ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి! | Don’t Trust Anyone Blindly | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VFMLMw4WbjU
Transcript:
(00:00) ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అది నమ్మకం ఎవరిని నమ్మాలి ఎంతవరకు నమ్మాలి అసలు నమ్మకం అనే పదానికి అర్థం ఏంటి? బంధాలు చాలా త్వరగా ఏర్పడతాయి. అంతే త్వరగా విడిపోతున్నాయి. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చూసి ఎవరో చెప్పిన నాలుగు తీపి మాటలు విని ఎదుటి వ్యక్తి అసలు రంగు తెలియకుండానే మన జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టేస్తున్నాం.
(00:22) ఆ తర్వాత మోసపోయామని తెలిసి మనసు విరిగిపోయి ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాం. మీరు గమనించారా మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది. కానీ మన మనసు మాత్రం ఇంకా ఆ పాతకాలపు అమాయకత్వంలోనే ఉంది. ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే చాలు వాళ్లే మన సర్వస్వం అనుకుంటాం. కానీ పరమహంస యోగానంద గారు ఒక మాట అనేవారు. ఈ ప్రపంచంలో మీకంటూ ఒక సొంత గుర్తింపు ఉంది.
(00:44) దాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి అని సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఎదుటివారి అందాన్ని చూస్తాం. వాళ్ళ హోదాని చూస్తాం. వాళ్ళ మాటల్ని నమ్ముతాం. కానీ వాళ్ళ క్యారెక్టర్ ని మాత్రం మనం టెస్ట్ చేయం. టెస్ట్ చేయకుండా నమ్మడం అనేది పునాదులు లేని ఇల్లు కట్టడం లాంటిది. చిన్న గాలివాన రాగానే ఆ ఇల్లు కోలిపోతుంది. అలాగే చిన్న కష్టం రాగానే ఆ బంధం కూడా మొక్కలైపోతుంది.
(01:05) ఈ రోజుల్లో యువత ఎదుర్కుంటున్న అతి పెద్ద మానసిక ఒత్తిడికి కారణం ఇదే. తప్పుడు వ్యక్తులపై నమ్మకం ఉంచడం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఒక చిన్న మొబైల్ ఫోన్ కొనాలంటే దానికి సంబంధించిన వీడియోస్ అన్ని YouTube లో చూస్తాం. వందల మందిని అడుగుతాం. అన్ని ఫ్యూచర్స్ చెక్ చేస్తాం. మరి మన జీవితాన్ని పంచుకునే వ్యక్తిని ఎంచుకునేటప్పుడు లేదా ఒక ముఖ్యమైన బాధ్యతను ఒకరికి అప్పగించేటప్పుడు ఎందుకు అంత త్వరగా నిర్ణయం తీసుకుంటున్నాం.
(01:28) ఈ తొందరపాటి మనల్ని ఇబ్బందుల్లో నెడుతుంది. అసలు మనం ఎందుకు ఇంత త్వరగా ఎవరినైనా నమ్మేస్తాం. ఎందుకు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. దీని వెనుక ఒక లోతైన కారణం ఉంది. అది మన ఒంటరితనం. మనలో చాలా మందికి లోపల ఒక ఒంటరితనం ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి మనల్ని ప్రేమించాలి. మనల్ని పొగడాలి అని కోరుకుంటాం. ఆ ఆకలిలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి వేసే చిన్న బిస్కెట్ కూడా మనకి ఒక విందు భోజనంలో అనిపిస్తుందన్నమాట.
(01:54) యోగానంద గారు చెప్పినట్లు మనసు అనేది ఒక కోతి లాంటిది. దానికి సరైన శిక్షణ లేకపోతే అది ఎక్కడ పడితే అక్కడ గెంతుతుంది. మన మనసు కూడా అంతే కొంచెం ప్రేమ దొరగగానే వెనక ముందు ఆలోచించకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. మనం టెస్ట్ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఒకరిని టెస్ట్ చేయడం అంటే వాళ్ళని అనుమానించడం అని కాదు వాళ్ళ యోగ్యతని తెలుసుకోవడం ప్రకృతిలో ఒక చిన్న పక్షికి ఉండే జ్ఞానం కూడా మనిషికి లేకపోవడం విచారకరం.
(02:21) మీకు తెలుసో లేదో పక్షి జాతిలో ఒక అద్భుతమైన రూల్ ఉంటుంది. ఆ రూల్ ఏంటంటే ఒక ఆడ పక్షి తన జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా అది ఎక్కడో ఎత్తైన కొండ మీద నుంచి ఒక చిన్న ఎండు పొల్లను కిందకి విసిరేస్తుంది. ఆ పుల్ల గాలిలో పడుతుండగానే మగ పక్షి మెరుపు వేగంతో వెళ్లి దాన్ని నేలని ముట్టుకోకముందే పట్టుకోవాలి.
