Sunday, March 15, 2026

46. నన్నునేనే తెలిసి మరీ ఎందుకు బాధించుకుంటున్నాను?

46. నన్నునేనే తెలిసి మరీ ఎందుకు బాధించుకుంటున్నాను?

Author Name:divine planet - Designing lives with divinity.

Youtube Channel Url:https://www.youtube.com/@divineplanet-designinglive1681

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Vlb-jJqTZJg



Transcript:
(00:00) శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది ఆ ప్రశ్న జరిగిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ నా జీవితంలో జరుగుతున్నాయి ఎందుకని ఒకసారి నేను ఒక సంఘటన వలన బాధపడితే నా మనసుకి అది ఎందుకు పట్టదు మళ్ళీ మళ్ళీ నన్ను నేను అలాంటి పరిస్థితులలోనే ఎందుకు పెట్టుకుంటున్నాను పరిస్థితులు నన్ను ఎందుకు నెట్టేస్తున్నాయి నాకు ఎందుకు ఎరుక రావట్లేదు అసలు నాకు ఏమి కావాలో నాకే తెలియట్లేదు ఆ బాధాకరమైన సంఘటన నుంచి నేను ఏమైనా
(00:48) నేర్చుకునేది ఉన్నదా ఉంటే నాకు ఎందుకు తెలియడం లేదు నాకు తెలియకపోవడం వల్లనే కదా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను నా బాధకి నేనే కారణం అని తెలుస్తున్నది కానీ నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను నన్ను నేను మానసికంగా శిక్షించుకుంటున్నాను నావల్ల ఇతరులు కూడా బాధపడుతున్నారు అని తెలుస్తున్నది అయినా నా మనసు కంట్రోల్ లో ఉండటం లేదు ఇది నా ప్రశ్న యక్చువల్ గా ఈ ప్రశ్నకు
(01:32) నేను సమాధానం ఎప్పటినుంచో చెవట్లేదు అంటే ఈ ప్రశ్న చాలా కాలం కిందటే అడిగారు. మళ్ళీ పదే పదే పదే మెయిల్స్ పెడుతున్నారు. ఏవండీ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఇక్కడ ప్రశ్నలోనే మీరే అలా ఉంటున్నారు మిమ్మల్ని మీరే అలా ఉంచుకుంటున్నారు. నేను అలా ఎందుకు ఉంటున్నాను అన్నదానికి అసలు ప్రపంచంలో ఎవరైనా ఆన్సర్ చెప్పగలుగుతారా? ఇప్పుడు చేసిన తప్పులే చేస్తున్నాను చేసిన పొరపాట్లే చేస్తున్నాను కొన్ని పరిస్థితులు సంఘటనలు మొదట తెలియక జరిగిన మళ్ళీ అదే పరిస్థితులు అవే సంఘటనలోకి నేనే వెళుతున్నాను నేనే చేస్తున్నాను అంటే
(02:17) మనుషులందరూ ఇలాగే ఉన్నారు మీరు కాదు మొత్తం మానవ జాతి ఇలాగే ఉంది. మీరు ఎవరిని అడిగినా ఇలాగే ఉంటది చేసినవే చేస్తాం అలాగే ఉంటాం ఇప్పుడు మన రొటీన్ లైఫ్ ఏంటి అసలు మీరు గమనించండి రోజు నిద్రపోతాం మళ్ళీ రోజు మేలుకుంటాం మేలుకున్నాక రోజు కాలకృత్యాలు తెర్చుకుంటాం రోజు తింటాం తాగుతాం తిరుగుతాం రోజు తినటము పడుకోవటం లేవటం రోజు అదే శరీరం అదే కాలకృత్యాలు అదే తిండి అదే తిప్పలు మొత్తం జీవితం అంతా ఇలాగే బతుకుతాం విషయాలు మారుతా ఉంటాయి అంతే ఆ తినే వస్తువులు 100 రకాలు ఉంటే అవి
(03:02) మార్చుకుంటూ ఉంటాం కట్టుకునే బట్టలో 100 రకాలు ఉంటే అవి మార్చుకుంటా ఉంటాం అంతే తప్ప కానీ అనుభవం అంతే తినటమే కట్టుకోవటమే జీవించటమే జీవించేది ఎప్పుడు పాత రోజు పాత శరీరంతోనే జీవిస్తాం మనిషికి ఇలాగే ఉంటది మనుషులందరికీ డబ్బు కావాలి మనుషులందరికీ సుఖాలు కావాలి మనుషులందరూ వాళ్ళ ఆనందంగా ఉండాలి మనుషులందరికీ దుఃఖం అక్కర్లేదు మనుషులందరికీ బాధలు అక్కర్లేదు ఎప్పుడు నిరంతరం సుఖంగా హాయిగా వాళ్ళు అనుకున్నట్టుగా జరిగిపోవాలి మొత్తం మనుషులందరూ ఇదే కోరుకుంటారు నేను కూడా అదే కోరుకుంటున్నా కానీ సృష్టి నడకకి కొన్ని ఆ విధానాలు పద్ధతులు
(03:47) ఉన్నాయి. అదే కర్మ సిద్ధాంతము కర్మ సిద్ధాంతం అంటే ఏమి లేదు ఎవరు చేసింది వాళ్ళు అనుభవిస్తారు అంతే ఇంకా మంచి లేదు చెడు లేదు మంచి అయితే మంచి అనుభవిస్తారు చెడైతే చెడు అనుభవిస్తారు ఎందుకని చేసిందే కదా అనుభవించాలి ఇప్పుడు ఎవరైనా సరే మనం వండుకుంది మనం తినటం ఇప్పుడు ఏం వండుకున్నామో అదే తినగలం ఇంకోటి తినటం ఎలా కుదురుతది ఇంకోటి తినాలంటే అది వండుకోవాలి అంతే కర్మ సిద్ధాంతం అద్భుతం కాదు మహిమ కాదు మాయ కాదు రోజు మన రొటీన్ లైఫ్ అంతే నేను ఇలా ఎందుకు ఉంటున్నాను నేను ఇలా ఎందుకు ఉంటున్నాను నేను ఇలా ఎందుకు ఉంటున్నాను అని అనేక ప్రశ్నలు వేసే బదులు
(04:30) నేను ఇలా ఉండకూడదు నేను మంచిగా మాత్రమే ఉండాలి ఇలాగే ఉండాలి నిర్ధారించుకొని అలా ఉండడం నేర్చుకోండి అదే ఆధ్యాత్మికం ఇంకా ఆధ్యాత్మికం అనేది పెద్ద గొప్ప విషయం ఏమ కాదు ఎలా ఉండకూడదు అనుకుంటున్నామో ఆ నిర్ణయం యించుకొని అలా ఉండకూడదు అలా చేయకూడదు అలా మాట్లాడకూడదు అలా జీవించకూడదు అనేటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని చక్కగా నేను ఇలాగే ఉండాలిఅనేదాన్ని ప్రాక్టీస్ చేసుకోవడమే ఆధ్యాత్మికం దానికి మనసే జరిగిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ మళ్ళీ నా జీవితంలో జరుగుతున్నాయి అంటే అసలు ఎవ్వరికైనా జీవితంలో జరిగిన సంఘటనలే జరుగుతాయి అదే శరీరం అదే మనసు అదే బుద్ధి
(05:14) అదే మనుషులు మన లోపల ఉన్న గుణాలువే స్వభావాలు అవే పద్ధతులు అవే అసలు మన జీవితం మొత్తం చనిపోయేవరకు ఇలాగే సాగుద్ది అసలు శరీరమే పాదది అదే కట్టుకోవడం అదే తినటం అదే తాగటం అదే పడుకోవడం అదే లేవటం ఏం మారిపోతాయి మన బుద్ధులు గుణాలు స్వభావాలు మనసు పరిస్థితులు అయ్యా అయినప్పుడు ఎప్పుడు జరిగిన సంఘటనలే జరుగుతా ఉంటాయి ఎప్పుడు దుఃఖం అయితే దుఃఖాన్నే తెచ్చుకుంటాం ఎందుకని మన స్వభావం అది ఉంది ఎప్పుడు మనకి నచ్చనవి అయితే ఎప్పుడు ఈరుషులు అసూయలు జేషాలకు లోనైపోయి మనని మనం దుఃఖ పెట్టుకుంటూ ఉంటాం మన చుట్టూ ఉన్నవాళ్ళని దుఃఖ పెడతా ఉంటాం.
(05:54) అహంకారం అయితే ఎప్పుడు అహంకారంతో వేటరేగిపోతా ఉంటాం మళ్ళీ మన చుట్టూ ఉన్నవాళ్ళని బాధపెట్టి మనం బాధ పెడతా ఉంటాం. అలా ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎవరిని అడుగుతాం చేసేది మీరే కదా మనసు మీదే కదా శరీరం మీదే కదా బుద్ధి మీదే కదా ఆలోచన మీదే కదా మిమ్మల్ని మార్చుకోవాల్సింది మీరే కదా ఒకసారి ఒక సంఘటన వల్ల నా మనసు బాధపడింది అది నా మనసుక ఎందుకు పట్టదు మళ్ళీ ఆ సంఘటనలోకి వెళ్ళకూడదు అటువంటి విషయాల్లోకి వెళ్ళకూడదు మళ్ళీ మళ్ళీ నేను అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనుకున్నా కూడా ఎందుకు నెట్టేస్తుంది అని ఎవరిని అడుగుతారు ఎందుకు నెట్టేస్తుందండి వెళ్తాం
(06:29) మనం అక్కడికి అసలు ఎవరు ప్రపంచంలో మనల్ని నెట్టరు మన గుణాలు అవే మన స్వభావం అదేమన బుద్ధులు అవే మన పరిస్థితులు మనకు ఉన్నవి ఏమున్నాయో వాటిని బట్టి మనం మార్చుకున్నప్పుడు అందులోకి వెళ్ళాం పరిస్థితులు ఎవరి నెట్ట ఎక్కడికి పరిస్థితులను మనసు వంకగా చూపిస్తా ఉంటది. నాకు జరిగే అన్నింటికి ఎదుటివాళ్ళు కారణం అని ఎదుటి పరిస్థితులు కారణం అని ఎదుటి ప్రపంచం కారణం అని అంత బయట చూపిస్తా ఉంటది తనను తాను ఒక అమాయకురాలుగా ఏమి తెలియని అన్యం పుణ్యం ఎరగనటువంటి ఒక పసిబిడ్డగా మనసు చూపిస్తా ఉంటది గారడి మనోగారడి అది ఈ మనోగారడికి ఎప్పుడు ఎదుటివాళ్ళ మీద
(07:12) నెపాలు వేసేస్తుంటాం లేదా పరిస్థితుల మీద నెపాలు వేసేస్తుంటాం నెపం మన మీద వేసుకోం నేరం మన మీద పెట్టుకోం నేనే కదా చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి పడుకుంది నేనే మేలుకొంది నేనే లేచింది నేనే లేచినాక పనులన్నీ చేస్తుంది నేనే అవి నా భావాలే నా ఆలోచనలే ఇలాగే జరగాలని అనుకుంటుంది నేనే ఇలా జరగకూడదని అనుకుంటుంది నేనే నాకు వచ్చేటువంటి సంఘటనలకి నాకు వచ్చేటువంటి పరిస్థితులకి కారణం నా జీవితం నా చుట్టూ ఉన్న మనుషులు నాకుఉన్నటువంటి పరిస్థితులు నా గుణం నా స్వభావం నా పద్ధతి ఇప్పుడువెయ మంది బాధ పెట్టినా నేను బాధ పడకూడదు అనుకున్న వాడిని ఎవరు బాధ
(07:50) పెట్టలేరు. అసలు ఎవరో బాధ పెట్టకపోయినా నిత్యం వ్యతిరేక ఆలోచనలతో భయాలతో బాధలతో బాధపడే వాళ్ళని ఎవరు ఆ బాధ నుంచి బయటికి తేలేరు ఎందుకని వాళ్ళే బాధను ఊహించుకుంటున్నారు. ఇది మనసు చేసే గారడి ఆ మనోగారడిని తెలుసుకోండి అది ఎప్పుడు ఎదుటి వాళ్ళని చూపిస్తా ఉంటది నేను కరెక్టే అంటా ఉంటది. మళ్ళీ మీరే చెప్పారు నా బాధకి నేనే కారణం అని తెలుస్తుంది కానీ నన్ను నేను కాపాడలేకోలేకపోతున్నాను అని అంటే మనో వ్యసనం ఇప్పుడు ఎలా తయారైపోద్దిఅంటే మామూలుగా ఊహించుకోండి ఇప్పుడు కొంతమంది సిగరెట్లు తాగుతారు కొన్ని రోజులు సిగరెట్లు తాగినాక ఇంకా సిగరెట్ అలవాటయపోి తాగపోతే ఉండలేరు.
