బంగారం విలువ వెనుక.. అసలు సీక్రెట్ ఇదే! | Gold History Explained | Out of COVERAGE
Author Name:Out of COVERAGE
Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999
Youtube Video URL:https://www.youtube.com/watch?v=B-T7giuAj1w
Title: బంగారం విలువ వెనుక.. అసలు సీక్రెట్ ఇదే! | Gold History Explained | Out of COVERAGE
Author Name: Out of COVERAGE
Description: Why Does Gold Rule the World? | The Hidden Science & History Revealed!
Gold. You can't eat it, it doesn't quench your thirst, it doesn't save lives, and it isn't even a basic human necessity. Yet, this single yellow metal has commanded human wealth and governed global economies for thousands of years. How did the entire world agree to believe in its ultimate value?
In his bestselling book Sapiens, renowned historian Yuval Noah Harari dropped a bombshell concept: "Money is the greatest story ever told—a collective myth." If money is just a shared fiction, what is the secret behind gold's supremacy?
In this video, we dive deep into the fascinating history and unexpected chemistry of wealth. We explore the failure of the ancient Barter System ("Coincidence of Wants"), the mind-blowing story of the giant "Rai Stones" of Yap Island, and run a scientific elimination round through the Periodic Table of Elements to discover why gases, liquids, and other metals failed—leaving Gold as the undisputed king of currency.
Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com
#gold
#money
#history
#ancienthistory
#outofcoverage
Transcript:
(00:00) బంగారం అది తినే పదార్థం కాదు దాహం తీర్చేది కాదు ప్రాణం కాపాడే వస్తువు కాదు కనీసం మనిషికి తప్పనిసరి అవసరం కూడా కాదు అలాంటి ఒక వస్తువును ఈ ప్రపంచంలోని మనుషులంతా అత్యంత విలువైనదిగా ఎలా నమ్మారు ఎవరు నమ్మించారు నిజానికి కేవలం అలంకారానికి తప్ప బంగారం ఎందుకు పనికొస్తుంది మెడలు వేసుకొని తిరగాలంటే బంగారాన్ని వేసుకోవాలా ఇప్పటికీ మనుషులు ఎన్నో రకాల పూసలు దండలు వేసుకుంటూనే ఉన్నారు.
(00:26) అయినా సరే పుత్తడి టాప్ ప్లేస్ లో ఉండి మిలమిల తలతలా మెరిసిపోతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను శాసిస్తోంది వందల ఏళ్లుగా సుప్రసిద్ధ చరిత్రకారుడు యుగల్ నోవా హరారి తన ప్రపంచ ప్రఖ్యాత పుస్తకం సేపియన్స్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్ లో మనుషులు బెదిరిపోయే ఒక షాకింగ్ విషయం చెప్తారు. డబ్బు అనేది అసలు నిజం కాదు అంటాడు ఆయన. అది కేవలం మనిషి సృష్టించిన అతి పెద్ద కల్పిత కథ అంటాడు.
(00:50) డీప్ గా ఆలోచిస్తే అవును నిజమే కదా అనిపిస్తుంది. మరి అలాంటి డబ్బుతో సమానంగా ఇంకా చెప్పాలంటే ఒక మెట్టు తానే ఎక్కువ అన్నట్టుగా హోయలుబోయే ఈ బంగారం వెనుకున్న గుట్టు ఏంటి? దీని వెనక పనిచేసిన చారిత్రక సూత్రం ఏంటి? నోవా హరారి మాటలో నిజం ఎంత? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇక టాపిక్ లోకి వెళ్తే ఈ బంగారం మాయ గురించి తెలియాలంటే మనం వేల ఏళ్ల క్రితం నాటి బార్టర్ సిస్టం గురించి తెలుసుకోవాలి.
(01:14) అది ఎలా నడిచిందో ఆ తర్వాత ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసుకోవాలి. గత ఎపిసోడ్ లో కూడా చెప్పాను. మనిషి జీవితంలోని ప్రతి మార్పు వ్యవసాయంతో లింక్ అయి ఉంటుందని నాడు అగ్రికల్చర్ కనిపెట్టింది కేవలం తిండి కోసమే తిండి కోసం మాత్రమే అయితే ఒక్కరు అన్ని పంటలు పండించలేరు కదా కాబట్టి నా పొలంలో టమాటాలు పండాయి మీ పొలంలో వరి పండింది.
