Friday, February 27, 2026

జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి - Dr .Harish Tenneti | How To Solve Your Problems | SMM

జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి - Dr .Harish Tenneti | How To Solve Your Problems | SMM

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=MngLtW7ddLE



Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తెనేటి మాక్సిలో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ అండ్ వేద్ సహస్రపాత్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ సూర్య ఉపాసనలో చాలా నేర్పిస్తూ ఉంటాం మేము మెడిటేషన్లు అట్లాంటివి నేర్పిస్తూంటాం. అయితే ఈరోజు మీకు నేర్పించబోయేది నేను సర్జరీ మీ జీవితంలో ఉండే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఒక సర్జన్ లాగా ఎలా ఆలోచించి ఆ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలి నేను ఫేస్ ఎముకలకు సంబంధించిన సర్జన్ ఎప్పుడైనా మీరు హెల్మెట్లు లేకుండా కింద పడి యాక్సిడెంట్లు అయినప్పుడు లేదా కొట్లాడుకున్నప్పుడు దవడ విరిగినా ఇట్లాంటివి ఏమైనా ఉంటే సర్జరీస్ చేసే
(00:35) స్పెషలిస్ట్ ని అయితే ఈ సర్జరీస్ చేస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మన జీవితానికి కి కూడా ఉపయోగపడతాయి కదా అని అనిపించి మీ అందరికీ సర్జరీ నేర్పించాలి అని వీడియో చేస్తున్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక సర్జన్ అయితే సమస్యని ఎలా డీల్ చేస్తాడో ఈరోజు ఈ వీడియోలో నేర్చుకోండి. ఫస్ట్ థింగ్ ఎవరైనా సర్జరీతో అంటే దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయ్యి తల నుంచి రక్తం వస్తూ మొహమంతా పగిలి నోరంతా రక్తం వస్తూ ఇట్లా ఉందనుకోండి ఫస్ట్ వాళ్ళని ఎమర్జెన్సీగా డీల్ చేస్తాం మేము.
(01:08) మేము కంగారు పడము. బట్ పేషెంట్ కి ఏమీ కాదు అనే ధైర్యం ఇస్తాం. సేమ్ ఇదే మన జీవితంలో అప్లై చేయండి. ఏదైనా సమస్య మన లైఫ్ లోకి వచ్చింది అమ్మో ఎంత పెద్ద సమస్యో అని భయపడవద్దు. ఓకే అందుకనే ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది నేను సర్జన్ కదా నా దగ్గరికి ఇలాంటి పేషెంట్లే వస్తారు కదా అనే ధైర్యం నాకు ఉంటుంది. అలాగే మన జీవితం కదా జీవితంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా అనే ధైర్యంతో ఉండాలి.
(01:38) సర్జన్ గా మా దగ్గర రాగానే ముందు ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా ఎక్కడో చేయించుకని వస్తే ఓకే లేదు ఎమర్జెన్సీగా వస్తే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెక్ చేస్తాం. నెక్ కి ఏమైనా దెబ్బ తగిలిందా ఊపిరి తీసుకోవడానికి ఏదైనా కష్టం అవుతుందా రక్తం ఎక్కడి నుంచనా బడబడా పోతుందా ఇలాంటివి స్పృహలో ఉన్నాడా ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మేము చెక్ చేస్తాం.
(02:01) నోట్లో నుంచి రక్తం పోతుందనో లేకపోతే స్పృహ తప్పి పడిపోయాడనో వామిటింగ్ అవుతుందనో ఇలాంటివి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఫస్ట్ అవి చూస్తాం ఎందుకంటే అది ప్రాణాపాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కదా అలాగే మన జీవితంలో ఏదైనా సమస్య వస్తే ఫస్ట్ థింగ్ మనల్ని మనం నమ్మి నేను సాల్వ్ చేయగలను అని నమ్మకం ఉండాలి. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ పాయింట్స్ ఏంటి ముందు నేను ఈ సమస్యలో సేఫ్ గా ఉన్నానా దీనిలో నా ప్రాణాపాయం ఏమన్నా ఉందా దీనిలో నా జీవితంలో జరగరాని నష్టాలు ఏమన్నా జరుగుతాయా అవి ఫస్ట్ సమస్యని ఐడెంటిఫై చేయాలి. యస్ ఏ సర్జన్ నేను అదే
(02:39) ఆలోచిస్తాను ముందేంటి ఎయిర్వే బాగుందా బ్రీదింగ్ బాగుందా సర్క్ులేషన్ బాగుందా జిసిఎస్ స్కోర్ అంటాం అంటే రెస్పాండ్ అవుతున్నాడా లేదా కోమాలోకి వెళ్ళిపోతాడా అని ఆలోచిస్తాం కదా అలాగా మన సమస్యలో ఉన్నప్పుడు నేను డేంజర్ లో ఉన్నానా దీనివల్ల నా లైఫ్ కి త్రెట్ ఉందా ఈ ప్రాబ్లం వల్ల నాకు ఏదైనా పెద్ద సమస్య ఫ్యూచర్ లో రాబోతుందా అని ఆలోచించుకుంటాను.
