Sunday, February 2, 2020

సూర్య నమస్కారాలు

🌟🌞సూర్య నమస్కారాలు🌞🌟

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :-

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...

ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

మరెన్నో లాభాలు :-

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

"సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి.

వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.

ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి

యోగి వేమన

యోగి వేమన..చాలా మందికి వేమన గురించి..తెలియదు

సినిమా వాళ్ళు ఎంత చూపించారో అంతే తెలుసు.....కానీ వాస్తవం వేరు..

ఈయన అసలు పెరు ""బెదమ కోమటి చిన వేమారెడ్డి""

ఈయన అన్న పేరు ""బెదమ కోమటి పెద వేమారెడ్డి""

అప్పటి కడప..కర్నూలు..అనంతపురం కలిపి ఒకే రాజ్యంగా ఉండేది...

దానికి సామంత రాజు బెదమకోమటి పెదవేమారెడ్డి గారు.

అతని మంత్రి ""తురగారాముడు.

తురగారాముడు ఎలాగైనా అన్నదమ్ములనిద్దరినీ చంపి

తాను రాజు కావాలని ఎన్నో కుయుక్తులు పన్నుతూ ఉంటాడు...

ఇప్పుడు మనం చినవేమారెడ్డిని వేమన అని పిలిచుకుంటున్నాము....

ఇతడు మహా ధైర్యవంతుడు...

పేరుకు అన్నగారు రాజు..

కానీ మొత్తం రాజ్యం వేమన్న ధైర్యసాహసాలు కనుసన్నులో ఉంటుంది....

అతని ధైర్యానికి ఉదాహరణ...



ఒక మదపుటెద్దు ఊరి మీద పడి అందరినీ కుమ్ముతూ హడలెత్తిస్తూ ఉంటుంది...

అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతూ వుంటారు...

ఎద్దుకు మదమెక్కితే దాన్ని ఆపడం ఏ పహిల్వాన్ చేత కూడా కాదు....

అటుగా వస్తున్న వేమన మీదికి వెళుతుంది....

అది ముందరికి రాగానే ఒక్కసారిగా గట్టిగా దాని కళ్ళలోకి చూసి ""ఏయ్"'అని



గద్ధిస్తాడు...

ఆ శబ్దం ఆ ఎద్దు చెవులనుంచి దూరి ఊరి మొత్తం ప్రతిధ్వనిస్తుంది.....

దాని కళ్ళకు వేమన మహా సింహం లాగా కనిపిస్తాడు.... హడలెత్తి తోకముడుచుకొని



పారిపోతుంది....దాన్ని ప్రత్యక్షంగా చూసిన తురగారాముడు, ముందు

వేమన్నను మట్టు బెడితే గానీ తన పని సులువు కాదని,,,

వేమన ఉన్నంత వరకూ తానేమీ చేయలేనని తెలుసుకుంటాడు...

తన దృష్టిను వేమన మీద ఉంచుతాడు..వేమనకు భోగగత్తెల ( ,వేశ్యల ) సాంగత్య ఎక్కువ..ఎక్కడైనా కొత్తగా భోగసానిగా వృత్తిలోకి వచ్చింది అంటే ఈయన ముందు వెళ్ళేవాడు....వేమనకు ""విశ్వద """అనే ఒక ప్రేయసి కూడా ఉంటుంది...

వేమన అంటే ఆమెకు చాలా ఇష్టం....

ఎన్నోసార్లు తన రాజ్యం గురించి,,,,తాను నిర్వర్థించాల్సిన ధర్మం గురించి అనేక సార్లు

హెచ్చరిస్తుంది..కానీ వేమన అవేమీ పట్టించుకునేవాడు కాదు....

మీరు శరీర అందం వెనుక పరిగెడుతున్నారు....కానీ అది శాశ్వతము కాదు....

అందం వెనుక అందవికారం కూడా దాగి ఉంటుంది...

యవ్వనంలో కనపడినట్లు ఈ శరీరం ముసలితనంలో తన ప్రాభవం కోల్పోతుంది.

ఏదైతే ఇప్పుడుండి ఇక మీదట ఉండదో దాని కొరకు మీరు పరిగెడుతున్నారు....

మీరు కాస్త ఆగి యోచించాలని హెచ్చరిస్తుంది....

కానీ వేమన పట్టించుకునే వాడు కాదు....

తురగారాముడి కుయుక్తులను కూడా గుర్తు చేస్తుంది...కానీ ఫలితం ఉండదు....

అప్పుడే దసరా తిరునాళ్ళు మొదలవుతాయి....

వెంపల్లి సంబరాలకు ముస్తాబవుతుంది....

ఆ తిరునాళ్ళలో మహా అందెగత్తె ""మాంచాల నాగులు భోగమాటను ప్రారంభిస్తుంది....

ఆమె గురించి ఆ నోటా,,,ఈ నోటా,,,వేమనకు చేరుతుంది...

వేమన ఒక సారి వెంపల్లెకు వెళ్లి చూస్తాడు.....

ఆమె అందానికి దాసుడై పోతాడు....

ఇక తన మకాం పూర్తీగా వెంపల్లె నాగుల యింటికి మారుస్తాడు....

ఓ ప్రేయసీ కంటే ఎక్కువగా అభిమానిస్తాడు.

నెలలు గడుస్తాయి.....

నెలల కొద్దీ ఇంటికి రాకపోయే సరికి అన్నకు వదినకు సందేహం కలుగుతుంది....

వేమన నాగుల అనే వేశ్య ఇంట్లో పరిమితమయ్యాడని తెలుసుకుంటారు..

డబ్బులన్నీ ఇలా ఆమెకు దారపొయ్యడం మంచిది కాదని,,,

రాజ్యం శిస్తులన్నీ వాడుకోవడం ధర్మ౦ కాదని..

రాజ్య పరిపాలన దెబ్బతింటుందని వదిన వారిస్తుంది....



""విశ్వద" కు వేమన్న భవిష్యత్తు కళ్లముందర కనిపిస్తుంది..

అతని భవిష్యత్తు అంధకారమై పోతుందని గ్రహించి...

సత్యం చెప్పే తీరాలని నిర్ణయించి వేమన్నను పిలిచి..

తొందరలోనే మీరు మరణించబోతున్నారు...

శరీరానికి నెలలు కాదు రోజులు మాత్రమే ఉన్నాయి...

ఈ శరీరం దేనికోసం తీసుకున్నావో దానిని ఇక మీరు నిర్వర్థించలేరు..

ఇప్పటికైనా మేల్కొనండి....

జీవితం యొక్క లక్ష్యాన్ని తెలుసుకోండి...

ఆ మార్గంలోకి వెళ్లే ప్రయత్నం చెయ్యండి అంటుంది...



వేమన పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు...

వేమన ""నాగుల"" కి పచ్చి బానిస అయ్యాడని గ్రహించిన

తురగారాముడు వెళ్లి నాగులను లోబర్చుకుంటాడు....

కొంత మంది సైన్యాన్ని కూడా లోబర్చుకుని ఉంటాడు...

సైన్యంతో నాగుల దగ్గరకు వెళ్లి ఆమె చేతికి విషం ఇచ్చి దాన్ని వేమన మీదికి ప్రయోగం



చేయవలసిందిగా చెబుతాడు....

దానికి గానూ ఆమెకు డబ్బు,,,

జాగీరు ఎరగా చూపుతాడు....

చెయ్యకపోతే తానే వేమన్నను చంపి ఆ అభియోగం నీమీదికి తీసుకొస్తానని



బెదిరిస్తాడు....చేసేది లేక ఆమె ఒప్పుకుంటుంది....



ఒక అమావాస్య రోజు పాయసం చేసి భోగలాలసలో వున్నప్పుడు తాగమని ఇస్తుంది....

వేమన తన ప్రేయసి ఎంతో ప్రేమతో చేసిందని తాగుతాడు....

అంతే పూర్తీగా దాదాపు శరీరాన్ని వదిలేసినంత కోమాలోకి వెళ్ళిపోతాడు..

నాగులు తురగారామునికి పని పూర్తీ అయిందని కబురు బెడుతుంది...

తురగారాముడు తన సైన్యాన్ని పురమాయించి శవాన్ని దట్టమైన కారడవులలో



వేయించేస్తాడు....

ఆ అడవులలో"" అభిరామ"" అనే వైద్యుడు ఆకుల రసాలతో ఇనుమును బంగారంగా



చేసే విద్యను నేర్చుకుంటూ ఉంటాడు....

ఒక రోజు ఆకుల కోసం వెళ్ళినప్పుడు వేమన్న శవాన్ని చూస్తాడు....

అతని నాడిని చూసి ఎక్కడో ఒక మూల ప్రాణం ఉందని గ్రహించి అతన్ని తీసుకెళ్లి తన



వైద్యం తో బ్రతికిస్తాడు....మెలకువ వచ్చిన తర్వాత వేమన ఏమీ మాట్లాడేవాడు కాదు....మౌనంగా కూర్చునేవాడు...ఏ వివరాలూ ఎంత అడిగినా చెప్పేవాడు కాదు.....

మహా మౌనంగా ఉండేవాడు...తాను చేసే వైద్య వృత్తిలో కాస్త మక్కువ చూపేవాడు....

విశ్వద చెప్పిన సత్యం,,,,నాగులు,,,తురగారాముడు చేసిన మోసం కళ్ళముందు



కదిలేవి....తానే యామరపాటుగా ఉన్నానని తెలుసుకునే వాడు..

ఆకులు అలముల కోసం అప్పుడదప్పుడూ అడవులకెళ్లి తెచ్చేవాడు....

అభిరాముడు..తన గురువుగారైన విశ్వకర్మ యోగి ని

కలిసి జ్ఞానాన్ని తెలిసుకుంటూ ఉండేవాడు....ఒక రోజు విశ్వకర్మయోగి తాను శరీరం వదిలేస్తున్నానని,,,తాను సంపాదించిన జ్ఞానాన్ని తనకు వాహకత్వం ఇస్తానని

రేపు రావలసిందిగా చెబుతాడు...అలాగే అని చెప్పి అభిరాముడు వెళ్ళిపోతాడు...

మరుసటి రోజు అభిరాముడు ఆకుల కోసమని వేమనతో చెప్పి బయలుదేరుతాడు...

దారిమధ్యలో ఒక పులి కనబడడంతో పరుగులు పెడతాడు.... దాంతో ఆ అడవులలో దారి తప్పిపోతాడు......

అభిరాముడు ఎంతకూ ఆకులు తీసుకురాలేదని గ్రహించి చీకటి పడుతుండడంతో



వేమన బయలుదేరుతాడు....వేమన సరాసరి విశ్వకర్మయోగి ఉన్న గుహలోకి వెళతాడు.....విశ్వకర్మయోగి చెందవలసిన వాడు,,,,రావలసిన వాడు రానే వచ్చాడు ,,

అని వేమన్నను పిలిచి ధ్యాన,,,జ్ఞాన,విద్యను నేర్పించి,, మూడొకన్నును ఉద్దేపనం చెందించి వాహకత్వం ఇచ్చి శరీరం వదిలేస్తాడు.... ఆ క్షణమే వేమనకు జగత్తు సత్యం అర్థమైపోతుంది....అంతలోనే అభిరాముడు అక్కడికి చేరుకుంటాడు....

తాను పొందవలసిన దాన్ని పొందలేక పోయానని బోరున విలపిస్తాడు....

వేమన దానికి అభిరామా....దుఃఖిించకు ,,భాధ పడకు,,,

నా ప్రేయసి నా కళ్ళు ఎన్నోసార్లు తెరిపించినప్పటికీ నేను పెడచెవిన పెట్టాను....

ఈ రోజు నువ్వు పొందవలసిన దాన్ని దైవం ఇచ్చలో భాగంగా నేను పొందడం జరిగింది...

విశ్వద ...అభిరామా ఇద్దరూ చెబుతూ వుంటే వేమన్న వింటున్నట్టుగా ప్రపంచానికి తెలియపరుస్తాను. అని చెబుతాడు...

విశ్వద ..అభిరామా ఇద్దరూ కలిసి వినరా వేమా...అని నాకు భోధిస్తున్నట్టుగా,,,చెబుతున్నట్టుగా ప్రపంచానికి చెబుతాను అని చెబుతాడు...

అందుకే..విశ్వదాభిరామా వినురావేమా..!

ఇది నాకిష్టమైన పద్యం.💐



కుండ కుంభమన్నా,,కొండ పర్వతమన్నా,,

నుప్పు లవనమన్నా,,నొకటి కాదే

భాషలిట్టే వేరు పరతత్వం ఒక్కటే

విశ్వదాభి రామ వినురవేమ....!



కుండ అన్నా,,,

కుంభమన్నా,,,

ఉప్పు అన్నా,,,

లవణ మన్నా,,,

కొండ అన్నా,,,

పర్వతం అన్నా,,,

అంతా ఒక్కటే.....

భాషలే వేరు....

భగవంతుని తత్వం ఒక్కటే... వేమన్న..

భాషలు వేరు కానీ భావం ఒక్కటే...

భాషలు వేరే....కానీ ఉన్నది

ఆ ""ఒక్కటే "".

భగవంతుడు..అని తెలియచెప్పాడు.

లోకా సమస్తా సుఖినోభవంతు..!!💐

💐శ్రీ మాత్రే నమః💐 (వాట్స్ ఆప్ సందేశం నుండి )

Saturday, February 1, 2020

శాకాహర విశిష్టత

🙏శాకాహర విశిష్టత🙏

🌷 మహాత్మా గాంధీ 🌷

▪“గొర్రె ప్రాణం విలువ... మానవుని ప్రాణం కన్నా తక్కువ ఏమీ కాదు.
▪మనిషి శరీరాన్ని పోషించుకోవడానికి గొర్రెను చంపడం ఎప్పటికీ అంగీకరించలేను. జంతువు చాలా నిస్సహాయమైన ప్రాణి. మానవుడి సహాయం పొందడానికి అది అధికారి.
▪అయితే, దానికి సాయం చెయ్యాలంటే మనిషికి ఎంతో యోగ్యత, అధికార విచక్షణ వుండడం అవసరం.”
▪“హింస ద్వారా హింస మాత్రమే పుడుతుంది; అహింసను ఆధారం చేసుకుని ప్రపంచంలోని ఏ క్రూర శక్తినయినా జయించవచ్చు.”
-------------------------------------------------------
🌷 వీరబ్రహ్మేంద్ర స్వామి 🌷

“జీవులను వధించి జీవికి వేసిన జీవ దోషములను జిక్కువడును: జీవ హింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబ!హంస కాళికాంబ!”
--------------------------------------------------------
🌷యోగి వేమన🌷

"పక్షి జాతిని బట్టి పరగ హింసల బెట్టి
కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు వసుధ ఛండాలుడు
విశ్వదాభిరామ వినురవేమ !”
--------------------------------------------------------
🌷జార్జి బెర్నార్డ్‌షా🌷

▪“మాంసాన్ని తినే మనము నడుస్తూ, తిరుగుతూ ఉన్న సమాధులం. వీటిలో మన జిహ్వ చాపల్యం కోసం చంపబడిన జంతువుల శవాలు పూడ్చి పెట్టబడ్డాయి.”
▪“శవాల కుళ్ళు మాంసాన్ని పీక్కుతినే కాకుల వలె మనం మాంసం తింటూ జీవిస్తున్నాం.
▪దీని వల్ల జీవులకు భయంకరమైన బాధ, కష్టం కలుగుతుందనే దాని గురించి మనకు చింత లేదు.మనము పట్టించుకోం. ఎంతటి దౌర్భాగ్యమో..”
-------------------------------------------------------
🌷 ఓషో రజనీష్ 🌷

▪“జంతువులు మన సహోదరులు. మీరు తినడానికి ఒక జంతువును చంపడం అనే ఆలోచనే అసహ్యకరమైనది. ఏ జంతువూ చంప బడకూడదు.
▪భూమి మీద ఏ జంతువు అవసరం వున్నా అది జీవిస్తుంది. అలాగే ఏ జంతువు అవసరం భూమి మీద వుండదో దాన్ని చంపినా చంపకపోయినా భూమి మీద నుండి అది అదృశ్యమై పోతుంది.”
▪“జంతువులు మానవులకు సోదరులు, తోబుట్టువులు.  కారణం వారి నుండే మానవుడు వచ్చాడు. అది మన కుటుంబం. మానవుడిని చంపడమంటే ఎదిగిన జంతువును చంపడం. జంతువును చంపడమంటే ఎదుగుతున్న మానవుడిని చంపడం. రెండూ సమానమే. కారణం ఒక నాటి జంతువులే మనుష్యులుగా పరిణామం చెందుతున్నారు.”
-------------------------------------------------------
🌷 తిరువల్లువర్ 🌷

▪“తన స్వంత మాంసాన్ని క్రొవ్వు పట్టేలా చేసేందుకు ఒక జంతువు మాంసాన్ని తినేవాడు నిజమైన కరుణను ఎలా అభ్యసించగలడు?”
▪“ప్రజలంతా మాంసాన్ని కొనడం మరి వినియోగించడం చేయకపోతే కనుక జంతువులను వధించి మరి మాంసాన్నిఅమ్మకానికి ఉంచే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.”
▪“ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్య్రంతో బాధపడటమే కాదు, అవమానాలకు కూడా గురవుతారు.”
-------------------------------------------------------
🌷 కబీర్ దాస్🌷
▪“జంతువులను ఒక్క పెట్టున నరకడం, చాలా సేపు రక్తం కార్చుతూ చంపడం దోషపూరితం, అధమం మరి దయా రహితం. అలాంటి వారు అంత్య సమయంలో శిక్ష అనుభవించవలసి వస్తుంది.”
▪“కడుపు నిండా చేపల్ని తిని కోటి గోవులను దానమిచ్చినా.. నరకానికే వెళతారు. బాధ అనేది ఏ జీవికైనా ఒక్కటే, మూర్ఖులైన జనులు గ్రహించడం లేదు.”
-------------------------------------------------------
🌷స్వామి దయానంద సరస్వతి🌷
▪“మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. మాంసం తినే వారి, మత్తుపానీయాల్ని త్రాగే వారి శరీరాలు మరి వీర్య కణాలు కూడా కలుషితమవుతాయి.”
---------------------------------------------------------
🌷మైఖేల్ నేమి🌷

“ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసం కూడా చీల్చ బడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరువ బడతాయి. ప్రతీ రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందే” ఇది తిరుగులేని న్యాయ సూత్రం.
--------------------------------------------------------
🌷మనుస్మృతి🌷

“జీవులను చంపే వారు, చంపించే వారు, అమ్మే వారు, వండే వారు, వడ్డించే వారు, మాంసం కోసే వారు, తినేవారు,  తినిపించేవారు ఈ ఎనిమిది రకాల వారు హత్యలో భాగస్వాములే.”
--------------------------------------------------------
🌷ఇస్లాం🌷
▪“భూమిపై సంచరించు జంతువులు గానీ, ఆకాశంలో రెక్కలతో ఎగురు పక్షులు గానీ, సృష్టిలోని సమస్తమూ మీవంటివే.”
-7వ కాండ 38వ వాక్యం, ఖురాన్
“అతడే పందిళ్ళపై నెక్కింపబడు తోటలను, పందిళ్ళగా మారని వృక్షములను సృష్టించెను. అలాగే ఖర్జూర వృక్షములను, పొలములను సృష్టించెను. వాని ఫలములు వేరు వేరుగా నున్నవి. దానిమ్మను కూడా సృష్టించెను. ఒకదానికొకటి పోలికలు లేని ఫలములను సృష్టించెను. అవి ఫలించినప్పుడు వాటిని భుజింపుము. వృధాగా ఖర్చు చేయకుము. అటువంటి వారిని భగవంతుడు ప్రేమించడు.”
-8వకాండ 142వ వాక్యం, ఖురాన్
“ఓ జనులారా ! భూమిలోని వస్తువులలో శాస్త్ర సమ్మతములై, పవిత్రములైన వాటిని భుజింపుము. ‘సైతాను’ మార్గంలో నడువకుము. నిశ్చయముగా ‘సైతాను‘ మీకు సుస్పష్టమైన శత్రువు. హింసా కార్యములను చేయు దిశగా మిమ్ములను ప్రేరేపించును. అసత్యములను పరమాత్మపై మోపుటకు మిమ్ములను ఆజ్ఞాపించును.”
-2వ సూరా 168వ వాక్యం, ఖురాన్
“ఎవడు ఒక హత్య బదులుగా కాక భూమిలో ఉపద్రవమునకు గాక ఒక జీవిని చంపునో, అట్టి వాడు సర్వ జీవులను చంపినవాడగును. ఎవడు ఒక ఆత్మను బ్రతుకనిచ్చునో, వాడు సర్వ ఆత్మలను బ్రతుకనిచ్చిన వాడగును.”
-6వ కాండ 32వ వాక్యం, ఖురాన్
-------------------------------------------------------
🌷క్రైస్తవం🌷

ఎడ్మండ్ జకై ప్రచురించిన “గాస్పెల్ ఆఫ్ పీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్” అనే పుస్తకంలో ఏసుక్రీస్తు ప్రవచనాలను ఈ విధంగా వ్రాశారు:
▪“ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమను తామే చంపుకుంటున్నారు. ఎవరైతే చంపబడిన జంతు మాంసాన్ని తింటారో వారు నిజానికి తమ మృత మాంసాన్ని తింటున్నారు. జంతువుల మృత్యువు వారి స్వీయ మృత్యువు. ఎందుకంటే ఈ పాపానికి ఫలితం అంటే శిక్ష మరణం కంటే తక్కువగా వుండజాలదు. ఎందుకంటే వాడి శరీరంలో ఆ జంతువుల రక్తం యొక్క ప్రతి చుక్కా విషంగా మారుతుంది. వాని శ్వాసలో మృత పశువుల శ్వాసల దుర్గంధ ముంటుంది. వాని రక్తం మృత పశువుల రక్తంలానే పొంగుతుంది.. మరి పశువుల మరణం వాని మరణం అవుతుంది” అని చెప్పారు. “మూగ జీవులను చంపకు. అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతాన్‌కు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖంతో కూడిన మార్గం. అది మృత్యువు వైపుకు తీసుకు వెళ్తుంది. పరమాత్మ ఆజ్ఞలో జీవించు, అలా జీవిస్తే ఆయన దూతలు జీవితపు మార్గంలో నీకు సహాయం చేస్తారు. అందువలన పరమాత్మ యొక్క ఈ ఆదేశాన్ని పాటించు. చూడు.. నేను నీకు భూమిపైన అనేక రకాల ఫలాలనూ, ధాన్యాలనూ ఇచ్చాను. ఫలాలు కాచే అనేక వృక్షాలను ఇచ్చాను. ఇవి నీకు మాంసానికి బదులుగా ఇవ్వ బడ్డాయి. రక్త మాంసాలతో వున్న వాటిని నీవెన్నడూ తినకు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

కొత్తపెళ్లికూతురుకు సలహాలు

కొత్తపెళ్లికూతురుకు సలహాలు
శ్రీ కళ్యాణవాణి

----------------------


ప్రియాతి ప్రియమైన కళ్యాణికి
నీ మేనత్త ప్రేమతో వ్రాయునది .....

నీ పెళ్లికి వచ్చి ఎన్ని కట్నకానుకలు ఇచ్చినా నాకు తృప్తి కలగడం లేదు. ఇంకా ఏదో ఇవ్వాలనిపిస్తోంది.

ఏమివ్వాలా? అని ఆలోచించాను...
నా అనుభవాన్నంతా సలహాల రూపంలో ఒక ఉత్తరం రాసి ఇస్తే నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందనిపించింది.

తల్లిలేని పిల్లవి నువ్వు..దాంపత్య జీవితం గూర్చి నీకెంత తెలిసో నాకు తెలియదు.నీ తల్లి ఉండుంటే ఇవ్వన్నీ చెప్పేది.

...నేనిచ్చే ఈ సలహాలు నీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను. వీటిని ఖాళీసమయం దొరికినప్పుడు రోజూ ఒక్కసారన్నా చదువు..

నీ అన్యోన్య దాంపత్యం విషయంలో నా ఈ సలహాల ఉత్తరం ఏమైనా ఉపయోగపడితే నా ఆలోచన ఫలించినట్లే!!

డియర్ కల్యాణి!

ఈ ప్రపంచంలో ఎవరంటే మనకు బాగా ఇష్టం ఉండాలో తెలుసా!

"తనమీద తనకే!"

అప్పుడే మనలో తృప్తి, ఆత్మవిశ్వాసం, ఆనందం ఏర్పడుతాయి. అలా తనమీద తనకి ఇష్టం కలిగేవిధంగా "మన ప్రవర్తన, నడవడిక,మనసిక స్థితి, వ్యక్తిత్వం" అలవర్చుకోవాలి.

ఇందుకోసం మనం నిరంతరం ప్రయత్నించాలి.
అందుకోసమే ఈ సలహాలు.....



ఎక్కడినుండి ప్రారంభించాలి?

దాంపత్యానికి మూలం బెడ్ రూమ్ కాబట్టి అక్కడినుండే ప్రారంభిస్తాను.

1. బెడ్రూమ్ లో మన ప్రవర్తన చాలా ముఖ్యమైనది.
"అన్ని సమస్యలకు మూలం బెడ్రూమ్ లొనే ఉంటుంది"అంటారు పెద్దలు.

ఆ సమయంలో...
ఆవులించడం.. విసుగు..ఉదాసీనత..నిర్లక్ష్యం.. అపరిశుభ్రత.. మొ౹౹ లక్షణాలు అసలే ఉండవద్దు!
సాయంత్రం స్నానం చేసి ఫ్రెష్ గా తయ్యారుకావాలి..రాత్రి కూడా బ్రష్ చేసుకోవడం మంచిది.

బెడ్రూంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే...
(ఎంత వయస్సు వచ్చినా కూడా)

" మొదట్లో కొంచెం సిగ్గు,...ఆసక్తి,..ఇష్టం,.. సంతోషం,..నమ్మకం,... బాధ్యత,.. ప్రేమ,..ప్రతిస్పందన,.. చురుకుదనం,.. సంభాషణాచాతుర్యం,.. తెలివి,..వివేకం,..క్రియేటివిటీ,.. భర్తకు అభద్రతాభావాన్ని కలిగించకపోవడం..సన్నని దరహాసం,.. ఆనుకూల్యత,..నాజూకుతనం,..గడుసుతనం,..తన్మయత్వం,..సరసత్వం,..ఏకాగ్రత,..తననూ-ప్రపంచాన్ని-కాలాన్ని మర్చిపోయేంత అనుభూతి,.. భక్తి,...................చివరగా తృప్తి."

....ఈ 24 లక్షణాలు నీలో ఉండాలి..నీ భర్తకి కనిపించాలి కూడా!

కొంతమంది ఇది తప్పు..పాపం అన్నట్లుగా ప్రవర్తిస్తుంటారు.
అది చాలా పొరపాటు అభిప్రాయం.

"ఇదీ గృహస్థాశ్రమ జీవితంలో శివశక్తుల స్వరూపాన్ని అనుభూతి చేసుకునే ఒక ఆథ్యాత్మిక సాధన."

దేవునిగుడిలోకి ఎలాంటి పవిత్రభావంతో వెళతావో అలాంటి పవిత్రత బెడ్రూంలో కూడా ఉండాలి.

ఒక్కమాటలో చెప్పాలంటే....
ఎన్ని గొడువలూ.. వాదనలు ఉన్నా బెడ్రూంలో ఒక భార్యగా నీ ప్రవర్తన "నేను అన్నీ మర్చిపోయాను సుమా!" అన్నట్లుగా ఉండాలి.

నే చెబుతున్న విషయాలు కొందరికి నచ్చకపోవచ్చు!..కానీ ఈ విషయాలన్నీ ముఖ్యమైనవే కాదు..సత్యమైనవి కూడా!

ఇక బెడ్రూంను స్టోర్ రూంలా చిందరవందరగా ఉంచుకోవద్దు! (ఆ మాటకొస్తే స్టోర్ రూమ్ కూడా అలా ఉంచుకోవద్దు...)

దీని ప్రభావం నీ దాంపత్యంపై పడుతుంది. కాబట్టి మనసుకు హాయి గొలిపేలా వీలైనంత శుభ్రంగా.. ఆకర్షణీయంగా ఉంచుకో!! అనవసర వస్తువులు బెడ్రూమ్ లో అసలే ఉంచవద్దు!

ఇక తెలిసి తెలియక మీరిద్దరూ నీలి చిత్రాలు..వంటి కృత్రిమ,అపవిత్ర పద్ధతుల ద్వారా స్పందన పెంచుకునే ప్రయత్నం ఎన్నడూ చేయవద్దు..ఒకసారి అలాంటి అపవిత్ర విధానానికి అవకాశం ఇస్తే క్రమక్రమంగా దాంపత్యం అపవిత్ర దిశగా వెళ్లడం ప్రారంభమౌతుంది.

ఇక ఈ సలహా విషయంలో పెద్దలు అంటుండగా విన్న ఒక శ్రుతి వాక్యాన్ని ఉటంకిస్తున్నాను.

" ప్రజాతిరమృతమానంద ఇత్యుపస్థే " అని అంటుందట ఒక దగ్గర వేదం.

ఉపస్థం అంటే జననేంద్రియం
దీనివల్ల రెండు ప్రధాన ప్రయోజనాలు..
1. ధర్మ బద్ధమైన సంతానం
2.అమృతమయమైన ఆనందం

ఇదిగో ....ఈ రెండు ప్రధాన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మీ బెడ్రూం దాంపత్యం ఉండాలి.



2.నీ దాంపత్యజీవితంలో ప్రేమపూర్వక మాటలను పెంచుకో!..కోపంతో కూడిన వాదనలను తగ్గించుకో!!

"నిన్ను చేసుకోవడం శుద్ధ వేస్ట్"....
"నన్నసలే పట్టించుకోరు"...
."నాతో మాట్లాడనే మాట్లాడరు"....
"నాతో ఏ విషయాలు చెప్పరు"....
"మీకేది చేతకాదు"...
"అతన్ని చూసి నేర్చుకోండి"...
"నే చెబితే విన్నారా?మంచి బుద్ధొచ్చింది!"....
"మీ వంశమే అంత"...

......ఇలాంటి నెగిటివ్ మాటలు అసలే మాట్లాడవద్దు!

ప్రశ్నలకు ప్రశ్నలనే సమాధానంగా ఎప్పుడూ ఇవ్వొద్దు... ఎందుకంటే "నూటికి 90% గొడవలకు ప్రశ్నలకు ప్రశ్నలనే సమాధానంగా ఇచ్చే మాటతీరే కారణమవుతుంది!"

కావాలంటే నువ్వు గయ్యాలి అని అనుకునే వాళ్ళను గమనించు!..వాళ్ళు ప్రశ్నకు...మరో ప్రశ్ననే సమాధానంగా ఇస్తుంటారు.

ఇతరులతో ఎప్పుడూ పోల్చుకోవద్దు!

వాస్తవమేదో దాన్నే స్వీకరించు!
నీ వాస్తవపరిస్థితులకు తగ్గట్టు జీవించు!!
డాంభీకాన్ని ప్రదర్శించవద్దు!!!

మరింత అభివృద్ధి సాధించడానికి నీ భర్తకు ధైర్యాన్ని..ప్రోత్సాహాన్ని..ప్రేమను అందించు.

నీ భర్తకు సంబంధించిన వ్యవహారాలలో ఎందులో జోక్యం చేసుకోవాలి?...ఎందులో చేసుకోవద్దు? అన్న విషయాలలో నీ భర్త మానసిక స్థితిని జాగ్రత్తగా గమనించు!

ఇక అనవసరంగా నీ భర్తకు ఉచితసలహాలు ఇవ్వమాకు!...పూర్తి కరెక్ట్ అని నువ్వు భావిస్తేనే సలహా ఇవ్వు!! ఎందుకంటే...
నువ్విచ్చే సలహాలు సరిగ్గా ఉండవు అనే అభిప్రాయం అతనికి దాంపత్య ప్రారంభంలోనే కలిగితే తర్వాత తర్వాత నీతో ఏ విషయాలు అతను చర్చించడు...క్రమంగా జీవితంలో ముఖ్య సంఘటనల్లో నీ ప్రాధాన్యత లేకుండానే జీవితం వెళ్లదీయాల్సి వస్తుంది.

అందుకే మొదట్లోనే ఈ విషయంలో నమ్మకం పోగొట్టుకోకుండా జాగ్రత్తపడి...క్రమక్రమంగా నమ్మకాన్ని పెంచుకోవాలి



3. ఇక కళ్యాణీ !నువ్వు చాలా అందంగా ఉంటావు.

ఈ సమాజంలో ముసుగువేసుకున్న గుంటనక్కలు...తోడేళ్ళు..చొంగకార్చే కుక్కల స్వభావం కలిగిన వారు ఎందరో ఉంటారు.

కాబట్టి అలాంటి వారు నీ అందాన్ని పొగుడుతూనో,...నీ కష్టాలపై సానుభూతిని చూపిస్తూ...లేదా అన్ని రకాలుగా స్నేహం చేద్దామని...చొరవ తీసుకుని ప్రయత్నాలు చేసేవారిని వెంటనే కట్ చేసెయ్యాలి.

అవసరమైతే ఈ విషయంలో మొహమాటం,భయం లేకుండా నీ భర్తకు చెప్పడం మంచిది.

నీ భర్తకు తెలియని ఏ స్నేహాన్ని నువ్వు కొనసాగించవద్దు..దాంపత్యంలో స్వేచ్ఛ కన్నా...నిజాయితీ,నమ్మకం అనేవి చాలా ముఖ్యం.



4. నీ భర్తను/ మీ ఇంట్లో పెద్దవారిని నిర్లక్ష్యం చేసినట్లు కనిపించొద్దు!

వాళ్ళు ఒక్కసారి పిలవగానే రెస్పాన్స్ ఇవ్వడం అలవాటు చేసుకో!

ఈ సందర్భంగా "ఒక్క నిమిషం!".."ప్లీజ్ "...ఇలా అవసరం బట్టి మాటలు ఉపయోగించాలి.

