Wednesday, November 11, 2026

కోటి మంది పిల్లల్ని ఎలా కన్నాడు? - తేల్చిన DNA రిపోర్ట్ | Genghis Khan | Out of COVERAGE

కోటి మంది పిల్లల్ని ఎలా కన్నాడు? - తేల్చిన DNA రిపోర్ట్ | Genghis Khan | Out of COVERAGE

Author Name:Out of COVERAGE

Youtube Channel Url:https://www.youtube.com/@outofcoverage999

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZQoqqtz8Zn0





Title: కోటి మంది పిల్లల్ని ఎలా కన్నాడు? - తేల్చిన DNA రిపోర్ట్ | Genghis Khan | Out of COVERAGE

Author Name: Out of COVERAGE

Description: How did a boy who once fought for survival over a tiny fish end up conquering the known world?

In this video, we take a softer, deeper look into the incredible life of Temujin, the boy who would become Genghis Khan. Born into a world of endless tribal warfare, Temujin’s life took a tragic turn when his father was died, and his own clan abandoned his family in the harsh Mongolian wilderness. Facing starvation, extreme weather, and constant danger, it was during these dark years that his unbreakable spirit was forged.

Rather than just a story of conquest, this is a tale of incredible resilience, brilliant diplomacy, and unmatched leadership. Witness how Temujin used friendship, loyalty, and a revolutionary system of meritocracy to unite the fractured nomadic tribes under one flag. In 1206, he was crowned Genghis Khan—the "Universal Ruler"—setting off a journey that would connect the East and the West, open global trade routes, and establish the largest contiguous land empire in human history.

Experience this majestic historical journey brought to life through beautiful visual storytelling!

Disclaimer : Some content are used for Educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