(01:34) నా దగ్గర ఉన్న కొన్ని టమాటాలు మీకు ఇచ్చి మీ దగ్గర ఉన్న ధాన్యం నేను తీసుకుంటాను. ఇలా వస్తు మార్పిడి మొదలైంది. ఈ పద్ధతి నిజంగానే బాగుంది. అందరి అవసరాలు తీరుతున్నాయి. కానీ సమాజం చిన్నగా ఉన్నంతవరకే ఈ బార్టర్ సిస్టం చక్కగా పనిచేసింది. క్రమంగా జనాభా పెరిగి అవసరాలు మారుతున్నప్పుడు ఈ సిస్టం లోని పెద్ద లోపం బయట పడడం మొదలైంది. ఎకనామిక్స్ భాషలో దీన్ని కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు.
(01:58) ఉదాహరణకు మీకు కొన్ని కిలోల బియ్యం కావాలి. మీరు తయారు చేసిన చీర పట్టుకొని బియ్యం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. కానీ ఆ వ్యక్తికి చీర కాదు అతనికి ఒక కోడి కావాలి. ఇప్పుడు మీ వ్యాపారం ఎలా సాగుతుంది? మీరు బియ్యం ఉన్న మరో వ్యక్తి వద్దకైనా పోవాలి లేదంటే చీర తీసుకొని కోడి ఇచ్చే వ్యక్తి దగ్గరికైనా వెళ్ళాలి. అతని నుంచి కోడి తీసుకొని తెచ్చి ఇతనికి ఇస్తే ఇతను మీకు బియ్యం ఇస్తే నువ్వు తీసుకొని వెళ్లి వండుకొని తినాలి.
(02:20) ఇలా ఒక వస్తువును మార్చుకోవడానికి మనిషి రోజంతా సమాజంలో తిరగాల్సిన పరిస్థితి క్రమంగా పెరుగుతోంది. ఇది మాత్రమే కాదు బార్టర్ సిస్టం లో మరో మూడు పెద్ద సమస్యలు ఉన్నాయి. మొదటిది విలువను డిసైడ్ చేయడం. ఒక కోడి విలువ ఎన్ని కిలోల బియ్యంతో సమానం లేదా ఎన్ని లీటర్ల పాలతో సమానం. ఇలా ప్రతి వస్తువును మిగతా వస్తువులతో కంపేర్ చేస్తూ సరైన విలువ నిర్ణయించడం ఇబ్బందిగా మారింది.
(02:40) ఇక రెండోది విభజన సమస్య. ఒక కోడి విలువ 10 kgల బియ్యంతో సమానం అనుకుందాం. కానీ మీకు 5 kgల బియ్యం మాత్రమే కావాలి. ఇప్పుడు ఏం చేయాలి కోడిని సగానికి కట్ చేసి ఇవ్వలేరు కదా ఇలా విభజన సమస్య తలెత్తింది. ఇక మూడో ప్రాబ్లం స్టోర్ చేసుకోవడం. ఒక రైతు నెలల పాటు కష్టపడి టమాటాలు పండిస్తే వాటిని కొన్ని రోజుల కంటే ఎక్కువ కాలం దాచలేకపోతున్నాడు.
(03:01) నెలల కష్టం రోజుల్లోనే మురిగిపోతుంది. నువ్వు వాడుకున్న వాడుకోకపోయినా ఇలాంటి ఇబ్బందుల వల్ల ప్రజల మధ్య ఇచ్చి పుచ్చుకోవడంలో తీవ్రమైన సమస్యలు మొదలయ్యాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కువైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజల మధ్య ఒక ఇచ్చి పుచ్చుకునే వారది అవసరమైంది. అది ఎలా ఉండాలంటే మనుషులందరూ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్ళిపోయేలా ఉండాలి.