(08:34) కొంతమంది మందు తాగుతారు కొన్ని రోజులు వరుసగా మందు తాగినాక తాగకపోతే ఉండలేరు. అలాగే కొంతమంది నిరంతరం మాట్లాడుతా ఉంటారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి వీళ్ళతో వాళ్ళతో వాళ్ళకి వెళ్లి వీళ్ళక వెళ్లి అది కూడా పెద్ద వ్యసనమే సిగరెట్లు తాగుడు కంటే పెద్ద వ్యసనమే ఎందుకంటే ఈ మాటల్లో అనేకం డొల్లిపోతా ఉంటాయి ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మన గురించి ఇంకా వాగుడికి అంతం ఉండదు దాన్ని విషయాసక్తి అంటారు ఆధ్యాత్మికతలో ఆ విషయాసక్తి ఉన్నవాళ్ళు వీళ్ళ కొంపలు వదిలేసి పనులు వదిలేసి ఎక్కడ కబుర్లు అక్కడ ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి గ
(09:10) అది కూడా వ్యసనమే ఇలా అన్ని రకాల వ్యసనాలు మనమే అలవాటు చేసుకొని నేను ఎందుకు అలా ఉంటున్నాను అంటే మీరు ఏమంటున్నారో కూడా చెప్పల పై పై విషయాలు చెప్పారంటే సంఘటనలు మళ్ళీ మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నాయండి ఏంటో మాకు తెలియదు అసలు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఇది మనసు దార మీరు చెప్పక్కర్లేదు ఎవరికీ చెప్పకండి కూడా ఒకసారి ఒక సంఘటన వల్ల ఒక పరిస్థితుల వల్ల బాధపడినప్పుడు నా మనసుక అది ఎందుకు పట్టట్లేదు మళ్ళీ ఎందుకు అందులోకి వెళ్ళిపోతుంది అంటే వ్యసనం వ్యసన మనసు అలా పరుగులు పెడతా ఉంటది.
(09:44) అలవాటు అయిపోయిన వ్యసన మనసు కొంతమందికి దుఃఖం వ్యసనం ఎప్పుడు బాధగా ఉంటారు బాధగా ఉండకపోతే వాళ్ళకి తోచదు అంటే బాధగా ఉండటం కూడా బాధపడటం దుఃఖ పడటం కూడా టైం పాస్ లాగా టైం మీకు తెలిీదు అలాగే సుఖపడటం ఆనంద పడటంలో కూడా టైం మీకు తెలియదు. ఏదో ఒకటి కాలక్షేపం విషయాసక్తితో పనులు చేయటం వాళ్ళకి కబురులు చేయడం లేదా సుఖకరమైన పనులు చేసుకోవడం ఆనందకరమైన పనులు చేసుకోవడం ఇష్టమైన పనులు చేయటం సినిమాలు శికారులక వెళ్ళటమో ఎలాగైనా కాలక్షేపమే లేదా అయోహించుకొని ఊహించుకొని భయాలు బాధలు దుఃఖాలు ఊహించుకొని ఎంతసేపు ఆ అటువంటివి విని అటువంటివి చదివి అటువంటివి తెలుసుకొని నిరంతరం భయం బాధలు దుఃఖాలకు
(10:29) లోన అవ్వడం కూడా టైం పాస్ కొంతమంది ఇలా నెగిటివ్ టైం పాస్ చేసుకుంటారు కొంతమంది అలా సుఖభోగాలతో పాజిటివిటీ అంటే ఎప్పుడు తనకు అనుకూలతగా టైం పాస్ చేసుకుంటారు అలా ఏదో ఒకటి టైం పాస్ చేస్తుంటారు అదో ఏదో చేయకుండా మధ్యలో మాత్రం ప్రశాంతంగా ఉండలేరు. రెండు వ్యసనాలే అటు వెళ్ళిపోయి నాకు నిరంతరం సుఖభోగాలు కావాలనుకొని కొంతమంది అప్పులు చేసి మరి తిరిగేస్తుంటారు ఊరోళ్ళ డబ్బులన్నీ తినేసి తాగేసి అప్పులు చేసి సుఖభోగాలు అనుభవించేస్తా ఉంటారు అప్పులు చేసి తప్పులు చేసి మరి సుఖభోగాలకి వెళ్ళిపోతుంటారు తర్వాత అయన్ని కష్టాలు అవుతాయి అయితే అయన ముందు ఇప్పుడు మేము ఈ
(11:09) కాలక్షేపం చేసేసుకోవాలి ఖాళీగా ఉండలేం మనసుని ఆపలేంు మేము ఎందుకని అంటే అసలు ఆపాలని ప్రయత్నించట్లే అది ప్రాబ్లం నేను ఎందుకు ఉంటున్నాను ఎలా నేను ఎందుకు ఉంటున్నాను ఎలా అంటే ప్రయత్నించుకోవాలి నన్ను నేను మంచిగా ఉంచుకోవాలి నన్ను నేను స్థిరంగా ఉంచుకోవాలి. అలా సుఖభోగాలకి వెళ్ళిపోయినాక ఏమైంది అప్పులు చేసి తప్పులు చేసి రకరకాలు చేసి అనుభవిం చేసామ అనుకోండి తర్వాత అవన్నీ మళ్ళీ కష్టాల కింద వస్తాయిగా బాధల కింద వస్తాయి కదా ఎటువంటివైనా ఏ రకమైనా సరే అన్ని మనం చేసినవే మనం చేయకుండా అసలు మన జీవితంలో ఒక చర్య కూడా జరగదు.
(11:48) అలా మనం చేస్తున్నాము అన్నప్పుడు అది మన మనసు చేత జరుగుతుంది ఇది మన మనసు కదలిక వ్యసన మనసు ఇది వ్యసన మనసుకి ఏంటంటే ఎన్నిసార్లు దానికి ఎన్ని దెబ్బలు తగిలిందా మళ్ళీ అటే వెళ్తది అది అది వ్యసన మనసు దానికి మంచి నేర్పడమే ఆధ్యాత్మికత దానికి మంచి నేర్పడమే ఆధ్యాత్మిక చదువు ఎవరు నేర్పాలి మీరు మీరే నేర్చుకోవాలి కొద్ది కొద్దిగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని నిర్ణయించుక కోవాలి గట్టి ప్రయత్నం చేయాలి అలా మార్చుకోపోతేట మీరు రామాయణాన్ని రచించినటువంటి ఆయన వాల్మీకి మహర్షి ఆయన ఆయన చరిత్ర వింటే మీకు కొంత అర్థం అవ్వచ్చు ఆయన పెద్ద గజదొంగ
(12:33) వాల్మీకి మహర్షి పెద్ద గజదొంగ గజదొంగగా ఆయన పేరు రత్నాకరుడు ఆయనకి భార్యా పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు. ఆయన ఏం చేసేవాడు ఒక అడవి మార్గం గుండా ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళే దారి ఉంది మధ్యలో కొంచెం అడవి చెట్లు గిట్లు ఉంటాయి కొంచెం ఏకాంతంగా ఉంటది అక్కడ ఉండేవాడు ఆయన అక్కడ కాపు కాసి ఆ మార్గం గుండా వెళ్తున్న వాళ్ళని కొట్టటమో చంపటమో ఏదో ఒకటి చేసి బెదిరించడం వాళ్ళ దగ్గర డబ్బులే లాక్కునేవాడు అంది ఆయన వృత్తి అది ఎందుకు తన భార్యా పిల్లల్ని పోషించుకోవడానికి తన తల్లిదండ్రులని పోషించుకోవడానికి ఓకే అలా సాగుతున్నప్పుడు ఒకరోజు ఆ రోడ్డు
(13:16) అమ్మటే అలా వెళ్తున్న రోడ్డు అమ్మటే నారదుడు వెళ్తున్నాడు అటువైపు నారద మహర్షి సేమ్ ఈయన అందరి దగ్గర ఎట్లా దోచుకుంటాడో ఆయన దగ్గర కూడా దోచుకుందాం అని వెళ్ళాడు ఆయన మీద కూడా వెళ్ళాడు కొట్టబోయాడు తిట్టపోయాడు డబ్బులు అడిగాడు ఆయన దగ్గర ఏమి లేవు అసలు నారద మహర్షి కనపడిపోతానే ఉంది. ఆయన ఆకృతి ఆకారం అసలు దోచుకోవడానికి ఏమి లేవు ఆయన దగ్గర సరే దోచుకోవడానికి ఏమ లేవు నారద మహర్షిని అడిగాడు ఎందుకయ్యా నువ్వు ఈ దొంగ పనులు చేస్తున్నావు ఏంటి ఇది అని ఈ మనుషులని కొట్టడం ఏంటి చంపడం ఏంటి వాళ్ళ లాగేసుకోవడం ఏంటి ఇదంతా పాప ప్రవృత్తి కదా అన్నాడు
(13:56) పాపం అంటే ఏంటి నాకు తెలియదు అన్నాడు ఆయన నాకు తెలిసిన కానుంచి ఈ వృత్తిలోనే ఉన్నాను మా ముందు మా పెద్దలు ఏ వృత్తులే చేశారు మాది దొంగతనాల వృత్తి నాకు ఇంతే తెలుసు పాపం అంటే ఏంటో అసలు తెలియదు అన్నాడు అంటే అప్పుడు నారదుడు చెప్పాడు నాయనా నువ్వు ఎవరినైతే బాధించి హింసించి కొట్టి తిట్టి లాక్కున్నావో ధనం లాక్కుపోతున్నావో వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ సొంత ధనం అది నువ్వు కష్టపడకుండా కొట్టి బెదిరించి లేక చంపేసి లాకపోతున్నావ్ అప్పుడు మరి వాళ్ళు పడినంత బాధ ఉంది కదా అది నీది కాదు కదా నువ్వు కష్టపడింది కాదు కదా అందువలన నీకు పాపం వస్తది అన్నాడు
(14:40) పాపం అంటే ఏంటి వస్తే ఏమవుతుది అన్నాడు పాప ఫలితాలను నువ్వు కష్టాలుగా బాధలుగా కన్నీళ్లుగా అనిపిస్తా అంటే నువ్వు ఎంతమందిని ఎన్ని బాధలకు గురి చేశవో అన్ని బాధలు నువ్వు పడాల్సి వస్తది ఎంతమంది దగ్గర ఎంత ధనం అపహరించి నిన్ను నువ్వు పోషించుకున్నావో నీ వాళ్ళని పోషించావో నిన్ను పోషించుకున్నావో అంత ధనము నువ్వు మళ్ళీ ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో ఏదో ఒక జన్మలో ఎత్తి అదంతా పోగొట్టుకోవాల్సి వస్తది.
(15:08) ఇదంతా సమానం అవుతుంది ఎప్పటికైనా నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో ఎంత దోచుకున్నావో అంత తిరిగి నువ్వు చెల్లించాల్సి వస్తది అది ఈ జన్మలోన మరు జన్మలోన జరగటం జరుగుద్ది అది పాప ఫలము అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు ఆయన అప్పుడు ఈ రత్నాకరుడు అనేటువంటి గజదొంగ అయిన వాల్మీకి మహర్షి అప్పుడు వాల్మీకి మహర్షి అవ్వల ఆయన అయ్యా ఇదంతా నాకు అసలు తెలియదు ఇవఏది చిన్నప్పటి నుంచి మాకు ఎవరు చెప్పినోళ్ళు లేరు అను అందువల్ల మా ముందోళ్ళని చూసి నేను ఇలాగే తయారయ్యాను నాకు ఇప్పుడు అర్థమయింది మీరు చెప్పింది నిజమే చాలామంది నేను కొడుతున్నప్పుడు చంపేస్తున్నప్పుడు వేడుకుంటారు వాళ్ళు
(15:46) పాపం కుటుంబం ఉందంటారు వదిలేయమంటారు ఇప్పుడు గుర్తొస్తున్నాయి మీరు చెప్పిన ఏమనా చాలా బాధలకు గురవుతారు కానీ ఇదంతా నేను నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నా మరి నాకు ఇక్కడ ఇక్కడ నేను ఉన్న ప్రదేశంలో నాకేం వృత్తి వ్యాపారాలు చేయడానికి లేదు నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నా మరి తప్పనిసరి మేము ఎలా బతకాలి అన్నాడు సరే నువ్వు ఎలా బతకాలనేది తర్వాత ఆలోచిద్దాం ఇదంతా నువ్వు నీ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను అంటున్నావు కదా ఓ పని చెయ్ నువ్వు ఇలా కొట్టి తీసుకెళ్తే నీకు పాపం వస్తుందిగా ఎంతమందిని ఎన్నిసార్లు కొట్టావో ఎంత చంపావో అంతా నువ్వు ఎన్ని
(16:22) జన్మలు ఎత్తేనా తీర్చుకోవాలి అలాగే ఎంత దోచుకున్నావో అంతా నువ్వు ఎన్ని జన్మలు ఎత్తేనా తిరిగేవ్వాలి అది ఈ జన్మ వచ్చే జన్మ అది కాల నిర్ణయం సృష్టి నిర్ణయం ఇప్పుడు ఇదంతా నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నాను అంటున్నావు గనుక ఈ పాపం అనేది ఇలా వస్తుంది ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాక నేను పాపం ఎలా వస్తది పాప ఫలితాలు ఏంటని నువ్వు వెళ్లి నీ కుటుంబ సభ్యులకి ఇవన్నీ చెప్పు ఆ పాపం ఏంటి పాప ఫలితాలు ఏంటి వాళ్ళు కూడా వాళ్ళ కోసమే చేశవు గనుక వాళ్ళందరూ ఇందులో భాగం పంచుకుంటారేమో అడిగిరా ఆ తర్వాత ఆలోచిద్దాం నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పారు ఆయన
(17:04) అయ్యో ఎందుకు పంచుకోరు అసలు నా భార్య నాకోసం ఎదురు చూస్తా ఉంటది ఆ గుమ్మం కూర్చొని ఉంటది నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమిస్తారు నా వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు నా పిల్లలు నన్ను ఎంతో ప్రేమిస్తారు ఇలా మనం మనలాగానే ఆయన భావించుకున్నవన్నీ చెప్పాడు. సరే ఓకే వాళ్ళు కూడా భాగం పంచుకుంటే మంచిదే కొంచెం నీ పాపం తగ్గుద్ది అందరికే మీ అందరికీ కలిసి డిస్ట్రిబ్యూట్ అవుద్ది తల కొంచెం అనుభవిస్తారు.