ఇంట్లో గౌరవించదగిన పెద్దలు ( నీ మనసును బట్టి కాదు..ధర్మాన్ని బట్టి) క్రింద కూర్చున్నప్పుడు నువ్వు పైన కూర్చోవడం సంస్కారం కాదు.

అలాగే పెద్దలకు అనుకోకుండా కాళ్ళు తగిలితే వారికి భక్తిపూర్వకంగా నమస్కరించాలి.

వాళ్ళు నీ పట్ల అనుకూలంగా ఉన్నా లేకున్నా నీ ధర్మం నువ్వు నిర్వర్తించాలి.ధర్మ విరుద్ధంగా పెద్దలకు అమర్యాద చేయొద్దు.

మన ధర్మమే మనకూ...ముఖ్యంగా మన పిల్లల విషయంలో రక్షగా నిలుస్తుంది.



5. కళ్యాణీ! భార్యాభర్తల మధ్య దాదాపు ఒక సంవత్సరం పాటు ఆకర్షణ తీవ్రంగా ఉంటుంది... తర్వాత తగ్గుముఖం పడుతూ ఒక శూన్యం లాంటింది ఏర్పడే అవకాశం ఉంటుంది....ఒకవేళ అలాగే చూస్తూ ఉన్నావనుకో! జీవితాంతం అలాగే గడపాల్సివస్తుంది! అలాంటి స్థితి ఏర్పడేముందే నువ్వు జాగ్రత్తపడి ఆ శూన్యాన్ని తొలగించుకోవాలి!!"

ఆ శూన్యాన్ని తొలగించుకోవాలంటే..ఒకరి ఇంట్రెస్ట్ లను ఒకరు తెలుసుకుని వాటిని గౌరవించి...చర్చింటంత జ్ఞానాన్ని కూడా పెంచుకోవాలి!

తన ఇంట్రెస్ట్ లు భాగస్వామికి ఇష్టం లేకపోయినా..లేదా..అర్థం చేసుకునే జ్ఞానం లేకపోయినా...క్రమంగా భాగస్వామితో మాట్లాడడం తగ్గిస్తూ అవే ఇంట్రెస్ట్ లు గల ఇతరులతో మాట్లాడడం చేస్తుంటారు ఎవరైనా......

ప్రతీ వ్యక్తి తాను ఏ ఆసక్తుల వల్ల ఆనందాలను పొందుతున్నాడో వాటినే భాగస్వామితో కలిసి పంచుకోవాలని చూస్తాడు! వాటిని స్వీకరించకుండా తమ అసక్తులను మాత్రమే రుద్దుతూ ఉంటే సంఘర్షణ ప్రారంభమౌతుంది!!

అందుకే నీ భర్త ఇంట్రెస్ట్ లు ఏమిటన్నది స్టడీ చెయ్యు!...వాటిగూర్చి మీ ఆయనతో చర్చింటంత జ్ఞానాన్ని పెంచుకో!...దానివల్ల భార్యాభర్తలు ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉండొచ్చు.

ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉండే ...అంటే మాటల ద్వారా ఒకరితో ఒకరు కాలక్షేపం చేసేలా ఉంటే....
వారి దగ్గరితనం యొక్క తాజాతనం ఎప్పటికీ తగ్గదు.



6.ప్రేమ అనేది ప్రతీ వ్యక్తిలో ఉంటుంది...అది ప్రదర్శించే విధానాల్లో తేడానే సంఘర్షణకు..లోటుకు..అశాంతికి..శూన్యతకు కారణమౌతుంది!

1 st స్టెప్ లో ఒకరి అవసరాలను ఒకరు నెరవేరుస్తూ కేర్ తీసుకోవాలి!!...

2 nd స్టెప్ లో ఒకరి ఆసక్తులను..ఎమోషన్స్ ను.. ఒకరు తెలుసుకుని..గౌరవించి మాట్లాడుకుంటూ ఉండాలి!
దీనివల్ల ఇద్దరిమధ్య అత్యంత దగ్గరితనం పెరుగుతుంది!
ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉన్న విషయాలైతేనే..ఎంతసేపైనా ఆ వ్యక్తితో మాట్లాడగలము! అలా మాట్లాడడమే.. మనమీద అవతలివ్యక్తికి ఆసక్తిని పెంచుతూ వుంటుంది కూడా!!

3rd స్టెప్ లో ఒకరివిజయాల్లో ఒకరు భాగస్వాములు కావాలి!!

4 th స్టెప్ లో ఒకరి జ్ఞానాన్ని ఒకరు షేర్ చేసుకోవాలి!

5 th స్టెప్ లో సువాసన వెదజల్లే ధవళం ..పూలు కలిసిన దండను భగవంతునికి సమర్పించినట్లు..

పవిత్రంగా జీవించేలా ఒకరికొకరు ప్రేరణ కలిగించుకుంటూ ఆత్మైక్యం చెంది పూర్ణాత్మలో లీనం కావాలి!

ఇదే "సనాతనధర్మంలోని దాంపత్యజీవన ఆదర్శం".

"కానీ..ఈ అన్నింటిలో ముఖ్యమైంది,.. కొంత కష్టసాధ్యమైంది 2nd స్టెపే!!అదొక్కటి సరిగ్గా ఉండేలా చూసుకుంటే చాలు! తర్వాతవి సహజంగానే వస్తాయి"

*

కళ్యాణీ!...
ఇంకా చాలా విషయాలు చెప్పాలనుంది.కానీ
ఇప్పటికే ఉత్తరం చాలా పెద్దదైంది..
నీ విషయం తెలియదు కాని, ఇప్పటి పిల్లలకి పెద్ద మ్యాటర్ చదవడం అలవాటు తప్పిపోయింది.

అందుకే ముగిస్తాను. మళ్ళీ మరో ఉత్తరంలో మరిన్ని సలహాలు రాస్తాను.

ఒక విషయం గుర్తుంచుకో! మీ అమ్మ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మంచి గృహిణి. మీ అమ్మ తనసహచర్యంతో మా అన్నయ్య సోమరితనం తొలగించడమే కాక ...అతని ప్రస్తుత అభివృద్ధికి మీ అమ్మే కారణమైంది.

మీ అమ్మనుంచే ఈ విషయాలన్నీ నేను నేర్చుకున్నాను.ఇప్పుడు నీకు చెప్పినవి అందులో కొన్ని మాత్రమే!

ఈ రోజు తాను లేకపోయినా పైనుండి నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటుంది.
నీలో .." గొప్పవ్యక్తిత్వం గల మీ అమ్మను" చూసుకోవాలనే మా ప్రగాఢమైన ఆశ..ఆకాంక్ష.

ఇక ఉంటాను.

నా బంగారు మేనకోడలుకు
శుభాసిస్సులతో...
నీ అత్తమ్మ....
శ్రీవాణి.

కోడలే అత్తింటికి అసలు కాంతి

కోడలే అత్తింటికి అసలు కాంతి

👍కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది ధర్మం ...!!!
👉ఎందుకోతెలుసా...!!!
👉చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!
👉కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!
👉తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!
👉తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే
"జీ హుజూర్" అంటూ అత్తింటి సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!
👉అందుకే కాఁబోలు సీతమ్మ అశోకవనంలో శోకిస్తున్నప్పుడు కూడా తమ వనవాసానికి కారణమైన మామ దశరథుడిని తక్కువ చేసి ఎన్నడూ మాట్లాడలేదు. పైగా మీరెవరని హనుమ అడిగిన ప్రశ్నకి దశరథుడి కోడలినని చెప్పిందే తప్ప జనకుడి బిడ్డనని చెప్పలేదు, ఇది ఉత్తమ కోడలియుక్క నిష్ఠ...!!
👉కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!
👉కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం "నాంది శ్రాద్ధం" పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!
👉పెళ్లి అయ్యాక ఏడుస్తున్న పెళ్లికూతురిని చూసి ఇప్పుడు నీకెవరు దిక్కు మీ నాన్న నా? అని ఎవరయినా అడిగితే "న న" (కాదు కాదు) అంటుంది. పెంచి పెద్దచేసిన నాన్న ఇప్పుడు 'నన' అయ్యాడు.
మరి ఎవరు దిక్కు అంటే, చేయి పట్టుకున్న భర్తపేరును కూడా చెప్పక "మా.! మా.! అయ్యా..!" అంటూ సమాధానమిస్తుంది. ఇదివిన్న పెళ్ళికొడుకు తండ్రికి మామయ్యా అని పిలిచినట్లనిపించి, ఎవడ్రా నాకోడలిని ఏడిపిస్తున్నది అని గర్జిస్తాడు.ఇక అప్పట్నుంచి కోడలిని బిడ్డలా కాపాడతాడు మామయ్య...!!
👉ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది, ఎందుకోతెలుసా...??
కోడలే అత్తింటి గృహలక్ష్మి...!!!

శుభం భూయాత్

మనల్ని వేధించే ఏడు రకాలైన నెగెటివ్ భావనలు.....


★★★★★★★★★★★★★

1...నేనింకా పరిపూర్ణనంగా లేను ...అని దేనితోనో,,ఎవరితోనో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుని .ఆ భావనను తలకెత్తుకుని ,,ఇంకా దేన్నో వెదుకుతూనో,,ప్రయత్నిస్తూనే ఉండడం..

★★★★★★★★★★★★★★★★

2...మనలోని,, ఇతరులలోని,,
నెగెటివ్ క్వాలిటీస్ మీద మనం దృష్టి కేంద్రీకరించినట్లైతే మనం నిరంతరం ఎదో ఒకటి,,ఎవరినో ఒకరిని,,
జడ్జ్ చేస్తూనే ఉంటాం..

★★★★★★★★★★★★★★★★

3...మనల్ని మనం సందేహించుకోవడం
అనే కలుపు మొక్కను మన జీవితం
మీద పెత్తనం చేలాయించకుండా ఉండాలంటే,,, ముందు దాన్ని పూకటివేళ్ళతోసహా పెకిలించి పారేయ్యాలి..

★★★★★★★★★★★★★★★★

4...పరిస్తితులెప్పుడూ మనం అనుకున్నట్టు ఉండాలన్న చెత్తరూలు ఎక్కడా లేదు....అలా నమ్మడం అనేది
మనమీద మనకు సందేహాన్ని తెచ్చిపెడుతుంది...

★★★★★★★★★★★★★★★★

5...మానసిక వ్యధ,,,మనోచింతన,,
లేదా దేనిగురించైనా చింతించడమనేది ఏ రకమైన మార్పులు తెచ్చిపెట్టదు...శరీర మానసిక
ఆరోగ్యాన్ని కోల్పోవడం తప్ప...

★★★★★★★★★★★★★★★★

6....మనం ఎక్కువగా నకారాత్మక భావనలతో కాపురం చేస్తే,,,నిరంతరం
కారణాన్ని బయటవెదుకుతూ ,,
ఫిర్యాదులు చేస్తూనే ఉంటాం..
దీని వల్లా మనల్ని మనం ఆనందం లేనిచోటుకు చేరవేసుకుంటాం...

★★★★★★★★★★★★★★★★

7...మనం బయట దేన్నీ నియంత్రించలేం...అలా ప్రయత్నించినా
ఫెయిల్ అవుతాం...అలా ప్రయత్నించాలనుకోవడం అనేది మనల్ని మనం మోసం చేసుకోవడమే...


★★★★★★★★★★★★★★★★

తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే

పూర్తి పేరు : సావిత్రిబాయి ఫూలే
పుట్టిన తేది : 1831 జనవరి 3
జన్మస్థలం : నయిగావ్ గ్రామం, సతారా
భర్త : మహాత్మా జ్యోతిరావు ఫూలే
వృత్తి : ఉపాధ్యాయిని, సంఘ సంస్కర్త
1831 జనవరి 3వ తేదిన ఖండోజి, లక్ష్మి దంపతులకు మహారాష్ర్టలో కవాడి గ్రామంలో జన్మించిన సావిత్రీబాయికి, బాల్యంలోనే జ్యోతిరావు ఫూలేతో 1840లో ఎనిమిద యేట వివాహం జరిగింది. ఫూలే తన జీవిత భాగస్వామికి విద్యావసరతను గుర్తించాడు. ఆమె ఆసక్తి దోహదపడింది. పరమహంస సభ సభ్యుడు, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కేశవ్ శివరాం భావాల్కర్ సహాయంతో ఆమెను విద్యావంతురాలిగా చేశాడు.సుగుణబాయి సహకారంతో సావిత్రిబాయి 1847లో మహర్వాడ (ఎస్సి)లో బాలికా పాఠశాలను ప్రారంభించారు. ‘మనువు పెట్టిన ఆంక్షలన్ని నిజం కాదు. వాటిని ఇప్పుడు పాటించవలసిన అవసరం లేదు. రండి. చదువుకోండి. చేయూతనిస్తాం. చదువు మీకు ఆనందాన్నీ, విజ్ఞానాన్ని ఇస్తుంది. సందేహించకండి...’ అంటూ వాడల్లో తిరిగి ప్రచారం చేస్తూ నచ్చ చెప్పి బాలికలను పాఠశాలకు తోడుకొని వచ్చేవారు సావిత్రిబాయి. 1848 నాటికి మరో పాఠశాల ప్రారంభించారు.
ఈ పాఠశాలలను నడిపించే బాధ్యత సావిత్రి స్వీకరించారు. సావిత్రీబాయి పాఠశాలకు వెళ్లి వచ్చే దారిలో బ్రాహ్మణ వర్గాలు పేడ, రాళ్లు, గుడ్లతో కొట్టి అవమానించేవారు. అయినా ఆమె ఏనాడూ చలించలేదు. ఇలా పూణే చుట్టుప్రక్కల అంటరాని బాలికల విద్య కోసం దాదాపు 18 పాఠశాలలు స్థాపించి, నిజమైన విద్యాదేవతలుగా నిలిచారు ఫూలే దంపతులు.కేవలం బాలికలకు విద్యనందించే కార్యక్రమమే కాక వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాల సమస్య, సతీసహగమనాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు సావిత్రిబాయి. కాశిబాయి అనే వితంతువు గర్భం దాల్చడంతో, ఆమె ఆత్మహత్య చేసుకొనే ప్రయత్నంలో ఫూలే దంపతుల కంటబడింది. ఆమెను రక్షించి ఆమెకు జన్మించిన యశ్వంతరావును దత్తత తీసుకొని పెంచిన మాతృదేవతామూర్తి సావిత్రీబాయి. వితంతువులకు బోడిగుండు కొట్టించి, చీకటి గదులకు పరిమితం చేసే అమానవీయ విచారకర విషయాలను తీవ్రంగా ఖండించారు. ‘బాలహత్య ప్రతిబంధక్ గృహ’ స్థాపించి బాల హత్యలను నివారించేందుకు కృషి చేసిన ప్రేమ స్వరూపిణి సావిత్రీబాయి ఫూలే. తను చేపట్టిన కార్యాన్ని అకుంఠితదీక్షతో విజయవంతం చేసిన సమర్థురాలామె.కుల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన యోధురాలు. ఆరోజుల్లో ఇంతటి సాహసం చేసి సామాజిక రుగ్మతల నిర్మూలనకు నడుంకట్టి ఒక ‘శూద్ర స్త్రీ’ ఉదాత్త, విశాల దృక్పథంతో ఉద్యమాన్ని నడిపించారంటే కొంత ఆశ్చర్యం కలిగించక మానదు.1873లో సత్యశోధక్ సమాజ్ (సత్యాన్ని శోధించే సంస్థ) ఏర్పడినప్పటినుండి జ్యోతిబా ఫూలే వెన్నంటి ఉండి, ఫూలే అనంతరం సత్యశోధక్ (సంఘంలో బ్రాహ్మణవర్గాల అనవసర జ్యోక్యాన్ని తిరస్కరించే) ఉద్యమాన్ని నడిపించిన ఘనత ఆమెకే దక్కుతుంది. బ్రాహ్మణులు లేకుండా పెళ్లిళ్లు చేయడం, వృత్తికులాల పూజలుమనుధర్మశాసనోల్లం ఘన అంటే, మంగళ్ళు క్షవరం చేయకపోవడం, చాకళ్లు బట్టలు ఉతకకుండా తిరస్కరించడం వంటి పోరాటాలు నడిపించే ఫూలేకు కుడిభుజమైంది.
ఒక రోజు ఒక అడుక్కునేవాడు సావిత్రీబాయి ఫూలే ఇంటికి రాగా ఆమె అతనికి కొంత ధాన్యాన్ని బహూకరించింది. దారిలో వెళుతుండగా అతని ధాన్యపు మూట చినిగి ఆ ధాన్యం భూమి పాలైంది. అదే దారి గూండా వస్తున్న మహాత్మా జ్యోతిరావు ఫూలే తన రుమాలును అతనికి ఇచ్చి ఆ ధాన్యాన్ని మూటగట్టాడు. తరువాత ఆ దానం చేసిన ఇల్లాలు తన భార్య సావిత్రి భాయి అని తెలిసి మిక్కిలి సంతోష పడ్డాడు ఫూలే. ఈ దాంపత్య జీవితం నిజంగా ఆదర్శప్రాయం.ఇదే క్రమంలో అపారజ్ఞానాన్ని సంపాదించారు సావిత్రి. 1854లో ‘కావ్య ఫూలే’ అనే పద్య కావ్యాన్ని రచించి చరిత్ర సృష్టించారు. మహారాష్ర్ట ‘ఆధునిక కవిత్వానికి ఆద్యురాలు’గా ఆమె గుర్తింపు పొందారు. 1856లో సావిత్రీ భాషణ్ (సావిత్రీ ఉపన్యాసాలు) పేరుతో మరో గ్రంథాన్ని రాశారు. ‘బవన్ని కాశి’, ‘సావిత్రి లేఖలు’, ‘సుబోధ్ రత్నాకర్’ వంటి విప్లవాత్మక కావ్యాలు ఆమె అపార ప్రతిభకు అద్దం పట్టే రచనలు.
ఇలా ఆజన్మాంతం పేద, స్త్రీ, అంటరాని వారి అభ్యున్నతే ధ్యేయంగా, సామాజిక అసమానతలను రూపుమాపడమే లక్ష్యంగా సమాజాన్ని 100 సంవత్సరాలు ముందుకు పరుగులు పెట్టించిన ఆధునిక సంఘసంస్కర్త సావిత్రిబాయి, 1896-97లో మహారాష్ర్టంలో సంభవించిన ప్లేగు వ్యాధికి గురైన వారికి సేవ చేయడంలో నిమగ్నమై చివరికి అదే వ్యాధికి గురై అసువులు కోల్పోయారు సావిత్రీబాయి ఫూలే. ఇలా తరతరాల అంధకారానికి చరమగీతం పాడి, మనువాద పెత్తందారీ పోకడలను చిత్తుచేసి నూతన సామాజిక విప్లవానికి పాదులు వేసిన ఫూలే దంపతులు ‘వ్యధాకులితమైన సంఘర్షణ సృజించిన’ మహోతన్న ఆదర్శమూర్తులు నేటికీ ఆచరణీయులు, అనుసరణీయులు.

