Wednesday, November 11, 2026

మాతృస్వామ్యంలో భర్త పరిస్థితి ఎలా ఉండేది? | Ancient Marriage System | Out of COVERAGE

మాతృస్వామ్యంలో భర్త పరిస్థితి ఎలా ఉండేది? | Ancient Marriage System | Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WXTzh-zaAZw





Title: మాతృస్వామ్యంలో భర్త పరిస్థితి ఎలా ఉండేది? | Ancient Marriage System | Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: From Matriarchy to Patriarchy… How Did the Institution of Marriage Change?

Marriage has not always been the same throughout human history. Was there once a system where husbands moved into their wives’ homes? Why did that system begin to change after the rise of agriculture? How did economics, agriculture, and changing family structures transform marriage?

In this episode, we explore how societies moved from matriarchal systems toward patriarchal structures. What role did ancient marriage practices such as bride price play in this transformation? How did economic power influence the rules of marriage? And how did changing social conditions reshape relationships between men and women?

We also look at the modern world. As women gain greater economic independence through education and employment, how is the institution of marriage changing? Could marriage itself take a completely different form in the future?

This is another important chapter in the Human Evolution Universe series.

To understand the complete journey of human evolution, watch the previous episodes in this series as well.

OUT OF COVERAGE — Beyond the Headlines.



Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#outofcoverage
#patriarchy
#humanevolution
#marriage