(03:05) అది మీ ఇంట్లో మీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలైనా కావచ్చు ఆఫీసుల్లో పెద్ద సమస్యలైనా కావచ్చు మీ ఫ్రెండ్స్ మధ్యలో గొడవలైనా కావచ్చు ఏదైనా సరే సీన్ మాత్రం సర్జన్ ఇలాగే డీల్ చేయాలి మీరు ఒక సర్జన్ అయితే ఇలాగే డీల్ చేయాలి ఫస్ట్ ఎమర్జెన్సీస్ ఏంటి వీటిని నేనేం సాల్వ్ చేసుకోవాలి. ఇందులో ఊహించుకుని సర్జరీలు చేయం మేము అమ్మో ఏమన్నా అయిపోతుందేమో అని ఊహించుకోము.
(03:34) ఏమన్నా అవుతుందా వాటి ఇండికేషన్స్ ఏంటి అని చూస్తాం. నిజంగా ఒకతను ఇట్లా పడుకుంటే అమ్మో కోమాలోకి వెళ్ళిపోతాడేమో అని భయపడం వాటికి టెస్ట్లు ఉంటాయి వాటికి మెథడ్స్ ఉంటాయి వాటిని బట్టి మేము డిసైడ్ చేస్తాము ఎక్స్రేలు తీస్తాము దాని లోపల నిజంగా ఎంత సివియారిటీ ఉంది నెక్ కి ఏమనా ప్రాబ్లం అయిందా అంటే దానికి సంబంధించిన ఎక్స్రే దానికి సంబంధించిన మెథడ్స్ ఫాలో అవుతాము.
(03:55) అలాగే మీరు కూడా ఊహించుకోవద్దు మైండ్లో అమ్మో నాకు ఇవ్వ అయిపోతుంది అమ్మో నా లైఫ్ లో ప్రాబ్లం ఊహించుకోవద్దు ట్రై చేసి వాటికి సంబంధించిన మెయిన్ మెయిన్ ఇష్యూస్ ని అడ్రెస్ చేయడం మొదలు పెట్టండి. ఓకే ఇలా చేశక సర్జరీ చేసేక ముందు మేము ప్రీ ఆపరేటివ్ గా అంటే సర్జరీ కంటే ముందు మేము కొన్ని టెస్ట్లు చేయిస్తాం రక్త పరీక్షలనో లేకపోతే ఎక్స్రేలనో లేకపోతే అనస్థెటిక్ చెకప్ అనో ఇలాగా పరీక్షలు చేయిస్తాం చేయించి సమస్య ఎక్కడ ఉంది అన్నది ముందు బయటకి తీస్తాం.
(04:31) సమస్య ఎక్కడ ఉంది అని నాకు తెలిస్తే ఏం ట్రీట్మెంట్ చేయాలి అని నాకు అర్థంవుతుంది. ముందు డయాగ్నోసిస్ చేయకుండా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అని బాధపడుతుంటారు చాలామంది ఈ సమస్య దాటిపోతే చాలండి నాకు అని ఎంతో మంది వస్తారు మీకు ఎంత డబ్బులు కావాలన్నా ఇస్తామండి ముందు మా సమస్య తీర్చండి అని వస్తారు చాలామంది. డబ్బులు తీసుకొని సమస్యనే తీల్చేటట్టయితే నేను ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ గా ఏ పెద్ద పెద్ద వాళ్ళకో అమెరికా ప్రెసిడెంట్లకో లేకపోతే సీఎం లకో పీఎం లకో సాల్వ్ చేస్తే బాగా కోట్లు వచ్చి పడతాయిగా అలా ఎక్కడా ఉండదు డబ్బులు ఇచ్చేస్తే సమస్య తీరితే అందరూ తీర్చుకుంటారుగా అలా జరగదు ఎవరి
(05:09) సమస్య వాళ్లే సాల్వ్ చేసుకోవాలి అందులోనూ సౌర మార్గంలో ఉంటే సూర్యుడి మార్గంలో ఉంటే మేము మంత్రం ఇస్తాం జపం చెప్తాం మెథడ్ చెప్తాము ఎక్సర్సైజ్ చెప్తాము లేకపోతే మీ లోపల ఉండే ఆ భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నాలు చెప్తాం కానీ సమస్యని సాల్వ్ చేయలేము అలాగే ఏ సర్జన్ అయినా సరే ఎవరైనా సరే డాక్టర్ ముందు డయాగ్నోసిస్ చేసి దీనికి ఏమేమి ట్రీట్మెంట్లు ఉన్నాయి అని ఆలోచించుకున్నట్లు మీరు కూడా ఈ సమస్య వాడి బాధ అని వదిలేయద్దు.