(02:44) ఇది ఒకసారి కాదు వందల సార్లు వేరు వేరు ఎత్తుల నుండి వేరు వేరు పరిస్థితుల్లో ఆ ఆడపక్షి ఈ పరీక్ష పెడుతుంది. ఎందుకు అంత కఠినంగా ఉంటుందది కేవలం తన కోసం కాదు రేపు తాను ఎత్తైన కొండ మీద గూడు కట్టి గుడ్లు పెట్టినప్పుడు ఆ గుడ్ల నుండి వచ్చే పిల్లలు పొరపాటున గూడు జారి కింద పడిపోతే వాటిని కాపాడగలిగే సత్త తన భాగస్వామికి ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారించుకోవడానికి సరే పక్షి గురించి పక్కన పెట్టండి.
(03:10) మరి మనం మనం కేవలం మాటలు చూస్తుంటాం. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పే మాటల వెనుకన్న నిజాయితిని పరీక్షించడం లేదు. ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? కష్టంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు? తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఎలా చూస్తున్నాడు ఇవేవి మనం పట్టించుకోం. యోగానంద గారు అనేవారు నిశశబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ నిజమైన స్వరూపాన్ని చూడగలరు అని అలాగే ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులే ఆ వ్యక్తి అసలైన క్యారెక్టర్ కానీ మనం బాహ్య రూపాలకి నటించే మాటలకి పడిపోతున్నాం. అందుకే మనకి సమస్యలు
(03:43) వస్తున్నాయి. సరే మరి దీని పరిష్కారం ఏంటంటే మనం అందరినీ అనుమానిస్తూ బతకాలంటే అసలు అవసరం లేదు. మనం చేయాల్సింది గుడ్డి నమ్మకాన్ని వదిలేసి జ్ఞానంతో కూడిన నమ్మకాన్ని పెంచుకోవడం. మొదటిగా పక్షి నుండి ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఎవరైనా మీ జీవితంలోకి ఆహ్వానించే ముందు వాళ్ళకి పరీక్షలు పెట్టండి. అది తప్పు కాదు వాళ్ళ నిజాయితీని, వాళ్ళ ఓర్పుని వాళ్ళ నైతికతని గమనించండి.
(04:08) యోగానంద్ గారు తన శిష్యులను కూడా అలాగే పరీక్షించేవారు. ఆయన అంటారు బంగారాన్ని ఎలాగైతే కాల్చి మెరుగు తీస్తారో మనిషి వ్యక్తిత్వాన్ని కూడా కష్టాల్లోనే గుర్తించగలమని ఒక వ్యక్తి మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారా? చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారా అవి గమనించండి. మీరు ఎవరినైనా నమ్మే ముందు వాళ్ళ ప్రవర్తనని వాళ్ళ గతాన్ని వాళ్ళ విలువలని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోండి ఎందుకంటే తొందర పడకండి.
(04:34) చాలా మంది తొందర తొందరగా డిసిషన్ తీసేసుకొని ఎవరిని పడితే వాళ్ళని వాళ్ళ జీవితంలోకి ఆహ్వానిస్తారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత దారుణంగా మారుతాయి అంటే అంత దారుణంగా మారుతాయి. ఒక పక్షి నెక్స్ట్ జనరేషన్ కోసం తనకి పుట్టిన పిల్లల కోసం అంతగా ఆలోచిస్తున్నప్పుడు మనం మనకోసం ఆలోచించుకోవడంలో తప్పులేదు కదా ఇక రెండవది మీ ఒంటరితనాన్ని దేవుడితో గడిపే సమయంగా మార్చుకోండి.
(04:58) మీరు ఎప్పుడైతే మీ లోపల మీరు ప్రశాంతంగా ఉంటారో అప్పుడు బయట వ్యక్తుల కోసం ఆరాటపడరు. సో యోగానంద గారు నేర్పించిన ధ్యానం మనకి ఇదే చెబుతుంది. నీ లోపల ఉన్న అనంతమైన శక్తిని తెలుసుకో అప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడవు. మీరు మానసికంగా బలంగా ఉన్నప్పుడు తప్పుడు వ్యక్తులు మీ జీవితంలోకి రావడం కష్టమవుతుంది. ఎందుకంటే మీలోని ఆ క్లారిటీ వాళ్ళని దూరం పెడుతుంది.