For any Copy right issue please contact me in
bhairakhi627@gmail.com

#genghiskhan
#changezkhan
#history
#outofcoverage

Transcript:
(00:00) బలంగా ప్రచారంలో ఉన్న విషయాలను నమ్మడానికి మనిషి మెదడు ఆసక్తి చూపుతుంది. చంగీస్ ఖాన్ కు సంబంధించి రెండు విషయాల్లో ఇలాంటి ప్రచారం బలంగా ఉంది. అందులో ఒకటి అతను ప్రపంచంలోనే అత్యంత క్రూరుడు. రెండోది భూమ్మీద ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు చంగీస్ ఖాన్ వారసులే. ఇవి రెండు చర్చలో ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ సోషల్ మీడియాలో వీటిపై ఎక్కువగా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది.
(00:21) తక్కువ మంది చెప్పే మాట ఏంటంటే ప్రతి నలుగురిలో ఒకరనేది కరెక్ట్ కాదు గానీ ఈ భూమి మీద చంగిస్ఖాన్ వారసులు కోటి మందికి పైగా ఉన్నారు అంటారు. వీటిలో ఏది వాస్తవం అది ఎలా సాధ్యమైంది? చంగిస్ఖాన్ ఏ స్థాయి క్రూరుడు ఎందుకు అలా మారిపోయాడు. ఇప్పుడు చెప్పబోతున్న వివరాలన్నీ మంగోల్ రాజకుటుంబం స్వయంగా రాసుకున్న అత్యంత ప్రాచీనమైన అధికారిక గ్రంథం ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది మంగోల్స్ లో స్పష్టంగా నమోదు చేయబడ్డాయి.
(00:45) మనంఅందరం గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే ఏ మనిషి పుట్టుకతో దొంగ కాడు నేరస్తుడు కాడు ఇవన్నీ నేర్చుకోవడానికి అమ్మ కడుపులో ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏది ఉండదు. పుట్టిన తర్వాత సమాజమే అన్ని నేర్పిస్తుంది. ఈ మాట గుర్తుపెట్టుకోండి చివరిలో మాట్లాడుకుందాం. చంగిస్ఖాన్ చాప్టర్ స్టార్ట్ చేస్తే అతని పేరు చూడగానే ముస్లిం అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు.
(01:05) కానీ అతను ఆ మతానికి చెందినవాడు కాదు. ఒక గిరిజనుడు. చైనా పక్కన ఉన్న ప్రస్తుత మంగోలియా దేశం ఇది. ప్రస్తుత మంగోలియా ఈశాన్య ప్రాంతంలో కేంతి ప్రావిన్స్ దాదాల్ జిల్లా పరిధిలో ఉన్న డెలిన్ బోల్డాగ అనే కొండ ప్రాంతంలో క్రీస్తు శకం 1162 లో ఇతను జన్మించాడు. ఈ చారిత్రక ప్రాంతాన్ని నేటికి అదే పేరుతో పిలుస్తున్నారు. మంగోలియన్లు దీన్ని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా భావిస్తారు.
(01:28) రష్యా సైబీరియా సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుతం ఇదొక ఫేమస్ హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడ నేటికి సరిగ్గా 864 ఏళ్ల క్రితం చంగీస్ ఖాన్ జన్మించాడు. అతని అసలు పేరు తేముజన్ కియాత్ అనే ఒక చిన్న గిరిజన తెగకు నాయకుడైన యేసురయి దంపతులకు తేజమును పుట్టాడు. తేజమును పుట్టినప్పుడు అతని కుడి చేతిలో ఒక నల్లటి రక్తపు ముద్ద గట్టిగా పట్టుకొని ఉన్నాడని చెప్తారు.
(01:54) ఆ తెగలను మంత్రసానులు అది చూసి ఒక్కసారిగా వనికిపోయారని ఇతను పెద్ద యొక్క ప్రపంచాన్ని ఏలే గొప్ప యోధుడు అవుతాడని జోసన్ చెప్పారట. ఒక సైకాలజీ ఎలా డెవలప్ అవుతుందో మనం ఈ తేముజన్ విషయాన్ని ప్రాక్టికల్ గా చూడొచ్చు. ఏదో ఒక సందర్భంలో మన చిన్నోడు ఇలాంటివాడు పెద్దోడు అలాంటివాడు అంటూనే ఉంటారు ఇంట్లోని పెద్దవాళ్ళు. అలా చిన్నప్పటి నుండి తాను యోధుడు అవుతాడు అనే మాటలు వింటూ పెరుగుతూ వస్తున్నాడు తేజమన్.