(05:44) మీ సమస్యని మీరు ఎలా డివైడ్ చేసి డయాగ్నోసిస్ కి రావచ్చు. నాకు వచ్చిన ప్రాబ్లం దేని దేని దేని వల్ల వచ్చింది అనేది తెలుసుకోవాలి. దేని వల్ల వస్తుంది ఎక్కడి నుంచి సమస్య సపోజ్ నాకు ఈ పైన జైగోమాటిక్ అంటాం ఇక్కడ ఇన్ఫ్రాబిటల్ అంటాం ఆర్ జైగోమాటిక్ అంటాం ఒకవేళ గనుక మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే తగ్గదు కదా అలాగే మీకు ఈ ఇన్ఫ్రా ఆర్బిటల్ కి ఈ పక్కన జైగోమాటిక్ కి లేకపోతే ఈ మండిబుల్ కి అన్నాను అనుకోండి మీరు అన్నిటికీ తీర్చుకుంటే తప్ప మీ సమస్య సాల్వ్ కాదు అలాగా మన జీవితంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది కరెక్ట్ గా తెలుసుకొని వాటికి తగ్గ
(06:28) ట్రీట్మెంట్లు తీసుకోవాలి యస్ ఏ సర్జన్ నేను అదే ఆలోచిస్తాను ఏది ట్రీట్మెంట్ ఏది డయాగ్నోసిస్ ఎక్కడి నుంచి వస్తుంది సమస్య నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఆలోచిస్తాను ఒక పేషెంట్ నా దగ్గరికి వస్తే నేను అదే ఆలోచిస్తాను. ఎక్కడ ప్రాబ్లం ఉంది ఎక్స్రేలు అన్నీ ఎక్కడ చెప్తున్నాయి బ్లడ్ టెస్ట్లు ఏం చెప్తున్నాయి రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి ఇది ప్రాబ్లం ఈ ప్రాబ్లం కి ఏమేం మెథడ్స్ ఉన్నాయి అని ఆలోచిస్తాను మీరు కూడా అలాగే ఆలోచించండి మీ నుంచి మీ సమస్య నుంచి ఒక అడుగు బయటిక వచ్చి ఒక సర్జన్ లాగా ఒక వైట్ కోట్ వేసుకుని మీరు ఆలోచించండి నా సమస్యని నేను
(07:07) కరెక్ట్ గా డయాగ్నోస్ చేస్తున్నానా నేను ఈ సమస్యకి కరెక్ట్ అయిన ట్రీట్మెంట్లు మెథడ్స్ రాసుకుంటున్నానా ఇది గనుక ఆలోచించడం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో మీరు ఒక సర్జన్ ఒక డాక్టర్ అవుతారు మీ లైఫ్ లో వచ్చిన సమస్యను మీరు ఇలా సాల్వ్ చేసుకుంటారు. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర సమాధానాలు ఉన్నాయి ట్రీట్మెంట్లు ఎన్నో ఉన్నాయి.
(07:32) కానీ మనం అసలు డయాగ్నోస్ చేయకపోతే ఎలా అందుకని మీ సమస్యని మీరు సాల్వ్ చేసుకునే ముందు అసలు ప్రాపర్ డయాగ్నోసిస్ కి రండి. అందులో కొన్ని ఇంపార్టెంట్ హింట్స్ ఉన్నాయి. ఇవి గనుక తెలుసుకుంటే మీకు నిజంగా కూడా మీ లైఫ్ లో ఈజీ అవుతుంది. ఆ హింట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దేని వల్ల ప్రాబ్లం వస్తుంది. మీరు అనుకుంటున్నట్టు కాదు దేని వల్ల వస్తుంది అనేది మీకు ప్రూఫ్ కావాలి. ఓకే.
(07:56) సపోజ్ మీ ఆయనతో గొడవ అవుతుంది అనుకోండి గొడవ అవుతుందండి గొడవ అవుతుందండి కాదు. ఎందుకు గొడవ అవుతోంది? ఆయన మెంటాలిటీ ఏంటి? మీ ఆవిడతో గొడవ అవుతుంది అంటే ఎందుకు ఆమె అలా బిహేవ్ చేస్తోంది? అనేది మీకు క్లియర్ గా తెలియాలి. మీరు ఊహించుకోవద్దు అది నాలుగైదు సార్లు ప్రూఫ్లతో సహా మీరు దాన్ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాక వాటికి మెథడ్స్ ఏంటి ట్రీట్మెంట్స్ ఏంటి ఆలోచించుకోవచ్చు.