(03:22) ఇంకా ఎంత కాలమైనా పాడవ్వకుండా ఉండాలి. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎన్నెన్నో వస్తువులను టెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల్లో వింతవింత వస్తువులను డబ్బుగా వాడటం మొదలు పెట్టారు. చైనా ఆఫ్రికాతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్రపు గవ్వలను చాలా కాలం పాటు కరెన్సీగా వాడారు. అవి చిన్నగా ఉంటాయి లెక్కించడానికి ఈజీగా ఉంటాయి.
(03:41) అమెరికాలోని కొన్ని కాలనీలో పొగాకు ఆకులను కూడా డబ్బుగా ఉపయోగించారు. ఈ డబ్బు వినియోగానికి సంబంధించి మానవ చరిత్రలోని అత్యంత విచిత్రమైన వాడకం పసిఫిక్ మహాసముద్రంలోని యాప్ అనే ఒక చిన్న ద్వీపంలో జరిగింది. అక్కడి ప్రజలు పెద్ద పెద్ద సున్నపు రాళ్లను డబ్బుగా వాడేవారు. వాటినే రైస్ స్టోన్స్ అని పిలిచేవారు. ఇవి ఎంత ఎత్తు ఉండేవి అంటే ఒక్కో రాయి మనిషి కంటే ఐదారు రెట్లు పెద్దగా టన్నుల టన్నుల కొద్ది బరువు ఉండేవి.
(04:06) ఇంత పెద్ద రాళ్లను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే వాటినైతే ఎవడు దొంగతనం చేయలేడు కదా అందుకే భారీ రాళ్లను వాడారు. ఇది సరే మరి వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళేటప్పుడు అంత బరువైన రాళ్ళను ఎలా తీసుకెళ్ళేవారు అనే డౌట్ వస్తుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఒక వ్యక్తి తనకు కావాల్సిన వస్తువు తీసుకొని డబ్బు ఇవ్వాల్సి వచ్చినప్పుడు అంటే ఈ రాయిని ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఊరి పెద్దల సమక్షంలో ఇదిగో ఈ చెట్టు పక్కన ఉన్న పెద్ద రాయి ఉంది కదా ఈ రోజు నుండి అది నాది ఇతని నుంచి నేను తీసుకున్నాను అని ప్రకటించేవారు.
(04:33) అంతే ఆ రాయి మాత్రం ఆనే ఉంటది. దాని యజమాని మాత్రమే మారిపోతాడు. ఇక్కడ ఏం పని చేసింది నమ్మకం మాత్రమే అంతకన్నా ఎక్కువగా అవసరం పనిచేసింది. ఈ రాయిని డబ్బుగా పెట్టుకోకపోతే జనాల మధ్య బిజినెస్ జరగట్లేదు. బిజినెస్ జరగకపోతే అవసరాలు తీరట్లేదు. కాబట్టి ఏదో ఒక గుడ్డి నమ్మకంతో అవసరంతో రాయిని డబ్బుగా వాడారు. రేపు పొద్దున ఎవరో ఒకడికి నేను మళ్ళీ ఈ రాయిని ఇచ్చి సరుకులు తెచ్చుకోగలను అనే నమ్మకంతోనే ఈ వ్యవస్థ ముందుకు సాగింది.
(04:57) ఈ నమ్మకం ఎంత బలంగా ఉండేదో చెప్పడానికి ఒక చిన్న కథ చెప్తారు. ఇది నిజంగానే జరిగిందని కూడా అంటారు. ఈ బిజినెస్ కోసం ఒక పెద్ద రాయిని పడవలో తెస్తుండగా సముద్రంలో పడిపోయిందట. ఆ సముద్రం అడుగు భాగంలో ఉన్న రాయిని కూడా ఆ తర్వాత డబ్బుగా వాడారట. ఆ ద్వీపం నుండి ప్రజలందరూ ఏమనుకున్నారంటే రాయి సముద్రంలో సురక్షితంగానే ఉంది కదా దాన్ని ఎవడు చోరీ చేయలేడు కూడా కేవలం మనకు కనిపించట్లేదు అంతే అని నమ్మి ఆ మునిగిపోయిన రాయిని కూడా తరతరాల పాటు లావాదేవులకు వాడుకున్నారట ఈ రాళ్లను డబ్బుగా వాడిన కథ మనక ఏం చెప్తోంది అంటే డబ్బు అనేది వస్తువులలో లేదు అది మన మైండ్ లో ఉండే ఒక అకౌంట్ బుక్
(05:31) మాత్రమే ఇప్పుడు అసలైన కెమిస్ట్రీ లోకి వెళ్దాం వస్తువులు ఇచ్చి పుచ్చుకునే బార్టర్ సిస్టం ఫెయిల్ అయిపోయింది. దాని స్థానంలో గవ్వలు ఆల్ చిప్పలు వాడారు. వారగా వారగా అవి పగిలిపోతున్నాయి. ఈ పెద్ద పెద్ద రాళ్లుు ఎక్కువ సంఖ్యలో ఉండవు కాబట్టి పెరిగే జనాభాకు సరిపోవట్లేదు. కొందరు పక్షుల ఈకలు వాడారు అవి గాలికి ఎగిరిపోయేవి.