(17:29) కానీ దానికి అసలు వాళ్ళు ముందు ఒప్పుకుంటున్నారా లేదా ఎందుకంటే నువ్వు ఎలా డబ్బు తెస్తున్నావ అని అసలు వాళ్ళకి తెలిసి ఉండాలిగా దాన్ని వాళ్ళు అంగీకరించి ఉండాలిగా ఈ చెడ్డ మార్గంలో వస్తున్న డబ్బుని మేము తింటున్నాము ఈ పాపంలో భాగం మేము కూడా తీసుకుంటామ అనేదానికి వాళ్ళ అంగీకరించి ఇదంతా తెలిసి జరుగుతా ఉండి ఉండాలి. కాబట్టి వెళ్లి చెప్పి వాళ్ళకి విషయం అడిగిరా అని చెప్పారు అంటే సరే అని వెళ్ళాడు ఎందుక తల్లిదండ్రులకి చెప్పాడు జరిగిందంతా చెప్పాడు ఇలా పాపం వస్తదంట అది నేను అనుభవించాలంట మరి మిమ్మల్ని పోషించడానికే నేను అనేకమందిని కొట్టాను తిట్టాను చంపాను
(18:03) రోజు ఆ డబ్బే తెస్తున్నాను మిమ్మల్ని పోషిస్తున్నాను మరి తల్లిదండ్రులుగా మీరు మరి తిన్నారు కదా ఈ సొమ్మంతా తింటున్నారు కదా నేను తెచ్చింది కాబట్టి నా పాపంలో కూడా భాగం పంచుకుంటారా అని అడిగాడు వాని వాళ్ళు అడ్డమైన తిట్లు తిట్టారు. ఒరే దుర్మార్గుడా ఇంతమందిని కొట్టి అంతమంది ఉసురు పోసుకొని అది తెచ్చి మాకు పెడుతున్నావా అలా చేసే బదులు ఏ పుల్లలు కొట్టుకొనో ఏదో ఒకటి ఏరుకొనో ఏదోటి చిన్న చిన్న పనులు చేసుకోనో నువ్వు డబ్బు సంపాదించి మాకు ఉన్నదాంట్లో కొంచెం అన్నమే పెట్టపోయావు మనుషుల్ని కొట్టడం ఏంటరా తిట్టడం ఏంటిరా దొంగతనాలు ఏంటరా మాకేం తెలుసు అది నిన్ను
(18:45) అలా ధనం తెమ్మని మేమం చెప్పలేదే నీ పాపంలో మేము ఎటువంటి పరి పరిస్థితిలోను భాగం పంచుకోమాకు అసలు ఆ పాపపు కూడే వద్దు అన్నారు వాళ్ళు పని చేయ ఎక్కడైనా పని చెయ్ లేకోతే అడవిలో ఉన్నాం పుల్లలు కొట్టుకొని వెళ్లి ఊళలో అమ్ము అలాంటి పనులు బోళలు ఉన్నాయి చేసుకోవచ్చు ఈ ఈ మార్గం ఎన్నుకోవడం అనేది నీ మనసులో ఉన్న దుశ్చర్య నీ దుర్మార్గత్వం నీ లోపల ఉంది.
(19:12) అందుకని తేలికైన మార్గం అనుకున్నాం కష్టపడకుండా ఆన్లైన్ తలక పగలు కొట్టేసి డబ్బులు ఎత్తుకుపోతే సుఖంగా ఉంటది కష్టంతో పనిలేదు అది నీ తప్పురా నీ పాపం నువ్వే అనుభవించాలి అసలు వద్దు రేపటినుంచి ఆ పాప కూడు మాకు పెట్టక అన్నారు నీ పాపంలో మేము భాగస్వామిని తీసుకోము అన్నారు సరే భార్య దగ్గరికి వచ్చి అడిగాడు పిల్లలు ఏదో చిన్న పిల్లలు అనుకోండి భార్య దగ్గరికి వచ్చి అడిగాడు భార్య కూడా సేమ అలాగ నోరు దుర్మార్గుడు వాళ్ళని చంపి వీళ్ళని చంపి వాళ్ళ మొగుళని చంపి వీళ్ళ పిల్ల పిల్లలని చంపి వాళ్ళకి భార్య భర్తలని దూరం చేసేసి పిల్లలకు తల్లిదండ్రులని దూరం చేసేసి ఎన్నాళ్ళు ఇచ్చేస్తున్నావా
(19:46) అంత దరిద్రపు సొమ్ము తెచ్చి మాకు పెడుతున్నావా మాకు వద్దు బాబోయ్ నీతో అసలు కాపురమే వద్దు నీలాంటి దుర్మార్గుడే మాకు వద్దు మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేమ నటిస్తున్నావా దాని బదులు ఎక్కువలో నాలో చేసుకు బ్రతకొచ్చు కదా మేము సద్దుకున్నాం అని చెబితే అందులో నీ పాపంలోనే అసలు ఎట్టి పరిస్థితిలోన భాగం పంచుకోవడమే కాదు అసలు మళ్ళ దరిద్రమే మాకు వద్దు ఈయన అసలు షాక్ తిన్నాడు ఇదేంటి నా వాళ్ళందరి కోసం నేను ఇన్ని చేస్తే వాళ్ళందరూ నాకోసమే బతుకుతున్నారు ఎంతో ప్రేమైక కుటుంబం మాది అను నేను అనుకుంటా ఉంటే వీళ్ళ ఎలా సమాధానాలు చెప్పారు ఏంటి వీళ్ళ కోసం కదా ఇన్ని
(20:25) చేశనని బొర తిరిగిపోయింది ఆయనకి ఇప్పుడు మనం కూడా అంతే మన వాళ్ళందరినీ ఇలాగే అనుకుంటా ఉంటాం కానీ పాపం ఎవడు తీసుకుంటాడు పుణ్యం చేసుకుంటాడు ఎవడైనా పాపం చేసుకుంటాడా ఎవడో తీసుకోడు ఎవడికీ అక్కర్లేదు కూడా నీ పుణ్యం ఏమనా ఉంటే తీసుకుంటారు ఎవరైనా పుణ్యం నుంచి సుఖభోగాలు వస్తాయి అయిపోయింది అంటే ఇది మనకోసమే చెప్పారు రత్నాకరుడు కాదు వాల్మీకి కాదు మొత్తం కథలన్నీ మనకోసమే మనం ఇప్పుడు ఎలా జీవిస్తున్నామో మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో నేను నాది నావాళ్ళు అనుకుంటూ నా కుటుంబ సభ్యులు అనుకుంటూ లేదా నా సొంత శరీరం అనుకుంటూ మనకోసం గాన మన వాళ్ళ కోసం
(21:05) గాన ఎన్ని పొరపాట్లు చేస్తున్నామో బేరీస్ వేసుకోవడానికి మనకు కొన్ని రకాలైనటువంటి కథలు అందించారు పోలిక పోల్చుక చూసుకోండి అని నీతి చెప్పారు నీతి కథలు ఇవన్నీ అందులోనుంచి మనకు అవసరమైంది తీసుకోవాలి వాళ్ళ గురించి ఆలోచించడం కాదు సరే ఇతను తిరిగి వచ్చేసాడు రత్నాకరుడు నారద మహర్షి అక్కడే ఉన్నాడు ఆయన చిరునవ్వు నవ్వుతూ కూర్చొని ఉన్నాడు.
(21:29) ఆ చెట్టు కింద కూర్చున్నాడు చక్కగా నీడలో ఈయన వచ్చాడు వస్తే నారద మహర్ష అడిగారు ఏంట ఏంటి మీ వాళ్ళందరూ మరి నిన్ను ఎంతో ప్రేమిస్తారు అన్నావు కదా నీ పాపంలో భాగం తీసుకుంటావ అన్నారు ఆ వాట అని అబ్బి లేదండి అడ్డమైన తిట్లు తిట్టారు పైగా ఇది ఈ అధర్మపు సంపాదనతో మమ్మల్ని పోషిస్తున్నావ అని ఇంకా తిట్టారు అసలు భార్య అన్నా కనీసం నాతో ఉంటది అనుకున్నాను ఆమె కూడా అలాగే తిట్టింది అడ్డమైన తిట్లు తిట్టి అసలు భార్యలకు భర్తలని దూరం చేసో భర్తలకు భార్యలని దూరం చేసావో ఎంతమందిని చంపావో పిల్లలకు తల్లిదండ్రులని దూరం చేశవు ఎన్ని నేరాలు ఘోరాలు చేశవో ఓరి దుర్మార్గుడు
(22:02) అసలు నేను చూస్తుంటేనే భయంకరంగా ఉందే మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాకుేం అర్థం కాలేదు వీళ్ళ కోసం ఇవన్నీ చేశను అన్నాడు. ఒరేయ్ వాళ్ళ కోసంని ఊహించుకొని నువ్వు ఎన్న తప్పులు చేశవు అలా కాకుండా నువ్వు ధర్మంగా బ్రతికి నీకుఉన్న దాంట్లో కూలోనాలు చేసి నువ్వు అదే పెడితే అదే తినేవాళ్ళు వాళ్ళు అందులోనుంచి సద్దుకునేవాళ్ళు నువ్వు ఊహించుకున్నావు ఇవన్నీ కాబట్టి ఆ పాపము నీదే ఇప్పుడు వాళ్ళు కూడా భాగం పంచుకొని అన్నారు కదా కాబట్టి మొత్తం పాపము నీదే ఇక నీ కర్మ నువ్వు అనుభవించి నేను వెళ్ళ వస్తాను నీకుేదో తెలియాలని విషయం చెప్పాను పాపము పుణ్యం అనేవి ఉంటాయి
(22:37) ఇక్కడ అందుకని నీకు విషయం తెలియాలి ని చెప్పాను నాకు తెలుసు కాబట్టి వెళ్తున్నాను అన్నాడు నారద మహర్షి వెంటనే రత్నాకరుడు ఉండండి ఉండండి బాబు ఉండండి ఇప్పుడు అసలు నేను ఏం చేయాలి నాకేం దిక్కు తోచట్లేదు ఇప్పుడు అసలు నాకు ఇంకా ఇన్నీ చేయాలనిపించట్లేదు ఇప్పుడు ఈ దొంగతనాలు ఇంకెందుకు నా వాళ్ళే నన్ను అక్కర్లేదు అన్నారు.
(22:58) నా వాళ్ళే తిట్టారు అసలు నాకు అక్కర్లేదు అన్నారు నువ్వు రాక్షసుడు అన్నారు. ఇక నా వాళ్ళే నన్ను అసయించుకుంటున్నారు అప్పుడు ఎవరి కోసం చేయను ఇవన్నీ కాబట్టి ఇి చేయను ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు ఆ పాపం ఉండిపోయింది కదా ఏం చేయాలి ఇక్కడి నుంచి అసలు నేను భవిష్యత్తు ఎలా బ్రతకాలిలో నాకు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులు అసలు నన్ను వద్దు అన్నారు నువ్వు దుర్మార్గుడు రాక్షసుడు అన్నారు ఇప్పుడు వెళ్లిపోడు తిరిగి వాళ్ళ మొహం చూడలేను వాళ్ళు నా మొహం చూసి నాతో ఉండటానికి ఇష్టపడరు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ పాపాన్ని ఎలా పోగొట్టుకోవాలి భవిష్యత్తు అంతా అసలు ఎలా
(23:30) బతకాలి ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు అన్నాడు అప్పుడు నువ్వు ధర్మ జీవితం మంచి జీవితం జీవిస్తాను అంటే దానికి నీకు మార్గ చెప్తాను నేను అన్నాడు ఆయన అయ్యా తప్పకుండా చెప్పండి అన్నాడు అయితే ఒక పని చేయ తపస్సు చెయ్ ముందు నీకు జపం నేర్పుతాను దాన్ని నేర్చుకో ఆ జపం చేసుకుంటూ ఆ జాసలో కూర్చో మనసుని నియంత్రణ చేసుకో చక్కగా స్థిరంగా కూర్చో అనేక రకాలుగా మనసు పరుగులు తీస్తది పట్టించుకోబాక కొన్నాళ్ళకి అదే ఆగిపోద్ది అయన్నీ నీకు నేర్పుతానని మొత్తం ఆధ్యాత్మికతలో మొదటి నుంచి ఏమేం చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు అని తపస్సు వరకు ఆయన దగ్గర ఉండి అన్ని
(24:13) నేర్పించి రామ నామ మంత్రాన్ని ఆయనకి ఇచ్చారు రామ రామ రామ అనుకొని నీ మనసు ఆగడానికి దీన్ని పెట్టుకో నువ్వు అని సరే అతను ఆయన చెప్పిన రీతిలో అన్ని జీవించుకుంటూ అన్ని చేసుకుంటూ చక్కగా రామ మంత్రాన్ని జపం చేసుకుంటూ ధ్యాన ముద్రలో తపో ముద్రలో కూర్చున్నాడు అలా కొంతకాలం గడిచింది ఈయనకి బాగా అలవాటు అయిపోయింది అది ఆ సాధన బాగా అలవాటు అయిపోయింది.
(24:42) ఎంత అలవాటు అయిపోయింది అంటే కొన్ని సంవత్సరాలకు ఆయన సమాధి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడు. అత్యుత్తమమైనటువంటి ఆ జపంలో లీనమైపోతున్నాడు బాహ్య స్థితులు తెలియట్లేదు ఆయనకి అంటే ఇదంతా కాలంలో సంవత్సరాల్లో జరిగింది. అలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఆయనకి సమాధి స్థితిలో తెలియని స్థితికి వెళ్ళిపోయి అలా కొన్ని రోజులు ఉండిపోతున్నాడు ఆయన. అప్పుడు ఎంత బలంగా ఆయన చేశాడు ఆయన ఈ తపస్సులు గాని ధ్యానం గాన జపతపాలు గాని ఆ సాధనలు గాని అంటే ఆయన శరీర స్పృహను పట్టించుకోకుండా కోల్పోయి తన అంతరంగంలో తాను స్థిరపడిపోతే దాన్ని సమాధి స్థితులు అంటారు.
(25:26) ఆయన శరీరం పైన చెదలు పుట్టలు కట్టేసినయి అలా నిశ్చలంగా కదలకుండా ఉండిపోయాడు ఆయన చెదలు పుట్టలు కట్టేసినన్ని రోజులు ఆయన కదలకుండా ఉండిపోయాడు అక్కడ తెలియట్లే ఆయనకి కానీ అద్భుతమైనటువంటి అంతరంగంలో ఇమిడిపోయి సాధనలో ఉన్నాడు. ఏకాగ్రం అయిపోయింది మనసు ఆ తర్వాత ఆయనకి మెలుక వచ్చినప్పుడు ఆ పుట్టలోనుంచి లెగిసి వచ్చాడు. వల్మీకము అంటే పుట్ట చెదలు పెట్టిన పుట్ట చూడండి పాము పుట్టలు ఉంటాయి అయన్నీ చెదలు పెట్టినయే లేకోతే చీమలు పెట్టినయి అందులోనే పాములు ఉంటాయి పాములు పుట్టలు నిర్మించుకోలేవు
(26:10) అలా ఈయన మీద పుట్ట కట్టేసినయి ఆ పుట్టలోనుంచి లేచి బయటిక వచ్చాడు ఆయనక మెలుక వచ్చినాక అందుకని వాల్మీకం అంటే పుట్ట వాల్మీకంలోనుంచి బయటిక వచ్చాడు గనుక వాల్మీకి అప్పటికి ఆయన మనసు నిశ్చలత్వాన్ని పొందేసింది జీవన్ముక్త స్థితిని పొందేసాడు తన ఆత్మ శక్తిని తాను తెలుసుకున్నాడు తన ప్రాణ శక్తిని తాను తెలుసుకున్నాడు. తనకు సమస్తం అర్థమయింది అవన్నీ ఆయన బోధించి వెళ్లారండి ఒక మాటతో మహిమ జరిగిపోయిన కూర్చుంటే తపస్సు చేసేస్తే వచ్చింది అనుకోబాకండి అవసరమైనన్ని నారద మహర్షి ఆయనకి బోధించి నేర్పించి ఆయన ఏం చేసుకోవచ్చు అన్ని చెప్పి వెళ్ళారు
(26:47) కథారూపకంగా ఒక లైన్లో రెండు లైన్లో వెళ్ళిపోతాం మనం ముందుకి కానీ అప్పుడు జరిగిందంతా కాలగమనంలో ఇప్పుడు మనక ఎలా జరుగుతుదో అలాగే అంత కాలంలోన జరిగింది. అన్ని నేర్చుకొని ఆయన ఆత్మజ్ఞాన సంపన్నుడు అయ్యాడు ఆయన వల్మేకములో నుంచి బయటకి వచ్చాడు గనుక వాల్మీకి అన్నారు ఆయన అక్కడి నుంచి అక్కడి నుంచి ఆయన ఇంక ఋషి ముని యోగి వచ్చి ఒకచోట ఆశ్రమం నిర్మించుకున్నాడు ఆయన అక్కడ సాధనలు చేసుకుంటూ అనేకమంది శిష్యులకి ఇవన్నీ నేర్పుతున్నాడు ఆయన మళ్ళీ ఆత్మజ్ఞాన సాధనలున్నీ నేర్పుతున్నాడు.
(27:25) అలా వాల్మీకి ఆశ్రమము తయారయింది. ఆ ఆశ్రమంలోనే ఆ వాల్మీకి ఆశ్రమంలోనే శ్రీరామచంద్రుల వారు తన భార్య అయినటువంటి సీతమ్మ తల్లిని గర్భవతిగా ఉన్నప్పుడు విడిచి రమ్మని లక్ష్మణుడికి చెప్పారు. అక్కడ సీతమ్మ తల్లిని ఆ ఆశ్రమంలోనే అనేకమంది ఋషులు ఉన్నారు అక్కడ గృహస్తులు ఉన్నారు ఋషులందరూ గృహస్తులే ఒకప్పుడు వాళ్ళందరూ నేర్చుకుంటూ సాధనతో ఉన్నారు అదంత పెద్ద ఋషి వాటికి అది అంటే ఒక నగరం లాగా ఒక గ్రామం లాగా సీతమ్మ తల్లిని అక్కడే ఉంచి అక్కడ వాళ్ళందరూ దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ పరిచర్యలు చేసి లవకుశులు అక్కడే పుట్టారు.
(28:07) లవకుశులకు మొట్టమొదటగా రామాయణాన్ని నేర్పించింది వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించి శ్రీరామచంద్రుల వారు ఉండగానే రచించాడు ఆయన రామ చరిత్రను ఎందుకంటే శ్రీరామచంద్రుడు రాజుగా ఉన్నాడు అక్కడ అంతటి ధర్మపరుడైన రాజు ఎవరూ లేరు కాబట్టి ఆయన చరిత్ర రచించి ప్రజలకు అందించాలని శ్రీరామచంద్రుల వారు ఉండగానే ఆయన రచించారు రచించి దాన్ని మళ్ళీ లవకుశులకు నేర్పారు అలా రామ రామాయణ ప్రచారం మొదలు పెట్టారు ఆయన ఎప్పుడు రాముడు ఉండగానే లవకుశులు వెళ్లి శ్రీరామచంద్రుడు ముందే రామాయణాన్ని వినిపించారు ఎందుకని అంటే అందులో ఏమన్నా అవకతవకలు తప్పులు ఉంటే శ్రీరామచంద్రుడికి
(28:48) తెలుస్తుది చెప్తాడు ఆయన అంటే రామాయణం అనేది శ్రీరామచంద్రుల వారు ఉండగానే ఆయన్ని చూస్తూనే ఆయన యొక్క ఆదర్శాలను చూస్తూనే వాల్మీకి మహర్షి రచించి దాన్ని మళ్ళీ లవకుశల చేత శ్రీరాముల వారిగా స్వయంగా వినిపింపచేశడు శ్రీరామచంద్రుల వారు ఆమోదించింది అది రామాయణం అందులో అసలు తప్పులు ఉండే ఛాన్సే లేదు సరే అది వేరే విషయం అనుకోండి ఇలా ఎంతటి వాడైనా ఎంతటి వాడైనా సజ్జన సాంగత్యం చేత అంటే నారదుడు అనే మహర్షి కలిసి ఎలా జయం చేసుకోవాలి జపతపాలు ఎలా చేసుకోవాలి ఏం గొప్ప విషయాలు కాదు మనోనియంత్రణకి మనసుని పరిపరి విధములు పరుగు పరుగుపెట్టి మనని
(29:33) ఈడుచుకుపోకుండా మనసుని నియంత్రించుకోవడానికి మంచి మాటలు వినటం మంచి పనులు చేయడం మంచి కథలు చదువుకోవడం మంచి చరిత్రలు చదువుకోవడం మహాత్ముల చరిత్రలు చదువుకోవడం అలా మనసుకు మంచిని పట్టించడం అనే ప్రక్రియ అందులో ఇంకొంచెం ముందుకు వెళ్తే మంత్ర జపాలు చేసుకోవడం నామ జపాలు చేసుకోవడం నామ జపాన్నే ఒక దేవుడు నామాన్ని తీసుకున్నప్పుడు మంత్ర జపం అంటారు.
(29:59) అలా జపాలు చేసుకోవడం తర్వాత ఆ జపాలు ముందు బిగ్గరగా చేయడం తర్వాత లోపల అంతరంగంలో చేసుకోవటం అక్కడి నుంచి ఆ జపం కూడా ఎగిరిపోయి ఇంకా అరూప స్థితికి సమాధి స్థితికి వెళ్ళిపోతారు. అంటే తన ప్రాణ శక్తి ఉనికిలోకి తను వెళ్ళిపోతారు శరీర ఎరుక మనో ఎరుక తగ్గిపోద్ది జపం చేస్తున్నంతసేపు మనో ఎరుక ఉంటది. జపం లోపల అంతరంగంలో జరుగుతున్నంతసేపు మనం ఎరుకు ఉంటది జపం బిగ్గరగా చేస్తుంటే శరీరం ఎరుకు ఉంటది ఎందుక నోటితో అంటా ఉంటాం శబ్దం వస్తుంటే శబ్దం వస్తుంటే శరీర మనసులో ఎరుక ఉంటది శబ్దం ఆగిపోయి లోపల మననం చేసుకుంటుంటే నిదానంగా శరీర ఎరుకపోయి మనో ఎరుక మాత్రమే ఉంటది జపంలో
(30:39) అది కూడా కొంతకాలానికి పోయి అంటే చేస్తూ చేస్తూ ఒకే నామం చేస్తూ చేస్తూ దాన్నే భావించ ంచకుంటూ భావించుకుంటూ కొంతకాలానికి అది కూడా ఆగిపోయి నిశ్చల నిర్మల స్థితిలో ఉండిపోతాం అదే ప్రాణశక్తి ఎరుక దాన్ని తపస్సు అంటారు ధ్యానం అంటారు జపం అంటారు అనేక పేర్లు ఉన్నాయి అనేక విధాలుగా సాధనలు ఉన్నాయి మన మూల తత్వానికి చేరుకోవడానికి అలా చేరుకున్న ఆయనే వాల్మీకి మహర్షి అయితే అలా చేరుకోవటం వలన అలా చేరుకోవటం వలన ఈ తపస్సులో ఏం జరిగింది అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని శాస్త్రం చెబుతుంది జ్ఞానం అనేటువంటి అగ్ని దగ్ధ కర్మాణం సకల కర్మలను కాల్చి
(31:25) పారేస్తుంది అంటే అంతకుముందు వరకు ఆయన చేసినటువంటి ఘోర కృత్యములన్నీ తన శరీరమును సుష్కింప చేసుకొని తన శరీరమును సాధన ద్వారా సుష్కింప చేసుకొని సాధనలో నిమగ్నమైపోయి ఆ పాత చెడ్డ మనసును పోగొట్టుకొని సంపూర్ణ పూర్ణమైనటువంటి జీవన్ముక్త స్థితికి చేరుకునేటప్పటికి కర్మలన్నీ నాశనం అయపోయి కర్మలు నాశనం అయితేనే అక్కడికి చేరుకోగలుగుతారు.
(31:53) అందుకే ముందు మీలో ఉన్న చెడుని పోగొట్టుకోండి మంచిలోకి రండి అంటే మంచి మనసు మంచి ఆలోచనలు మంచి బుద్ధులు మంచి గుణాలు మొత్తం అన్ని చెడుని పోగొట్టుకోవాలి మంచిలోకి రండి మంచిలోనుంచి మోక్షంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మన ప్రాణశక్తిలోకి వెళ్ళడమే అలా దారి ఉందని ప్రతి శీర్షికలో చెబుతున్నాను అదే జరిగింది వాల్మీకి మహర్షి రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యే శ్రీరామచంద్రుల వారి యొక్క బిడ్డలను ఆయన స్వయంగా పెంచారు సీతమ్మ తల్లిని ఆయన దగ్గరే ఉంచుకొని తండ్రిలా ఆయన పోషించారు.
(32:30) అంటే ఒకప్పుడు దొంగ ఇప్పుడు ఒక ఋషి వాటిక పెట్టుకొని అనేకమంది శిష్యులకు ఆత్మజ్ఞానాన్ని నేర్పుతూ అనేకమందిని తన దగ్గర ఉంచుకొని ఆఖరికి దైవ స్వరూపులుగా దేవుడిగా భూమి మీదకు దిగి వచ్చినటువంటి సాక్షాత్తు విష్ణువు శ్రీలక్ష్మి అయినటువంటి శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లికి సీతమ్మ తల్లి అనేటువంటి దేవత ఆయన ఆశ్రమంలో ఉండటానికి ఒప్పుకుంది అంటే అంటే కాల నిర్ణయం ప్రకారం చరిత్రకే అలాగే శ్రీరామచంద్రుడు అనేటువంటి దేవుడు తన భార్యను తన పిల్లలని ఆయన సంరక్షణలో పెరగడానికి ఒప్పుకున్నాడుంటే ఆయన ఎంత మంచివాడయ్యాడు ఎంత దైవత్వ సంపదనే సద్గుణాలను తనలో సంపాదించుకొని
(33:17) పెంపొందించుకున్నాడు చూడండి దైవత్వ గుణాలు ఏమి లేదు మంచి మంచి మాత్రమే ఆ మంచి కోసం బతకడమే తపస్సు అలా మనసుని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలి అది రావటం లేదు నాకు ఎందుకు చేసిందయతే మళ్ళీ చేస్తున్నా నా మనసుక ఎందుకు పట్టంట్లేదుఅని మీరు పట్టించుకోవట్లేదు. మంచి వినండి మంచి మాటలు వినండి మంచి పనులు చేయండి అది ఒక్క రోజులో మార్పు రాదు నిరంతరం మంచి గ్రంథాలు చదువుకోండి నేను అసలు చెడ్డగా ఉండకూడదు బాధల్లోకి వెళ్ళకూడదు కష్టాల్లోకి వెళ్ళకూడదు కన్నీళ్లలోకి వెళ్ళకూడదు నన్ను నేను బాధ పెట్టుకోకూడదు ఇతరులని బాధ పెట్టకూడదు ఇటువంటి పరిస్థితులు నా జీవితంలోకి
(33:54) తెచ్చుకోకూడదు ఒకవేళ వచ్చిన వాటిని సర్దుకోవాలి ఆశలు తగ్గించుకోండి కోరికలు తగ్గించుకోండి డబ్బు అవసరాలు తగ్గించుకోండి శారీరక అవసరాలు తగ్గించుకోండి ఉన్నంతలో తృప్తిగా బతకడం నేర్చుకోండి అప్పుడు ఆట ఆటోమేటిక్ గా మనసు కంట్రోల్ లోకి వస్తది అవేవి తగ్గించుకోకుండా మనసు మారదు. నాకు అన్నీ కావాలి నేను అన్ని పొందాలి అనుకున్నోళ్లే పదే పదే తప్పులు చేస్తుంటారు.