(08:24) సో ఫస్ట్ థింగ్ ఫైండ్ అవుట్ ద కాస్ సెకండ్ వచ్చేసి దీనికి ఇంకా ఏమైనా కారణాలు ఉండిండొచ్చా అని ఆలోచించాలి. మేము ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకోండి ఇట్లా కొట్లాడుకుంటారు. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు ఏదో జాతరకి వెళ్ళాడు ఆ జాతరలో బెల్లం విసిరారంట. ఆ బెల్లం విసిరితే వచ్చి దవడకు తగిలింది. దవడకు తగిలి దవడ విరిగిపోయింది. పాయింట్ ఏంటంటే ఎక్కడో చెక్ చేశారు దవడ విరిగింది అనుకున్నారు కానీ ఇక్కడ దెబ్బ తగిలి ఇక్కడ కూడా విరిగింది.
(08:52) ఆ ఫోర్స్ వల్ల ఇది పైకి వెళ్లి ఇది కూడా విరిగింది. సో ఇది ఒక్కటే సమస్య అనుకొని ట్రీట్ చేసి ఉంటే ఇక్కడ నొప్పి వచ్చేది మళ్ళీ అలాగే మన జీవితంలో ప్రాబ్లం కి ఆన్సర్ తెలిసినప్పటికీ ప్రాబ్లం ఇదేనా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి సర్జన్స్ ఐ ఎప్పుడు వెతుకుతుంది ఎందుకు దీనికి ఇంకేదైనా కారణం అయి ఉంటుందా అని సో ఫైండ్ అవుట్ మోర్ కాసెస్ ఓకే ఒక సమస్యకి పరిష్కారం వెతికే ముందు సమస్య ఏంటి దానికి ఎందుకు వస్తోంది ఇంకేవైనా కారణాల వల్ల రావచ్చా ఇవి ఆలోచించుకోవాలి.
(09:28) దీంతో పాటు మనము అక్కడికక్కడ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చా ఇంకా డీప్ గా ఏదైనా సాల్వ్ చేయాలా సపోజ్ ఇక్కడ ఎక్కడైనా బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనుకోండి కొన్ని కొన్ని సార్లు ఇక్కడ ఇక్కడ ఇక్కడ మేము పట్టుకోలేక రక్తం ఆపలేకపోతే మెడలోకి వెళ్లి ఈ రక్తనాళాల దగ్గర లైగేట్ చేస్తాం ఆర్ క్లామ్ ఆపుతాం ఇక్కడ ఆపుతాము అన్నమాట సో అలాగా సమస్య ఇక్కడ ఎక్కడో ఉండి ఉండొచ్చు కానీ సమాధానం మాత్రం వేరే చోట దొరుకుతుంది అందుకని ఫైండ్ అవుట్ ద అదర్ కాసెస్ ఫైండ్ అవుట్ ద ఆరిజిన్స్ ఆరిజిన్ దగ్గర ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కట్ చేయాలి.
(10:02) ఓకే ఇది గుర్తుపెట్టుకుంటే లైఫ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వెల్ ఒక్క రోజులో మీరు సర్జన్ కాలేకపోవచ్చు కాకపోతే ప్రయత్నం మొదలు పెట్టండి. ఇంకా ఇలాంటివి ఏమైనా మీకు ఈజీగా అర్థం అవ్వడానికి మెథడ్స్ వెతికి మరి మీకు చెప్తుంటాను నా వీడియోలు చూసి మీకు నచ్చి మీరు లైఫ్ లో అప్లై చేస్తే లైఫ్ విల్ బికమ్ బ్యూటిఫుల్ నిజంగా మీరు అంటారు చాలా చాలా బాగుంది సార్ మేము ట్రై చేశము ఈ లైఫ్ అనే గేమ్ భలే మజా వచ్చింది అంటారు.
(10:31) ఓకే కొంతమందికి ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల నాకు తెలిసిందే కరెక్ట్ మీకు ఎవ్వరికీ ఏం తెలియదు అనే మూఢత్వంలో ఉంటారు. అలాంటి వాళ్ళు తొందరగా మారాలి ప్రాబ్లమ్స్ వస్తాయి బాస్ ఎవరి మీదో తొయ్యను నేను సాల్వ్ చేసుకుంటాను అనే దాంట్లోకి దిగండి. నేను చెప్పింది ఆలోచిస్తారని మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment