడెన్స్ లేనప్పుడు లక్ష్యం ఎందుకు వస్తుంది సో ఒక మనిషికి లక్ష్యం అనేది ఉంది అంటే కచ్చితంగా అతనికి సాధించగలను అనే నమ్మకం ఉంటేనే లక్ష్యం వస్తుంది.
(07:20) కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ఈ క్షణం నుంచి ఎవరైనా మీ మనసుని గాయపరిచేలా మాట్లాడితే లోపల ఒక్కసారి రమణ మహర్షి గారిని తలుచుకోండి. నేను ఈ శరీరాన్ని కాదు ఈ పేరుని కాదు నేను శాశ్వతమైన ఆనంద స్వరూపాన్ని అని మీకు మీరు చెప్పుకోండి. ఇప్పుడు చూడండి ఆ విమర్శల గాలిలో కలిసిపోతాయి.
(07:43) మీరు మాత్రం కొండలా బలంగా నిలబడతారు. ఆ గాలి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ గాలిలో కలిసిపోయే మాటలకి మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. సో ఈరోజే మీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టే అడుగు వేయండి. మిమ్మల్ని ఆపేది ఎవరు కాదు. ఒకవేళ ఆపితే గీపితే మిమ్మల్ని మీరే ఆపుకుంటారు. అంతకుమించి ఏమి లేదు కాబట్టి మీకో చిన్న ప్రశ్న మీ జీవితంలో మిమ్మల్ని ఎవరైనా బాగా విమర్శించినప్పుడు ఆ మాటలను మీరు ఎలా తట్టుకున్నారు? ఆ సిచువేషన్ ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు లేదా ఇప్పుడు ఈ వీడియో చూశాక మీ ఆలోచనలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ ఎక్స్పీరియన్స్ ని లేదా మీ
(08:17) అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసే ఆ ఒక్క కామెంట్ అనేది ఇంకొకరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అంతే అంతకు మించి ఏమీ లేదు. ఏది ఏమైనా సరే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పటివరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.
(08:53) బాయ్ ఓం

No comments:

Post a Comment