(34:16) అనేక సందర్భాల్లో ఈ సంఘటన వల్ల నాకు బాధ కలిగింది అని తెలిసినా నా మనసు ఎందుకు పట్టదు మళ్ళీ అలాంటి పరిస్థితులకి ఎందుకు వెళ్తున్నాను అంటే పదే పదే నేను నన్ను మార్చుకోను మంచిలో ఉంచుకోను నా గుణం అలా సాగుతానే ఉంటది నా బుద్ధులు అలా వెళ్తానే ఉంటాయి నన్ను ఎవరో నెట్టేస్తున్నారు అని చెబుతా ఉంటాను కాదు మారాలని నిర్ణయించుకున్న రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయ్యాడు సాక్షాత్తు భగవత్ స్వరూపులైనటువంటి రామచంద్రుడు సీతమ్మ తల్లి వాళ్ళ బిడ్డలు భగత్ స్వరూపులైన లవకుశులను తన ఆశ్రమంలో పెంచి పోషించాడు రక్షించాడు కాపాడాడు దైవ సాన్నిధ్యం దొరికింది ఆయనకి
(34:58) అది చరిత్ర కథ అంటే ఏంటి అలా ఆ దైవత్వాన్ని పొందొచ్చు దైవత్వానికి దగ్గరికి వెళ్ళొచ్చు అని మనకు నిరూపణగా చెబుతున్నారు మంచే దైవత్వం ఈ వ్యసన మనసుని మార్చుకోవడం అనేది మనం చేయవలసిన పని దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మంచిని నిరంతరం వింటూ ఉండండి నిరంతరం చేస్తూ ఉండండి ఆచరించుకోండి సాధన చేయండి ఒకవేళ మీ వల్ల కాటలేదు చక్కగా ఏ నామమో చేసుకోండి నామ సంకీర్తనలు చేసుకోండి జపతపాలు చేసుకోండి మీరు ఏది చేయగలరో అన్నీ చేయండి లేదా మంచి పుస్తకాలు చదువుకోండి పారాయణలు చేసుకోండి మంచి గ్రంథాలు చదువుకోండి మహాత్ముల చరిత్ర చదువుకోండి లేదా మంచి మాటలు వినండి
(35:38) మంచి ద్వారానే మనసుని మనం ఆపడం కుదురుతది. మనసు పరుగులు పెడుతూనే ఉంటది అయితే ఇది ఒక రోజులో కుదరదు చాలా కాలం బట్టి ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మీకు ఈ మాటలు చెబుతున్నా నేను సుమారుగా 40 ఏళ్ల నుంచి ఇందులోనే ఉన్నాను. అధిక జీవితాన్ని ఇందులో గడిపాను తక్కువ జీవితాన్ని భౌతికంలో గడిపాను. భౌతికం కూడా కడిపోయాను అన్ని ఉన్నాయి భార్య పిల్లలు ఉన్నారు అన్ని ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేశను కానీ అధికమైన ఆసక్తి నాకు దీని మీదే ఉంది.
(36:08) అందుకని అసలు ఈరోజు ఏ తప్పు చేయని స్థితికి మనసు వచ్చేసింది. ప్రపంచంలో ఎన్ని తప్పులైనా ఉండొచ్చు కానీ మనసు మన మనసు ఆ స్థితికి వస్తది తప్పులు చేయదది అయితే దానికి 40 ఏళ్ళు పట్టింది. అలా సాగుతూనే ఉండాలి వింటూనే ఉండాలి చెప్పుకుంటూనే ఉండాలి అందుకే శీర్షికులు కూడా తెలిసి తెలిసి మీరు ఎందుకు నన్ను నేను శిక్షించుకుంటున్నాను నా వల్ల ఇద్దరులు కూడా బాధపడుతున్నారు అయినా నేను అలాగే జీవిస్తున్నాను మనసు కంట్రోల్ లో ఉండలేదంటే ఎవరి మనసు కంట్రోల్ లో ఉండదు నాకు కూడా డబ్బు కావాలి నాకు కూడా సుఖభోగాలు కావాలి అందరికీ కావాలి ప్రపంచంలో కానీ ఇవన్నీ వినటం వలన ఇవన్నీ పదే పదే పదే
(36:48) అనేక సంవత్సరాల నుంచి విని సాధనలు చేసుకుంటూ ముందుకు నడుస్తూ తెలుసుకోవడం వలన నాకు డబ్బు కావాలి సుఖభోగాలు కావాలి కానీ ఇవన్నీ నాకు మంచిగా మాత్రమే కావాలి చెడ్డగా వద్దు చెడ్డగా ఒకవేళ ఇది వస్తే నాకు అక్కర్లేదు నేను వీటిని వదిలేసుకుంటాను ఉన్నంతలో తృప్తిగా బతుకుతాను చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటాను ఆస్తిపాస్తులు లేకపోయినా పర్వాలేదు ఉన్నంతలో పచ్చలన్నం తింటాను నేను నా కుటుంబం అయినా సరే మొత్తం అందరం పచ్చల మెతుకులు వేసుకు తినటం కానీ తప్పుగా మాత్రం నాకు వద్దు అనేటువంటి ఒక మనస్తత్వం రావాలి అది నాకు వచ్చింది నేను తప్పులు చేయనని నిర్ధారించి అవుతున్నాను కానీ అలా
(37:27) నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు ఎటువంటి జ్ఞానానుభవం కలగలేదు తప్పులైతే చేయను అంతవరకు మాత్రం పర్ఫెక్ట్ మనసు అనేది ఎప్పుడు కూడా మనం తయారు చేసుకునేదే ముందా విషయం తెలుసుకోండి మనసు అనేది మనక ఏదో పెట్టబడింది కాదు ఒక కాలు ఒక చెయ్య ఒక కన్ను ఒక ముక్కు మన శరీర అవయవాలు మనకి కూర్చబడినట్టు మనసు కూర్చబడింది కాదు మనసు తయారు చేసుకోబడుతుంది మనిషి చేత మనం పుట్టిన దగ్గర అంటే పసి బిడ్డగా మాతృ గర్భంలో నుంచి బయటకి వచ్చినప్పుడు ఆ బిడ్డకి ఎటువంటి మనసు ఉండదు ముందు ఆ విషయం తెలుసుకోండి అసలు బిడ్డకి ఎటువంటి మనసు ఉండదు అక్కడి నుంచి బిడ్డ దగ్గర ఏముంది ఇప్పుడు
(38:10) అంటే శరీరం ఉంది శరీరంలో ప్రాణశక్తి ఉంది అందుకని బిడ్డ బతికి ఉంది అని చెబుతున్నాం మనం అక్కడి నుంచి ఇంకా బిడ్డ పంచేంద్రియముల ద్వారా అంటే కంటితో చూడటం ద్వారా చెవితో వినడం ద్వారా ముక్కుతో వాసన చూడటం ద్వారా నాలుకతో రుచులు తెలుసుకోవడం ద్వారా చర్మంతో స్పర్శలు తెలుసుకోవడం ద్వారా గ్రహించే విషయాలన్నీ బిడ్డలో ఉన్న ప్రాణశక్తిలో ముద్రింపబడుతున్నాయి.
(38:37) అదే మనసు అవే జ్ఞాపకాలు అవే భావాలు అక్కడే గుణం తయారవుద్ది స్వభావం తయారవుద్ది అన్ని మనమే తయారు చేసుకుంటాం. ఇదంతా ఎలా నేర్చుకుంటాం మన చుట్టూ ఉన్నవాళ్ళ నుంచి ఇప్పుడు మన అమ్మ నాన్న అరుపులు కేకలు వేస్తూ కోపాలు ప్రదర్శిస్తూ గొడవలు చేస్తూ గోలలు చేస్తూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారనుకో పిల్లలక స్వభావాలు అయిపోతాయి.
(39:02) అంటే ఇది ఎంత స్పష్టంగా మీకు అర్థం అవ్వాలంటే మనసు అనేది తెలుగు ప్రాంతంలో పుట్టిన బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన బిడ్డలు తెగే వస్తది వాళ్ళకి మాతృభాష తెగే అంటే అది ఏమున్నాయండి తెలుగులో పుట్టడం వల్ల ఆటోమేటిక్ గా రక్తంలో నుంచి తెలుగు వచ్చేస్తుంది ఏంటి భాషగా కాదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలుగు మాట్లాడటం వల్ల తెలుగు పదాలు విని విని విని విని తెలుగు సహజం అయిపోయింది ఇంట్లో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు ఇదే కర్ణ కర్ణాటకలో పుడితే కన్నడ వస్తుంది మద్రాసులో పుడితే తమిళ వస్తుంది తమిళనాడులో పుడితే మహారాష్ట్రలో పుడితే మరాఠి వస్తుంది ఏ దేశంలో పుడితే ఏ ప్రాంతంలో పుడితే అక్కడ భాష వస్తుంది
(39:42) ఎందుకని దానిని నేర్చుకుంటున్నారు అదే మనసు అలాగే అలవాట్లు వస్తాయి భాష ఎంత సహజంగా వచ్చిందో అలవాట్లు అంత సహజంగా వస్తాయి గుణాలు అంత సహజంగా వస్తాయి స్వభావాలు అంత సహజంగా వస్తాయి అలా మనసు తయారైపోద్ది మీరు అలాంటి మనసు తయారు చేసేసుకో ని ఇప్పుడు తయారైపోయిన మనసు మళ్ళీ మనక విషయాలను గుర్తు చేస్తది మానవ ప్రవృత్తి ప్రకృతి అది ఇప్పుడు మనకి జ్ఞాపకాలు ఆలోచనలు భావాలు అంటే ఏంటి ఏ విషయాలను మనం మనసుగా తయారు చేసుకున్నామో మనసు అంటే ఏమ లేదు ప్రాణ శక్తిలో ప్రింట్ అయిన విషయాలు శరీరంతో మనం గ్రహించినవి చిన్ననాటి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు చుట్టూ అరుపులు కేకలు మన ఇంట్లో
(40:22) మన నాన్న అరవటం అమ్మ అరవటం అవి కూడా అయ్యే నేర్చుకున్నాం అనుకో అందరి మీద అరుస్తుంటాం కోపతపాలు ప్రదర్శిస్తుంటాం లేదు మన ఇంట్లో వాళ్ళు ఈర్ష అసూయ ద్వేషాలు చూసి అవి నేర్చుకున్నాం అనుకో అవి ప్రదర్శిస్తుంటాం అన్ని నేర్చుకునేవే ఇంతక లోపల నుంచి వచ్చేవి ఏమి లేవు సహజంగా బిడ్డ పుట్టినప్పుడు ఏమీ ఉండవు చుట్టూ ఉన్నవాళ్ళని చూసి నేర్చుకునేవే ఆ స్నేహితుల నుంచో ఇంట్లో వాళ్ళ నుంచో బయటవాళ్ళ నుంచో మొత్తానికి నేర్చుకునేదే మనసంతా ఆ మనసు తిరిగి మళ్ళీ దాన్నే గుర్చేస్తది నీకు ఇప్పుడు రోజు జీవితం గడవాలి అంటే అసలు నేను ఫలానా మనిషినని నాకు గుర్తుండాలి నిద్ర లేచేటప్పటికి మనసు
(40:58) పనిచే చేయక ఆలోచన రాక నేను ఎవరో నాకు తెలియలేదు అనుకో ఎలా బతుకుతాను అందుకని మనసు నిద్ర లేవడం అంటేనే మనసు మేలుకోవడం ఆలోచన మేలుకోవటం ఆలోచన భావం కలుగుతుది నేను నేను ఫలానా మనిషిని నేను స్త్రీని నేను పురుషుడిని నా పేరు ఇది నా ఊరు ఇది నా ఇల్లు ఇది నా శరీరం ఇది మొత్తం అన్ని ఇంకా అక్కడి నుంచి మొత్తం అన్ని గుర్తొస్తాయి నా వస్తువులు నా విషయాలు నా ప్రదేశం నా ఊరు మొత్తం మనకు సంబంధించిన లక్షల కోట్ల విషయాలు గుర్తు చేస్తది అది అందువల్ల అలా కంటిన్యూటీ లైఫ్ బతకగలుగుతున్నాం నిద్రపోయి లేచినప్పుడు అల్లా లేకోతే కంటిన్యూటీ లైఫ్ బ్రతకలేము
(41:33) మనం అలా కంటిన్యూటీగా జీవితం జీవించడానికి మనసు అనేటువంటి ఒక ఏర్పాటుని సృష్టి చేసింది. అది ప్రాణశక్తి ప్రాణశక్తిలో ఈ విషయాలు గుర్తున్న భాగం పేరు మనసు మిగిలింది ప్రాణశక్తి కా మనసు తప్పు కాదు రైటు కాదు మీరు తప్పుడు విషయాలు లోపల వేసుకుంటే తప్పు మనసుఅయింది మీరు మంచి విషయాలు లోపల వేసుకుంటే మంచి మనసుఅయింది. మనకు తెలియదు మనుషులందరూ ఏదోగా బతికేస్తున్నారు చుట్టూ తప్పు మనుషులతో బతికాం తప్పు విషయాలు వేసుకున్నాం అలవాట్లు అయిపోయినయి వ్యసనాలు అయిపోయినాయి అహంకారం వచ్చింది ఈర్షువులు వచ్చేసినయి ద్వేషాలు వచ్చేసినయి తప్పు పనులు చేయడం
(42:11) వచ్చింది పదే పదే చేసిన తప్పులే చేస్తున్నాం ఇప్పుడు ప్రశ్న అదేగా సోదరుడు అడిగింది నేను ఎందుకు ఆ సంఘటనల నుంచి ఏమి నేర్చుకోవట్లేదు ఇంతకుముందు అనేక బాధలు కలిగిన మళ్ళీ ఆ సంఘటనలోకి ఆ విషయాల్లోకి ఎందుకు వెళ్తున్నాను అసలు నా మనసుక ఎందుకు నాకు అది ఎరుక రావట్లేదు మళ్ళీ మళ్ళీ చేసిన ఆ పరిస్థితుల్లోకి వెళ్లి అదే ఎందుకు చేస్తున్నాను వాటిలో ఎందుకు వెళ్ళిపోతున్నాను అంటే అలవాటైన మనసు అది చెప్పేది ఇక్కడ అలవాటైన మనసు అట వెళ్ళిపోద్ది సిగరెట్ కాల్చడం అలవాటైన మనసు అట వెళ్ళిపోద్ది.
