Wednesday, February 5, 2020

పెరటి గడప పేద ముతైదువు...

పెరటి గడప పేద ముతైదువు..............!!

ఇంటి వెనక పెరటి గుమ్మాన్ని పేద ముత్తైదువు అంటారు...
ఎందుకంటే అందరూ ముందర గుమ్మానికి
బాగా అలంకరిస్తారు పూజ చేస్తారు కానీ
వెనుక గుమ్మానికి పెద్దగా పట్టించుకోరు...

లక్ష్మీ దేవి ముందు గడప నుండి వస్తుంది,
జేష్ఠ దేవి ఎట్టి పరిస్థితుల్లో ముందు గడపలో
అడుగు పెట్టదు..
వెనక గుమ్మంలో నుండి వస్తుంది..
ఒకే ఇంట్లో ఇద్దరు ఉండటంవల్ల ధనము వస్తుంది
వచ్చిన ధనము వెంటనే నిలవకుండా పోతూ ఉంటుంది, నగలు వస్తుంటాయి
తాకట్టులోకి పోతుంటాయి
జేష్ఠ దేవి ఆవిడ ప్రతాపం చూపిస్తుంటుంది..

వెనక గుమ్మం నుండి జేష్ఠ దేవిని రాకుండా
అడ్డుపడగల శక్తి పెరటి గుమ్మానికి ఉంది..

అందుకే కాస్త పసుపుకుంకుమ వెనుక గుమ్మానికి
కూడా పెడితే లక్ష్మీ దేవి వచ్చే సమయానికి..
జేష్ఠదేవిని వెనక గుమ్మానికి రాకుండా అడ్డుపడి
ఈ ఇంటి ఇల్లాలు నాకు పసుపు కుంకుమ ఇచ్చింది
కనుక నేను నిన్ను ఈ ఇంట రానివ్వను..
అని అడ్డు పడుతుంది...

ఎవరైనా పెరటి గుమ్మానికి కాస్త పసుపు కుంకుమ
కూడా పెట్టకుండా పట్టించుకోకుండా వదిలేస్తారో..
వారి ఇంట్లోకి కూడా జేష్ఠదేవి వస్తున్నప్పుడు
పెరటి గుమ్మం పట్టించుకోదు ఆహ్వానిస్తుంది..

అందుకే ముందర సింహ ద్వారాన్ని ఎంతగా అలంకరిస్తారో..పెరటి గుమ్మానికి కూడా
అంత మర్యాద చేయాలి.
కనీసం పసుపు కుంకుమ అయినా పెట్టాలి...

అయితే ఇప్పుడు అపార్ట్మెంట్ ఇల్లు కావడం వల్ల
చాలా మందికి పెరటి గుమ్మలూ ఉండటం లేదు...
అలాంటి వారికి ఒక ఉపాయం ఉంది..
వారు గుమ్మానికి దగ్గరగా కానీ బోల్కనీ లో కానీ
తులసి మొక్కను పెట్టి పూజ చేయలి ,
పెరటి గుమ్మం పూజ కూడా నీకే చేస్తున్నాము తల్లి
అని తులసికి మొక్కినా సరిపోతుంది...

పెరటి గుమ్మానికి ఉన్న శక్తి విలువ తెలుసుకుని.. మర్చిపోకుండా అంత పసుపు కుంకుమ పూలు పెట్టండి..
మంచి ఫలితాలు పొందండి..!!

