దివ్యదృష్టిని ఎలా పొందాలి? | Grandhalayam Ep - 25 | Yoga Secrets | Allabakshu | PMC Telugu
Author Name:PMC Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@PMCTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=z7aVSZ2Z6YI
Transcript:
(00:30) పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సమర్పిస్తున్నటువంటి గ్రంధాలయం స్వాధ్యాయ కార్యక్రమానికి మీ అందరికీ ఆత్మీయ స్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్శక్తి విలాసం ప్లే ఆఫ్ కాన్షియస్ నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను అనుభూతులను అందించిందో తీత తెల్లం చేస్తుంది.
(01:16) [సంగీతం] సాధారణంగా కుండలిని జాగృతమైన తర్వాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకం ఇది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది.
(01:50) స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం మనం గ్రంధాలయం స్వాధ్యాయ కార్యక్రమంలో భాగంగా స్వామి ముక్తానంద గారి ఆత్మకథ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ చిత్శక్తి విలాసం గురించి మనందరం కలిసి స్వాధ్యాయం చేస్తున్నాము. గత 24 ఎపిసోడ్లుగా మనం తెలుసుకుంటూ వచ్చాము ఈరేదు ఈరోజు 25వ ఎపిసోడ్ మనం 24వ ఎపిసోడ్ పూర్తిగా బిందు భేదం అంటే ఏంటో తెలుసుకుందాము అని చెప్పి మనం అనుకున్నాము దానికి సంబంధించినటువంటి మనం తెలుసుకుంటాము 24 ఎపిసోడ్లో అలాగే మనం నాగలోకాన్ని యమలోకాన్ని చంద్రలోకాన్ని కూడా స్వామి
(02:36) వారు ధ్యానంలో దర్శించుకున్నారు. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి స్వర్గ లోకం కూడా ఆయన దర్శిస్తారు. దానికంటే ముందు ఒక యోగశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఉంది ఎలాగైతే కేచరి ముద్ర అనేది ఒకానొక ప్రక్రియో బిందు భేదము బిందు భేదము అనేటువంటి ఒకానొక ప్రక్రియ ఆయనకి కూడా సహజంగా ఏర్పడుతుంది. అంటే ధ్యానంలో ఆయన లోలోతులకి లోలోతులకి వెళ్తున్న కొద్దీ ధ్యానంలో ఆయన ఉన్నతమైన స్థితికి వెళ్తూ వెళ్తూ ఉంటారు.
(03:11) ఇక్కడ బిందు భేదం అంటే ఏంటంటే రెండు కనుపాపలు సమానంగా ఉండడము అంటే రెండు కనులకు కూడా ఏమవుతుంది అంటే మామూలు చూపు ఏర్పడి ఒకే వస్తువు కనబడుతూ ఉంటుంది మీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు అదేంటి సార్ ఎప్పుడు కూడా ఒకే వస్తువు కనిపిస్తుంది కదా అని అంటే లేదు రెండు కళ్ళు కూడా మనకి ఎప్పుడూ కూడా రెండు వస్తువుల వైపు చూస్తూ ఉంటాయి ఒక వస్తువు వైపు దృష్టి కేంద్రీకరించినప్పుడు మనం ఒక వస్తువును చూస్తుంటాం అని భ్రమపడుతూ ఉంటాం కానీ వాస్తవానికి మనం రెండు విభిన్నమైనటువంటి వస్తువులను చూస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే రెండు కన్నులు కలిసి ఒకే చూపుగా మారుతాయో ఒకే వస్తువు
(03:52) కనిపించడం ప్రారంభం అవుతుందో దాన్ని మనం బిందుబేదము అంటాం. ఈ బిందు భేదం వల్ల మన కన్నులలోకి నీలపు రంగు అనేది వస్తుంది. కన్నులలోకి నీలపు రంగు అనేది వస్తుంది. ఇది శాంభవీ ముద్ర ఏర్పడడానికి ముందు జరిగేటువంటి క్రియ. మనందరికీ తెలుసు యోగశాస్త్రాల్లో శాంభవీ ముద్ర అనేది అత్యంత ప్రతిష్టాత్మకమైనది దానికంటే ముందు ఏర్పడేది ఈ బిందు భేదము అంటాము.