Transcript:
(00:01) [సంగీతం] ఆ అమ్మాయికి 13 ఏళ్ళ నిండాయి. ఆమె పేరు నూజా తన జీవితంలోనే ప్రత్యేకమైన వేడుకను కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. అంటే మన దగ్గర పెద్ద మనిషి ఫంక్షన్ లాంటిది. తర్వాత ఆమెకి ఇంట్లో ప్రత్యేకమైన గదిని కేటాయించారు. దానికి నేరుగా ప్రవేశించే ద్వారంతో పాటు కిటికీలో నుంచి లోపలికి రావడానికి కూడా ఒక చిన్న ఏర్పాటు ఉంది.
(00:28) పగటిపూట పని ప్రదేశాల్లోనో పండగ సమయాల్లోనో ఒక అబ్బాయిని చూసి మనసు పారేసుకుంది. అటు వాడికి కూడా గుండెజారి గల్లంత అయిపోయింది. అంతే ఆమె సిగ్నల్ ఇచ్చేసింది. వాడు అందుకున్నాడు. ఒకరోజు రాత్రి కిటికీ తలుపు గుండా ఆమె గదిలోకి ప్రవేశించాడు. మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. లోనికి ప్రవేశించిన తర్వాత తన టోపీని అందరికీ కనిపించేలాగా కిటికీకి వేలాడదీశాడు.
(00:53) అది ఇంట్లోని వాళ్ళకు మాత్రమే కాదు ఊర్లోని వాళ్ళకు కూడా ఒక గుర్తు అమ్మాయి తన గదిలో ఒక అబ్బాయితో ఉంది. వారిని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు అని దాని అర్థం. అలా రాత్రంతా అమ్మాయితో గడిపిన తర్వాత తెల్లవారు జామున సూర్యుడు రాకముందే ఆ అబ్బాయి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలా వాళ్ళద్దరికీ నచ్చినంత కాలం ఈ బంధంలో కొనసాగుతారు.
(01:16) ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా ఆ తర్వాత విడిపోవచ్చు. అదేంటి మరి ఈ గ్యాప్ లో పిల్లలు పుడితే ఎలా అనే సందేహం మీ మైండ్ లో రన్ అవుతుందని నాకు తెలుసు. అలా పుట్టిన పిల్లలను అమ్మాయి ఇంటివారే చూసుకుంటారు. అమ్మాయి తల్లి అన్నదమ్ములే పెంచుతారు. అలా పుట్టే పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. తల్లి మాత్రమే తెలుస్తుంది. మాతృస్వామ్య వ్యవస్థలోని పెళ్లిలలో ఇదొక రకం.
(01:40) ఇప్పుడు ఈరోజుకి కూడా ఇది కొనసాగుతూనే ఉంది. మన పక్క దేశమైన టిబెట్ లోయలో ఉన్న మసువ తెగలోనిది ఈ సంప్రదాయం. దీన్నే వాకింగ్ మ్యారేజ్ సిస్టం అని కూడా పిలుస్తారు. ఇక మన దేశంలోనే మేఘాలయ రాష్ట్రంలో మరో విధమైన మాతృస్వామిక వ్యవస్థ కొనసాగుతోంది. ఇక్కడ ఖాసి అనే తెగ ఉంది. భారతదేశంలో మాతృస్వామి వ్యవస్థ కలిగిన అతి పెద్ద తెగ ఇదే. ఇప్పటికీ ఈ సంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది.
(02:06) ఇక్కడ పెళ్లి తర్వాత భర్తే భార్య ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడే నివసిస్తాడు. పుట్టబోయే పిల్లలకు భార్య ఇంటి పేరే వస్తుంది. ఆస్తి హక్కులు కూడా మొత్తం అమ్మాయికే చెందుతాయి. అబ్బాయిలకు ఏమి చెందవు. ఇలాంటి మాతృస్వామి పెళ్లిళ్లు సాంప్రదాయాలు మనకు కొత్తగా చాలా వింతగా విచిత్రంగా అనిపిస్తాయి. కానీ ఈ సాంప్రదాయాల వయసు ఏకంగా రెండు లక్షల ఏళ్లకు పైమాటే.
(02:31) మన పితృస్వామి పెళ్లి సాంప్రదాయం వయసు కేవలం 5000 నుంచి 10వేల సంవత్సరాలు మాత్రమే మరి లక్షల ఏళ్ల క్రితం ఈ మాతృస్వామిక వ్యవస్థలోకి పెళ్లిలు ఎలా వచ్చాయి ఎందుకు మొదలయ్యాయి ఆ తర్వాత పితృస్వామిక వ్యవస్థలో పెళ్లిలు ఎలా ప్రారంభమయ్యాయి అనే వివరాలతో పాటు ఆ పెళ్లిలో అంతరించిపోతున్న ఈ పెళ్లిలు ఆరంభంవుతున్న సంధికాలం ఉంటుంది కదా ఇది అత్యంత కీలకమైన సమయం.