(02:15) పైగా తాను గిరిజన తగకు చెందిన నాయకుడి కొడుకు కూడా తేముజనునికి తొమ్మిదేళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాతనే ఒక్కసారిగా మారిపోయింది. అతని తండ్రి యేసుగేయిని వారి పరమ శత్రువులైన తాతార్ తెగవారు చాలా మోసపూరితంగా చంపేశారు. ఈ రెండు తెగల మధ్య గట్టి శత్రుత్వం ఉండేది. ఒకసారి యేసుగేయి మరో ప్రాంతానికి వెళ్ళేస్తుండగా తీవ్రంగా అలిసిపోయాడు. ఆకలి దాహం వేధిస్తోంది.
(02:38) ఇప్పట్లో మాదిరిగా పక్క పక్కనే ఊళ్లు ఉండేవి కావు కదా అడవుల్లో ఎన్నో కిలోమీటర్ల దూరంలో చిన్న చిన్న గూడాలు మాత్రమే ఉండేవి. ఇలాంటి పరిస్థితుల్లో అతను ఇక ముందుకు సాగలేనని గుర్తించి తన గుర్రాన్ని సమీపంలో ఉన్న గూడె వైపు మల్లించాడు. అది ఎవరిదో కాదు, శత్రువులైన తాతారు తెగవారిది. ఈ విషయం యేసుగేయకు ముందే తెలుసు.
(02:56) అయినా ఎందుకు వెళ్ళాడంటే మంగోలియన్ సాంప్రదాయం ప్రకారం అవసరం కోరి వచ్చిన వ్యక్తి పరమ శత్రువు అయినా సరే ఆహారం నీళ్లు ఇచ్చి పంపాలి. గొడవలు ఏవైనా ఉంటే తర్వాత చూసుకోవాలి. అందుకే అక్కడికి వెళ్ళాడు. వారు కూడా అతన్ని స్వాగతించి నీళ్లి ఇచ్చి భోజనం పెట్టి పంపారు. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ గుర్రం ఎక్కిన యేసుగైకి కాస్త దూరం వెళ్ళిన తర్వాత తేడా కనిపించడం మొదలైంది.
(03:15) మీ అనుమానం కరెక్టే అతనికి విషం కలిపిన ఆహారం ఇచ్చారు. తండ్రి మరణంతో తేముజన్ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో అండగా నిలవాల్సిన తమ తెగలోని వారు నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. తండ్రి నాయకత్వాన్ని ఆక్రమించుకొని వారి ఆస్తులను పశువులను కూడా లాక్కొని తేబుజని తల్లిని అతని తమ్ములను తీవ్రమైన చల్లిలో అడవుల్లోకి నెట్టేసి వెళ్ళిపోయారు.
(03:35) తిండి లేక ఆకలితో అడవిలో అవస్థలు పడుతూ ఆ కుటుంబం బతికింది. సమాజం చూపించిన ఈ పరమ క్రూరత్వం తేముజిని మనసులో మొదటిసారిగా బలమైన ముద్ర వేసింది. అప్పటికే తాను చిన్ననాటి నుంచి వింటున్న యోధుడు అనే మాటలు ఉన్నాయి కదా అవి కూడా దీనికి ఆజ్యం పోయడం మొదలు పెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో అడవుల్లో ఉన్నప్పుడే ఒక చిన్న చేప వేట విషయంలో తన సవతి అన్న బెక్తర్ తో గొడవ వచ్చింది.
(03:57) ఈ విషయంలో తన పట్ల క్రూరంగా ప్రవర్తించడంతో అతన్ని బాణంతో కొట్టి చంపేసాడు. అప్పటికి తేముజన్ వయసు 13 ఏళ్ళు ఇలా రోజులు గడుస్తుండగా టైచియుడ్స్ అనే శత్రు తెగవారు తేముజన్ను పట్టుకున్నారు. అతన్ని బంధించి మెడకు భారి చెక్క కంచె వేసి బానిసగా మార్చారు. రోజులు నెలల తరబడి పశువుల కంటే దారుణంగా కొట్టారు. హీనంగా అవమానించారు. ఇలాంటి కంచెను దాటుకొని ఒక రాత్రివేళ అత్యంత చాకచక్యంగా తప్పించుకున్నాడు తేముజన్.
(04:21) ఈ లోకంపై అతనికుఉన్న పగ కక్ష ఇప్పుడు డబుల్ అయ్యాయి. అతను ఎదుగుతున్నాడు అతనితో పాటే ఆలోచనలు కూడా తీవ్రమవుతున్నాయి. ఇలాంటి సమయంలోనే తేముజోని జీవితంలో అతి పెద్ద సంఘటన చోటు చేసుకుంది. అప్పట్లో మంగోలియా ప్రాంతంలో చట్టాలు న్యాయాలు ఏమీ లేవు. ఒక తెగ మరో తెగపై దాడి చేయడం పురుషులను చంపి మహిళలను పిల్లలను బానిసలుగా తీసుకెళ్ళడం సర్వసాధారణం.
(04:43) అలాంటి పరిస్థితుల్లో అతనికి పెళ్లైన కొత్తలో మరో శత్రు తెగ అయిన మెర్కిట్స్ వారు తేముజిని ఇంటిపై దాడి చేసి అతని భార్య బోర్టిని ఎత్తుకెళ్ళిపోయారు. గత గాయాలతో రాటు దేలుతున్న తేజమన్ ఈ దాడిని అవమానాన్ని భరించలేకపోయాడు. నా పౌరుషం మీద నా పరువు మీద చెయ్యి వేశారంటూ రగిలిపోయాడు. తన తెగలోని వారితో ఒక చిన్న సైన్యాన్ని తయారు చేసి శత్రువుల మీదకు విరుచుకు పడ్డాడు.