(04:20) సాధకుల్లో వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడైతే నీలపు వెలుగు గనుక కనిపించిందో ఆ నీలం రంగు వెలుగు అనేది ఒక విధంగా చెప్పాలి అంటే సాధకుడి యొక్క అదృష్టానికి ప్రతిఫలంగా మనం చెప్పుకోవచ్చు సాధారణంగా ఏం జరుగుతుందంటే ఈ బిందు భేద ప్రక్రియ ఏర్పడినప్పుడు సాధకులు భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారు చూపు ఎక్కడ పోతుందో ఏంటి ఒక్కటే కనబడుతుంది ఇంకా మిగతావి కనిపించడం లేదేంటి చూపు పోతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు.
(04:50) ప్లస్ ఇంకా ఏం జరుగుతుంది అంటే బిందుబద ప్రక్రియ జరగడం కంటే ముందు కనుపాపలు కనుగుడ్లు పైకి కిందికి కొట్టుకుంటూ ఉంటాయి. ఎంతో వేగంగా వస్తుంటాయి. కన్నులు బయట పడతాయేమో అన్నంత వేగంగా వస్తూ ఉంటాయి. చూసేవారికి కూడా కొద్దిగా భయం కలుగుతూ ఉంటుంది ఒక సాధకుడు బిందు భేద ప్రక్రియ చేస్తున్నప్పుడు చూసేవారికి కూడా కొద్దిగా భయం కలుగుతుంది. కానీ ఎవరైతే ఆ భగవతిని ఎవరైతే కుండలిని శక్తిని ఎవరైతే చిన్మాత్రని సంపూర్తిగా నమ్ముకుంటారో ఆ చిన్మాతని సంపూర్తిగా నమ్ముకుంటారో వారికి ఎలాంటి భయం కూడా అవసరం లేదు.
(05:26) ఎందుకంటే మనకి ఈ కుండల్ని జాగరణ ప్రక్రియలో బాహ్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియలు ఇవేవి ఏవైతే ఉన్నాయో ఈ ప్రక్రియలు చేయించేది ఎవరు లోపల ఉన్నటువంటి మన పరమాత్మ శక్తి చేయిస్తుంది మన పరమాత్మ శక్తి మనతో ఈ ప్రక్రియలన్నీ చేయిస్తున్నప్పుడు మనం ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం ఉంది ఎవ్వరికీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మన కనుగుడ్లు తిరుగుతూ ఉంటాయో అప్పుడే నేత్ర భ్రమణం అనేది జరుగుతుంది నేత్రచే ఛేదనం అనేది జరుగుతుంది.
(05:57) నేత్ర భ్రమణం నుంచి నేత్ర ఛేదనం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ నేత్ర ఛేదనం వల్ల ఏమవుతుందంటే ఈ చక్షువులకు సంబంధించి అంటే ఈ కన్నులకు సంబంధించినటువంటి ఒకానొక అధిష్టాన దేవత ప్రసన్నం అవుతుంది. దీనికంటే ముందు మనం ఒక విషయం చెప్పుకోవాలి మన శరీరంలో ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి ఇంద్రియానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది.
(06:21) ఈ విషయాన్ని సాధకులు ఎవరు కూడా మర్చిపోవద్దు మాస్టర్స్ అయితే చక్రాలు శుభ్రపడినంతవరకు అంటే మన శరీరంలో అవయవాలు చక్రాలు నాడులు అంతర్గతంగా శుభ్రపడనంతవరకు ఇంద్రియాలు మామూలుగానే పనిచేస్తూ ఉంటాయి అందరిలో కూడా మామూలుగానే పనిచేస్తుంటాయి కానీ ఎప్పుడైతే చక్రాలు పరిశుభ్ర పడతాయో అప్పుడు వాటికి దివ్యమైనటువంటి శక్తి లభిస్తుంది ఆ దివ్యమైనటువంటి శక్తి ఎట్లా వస్తుంది అంటే ఆ చక్రాలకు సంబంధించ ించినటువంటి అధిష్టాన దేవత అంతవరకు శుషుప్తి అవస్థలో ఉన్నటువంటి ఆ అధిష్టాన దేవత జాగృతవస్థలోనికి వస్తుంది అందుకే మనకి దివ్యమైనటువంటి శక్తి లభిస్తుంది అలాగే ఈ చక్షువు యొక్క ఈ
(07:03) చక్రాలు మన చక్షువుల్లో కూడా చక్రాలు ఉంటాయి ఈ చక్షు చక్రాలు ఎప్పుడైతే శుభ్రపడతాయో అప్పుడు ఆ చక్షు దేవత మనకి దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది. ఇక్కడ మనకి దివ్య దృష్టి కలుగుతుంది. చూడండి మాస్టర్స్ బాగా గమనించండి దివ్య దృష్టి కోసం ఇవన్నీ సాధకుడు చేయాల్సిన అవసరం లేదు సాధకుడు చాను చేస్తున్నటువంటి ధ్యానాన్ని ఒక సంపూర్ణమైనటువంటి శ్రద్ధతో చేస్తూ పోయినట్లయితే ఇవన్నీ కూడా తనకి సంభవిస్తూ ఉంటాయి.