(02:56) ఆ సమయంలో ఏం జరిగింది అనే వివరాలను మనం ఈ వీడియోలో పిన్ టు పిన్ చూద్దాం. డోంట్ మిస్ ఇట్. దాదాపురం లక్షల ఏళ్ల పాటు కొనసాగిన మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీ ఆధ్వర్యంలోనే పాలన ఎలా సాగిందో గత ఎపిసోడ్ లో చూసాం. మగాళ్ళు వేట జంతువులను ఆడవాళ్ళు పండ్లు దుంపలను సేకరిస్తూ తిండి సమస్యను అధిగమిస్తున్నారు. శృంగారంలో కూడా స్వేచ్ఛ ఉండేది కాబట్టి ఎవరో ఒకరి రూపంలో ఆకలి కూడా తీర్చుకుంటున్నారు.
(03:22) కానీ కాలక్రమంలో ఒక పెద్ద ఇబ్బంది వాళ్ళు గమనించారు. ఇది అర్థం కావడానికి వాళ్ళకు చాలా కాలమే పట్టింది. అదే జెనటిక్ డిసార్డర్ ఒకే గుంపులో ఉన్నవారు వాళ్ళలో వాళ్లే తరతరాలుగా శారీరక సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వేలాది సంవత్సరాలుగా ఇదే విధంగా ఇన్ బ్రీడింగ్ జరగడం వల్ల కొత్త తరాలకు జెనటిక్ సమస్యలు రావడం మొదలయ్యాయి. కాళ్ళు చేతులు వంకరగా పుట్టడం, ముక్కు మూతి సరిగా లేకపోవడం, ఇతర తీవ్రమైన రోగాలతో పిల్లలు పుట్టడాన్ని చూశారు.
(03:50) కానీ ఎందుకి ఇలా జరుగుతుందో మాత్రం చాలా కాలం పాటు వాళ్ళకి అర్థం కాలేదు. కొందరికి పుట్టే పిల్లలు మాత్రం ఎంతో ఆరోగ్యంగా బలిష్టంగా ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందని బాగా ఆలోచిస్తే వందలు వేల ఏళ్ల తర్వాత సమాధానం దొరికింది. సొంత గుంపులోని వారితో జతకట్టిన వారికి వైకల్యంతో కూడిన పిల్లలు బయట గుంపులోని వారితో కలిస్తే మంచి ఆరోగ్యకరమైన పిల్లలు పుడుతున్నారని గుర్తించారు.
(04:14) ఆ విధంగా సొంత గుంపులోని వారు కలవకూడదు అని తీర్మానించుకోవడం మొదలు పెట్టారు. మరి ఇప్పుడు ఏం చేయాలి ఎవరితో రిలేషన్ పెట్టుకోవాలి అంటే వేరే గుంపులోని వారితో కలవాలి అని అర్థం అవ్వడం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో వేరే గుంపులోని వారితో సంబంధాలు పెట్టుకునేందుకు అమ్మాయిలను వెతుక్కుంటూ మగవాళ్ళు వెళ్ళిపోయేవారు. ఇవాళ ఊర్లు పక్క పక్కనే ఉన్నట్టుగా అప్పట్లో ఉండేవి కాదు.
(04:35) ఆ రోజుల్లో జనాభా చాలా చాలా తక్కువ. అందుకే ఒక్కో గుంపు ఎక్కడెక్కడో పదులు వందల కిలోమీటర్ల దూరంలో ఉండేవి. అయినా శృంగారం కూడా ఆకలే కదా దాన్ని తీర్చుకోవడానికి మనిషి ఏమైనా చేస్తాడు. అలా అమ్మాయి గుంపుల వద్దకు వెళ్ళడం మొదలు పెట్టారు సుదూర ప్రాంతాలకు ఇక్కడే ఒక డౌట్ రావచ్చు మగాడ వెళ్ళడానికి గ్యారెంటీ ఏంటి ఆడవాళ్ళు వెళ్ళలేదా అతడు మాత్రమే వెళ్ళడానికి కారణం ఏంటి అనేదే ఆ డౌట్ దీనికి సమాధానం ఆడవాళ్ళు కూడా వెళ్లి ఉండొచ్చు కానీ ఎక్కువగా మగాడే వెళ్ళేవాడు.
(05:08) దీనికి కారణం చాలా సింపుల్. మహిళలు ఇంటిపట్టనే ఉండి పిల్లల్ని చూసుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇంకా ప్రెగ్నెంట్ అయిన వారు ఖచ్చితంగా పిల్లకే పరిమితం కావాల్సి వచ్చేది. ఇలాంటి సమయంలో కోరిక రుచి మరిగిన మగాడు మరో తోడు కోసం చూస్తాడు. ఇప్పటికీ ఇంతే కదా భార్య ప్రెగ్నెంట్ అయి పుట్టింటికి వెళ్లి మళ్ళీ వచ్చే గ్యాప్ లోనే మెజారిటీ అక్రమ సంబంధాలు పుడతాయి.
