Monday, March 16, 2026

ఆత్మ 13 రోజులు ప్రయాణం 🕧

 *ఆత్మ 13 రోజులు ప్రయాణం 🕧*

*మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం…*

*మరణం జరిగిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే, ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది.*

*అందుకే*
*శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది.*

*మొదటి 3 రోజులు*
*మరణం తర్వాత మొదటి మూడు రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం.*

*ఈ సమయంలో*
*ఆత్మకు దారితెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి, ప్రార్థనలు చేస్తారు.*

*4వ రోజు నుంచి 10వ రోజు వరకు*

*ఈ రోజుల్లో*
*ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది.*

*ప్రతిరోజూ చేసే పిండ ప్రదానం, తిల తర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారుతాయి.*

*ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మరియు తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది.*

*11వ రోజు – ఏకోదిష్ట శ్రాద్ధం*

*ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది.*

*ఇక్కడ*
*ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృ స్థితికి చేర్చుతారు.*

*12వ రోజు – సపిండీకరణ*

*ఈ రోజు*
*మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది.*

*అంటే*
*పితృ దేవతలలో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెబుతాయి.*

*13వ రోజు – కర్మకాండ ముగింపు*

*13వ రోజుఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం.*

*ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది.*

*ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవి?*

*➡️ ఆత్మకు శాంతి కోసం*
*➡️ కుటుంబానికి మానసిక ధైర్యం కోసం*
*➡️ పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు*

*సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు…అది ఒక మార్పు మాత్రమే.*

*మన కర్మలే*
*మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి.*

*అందుకే*
*మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు మరణానంతర ప్రయాణాన్నీ ప్రభావితం చేస్తాయి.*ఆధ్యాత్మిక కుటుంబం 4*                                                 

No comments:

Post a Comment