నమ్మకం విలువ


ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు. ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక భవంతిని నిర్మించాలి. ఎంత ఖర్చయినా
ఫరవాలేదు. ఆ భవనం 'నభూతో న భవిష్యతి' అనే రీతిలో
అద్భుతంగా ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా, విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన నెలనెలా ఇచ్చే జీతం రాళ్ళు తప్ప.
అంచేత ఈ భవన నిర్మాణానికి కేటాయించిన చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను' అనుకున్నాడు. అలా
తలచిన ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే ముడిసరకులతో
నిర్మించి పైకి మాత్రం కళాత్మకంగా ఉండేలా వివిధ నగిషీలతో
శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు. పైకి అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ, ''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే దేశం వెళ్లిపోతున్నాను. అత్యంత
విశ్వాసపాత్రుడిగా ఇన్ని సంవత్సరాలుగా నన్నే అంటిపెట్టుకొని
ఉన్న నీకు అపురూపమైన జ్ఞాపికలా మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాను. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు.
త్వరలో
కూలబోయే ఆ భవనంలాగే.

నీతి: పని నీ వంతు ఫలితం ఇవ్వడము పరమేశ్వరుని వంతు, మనసా వచ్చా కర్మనా ఏ పని అయిన త్రికరణశుద్ధి గా చేస్తేనే మంచి ఫలితాలు లభ్యం లేదంటే అవే నీ పాలిట శాపలు గా మారతాయి

మీ జీవితం మీ చేతుల్లో...

👉 🌹మీ జీవితం మీ చేతుల్లో....🌹

▪మన గురించి మనం చేసే ప్రతి ఆలోచన మన పట్ల వాస్తవమవుతుంది.
▪మనము వేటినైతే బయటికి పంపుతున్నామో వాటిని తిరిగి పొందుతున్నాము.
▪ప్రతి ఒక్కరూ వారి వారి జీవన పరిస్థితులకు వారే బాధ్యులు.
▪మన మనసులో నుంచి జనించే ప్రతి ఆలోచన, మన నోటిలో నుంచి వెలువడే ప్రతి వాక్కు మన జీవిత అనుభవాలని సృష్టిస్తున్నాయి.
▪మన పరిస్థితులను మనమే సృష్టించుకొని మన నిరాశా నిస్పృహలకు ఇతరులను నిందిస్తూ మన శక్తిని మనమే కోల్పోతున్నాము.
▪నిజానికి ఏ వ్యక్తి గాని ఏ ప్రదేశం గాని మనల్ని ప్రభావితం చేయలేవు, ఎందుకంటే మన మనస్సులో ఆలోచనలు చేసేది నిశ్చయంగా మనమే కాబట్టి.
▪మన మనస్సులో శాంతిని సామరస్యాన్ని సృష్టించుకుంటే వీటినే మన జీవితాల్లోని దర్శించవచ్చును.
▪ "అందరూ అన్ని వేళలా నాకు సహకరిస్తారు" అనే నమ్మకాన్ని నీవు ఎంపిక చేసుకున్నట్లు అయితే మీ సబ్ కాన్షియస్ మైండ్ బేషరతుగా మీ నమ్మకాన్ని అంగీకరించి మీ జీవితంలో అదే వాస్తవమై యేటట్లు చేస్తుంది.
▪ఈ విశ్వము మనం ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనలు మరి ప్రతి నమ్మకాన్ని పూర్తిగా సమర్థిస్తుంది.
▪ఈ విశ్వ శక్తి మనలో ఉన్నదున్నట్లుగానే మనల్ని అంగీకరించి మరి మన నమ్మకాల్నే మన జీవితాల్లో ప్రతిఫలించేటట్లు చేస్తుంది.

👉 ఉదాహరణకు
నాకెవ్వరూ లేరు, నేను ఒంటరి వాడ్ని, నన్ను ఎవరు ప్రేమించరు, నాకు ఎవ్వరు సహకరించరు...
అనే నమ్మకాలతో మీరు గనక జీవిస్తూ ఉంటే మీ జీవితాలలో అలాంటి ప్రతి ఫలాలను తప్పక పొందుతారు.

🌹నిజానికి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం ప్రేమించు కోవడం ఎలాగో నేర్చుకోవాలి
🌹మనల్ని మనం నిజంగా ప్రేమించుకుంటే జీవితంలో ప్రతిదీ మనకు అనుకూలిస్తుంది.

ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output

అద్భుతమైన లైఫ్
ఖచ్చితంగా ఇలా సాధ్యం!


ఈ క్షణం మీరెలా ఫీలవుతున్నారు? అద్భుతంగానా, డిజప్పాయింటెడ్‌గానా, బోర్‌గానా, చిరాకుగానా…? ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. ఖచ్చితంగా మన లైఫ్‌ని డిసైడ్ చేసే అతి పెద్ద ఫేక్టర్ ఇది.

బ్రెయిన్‌కి పంపించబడాల్సిన instructions చాలాసార్లు తప్పుగా హైజాక్ అవుతుంటాయి. అందుకే మనం ఫెయిల్యూర్డ్ పీపుల్‌గా మిగిలిపోతున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే “నెగిటివ్ ప్రోగ్రామింగ్” చేయబడుతోంది బ్రెయిన్.

బ్రెయిన్‌కి మంచీ చెడూకి మధ్య తేడా తెలీదు. మనం ఏది చెయ్యమంటే అది గుడ్డిగా చేస్తుంది.

చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీరు “ఈ మధ్య జనాల పేర్లు మర్చిపోతున్నాం” అని రిపీటెడ్‌గా అనుకుంటూ ఉన్నారనుకోండి.. బ్రెయిన్ అలాగే ప్రోగ్రామింగ్ చెయ్యబడుతుంది. మీరు గుర్తుంచుకోవాలని ట్రై చేసిన ప్రతీసారీ గుర్తుంచుకోవలసిన పేరుని డెఫినెట్‌గా మర్చిపోయి… మన నెగిటివ్ ప్రోగ్రామింగ్‌ని విజయవంతంగా ప్రాసెస్ చేసి పారేస్తుంది బ్రెయిన్.

మీకు హెల్త్ బాలేదని అనుకుంటూ ఉండండి…. ఖచ్చితంగా ఏదో ఒక సమస్య వస్తుంది. “బాలేదు బాలేదు” అనుకుంటున్న క్షణం నుండి బ్రెయిన్ వివిధ organsకి ఆదేశాలు జారీచేసి, బాడీ మెటబాలిజాన్ని తారుమారు చేసి ఏదో ఒక discomfort తలెత్తేలా చేసి తీరుతుంది. దానికి మనం అప్పజెప్పిన task ఏదైతే ఉందో… “మన హెల్త్ బాలేదని” దాన్ని కంప్లీట్ చెయ్యడమే దాని లక్ష్యం.
————
చాలామంది ఉద్యోగాలు రావట్లేదనో, లైఫ్‌లో తాము ఎందుకూ పనికిరామనో, సంతోషం అంటే ఏమిటో తెలీదనో.. రకరకాల మెంటల్ ట్రాప్‌లలో ఇరుక్కుపోతుంటారు. ఇవి రిపీటెడ్ సజెషన్లని బ్రెయిన్‌కి పంపిస్తుంటాయి. దాంతో ఉద్యోగం కోసం ట్రై చేసే ప్రతీ ప్రయత్నంలోనూ ఏదో ఒక లోపం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది, సంతోషంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా చిరాకుగానే ఉండిపోతుంటాం.
————–
ప్రతీ క్షణం మన ఆలోచనల ద్వారానో, నోటితో మాటల ద్వారానో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం. ఆ ఆలోచనలు ప్రోగ్రామింగ్ లాంటివి. ఈ ప్రోగ్రామింగ్‌లో పాజిటివ్ ఏటిట్యూడ్ సాధించగలిగితే ఖచ్చితంగా ప్రతీ క్షణం చాలా అద్భుతంగా ఉంటుంది.

అంటే మనల్ని మనం blame చేసుకోవడం తగ్గించాలి, ఇతరులు మనల్ని చులకన చేస్తూ మాట్లాడే వాటిని బ్రెయిన్‌కి తీసుకుని కుంగిపోవడం తగ్గించాలి. ఎంత నెగిటివ్ ఎనర్జీ మనం లోపలకు పంప్ చేస్తే అంత నెగిటివ్ output వస్తుంది. సరిగ్గా అలాగే ఎంత పాజిటివ్ ఎనర్జీ పంప్ చేస్తే అంత పాజిటివ్ output వస్తుంది.

ఇక్కడా మరో చిన్న ఉదాహరణ తీసుకుంటే… ఓ పబ్లిక్ గేదరింగ్‌లో అందరితో కలవలేక ఓ మూలన ఇరుక్కుంటే అందరూ సంతోషంగా ఉన్నట్లు కన్పిస్తారు. మనం ఒంటరిగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అరమరికలు మర్చిపోయి మనుషుల మధ్య దూసుకుపోతే మన సంతోషం ముందూ, కలివిడితనం ముందూ అందరూ సరెండర్ అయిపోతారు.

సో లైఫ్‌లో ప్రతీ క్షణం ఏ సిట్యుయేషన్‌ని ఎలా లీడ్ చేయాలన్నది మన చేతిలోనే ఉంటుంది. సో ఎలాంటి ఛాయిస్ తీసుకుంటే లైఫ్ అలా ఉంటుంది.

ప్రోగ్రామింగ్ ట్రాప్ అని మరొకటి ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన వెంటనే దానికి సంబంధించిన పాత జ్ఞాపకాలూ, అనుభవాలూ ఏమైనా మన బ్రెయిన్ డేటాబేస్‌లో ఉన్నాయేమో బ్రెయిన్ చకాచకా స్కాన్ చేస్తుంది.

ఉదా.కు.. రోజూ మీకు టీ తాగే అలవాటు ఉంటే గతంలో ఎప్పుడో ఓరోజు సాయంత్రం టీ తాగలేదనుకుందాం. బాగా తలనొప్పి వచ్చి ఉంటుంది.

సో ఈరోజు మీరు మళ్లీ టీ తాగలేదనుకుందాం. వాస్తవానికి తలనొప్పి వచ్చే అవకాశం లేకపోయినా.. బ్రెయిన్ ఒక కండిషన్‌కి ఓ రిజల్ట్‌ని match చేసుకుని ఆ outcome ఎలాగైనా సాధించి పెడుతుంది.

ఇక్కడ కండిషన్ ఏంటంటే.. టీ తాగలేదు.

రిజల్ట్స్ ఏమిటంటే తలనొప్పి రావాలి.

సో తలనొప్పి వచ్చే ఛాన్స్ లేకపోయినా డేటాబేస్‌లోని పాత రికార్డుల ప్రకారం శరీరంలో బయలాజికల్ మార్పులను సృష్టించి మొత్తానికి తలనొప్పి తెప్పించేస్తుంది.
————
సో ప్రతీ కండిషన్‌నీ, ప్రతీ అనుభవాన్నీ, ప్రతీ రోజునీ, ప్రతీ క్షణాన్నీ కొత్తగా చూస్తే, కొత్తగా రెస్పాండ్ అవుతూ పోతే బ్రెయిన్ డేటాబేస్‌లోని పాత రికార్డులూ, పనికిమాలిన చేదు జ్ఞాపకాలూ అన్నీ కొట్టుకుపోతాయి. లైఫ్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది.. ఇప్పుడే లైఫ్ మొదలెట్టినంత తాజాగా ఉంటాం.

జీవితం అందమైనది...ఆనందంగా జీవించండి

శాంతము, మౌనం

ఒక రోజున ఒక హైందవ సాధువు తన శిష్యులతో కలిసి గంగానది వద్దకు స్నానం చెయ్యడానికి వెళ్ళేడు.

అక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు కొంతమంది కోపంతో ఒకరిపై ఒకరు అరుచుకుంటున్నారు.

ఆ సాధువు తన శిష్యులవైపు చూసి నవ్వుతూ వారిని ఇలా అడిగేడు.“కోపంలో ఉన్నప్పుడు మనుషులు ఒకరిపై ఒకరు ఎందుకు అరుచుకుంటారు?” ??

ఒక్క క్షణం ఆలోచించిన తరవాత ఆ శిష్యులలో ఒకడు ఇలా సమాధానం చెప్పేడు, “మనం సహనాన్ని కోల్పోవడం వల్ల అరుస్తుంటాము”“

కాని మనుషులు పక్కనే ఉన్నప్పుడు అలా అరవలసిన అవసరం ఏముంది? మెల్లగా పక్కనే ఉన్నవాళ్ళకి నెమ్మదిగా చెప్పవచ్చు కదా” అన్నారు సాధువు.

మిగిలిన శిష్యులు కూడా వారికి తోచిన విధంగా సమాధానాలు చెప్పేరు కాని ఎవరుచెప్పిన అభిప్రాయము సంతృప్తికరంగా లేదు.

చివరకు సాధువు ఇలా వివరించేరు.

ఇద్దరు వ్యక్తులు ఒకరిపట్ల ఒకరు కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాలు చాలా దూరం అయిపోతాయి. ఆ దూరాన్ని అధిగమించడం కోసం, వాళ్ళకి వినిపించడంకోసం అలా గట్టిగా అరుచుకుంటూ ఉటారు. కోపం ఎక్కువయిన కొద్దీ తమ మధ్య పెరుగుతున్న దూరం కారణంగా మరింత గట్టిగా అరుచుకుంటారు.

అదే ఇద్దరు వ్యక్తులు ప్రేమగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది?వాళ్ళు ఏమాత్రం అరుచుకోకుండా ఎంతో మెల్లగా, మృదుమధురంగా మట్లాడుకుంటూ ఉంటారు, ఎందుకంటే వారి హృదయాలు ఎంతో దగ్గరగా ఉంటాయి కనుక. ప్రేమలో ఉన్నప్పుడు మనుషుల హృదయాల మధ్య దూరం చాల తక్కువగా, అసలు దూరమే లేనట్లుగా ఉంటుంది.

ఆ సాధువు తన శిష్యులకు ఇంకా ఈ విధంగా వివరించేరు.

మనుషులు ఒకరినొకరు గాఢంగా ప్రేమించినప్పుడు ఏంజరుగుతుంది? వాళ్ళు మాట్లాడరు, ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ చాలా ప్రేమగా దగ్గరవుతారు. చివరకు వాళ్ళ్ళకు గుసగుసలతో కుడా అవసరం లేకుండా ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుంటారు.అంతే ఆవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నప్పుడు వారి హృదయాలమధ్య అసలు దూరమే లేకుండా దగ్గరవుతాయి.

ఆ సాధువు తన శిష్యులతో ఇంకా ఈ విధంగా అన్నాడు.“కాబట్టి మీరు వాదించుకునేటప్పుడు కోపంతో మీ హృదయలను దూరం చేసుకోకండి.మనుషుల మధ్య దూరం పెరిగే విధంగా మాట్లాడకండి.లేకపొతే ఆ దూరం ఎప్పటికీ దగ్గరకాలేనంతగా పెరిగిపోతుంది.”