(05:50) మరి కొందరు జంతువుల చర్మాలు పొగాకు వాడారు అవన్నీ కొంత కాలం తర్వాత పాడైపోతున్నాయి. కాబట్టి ఇలాంటి వస్తువులను వదిలేసి మెటల్స్ వైపు చూడడం మొదలుపెట్టారు. సైన్స్ పరంగా చూస్తే కెమిస్ట్రీలోని పీరియాడిక్ టేబుల్ లో మొత్తం 118 మూలకాలు ఉంటాయి. వీటిలో మొదటి రకం వాయువులు అంటే ఆక్సిజన్, నైట్రోజన్, హీలియం లాంటివి. వీటిని మనం పట్టుకోలేం జేబులో దాచుకోలేం కాబట్టి ఈ వస్తువును డబ్బుగా వాడడం కుదరదు.
(06:13) ఇక రెండో రకం లిక్విడ్స్ ఇవి ద్రవ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని మోసుకెళ్ళడం కూడా అంత సులభం కాదు ఇంకా కౌంట్ చేయడం కూడా సమస్యే ఇక మూడో రకం క్షార లోహాలు ఇవి చాలా ప్రమాదకరం వీటికి కొంచెం నీరు తగిలిన పేలిపోతాయి కాబట్టి వీటిని ముట్టుకోలేము. ఆ తర్వాత రేడియో ధార్మిక మూలాలు వీటి దగ్గరికి వెళ్తేనే మనుషులు చచ్చిపోతారు. ఇలా మూలకాలన్నింటిని తీసేయగా మిగిలినవి సాధారణ లోహాలు అవే ఇనుము, రాగి, అల్యూమినియం, సీసం ఇవి మంచి లోహాలే కానీ వీటికి ఒక పెద్ద సమస్య ఉంది.
(06:40) ఇవి భూమిపై ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా దొరుకుతాయి. ఒకవేళ ఇనుమును డబ్బుగా పెడితే ప్రతి ఒక్కడు ఇనుము తవ్వుకొని డబ్బు చేసుకోగలడు. ఇక అరుదైన లోహాలు ప్లాటినం లాంటివి. ఇవి ఉన్నా కూడా వాటిని కరిగించి నాణాలుగా మార్చాలంటే 1700°ల కంటే ఎక్కువ వేడి కావాలి. పురాతన కాలంలో మనుషుల దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఇలా అన్నిటిని ఎలిమినేట్ చేయగా చివరికి మిగిలింది రెండే రెండు లోహాలు అందులో ఒకటి వెండి రెండోది బంగారం ఇందులో వెండి కూడా చాలా కాలం పాటు డబ్బుగా చలామన అయింది కానీ కాలక్రమంలో ఆక్సిడైజ్ అయిపోయి నల్లగా మారిపోద్ది అది ఇలా వెండి కూడా సెకండ్ ప్లేస్ లోకి జారిపోయినప్పుడు
(07:14) నెంబర్ వన్ గా మిగిలిపోయిన ఒకే ఒక్క లోహం బంగారం. దీనికి దాదాపుగా ఏ రసాయనంతోనూ శత్రుత్వం లేదు. వేల సంవత్సరాలు నీటిలో ఉన్న భూమి లోపల ఉన్న తన మెరుపును కోల్పోదు. ఎండకు ఎండిన వానకు తడిసిన తుప్పు పట్టదు. ఇంకా మనుషులు పట్టుకోవచ్చు సులభంగా మోసుకెళ్లొచ్చు ఎన్నటికీ పాడవ్వదు. వీటన్నిటికంటే ముఖ్యంగా భూమిపై చాలా అరుదుగా మాత్రమే దొరుకుతుంది.