(07:34) మరి దివ్య దృష్టి వల్ల ఏంటి ఉపయోగం అంటే దూరంగా ఉన్న వాటిని సైతం కూడా సాధకుడు చూడగలడు దివ్య దృష్టి అంటే థర్డ్ విజన్ కాదు థర్డ్ విజన్ వేరు దివ్య దృష్టి వేరు దివ్య దృష్టిలో నువ్వు బాహ్యంగానే ఏం చేస్తావు కన్నులు మీరు తెరుచుకునే ఉంటాయి మీ తెరుచుకున్న నేత్రాల ద్వారా మీ కన్నుల ద్వారా దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా మీరు చూడగలరు. ఈ అద్భుతమైనటువంటిది ఎప్పుడైతే స్వామి ముక్తానందలో ఈ చక్షు దేవత ప్రసన్నమైందో దివ్య దృష్టి ఆన ఆయనకు ఏర్పడుతుంది అలాగే ధ్యానంలో కూర్చుంటూ ఉండగానే కేచరి ముద్ర దివ్య దృష్టి రెండు సహజంగానే వస్తుంటాయి ఆనందం యొక్క స్ఫురణ
(08:14) వస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే ఆయనకి ఈ అగచక్షువు యొక్క అధిష్టాన దేవత ప్రసన్నమై దివ్య దృష్టిని ఆయనకు అందిస్తుందో అప్పుడు ఆయన సదా ఆనందంలో ఉండిపోతాడు ఆనందం యొక్క స్పృహ ఉంటుంది ప్లస్ ఎరుక ఇంకా స్థిరపడుతుంది. అవేర్నెస్ అనేది ఇంకా స్టిల్నెస్ గా మారిపోతూ ఉంటుంది. ఇటువంటి ఎరుక ఎట్లా అంటే మళ్ళీ ఏదో సంభవించినట్లు కాదు సహజంగానే ఉంటూ సామాన్యంగానే ఉంటూ ఎరుక చాలా స్థిరమవుతూ ఉంటుంది.
(08:47) అలాగే ఏదైనా విషయాల గురించి అర్థం చేసుకునేటువంటి పద్ధతి కూడా కొత్తగా ఉంటుంది. అంటే అప్పటివరకు ఏదైతే తమ యొక్క మనసు ఆధారంగా అర్థం చేసుకుంటూ ఉంటారో విషయాల్ని ఈ ఎరుక అనేది సంపూర్తిగా ఏర్పడ్డప్పుడు దాన్ని ఒక దివ్యంగా అర్థం చేసుకోవడం ప్రారంభం అవుతుంది ఆయన చెప్తారు నేను ఎంతో మెలుకోతూ ఉంటున్నాను నేను నా బుద్ధి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఎరుక నాలో స్థితమైంది సంపూర్ణమైనటువంటి ఎరుక నాలో స్థితమైంది అన్న విషయం నాకు బోధపడింది అని చెప్తూ ఉంటారు.