(42:43) అక్కడ విచక్షణతో ఆపడం నేర్చుకోవడమే ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనేది ప్రత్యేకత కాదు అది తప్పని తెలిసినప్పుడు ఆపే ప్రయత్నం చేయడం సాధన. అది తప్పని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జ్ఞానం తప్పని తెలుసుకొని అటువైపు వెళ్ళకుండా మనసుని నిరోధించగలిగి శరీరంతో ఆ పనులు చేయకుండా ఉండటమే సాధన అందుచేత సాధనలు అంటే మీరు కూర్చొని తపస్సులు చేయడం కాదు చెడుని చేయకుండా ఉండటం అసలు ముందు చెడుని గుర్తించటం ఆధ్యాత్మికత ఆ చెడుని గుర్తించి నాలో ఈ చెడు ఉంది అని నా అంతరంగంలో ఈ చెడు ఉంది నేను ఈ చెడు పనులు చేస్తున్నాను నేను ఈ దుఃఖమైన పనులు చేస్తున్నాను ఈ దుఖ దుఖలోకి
(43:23) వెళ్ళిపోతున్నాను నా చుట్టూ ఉన్న దుఃఖ పెడుతున్నాను అంటే తప్పు చెడు ఉంటేనే ఉంటది అక్కడ అహంకారం ఉండాలి ఈర్ష అసూయలు ఉండాలి ద్వేషాలు ఉండాలి ఆశలు ఉండాలి అత్యాసలు ఉండాలి దురాశలు ఉండాలి మితిమీరిన కోరికలు ఉండాలి అహంకారం ఉండాలి ఇవన్నీ ఉంటేనే జరుగుతాయి. అవన్నీ చెడు లక్షణాలే ఈ చెడును గుర్తించి ఆ చెడును గుర్తించడమే ఆధ్యాత్మిక ప్రక్రియలో మొదటి భాగం ఆధ్యాత్మికత అంటే ఏమి లేదు నా లోపలికి నేను చూసుకొని నా చెడును గుర్తించడం ఆధ్యాత్మికత మొదలైపోయిందండి నా లోపల నా చెడుని చూశను నేను గుర్తిస్తున్నాను ఇప్పుడు ఆ చెడుని తొలగించుకోవడానికి నేను చేసే
(43:58) ప్రయత్నాలన్నీ ఆధ్యాత్మిక సాధనలు ఆ చెడుని తొలగించుకుంటూ మంచిగా జీవించడానికి నేను చేసే ప్రయత్నం అంతా ఆధ్యాత్మిక ఉన్నతి సాధన కాదు అది ఉన్నతి నువ్వు మంచిగా జీవించావు అంటే అర్థం ఏంటి సాధించేసావ అని మంచిగా జీవించడం అనేది ఆధ్యాత్మిక ఉన్నతి అది వచ్చేసింది నీకు అలా జీవించడం చెడును పోగొట్టుకొని ఒక విషయంలో చెడును పోగొట్టుకున్నావ్ ఒక విషయంలో మంచిగా జీవిస్తున్నావ్ మంచిగా జీవించే ఏ విషయమైనా నీ ఆధ్యాత్మిక ఉన్నతి చెడుగా జీవించే ఏ విషయమైనా నీ ఆధ్యాత్మిక పతనం అసలు నీలో నీ చెడును గుర్తించటం ఆధ్యాత్మిక కథ నీ లోపలికి నువ్వు చూసుకోవడం నిన్ను నువ్వు
(44:40) చూసుకోవడం ఆ చెడును పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం నువ్వు ఏ సాధన అయినా చేసుకో దాని పేరు సాధన అది ఏదైనా చెయ్ దానికి మహాత్ములు మనసులు నిలవకపోతే తనంతట తాను తనలో చెడును పోగొట్టుకోలేని మనసు నిలవని వాళ్ళ కోసం చెప్పిన విషయాలు ఏంటంటే ఆయన నిలవని వాళ్ళ కోసం చెప్పారు ఆ విషయాలు ఆ చెప్పిన విషయాలు ఏంటి అంటే అనేక రకాలు చెప్పారు దైవ పూజలు చేసుకో ప్రార్థనలు చేసుకో ప్రేయర్స్ చేసుకో దేవుని దేవతని ఆలంబనగా పెట్టుకో ఓ మార్గాలు ఆలంబనగా పెట్టుకో ఏదో ఒకటి నీకు ఆలంబన కోసం అంతే అక్కడ అది ఉండని కాదు చెడు వైపు వెళ్ళకుండా ఉండడానికి ఒక ఆలంబన కోసం ఓ దైవ
(45:21) విశ్వశక్తినే దైవశక్తిగా దేవుడిగా దేవతగా మతంగా మార్గంగా ఆచారంగా సాంప్రదాయంగా ఒక సామాన్యుడు తన ఇంట్లో చేసుకోవడానికి వీలుగా తయారు చేసి ఇచ్చారు. పోనీ ఇలా పాటించుకోండి ఇంత కొద్ది కొద్దిగా మొదలు పెట్టండి చిన్నగా దేవుని నమ్మండి దేవతని నమ్మండి అది విశ్వ శక్తే సృష్టి శక్తే ప్రకృతి శక్తే నీలో ఉన్న ప్రాణ శక్తే కానీ నువ్వు చెడువైపు వెళ్ళపోయావు శరీరం నేను అనుకో నీకు తెలియట్లేదు అందుకని చిన్నగా మొదలు పెట్టు ఒక నమస్కారం పెట్టుకో ఒక అగరత్తి వెలిగించు ఒక దీపం వెలిగించు ఏదో చిన్న ప్రార్థన చేసుకో అలా మనసుకు మంచి నేర్పు నన్ను మించిన ఒక శక్తి ఉంది ఆ
(45:58) శక్తిని నన్ను గమనిస్తుంది నేను చెడు చేయకూడదు మంచిగానే ఉండాలని నీకు నువ్వు చెప్పు కో అలా చెప్పుకోవడానికి ప్రేయర్స్ ప్రార్థనలు విధానాలు ఆచార సంప్రదాయాలు పద్ధతులు మార్గాలు మతాలు ఇవన్నీ కూడా నిన్ను మంచిలో నడిపించి మంచిగా ఉంచడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇంకా అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే నామ సంకీర్తనలు జపతపాలు పాటలు భక్తి పాటలు భజనలు అనేక రకాలు తయారు చేశారు.
(46:24) అంటే కొన్ని వందల వేల రకాలు చేశారు ఎందుకని మనిషి యొక్క స్థాయిని బట్టి ఒకవేళ నువ్వు ఈ స్థాయి దాటి ముందుకు వెళ్తే ఇంకోటి చేసుకోవచ్చు అలా నువ్వు ఇవన్నీ చేస్తూ మనోనియంత్రణ చేసుకో నన్ను మించిన ఒక శక్తి ఉందని నమ్మి చెడుని నేను చేయకూడదని నీ మనసుకు బలంగా చెప్పు ఆ దేవ ఆధారంగా చెప్పు ఆ దేవుడు ఆ దేవత మన మించిన గొప్ప శక్తి మనం చెడు చేస్తే శిక్షిస్తారు మనం మంచి చేస్తే వాళ్ళు రక్షిస్తారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకుంటూ చెడు వైపు వెళ్ళకుండా ఉండడానికి ఆలంబన ఇచ్చారు అది ఆలంబన మాత్రమే అంతిమము ఆ శక్తి నువ్వే దాన్ని నీకు నీలో చూపిస్తారు చివర్లో
(47:02) ముందే నువ్వు ఇలా మొదలు పెట్టు మనసు నియంత్రణ కోసం ఇలా మొదలు పెట్టు చెడుని వదిలేయడం కోసం మొదలు పెట్టు కాబట్టి నాలో చెడు ఉన్నదని నేను గుర్తించడమే ఆధ్యాత్మికత ఫస్ట్ పాయింట్ అసలు నా వైపు నేను తిరిగి నాలోకి నేను చూసుకొని నాలో చెడు ఉన్నది అని నేను గుర్తించటమే ఆధ్యాత్మికత మొదలైపోయినట్టు ఆ చెడును పోగొట్టుకోవడానికి ఏం చేయాలని నేను ఆలోచించుకొని మతపరమైన ఆచారపరమైన సాంప్రదాయ పరమైన దైవీ పరమైనా లేదా నాకు నేనే నాతో చెప్పుకొని చెడు చేయకుండా నన్ను నిగ్రహించుకోవటమైనా అదంతా సాధన నువ్వు ఏ సాధన అయినా చేసుకో నీకు నువ్వైనా చేసుకోలేదా దైవీపరమైన
(47:44) సాధనలో గురువులు మహాత్ములు మతాలు చెప్పినయనా చేసుకో చెడు చేయకుండా ఉండాలి దాని అంతిమ లక్ష్యం చెడు చేయకూడదు అప్పుడు దాన్ని సాధన అని పిలుస్తారు నేను చెడును చేయకుండా ఉండాలని నువ్వు చేసే ప్రయత్నంతో ఏది చేసినా అది సాధన అవుద్ది అది దైవ పరమైనదైనా మామూలుదైనా నిన్ను నువ్వు నియంత్రించుకున్నా సరే ఆ నియంత్రించుకోవడానికి నువ్వు రకరకాలు చేసినా సరే చెడు చేయకూడదు అంతే అది సాధన ఇప్పుడు నువ్వు మంచిని చేస్తున్నావ్ చెడుని చేయకుండా ఉంటున్నావ్ నువ్వు ఎంత మంచిని చేస్తున్నావో అంత ఆధ్యాత్మికత నీలో డెవలప్ అయింది అది ఆధ్యాత్మిక ఉన్నత్యము అంటే అంటే ఆధ్యాత్మికత నీలో అంత పెరిగింది
(48:24) ఎవరు ఎంత మంచిని ఆచరిస్తున్నారో వాళ్ళలో అంత ఆధ్యాత్మిక ఉన్నత్యం ఉంది అంత ఆధ్యాత్మిక ఉన్నతి ఉంది ఇంకా చెడు మిగిలింది ఆ చెడుని పోగొట్టుకోవాలి సంపూర్ణంగా పోల దానికోసం సాధనలు చేస్తూ చెడుని సంపూర్ణంగా పోగొట్టుకొని మంచిని సంపూర్ణంగా మంచిని మాత్రమే చేస్తూ జీవించే స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళలో ఆధ్యాత్మిక ఉన్నతి అతి తారా స్థాయికి వచ్చేసింది ఇంక చెడు చేయరాళ్ళు ప్రాణం పోవచ్చు గాక ఇంకా ప్రాణం పోవచ్చు నాకు మిగిలిన విషయాలు పెద్ద విశేషం ఏముంది ఎవరి కోసం చేయరు నాకోసం చేయరు కుటుంబ సభ్యుల కోసం చేయరు తన కోసం చేయరు తన వాళ్ళ కోసం చెడు చేయరు అన్ని
(49:03) చేసుకుంటారు ధర్మబద్ధమైన అన్ని చేసుకుంటారు హాయిగా బతుకుతారు. వాళ్ళు ఒక ఋషులుగా యోగులుగా మునులుగా జీవిస్తున్నట్టు మీరేమి ఋషులు డ్రెస్సులు వేయక్కర్లే మునులు డ్రెస్సులు వేయక్కర్లే అది పూర్వకాలం అప్పుడు వేష భాషలు అవి కానీ ఇప్పుడు వేష భాషల ప్రకారం ఇలా జీవిస్తూ చెడి చేయన వాళ్ళందరూ యోగులే మునులే ఋషులే తపస్సు సంపన్నులే మంచిగా జీవించే వాళ్ళందరూ ఋషులు మునులు యోగులు తపస్సు సంపన్నులే చక్కగా మీ కుటుంబాన్ని నడుపుకోండి హాయిగా నడుపుకోండి భార్యా భర్తలు సుఖంగా ఉండండి మీ పిల్లలని చక్కగా పెంచుకోండి జస్ట్ చెడు చేయద్దు మంచితో మాత్రమే జీవించండి. ఎక్కువ వస్తే
(49:40) ఎక్కువ అనుభవించండి తక్కువ అయితే తక్కువ అనుభవించండి కానీ మంచిలోనే అనుభవించాలి మంచితోనే అనుభవించాలి మంచిగానే జీవించాలి అప్పుడు వీరంతా ఋషులే మనందరం ఋషులమ అయిపోతాం ఇప్పుడు ఋషిగా మునిగా యోగిగా మనకు ఒక అర్హత వచ్చేసింది చెడిపోయింది మంచిగా జీవిస్తున్నాం ఆధ్యాత్మిక ఉన్నత్యంతో ఆ స్థాయికి వచ్చింది.