(05:04) దొరికిన వాడిని దొరికినట్టు ఊచకోత కోసి పారేసాడు. అయితే ఇదంతా జరిగేసరికి కొన్ని నెలలు పట్టింది. శత్రువులను వేసేసి భార్యను చూసుకునేసరికి ఆమె గర్భవతిగా కనిపించింది. బలవంతంగా ఈ దురాగతానికి వడికట్టారని అర్థమైన తేముజిన్ శేషమైనదే లేకుండా శత్రు సంహారం కొనసాగించడమే తన అంతిమ ధ్యేయమని. అప్పటిదాకా మనశశాంతి లేదని తనకు తాను ప్రతిజ్ఞ చేసుకున్నాడు.
(05:25) ఇలాంటి సమయంలో తేముజున్ జీవితంలోకి జముకా వచ్చాడు. అతను తేముజున్ అత్యంత ఆప్తమిత్రుడయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణంతో సమానం. వీరిద్దరూ కలిసి మొత్తం మంగాలియాలని అన్ని తెగలను ఆక్రమించి దానికి సింగిల్ కింగ్ అయిపోవాలని నిర్ణయించుకున్నారు. క్రమంగా తమ సైన్యాన్ని పెంచుకుంటూ శత్రువులపై దాడులు చేస్తూ విస్తరిస్తూ వెళ్తున్నారు.
(05:45) వారు కోరుకున్న దశ రానే వచ్చేసింది. మరి ఇప్పుడు ఆ సింగిల్ కింగ్ ఎవరు కావాలి? ప్రాణమిత్రుడిగా భావించిన జముక ప్రత్యర్థిగా మారిపోయాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఫెర్ ఇన్ లవ్ అండ్ వార్ యుద్ధంలో ఏం చేసినా న్యాయమే అనేది దాని అర్థం. ఇద్దరి మధ్య భీకరపోరు కొనసాగింది. అందులో చివరకు తేముజున్ గెలిచాడు. ఇలా ప్రాణ స్నేహితుడు కూడా ద్రోహం చేయడంతో మనుషులపై ఉన్న ఆఖరి నమ్మకం కూడా చచ్చిపోయిన చివరి క్షణం అది.
(06:09) తేముజున్లో జాలి దయ అనేదే లేని క్రూరత్వం పుట్టిన ఆఖరి క్షణం కూడా అదే. అలా శత్రువు ఎవరైనా సరే ఎవ్వరినైనా నిర్దాక్షిణ్యంగా అంతం చేసే క్రూరత్వం ఇక్కడి నుంచే తేముజన్లో పీక్స్ కు చేరింది. ఒకవైపు మిత్రుడిపై ఉన్న ప్రేమ మరోవైపు అతను చేసిన ద్రోహం ఇవి రెండు కలిసిన తీవ్ర వేదన పీడిస్తున్న వేల కూడా గౌరవంగా అతని ప్రాణాలు తీశాడు.
(06:31) మంగోలు విశ్వాసం ప్రకారం రక్తం నేలపై పడకుండా చంపడం అనేది వారికి ఇచ్చే గౌరవం. అలా మిత్రుడు జాముకాను వెన్నుముక విరిచి చంపేశడు. ఇక ఇప్పుడు అతను ప్రేమ, అభిమానం ఆప్యాయత ఇవన్నీ ఆవిరైపోయిన హృదయం కరుడు కట్టుకుపోయిన మనిషి ఇలాంటి వారిని ఒక లక్ష్యం మాత్రమే బతికిస్తుంది. అది మాత్రమే వారిని ముందుకు నడిపిస్తుంది. అలాంటి తేముజనుని ఏకైక లక్ష్యం మంగోలియన్ సామ్రాజ్య విస్తరణ.
(06:54) దొరికిన వారిని దొరికినట్టు వేసుకుంటూ అందినకాడిక రాజ్యాలను హస్తగతం చేసుకోవడమే అతని ఏకైక లక్ష్యం. జీవితపు అంతిమ లక్ష్యం. ఇలా దూసుకెళ్తున్న తేముజిన్ క్రీస్తు శకం 1206 నాటికి తన శత్రువుల అందరిని ఓడించి మంగోలియాలోని అన్ని గిరిజన తెగలను ఒకే తాటిపైకి తెచ్చి వన్ అండ్ ఓన్లీ కింగ్ అయ్యాడు. ఓనా నది వడ్డున జరిగిన మంగోల్ తెగల మహాసభలో తనను తాను చంగీస్ ఖాన్ అని ప్రకటించుకున్నాడు.
(07:19) దీని అర్థం విశ్వ విజేత అని. సముద్రాల వంటి విశాలమైన రాజ్యాలను పాలించేవాడు అని. అప్పటికి అతని వయసు 44 సంవత్సరాలు. ఇక అప్పటి నుంచి ఎదురొచ్చిన ప్రతి రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ ముందుకు సాగిపోయాడు. ప్రస్తుత వరల్డ్ మ్యాప్ ప్రకారం చూస్తే చైనా, మంగోలియా, కొరియా, రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ తూర్పు ఐరోపాలోని కొన్ని భాగాలు.
(07:43) వీటన్నిటికీ ఒకే ఒక్క రాజుగా చంగిజ్ఖాన్ ఉన్నాడు. అలా ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద విస్తీర్ణం కలిగిన సామ్రాజ్యంగా చంగిస్ఖాన్ స్థాపించిన మంగోల్ మహాసామ్రాజ్యం గుర్తింపు పొందింది. చాలా మంది చంగిస్ఖాను కేవలం క్రూరుడిగా మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. కానీ అతను అద్భుతమైన రాజనీతిని ప్రదర్శించేవాడు. అతని కత్తికి ఎంత పదును ఉండేదో అతని బ్రెయిన్ కూడా అంతే పదునైంది.