నీతి:– కోపం వచ్చినపుడు మాట్లాడకుండా మౌనంగా ఉండడం ఉత్తమమైన పద్ధతి.
అటువంటి కోపంలో మట్లాడే మాటలు అవతలి వ్యక్తి హృదయంపై చెరగని ముద్ర వేస్తాయి.
కోపం మనల్ని మనకి ప్రియమైన వారి నుండి దూరం చేస్తుంది.👏

చావు అంటే?చావు తర్వాత?నేను చిరంజీవినా?,పరిపూర్ణత ఎప్పుడు?,జన్మలెన్ని?నేను శరీరం కాదా?

✳ చావు అంటే ఏమిటి?
భౌతిక శరీరం మరియు సూక్ష్మ శరీరం మధ్య ఉండే 'ప్రాణయమ తీగ' (Silver Cord) తెగిపోవడమే చావు అంటే. చావు అనేది భౌతిక శరీరానికి మాత్రమే. ఈ శరీరం కొన్ని అణువుల సముదాయం. ఈ సముదాయానికి కొంత కాల పరిమితి మాత్రమే ఉంటుంది. చావు అనేది 'నేను' అనబడే 'నా'కు కాదు. ఈ భౌతిక శరీరానికి మాత్రమే.

✳ చావు తర్వాత ఏమవుతుంది?
చావు తరువాత ఆత్మ, సూక్ష్మ శరీరంతో (ఏడు శరీరాలలో ఒకటి) సూక్ష్మ లోకాలకు వెళ్తుంది.

✳ అయితే నేను చిరంజీవినా?
జీవి ఎప్పుడూ చిరకాలంగా ఉండేదే! చావు, నాశనం అనేవి లేవు. ప్రతి జీవి యొక్క పరమార్ధం 'పరిపూర్ణత'ను సాధించడమే.

✳ పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది?
మనం ఈ భౌతిక శరీరంలో ఉండి, అన్ని పాత్రలు ధరించి, ప్రతి ఒక్క పాఠము నేర్చుకొని 'పరిపూర్ణం' (perfect) అయినప్పుడు మాత్రమే.

✳ నేను ఈ శరీరాన్ని ఎన్నిసార్లు దాల్చాలి?
మనం ప్రతి జీవితంలోనూ 'ఏమి నేర్చుకోవాలో' ముందుగానే మన ఆత్మ నిర్ణయించుకుంటుంది.
మన లక్ష్యం నెరవేర్చేవరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. మన లక్ష్యం ఈ భౌతిక జీవితంలోనే నెరవేర్చాలి.

✳ అయితే, నేను ఈ శరీరం కాదా?
అవును, మనం ఈ భౌతిక శరీరం కాదు. ప్రతి ఉదయం మనం స్నానం చేసి వేరే గుడ్డలు మార్చినట్లు, ఈ జన్మ తరువాత ఇంకో జన్మ తీసుకొంటాము. మనం వేసుకొనే బట్టలను జాగ్రత్తగా చూసుకొన్నట్లే ఈ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి.

తిరుమలలోని ఏడుకొండల పరమార్థం గురించి తెలుసుకొందామా..!

ఏడు కొండలు:
➖➖➖✍

1. వృషబాద్రి 2. వృషాద్రి 3. గరుడాద్రి
4. అంజనాద్రి 5. శేషాద్రి. 6. వేంకటాద్రి
7. నారాయణాద్రి.

మనలోని ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మ స్థానంలో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 కొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంటుంది.
ఆ 7 కొండలు సాలగ్రామాలే. ఆ 7 కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః -- ఇతి నామాని వింశతిః

ఈ 20 నామాలు పఠించటంవల్ల సర్వ పాప బంధాలు నుండి విముక్తులు కాగలరు.

1. వృషభాద్రి - అంటే ఎద్దు :

వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు. దానికి 4 కొమ్ములుంటాయి. 3 పాదాలు (భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు)
వాక్కు అంటే - శబ్దం
శబ్దం అంటే - వేదం
వేదం అంటే - ప్రమాణము
వేదమే ప్రమాణము. వేదము యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడు.

2. వృషాద్రి - అంటే ధర్మం :

ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడడం, మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.

3. గరుడాద్రి - అంటే పక్షి :

ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం.
షడ్ - అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ మాత్రమే జీర్ణంకానిది. పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరు లేని వాడు భగవానుడు.
భగవ : ఐశ్వర్య బలము, వీర్య తేజస్సు మరియు అంతా తానే బ్రహ్మాండము అయినవాడు.
అన్ : ఉన్నవాడు, కళ్యాణగుణ సహితుడు, హేయగుణ రహితుడు. అటువంటి భగవానుణ్ణి జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.

4. అంజనాద్రి :

అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినపుడు. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పుడు అంజనాద్రి దాటుతాడు.

5. శేషాద్రి :

ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు "తుల్య నిందా స్తుతిర్ మౌని" (శ్లోకం చెప్పారు) తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండడమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.

6. వేంకటాద్రి :

వేం : పాపం, కట : తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు, అందుకనే మనకి బ్రహ్మం తెలిసినవారు పిచ్చివాళ్ళలా కనవడుతారు. రామకృష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకే జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం, అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.

7. నారాయణాద్రి :

అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి.

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటాచల తిరుమల శ్రీనివాసున్నీ మనసారా కొలవడం అంటే నాభూతో నాభవిష్యత్. ఆయన చెంత ఉంటే వైకుంఠమేగా ఇక.

ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద..
ఓం నమో వేంకటేశాయా!✍

🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

ధ్యాన ఫలం

‘🙏 జీవితంలోని అత్యుత్తమ కళల్లో ధ్యానం ఒకటి’ అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. అదే అత్యంత ఉన్నతమైంది కూడా. బతుకు పయనంలో జరిగే వ్యావహారిక పనులేకాకుండా కళలూ మనిషి చేపట్టే ప్రక్రియలే. జీవనం కోసం చేసే సాధారణ పనులకన్నా కళలు కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. చూపరుల దృష్టిని ఇట్టే ఆకట్టుకుని ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అందుకు ప్రధాన కారణం- రోజువారీ పనుల్ని మొక్కుబడిగా, లాంఛనప్రాయంగా చేసి ముగిస్తారు. కళల్ని శ్రద్ధగా, భక్తితో చేసి పూర్తిగావిస్తారు. శిల్పాన్ని చెక్కడం, సంగీత వాయిద్యాలు వాయించడం, మురళీగానం, చిత్రలేఖనం... ఇవన్నీ ధ్యానంతో చేసేవి. అందువల్లే, కళల్ని ప్రత్యేకంగా ప్రేమించిన వ్యక్తికి పట్టరానంత ఆనందం కలుగుతుంది.

భూమి చుట్టూ ప్రాణవాయువు వ్యాపించి జీవరాశిని బతికిస్తున్నట్టుగానే, మనిషిని సాధికారికంగా నడిపించడానికి అతడి జీవితం చుట్టూ ధ్యానం పరచుకుని ఉంటుంది. అది అనాదిగా ఉంటోంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. కానీ, మనిషే దాన్ని మరిచిపోయాడు. అందుకనే ‘ఒక్క మనిషి తప్ప ప్రకృతి మొత్తం ధ్యానంతో ఉంటోంది’ అనేవారు సుప్రసిద్ధ తత్వవేత్త ఓషో.

అద్భుతమైన పనికి ఆకర్షితులైన చూపరులు దానికి మెచ్చుకోలు పలుకుతూ ‘ఈ పనిలో కళాత్మకత ఉట్టిపడుతోంది’ అనడం తరచూ వింటూ ఉంటాం. ఒక పనిని చాలా ఇష్టంగా, ధ్యానంతో చేస్తే దాన్ని కళతో పోల్చిచెప్పడం లోకంలో పరిపాటి. చేపట్టిన పని పైన లేదా ఒక విషయం మీద మనసును లగ్నం చేసినప్పుడు అది చంచల స్వభావాన్ని కోల్పోతుంది. అప్పుడిక మిగిలేది- ఎరుకతో కూడిన గమనింపు. ధ్యానమంటే అదే. బహుమూల్యమైన ఆ ధ్యానంతో చేసే ఏ పనైనా బాగా పండుతుంది. ప్రతిఫలంగా, రావాల్సిన ఫలాల మూట- పెద్ద మొత్తంలో అందుతుంది.


‘ఒక వ్యక్తికి కీడు కలిగించి, తన కుటుంబానికి సమాజానికి హాని తలపెట్టే దుశ్చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు మంచివి కావు. అవి అత్యంత ప్రమాద కారకాలు’ అని పెద్దలు చెప్పడం వెనకాల తాత్విక నేపథ్యం, ఆధ్యాత్మిక కారణాలూ ఉన్నాయి. చెడు పనిని ఎరుకతో చెయ్యలేరు. అది అసాధ్యం. ఎరుకలేని చోట ధ్యానం కుదరదు. ధ్యానం లేని పని ఆధ్యాత్మికంగా నిస్సారమైంది. గడ్డిపోచ విలువ చెయ్యని చిన్నపనైనా, సింహాసనంపై ఉండి రాజ్యమేలే పెద్ద పనైనా- వాటిపై ప్రేమ లేనప్పుడు ఆ పనులు చేయకుండా ఉండటమే మేలు.

‘ప్రేమతో పనిచేసినప్పుడు మీతో మీరు, ఒండొరులతో, దేవుడితో బంధాలు ఏర్పరచుకుంటారు’ అంటారు లెబనాన్‌ తత్వవేత్త ఖలీల్‌ జిబ్రాన్‌.

ఆకాశాన్ని తాకేంత ఒక పెద్ద భవనం చాలా కాలంపాటు చెక్కుచెదరకుండా నిలబడాలంటే, దాని పునాది బలంగా ఉండాలి. మనిషి జీవితానికీ ఇది వర్తిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి మనసు బాగుండాలి. మనసు మంచిగా ఉండాలంటే అది ఆనందంతో నిండాలి. దానికి ధ్యానమే అంతిమ సోపానం.


గోళ్లను గోళ్లతో రాపిడి చేయడం, ఆహారం సేవిస్తున్నప్పుడు పండ్లతో బాగా నమలడం వల్ల ఆరోగ్య ఫలాలు అందుతాయని యోగా చెబుతుంది. పైగా హింసా ప్రవృత్తి విడనాడి అహింసా మార్గం అలవడుతుంది. అందుకే నెమరువేసే గుణం ఉన్న పశువులు సాధు స్వభావం కలిగి ఉంటాయి. మనిషికి కోపం వచ్చినప్పుడు శక్తి విస్ఫోటం చెంది మనిషిలోని బలం వృథా అవుతుంది. క్రోధం కలిగే క్షణాల్లోనే దాని మూలాన్ని పట్టుకుని గమనించితే, ఆ కోపమంతా ప్రేమగా రూపాంతరం చెందుతుంది. అదే ధ్యానం వల్ల కలిగే రహస్య ప్రయోజనం.

రోజూ ఉదయం, సంధ్యా కాలాల్లో ధ్యాన సాధన సాగుతుంటే జీవితం పట్ల ఒక స్పష్టత వస్తుంది జీవితానికి లక్ష్యమూ ఏర్పడుతుంది. ఎలా జీవించాలో తెలుస్తుంది.🙏

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం...

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం.....
సూర్యాష్టకం (Surya Ashtakam is the devotional Prayer to Lord Surya i.e. Planet Sun. Surya Ashtakam is taken from ancient Hindu text Samba Puranam. This was told by Samba who is the son of Lord Sri Krishna and Jambavati.) లోని చివరి రెండు శ్లోకాలు ఈ కింది శ్లోకాలు

అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||

తాత్పర్యం:

మాంసం తినడం,
మద్యం తాగడం,
స్త్రీతో సాంగత్యం,
తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు ఇలా చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించెయి దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా

అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.

ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి
ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.

ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు.

మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వన్నీ తెలిపేది మన హైందవ సంస్కృతి.

అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు.

మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు మధ్యాన్ని తాగే వారు కాదు
కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది.

ఈ పోస్టు హిందూ సోదరులకు ఉత్సాహాన్ని మరియు నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. దీన్ని పాటించడానికి ప్రయత్నించండి...

|| ఓం నమః శివాయ ||🙏🏽🙏🏽

రేమాండ్ అధిపతి జీవితాన్ని చూస్తే, ప్రాణం విడిచే వరకు కొంత మొత్తం ఉంచుకోవాలనేది అర్థమవుతోంది.

రేమండ్ కంపెనీ వ్యవస్థాపకుడు విజయ పత్ రేమండ్స్ చరిత్ర ప్రతి తల్లి తండ్రులకు ఒక గుణపాఠం కావాలి... Heart touching story... Read fully
మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అని కార్ల్ మార్క్స్‌ ఏనాడో చెప్పాడు. అది నిజమేనని నేటి సమాజం నిరూపిస్తోంది

పిల్లలను గుడ్డిగా ప్రేమించే తల్లిదండ్రులకు ఈయన జీవితం ఓ గుణపాఠం.

మానవ సంబంధాల్లో ఆర్థికపరమైన అంశాలకే మనుషులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మనీ మాయలో తోటివారినే కాదు కుటుంబసభ్యులను కూడా మర్చిపోతున్నారు.

మనిషిలో పెరుగుతున్న స్వార్థం, డబ్బుమీద పెరుగుతున్న మోజు కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాయి.

తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లు, కొడుకులు, కూతుళ్లు డబ్బుకిస్తున్న ప్రాధాన్యత ప్రేమానురాగాలకు ఇవ్వకపోవడం వారి మధ్య అగాధాన్ని పెంచుతోంది.

అసలు డబ్బు పిచ్చి ఏ రేంజ్ లో ఉందంటే.. కన్నవారినే రోడ్డున పడేసే దుస్థితి వచ్చింది.

ఇలాంటి ఘటనే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వస్త్ర పరిశ్రమలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన రేమాండ్స్ వ్యవస్థాపకుడు విజయ్ పథ్ సింఘానియా ఇప్పుడు వీధినపడ్డారు. కొడుకు బయటకు గెంటేయడంతో బిచ్చగాడిలా మారారు.

రేమాండ్‌ వస్త్ర సామ్రాజ్యాన్ని స్ధాపించి. రెండు దశాబ్దాలకు పైగా దుస్తుల రంగంలో ఆ బ్రాండ్‌ను తిరుగులేకుండా నిలిపిన పారిశ్రామిక దిగ్గజం విజయ్‌పథ్‌ సింఘానియా(80). వేల కోట్ల ఆస్తులు సంపాదించిన ఈయన.. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు.

తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయల వ్యాపారంతో తులతూగిన విజయ్ పథ్ సింఘానియాకు ఈ కష్టాన్ని తెచ్చిపెట్టింది మరెవరో కాదు ఆయన పుత్రరత్నమే.

వ్యాపారాన్నంతా కైవసం చేసుకుని తండ్రిని వీధిన పడేశాడు కొడుకు. తండ్రి కనీస అవసరాలను తీర్చేందుకు కూడా డబ్బు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారట. వెయ్యి కోట్ల రేమండ్‌ సంస్థను, 36 అంతస్థుల భవనాన్ని విజయ్‌పథ్‌ సింఘానియా తన కొడుకుకు ఇచ్చారు. ఆస్తి మొత్తం రాయించుకున్న తర్వాత.. తండ్రిని ఇంట్లో నుంచి గెంటేశాడు.

చేతిలో చిల్లిగవ్వ లేక అద్దె ఇంట్లో విజయ్ సింఘానియా నానా అవస్థలు పడుతున్నారు.

విధిలేని పక్షంలో కోర్టును ఆశ్రయించారు. 80ఏళ్ల వయసులో ఆయన పడుతున్న ఈ కష్టాన్ని చూసి ఇరుగుపొరుగు వారు ఆవేదన చెందుతున్నారు.

తనకు రావాల్సిన ఆస్తి, డబ్బును ఇప్పించాలని రేమండ్ దిగ్గజం విజయ్ పథ్ సింఘానియా కోర్టును వేడుకుంటుననారు.

ఎనిమిది పదుల వయసులో హాయిగా పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకోవాలి. ఆనందంగా జీవించాలి. అలాంటిది. విజయ్ సింఘానియా.. కుమారుడు గౌతమ్ సింఘానియాతో ఆస్తి కోసం పోరాడాల్సి రావడం బాధాకరం.

రూ. 1041 కోట్లను కొడుక్కు రాసిచ్చిన సింఘానియా.. ఇప్పుడు వృద్దాప్యంలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

వేల కోట్ల ఆస్తిని తీసుకున్న కొడుకు గౌతమ్‌.. ఇప్పుడు వృద్ధుడైన తండ్రికి కనీసం కారు, డ్రైవర్‌ లేకుండా చేసేశారని న్యాయస్థానానికి విన్నవించారు విజయ్ సంఘానియా తరపు న్యాయవాది.

తనకున్న విలువైన షేర్లు, ఇతర ఆస్తులన్నింటిని కొడుకు గౌతంకు ఇచ్చినా.. ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ సాగుతోంది.

రేమాండ్ కంపెనీ పేరుతో 36 అంతస్థుల భవంతి ముంబైలో ఉంది. కానీ విజయ్ పథ్ అద్దె ఇంటిలో ఉంటున్నారు.