(07:36) ఇంకా చూడడానికి అందంగా మెరుస్తుంది కూడా. అన్ని దశలను విజయవంతంగా దాటుకొని ఆఖరి ప్రశ్నలో కూడా నెగ్గి కోటి రూపాయలు గెలుచుకున్న కౌన్ బనేగా కరోడుపతి షో విన్నర్ మాదిరిగా ఈ కెమిస్ట్రీ రేసులో అన్ని లోహాలను వెనక్కి నెట్టేసిన బంగారం నెంబర్ వన్ గా నిలిచింది. మనుషుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇక్కడి వరకు చూస్తే బంగారాన్ని అల్టిమేట్ డబ్బుగా వాడడం మంచిదని ఈ ప్రపంచం గుర్తించింది సరే మరి దీన్ని ఒక కరెన్సీగా వాడటం అధికారికంగా చలామందిలోకి తేవడం ఎవరు మొదలు పెట్టారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? అనేది చూస్తే ప్రాచీన టర్కీ దేశ ప్రాంతంలో లిడియా అనే
(08:09) ఒక సంపన్న సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దంలో అంటే దాదాపు 2700 సంవత్సరాల క్రితం అలియాటెస్ అనే ఒక రాజు పాలించేవాడు. ఆయన ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేశాడు. ఈయనకన్నా ముందే జనం బంగారాన్ని డబ్బుగా వాడేస్తున్నారు. ఇప్పుడు మన వద్ద 10 గ్రాముల బంగారాన్ని తులం అంటాం. నాటి లిడియా సామ్రాజ్యంలో దీన్ని స్టేటర్ అని పిలిచేవారు. దీని బరువు సుమారు 14.
(08:35) 2గములు ఉండేది. ఈ లెక్క సరి చూసుకునేందుకు మనుషులు తమ వద్ద ఉన్న బంగారాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తూకం వేసుకుంటూ వ్యాపారం చేసేవారు. ఇలా అందరి బంగారాన్ని ముక్కలు చేస్తూ బరువు చెక్ చేస్తూ ఉండడం వల్ల ఈ ప్రక్రియ చాలా ఆలస్యమయ్యేది. ఇలాంటి సమయంలో బంగారం మరియు వెండి కలిపిన ఎలక్ట్రం అనే మిశ్రమ లోహాన్ని చిన్న చిన్న బిల్లలుగా చేసి దానిపై తన రాజముద్రను వేసి జనాల్లోకి విడుదల చేశాడు ఆ రాజు అంటే ఆ బిల్ల ఒక స్టేటర్ అన్నమాట ఇక జనాలు ఎవరు బంగారాన్ని ముక్కలు చేసుకుంటూ తూచుకుంటూ ఉండాల్సిన పని లేదు ఇదిగో ఒక స్టేటర్ తీసుకొని నాకు
(09:07) ఒక కేజీ ఉల్లిగడ్డలు ఇవ్వు అని ఈజీ గా అడగొచ్చు ఇలా బిజినెస్ చాలా సులువు అయిపోయింది మరి ఈ బిల్లను ప్రజలు ఎలా నమ్మారు ఇది సరైందేనని అందులో బంగారం స్వచ్ఛమైనదేనని గ్యారెంటీ ఏంటి అంటే రాజ్యాన్ని పాలిస్తున్న రాజే విడుదల చేశాడు కాబట్టి నమ్మకం ఆయన పైన ఉంది. అంటే రాజ్యం పైన ఉంది అంతేగాన ఆ బిల్ల మీద కాదు రేపు పొద్దున పన్ను కట్టాలంటే ఇవే బిల్లలు తీసుకెళ్లి అదే రాజుకి ఇస్తాం కాబట్టి మనం నష్టపోయేది ఏమీ లేదు.