(08:07) అతను జయించిన రాజ్యాల్లో ప్రజలకు పూర్తిగా మతస్వేచన ఇచ్చాడు. బౌద్ధులు, ముస్లింలు, క్రైస్తవులు టావోస్ట్ులు అందరినీ గౌరవించాడు. అన్ని మతాల ప్రార్థన స్థలాలకు పన్నుల నుండి మినహాయింపిచ్చాడు. ఇది చాలా తెలివైన వ్యూహం. సామ్రాజ్యంలో అంతర్గత గొడవలు తలెత్తకుండా ఉండడానికి ఆయన వాడిన ట్రిక్ ఇది. ప్రభుత్వంలో పదవులు ఇచ్చేటప్పుడు కూడా కేవలం ప్రతిభ ఉన్నవాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చాడు.
(08:29) ఒకానొక యుద్ధంలో బాణం వేసి తనను చంపబోయిన శత్రు సైనికుడు జేబేను అతని ప్రతిభ కారణంగా తన సైన్యంలో జనరల్ గా నియమించాడు. ఇలా అందరిని సమానంగా చూడటం కూడా వ్యూహంలో భాగమే. అదే సమయంలో తన పేరు చెబితేనే జనం వనికిపోవాలి. అప్పుడు మాత్రమే తప్పులు చేయకుండా ఉంటారు. తనను ఎదిరించాలనే ధైర్యం చేయకుండా ఉంటారు. ఈ విషయం చంగీస్ కు చాలా బాగా తెలుసు. అందుకే తన సామ్రాజ్యంలో యాసా పేరుతో కఠినమైన చట్టాలను తీసుకొచ్చాడు.
(08:54) ఈ చట్టం ప్రకారం దొంగతనం చేసిన నమ్మక ద్రోహం చేసిన వ్యభిచారం చేసిన ఉరిశిక్షే. దీనివల్ల ఆయన కాలంలో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒక కన్య నెత్తిన బంగారు పాత్ర పెట్టుకొని సామ్రాజ్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లొచ్చు అనే సామెత చంగీస్ఖాన్ రాజ్యంలో ఉండేది. ఇక్కడే కీలకమైన విషయం ఒకటి గుర్తు చేసుకోవాలి. తాను ఓడించిన రాజ్యాల్లో అతనికన్నా బలమైనవి కూడా ఉన్నాయి.
(09:16) రెండు మూడు రెట్లు అధిక సైన్యం కలిగినవి కూడా ఉన్నాయి. అయినా ఎలా గెలిచాడంటే ఇక్కడే ఒక సైకలాజికల్ వార్ఫేర్ స్ట్రాటజీని అమలు చేసేవాడు. తన శత్రువులను కేవలం ఓడించడం కాకుండా వారిని విచక్షణ రహితంగా భయం కొలిపేలా నరికి చంపేసేవాడు. వారి తలలను పిరమిడ్ల ఆకారంలో పేర్చేవాడు. ఈ వార్త ఇతర రాజ్యాలకు పాకిపోయి చంగీస్ దండయాత్రకు వస్తున్నాడంటేనే వనికిపోయి లొంగిపోయేవారు.
(09:37) తన తండ్రిని విషమించి చంపిన తాతార్ తెగపై చంగీస్ ఖాన్ పగతీర్చుకున్న విధానం అత్యంత భయంకరమైంది. ఆ తెగను ఓడించిన తర్వాత బందీలైన పురుషులందరినీ ఒకచోట నిలబెట్టాడు. మంగోల్ సైన్యానికి చెందిన ఒక పెద్ద రథం చక్రాన్ని తీసుకొచ్చి వారి పక్కన పెట్టాడు. ఆ చక్రం కంటే ఎత్తు ఎక్కువగా ఉన్న ప్రతి ఒక్క మగాడిని అక్కడికక్కడి తలలు నరికేసాడు. చిన్న పిల్లల్ని మాత్రమే వదిలేసి మిగతా వంశాన్ని మొత్తం నామరూపాలు లేకుండా తుడిచేశడు.
(10:02) పర్షియాకు చెందిన ఒక గవర్నర్ మంగోల్ రాయబారులను చంపేస్తే ఆ గవర్నర్ కళ్ళు చెవుల్లో కరిగించిన వెండిని పోసి చంపాడు. అలాగే రష్యా రాజులను ఓడించినప్పుడు వారి రక్తం భూమిపై పడకుండా చంపాలనే కోరిక కోసం ఆ రాజులందరినీ నేలపై పడుకోబెట్టి వారిపై పెద్ద చెక్క బల్లలు పరిచాడు. ఆ బల్లల పైన చంగిస్ ఖాన్ సైన్యం విజయోత్సవ విందు చేసుకుంటూ డాన్స్ చేశారు. అలా కింద ఉన్న రాజులు ఊపిరాడక నలిగిపోయి ప్రాణాలు విడిచారు.
(10:25) ఇలా మహా సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటూ పోతున్న చంగీస్ తాను ఓడించిన రాజ్యాల యువరాణులను కూడా వివాహం చేసుకుంటూ పోయాడు. అలా చంగీస్ ఖాన్కు వందల మంది భార్యలు ఉన్నారని చెప్తారు. అయితే మొదటి భార్య అయిన బోర్టేకి మాత్రమే [గొంతు సవరించుకోవడం] ప్రధాన రాణి హోదా ఉండేది. ఆమె పిల్లలకే సామ్రాజ్యంపై హక్కు ఉండేది. బోటే ద్వారా అతనికి నలుగురు కొడుకులు ఐదుగురు కూతులు జన్మించారు.