దోశ పుట్టు పూర్వోత్తరాలు

దోశ పుట్టు పూర్వోత్తరాలు

నెల్లూరు సీమను పరిపాలించిన మనుమసిద్ధి మహారాజు ఆస్థానంలో కమ్మటి కవిత్వం చెప్పిన కవి తిక్కన,మహా వీరుడు ఖడ్గ తిక్కన మాత్రమే కాదు .కమ్మటి వంటలు చేసే నారాయణ శర్మ కూడా ఉండేవారు.రాజు గారికి ప్రతీ రోజు ఉదయం అల్పాహారంలో ఇడ్లీ ,ఉప్పు పొంగలి తప్పనిసరిగాఉండాల్సిందే.దానితో పాటుకొబ్బరి చట్నీ, కారప్పొడి,కమ్మటి సింహపురి మొలగొలకుల గ్రాసం తిన్న గేదెల ద్వారా వచ్చిన సువాసనతో కూడిన నెయ్యి, కమ్మటి పులుసు తప్పని సరి.కానీ ఓ రోజు నారాయణ శర్మ గారు ఖర్మ కాలి భార్యతో గొడవపడి కొద్దిగా అన్య మనస్కంగా ఇడ్లీ పిండి రుబ్బుతుంటే నీళ్లు ఎక్కువై పల్చన అయిపోయింది. అంతే ప్రాణాలు ఉగ్గ బెట్టుకొని మంత్రిగారి దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు. మంత్రి శివారాధ్యులవారు కళ్లెర్ర చేసి ఉరిశిక్షే అన్నారు.చావు ఎలా తప్పదని చివరి సారిగా ఆప్తమిత్రులు భిషగ్వరుడు మాధవాచార్యులవారి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు.ఆయన వెంటనే ఓ ఉపాయం చెప్పి నేను చూసుకుంటానులే అని అభయం ఇచ్చారు.పక్కరోజు రాజుగారి అల్పాహారాన్ని పర్యవేక్షిస్తున్న మాధవాచార్యులవారు
ఓ పల్చటి అట్టు నేతితో వేసి తీసుకొచ్చారు.రాజు గారు తిని,రుచికి ఆశ్చర్య పోయి మాధవులవారిని ఇది ఎలా తయారు చేశారు అని అడిగారు.వెంటనే మాధవులవారు వంటగదిలోకి రాజుగారిని తీసుకు వెళ్లి పెనం మీద పల్చటి ఇడ్లీ పిండిని వేసి చక్కగా నెరిపారు.అట్టు అద్భుతంగా వచ్చింది.పిండి పెనం మీద వేసేటప్పుడు రెండు సార్లు సుఁయ్ అని చప్పుడు వచ్చింది. అంతే పక్కన ఉన్న తిక్కన గారు ఆనందంతో
"ద్వే సుఁయ్"
ఈ కొత్త అట్టుకి నామకరణం చేసేసారు.ఆ 'ద్వే సుఁయ్' రూపాంతరం చెంది దోశ గా మారి జన బాహుళ్యం లోకి వచ్చిందన్న మాట.ఇలా విక్రమ సింహపురి లో పుట్టిన దోశ విశ్వవ్యాప్తమై అనేక శతాబ్దాలుగా కొత్త రుచులను చేర్చుకుంటూ మసాలా దోశ, కారం దోశ,ఉప్మా దోశ, ఉల్లి దోశ అంటూ మార్పులు, మెరుపులు చేసుకుంటూ మన గుండెల్లో ఉండిపోయిందన్నమాట.

మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు.

ఓం నమశ్శివాయ🙏
ఫ్రెండ్స్ మాటలు ఎంతో విలువైనవి
వాటిని జాగ్రత్తగా వాడాలి
ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు
ఎవరిని మాటలతో భాదించకూడదు
ఇవాళ మనం శక్తివంతంగా ఉండొచ్చు
కానీ కాలం మన కన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకోవాలి
ఒక చెట్టు నుంచి లక్షల అగ్గి పుల్లల తయారవుతాయి లక్షల చెట్లను బూడిద చేయడానికి
ఒక అగ్గిపుల్ల చాలు
అలాగే ఒక్క మాటతో మనతో ఉన్న బంధాలు తెగిపోతాయి తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం లేదు.
కాకి అరిస్తే దాన్ని తరిమేస్తాం.
కోకిల కూస్తే ఆనందంగా వింటాము.
కోకిల చేసిన పుణ్యమేమి?
కాకి చేసిన పాపమేమి?
వాటి నోటి నుంచి వచ్చిన ధ్వనిలో ఆ భేదం ఉంది.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని
పెద్దలు చెప్తారు.
ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు.
కాని కొంత ఊరటగా మాట్లాడవచ్చు.
దానివలన వారికి కొంత ఉపశమనం కలుగుతుంది.
మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు.
అది మంచిదైతే మనకు అన్నీ సుఖాలను తెస్తుంది. చెడ్డదైతే కష్టాలను తెస్తుంది.
కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి.
కోపం మనసులో కాదు మాటలు మాత్రమే ఉండాలి ప్రేమ మాటల్లో మాత్రమే కాదు
మనసులో కూడా ఉండాలి
ఎన్నో జన్మల పుణ్యఫలము ఈ మానవ జన్మ
ఆ తండ్రి పాదాల చెంత చెరు వరకు
ప్రతిక్షణం ఆ భగవన్నామ స్మరణ చేస్తూ
మంచి మాట్లాడుతూ మంచి మాటలు పంచుతూ
ఈ జన్మ సార్థకం చేసుకుందాం ఓం నమశ్శివాయ 🙏

శివయ్య అందరినీ చల్లగా చూడు తండ్రి🙏

గర్వ భంగం

ఒకసారి సత్య భామ శ్రీకృష్ణునితో
‘స్వామీ.. రామావతారం లో సీత మీ భార్యకదా!
ఆమె నాకంటే అందంగా ఉండేదా?’
అని అడిగింది.

ఆ సమయం లో అక్కడే ఉన్న గరుడుడు
‘ప్రభూ,
నాకంటే వేగంగా ఈ ప్రపంచం లో ఎవరైనా ప్రయాణించ గలరా?’
అన్నాడు.