(05:20) అలా కాకుండా మీరు ఆధ్యాత్మికంగా కూడా దేవుడికి దూరమైనప్పుడు అది ఏ దేవుడైనా అవ్వచ్చు. మీరు ఆధ్యాత్మికంగా దేవుడికి దూరమైనప్పుడు మీలో తెలియని ఒక అలజడి మొదలవుతుంది. నిజం చెప్పండి ఈ ప్రపంచంలో మనం నమ్మేది మొట్టమొదటిగా అమ్మ నాన్న ఆ తర్వాత దేవుడు. సో వాళ్ళందరికీ మనం దూరం అయిపోయిన తర్వాత మనకు మిగిలేది ఏంటి అందులోనూ మనల్ని కన్న వాళ్ళకి అలాగే మనల్ని సృష్టించిన వాళ్ళకి మనం దూరమైనప్పుడు ఈ భూమి మీద మనం ఒంటరి వాళ్ళు మాత్రమే మనుషులు మన జీవితంలోకి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.
(05:50) నిజం చెప్పండి 24 గంటలు ఒక మనిషి మనల్ని ప్రేమిస్తాడా మన మీద కోప్పడతారు మన మీద చిరాగుపడతారు మనల్ని ప్రేమిస్తారు అందులోనూ మనల్ని పక్కన పెట్టి వాళ్ళ పనులు కూడా చేసుకుంటారు కానీ మనల్ని పక్కన పెట్టకుండా మన మీద కోపపడకుండా మన మీద చిరాకు పడకుండా నిరంతరం మన గురించి ఆలోచించేది ఆ భగవంతుడు మన తల్లిదండ్రులు మాత్రమే కానీ మనం ఏమనుకుంటామ అంటే మనుషులు మనల్ని పెట్టే కష్టాలను చూసి దేవుని నిందిస్తాము మనుషులు మనల్ని పెట్టే ఇబ్బందులను చూసి నా తల్లిదండ్రులు నాకు కావాల్సినంత డబ్బు సంపాదించలేదని చెప్పేసి వాళ్ళని కూడా నిందిస్తాము. కానీ చేయాల్సిన తప్పులన్నీ
(06:23) చేసింది ఎవరు మనమే కదా అసలు ఎవరిని మన జీవితంలోకి రానివ్వాలో వాళ్ళని రానివ్వకుండా ఎవరిని పడితే వాళ్ళని మనం నమ్మేసి వాళ్ళు పెట్టే ఇబ్బందుల్ని దేవుడు ఇచ్చాడని వాళ్ళు పెట్టే కష్టాలు నా తల్లిదండ్రుల వల్ల నాకు వస్తున్నాయి అని చెప్పేసి మనం అనుకొని మన అయిన వాళ్ళకి మనం దూరం అయితే నష్టపోయేది ఎవరు మనమే కదా అందుకే నేను ఏమంటానంటే మనిషికి క్లారిటీ అనేది చాలా అవసరం అందులోనూ ఆధ్యాత్మికంగా మనిషి అనేవాడు స్ట్రాంగ్ గా ఉండాలి.
(06:48) అలా ఉన్నప్పుడే మీ లైఫ్ మీద మీకు క్లారిటీ వస్తుంది. మీ మీద మీకు క్లారిటీ ఉన్నప్పుడు మీ జీవితంలోకి ఎవరు పడితే వాళ్ళు రారు. ఎందుకంటే అక్కడే 95% మంది ఫిల్టర్ అయిపోతారు. ఎందుకంటే దేవుడికి దగ్గరగా ఉండే వాళ్ళకి మీతో పని లేదు. అందులోనే క్లారిటీగా ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి అందరూ వేషాలు వేయలేరు. సో 95% జనం అక్కడే మీకు దూరమైపోతారు అంటే ఫిల్టర్ అయిపోతారు. మీకే మంచిది.
(07:10) సో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మీరు ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండండి. మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుడిని సహాయం అడగండి నన్ను సరైన దారిలో నడిపించు నా చుట్టూ ఉన్న వ్యక్తులు నిజ స్వరూపాన్ని నాకు చూపించు అని కోరుకోండి. మనల్ని మోసం చేసేవాళ్ళు మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పుడే మన జీవితంలోకి వస్తారు.
(07:30) బేసికల్ గా మనం ఒంటరిగా ఎప్పుడైపోతాం కుటుంబానికి దూరమైనప్పుడు ఆధ్యాత్మికంగా అసలు దేవుడితో సంబంధం లేనప్పుడు బలహీనంగా ఎప్పుడైపోతాం చిన్న చిన్న విషయాలని కూడా కష్టాలుగా భావించినప్పుడు అలా ఎందుకు భావిస్తామ అంటే లైఫ్ మీద ఒక క్లారిటీ లేనప్పుడు భావిస్తామ అన్నమాట. సో అలాంటి సమయంలోనే మన జీవితంలోకి కొంతమంది వస్తారు ఇంకా దరిద్రంగా చేసి వాళ్ళ పాటికి వెళ్ళి వెళ్ళిపోతారు.