(10:46) మిగిలిన వందలాది భార్యల ద్వారా అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు అనేదానికి స్పష్టమైన సంఖ్య లేదు. ఈ భూమి మీద ప్రతి నలుగురిలో ఒకరు చంగిస్ఖాన్ వారసులు అనే మాట ఇక్కడి నుంచే పుట్టింది. సైంటిస్టులు ఈ విషయం అవాస్తవం తెలిచారు. కానీ అంతకంటే పెద్ద షాకింగ్ నిజాన్ని కూడా బయట పెట్టారు. 2003 లో కొంతమంది అంతర్జాతీయ సైంటిస్టులు ఏషియా ఖండం అంతట అంటే చెంగిస్ ఖాన్ అతని వారసులు పాలించిన ప్రాంతంలో పురుషుల dఎన్ఏ శాంపిల్స్ సేకరించారు. ఒక భార్య రీసెర్చ్ చేశారు.
(11:10) పురుషుడిలో xవై క్రోమోసోమ్స్ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అందులో x ట్రాన్స్ఫర్ అయితే అమ్మాయి పుడుతుంది. y క్రోమోజోమ్ ట్రాన్స్ఫర్ అయితే అబ్బాయి పుడతాడు. ఇలా థండర్ నుంచి కొడుకుకు మాత్రమే బదిలీ అయ్యే వై క్రోమోసోమును వారు పరిశీలించారు. ఈ రీసెర్చ్ ఫలితాలు మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పాయి. మంగోలియా సామ్రాజ్యం విస్తరించిన ప్రాంతాల్లోని దాదాపు 8 శాతం మంది పురుషుల్లో ఒకే రకమైన జెనటిక్ మార్కర్ కనిపించింది.
(11:34) దీన్ని ప్రపంచ జనాభా మొత్తానికి లెక్క కడితే ప్రతి 200 మంది పురుషుల్లో ఒకరు ఈ DNAన్ఏ ను కలిగి ఉన్నారని తేలింది. ఈ లెక్కన ప్రపంచ వ్యాప్తంగా ఈ జెనటిక్ మార్కర్ కలిగినవారు దాదాపు ఒక కోటి 60 లక్షల మంది ఉన్నారని తేల్చారు. ఆ DNAన్ఏ ఎవరిదో కాదు చంగిజ్ ఖాన్ వంశానిది. అంటే దీని ప్రకారం ఈ భూమి మీద చెంగిస్కాన్ యొక్క వారసులు ఏకంగాకోటి 60 లక్షల మంది ఉన్నారని ఈ DNAన్ఏ రిపోర్ట్ అఫీషియల్ గా ఘంటాపదంగా చెప్తోంది. ఇక్కడే మనక ఒక డౌట్ రావచ్చు.
(12:00) ఎంత వందల మంది భార్యలు ఉంటే మాత్రం ఒక్కడే ఎంతమంది పిల్లలను ఎలా కనగలడు అనిపిస్తుంది. అయితే కేవలం చెంగిస్ ఖాన్ మాత్రమే కాదు అతని పిల్లలు మనవల్ల కూడా విశాలమైన సామ్రాజ్యాన్ని సుదీర్ఘ కాలం పాలించారు. వారికి కూడా పదుల సంఖ్యలో భార్యలు ఉన్నారు. చంగీస్ ఖాన్ పెద్ద కుమారుడికి ఏకంగా 40 మంది భార్యలు ఉండేవారని చెప్తారు.
(12:20) ఇంకా అనాధికారికంగా ఉండే వారికి లెక్క లేదు. ఇలా అతని కుమారులు మనవాళ్ళు కూడా బహుభార్యత్వం సుదీర్ఘ కాలం కొనసాగించారు. వారి సంతానమే కాలక్రమంలో విస్తరిస్తూ ఇంత భారీ వారసత్వానికి కారణమైందని చెప్తారు. ఎలా చూసుకున్నా కూడా ఒకే వ్యక్తికి ఇన్ని కోట్ల మంది వారసులు ఉండడం అనేది మానవ చరిత్రలోనే ఒక రికార్డు. ఈ పరిశోధన 2003 లో జరిగింది.
(12:41) అంటే ఇప్పటికి 23 ఏళ్లు గడిచిపోయాయి. ఈ గ్యాప్ లో ఆ సంతానం నుంచి మరెంత మంది పిల్లలు వచ్చారో తెలీదు. అయితే ఆ తర్వాత 2006 సమీపంలో మరో పరిశోధన చేశారు. కజకిస్తాన్ లోని మంగోల్ పాలకుల సమాధుల నుండి సేకరించిన ప్రాచీన డిఎన్ఏ అని సైంటిస్టులు సరికొత్తగా విశ్లేషించారు. ఈ రీసెర్చ్ ప్రకారం చంగిస్ఖాన్ డిఏ గా చెబుతున్న ఆ వై క్రోమోజోమ్ మార్కర్ చంగిస్ఖాన్ కంటే ముందే మంగోలియన్లలో ఉందని తెలిసింది.
(13:04) ఇలా చూసుకున్నా కూడా అది చంగీస్ వంశానికి చెందిన DNAన్ఏ గానే భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా తన సంతానాన్ని కోట్ల విత్తనాలుగా ఈ భూమి మీద చల్లిన చంగీస్ ప్రపంచంలోని అతి పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి విస్తరించిన చంగీస్ భారతదేశాన్ని మాత్రం ఎందుకు వదిలేసాడు అనేది ఆసక్తికరమైన విషయం. నిజానికి అతని సైన్యం మన సింధూ నది బార్డర్ వరకు వచ్చింది.