విజయ్‌పథ్‌ సింఘానియాకు నెలకు రూ.7లక్షల చొప్పున కంపెనీ నుంచి రావాల్సి ఉందని ఆయన న్యాయవాదులు చెప్పారు. అంతేకాదు, కంపెనీ ఖర్చులతో ఆయనకు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాల్సి ఉందన్నారు. ఈ నెల 18 నాటికల్లా దీనిపై సమాధానాన్ని దాఖలు చేయాల్సిందిగా రేమాండ్స్‌ సంస్థను కోర్టు కోరింది. 22న దీనిపై తదుపరి విచారణ జరుగుతుంది.

కొడుకుల కోసం సంపాదించి పెట్టిన రేమాండ్ అధిపతి.. చివరకు అదే డబ్బు కోసం కోర్టులకు వెళ్లడం ఆశ్చర్యమే.

ఎంత కొడుకులు, కూతుళ్ల మీద ప్రేమ ఉన్నా.. ప్రాణం విడిచే వరకు కొంత మొత్తం ఉంచుకోవాలనేది రేమాండ్ అధిపతి జీవితాన్ని చూస్తే అర్థమవుతోంది.
👏

About microwave ovens & Kashira Cancer Center recommendations



Japan govt has decided to dispose of all the " microwave ovens" in the country b4 this year end.

Reason for this ban: University of Hiroshima's scientists researched n found dat "radio waves" from microwave ovens cause greater harm to health over the last 20 yrs, than the US atomic bombs on Hiroshima n Nagasaki in Sep 1945.

Experts found dat food heated in microwave ovens has very unhealthy vibrations n radiation.

All the factories of "microwave ovens" in Japan are being closed.

S Korea announced plans to close all "microwave ovens" factories by 2021, n China by 2023.

A conference on cancer prevention held @ Kashira Cancer Center recommended:
1. No Refined oil
2. No Milk of animal origin (recommended soy milk)
3. No Food cubes (chicken broth spices like Maggie etc)
4. No Soda (32 pieces of sugar per liter)
5. No Refined sugar
6. No Microwave ovens
7. No mammogram b4 birth, except echocardiography
8. No Very narrow underwear n bra
9. No Alcohol
10. Do not re-freeze thawed food.
11. Do not drink chilled water kept in plastic bottles stored in the fridge.
12. Avoid deodorants usu used after shaving or baths bc they cause cancer.

The conference advise adding these to your diet :
1. Vegetables
2. Honey moderately used instead of sugar
3. Plant proteins (beans instead of meat)
4. 2 cups of water at body temp on empty stomach b4 brushing teeth
5. Food should be warm n not very hot
6. Aloe vera juice + ginger + parsley + celery + bromalin (Mix n drink on an empty stomach)
7. Carrot juice daily
8. Tomato, garlic onion with meals

Note : The American Physicians Association found the causes of cancer:
1. Do not drink anything hot in plastic cups
2. Do not eat anything hot wrapped in paper or cardboard or in a plastic bag (eg fried potatoes)
3. Don't eat in plastic or microwave dishes

Note:
When plastic is exposed to heat, chemicals dat can cause 52 cancer types are released.

You must also avoid drinking all kinds of soft drinks such as "Cola, Pepsi, Av, Fanta n all concentrated juices because cancer feeds on sugar. Eat fresh pineapples n avoid pineapple mix. Don't eat heavy food after 7pm.

Drink more water in the morning n less in the evening. Do not take a horizontal position (lying down/sleep) immediately after eating.

Share this with your loved ones

భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు

భార్యాభర్తల అనుబంధం గురించి అమృత వాక్యాలు
%%%%%%%%%%%%%

నీకెంత అదృష్టం కలసి వచ్చినా నువ్వెంత కష్టం చేసే వాడివే అయినా నీ భార్య సహకారం లేనిదే నువ్వే రంగంలోనూ రాణించలేవు.

తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఓ వరమే.

అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కుతినేవాడు కూడా హాయిగా జీవిస్తాడు.

అహంకారి భార్య దొరికితే అంబానీ కూడా సన్యాసంలో కలవాల్సిందే.

ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే,ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తే ఇదే మధురమైన బంధం.

భార్యకు సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు అర్థం.బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం.

సంసారం అంటే కలసి ఉండడమే కాదు.
కష్టాలే వచ్చినా కన్నీరే ఏరులై పారినా ఒకరిని ఒకరు అర్థం చేసుకోని కడవరకూ తోడూ వీడకుండా ఉండడం.

ఒక మంచి భర్త భార్య కన్నీరు తూడుస్తాడెమో కానీ అర్థం చేసుకునే భర్త
ఆ కన్నీటికి కారణాలు తెలుసుకుని మళ్లీ తన భార్య కళ్లలో కన్నీరు రాకుండా చూసుకుంటాడు.

భార్యాభర్తల సంబంధం శాశ్వతం.కొంతమంది మధ్యలో వస్తారు.
మధ్యలోనే పోతారు.
భార్యకి భర్త శాశ్వతం.
భర్తకు భార్య శాశ్వతం.

ఇంటి వ్యవహారాలు చక్కగా నిర్వహించగలిగే ప్రతి గృహిణీ గొప్ప విద్యావంతురాలి కిందే లెక్క!

అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు.భార్య లేకుంటే ఆ జన్మకు అర్థం లేదు.

మోజు తీరగానే మూలనేసేది కాదు మూడుముళ్ల బంధం.
ముసలితనంలో కూడా మనసెరిగి ఉండేది "మాంగల్య బంధం"

బంధాలు శాశ్వతంగా తెగిపోకుండా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి.మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.

మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిసను చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది.కానీ తెలివైన మహిళ తన భర్తను రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది.

కుటుంబంలో ఎన్ని కీచులాటలున్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది.భార్యను చులకనగా చూడకుండా గౌరవించవలసిన ధర్మం భర్తది.

నీ సంతోషం నేను కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే.
నీ ఆలోచన నేను కాకపోయినా నా ప్రతి ఙ్ఞాపకం నువ్వే.

ప్రేమ అనేది చాలా విలువైనది.దాన్ని "వివాహం"అనే అద్దాల బీరువాలో పెట్టుకుంటేనే అది రాణిస్తుంది.

సృష్టి తీర్చిదిద్దిన అతి గొప్ప కళాఖండం"కుటుంబం"

గొడవ పడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఒక గొప్ప వరం.

కలిమి లేములతో..
కలసిన మనసులతో...
కలివిడిగా మసలుకో..
కలకాలం సుఖసంతోషాలు పంచుకో..!

బంధం అన్నది అందమైన పుస్తకం లాంటిది.
పొరపాటు అనేది అందులో ఒక పేజీ మాత్రమే.

ఆ ఒక్క పొరపాటు జరిగితే సవరించాలి కానీ మొత్తం పుస్తకాన్ని చించి వేయకూడదు.

భర్తకి భార్య బలం కావాలి.
బలహీనత కాకూడదు
భార్యకి భర్త భరోసా కావాలి
భారం కాకూడదు.
భార్యా భర్తల బంధం అన్యోన్యం కావాలి
అయోమయం కాకూడదు.

మనసులోని ప్రేమని, బాధని కళ్లలో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకుమించిన అదృష్టం మరొకటి ఉండదు.

అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే
ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే.

పెళ్లి అంటే ఈడూ-జోడూ, తోడూ-నీడా,కష్టం- సుఖం గురించి కాదు.
ఇద్దరూ ఐక్యమైపోయి తమని ఉద్ధరించుకొనే ఒక మంచి అవకాశం.
ప్రతి అమ్మాయికి చదువుకున్న భర్త రావడం సహజం.కానీ తన మనసు చదివిన భర్త రావడం అదృష్టం.

చిరునవ్వులతో కూడిన దంపతులారా అందుకోండి ఇదే నా సలాం!

"మనస్పూర్తిగా....మీ...🙏

నిత్య పారాయణ శ్లోకాలు

నిత్య పారాయణ శ్లోకాలు
దైవ సన్నిధిలో జపించవలసిన శ్లోకములు.

ప్రభాత శ్లోకం :
కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ !
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ !!

ప్రభాత భూమి శ్లోకం :
సముద్ర వసనే దేవీ పర్వత స్తవ మండలే !
విష్ణుపత్ని సమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే !!

సూర్యోదయ శ్లోకం
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ !
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ !!

స్నాన శ్లోకం
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ !
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు !!

భస్మ ధారణ శ్లోకం
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ !
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ !!

భోజనపూర్వ శ్లోకం
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ !
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన: !!

అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ - మాశ్రిత: !
ప్రాణాపాన సమాయుక్త: పచామ్యన్నం చతుర్విధమ్ !!

త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే !
గృమాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర !!

భోజనానంతర శ్లోకం
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ !
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ !!

సంధ్యా దీప దర్శన శ్లోకం
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ !
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోఁస్తుతే !!

నిద్రా శ్లోకం :
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ !
శయనే య: స్మరేన్నిత్యమ్ దుస్వప్న - స్తస్యనశ్యతి !!

కార్య ప్రారంభ శ్లోకం :
వక్రుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ: !
నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా !!

హనుమ స్తోత్రం :
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !
వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా సమామి !!

బుద్ధిర్భలం యశొధైర్యం నిర్భయత్వ - మరోగతా !
అజాడ్యం వాక్పటుత్వం హనుమత్ - స్మరణాద్ - భవేత్ !!

శ్రీరామ స్తోత్రం :
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ !
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !!
అగజానన పద్మార్కం గజానన మహర్ణిశమ్ !
అనేకదంతం భక్తానా - మేకదంత - ముపాస్మహే !!

శివ స్తోత్రం:
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధినమ్ !
ఉర్వారుకమి’ వ బంధ’ నాన్ - మృత్యో’ర్ - ముక్షీయమాఁ మృతా’’త్ !!

గురు శ్లోకం :
గురుబ్రహ్మా గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: !
గురు: సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ: !!

సరస్వతీ శ్లోకం :
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ !
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా !!

యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా !
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా !!
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ - దేవై: సదా పూజితా !
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా !!

లక్ష్మీ శ్లోకం
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ !
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురామ్ !
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ !
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ !!

వెంకటేశ్వర శ్లోకం :
శ్రియ: కాంతాయ కళ్యాణనిధయే నిధయేఁర్థినామ్ !
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ !!

దేవీ శ్లోకమ్
సర్వ మంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే !
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే !!

దక్షిణామూర్తి శ్లోకం.

గురువే సర్వలోకానాం భిషజే భివరోగినామ్ !
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ: !!

అపరాధ క్షమాపణ స్తోత్రం.

అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !
దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే: స్వభావాత్ !
కరోమి యద్యత్సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి !!

దాంపత్య దోష నివారణ కాత్యాయని మాత దేవతా మంత్రం


అన్యోన్య దాంపత్యం

దాంపత్యం అంటే… భార్యాభర్తల అన్యోన్యత. ఇది ఒక శాశ్వతబంధం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు.. అంటూ దాంపత్య ధర్మాన్ని దేవతా స్థానంలో ఉంచి ఆరాధించే సంప్రదాయం మనది. ఆ దేవదంపతులకు అనేకమార్లు కళ్యాణాలు చేస్తూ.. ఆ ఉత్సవాల ద్వారా వివాహ వ్యవస్థలోని పవిత్రతనీ, దాంపత్యంలోని శాశ్వతత్వాన్ని గుర్తు చేసుకుంటాం.

ధ్రువాసి ధ్రువోయం యజమానో స్మిన్నాయతనే!! (యజుర్వేదం)
'ఈ గృహంలో నువ్వు శాశ్వతం, యజమానియైన ఇతడు (భర్త) శాశ్వతం' ఈ వేద వాక్కు. మార్పు చెంద(కూడ)ని దంపతుల స్థిరత్వాన్ని చాటుతోంది. 'యజమాని' అంటే సత్కర్మను (యజ్ఞాన్ని) ఆచరించు వాడు అని సరైన నిర్వచనం.

భారతీయ దృక్పథంలో సతీపతుల బంధం ఇహలోక, పరలోకాలకు, జన్మజన్మలకు కొనసాగుతుంది. ఇంద్రాదులు, గంధర్వాదులు ఆ జాయాపతులకు బంధాన్ని ఏర్పరచిన వివాహ మంత్రాలు చెబుతున్నాయి. దంపతుల స్థిరత్వం కుటుంబానికి పునాది. దంపతులు అభిరుచులు, అభిప్రాయాలు, ప్రేమానురాగాలను పంచుకుంటూ, పెంచుకుంటూ అన్నింటా కుటుంబంలో ఒదిగిపోవాలి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల దంపతుల మధ్య అనురాగం కరువగు చున్నది అటువంటి వారు ఈ క్రియతో మంచి ఫలములు పొందే అవకాశమున్నది.
నవదుర్గల్లో కాత్యాయని మాతకు ఆరో స్థానం. ఈమెకు గురు గ్రహం ఆధిపత్య దైవం. ఈమె సింహంపై ఆసీనురాలై వుంటుంది. త్రినేత్రాలను కలిగివుంటుంది. కాత్యాయని మంత్ర జపంతో కుజ దోషాలు హరించుకుపోతాయి. దాంపత్య జీవనంలో వుండే దోషాలను ఇది తొలగిస్తుంది. కాత్యాయని మంత్రాన్ని జపించే దంపతులు అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. ''కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరి
నంద గోప సుతం దేవీ పతిమే కురుతే నమః
అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః
కామేశ బద్ధ మాంగల్య సూత్ర శోభిత కందర
విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రయంబికే దేవీ నారాయణే నమోస్తుతే" 41 రోజులు అమ్మవారిని ఈ మంత్రంతో జపిస్తే దాంపత్య దోష నివారణ జరుగుతుంది. భార్యాభర్తల మధ్య విడాకులు అనే మాటకు చోటుండదు. ఇంకా దంపతుల మధ్య వివాదాలుండవు.
దీనితోపాటు సుదరకాండలో 24 వ సర్గ పారాయణకూడా మంచి ఫలితమును కలుగ చేయగలదు.
శుభం
లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి*

🌷 గోమాత స్దానంలో బర్రె ఎలా 🌷❓

🌷 గోమాత స్దానంలో బర్రె ఎలా 🌷 ❓

మీకు తెలుసా చాయి ( TEA ) భారత దేశంలో... గో వంశాన్ని కసాయి పాలు చేసింది. ఇది 100% సత్యం.

క్రైస్తవబ్రిటీషర్లు భారత దేశ వైభవాన్ని సంపదను, వనరులను, అభివృద్ధిని ఇక్కడి వైజ్ఞ్యానిక సంపదను భారతీయుల మేధా శక్తిని అధ్యయనం చేసి వీటన్నింటికి మూలాధారం మరియు భారతీయుల సంస్కృతి జీవన విధానం మనుగడకు గోవె ప్రధాన కారణమని దేశ అభివృద్ధికి గోవే మూలమని అన్ని కోణాల్లోంచి నిర్ధారించుకొని...

భారతీయుల జీవన విధానం నుండి గోవును తప్పిస్తే తప్ప తమ లక్ష్యం సాధించలేము అని భావించుకొన్ని కుట్రలు చేసినారు అందులో ఒకటి ఈ దిక్కుమాలిన ➖ టి ( చాయ్ )

పథకం ప్రకారం దేశంలోని గ్రామాల్లో, పట్టణాల్లోని చౌరస్తాల్లో ఉచిత చాయ్ పంపకం కేంద్రాలు ఏర్పాటు చేసి జనాలకు అలవాటయ్యే వరకు ఫ్రీ టి సెంటర్లను నడిపినారు ప్రజలు చాయ్ కి బానిసలూ అయ్యారని నిర్ధారించుకొని తరవాత చాయ్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆపి కేవలం చాయ్ పత్తి పాకెట్స్ ఫ్రీగా పంచడం ప్రారంభించారు.

ప్రజలు వాటిని పట్టుకెళ్లి తమ తమ ఇళ్లల్లో టీ చేసి త్రాగితే దాని రుచి కోల్పోయి చాయ్ కుదరలేదు జనాలు పరుగెత్తి వారి వద్దకు వెళ్లి టీ బాగ లేదు అని అడుగగా అప్పుడు వారు అన్నారు మేము మీకు ఫ్రీగా పంచిన టీ బర్రె పాలతో చేసినాము టీ ఆవు పాలతో రుచిగా రాదు అన్నారు.

అప్పటి వరకు దేశంలో ఇంటింటికి గోవులు ఉండేవి వెంటనే దేశంలో బలమైన మార్పు ప్రారంభమ...
దేశ వ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లల్లోని కొట్టాల నుండి ఒక అవును బైటకు పంపి ఒక బర్రె ను కట్టడం మొదలు పెట్టినారు!!

సమాజంలో పాలు కొనేవారు సైతం ఆవు పాలు విడిచి బర్రె పాలు కొనడం ప్రారంభమైంది.
మెల్లమెల్లగా దేశంలో బర్రె పాల డిమాండ్ ప్రారంభంమై వేగం పుంజుకుంది అప్పటి వరకు దేశం లోని పాడి పరిశ్రమలో గోవులు ఉండేవి వాటి స్థానంను బర్రెలు ఆక్రమించాయి!!