(07:53) కాబట్టి ఆ సమయంలో ఒక ధ్యానంతోనో మన ఆధ్యాత్మిక ప్రయాణంతోనూ మన ఆలోచనల్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోపోతే మన ఆలోచనలు ఏమనుకుంటాయి వీడు నా ఫ్రెండ్ ఏమో వీడు నా శ్రేయభిలాష ఏమో వీళ్ళు నన్ను ఇష్టపడుతున్నారేమో అని చెప్పేసి రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాము. అందులోనూ మన మనసుని ఒక కోటలాగా కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే మన జీవితం తల్లకిందులు అయిపోతుంది.
(08:16) ఇక చివరిగా మనం మన జీవితాన్ని ఎలా ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలి నమ్మకం అనేది ఒక బాధ్యత అని గుర్తించండి. అది ఉచితంగా వచ్చేది కాదు దాన్ని మనం సంపాదించుకోవాలి. ఎదుటివారు మనల్ని నమ్మాలని కోరుకునే ముందు మనం ఎంతవరకు నమ్మదగిన వ్యక్తులుగా ఉన్నామో ఆలోచించుకోవాలి. పక్షి పాఠంలో మనం పక్షిగా ఆ ఎండ్ పొల్లను పట్టుకోవడానికి ఎన్ని సార్లు ప్రయత్నిస్తుందో తెలుసా ఎన్ని సార్లు కిందకు విసురుతున్న విసుగు చెందదు.
(08:40) అలాగే మన జీవితంలో కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషి చేయాలి. మన మాట మన ప్రవర్తన నిష్కల్మంగా ఉండాలి. యోగానంద గారి జీవితాన్ని చూస్తే మనక ఒకటి అర్థంవుతుంది. ఆయన అందరినీ ప్రేమించేవారు కానీ అందరిని గుడ్డిగా నమ్మేవారు కాదు ఆయనలో ఉన్న ఆ దయ సరళత మనకి ఆదర్శం. ఆయన చెప్పినట్లు ప్రేమ అందరికీ ఇవ్వండి కానీ మీ నమ్మకాన్ని మాత్రం సంపాదించుకున్న వారికే ఇవ్వండి.
(09:06) ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఇకపై మాటలను చూసి మోసపోను వ్యక్తుల క్యారెక్టర్ ని గమనిస్తాను. నా సమయాన్ని, నా ప్రేమని, నా నమ్మకాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత బాధపడను అని చెప్పేసి మీరు చాలా విలువైన వారు. మీ జీవితం చాలా గొప్పది. దాన్ని తప్పుడు వ్యక్తుల చేతుల్లో పెట్టి పాడు చేసుకోకండి. గుర్తుంచుకోండి నమ్మకం అనే పునాది మీద కట్టబడిన ఏ బంధమైనా ఏ కుటుంబమైనా ఎప్పటికీ విచ్చిన్నం కాదు.
(09:32) ఆ పునాది గట్టిగా ఉండాలంటే ముందుగా పరీక్ష అనేది అవసరం అంటే టెస్ట్ అనేది అవసరం. ఆ టెస్ట్ లో నెగ్గడం ద్వారానే మనకి నిజమైన గౌరవం లభిస్తుంది. జీవితం అంటే కేవలం బతకడం కాదు ఒక సాక్షిగా నిలబడటం ఈ క్షణం నుంచి మీ ఆలోచనలని మార్చుకోండి. ఒక పక్షి లాగా దార్శనికతతో ఉండండి. యోగానంద గారు చెప్పినట్లు మీ ఆత్మ ప్రకాశాన్ని ఎవరికీ తలవంచనివ్వకండి.
(09:58) మీరు మారితే ఈ ప్రపంచం మారుతుంది. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈరోజు ఇప్పుడే ఆ మార్పు మొదలవ్వాలి. చివరిగా మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ మనసుతో ఆలోచించి సమాధానం చెప్పండి. గతంలో మీరు ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోయినప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తనలో మీకు ముందుగానే వార్నింగ్స్ కనిపించాయా? కానీ మీరు మీ మనసు చెప్పిన మాట వినకుండా కేవలం వాళ్ళ మాటలే నమ్మి ముందుకు వెళ్ళారా? అలా వెళ్తే మాత్రం కచ్చితంగా కామెంట్ చేయండి.
(10:23) దీని గురించి ఆలోచించండి. మీ అనుభవం ఇంకోసారి పాఠం కావచ్చు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే కచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కట్ సెక్షన్ లో మీకోసం ఇంకొక రెండు అద్భుతమైన వీడియోలు పిన్ చేసి పెట్టాను. వాటిని కూడా చూడండి.
(10:43) ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పవచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బాయ్ ఓం
No comments:
Post a Comment