(13:24) అయితే అప్పటి ఢిల్లీ సుల్తాన్ ఇల్టుట్మిష్ తెలివిగా వ్యవహరించడంతో చంగీస్ భారతదేశంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల ప్రాంతాలన్నీ కలిసి క్వారెస్మియన్ సామ్రాజ్యంగా ఉండేవి అప్పుడు. ఈ రాజ్యంపై చంగీస్ దండయాత్ర చేసి తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. ఆ సమయంలో ఆ రాజ్యపు యువరాజు జలాల్ ఊదును తరుముకుంటూ భారతదేశం సరిహద్దు వరకు వచ్చాడు.
(13:47) జలాల్ భారత్లో ఆశ్రయం కోరాడు కానీ చంగీస్ గురించి తెలిసిన నాటి ఢిల్లీ సుల్తానులు అతనికి ఆశ్రయం ఇవ్వలేదు. దాంతో చంగీస్ ఇండియాలోకి అడుగు పెట్టాల్సిన అవసరం రాలేదు అని చెప్తారు. అదే సమయంలో ఇండియాలోని వేడి ఉక్కపోత మంగోలియన్ గుర్రాలకు సరిపడదని వెనక్కు తగ్గాడనే అభిప్రాయం కూడా మరొకటి ఉంది. మొత్తంగా తన జీవిత కాలంలో ప్రపంచంలోనే భారీ సామ్రాజ్యాన్ని స్థాపించిన చంగీస్ క్రీస్తు శకం 1227 లో వెస్టర్న్ జియా పై దండెత్తాడు.
(14:12) వెస్టర్న్ జియా అంటే నేటి చైనాలోనే ఒక భాగం. ఆ సమయంలోనే ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి చెంగి వయసు 65 ఏళ్ళు అయితే ఎలా చనిపోయాడు అనేది మాత్రం పెద్ద మిస్టరీ గానే మిగిలిపోయింది. అతని మరణానికి సంబంధించి నాలుగు కథలు ప్రచారంలో ఉన్నాయి. మంగోలి పవిత్ర గ్రంథం ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ది మంగోల్స్ ప్రకారం ఈ దండయాత్రకు కొంత కాలం ముందు చంగిస్ఖాన్ అడవి గుర్రాలను వేటాడుతుండగా అతను ప్రయాణిస్తున్న గుర్రం బెదిరిపోవడంతో గుర్రం నుంచి కింద పడిపోయాడు.
(14:38) ఈ ఘటనలో అంతర్గత గాయాలై ఆరోగ్యం క్షీణించి కొన్ని నెలల తర్వాత వెస్టర్న్ జియా ముట్టెడు సమయంలోనే కన్ను మూసాడని చెప్తారు. ఇది కాకుండా వెస్టర్న్ జియాని ఓడించిన తర్వాత అక్కడ యువరాణిని బలవంతంగా పెళ్లి చేసుకోబోయాడని ఆమె తన దుస్తుల్లో దాచుకున్న కత్తితో దాడి చేసిందని చెప్తారు. మరో ప్రచారంలో శత్రువుల విషపూరిత బాణం తగిలిందని అంటారు. మరి కొందరు మాత్రం అప్పట్లో విజృంభించిన ప్లేగ్ వ్యాధి కారణంగా చనిపోయాడని భావిస్తారు.
(15:01) అయితే ఎలా చనిపోయాడు అనేది ఒకఎత్త అయితే తాను మరణించే సమయంలో తన సైనికులకు ఇచ్చిన ఆదేశాలు మాత్రం ఇప్పటికీ సంచలనమే. తన సమాధి ఎవ్వరికీ దొరక్కుండా తనను పూర్చి పెట్టాలని ఆదేశించాడట. తన నమ్మకస్తుల నుంచి ఈ మేరకు మాట తీసుకున్నాడట. అలా వారు ఇచ్చిన మాట మేరకు చంగీజ్ ను ఎవ్వరు గుర్తించలేని ప్రాంతంలో కరణం చేశారని చెప్తారు. ఈ క్రమంలో చంగీజ్ మృతదేహాన్ని మోసుకెళ్తున్న సమయంలో దారిలో కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేసుకుంటూ వెళ్లారని చెప్తారు.
(15:26) అంతేకాదు సైన్యం అత్యంత రహస్య ప్రదేశంలో బాడీని పూడ్చిన తర్వాత ఆనవాలు లేకుండా ఉండేందుకు వందలాది గుర్రాలతో నేలను అతన్ని పూడ్చిన ప్రదేశాన్ని తొక్కించారట. ఆ తర్వాత సైన్యం తిరుగు ప్రయాణం కాగా మరో సైన్యం బెటాలిని మధ్యలో అడ్డగించి వారందరిని చంపేసిందని కూడా ప్రచారంలో ఉంది. అలా చెంగిస్ సమాధి గురించి తెలిసిన ఏ ఒక్కరిని ప్రాణాలతో లేకుండా చేశారనే ప్రచారం ఉంది.
(15:47) అయితే ఈ ప్రచారానికి సరైన ఆధారాలు లేవు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. అదే తన సమాధిని ఎవ్వరు గుర్తించలేని ప్రాంతంలో పాతి పెట్టాలని చెప్పడం. ఇది ఎందుకు వాస్తవంగా అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు ఆ సమాధిని ఎవ్వరు గుర్తించలేకపోయారు కాబట్టి దీన్ని బట్టి అతని సైన్యం చాలా జాగ్రత్తలు తీసుకొని రహస్య ప్రదేశంలో అతని శవాన్ని పూర్చి పెట్టిందని మనం అర్థం చేసుకోవచ్చు.