(05:29) ఇలాంటి పలు కారణాలతో నాడు కూడా మరో తోడు వెతుక్కుంటూ మొగాడే ఎక్కువగా వెళ్ళేవాడు. అలా వెళ్ళినవాడు అక్కడ కొంతకాలం ఉండి తిరిగి తన గుంపు వద్దకు వచ్చేవాడు ఇలా రాకపోకలు సాగించేవాడు ఇప్పుడు ఇదే పరిస్థితి అతను గుంపు మొత్తానికి అప్లై చేసి చూడండి ఇదే పద్ధతిని అన్ని గుంపులకు అప్లై చేయండి ఇక్కడ వాళ్ళు ఆ గుంపులోకి అక్కడి వాళ్ళు మరో సమూహంలోకి ఆ మరో సమూహంలోని వాళ్ళు ఇంకో గుంపులోకి ఎక్కడికి వీలైతే అక్కడికి వెళ్లి రావడం మొదలు పెట్టారు.
(06:01) ఇలా అన్ని గుంపుల మధ్య రాకపోకలు సాగుతూ ఉండేవి. అయితే ఇదంతా ఇంత సింపుల్ గా ఉండేదని మాత్రం అనుకోవద్దు. నేటి మాదిరిగానే వేరే తెగ నుంచి వచ్చిన మగాడిపై దాడులు చేయడం చంపేయడం ప్రతిగా ఆ తెగవాళ్ళు వీళ్ళ గుంపుపై దాడి చేయడం వంటివి ఎన్నో జరిగాయి. కానీ ఆఖరికి వాస్తవాన్ని గుర్తించాల్సిందే కదా జెనటిక్ సమస్యల కారణంగా ఒకే గుంపులోని వారు జతకట్టడం ఆపేసినప్పుడు ఆ ఎమోషన్ మరెక్కడో ఒక చోట తీర్చుకోవాల్సిందే కదా అది వేరే గుంపులోని వాళ్ళ దగ్గరనే సాధ్యం కదా అనే విషయాన్ని మెల్లగా అందరూ గుర్తిస్తూ వచ్చారు.
(06:32) ఆ విధంగా క్రమంగా కొట్లాటలు గొడవలు ఆపేసి అబ్బాయి అమ్మాయిని ఒక్కటి చేయడం మొదలు పెట్టారు. ఇక్కడే అత్యంత ముఖ్యమైన విషయం ఉంది. ఇవాళ పెళ్లి అంటే చేసుకోబోయే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన అంశంగా మారిపోయింది. అంతగా సొసైటీ సింప్లిఫై అయింది. కానీ నాడు పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కానే కాదు రెండు గుంపులకు సంబంధించిన అంశం రెండు తెగల కలయికకు సంబంధించిన విషయం ఆ రోజుల్లో ఇది సాధారణమైన విషయం కానే కాదు.
(07:00) ఎందుకంటే అప్పటికే ఇతర తెగలతో ఆ తెగ ఎన్నో యుద్ధాలు చేసి ఉంటుంది. ఎంతో మంది తమ వాళ్ళను పోగొట్టుకొని ఉంటుంది. ఎన్నో నమ్మక ద్రోహాలను ఎన్నో వెన్నుపోట్లను చూసి ఉంటుంది. కాబట్టి ఒక కొత్త వ్యక్తి తమ సమూహంలోకి వస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా అన్ని పరిశీలించి అనుమతించాల్సి వచ్చేది. ఇలా ఒక కొత్తవాడిని తమతో కలుపుకునేవారు. ఈ 2026 దాకా కూడా పెళ్లి అనేది పెద్దలు తీసుకునే ప్రధాన నిర్ణయంగా వారి అనుమతితోనే సాగాల్సిన కార్యంగా ఎందుకున్నదో మీకు ఈ పాటికే అర్థమైందని భావిస్తున్నాను.
(07:33) ఈ విధంగా మగాడు అమ్మాయి ఇంటికి వెళ్లి రావడం మొదలైంది. అది మాతృస్వామిక వ్యవస్థ కాబట్టి అప్పటికే పాలన మొత్తం క్లాన్ మదర్ చేతిలో ఉండేది. ఇది గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం. కుటుంబ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆమె చేతి మీదగానే కొనసాగేది. అంటే అప్పుడు ఇంటి పెద్దగా అమ్మమ్మనో ఆమెన కన్నా అమ్మనో ఉండేది. అలాంటి ఇంటికి అమ్మాయి కోసం వెళ్ళిన కొత్తవాడిని మన భాషలో చెప్పాలంటే ఆ అల్లుడిని కేవలం ఒక చుట్టం మాదిరిగానే చూసేవారు.
