Monday, March 16, 2026

 *సీతమ్మ పుట్టినిల్లు* 

🔔🔔🔔🔔🔔

జానకీ మందిర్‌.. సీతమ్మ పుట్టిల్లు మిథిలారాజ్యం(నేటి నేపాల్‌లోని జనక్‌పూర్‌)లో నెలవైన ఆలయం. ఆ జగదానంద కారకుడి పట్టమహిషి కొలువైన మందిరం. 

స్థలపురాణం ప్రకారం జనక మహారాజు ఏలిన నేల ఇది. సీతమ్మతల్లి జనకుడికి లభ్యమైన చోటు ఇదేనని.. రామయ్యను పెళ్లాడి అయోధ్యకు వెళ్లేదాకా ఈ నేలపైనే నడయాడిందని ఐతిహ్యం. అందుకు నిదర్శనంగా.. 1657లో ఈ ప్రాంతంలో ఒక స్వర్ణ సీత విగ్రహం దొరికింది. ఈ ఆలయానికి సమీపంలో ‘వివాహ మండప్‌’ పేరుతో ఒక గుడి ఉంటుంది. సీతారాముల పెళ్లి జరిగింది అక్కడేనని భక్తుల నమ్మిక. జానకీ మందిర్‌ను నేపాలీలు ‘నౌ లఖా మందిర్‌’గా వ్యవహరిస్తుంటారు. నౌ లఖా అంటే తొమ్మిది లక్షలు. 150 అడుగుల ఎత్తుండే ఈ మూడంతస్తుల గుడిలో 60 గదులుంటాయి. రాణి వృషభాను 1910లో దీన్ని నిర్మింపజేసింది. ఈ ఆలయ నిర్మాణానికిఅయిన ఖర్చు.. 9,99,900. అందుకే ‘నౌ లఖా మందిర్‌’ అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు నేపాల్‌ నలుమూలల నుంచే కాక.. భారత్‌, శ్రీలంక తదితర దేశాల నుంచి వేలాది భక్తులు వస్తుంటారు.
*ఆధ్యాత్మిక కుటుంబం 4*

No comments:

Post a Comment