(50:04) అప్పుడు ఈ శరీరము నేను కాదు శరీరం ఏదో ఒకరోజు సిధిలమైపోద్ది. ఈ మనసు నేను కాదు మనసు అనేది ప్రాణశక్తిలో శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించబడిన విషయాలు ప్రింట్ అయినయి అంతే కానీ అది ప్రాణశక్తే ఆ ప్రింట్ అయిన విషయాలు తీసేస్తే అది ప్రాణశక్తే ప్రాణశక్తి లేకపోతే నేను మనసుగాను ఉండను శరీరంగాను ఉండను కనుక శరీరం శిధిలమైపోయే లోపల నా ప్రాణశక్తిని నేను తెలుసుకుంటాను అని ఆ మంచిలోంచి ఆల్రెడీ మంచిగా జీవించడానికి చెడును పోగొట్టుకోవడానికి మీ లోపలికి మీరు వెళ్ళటం మీకు అలవాటు అయిపోయింది మీ లోపల మిమ్మల్ని గమనించుకోవడం మీకు అలవాటు అయిపోయింది మీ లోపలికి మీరు వెళ్లి గమనించుకుంటూ సాధనాయత జీవితం గడపడం అలవాటు
(50:46) అయిపోయింది మంచిగా జీవించే వాళ్ళందరూ యోగులు మునులు ఋషులు అయిపోయి సాధనలు చేస్తున్న వాళ్లే అదే సాధన మంచి సాధన అప్పుడు నీకు ఆటోమేటిక్ గా మంచిలో నువ్వు ఇమిడిపోయి ఉన్నావు గనుక నీ ప్రాణశక్తి ఎరుక నీకు అతి తేలికగా కలుగుతుది కొంచెం ఆత్మజ్ఞానం తెలుసుకుంటే చాలు అప్పుడు అప్పుడు నేను నేను ప్రాణశక్తిని శరీరం నశించిపోయినా నాకేం ప్రాబ్లం లేదు నేను శాశ్వతంగా ఉండేటువంటి అనంత ఆత్మ శక్తిని సృష్టి శక్తిని విశ్వశక్తిని నేను శక్తిగా ఎప్పుడూ శాశ్వతమే అనేటువంటి ఒక ఏకత్వపు అనంతపు శాశ్వతపు నిర్మల నిశ్చల ప్రశాంత ఆనంద భావన కలుగుతది దాని పేరు మోక్షం
(51:31) దాని పేరు మోక్షం అప్పుడు ఆ భావన కలిగి లిగితే అటువంటి స్త్రీలను పురుషులను జీవన్ముక్తులు అంటారు. అక్కడికి వెళ్ళడానికి మనం ఈ ప్రయత్నించుకుంటాం ఇదంతా మనిషి చేయగలడు ఎందుకే ఇది ఆధ్యాత్మిక చదువు భౌతిక చదువులు వేర వృత్తి వ్యాపార ఉద్యోగాలు ధన సంపాదనకు పనికొస్తాయి. ఇది ఆధ్యాత్మిక చదువు నా స్వీయ ఆత్మ ఎరుకకు నా సంపూర్ణతకు పనికవచ్చే చదువు ఇది నా శరీర స్థితి నుంచే నా యొక్క అనంత ఆత్మశక్తి స్థితి ప్రాణశక్తి స్థితి నాకు తెలియజేసే చదువు ఇది అది నాకు ఆ ప్రాణశక్తి యొక్క అనుభవాన్ని సమకూర్చే చదువు ఇది ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు
(52:14) ఈ చదువుకుంటాడా వెళ్తే ఆటోమేటిక్ గా మనసు కంట్రోల్ లోకి వచ్చేస్తది మీరు వింటూ ఉండండి నేను తప్పు చేయకూడదని బలంగా నిర్ణయించుకోండి ండి మనసు మనదే శరీరం మనదే తప్పులు చేసేది మనమే పొరపాటులు చేసేది మనమే వ్యసనాలకు లోయపోయేది మనమే వద్దునుకున్న పదే పదే అటు పరిగెత్తేది మనమే అది వ్యసన మనసు ఇప్పుడు మనసుని వ్యసన విముక్త మనసు చేయాలి.
(52:36) అదే చెడుపోకోవటం పోగొట్టుకోవటం ఇప్పుడు మనకి వ్యసన విముక్త మనసు కావాలి దానికోసమే ఆధ్యాత్మిక చదువు చెప్పుకుంటున్నాం మీకు కోపం ఉందనుకోండి వ్యసనమే అధిక కోపం వ్యసనమే ఈర్షసూయ ద్వేషాలు వ్యసనాలే కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు వ్యసనాలే ఊరికినే ఇతరులని బాధ పెట్టడం వ్యసనమే ఊరికినే ఇతరుల నుంచి ఆశించడం కోరుకోవడం ఆశ అత్యాశ దురాశ వ్యసనాలే ఇలాంటివన్నీ పోగొట్టుకోండి అహంకారం వ్యసనమే ఇవి ఇవి మానసిక వ్యసనాలు వ్యసన మనసు లక్షణాలు అవి వ్యసన మనసు అలా ప్రవర్తిస్తది ఆ వ్యసన మనసుని వ్యసన విముక్త మనసుగా చేస్తాం మంచి మనసుగా చేస్తాం అదే సాధన కాబట్టి ఇప్పుడు వ్యసన మనసులో ఉన్నప్పుడు
(53:21) మీకు ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. నన్ను నేనే మానసికంగా శిక్షించుకుంటున్నాను ఇతరులను కూడా బాధ పెడుతున్నాను అయినా నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను ఇటువంటి వ్యసన మనసుకి భయము ఆందోళన అభద్రత డిప్రెషన్ ఒత్తిడి స్ట్రెస్ ఈ వ్యసన మనసు ఎంత బలహీనంగా ఉంటది అంటే తనను తాను కంట్రోల్ చేసుకోలేక తెలిసిన తప్పులనే చేస్తా ఉంటారు అది తప్పుఅని తెలిసే మాట్లాడతారు అది తప్పుఅని తెలిసే చేస్తారు అన్ని తప్పని తప్పుఅని తెలిసే చేస్తా ఉంటారు అంటే బలహీనం అయపోయింది వ్యసన మనసు ఇప్పుడు దానికి జ్ఞాన బలాన్ని అందించాలి జ్ఞానంతో బలాన్ని ఇవ్వాలి సంకల్పంతో బలాన్ని ఇవ్వాలి మనసుతో నేను
(54:03) తప్పులు చేయను చేయను చేయను అని దానికి జ్ఞానాన్ని పదే పదే వింటూ మనసుకి మనసుకి మనోబలాన్ని ఇవ్వాలి మంచి వినాలి మహాత్ముల చరిత్రలు వినాలి మంచి మాటలు వినాలి జ్ఞానయుత బోధలు వినాలి అలాగే ఆధ్యాత్మిక పరమైన దైవీ పరమైన మీరు ఏ మతంలో ఉంటే ఆ మతం ఏ దేవుడిలో ఉంటే ఆ దేవుడు ఏ గురువుతో ఉంటే ఆ గురువుతో ఏ గ్రంథం అయితే ఆ గ్రంథం వాటిని నమ్మి చదువుకుంటూ విశ్వసిస్తూ మనసుకవి బాగా పట్టిస్తూ ఆచార సంప్రదాయాలు పాటించుకుంటూ మీకు కుదిరినంత మీరు చేయగలిగినంత నిరంతర దైవ చింతన చేసుకుంటూ మనసుని ముందు దాన్ని మురికిని కడుగుతూ ఉండాలి. ఆ దైవ చింతనతో ఆ చిన్నదో పెద్దదో
(54:44) ఆ ప్రార్థనలతో ఆ ఆచార సాంప్రదాయాలతో ఆ పూజా విధానాలు అర్చనలు ఆరాధనలతో మనసుని శుభ్రపరుచుకోవాలి. అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనసుని పైకి లేపాలి దానికి బలాన్ని సమకూర్చాలి దానికి ఒక దేవుడు ఒక దేవత ఒక గురువు ఒక జ్ఞాన గ్రంథం సాయంగా అందించాలి. ఆ సాయంతో అది బలాన్ని పొంచుకుంటా ఉంటది బలహీన పడిపోయింది ఇప్పుడు బలహీన పడిపోయిన మనసు పదే పదే వెళ్ళిపోయి తన కంట్రోల్లో తనే లేకుండా తనను తానే శిక్షించుకుంటది అందుకే మీరు అడిగారు నన్ను నేనే మానసికంగా శిక్షించుకుంటున్నాను నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను నా బాధకి కారణం నేనే అని తెలిసినా నేను
(55:21) మళ్ళీ అదే తప్పు చేస్తున్నాను తప్పు అని తెలిసినా చేసిందే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను ఎందుకు ఆపలేకపోతున్నాను అంటే బలహీన మనసు వ్యసన మనసు బలహీన పడిపోయింది శక్తి లేదు దానికి కంట్రోలింగ్ పవర్ పోయింది ఇప్పుడు దాని కంట్రోల్ పవర్ మీకు సంబంధించినటువంటి దైవ ఆరాధనలతో మీకు సంబంధించిన మతం ఏదో ఆ మతంలో మీరు చేసుకునే మీ ఇంట్లో చేసుకునే మీరే దేవుని నమ్ముతారో ఏ గురువుని అనుసరిస్తారో ఏ గ్రంధాన్ని అనుసరిస్తారో అది బలంగా పట్టుకోండి వాళ్ళ కోసం ఈ ఏర్పాట్లు ఈ బలహీనమైనటువంటి మనసుతో సామాన్య స్థితి నుంచి ఉన్నటువంటి మనుషుల్ని నడిపించడానికి ఏర్పాటు
(55:59) చేయబడినటువంటి వ్యవస్థలు మతాలుమార్ మార్గాలు ఆచారాలు సాంప్రదాయాలు జ్ఞాన గ్రంథాలు గురువులు పద్ధతులు సాధనలు అర్చనలు ఆరాధనలు ప్రార్థనలు మీరు మొట్టమొదటి నుంచి బయలుదేరండి ఒక చిన్న ప్రార్థనతో ఒక చిన్న అర్చనతో ఒక చిన్న ఆరాధనతో అలా అలా బయలుదేరండి అది రోజు చేయండి ఒక నియమంగా చేయండి ఒక పద్ధతిగా చేయండి మనోబలం పెరుగుతది.
(56:21) అలా మనోబలం పెరుగుతూ వచ్చినాక స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళండి ఒకది మీకు నచ్చిన దైవ నామాన్ని తీసుకోండి పదే పదే స్మరించుకోండి ఆ దైవ గ్రంథాలు పదే పదే చదువుకోండి ఓ దేవుడు ఓ దేవత నన్ను చూస్తున్నారని భావించుకోండి అది నిజం అందుకే మతాలు చెబుతాయి ఆ నిజంలో ఎముడండి ఎందుకంటే వ్యసన మనసుకి అత్యంత ఆత్మజ్ఞానం అప్పుడే అర్థం కాదు నువ్వే ఆత్మ శక్తివ అంటే అప్పుడే అర్థం కాదు అందుకని దేవుడి మీద నుంచి దేవత మీద నుంచి ప్రయాణం చేసుకుంటూ రావాలి అందుకని మతాలు వచ్చినాయి అందుకని ఒక దేవుడిని ఒక దేవతని మీరు ఎవరిని నమ్మితే వాళ్ళని పట్టుకోండి.