(07:59) అంతే తప్ప ఆ ఇంట్లో అతనికి ప్రత్యేకమైన అధికారం కానీ బాధ్యతలు కానీ ఏవి ఉండేవి కావు. కేవలం అతను ఒక టూరిస్ట్ మాదిరిగా ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్తూ ఉండేవాడు. ఇలాంటి పెళ్లి వ్యవస్థలో భర్త లైఫ్ స్టైల్ మనకు వింతగా అనిపిస్తుంది. అతను పగటిపూట తన కన్న తల్లి సోదరిమలు ఉన్న తెగకు వెళ్లి వారి పొలాల్లో లేదా వేటలో సహాయం చేసేవాడు.
(08:18) రాత్రి వేళకు తిరిగి భార్య ఇంటికి వచ్చేవాడు. మళ్ళీ పొద్దున్నే తన ఇంటికి వెళ్ళిపోయేవాడు. భర్తగా మారిన మగాళ్ళందరి పరిస్థితి ఇదే విధంగా ఉండేది. అతనికి పుట్టిన పిల్లలు భార్య ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ బాధ్యతను భార్య భార్య సోదరులు అంటే మేనమామలదే. ఈ భర్త కూడా పొద్దునే లేచి తన ఇంటికి వెళ్లి అక్కడ తన అక్కలు చెల్లెళ్లకు పుట్టిన పిల్లల అవసరాలు చూసుకునేవాడు అంటే తన కుటుంబం అదేనన్నమాట ఇలా బెజవాడ కోదాడ మీద తిరిగే ఎర్ర బస్సు మాదిరిగా అటు ఇటు రౌండ్లు వేసేవాడు భర్త.
(08:48) ఇలాంటి వ్యవస్థలో ఫలానా పిల్లలు ఎవరి వాళ్ళు అంటే వాళ్ళ అమ్మ పేరే చెప్పేవారు. ఆ ఇల్లు ఎవరిది అంటే క్లాన్ మదర్ గా ఉన్న అమ్మమ్మ పేరే చెప్పేవారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మగాడికి ఎలాంటి గుర్తింపు ఉండేది కాదు. ఈ వ్యవస్థ దాదాపురం లక్షల ఏళ్ల క్రితం మొదలై కొత్త రాత యుగం వరకు కూడా కొనసాగిందని దాదాపు భూమి మీద ఉన్న అన్ని ఖండాల్లోనూ ఇది వర్ధిల్లిందని పరిశోధకులు గుర్తించారు.
(09:10) దీనికి అతి పెద్ద చారిత్రక ఆధారం టర్కీలోని చెతాల్హోవియుక్ ప్రాంతం. 9 వేల ఏళ్ల క్రితం నాటి ఆధారాలు ఇక్కడ లభించాయి. వాటిపై జరిపిన dఎన్ఏ పరిశోధనలు క్లియర్ కట్ గా చెప్పేసాయి. పెళ్లైన పురుషులంతా తమ పుట్టిన ఇల్లు వదిలి భార్యల ఇల్లులోనే నివసించారని నిరూపితమైంది. మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పుకున్న టిబెట్ మోసవో మేఘాలయ కాశీ తెగ మాదిరిగా ఇలా కొనసాగుతున్న ఆడవల్ల రాజ్యం కుప్పకూలిపోవడానికి 12వ000 ఏళ్ల క్రితం ఒక బీజం పడింది.
(09:37) ఆ విత్తనమే వ్యవసాయం. ఎప్పుడైతే మనిషి వ్యవసాయాన్ని కనిపెట్టాడో మాతృస్వామిక వ్యవస్థకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. వ్యవసాయం కనిపెట్టిన తర్వాత పశువుల మందలు పెరిగిన తర్వాత మగాడి శారీరక శ్రమకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అతను వేటకు వెళ్ళాల్సిన అవసరం తగ్గిపోయింది. ఒక్కచోటనే ఉండి సంవత్సరానికి సరిపడా తిండి గింజలు పండిస్తున్నాడు.
(09:59) ఇలాంటి పరిస్థితుల్లో స్త్రీ తెచ్చే పండ్లు దుంపల మీద కూడా ఆధారపడాల్సిన అవసరం తగ్గిపోయింది. అంతేకాకుండా వ్యవసాయాన్ని చూసుకోవడానికి రైతుగా మగాడు నిత్యం పొలం దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మైళ్ల దూరంలో ఉన్న భార్య ఇంటికి కాళీ నడకన వెళ్లి రావడం ఇబ్బందిగా మారుతోంది. కాబట్టి ఇన్నాళ్ళు నన్ను మీ ఇంటికి రప్పించుకున్నారు కదా ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు మీ అమ్మాయిని నా ఇంటికి పంపించండి అని అడగడం మొదలు పెట్టాడు.
