Sunday, March 15, 2026

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

   *"దానం చేయడం..."*
         ➖➖➖✍️

*మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి.. “దానం చేయడం...!”*

*అందులో సందేహం లేదు.. అయితే ఇక్కడొక జాగ్రత్త అవసరం.* 
```
దానం పొందిన వ్యక్తి....              పొందిన దానంతో తాను అభివృద్ధి చెందాలి, తిరిగి సమాజానికి ఉపయోగపడాలి.

దానం చేయడం వలన..., దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి.

అయితే కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజాభివృద్ధికి ఆటంకమవుతారు, దీనితో పాటు చెడు వ్యసనాలకు బానిసలై మోసపూరిత మాటలతో దాతలను మరింత పీడిస్తారు.

దానం చేసే వ్యక్తి ముందుగా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే... తన దానాన్ని స్వీకరించే వారు తగిన అర్హతలున్న వారా.. కాదా.. అని బాగా ఆలోచించాలి, తదుపరి ఖచ్చితంగా ఋజువు చేసుకోవాలి.

*వారు దానం స్వీకరించడానికి అర్హులు అయితే.. అలాంటి వారికి మాత్రమే దానం ఇవ్వాలి.

*దానం స్వీకరించే వ్యక్తులు.. తగినంత అర్హులు కారని తెలిసి కూడా... అలాంటి వారికి దానం ఇచ్చినట్టయితే.... అలాంటి దానాన్ని "అపాత్రదానం" అంటారు. ఈ అపాత్రదానం చేసే దాతలకు కలిగే గండాలు ఎలా ఉంటాయో భారతంలోని ఒక కథ ద్వారా తెలుసుకుందాం..
-----------------------
*శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్యంలో సహ విద్యార్థులు, స్నేహితులు కూడా. వీరిద్దరూ పెద్దవారు అయినాక.. శ్రీకృష్ణుడు సకల సౌకర్యాలతో తులతూగుతుండగా... కుచేలుడు దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటాడు.

*ఒకనాడు కుచేలుడు తన అర్థాంగి సూచన మేరకు శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళాలనుకుంటాడు. మిత్రుడి వద్దకు ఉత్తచేతులతో వెళ్ళడం సమంజసం కాదు కనుక, కొన్ని అటుకులు తీసుకు వెళ్ళి, తన చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడికి ఇవ్వగా... మొదటి పిడికిలి అటుకులు తిన్న శ్రీకృష్ణుడు దానంగా కుచేలుని దారిద్ర్యాన్ని పోగొడతాడు.

*రెండవ పిడికిలి అటుకులు తిన్నప్పుడు కుచేలునికి సకల సౌకర్యాలు కల్పిస్తాడు.

*మూడవ పిడికిలి అటుకులు తినబోతున్న కృష్ణుడిని రుక్మిణి ఆపుతుంది....

*దీనికి ముఖ్య కారణం అపాత్రదానం చేయబోతున్నాడని!  
అంటే.. 
అన్ని సౌకర్యాలు ఏర్పడిన తర్వాత  కుచేలుడికి ఇక దానం అవసరం లేదు! 
అయినా దానం ఇస్తే... 
అలా అవసరం లేని వారికి దానం ఇచ్చిన వారు పుచ్చుకొన్న వారింటికి పనివారుగా వెళ్లవలసి వస్తుందని చెబుతోంది శాస్త్రధర్మం.✍️
***************************
ఇది సేకరణే... 
మరింత అర్థవంతంగా మలచి అందించడమైనది: 🙏```
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
             🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🙏

No comments:

Post a Comment