(09:24) ఇప్పుడు ఆయనలో పూర్తిగా ఆల్రెడీ మనకి అవధూత గారి దర్శనం తర్వాతనే వాంఛ అనేది ఆయనకి తొలగిపోయింది కానీ ఇప్పుడు తనకి ఏం జరిగింది అంటే స్వామి వారికి కామవాంఛ పూర్తిగా తొలగిపోతుంది మాస్టర్స్ అసలు కామవాంఛ అంటూ ఏమీ ఉండకుండా సంపూర్తిగా కామవాంఛ అనేది తొలగిపోతుంది ఒక నూతనమైనటువంటిది కొత్తదైనటువంటి ప్రేమ భావం ఉదయిస్తుంది ఒక ప్రేమ భావం ఉదయిస్తుంది అది పెరిగి పెద్దదై అందరి పట్ల ఒక ప్రవాహంగా మారుతూ ఉంటుంది అందరి పట్ల అంటే ఒక అన్కండిషనల్ లవ్ లోకి వచ్చేస్తారు అంటే పూర్తిగా ఇక ఏం జరిగింది అంటే ఇక్కడ అనాహతము సంపూర్తిగా విచ్చుకుంది అంటే అనాహతములోనికి ఆ పరమేశ్వరి మాత తన సంపూర్ణమైనటువంటి
(10:09) శక్తిని ప్రసరింపచేసింది అని ఆయన ఆలోచిస్తారు ఒక విచారణ ఏంటి ఇది ఇష్టమా మమత కామమా అని ఆలోచించినప్పుడు కాదు ఈ మూడింటికీ అతీతమైనటువంటి ఒక అన్కండిషనల్ లవ్ అని చెప్పి ఆయనకు అర్థంవుతుంది. అసలు వృక్షాల పట్ల కూడా ఆ మామిడి చెట్లు అంటే ఆయనకు ఆల్రెడీ చాలా ఇష్టం కానీ ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆయన చెప్తారు ఇక్కడ భగవంతుడు అన్నింటిని ప్రేమిస్తూ ఉంటాడు.
(10:42) ఆ భగవంతుడి యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ నాలోంచి ప్రతిఫలిస్తూ ఉంటుంది. దానికి పెద్ద కారణం అంటూ ఉండదు. ఒకరిని ప్రేమించడానికి పెద్ద కారణం అంటూ అవసరం లేదు అలా అవసరం లేనటువంటి అంటే కారణం అవసరం లేనటువంటి ఒక అన్కండిషనల్ లవ్ ఒక స్వేచ్ఛ ప్రేమ అనేది ఎలాంటి ఆటంకాలు లేనటువంటి ఎలాంటి ఆశించడాలు లేనటువంటి ఒక స్వేచ్ఛ ప్రేమ అనేది ఇక్కడ మనకి స్వామి ముక్తానందలో ప్రవహించడం ప్రారంభించింది.
(11:14) అందుకే ఆయన ఇక్కడ ప్రేమ గురించి కొన్ని అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు అది ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం చూడండి భగవంతుని ప్రేమ చాలా గొప్పది పక్షపాతం లేనిది భగవంతుడి ప్రేమ మానవుడి ప్రేమను పోలినటువంటి ఈ వ్యవహారం కాదు వ్యవహారిక ప్రేమ నిజానికి ప్రేమ కాదు అది వ్యాపారం ఇచ్చి పుచ్చుకునేది అంటున్నారు ఆయన ఒక కసాయివాడు కూడా గొర్రెల్ని ప్రేమిస్తాడు దేనికోసం ప్రేమిస్తాడు ఆ తరువాత డబ్బు ఆర్జన దృష్టిలో పెట్టుకొని ప్రేమిస్తూ ఉంటాడు అది స్వచ్ఛమైన ప్రేమ కాదు సహజమైన ప్రేమ కాదు ప్రేమ అనేది ఒక హృదయం యొక్క ప్రేమ హృదయం యొక్క అవ్యాజ్యమైనటువంటి
(11:50) స్నేహం అంటారు. మానవుడి ప్రేమకి ఏదో కారణం ఉంటుంది. కానీ అది దాన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం కానీ స్వార్థం అది కారణం ఉన్నటువంటి ప్రేమ స్వార్థంతో సమానం భగవంతుడి ప్రేమ ఒక్కటే నిర్మలంగా ఉంటుంది ఎందుకంటే భగవంతుడి స్వభావమే ప్రేమ భగవంతుడి కృప ప్రేమ భగవంతుడు ఇచ్చేది ప్రేమ భగవంతుడు తీసుకునేది ప్రేమ యావత్ ప్రపంచం పట్ల భగవంతుడి దృష్టి ఒకేలాగా ఉంటుంది అలాంటి భగవంతుని ప్రేమ నాలో ప్రవహించింది అని ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఆయన ఏదైతే దర్శించారో ఆయన దర్శించిన దాన్ని మాటల రూపంలో పదాల రూపంలో మనకి వర్ణిస్తూ ఉంటారు.