(10:26) నెసెసిటీ ఇస్ ది మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అని ఇంగ్లీష్ లో ఫేమస్ కొటేషన్ ఉంటుంది. దీని అర్థం అవసరం మనిషికి ఏదైనా నేర్పిస్తుంది అని పరిస్థితి మనిషితో ఏ పైనైనా చేస్తుంది. ఇలా అడిగినప్పుడు భార్య తరపు కుటుంబం కూడా నో చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు అతను చెప్పిన దాంట్లో నిజం ఉందని. వాళ్ళ ఇంట్లోని మగాళ్ళు కూడా ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉంటారు కదా.
(10:50) అలా భర్త వద్దకు భార్యను పంపించే తరుణం మొదలైంది. ఆ విధంగా లక్షల ఏళ్లనాటి మాతృస్వామిక వృక్షం కుప్పకూలిపోయి పితృస్వామిక వ్యవస్థ ప్రాణం పోసుకోబోతుంది. ఒక స్త్రీ తల్లి కాబోతుందనే విషయం ఆమె నెలతప్పిన తర్వాతనే తెలుస్తుంది. కానీ అండం ఫలదీకరణ చెంది అప్పటికే రెండు వారాలు గడిచిపోయి ఉంటుంది. ఈ విషయం తొలి రోజునే మనిషికి ఎన్నటికీ తెలియదు.
(11:13) మార్పు కూడా ఇంతే అది మొదలైందన్న విషయాన్ని వెంటనే ఎవ్వరు గుర్తించలేరు. దాన్ని గుర్తించేసరికే అది చాలా దూరం వచ్చేసి ఉంటుంది. ఇలా పితృస్వామిక వ్యవస్థ చాప కింద నీరులా మొదలైంది. ఈ క్రమంలో వందల ఏళ్లు గడిచిపోయాయి. కొందరు భర్తలు భార్యలను తమ ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఇంకా కొందరు మగాలు మాత్రం పాత పద్ధతి ప్రకారం భార్య ఇంటికే వెళ్లి వస్తున్నారు.
(11:36) ఇక్కడ అవసరాయ పరిస్థితులను నిర్ణయిస్తున్నాయని మనం గుర్తించాలి. కానీ మెల్లగా మాతృస్వామిక వ్యవస్థ అంతరించి పోతుండగా దాని స్థానంలో సరికొత్త పితృస్వామిక వ్యవస్థ ఎమర్జ్ అవుతుంది. ఈ రెండిటి మధ్య ఉండే సమయాన్నే సంధి కాలం అంటారు. ఇలాంటి సంధి కాలాన్ని పితృస్వామిక వ్యవస్థ వేగంగా తన వైపు తిప్పుకోవడంలో చాలా అంశాలు కీలక పాత్ర పోషించాయి.
(11:59) అందులో అత్యంత ప్రధానమైనది కన్యాశుల్కం. ఆ రోజుల్లో వ్యవసాయాన్ని వదిలి భార్య ఇంటికి వెళ్లలేని పరిస్థితి కొందరిదైతే భార్యనే తన ఇంటికి తెచ్చుకోవాలనే కోరిక మరికొందరిది. ఇలా వీళ్ళద్దరి అవసరాలను ఈ కన్యాశుల్కం తీర్చేసింది. కన్యాశుల్కం అంటే నేటి వరకట్నం లాంటిది. ఇవాళ పెళ్లిలో వరుడికి కట్నం ఇస్తున్నారు. ఇదే కట్నం నాడు వధువుకి ఇచ్చేవాళ్ళు అయితే కన్యాశుల్కాన్ని నేటి వరకట్నంగా చూడలేము.
(12:24) ఎందుకంటే ఈ వరకట్నంలో గౌరవం విలువ వంటివి ఉన్నాయి. కానీ కన్యాశుల్కంలో ఇవేవి ఉండేవి కావు. అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు సంపద ఇచ్చి ఒక రకంగా ఆమెను కొనుక్కొని వెళ్ళిపోయేవారు. నేను భార్య కోసం మీ ఇంటికి రాలేను. నాకు వ్యవసాయంతో పాటు చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి మీ అమ్మాయిని నా ఇంటికి పంపండి దానికి ప్రతిఫలంగా ఇదిగో ఈ 10 జాతల పశువులను మీకు ఇస్తాను లేదంటే ఆరు నెలలకు సరిపడా ధాన్యాన్ని మీకు ఇస్తాను అని అమ్మాయి కుటుంబంతోనో వారి తెగతోనో బేరం కుదుర్చుకొని తన ఇంటికి అమ్మాయిని తెచ్చుకోవడం మొదలు పెట్టాడు.