(09:32) ప్రజలందరూ కూడా దీన్నే నమ్ముతూ ఆ బిల్ల చూపించగానే సరుకులు ఇస్తున్నారు కాబట్టి జనం దాన్నే నమ్మారు. అలా మొదలైన ఒక సిస్టం కాలక్రమంలో మానవ అలవాటుగా మారిపోయింది. వందల ఏళ్లు గడిచిపోయాయి. పాత రాజ్యాలు అంతరించాయి ఆధునిక ప్రభుత్వాలు అవతరించాయి. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరంభమైంది. అప్పటివరకు వ్యాపార అవసరాల కోసం జనాలు వ్యాపారులు కిలోల కొద్ది బంగారాన్ని అటు ఇటు మోసుకుంటూ తిరిగేవారు.
(09:55) బరువు అనేది ఒక సమస్య అయితే దొంగలు దాడి చేసి దోచుకెళ్ళడం అనేది మరో తీవ్రమైన సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులో పని చేశయి. బంగారం అంతా తమ దగ్గర స్టోర్ చేసుకొని ఆ బంగారానికి సమానమైన ఒక కాగితపు రసీదులు ఇచ్చేవి. దాన్నే గోల్డ్ స్టాండర్డ్ అనేవారు. మనం ఇప్పుడు వాడుతున్న కరెన్సీ నోట్లు అలా పుట్టినవే. అంటే మార్కెట్లో ఒక వంద రూపాయల నోటు తిరుగుతోంది అంటే దానికి సమానమైన బంగారం బ్యాంకు ఖజానాలో భద్రంగా ఉందన్నమాట.
(10:20) ఆ ధైర్యంతోనే ఆ కాగితం ముక్క చూపించగానే ఎవరైనా సరుకులు ఇచ్చేవారు. ఇక్కడ కూడా ఏం పని చేసింది నమ్మకమే అంటే వ్యవస్థ ఇచ్చే భరోసా ఇక్కడ మన దేశంలోని నోట్ల రద్దును సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ₹1000 రూపాయలు 500 నోట్లను రద్దు చేసేంతవరకు అవి విలువైనవే. ఆ తర్వాత అవి చిత్తు కాగితాలు. టిష్యూ పేపర్ గా కూడా పనికి రానివిగా మారిపోయాయి.
(10:41) మరి ఇక్కడ ఏం పని చేసింది రాజ్యం కల్పించిన నమ్మకం పోయింది. ఇదే నమ్మకం బంగారం విషయంలో కూడా వర్తిస్తుంది. రేపు పొద్దున ప్రపంచ దేశాలన్నీ కలిసి బంగారాన్ని చలామనించి తప్పిస్తున్నామని ప్రకటిస్తే మన ఇంట్లో ఉన్న బంగారం ముద్ద కుంకుడుకాయలు కొట్టుకోవడానికి కూడా పనికి రాదు. ఇలా బంగారానికి గాని కరెన్సీ నోట్లకు గాని విలువ వచ్చింది మనుషుల అవసరం నమ్మకంతోనే.
(11:01) ఈ విధంగా 1971 ఆగస్టు 14 వరకు బంగారం కరెన్సీ నోట్లు ఒక్కటిగా ప్రపంచవ్యాప్తంగా చలామన అయ్యాయి. కానీ 15వ తేదీన నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కొట్టిన దెబ్బకు బంగారానికి కరెన్సీకి మధ్య ఉన్నటువంటి లింక్ పట్టుమని తెగిపోయింది. అది మామూలు దెబ్బ కాదు ఆ దెబ్బకు ప్రపంచంలోని దేశాల కరెన్సీలన్నీ నెత్తుటు మడుగులో పడి గిలగిల గిల కొట్టుకున్నాయి.
(11:27) దీన్నే చరిత్రలో నిక్సన్ షాక్ అంటారు. ఇంతకీ ఆ మహానుభావుడు చేసిన వ్యవహారం ఏంటి? ఒక అమెరికా డాలర్ కు మనం ఇప్పుడు ₹95 ఎందుకు చెల్లించాల్సి వస్తుంది అనే వివరాలను నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సెలవ్

No comments:
Post a Comment