(12:30) అలా అత్యున్నతమైనటువంటి ఒక ప్రేమ భావన ఆయనలోకి వచ్చిన మరుక్షణమే ధ్యానంలో ఇప్పుడు ఒక అద్భుతం సంభవిస్తుందండి. ఆయన అంతకుముందు ఏం చూశారు నల్లటి అంధకారమయమైన లోకాన్ని చూశారు కదా ఆ తరువాత తన ఎదుట అందంగా అలంకరించబడినటువంటి ఒక ఏనుగుని చూస్తారు ఆయన అన్ని కూడా ఆయనకి ధ్యానంలో దివ్య దృష్టి ద్వారా కనబడుతున్న విజన్స్ అని చెప్పుకున్నాం కదా మనం ఆయన తర్వాత ఏం చూస్తారు అంటే నెక్స్ట్ ఏడు ముఖాలు కలిగి ఏడు ముఖాలు కలిగి ఉంటాయి ఏనుగుకి ఏడు ముఖాలు ఉంటాయి అందంగా అలంకరించబడి ఉంటుంది.
(13:11) అందమైన వస్త్రాలతో అలంకరించబడినటువంటి ఏనుగు మెడలో బంగారము ముత్యాలు మనులతో చేసినటువంటి ఆభరణాలు ఉంటాయి. ఆ ఉదయపు సూర్యకాంతిలో ఆ ఆభరణాలన్నీ మెరుస్తూ ఉన్నాయి. ధ్యానంలో ముక్తానంద గారు ఆ ఏనుగుని చూస్తూ చూస్తూ ఉంటారు. దాని గురించే తర్వాత ధ్యానం ముగిసిన తర్వాత ఆ ధ్యానం ముగుస్తుంది. ఏనుగు మనం చెప్పుకున్నాం కదా ఒక హైయెస్ట్ టాప్ లోకి రాంగానే ఏమవుతుంది? ధ్యానం ముగిస్తుంది.
(13:40) ధ్యానం ముగిసిన తర్వాత ఆయన ఏం చేస్తారు దాని గురించినటువంటి విచారణ ఆయన చేస్తూ ఉంటారు. ఆ విచారణలో భాగంగా ఆయన ఒక పురాణ గ్రంథం చదివినప్పుడు దాంట్లో ఉంటుంది. ఆ ఏనుగు సాధారణ ఏనుగు కాదు ఆ ఏనుగు ఇంద్రలోకానికి సంబంధించినటువంటి ఐరావతం సో ఆయన దేన్ని దర్శించుకున్నారు ఇప్పుడు ఇక ఇంద్రలోకానికి వెళ్తున్నారు ఆయన యమలోక దర్శనం వైపు అయిపోయింది ఐరావతాన్ని దర్శించుకున్నారు ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్తున్నారు ఆయన ఆయన ఆ గ్రంథంలో రాసి ఉంటుంది ఐరావతం యొక్క దర్శనం పుణ్యప్రదం ఎప్పుడైతే ఐరావతం తనకి దర్శనం ఇచ్చిందో స్వామి వారి ధ్యాన సాధన ఉదృతంగా వస్తుంది
(14:21) ఎంతో ఉత్సాహము ఎంత ఉత్సాహం అంటే అసలు వేరే పని ఏది చేయకుండా రాత్రి పగలు రాత్రి పగలు ధ్యానం చేద్దామా ధ్యానం చేద్దామా అన్నంత ఉత్సాహం వస్తుంది ధ్యాన వేగానికి దాని వల్ల కలిగే అలసట కూడా ఏమీ రాకుండా ఉంటుంది. అందుకని ఇక్కడ స్వామి వారు ఏం చెప్తారు అంటే మనము ఈ ధ్యానంలో ఈ అనుభవాలు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం సదా సదా సదా ఆచరించాలి.