(56:56) ఆ వాళ్ళ పట్ల భక్తి పెంపొందించుకోండి మీకు ఎవరైనా గురువులు ఉంటే వాళ్ళని పట్టుకొని ఆ గురువుల పట్ల భక్తి పెంపొందించుకోండి వాళ్ళ సలహా సంప్రదింపులతో చక్కగా మీరు నిత్యము ఆ భావాల్లో ఉండండి మీ భౌతిక విషయాలలో సమయం కొంత మిగుల్చుకొని ఈ దైవీ కార్యక్రమాలకే ప్రార్థనల ప్రేయర్స్ అర్చనల పూజలా జపదపాలా మీరు ఏం చేయగలిగితే లేదా చదువుకుంటారా పుస్తకాలు లేదా వింటారా ఏదో ఒక రకంగా మంచి మనసు తయారు చేసుకొని ఆ మంచి మనసుని ముందుకు తీసుకెళ్ళండి అక్కడి నుంచి బలం పెరుగుద్ది మీకు మనోబలం పెరుగుతది మంచి మంచిని ఎంత అందిస్తుంటే మనసుక అంత బలం పెరుగుద్ది ఎంత బలం
(57:38) పెరుగుతుంటే అప్పుడు మీకు అంత కంట్రోల్ పవర్ వస్తది మీరు ఆపగలుగుతారు దాన్ని మిమ్మల్ని మీరు తప్పుల్లోకి తీసుకెళ్లకుండా ఉంచగలుగుతారు. మిమ్మల్ని మీరు తప్పుల్లోకి వెళ్లి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకోకుండా ఉంచగలుగుతారు అభద్రతలో నుంచి డిప్రెషన్ లో నుంచి ఒత్తిడి నుంచి స్ట్రెస్ లో నుంచి మీకు కలిగే దుఃఖంలో నుంచి బాధల్లో నుంచి మిమ్మల్ని మీరే బయటకి తెచ్చుకుంటారు ఎందుకంటే మానసికమైనటువంటి వీటిలో మిమ్మల్ని బయటకి తేగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు మీకు మీరే సాయం చేసుకోవాలి.
(58:05) అదే దైవ సాయం మత సాయం గురు సాయం జ్ఞాన గ్రంథాల సాయం మీకు ఏది నచ్చితే అచ్చేసుకోండి. అలా కొద్ది కొద్దిగా బయటకి రండి అలా బయటకి వచ్చినాక ఆటోమేటిక్ గా మీరు మొత్తం మంచిోళ్ళ అయిపోతే ఆత్మజ్ఞాన దారి మంచిలోనుంచి ఉంది మోక్షదారి ఆటోమేటిక్గా వచ్చేస్తది కాబట్టి మీకు మీరు సహాయం చేసుకోండి ఎలా ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రీతులలో మీరు పై పైన విషయాలు ఏమి లేకుండా మీరు ఏం చెప్పారంటే జరిగిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ నా జీవితంలో జరుగుతున్నాయి ఒక సంఘటన వల్ల బాధపడిన మనసుక అది ఎందుకు పట్టడం లేదు మళ్ళీ అందులోకి వెళ్లి అలాంటివే ఎందుకు చేస్తున్నాను ఇలా పై పైన రాశారు లోతుగా
(58:48) ఏంటో మీకు తెలుస్తాయి ఆ సంఘటనలు ఏంటి ఆ విషయాలు ఏంటి అక్కడ ఏం జరిగింది అప్పుడు మీ బుద్ధులు ఏంటి మీ గుణాలు ఏంటి మీ పరిస్థితులు ఏంటి అవన్నీ మీకు తెలుస్తాయి అవి ఎవరికీ చెప్పకండి అసలు చెప్పక్కర్లేదు కూడా కానీ మీకు తెలుస్తాయి గనుక మీరు వాటిలో ఉన్న చెడుని వదిలేసుకుంటూ మంచిలోకి రావడానికి అవసరమైనన్ని చక్కగా చేసుకోండి.
(59:09) అలా చేసుకోవడానికి అనువుగా మంచి వింటూ ఉండండి మంచి చదువుతూ ఉండండి మంచి చేస్తూ ఉండండి. ఏదైనా సందేహాలు వస్తే మళ్ళీ అడుగుతూ ఉండండి తప్పకుండా చెబుతాను ఎందుకంటే మనుషులు మారటానికి కదా ఇవన్నీ చెప్పుకునేది తప్పకుండా విశ్లేషించుకుందాం తప్పకుండా మాట్లాడుకుందాం. కానీ మీరు కొంత ప్రయత్నించండి మీ ప్రయత్నానికి ఈ బయట సహకారాలు మీకు మనోబలానికి సరిపడతా ఉంటాయి కానీ ముందు మీరు నిర్ణయించుకోవాలి మీరు నిశ్చయించుకోవాలి నేను చెడులోనుంచి మంచిలోకి రావాలి నన్ను నేను శిక్షించుకోకూడదు నన్ను నేను బాధ పెట్టుకోకూడదు నేను ఇతరులకు బాధని ఇవ్వకూడదు నా మనసు నా కంట్రోల్లో
(59:46) ఉంచుకోవాలిని ఒక బలమైన నిర్ణయం చేసుకొని అక్కడి నుంచి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తే బయట విషయాలన్నీ మీకు సహకరిస్తాయి ప్రకృతి కూడా మీకు సహకరిస్తది భగవత్తత్వం కూడా మీకు సహకరిస్తది అసలు భగవంతుడు భగవత్తత్వం మతం మార్గం గురువు జ్ఞాన గ్రంథాలు ఉన్నదే అందుకు మనుషులకు మనోబలాన్ని పెంచడానికి మంచి ద్వారా మాత్రమే మనోబలం పెరుగుతుది మనోబలం పెరిగినటువంటి మనసు తన యొక్క సంపూర్ణ ఆత్మశక్తి ఎరుకను పొందగలుగుతది.
(1:00:17) అందుకని మీకు మీరు సాయం చేసుకోండి తప్పకుండా మిగిలిన సహాయాలన్నీ మీకు అందుతాయి ఇలా సాయం చేసుకొని మీకు మీరు సాయం చేసుకుంటూ మీరు నడిచే మార్గంలో మీకు ఏమనా సందేహాలు వస్తే అడగండి మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లుయనా చెప్పుకుందాం కానీ కొంచెం స్పష్టంగా క్లియర్ గా మీకు అర్థమయ్యేలా మేమ చెప్పడానికి మాకు అర్థమయ్యేలా కొద్దిగా చెప్పండి అలాని మీ జీవితంలోని విషయాలు ప్రత్యేకంగా ఎవరికీ ఏమి చెప్పక్కర్లే మాకు చెప్పక్కర్లే అసలు ఎవరికీ చెప్పకండి సూచన ప్రాయంగా కొద్దిగా అర్థం అయ్యేలా చెప్పండి చెప్పండి మీ వయసు అయి కూడా తెలియజేయండి దాన్ని బట్టి కూడా
(1:00:51) మీకు చెవ్వటానికి వీలు ఉంటది వయసుని బట్టి కూడా మనిషిలో చర్యల్లో మార్పులు ఉంటాయి. చిన్న వయసు వాళ్ళు కొంచెం ఉద్రేకంగా స్పీడ్ గా ఉంటారు. పెద్ద వయసు వాళ్ళకి కుటుంబ బాధ్యతల్లో ఇమిడిపోయి ఉంటారు అందుకని మీ వయసును బట్టి మీ చదువు లేకతే మీ కుటుంబ పరిస్థితులు మీకు వివాహం అయిందా లేదా మీకు వివాహం అయితే వివాహ కుటుంబ జీవితంలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఇవన్నీ కూడా తెలిస్తే కొంచెం మీకు చెప్పడానికి వీలుగా ఉంటది కానీ వాటిని ఏది కూడా అందులో ఉన్న లాభ నష్టాలు అందులో ఉన్న ఇబ్బందులు ఎవరికీ వివరంగా చెప్పొద్దు నాకు చెప్పొద్దు ఎవరికీ చెప్పొద్దు మీ
(1:01:26) పర్సనల్స్ ఎవరికీ చెప్పకూడదు. విషయం అర్థంఅయ్యేంతవరకు కొన్ని చెప్పండి చాలు మీ వయసు చదివితే నాకు అర్థంయేది మీరు ఎక్కడ చెప్పలే ఆ వయసుని బట్టి కూడా చెప్పొచ్చు పెద్ద వయసు వాళ్ళకయితే ఒకలా చెప్పాలి చిన్న వయసు వాళ్ళకయితే ఒకలా చెప్పాలి మన వేగం చిన్న వయసు వాళ్ళకి అధికంగా ఉంటది. అలా ఆలోచించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం మీకు ఏమనా సందేహాలు ఉంటే మళ్ళీ అడగండి మీరు తప్పకుండా ధైర్యంగా హాయిగా బతకొచ్చు ప్రతి మనిషి బతకొచ్చు మీలాంటి పరిస్థితుల్లో నుంచే మేమందరం ఇక్కడిదాకా వచ్చాం నేను కూడా మీరు చెప్పిన అన్నింటికీ గురైన వాడినే నా చిన్నతనంలో ఇప్పుడు నా
(1:02:04) వయసు 57 ఏళ్ళు నా చిన్నతనంలో నా జీవితంలో ఇవన్నీ ఎదుర్కుంటూనే వచ్చాను. ఇప్పుడు కూడా ఏఒక సమస్యలు వస్తానే ఉంటాయి శరీరం ఉన్నంతవరకు ఉంటాయి కానీ అవన్నీ ధర్మంగా నడుపుకుపోతా ఉంటాం అధర్మం అయితే చేయం అలాంటి ఒక మనోస్థితి ఏర్పడింది ఆ మనోస్థితి చెడిపోకుండా ఉండటానికి మంచిలోనే నడవడానికి శీర్షికలు పెట్టుకొని మీతో పంచుకుంటున్నాను సత్కాలక్షేపం చేసుకుంటున్నాను మీరు కూడా అలా సత్కాలక్షేపం చేసుకొని మనోబలాన్ని పెంచుకోండి మంచిని మాట్లాడుకోవడం వలన మంచిని వినటం వలన మంచిని చేయటం వలన చెడు చేయకుండా ఉండటం వల్ల మనోబలం పెరుగుతుంది చెడు చేసే వాళ్ళందరికీ మనోబలం తగ్గిపోద్ది
(1:02:43) బలహీనులు అయిపోతారు ఆ చెడులోనుంచి బయటకి రాలేరు అక్కడి నుంచి ఒత్తిళ్లకి స్ట్రెస్లకి డిప్రెషన్లకి గురైపోతారు అనారోగ్యాలకు గురైపోతారు మానసిక శారీరక వ్యాధులకు గురైపోతారు చెడు వైపు వెళ్ళకండి చెడు చాలా ప్రమాదము మంచిలోకి వచ్చి మంచిలో నడవడానికి శీర్షికులు చెప్పుకుంటున్నాం ఇది ఆధ్యాత్మిక విద్యాలయము ఇందులో మంచి మాత్రమే ఉంటది మంచి నుంచి ఆత్మ జ్ఞానానికి వెళ్లచ్చు ఇది ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు దానికి ప్రభం చెడులోనుంచి మంచిలోకి రావటం ఆలోచించి చూడండి అర్థమైతే ఆచరించుకోండి ఆచరిస్తూ సందేహాలు వస్తే అడగండి ఎన్నిసార్లుైనా మళ్ళీ మళ్ళీ మళ్ళీ
(1:03:23) విశ్లేషించుకుందాం ఒక మనిషి శాంతిగా హాయిగా మంచిగా బ్రతకడానికి మించినంత గొప్ప విషయం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు వాళ్ళే మునులు యోగులు ఋషులు ఆ డ్రస్లు గెటప్పులు ఒకప్పుడు మునులు ఋషులు అలా ఉండేవాళ్ళు వాళ్ళ జీవన విధానం అది వాళ్ళు బట్టల కట్టుకునేవాళ్ళు ఇప్పటిలాగా ఎయిర్ కటింగ్ సెలన్స్ అవన్నీ లేవు అందుకని జుట్టుల ముడులు వేసుకునేవాళ్ళు రకరకాలుగా ఉండేవాళ్ళే అప్పటి వేల సంవత్సరాల వెనక జీవన విధానం ఇది ఇప్పుడు మన జీవన విధానం ఇది ఏ జీవన విధానంలో ఈ డ్రెస్సింగ్ తో ఈ స్టైల్స్ తో ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఎలా ఉన్నారో అలాగే ఉంటూ మంచిగా బతికి చెడు
(1:03:59) చేయకుండా ఉండే అందరూ ఋషులు మునులు యోగులే మనం కూడా అలా జీవించే ప్రయత్నం చేద్దాం నేను చెప్పింది నచ్చని వాళ్ళు ఇది మాకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు అసలు వినబాకండి నచ్చన వాళ్ళ అందరికీ చెబుతున్నాను నేను అతి సామాన్యుడిని నాకేదో తెలుసని గొప్పలక అసలు చెవటం లేదు నేనుే గురువుని కాదు నేనే స్వామిని కాదు ఏదో చాలామంది కొంతమంది పాపం అమాయకులు కామెంట్స్ లో గురువుగారు అని పెడతా ఉంటారు స్వామి అని పెడతా ఉంటారు నమస్కారం బొమ్మలు పెడతా ఉంటారు అంతటి అర్హత అసలు నాకు ఏమీ లేదు నేను సామాన్య మానవుడిని నన్ను నేను మంచిలో ఉంచుకోవడానికి నేను చెడులోకి వెళ్ళకుండా
(1:04:39) ఉండటానికి ఈ శీర్షికల్ని సజ్జన సాంగత్యకంగా పెట్టుకొని కొంచెం మంచిలో జీవించడానికి ఈ మాధ్యమాన్ని వాడుకుంటున్నాను. అంతే ఎవరో నలుగురికి ఉపయోగపడుతది కదా కొంతమంది అడుగుతున్నారు చెప్పమంటున్నారు కదా అని ఇందులో చెబుతున్నాను తప్ప నేను అతి సామాన్యుని నన్ను క్షమించి వదిలివేసి నచ్చని వాళ్ళందరమ మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి.
(1:05:04) శుభమస్తు మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరు గాక మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం

No comments:

Post a Comment