(16:07) మరి ఇంతకీ అతని శవాన్ని ఎక్కడ పూర్చిపెట్టి ఉండొచ్చు అంటే చాలా మంది నమ్మే విషయం ఒకటి ఉంది. అతని శవాన్ని మూర్ఖాన్ కుల్దున్ పర్వత ప్రాంతాల్లో పూడ్చి ఉంటారని అంటారు. ఈ పర్వతాలు ప్రస్తుతం మంగోలియా దేశపు ఈశాన్య భాగంలో ఉన్నాయి. చిన్నతనంలో శత్రువుల నుంచి తప్పించుకొని ఈ కొండలోనే దాక్కొని చంగిస్ ప్రాణాలు కాపాడుకున్నాడని చెప్తారు.
(16:26) దాంతో ఆ పర్వతాన్ని దైవంగా భావించి పూజించేవాడని ఒకానొక సందర్భంలో నేను చనిపోయాక నన్ను ఇక్కడే పాతి పెట్టండి అని తన అనుచరులతో అన్నట్లు మంగోలు ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఈ పర్వత శిఖరంపై మనుషులు నిర్మించినట్లుగా ఉన్న ఒక భారీ రాతి స్తూపం లాంటి నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు ఆ మధ్య గుర్తించారు. అయితే ఆ పర్వతం పట్ల స్థానికులకు ఉన్న సాంస్కృతిక గౌరవం మంగోలియా ప్రభుత్వ నిషేధాల వల్ల అక్కడ తవ్వకాలు జరపడానికి వీలు లేకుండా పోయింది.
(16:53) ఆ విధంగా చంగిస్ ఖాన్ సమాధి ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియకుండా పోయింది. కాబట్టి అతని ఒరిజినల్ DNAన్ఏ శాంపిల్ అనేది ఇప్పటివరకు దొరకలేదు. అది దొరికే వరకు ప్రస్తుత DNAన్ఏ పరిశోధనలు చెబుతున్న ఆ 1.6 కోట్ల మంది నిజంగా అతని వారసులేనా లేదంటే ఆ కాలపు వేరే మంగోల్ వీరుడి వారసులా అనేది ఖచ్చితంగా చెప్పలేం. ఇదిఇలా ఉంటే చంగిస్ఖాన్ దండయాత్రల వల్ల ఎంతమంది చనిపోయారో తెలుసా ఒక అంచన ప్రకారం దాదాపు నాలుగు కోట్ల మంది వరకు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.
(17:22) అంటే నాటి ప్రపంచ జనాభాలో ఏకంగా 10 శాతం దీనివల్ల ప్రకృతికి చాలా మేలు కలిగిందని పరిశోధకులు చెప్తారు. సాగుభూములన్నీ మళ్ళీ దట్టమైన అడవులుగా మారిపోయాయి. ఫలితంగా వాతావరణం నుండి దాదాపు 700 మిలియన్ టన్నల కార్బన్ తగ్గిపోయిందని అంచన వేశారు. కార్నగి ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ వారు చేసిన రీసెర్చ్ ప్రకారం ఇది నిరూపితమైంది. అందుకే సైంటిస్టులు అతన్ని హిస్టరీస్ గ్రీనెస్ట్ కాంకరర్ అని ఫన్నీగా పిలుస్తారు కూడా అలాంటి చెంగిస్ ను ప్రపంచం క్రూరిడ్డిగా చూడొచ్చు.
(17:48) కానీ మంగోలియా దేశానికి అతను ఒక నేషనల్ హీరో. అక్కడి కరెన్సీ నోట్లపై ఎయిర్పోర్ట్లపై చెంగిస్కాన్ బొమ్మే ఉంటుంది ఇప్పటికీ. పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే ఒక సాధారణ గిరిజనుడిగా మొదలై కోట్లాది మంది నరాల్లో తన రక్తం ప్రవహించేలా చేయడం అనేది చంగిస్ఖాన్ సృష్టించిన ఒక అసాధారణ హిస్టరీ. చివర్లో మాట్లాడుకుందాం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను గుర్తుందా ఏ మనిషి పుట్టుకతో దొంగ కాడు నేరస్తుడు కూడా కాడు.
(18:12) ఇవన్నీ నేర్చుకోవడానికి అమ్మ కడుపులో ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏమి ఉండదు. సమాజమే అన్ని నేర్పిస్తుంది. అందుకే మనం ఎలాంటి సమాజాన్ని నిర్మిస్తున్నాం అనేది కీలకం. మనం ఇప్పుడు వేసుకునే చెప్పుల్లోనే రాబోయే తరం కాళ్ళు పెడుతుంది. మన బాటలోనే నడిచి ముందుకు సాగుతుంది. ఈ విషయాన్ని ఎవ్వరు మర్చిపోవద్దు. ఇదే ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సెలవు

No comments:

Post a Comment