పెద్ద ఎత్తున గోవులు కబేళాల పాలవడం ప్రారంభమైంది తత్ కారణంగా వందలాది ఉత్తమ ప్రాచీన జాతులు నశించి పోయినాయి కోట్లాది గోసంతతి అంతరించి పోయింది ఇంటింటికి వర్ధిల్లె గోవులు 95% పైగా ఇళ్లల్లో మాయమైనాయి 😔

క్రైస్తవబ్రిటిష్ వారి అంచనా ప్రకారం భారతీయులు తరతరాలుగా ఆవు పాలు త్రాగడం వల్ల మంచి ఆరోగ్యం, మేధస్సు కలిగి ఉన్నారు వారిని బర్రె పాలకు మార్చడం వళ్ళ వారిలో చురుకు ధనం మేదా శక్తి తగ్గిపోతుంది తత్ద్వార అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గి మెల్లమెల్లగా మనిషి బలహీనమవుతాడు మనకు బానిసలవుతారు అని అంచనా వేశారు, పన్నిన కుట్ర సఫలమైది!!

భారతీయులు ఇంటి నుండి గోవువులని సడాక్ లోకి తోసివేసిన పాపాన భారతీయుల ఆయుష్షు 100 సంవత్సరాల నుండి ఆయుప్రమానం 60--70 కి పడిపోయింది ప్రతి ఇల్లు రోగాల కుప్పలాగా తయారైయాయి!!

ఇంట్లో గోవులు వున్నంతకాలం అనారోగ్యం, బద్ధకం, గ్రహాచార దోషం, అకాల మృత్యువు, శత్రు పీడ, వాస్తు దోషం, దరిద్రం, రసాయనిక ఎరువులు ఉండేవి కావు.

ఒక చాయ్ మూలంగా వ్యక్తి, కుటుంభం, గ్రామం, దేశం అలాగే వ్యవసాయం, భూసారం, ఆరోగ్యం, ఉపాధి పతనమై పోయినాయి!!

చాయ్ పట్ల లోభం ఎంతో అనర్ధానికి దారి తీసింది.
చాలా లోతుగా అలోచించి క్రైస్తవబ్రిటిషర్లు 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపనీ చాయ్ పత్తి వ్యాపారం పేరుతో ప్రవేశించి మనలను లక్షల సంవత్సరాల వెనక్కు నెట్టేసి అందిన కాడికి దోచుకొని వెళ్ళిపోయారు!!

క్రైస్తవబ్రిటిష్ చాయ్ కి పూర్వం మన దేశంలో అందరూ కేవలం ఆవు పాలు త్రాగేవారు.

క్రైస్తవబ్రిటిష్ దురాక్రమానకు పూర్వం దేశంలో పూరి గిడిసే మొదలుకొని ధనవంతుని భవంతులవరకు ప్రతి ఇంట్లో ఆవులు ఉండేవి అలా ఇళ్లల్లో గోవులు ఉన్నంత కాలం ప్రతి ఇల్లు దైవ శక్తితో నిండి ఉండేది ఆవు వ్యక్తి ఒక్క అనేక అవసరాలకు పెద్ద దిక్కుగా ఉండేది.

✨✨✨✨

సమస్త జీవరాశులకు ఆరోగ్య ప్రదాత సూర్య నారాయణుడు - సూర్యుని నుండి కోన్ని అద్భుత బంగారు ఓషధీ శక్తులు విడుదలవుతాయి భూమి పైన వాటిని గ్రహించే శక్తి కేవలం గో మాతాకె వున్నది ఆవు ఎండలో మెతమేస్తూ తిరిగేటప్పుడు సూర్య రేష్మి ద్వారా అట్టి దివ్యమైన శక్తుల్ని తన కొమ్ములోవుండే సూర్యకేతు నాడి ద్వారా గ్రహించి మూపురం వద్ద ప్రభావితమై తన పాలు పెడ మూత్రంలో వదులుతుంది మిగిలిన శక్తి తన కాళ్ళ ద్వారా అక్కడి భూమిలోనికి వదులుతుంది.

దేశవాళీ ఆవుపాలల్లో సూర్యుని యొక్క శక్తివంతమైన స్వర్ణ క్రాంతి ఉంటుంది అది మానవ శరీరానికి అత్యంత శక్తివంతమైన ఓషధ భాన్డాగారము పైగా పాలు మానవ శరీరానికి కావాల్సిన అన్నిరకాల పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారము.

ఇప్పుడు ట్రెండ్ మారింది మల్లి గ్రామాల్లో పట్టణాల్లో గోవు ప్రాముఖ్యతను గుర్తించి అన్ని సమస్యలకు రేడియేషన్ పొల్యూషన్ పాలిథిన్ కెమికల్స్ విష రసాయనాల దుష్ప్రభావం నుండి కేవలం గోవే కాపాడగలదని మరియ అంతే కాక గ్రహాచార దోషం వాస్తు దోషం అనేక అనారోగ్య సమస్యల నుండి గోవే కాపాడగలదని గ్రహించిన ఎందరో తమ తమ ఇళ్లల్లో ఫ్యాక్ట్రీలలో ఫామ్ హౌస్లలో వ్యవసాయ క్షేత్రాల్లో ఆసుపత్రుల్లో విద్యా సంస్థల్లో ఇండస్ట్రిస్ లలో గోవులు పెట్టుకోవడం ప్రారంభమైంది. మహానాగరాల్లో కొన్ని చోట్ల కొత్తగా కట్టే భవంతుల్లో గ్రౌండ్ ఫ్లోర్ పిల్లర్స్ మధ్య గోసధనాలను రూపొందిస్తున్నారు.

మన తల్లి గోవు పథనానికి కారణమైన చాయ్ త్రాగడం కన్నా మానవ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా కలిగి ఉండి సంపూర్ణ ఆహారంగా లభించే దేశవాళీ గోవు పాలనే సేవిద్దాం తిరిగి శక్తివంతమైన భారత దేశాన్ని నిర్మిద్దాం ✊️

✨ వందే గో మాతరం ✨ ➖ ✨ జైగోమాత ✨

సుందరకాండ విశిష్టత

సుందరకాండ విశిష్టత

ఆంజనేయుని సుందర రూపానికి దృశ్య మాలిక సుందరకాండ.
ఇది రామాయణంలో ఐదవ కాండ.
సుందరకాండను "పారాయణ కాండ" అని కూడా అంటారు.

సుందరకాండలో 68 సర్గలు ఉన్నాయి.
హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము,
లంకాదహనము,
సీత జాడను రామునికి తెలియజెప్పుట
ఇందులో ముఖ్యాంశాలు.

బ్రహ్మాండపురాణం ఈ కాండమును
"సమస్త మంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయః" అని, "బీజకాండమితి ప్రోక్తం సర్వం రామాయణేష్వసి" అని, "అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే .. ఏతత్పారాయణాత్సిద్ధిర్యది నైవ భవేద్భువి,
న కేనాపి భవేత్సిద్ధిరితి బ్రహ్మానుశాసనమ్" అని ప్రశంసించింది.

సుందరకాండకు ఆ పేరు ప్రతిపాదించడానికి
అనేక కారణాలున్నాయి.
తరచి చూస్తే, ఈ సుందరకాండ లో సుందరం కానిది
ఏది లేదని చెప్పవచ్చు.
శబ్ధ, అర్ధ మరియు రస సౌందర్యముల మేలుకలయిక సుందరాకాండ.

భగవానునికి విష్ణుసహస్రనామములలో ‘సుందరు’ అని నామము కలదు.
అలాగే అమ్మవారికి ‘సుందరి’ అని పేరు కలదు. సుందరుడు అనగా ఆనందము కలిగించువాడని అర్ధము. హనుమ సీతారాములిరువురికి ఆనందం కల్గించి సుందరుడైనాడు.
ఈ విధముగా పాత్రోచితరీతిలో సుందరకాండ శ్రీరాముని, సీత మరియు హనుమల సౌందర్యాలను దర్శంపచేస్తుంది.

ఆధ్యాత్మక చింతనతో చూస్తే..
భగవత్సౌందర్యమును,
జీవ సౌందర్యమును,
ఆచార్య సౌందర్యమును సుందరకాండ వర్ణిస్తుంది.

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథః సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం?

అనగా,సుందరుడైన రామచంద్రమూర్తిని వర్ణిస్తున్నది కావున ఇది సుందరకాండ.
సుందరమైన కథను చెబుతున్నది కావున సుందరకాండ. సుందరమైన సీతను గురించి చెబుతున్నది కావున సుందరకాండ.
సుందరమైన అశోకవనాన్ని వర్ణిస్తున్నది కావున సుందరకాండ.
సుందరమైన అంత్యాను ప్రాసలతో ఉపమాలంకార శబ్ధాలతో చెప్పబడినది కావున సుందరకాండ. సుందరమైన హనుమంతుడి గాథను చెబుతున్నది కావున సుందరకాండ.
పారాయణకు సంబంధించిన అన్ని రకములైన సుందర విషయాలు చెబుతున్నది కావున సుందరకాండ.

మంత్రయుక్తమైన రామాయణ కావ్యంలో,
విశేషించి సుందరకాండలో,
హనుమ యొక్క కుండలినీ యోగసాధన,
త్రిజటా స్వప్నంలో గాయత్రీ మంత్రం నిక్షేపింపబడినవి.

ఇది రామాయణమునకంతటికీ బీజ కాండము.
ఇందులో సీతయే పరాశక్తి అని వాల్మీకి వాడిన అనేక శబ్దాల వలన, పదాల వలన గ్రహించవచ్చును.
అట్టి అమ్మవారే సౌందర్యనిధి.
ఆమెయే సౌందర్యము.
శ్రీ దీప్తి హ్రీ శాంత్యాది శబ్దముల అర్ధము నందు
ఆమె వసించును కావున ఇది సుందరకాండమైందని గుంటూరు శేషేంద్ర శర్మ తన ‘షోడశి - రామాయణ రహస్యములు’ అనే పుస్తకంలో అభిప్రాయపడ్డారు.

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః
ఇయేష్ట పదమన్వేష్టుం చారణాచెరితేపథి.

సుందరకాండ ‘తత్’ అనే పదంతో కూడిన పైపద్యంతో మొదలవుతుంది.
తత్ అంటే పరబ్రహ్మము.
పరబ్రహ్మాన్ని ఎలా ఉపాసనచేయాలో సుందరకాండ వివరిస్తుంది.
అందుకే దీనిని ‘ఉపాసనకాండ‘ అని కూడా అంటారు. అటువంటి సుందరకాండను పారాయణం చేసే క్రమము: సంక్షేప రామాయణం,
శ్రీరామావతారము,
సీతాకళ్యాణము,
సీతారామోయోః సుఖజీవనము,
నాగపాశము విమోచనము,
ఆదిత్య హృదయము,
రావణవధ,
బ్రహ్మకృత రామస్తుతి,
పట్టాభిషేకము.
ఈ క్రమములో సంపూర్ణ రామాయణ పారాయణం చేసిన విశేష ఫలం లభిస్తుందని పెద్దలు చెపుతారు.

సుందర కాండం పారాయణ చేయడం వల్ల కలిగే ఫలితాలు
1.కళ్యాణం కావాల్సిన వారికీ కళ్యాణం,
2.ఆరోగ్య సంపద కోసం
3.గృహం లో శుభకార్యాలు జరగడం కోసం
4.భార్య భర్త ల మధ్య సఖ్యత కోసం
5.ఇంట్లో ఏవరైయినా తప్పి పోయినా,వారు తిరిగి ఇంటి కి రావడం కోసం
6.సంతానం కోసం
7.పిల్లల అభివృద్ధి కోసం
8.ధన ప్రాప్తి కోసం
9.అప్పులు తీరడం కోసం
10.శని దోష నివారణ కోసం
11.బుద్దిమాంద్యం తగ్గటంకోసం.
12.ఇంట్లో గ్రహపీడ తొలగటంకోసం.
13.మనసుకు శాంతి లభించి మానసిక బలం చేకూరటంకోసం.

(సేకరణ)

భ్రమ నేేేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో

👉 భ్రమ

నేేేనే కనుక లేకపోతే ఏమి జరిగి ఉండేదో....

పట్టాభిషేకం జరిగింది, శ్రీ రాముడు విశ్రాంతిగా కూర్చుని ఉన్నాడు. హనుమ రాముని వద్దకు వచ్చి ఇలా అంటున్నారు... ప్రభూ! లంకలో విభీషణుడు ఇంటికి వెళ్ళేంత వరకు , నాకు లంకలో అసలు మహా పురుషులు ఉంటారా నాకు కనబడతారా అనే సందేహం ఉండేది. ప్రభూ! భక్తులు, సాధువులు, సంత్ లూ కేవలం భరత భూమిలోనే ఉంటారనీ పృథ్విలో ఇంక ఎక్కడ ఉండరని అభిప్రాయం ఉండేది. కానీ లంకలో ఎంత వెతికినా సీతా మాతను కనుగొనలేకపోయిన వేళలో విభీషణుని సలహామేర తల్లిి
దర్శనం కలిగిన తరువాత అనిపించింది స్వామి ఎవరినైతే ఎంత వెతికినా చూడ లేకపోయానో ఆ తల్లి జాడ లంకలో ఒక సాధు పురుషుని ద్వారా తెలియజేయబడిందే..
బహుశా నా ప్రభువు నాకు ఈ సత్యాన్ని ఎరుకపరచడానికి పంపేడేమో అని అనుకున్నాను...

అశోకవనంలో రావణుడు తీవ్రమైన క్రోధంతో సీతా మాతను వధించేందుకు కత్తి దూసిన క్షణంలో , ఆ ఎత్తిన కత్తితో వాడి శిరస్సులు ఖండించి వాడిని అంతం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది. కానీ అంతలోనే మండోదరి ఆ దుష్టుడిని వారించి వాడి నుంచి అమ్మని కాపాడిన ఆ దృశ్యం నన్ను మ్రాన్పడేటట్లు చేసింది.

ప్రభూ! ఎంత చక్కని అనుభవమిచ్చావు, అక్కడ కూడా మంచి వారి రూపంలో మండోదరి తల్లి ని చూపించావు, నేనే లేకపోతే సీతమ్మని ఎవరు రక్షించగలిగే వారనే భ్రమ కలిగేది.

చాలా మందికి ఇటుు వంటి భ్రమే కలుగుతుంది, నా కూడ కలిిగిి ఉండేేది...

కానీ స్వామీ నీవు ఆ తల్లిని రక్షించడమేకాదు , ఆ పని స్వయం రావణుని పత్ని మండోదరి చేత చేయించేవు.
దీంతో నాకు, స్వామీ నువ్వు ఎవరితో నీ పని చేయించిలనుకుంటావో వారితో ఆ పని నెరవేర్చుకుంటావు.
ఇందులో మా మహత్వమేమీ లేదు.

దేవా! త్రిజట తన స్వప్ననవృత్తాంతం తోటి రాక్షస స్త్రీలకు చెబుతూ లంకలోకి ఒక కోతి వస్తుందనీ, ఆ వానరం లంకని దహిస్తుందని చెప్పగా విని నేను చాలా చింతలో మునిగిపోయాను. ప్రభు శ్రీీరాముడు నాకు లంక దహించడం గురించి ఏమీ ఆదేశమివ్వ లేదే కానీ ఇక్కడ త్రిజట ఇలా చెప్తోందే మరేం చేయాలి అని. రావణుడి ఆస్థానంలో రావణ సైనికులు ఆతని ఆజ్ఞ మేరకు నన్ను వధించేందుకు మీదకి ఉరికినపుడు విభీషణుడు వారించి దూతలను వధించడం నీతి కాదని అన్నకి నచ్చ చెప్పడంతో నాకు నువ్వు నన్ను కాపాడడానికి ఆ రావణుని తమ్ముణ్ణే నియోగించేవని అర్ధమైంది.

ఇంతలో నా ఆశ్చర్యం అవధులు లేేేనంతగా అయింది... రావణుడు తమ్ముని మాటమన్నించి నన్ను చంపకుండా నా తోకకి నిప్పు పెట్టమని భటులని ఆదేశించినపుడు...

లంకలో ఆ సాధ్వి త్రిజట చెప్పిన మాటలు ఈ విధంగా నిజమవుతున్నందుకు.
లేకపోతే లంకని దహించడానికి కావలసిన బట్టలు , నెయ్యి అన్నీ నాకెలాగ సమకూరేవి తండ్రీ....