(14:49) ఇదే ఈ ఎపిసోడ్ యొక్క హైలైట్ ఏందంటే ఆయన మనక ఒక మంచి సూచన ఇస్తున్నారు. మనలాంటి ధ్యాన సాధకులందరికీ కుండలిని సాధకులందరికీ ఆయన ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బోధిస్తారండి ఆయన అంటే మనము ధ్యానం చేస్తుంటాము కుండలిని సాధన చేస్తుంటాము మరి భౌతిక జీవితంలో ఎలా ఉండాలి ఈ సాధన చేసేటప్పుడు అంటే ఆయన చెప్తున్నాడు చూడండి ధ్యానం చేసే వ్యక్తి తన గురించి పూర్తిగా అర్థం చేసుకోగలగడం ముఖ్యం తన గురించి తనకి పూర్తిగా అర్థం చేసుకోవాలి విశృంకలంగా వ్య వ్యవహరించవద్దు అని బోధిస్తున్నారు మనకి ఇక్కడ ధ్యానం చేసే వ్యక్తి విశృంకలంగా వ్యవహరించవద్దు అతిగా నవ్వడం కానీ అతిగా రోధించడం గానీ
(15:32) అనవసరమైనటువంటి మాటలు కానీ హద్దు మీరినటువంటి ఆహారాలు కానీ హద్దు మీరినటువంటి విహారాలు కానీ పనికి రావు ధ్యానం చేసే వ్యక్తి సాధన చేసే వ్యక్తి తన గురించి తాను అర్థం చేసుకోవాలి విశృంఖలంగా ప్రవర్తించవద్దు అతిగా మాట్లాడవద్దు అనవసరమైన మాటలు మాట్లాడవద్దు హద్దు మీరిన ఆహార విహారాలు చేయవద్దు అని చెప్తున్నారు. అవి పనికి రావు ఎందుకంటే మీతో పాటుగా అవి చేయడం వల్ల ఏం జరుగుతుంది మీ వర్క్కి మాత్రమే నష్టం కాదండి మీతో పాటు మీరు గొప్ప తపస్సు చేశారు మీరు ఇంతవరకు మీరు ధ్యానంలో ఈ స్థితికి చేరుకున్నారు అంటే మీరు గొప్ప తపస్సు చేశారు మీ తపస్సు యొక్క
(16:17) స్థితి వలన మీ ఫలితం ఏమవచ్చింది పారమేశ్వరి మాత అనుగ్రహం కలిగింది కదా మీకు ఈ పారమేశ్వరి అనుగ్రహక శక్తికి ఎటువంటి అపచారం జరగకుండా చూడండి ఈ పనులన్నీ గనుక మీరు చేస్తున్నట్లయితే మీలో ఉన్నటువంటి ఈ పారమేశ్వరి అనుగ్రహం వల్ల కలిగిన శక్తికి అపచారం కలిగినట్లుగా అలా అపచకారం జరగకుండా చూడండి ఆ విధంగా జరిగితే ఏం జరుగుతుంది మీ మంత్ర సిద్ధి గాని మీ దూర దృష్టి గాని మీ ఇష్ట దేవతా దర్శనము గాని మీ ఐహిక సంపద గాని వీటిని పొందడం నిలిచిపోతుంది అంటే ఇంతవరకు ఏదైతే మీరు ఆధ్యాత్మికంగా మీకు సహజంగా లభించాయో అవన్నీ కూడా మీ నుంచి దూరం జరగడం
(17:04) జరుగుతుంది. ఇక్కడ బాబాజీ గారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారండి మనకి స్వామి ముక్తానంద గారు మరొక అద్భుతమైన ఉదాహరణ ఏం చెప్తారంటే ఆయనతో ఒక శిష్యుడు అంటాడు బాబాజీ ధ్యానం అయితే జరిగింది కానీ నాకు ఆనందం లభించలేదు అంటారంట ఒకళ్ళు ఇంకోవారు ఏమంటారు నాకు ధ్యానంలో అనేక దృష్టి అనేక విజన్స్ కనపడ్డాయి కానీ అవి ఏవి నిజం కాలేదు కదా అన్ని అబద్ధాలు అయినాయి అని చెప్పి ఇంకొకరు ఇంకొకళ్ళు ఏమంటారు ధ్యానానికి కూర్చున్నప్పుడు భయం కలుగుతుంది అంటారు వేరేవారు ఏమన్నారంటే ధ్యానంలో దిగులు ఎక్కువైతున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు.
(17:38) వీటన్నింటి ప్రశ్నలకి స్వామి ముక్తానంద గారు ఈ పేరాగ్రాఫ్ లో జవాబు ఇస్తున్నారండి ఏమంటారంటే ఓ నా ప్రియమైన సిద్ధ విద్యార్థులారా మీ అంతరంగంలో మీ అంతరంగంలో క్రియా రూపంలో ఉన్నటువంటి మహాశక్తి పట్ల మీరు అపచారములే అవహేళన జరిగింది. మీరు మీ లోపల మీ అంతరంగంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ మహాశక్తి పట్ల అపచారం చేశారు అవహేలనగా ప్రవర్తించారు కాబట్టే దీనికి అంతటికీ కారణం దేనికి ధ్యానంలో దుఃఖం లభించడం కానీ ధ్యానంలో భయం కలగడం కానీ ధ్యానంలో దిగుళ్లు ఎక్కువైనవడం కానీ ఇవన్నీ దేని వల్ల అవుతుంది మీరు బాహ్యంలో సరైనటువంటి
(18:24) క్రమశిక్షణతో ఉండకపోవడం వల్ల ఇలాంటి అనర్థాలన్నీ మీకు జరుగుతున్నాయి అందుకే దీనికి ఏంటి కారణం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం ఎవరితో పడితే వాడితో స్నేహం చేయడం అన్న మాట కూడా వాడతారండి అయోగ్యులతో స్నేహం చేయడం వంటి చర్యలు కూడా చేయవద్దు. ఎవరు జ్ఞానులతోనే మీ ఆహార విహారాలతో ఉండండి. అందుకే ఎందుకు అంటే ఇలాంటి చర్యల వల్ల మీకు పూర్ణ సిద్ధి ప్రాప్తించదు.