(12:58) అవసరాలు మాత్రమే కీలకమైన నాటి రోజుల్లో ప్రేమ దోమ అనే పదాలకు తాగే లేదు. మీరు కూడా వాటిని వెతుకుతూ ఇబ్బంది పడకండి. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దీన్నే ప్రాక్టికల్ థింకింగ్ అంటారు. ఇలా కొందరు భార్యను కొనుక్కొని తమ ఇంటికి తెచ్చుకుంటుంటే అలా కొనుక్కునే స్తోమత లేని వారు ఇంకేదో ఉపాయం ఆలోచించేవారు.
(13:18) లేదంటే యుద్ధాలు చేసి ఆడవాళ్ళను ఎత్తుకొచ్చేవాళ్ళు మొత్తానికి ఈ విధంగా స్త్రీని భర్త ఇంటికి తెచ్చుకోవడం మొదలుపెట్టారు. చరిత్రలో ఏ వ్యవస్థ శాశ్వతంగా లేదు. భవిష్యత్తులో కూడా ఏ వ్యవస్థ శాశ్వతం కాదు. కాలం ఆర్థిక వనరులు ఎవరి చేతిలో ఉంటే పెళ్లి రూల్స్ వారి చుట్టూనే తిరుగుతాయని చెప్పడానికి ఈ ఎవల్యూషన్ స్టోరీయే ఒక పచ్చి నిజం. ఇక్కడ పాప పుణ్యాలకు చోటు లేదు ఆర్థిక బలం ఎవరి చేతిలో ఉంటే వారే వ్యవస్థను శాసిస్తారు.
(13:46) ఇది మొత్తం మానవ చరిత్రే నిరూపిస్తున్నటువంటి సత్యం. ఇప్పుడు మనం పాటిస్తున్న పెళ్లి వ్యవస్థకు కూడా ఏనాడో బీటలు పడ్డాయి. దీని వెనుక కూడా ఆర్థిక కారణమే బలంగా ఉండడాన్ని మనం గమనించొచ్చు. చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళు కూడా ఇప్పుడు సంపాదిస్తున్నారు. అలా ఆర్థికంగా బలం పొంజుకుంటున్న మహిళలకు మగాడి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండడం లేదు.
(14:08) వారు చెప్పినట్టు నేనుఎందుకు వినాలి అంటున్నారు. అర్బన్ ఇండియాలో ఎప్పుడో మొదలైన ఈ సంస్కృతి మెల్లగా రూరల్ ఇండియాలో కూడా ఇప్పుడు విస్తరిస్తుంది. ఈ తరహ ఆలోచనల్లో మాస్టర్స్ చేసిన ఆడవాళ్ళు మగాడిని కేవలం సెక్స్ టూల్ గా మాత్రమే చూస్తున్నారు. ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు నేను వాడి కింద బానిసగా ఉండడం ఎందుకు అంటున్నారు.
(14:29) అందుకే పెళ్లి సిస్టం ను లెఫ్ట్ లెగ్ తో తనేస్తున్నారు. ఈ పరిస్థితి రాబోయే 2040 నాటికే చాలా తీవ్రం కానుందని మొత్తం పెళ్లిలలో దాదాపు 30% పెళ్లిలు తగ్గిపోతాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ పరిస్థితి నెక్స్ట్ ఏ రూపం తీసుకుంటుందో చరిత్ర తెలిసిన వాడిగా భవిష్యత్తును అంచనా వేయగలిగిన వాడిగా నాకో ఐడియా ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెక్స్ట్ చేస్తాను.
(14:52) మొత్తానికి మాతృస్వామ్యంలో ఆడవాళ్ళు పెట్టినటువంటి పెళ్లిని కాలం మగాడు ఇద్దరు కలిసి మార్చేశారు. తాను తెచ్చిన పెళ్లితో పితృస్వామిక వ్యవస్థకు పురుషుడు బలమైన పునాదులు వేశడు. మరి పెళ్లి తెచ్చారు సరే ఎవరం చేసుకోవాలి? ఇది చాలా పెద్ద ప్రశ్న. వీళ్ళని ఎందుకు చేసుకోవాలి? వాళ్ళని ఎందుకు చేసుకోకూడదు? దీంతో పాటు మేడరికం తరహా వివాహాలు ఏదో ఒక రూపంలో అన్ని సమాజాల్లోనూ ఎందుకున్నాయి? అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.
(15:21) నేను మొత్తం హ్యూమన్ ఎవల్యూషన్ ఒక యూనివర్సల్ సిరీస్ గా చేస్తున్నాను. కాబట్టి ప్రతి వీడియోకు కనెక్షన్ ఉంటుంది. కొత్త వాళ్ళకు పర్ఫెక్ట్ గా అర్థం కావడానికి ముందు వీడియోలను కూడా చూడాలని కోరుతున్నాను. సెలవ్. [సంగీతం]

No comments:

Post a Comment