ఒక భక్తురాలి మాట నెగ్గించడానికి నువ్వు రావణునే ఉపయోగించుకొని కార్యం నడిపావు, అటువంటిది నాచే చేయించుకోవటంలో ఆశ్చర్యం ఏమున్నది ప్రభూ!🙏🙏
దీనిని పట్టి నేను నిమిత్త మాత్రుణ్ణి , మీ కార్యం మీరే నెరవేర్చుకుంటున్నారు, అని అర్థం అయింది,

నీతి

అందుచేత మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే... మన జీవితాలలో ఏం జరిగినా మనమేమి సాధించినా అది ఈశ్వర సంకల్పమే కానీ మన గొప్పతనమో మన సాధకత్వమో కాదు..
అందుకని నేనే కనక లేకపోతే ఏమీ జరగదు అనే భ్రమ ఎన్నడూ కలగకూడదు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

వ్యాపారంలో దానధర్మాలు ఉండకూడదు. దానంలో వ్యాపారం చూడకూడదు

ఇంటి గుమ్మం ముందు కూర్చొని బియ్యంలో రాళ్లు ఏరుతోంది అమ్మ. కొడుకు పక్కనే కూర్చుని చదువుకుంటున్నాడు. అంతలో అక్కడికి ఆకుకూరలమ్మే ఒకామె వచ్చింది. ‘‘ఆకుకూర కట్ట ఎంత?’’ అడిగింది అమ్మ. ‘‘అయిదు రూపాయలు’’ చెప్పిందామె.
‘‘నాలుగు కట్టలు తీసుకుంటాను. కట్ట మూడు రూపాయలు చేసివ్వు’’
‘‘నాకు గిట్టదమ్మా...’’ అని ఆకుకూరామె గంప తీసుకొని బయలుదేరింది. అయితే నాలుగడుగులు వేసి మళ్లీ వెనక్కి తిరిగి ‘‘అమ్మా, కట్ట నాలుగు చేసుకోండి’’ అంది.
‘‘కుదరదు. మూడంటే మూడే’’ అందా అమ్మ.‘‘సరే’’ అని ఆమె ఆకుకూర ఇచ్చి వెళ్లబోతుంటే కొంచెం నీరసంగా ఉన్నట్లు అనిపించింది.
‘‘ఏంటమ్మా, తినలేదా? నిస్సత్తువగా కనిపిస్తున్నావు’’ అమ్మ అడిగింది.
‘‘లేదమ్మా. ఇవన్నీ అమ్మి ఇంటికెళ్లి వండుకొని తినాలి’’ అందా కూరలామె.
‘‘సరేలే, ఇంత నీరసంలో ఆ గంప ఎత్తుకొని ఎక్కడ తిరుగుతావు. ఏమన్నా తిని వెళ్దువుగాని రా’’ అని అమ్మ ఆమెని ఇంట్లోకి తీసుకెళ్లి ఇడ్లీలు పెట్టింది. వాటిని తృప్తిగా తిని, గంప తీసుకొని ఆ కూరలమ్మి వెళ్లిపోయింది.
ఇదంతా గమనిస్తున్న కొడుకు ‘‘అమ్మా, కూరాకు దగ్గర బేరం ఆడావు. కట్ట అయిదు రూపాయల చొప్పున నాలుగింటికి ఇరవై రూపాయలే అవుతుంది. కానీ, నువ్వు ఆమెకి ఆరు ఇడ్లీలు పెట్టావు. హోటల్‌ రేటు ప్రకారమైతే అవి ముప్పై రూపాయలు అవుతాయి కదా?!’’ అన్నాడు.
‘‘కన్నా, వ్యాపారంలో దానధర్మాలు ఉండకూడదు. దానంలో వ్యాపారం చూడకూడదు’’ కొడుకు వైపు ప్రసన్నంగా చూస్తూ చెప్పిందా అమ్మ.
ఆ మాటలతో కొడుకు మస్తిష్కంలో ఎక్కడో జ్ఞానజ్యోతి వెలిగింది. అది జీవితాంతం అతణ్ని మానవతామూర్తిగా నిలిపే దివ్య జ్యోతి.

విషం నీ మనసులో ఉండేది... ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది.

ఈరోజు మరొక జీవిత సత్యం. ఆమెకి అత్తగారితో అస్సలు పడటం లేదు.
ఆమెతో నిత్యం వాదులాటే... రోజూ మాటలయుద్ధమే.
ఇక ఉండలేననుకుంది.

తండ్రి దగ్గరకి వచ్చి "నాన్నా.... ఈ అత్తని అంతం చేసెయ్యాలి... అది బతికున్నంతకాలం నాకు శాంతి లేదు. కాసింత విషం ఇవ్వు నాన్నా
.....ఆ ముసలి దాన్ని చంపేస్తాను.
పీడ విరగడౌతుంది." అంది.

తండ్రి "సరేనమ్మా... అయితే ఆమె ఉన్నట్టుండి చనిపోతే అందరికీ నీ మీదే అనుమానం వస్తుంది. కాబట్టి నెమ్మదినెమ్మదిగా పనిచేసే విష మూలికలు ఇస్తాను.

అన్నంలో కలిపి ఇవ్వు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆమెతో ప్రేమ నటించు. ఆమె చెప్పినట్టుచెయ్యి.
ఆమెకి కూడా నువ్వు విషo ఇస్తున్నట్టు అనుమానం రాకూడదు. నీ భర్తకూ అనుమానం రాకూడదు." అన్నాడు.

ఆయన విషం ఇచ్చాడు.
కూతురు తెచ్చుకుంది.

రోజుకింత అన్నంలో కలిపి అత్తకు పెట్టడం మొదలుపెట్టింది.
ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించేది. అత్తా అత్తా అంటూ ఆమె చుట్టూ తిరిగేది.

అత్త మాటలన్నా పట్టించుకునేది కాదు. సేవలు చేస్తూనే ఉండేది.
అటు అత్తలోనూ క్రమీపీ మార్పు రావడం మొదలైంది.
"నా కోడలు బంగారం" అంటూ పదిమందికీ చెప్పుకోవడం మొదలుపెట్టింది.
కూతురు పట్ల ఎంత ప్రేమ చూపేదో కోడలు పట్లా అంతే ప్రేమ చూపించేది.

ఇంకొన్నాళ్లకి కోడలు మనసులో పశ్చాత్తాపం మొదలైంది.
"అయ్యో ఇంత మంచి అత్తను చంపుకుంటున్నానా... నా' చేజేతులా విషం పెడుతున్నానా?" అని బాధ పడసాగింది.

ఉండబట్టలేక తండ్రి దగ్గరికి పరుగుపరుగున వెళ్లింది.

"నాన్నా ... విషానికి విరుగుడు ఇవ్వు నాన్నా... అంత మంచి ఆమెను చంపుకోలేను. ఆమె నాకు అమ్మ తరువాత అమ్మ లాంటిది." అంటూ కన్నీరు పెట్టుకుంది.

తండ్రి నవ్వాడు.

"అమ్మా... నేనిచ్చిన దానిలో విషం లేదు. అవి బలం మూలికలు మాత్రమే... వాటిలో విషం లేదు...

విషం నీ మనసులో ఉండేది... ఇప్పుడు అది కూడా విరుగుడైపోయింది." అన్నాడా తండ్రి 🙏🏼

Friday, January 31, 2020

పిల్లలు - సంస్కారం

పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాలని, వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని మనం సహజంగా కోరుకుంటాం. విద్యకు ప్రాధాన్యమిచ్చిన సంస్కృతి మనది. పిల్లలు ఏ వయసు నుంచి నేర్చుకోగలుగుతారు, ఏ వయసులో వారికి ఏం నేర్పించగలం అని తరచూ తల్లిదండ్రులు ఆలోచించే ప్రశ్న. పిల్లలు తల్లి కడుపులో ఉండగానే కొన్ని విషయాల్ని గ్రహించగలరని ఇటీవల అనేక పరిశోధనల్లో తేలింది. దీన్ని prnatal learning అన్నారు. ఈ విషయంపై మన పూర్వీకులు పరిశీలించిన విధానాన్ని మహాభారత కాలం నుంచి చూడగలం. తల్లి గర్భంలోని పిల్లలు విషయాల్ని ఎలా గమనిస్తారన్న అంశంపై మన సంస్కృతిలో అనేక కథలున్నాయి.
మనందరికీ తెలిసిన కథ అభిమన్యుడి గురించి. అతడు గర్భంలో ఉండగానే ఒకానొక సమయంలో తల్లిదండ్రుల సంభాషణను విన్నాడట. అర్జునుడు.. సుభద్రతో యుద్ధంలోని వ్యూహాల్ని గురించి ముచ్చటిస్తూ సైన్యాన్ని పద్మవ్యూహంలో ఎలా నిలపాలి అనే విషయంపై చర్చించాడట. మాట్లాడుతూ ఆ మాటల్ని మధ్యలో ఎందువల్లనో ఆపినట్లు.. అందువల్ల అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసినట్లు భారతంలో గమనిస్తాం. అలాగే భారతంలోని వనపర్వంలో అష్టావక్రుడు అనే మహర్షిని గూర్చి మరొక కథ ఉంది (అధ్యా: 132-34). అష్టావక్రుడు చరిత్రలోని వ్యక్తియే. ఇతడు రాసిన అష్టావక్రసంహిత (అష్టావక్ర గీత) అనే వేదాంత గ్రంథం ప్రసిద్ధమైంది. ఇతని తండ్రి కహూలుడు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రి, తాతలు వేదాన్ని వల్లెవేయడం జాగ్రత్తగా విన్నాడట. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ఒక స్వరాన్ని తప్పుగా పలికినపుడు గర్భంలో ఉన్న అష్టావక్రుడు ఆ తప్పును సూచించాడట. ఆ సమయంలో మిగతా శిష్యులు కూడా ఉండటంతో తండ్రి దాన్ని అవమానంగా భావించి గర్భస్త శిశువుకి శాపం పెట్టాడు. దానివల్ల ఆ శిశువు ఎనిమిది వంకరలతో పుట్టాడని, అందువల్ల అతడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చిందని చదువుకున్నాం. కాలక్రమేణ అష్టావక్రుడు గొప్ప పండితుడయ్యాడనీ, తండ్రి అనుగ్రహంతో మళ్లీ సాధారణ రూపాన్ని పొందాడని సుదీర్ఘమైన కథ.

మనకు పరిచయం ఉన్న మరొక పురాణగాథ ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో అదను చూసి ఇంద్రుడు రాక్షసులపై దాడికి వెళ్లాడట. రాక్షసుల్ని తరిమిన తర్వాత హిరణ్యకశిపుడి భార్య గర్భవతి అని తెలిసిందట. ఆమెకు పుట్టబోయే బిడ్డను కూడా రాక్షసుడే కాబట్టి అతడ్ని సంహరించాలని ఆమెను కూడా బందీగా తీసుకున్నాడట. ఆ సమయంలో నారదుడు ఇంద్రుడ్ని అడ్డుకుని ఆమెకు కలగబోయే సంతానం గొప్ప విష్ణుభక్తుడు అవుతాడనీ, హిరణ్యకశిపుడిని అణచడానికి కూడా కారణమవుతాడని చెప్పడంతో ఇంద్రుడు ఆమెను వదిలాడట. నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచి విష్ణుభక్తి బోధించాడట. నారదుడి విష్ణుభక్తి గానాన్ని గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా విని గొప్ప విష్ణు భక్తుడయ్యాడని భాగవతంలో చూస్తాం.

గర్భంలోనే విద్యను నేర్చిన పై కథల్లాగానే పూర్వ జన్మ సంస్కారంతో జ్ఞానిగా పుట్టిన మరొక కథ కపిలుడు అనే మహర్షిని గూర్చి. కపిలుడు కూడా చరిత్రలోని వ్యక్తే. ఇతణ్ణి సాక్షాత్తు విష్ణువు అవతారంగా భాగవతం వర్ణిస్తుంది. ఇతని తల్లి పేరు దేవహూతి. ఇతడు పుట్టుకతోనే గొప్ప జ్ఞానియైు బాల్యంలోనే తన తల్లికి వేదాంత శాస్త్రంలోని గంభీరమైన విషయాల్ని బోధిస్తాడు.

పిల్లలు ఏ విధంగా తయారు కావాలని తల్లిదండ్రులు తీవ్రమైన విశ్వాసంతో కోరుకుంటే వారు అలాగే అవుతారని చెప్పడానికి మరొక కథ ఉంది. ఇది మార్కండేయ పురాణం (అధ్యా: 21-22) లోనిది. రుతధ్వజుడు గొప్ప ధార్మికుడైన రాజు. గంధర్వ రాజకుమారి అయిన మదాలస అతని భార్య. తన పిల్లలు కూడా మంచి పరాక్రమవంతులైన, ధార్మికులైన రాజులు కావాలని రుతధ్వజుడి కోరిక. తన పిల్లలకి విక్రాంతుడు, శత్రుమర్ధనుడు మొదలైన పేర్లు పెట్టాడు. మదాలస మాతరం ఆ పిల్లల్ని ఆడించే సమయంలో జోలపాటలు పాడుతూ వేదాంతాన్ని చెప్పింది. నీకు జరిగిన నామకరణం కేవలం కల్పన మాత్రమే. నీవు పరిశుద్ధుడైన బ్రహ్మవి, పంచభూతాల వల్ల నీ దేహం ఏర్పడింది, శుద్ధచైతన్య రూపుడైన నీకు ఈ దేహం ఒక తొడుగు మాత్రమే అంటూ జోలపాటలు పాడేదట. ఆ పిల్లలు దానికి అనుగుణంగా బాల్యంలోనే విరక్తిని పొంది రాజ్యాన్ని వదిలి వెళ్లారు. రాజు చాలా బాధపడ్డాడు. నాలుగో కొడుకు పుట్టిన తర్వాత రాజు తన అసహనాన్ని ఆపుకోలేక మదాలసను గతంలోలా చేయకుండా వారించాడు. మదాలస ఆ బాలుడిని లాలించే క్రమంలో నీవు గొప్ప జ్ఞానివై ప్రజారంజకంగా రాజ్యాన్ని పాలిస్తావు అని కోరుతూ జోలపాట పాడిందట. ఆ బాలుడు వారు ఆశించిన విధంగా గొప్ప చక్రవర్తి అయ్యాడట.

పిల్లలు అతి చిన్న వయసు నుంచే అనేక విషయాల్ని గ్రహించగలరనే పరిశీలనను పై కథలో చూడగలం. కథలోనే కాక ఈ విషయంపై శాస్త్రీయ చర్చ చాలాచోట్ల ఉంది. భాగవతంలోనే కపిలుడు తన తల్లికి వేదాంత బోధ చేసిన సందర్భంలో (స్కంధం: 3, అధ్యా: 31) జీవుడు గర్భంలో పడిన సమయం నుంచి క్రమక్రమంగా ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని వర్ణించాడు. ఇదే విషయాన్ని గర్భోపనిషత్తు అనే ఉపనిషత్తు చెబుతుంది. గర్భం ఏర్పడినపుడు తొమ్మిది నెలల వరకు గర్భం ఎలా వృద్ధి చెందుతుంది, ఏయే దశలో ఏయే అవయవాలు ఏర్పడతాయి.. మొదలైన విషయాల్ని గూర్చి ఇది చెబుతుంది.

శిశువు గర్భంలో ఉండే చివరి మూడు నెలల్లో మనసు, శరీరంలోని అవయవాలు ఎలా సంపూర్ణంగా ఏర్పడతాయి అన్న వర్ణన ఇందులో ఉంది. ఆయుర్వేద గ్రంథాల్లోని గర్భసంస్కారం, గర్భిణీ వ్యాకరణం మొదలైన అధ్యాయాల్లో గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, మంచి పుస్తకాల్ని చదవాలి లేదా లలితమైన సంగీతాన్ని వినాలి మొదలైన వాటిని వివరంగా విశ్లేషించారు.
ఇటీవలి కాలం వరకూ సుమతీ శతకం, వేమన శతకం, భర్తృహరి సుభాషితాలు మొదలైనవాటిని తల్లిదండ్రులు పిల్లలతో వల్లెవేయించేవారు. శతక వాఙ్మయం ప్రపంచంలో మరే సంస్కృతిలోనూ లేదు. జీవితంలోని అనేక సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, వాటిని అధిగమించడానికి ఈ సుభాషితాలు తోడ్పడతాయి. ఉదాహరణకు ‘కందుకమువోలే సుజనుడు’ అనే పద్యాన్ని జీర్ణించుకున్నవాడు జీవితంలో వైఫల్యాన్ని ధైర్యంగా ఎదుర్కోగలడు. అలాగే ‘ఆరంభింపరు నీచమానవులు’ అనే పద్యం వ్యక్తిలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ వీటిలోని భావాన్ని మరింత లోతుగా జీవితానికి అన్వయించుకోగలరు. ర్యాంకు సాధించలేని విద్యార్థులు తమ జీవితాన్ని అంతం చేసుకోకుండా ధైర్యంగా ఆలోచించగలరు. అర్థం లేని నర్సరీ పాటలు వచ్చిన తర్వాత జీవిత సత్యాల్ని బోధించి మానసిక స్థైర్యాన్ని నింపే సాహిత్యం మనకు దూరమైంది. భారతీయ విద్యా విధానంపై పరిశోధనలు జరిపి అందులోని సూక్ష్మ విషయాల్ని ప్రపంచమంతా అనుసరిస్తున్న సమయంలో మనం వాటికి దూరం కాకుండా రక్షించుకోవడం చాలా అవసరం.

అర్థం లేని నర్సరీ పాటలు వచ్చిన తర్వాత జీవిత సత్యాల్ని బోధించి మానసిక స్థైర్యాన్ని నింపే శతక సాహిత్యం మనకు దూరమైంది.