(18:51) ఇప్పుడు మీరు చూడండి ఇంతమంది చేస్తున్నారు కదా సాధన ఇంతమందిలో ఉన్నటువంటిది ఒకే ఒక శక్తి కదా శక్తి వేరు వేరు రూపాల్లో లేదు ఒకే రూపంలో ఉన్న శక్తి సాధన చేస్తున్నటువంటి ఇంతమందిలో కూడా ఎందుకు వివిధ రూపాలలో ఒక సిద్ధి కలిగిస్తుంది శక్తి ఒక్కటే సాధన ఒక్కటే చేస్తున్నారు కానీ ఎందుకు అందరికీ పూర్ణ సిద్ధి లభించట్లేదు అంటే బాహ్యంలో మీ యొక్క క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఇదంతా సంభవిస్తుంది అని మనకి మంచి హితబోధ చేస్తున్నారండి ఆ తర్వాత స్వామి వారికి మరొక అద్భుతం అనేది సంభవిస్తుంది.
(19:26) ఏంటంటే ఎప్పుడైతే మనం చెప్పుకున్నాం కదా బిందు భేదం అనేది సంభవిస్తుందో ఆ బిందు భేదం వల్ల రెండు కనుపాపలు గుండ్రంగా తిరుగుకుంటూ కేంద్రానికి చేరుకొని రెండు బిందువులు సమానమైపోయి ఏం జరుగుతుంది చిన్న నువ్వు గిన్నంత చిన్నది అయినటువంటి నీలము రంగు ఒక బిందువు దర్శనం ఇస్తుంది ఏం దర్శనం ఇస్తుంది ఎంతో ప్రకాశంతో కూడినదైనటువంటి ఒక నీల బిందువు దర్శనం ఇచ్చి అది ఎక్కడికి వెళ్తుంది అంటే కళ్ళలోంచి ఎంతో ప్రకాశంతో బయటికి వెళ్లి మళ్ళీ కళ్ళల్లోకి వస్తుంది.
(20:06) సో బిందు భేదము జరిగిన తర్వాత కళ్ళల్లోంచి ఎంతో వేగంగా చిన్న నువ్వు గింజంతా నీలం బిందు బయటికి వచ్చి మళ్ళీ కళ్ళల్లోకి వెళ్తుంది. ఇది మామూలు ప్రక్రియ కాదు. దీన్ని స్వామి వారు ఏమంటున్నారు అంటే స్వామి వారికి జరిగినటువంటి ఈ ప్రక్రియ స్వామి వారికి ధ్యానంలో సంభవించినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఇదొక రహస్యమైనటువంటి గుప్తమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రక్రియ ఈ చిన్న నీలం బిందువు క్షణంలో దశ దిశలను ప్రకాశవంతం చేస్తుంది అది బయటికి వచ్చింది ఒక్క సెకనే కానీ ఆ ఒక్క సెకండ్ లోనే అది ఏం చేస్తుంది నలు దిశలను ప్రకాశవంతంచే చేస్తుంది అది స్వామివారు
(20:50) ఇటు కూర్చుంటే ఆ దిశ వైపుగా సంపూర్ణ దిశ వైపుగా ఉండేది చూడండి అందుకని ఏమంటారు నేను పూర్వాభిముఖంగా కూర్చుంటే పూర్వ దిశ ప్రకాశించేది దక్షిణ అభిముఖంగా కూర్చుంటే దక్షిణ దిశ ప్రకాశించేది అని చెప్పి ఆ బిందువు యొక్క మహిమ గురించి స్వామి వారు మనందరితో పంచుకుంటున్నారు ఆయన అనుభవాన్ని ఏంటంటే ఆ నీలం బిందువు యొక్క గమనం అంటే దాని యొక్క ఫోర్స్ ఎలా ఎలా ఉంటుంది అంటే దాని గమనము విద్యుత్ శక్తి వేగం కంటే తీవ్రమైనది మనకు కరెంట్ తెలుసుగా ఎంత స్పీడ్ గా వెళ్తుందో దానికంటే కూడా మీ కళ్ళల్లో బిందు భేదం వల్ల యొక్క ఫలితమైనటువంటి ఆ నీలం బిందువు
(21:33) అనేది దానికంటే వేగమైనది తీవ్రమైనది దాన్ని చూస్తుండగానే ఏం జరిగేవి అంటే ఆయనకి మనసులో స్వామి గారికి రకరకాల భావాలు ఉత్పత్తి అయ్యేది దానితో పాటు ఆయన అనుకునేవారు ఈసారి నాకు రాముడు దర్శనం ఇస్తారా ఈసారి నాకు కృష్ణుల వారు దర్శనం ఇస్తారా ఈసారి నాకు పరమశివుల వారు దర్శనం ఇస్తారా అని చెప్పి దర్శనాల గురించిన ఆశ కూడా స్వామి వారికి ఎక్కువకుంటూ వచ్చింది.
(21:58) మనసులో సంతోషము ఇదంతా అంతరాత్మ కూడా సంతృప్తి చెందుతుందండి వీటి ఫలితాలు మొత్తం చూసిన తర్వాత అవుట్పుట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా స్వామి ముక్తానంద గారికి ఆయనకు కూడా ఎంతో ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అప్పుడు తనకి మనసులో తనకి ఏమవస్తుందంటే అంతరాత్మ చెప్తూ ఉండేదంట నీకు భగవతి కుండలి ప్రసాదం లభించింది నీకు భగవతి కుండలిని ప్రసాదం లభించింది అందుకే అప్పటి నుంచి ఆయన ఇంకా ప్రశాంతంగా ఇంకా జ్ఞానపూర్వకంగా అలా జ్ఞానపూర్వకంగా ఉండేవారు.
(22:32) కానీ ఆ నీలం బిందువు గురించి ఇంకా వర్ణిస్తారండి ఆయన నీలేశ్వరి అంటారు. సో మనం రక్తేశ్వరి నుంచి శ్వేతేశ్వరికి వచ్చాము శ్వేతేశ్వరి నుంచి కృష్ణేశ్వరి కృష్ణేశ్వరి నుంచి నెక్స్ట్ మనకి ఇంకో నాలుగో జ్యోతి ఏంటి ఇప్పుడు కనబడింది నీలేశ్వరి ఆ నీలేశ్వరి గురించి ఆ నీలేశ్వరి ఆయనలో కలిగించినటువంటి ఆ కల్పించినటువంటి ఆ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుంటూ ఐరావతం కనిపించింది ఇంకా అతను ఇంద్రలోకంలోనికి సంపూర్తిగా వెళ్ళలేదు ఐరావతం కనిపించిన తర్వాత తనకి నీలం రంగు జ్యోతి కనిపించింది ఈ నీలం రంగు జ్యోతి యొక్క దర్శనము కానీ ఈ నీలం రంగు
(23:16) జ్యోతి యొక్క ఈ నీలేశ్వరి నీలేశ్వరి గురించినటువంటి మరిన్ని మహిమాన్వితమైనటువంటి విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయినటువంటి 26వ ఎపిసోడ్ లో మనం తెలుసుకుంటాము సంపూర్తిగా సో మరిన్ని మరిన్ని దర్శనాల సంబంధించినటువంటి విషయాలతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో నీలేశ్వరి గురించి తెలుసు సుకోవడానికి మనం మళ్ళీ కలుసుకుందాము.
(23:41) కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఈ చిత్శక్తి విలాసం స్వాధ్యాయంలో మనందరం కలిసి పాలుపంచుకుంటున్నందుకు మనందరం కూడా ఆ కుండలిని మాతకి ఆ భగవతీ మాతకి మనందరం కూడా ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. అలాగే మీ అందరికీ కూడా శుభాకాంక్షలు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం నీలేశ్వరి గురించినటువంటి సంపూర్ణ మహిమాన్వతమైనటువంటి అవగాహన తెలుసుకుందాము థాంక్యూ వెరీ మచ్ మాస్టర్స్
(24:30) [సంగీతం]
No comments:
Post a Comment