పక్కనే ఉన్న సుదర్శనుడు
(సుదర్శన చక్రం)
కూడా.. ‘పరంధామా,
అనేక యుద్ధాల్లో పాల్గొని మీకు విజయాన్ని తెచ్చి పెట్టాను.
నాతో సరి తూగు వారెవరు స్వామి’
అన్నది.

ముగ్గురి మాటలూ విన్న నంద గోపాలుడు వారికి గుణపాఠం చెప్పాలను కున్నాడు.

దీర్ఘంగా ఆలోచించి..

‘సత్యా, నువ్వు సీతగా మారిపో.
నేను రాముణ్నవు తాను.
గరుడా నువ్వు ఆంజనేయుని దగ్గరికి వెళ్లి సీతా రాములు నిన్ను తీసుకు రమ్మన్నారని చెప్పి తోడ్కనిరా.
చక్రమా,
నా అనుమతి లేనిదే ఎవరూ లోపలికి ప్రవేశించ కుండా చూడు’
అంటూ ముగ్గురి కీ మూడు బాధ్యతలు అప్పగించాడు.

గరుత్మంతుడు హనుమంతుని వద్దకు వెళ్లి..
సీతా రాములు రమ్మన్నారని చెప్పాడు.

హనుమ ఆనందంతో పుల కించిపోతూ..
‘నేను నీ వెనుకే వస్తాను.
నువ్వు పద’
అని గరుత్మంతు ని సాగ నంపుతాడు.

ఈ ముసలి వానరం రావడానికి ఎంత కాలమవు తుందో కదా అను కుంటూ గరుడుడు రివ్వున ఆకాశానికి ఎగురు తాడు.
కానీ..
ఆయన కంటే ముందే హనుమ ద్వారక చేరడం తో గరుత్మంతు నికి మతి పోతుంది. సిగ్గుతో తలదించు కొని మౌనంగా ఉండి పోతాడు.

ఇంతలో..
‘హనుమా’
అన్నపిలుపు తో పులకించిన ఆంజనేయుడు తన రాముని వైపు చూశాడు.
‘లోనికి రావడానికి నిన్నెవరూ అడ్డగించలేదా?’
అని అడగ్గా..
హనుమ తన నోటి నుండి చక్రాన్ని తీస్తూ
‘ప్రభూ,
ఇదిగో ఈయన నన్ను లోపలికి రాకుండా ఆపాడు.
ఎన్ని చెప్పినా వినక పోవడం తో ఇక లాభం లేదని భావించి నోట్లో పెట్టుకొని మీ ముందు వచ్చి నిలిచాను’
అన్నాడు సుదర్శనుడు కూడా గరుడని వలె అవమానం తో నేల చూపులు చూస్తూ ఉండి పోయాడు.

ఇంతలో హనుమంతు ని చూపు తన రాముని పక్కన కూర్చున్న స్ర్తీ
పై పడి
‘స్వామీ,
మీ పక్కనుండ వల్సింది నా తల్లి సీతమ్మ కదా!
ఎవ రీవిడ ప్రభూ’ అన్న మాటలు విన్నదే తడువు గా సత్య భామకు కూడా గర్వ భంగమై ప్రభువు కాళ్ళ మీద పడింది.

అలా కృష్ణ
పర మాత్ముడు, ముగ్గురిలో మొగ్గ తొడిగిన గర్వాన్ని తుంచి వేసి వినయాని కున్న విలు వేమిటో తెలియ చెప్పాడు.🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?ఎందుకోసం? ఆపదలు బాపే హనుమంతుని ప్రసన్నం చేసుకునే స్తోత్రాలలో విశేషమైన హనుమాన్ చాలీసా ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాము.

వారణాసి లో సంత్ తులసీదాసు నివసిస్తూ ఉండేవాడు.రామగాన నిరతుడయి బ్రహ్మా నందము లో తేలియాడు

తుండేవాడు.మహాత్ములయిన వారి సన్నిధిలో మహిమలు ఎప్పుడూ వెల్లడవుతుంటాయి.వారి ప్రభావము వల్ల ప్రభావితులయిన జనం వారి ద్వారా రామనామ దీక్ష తీసుకొని రామనామ రసోపాసనలో తేలియాడు

తుండేవారు.యెంతో మంది యితర మతాల వారు కూడా రామ భజన పరులు కావడంజరుగుతున్నది.

అయితే తమ నమ్మకాల పట్ల మొండి పట్టుదల కల మతగురువులకు యిది కంటగింపుగా వుండేది.వారు తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మన మతాన్ని కించ పరుస్తున్నాడని ధిల్లీ పాదుషా వారికి అభియోగాలు పంపుతూ వుండేవారు.

ఇది యిలా వుండగా వారాణసిలో వుండే ఒక సదాచార పరుడయిన ఒక గృహస్తు తన ఏకైక కుమారునికి కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో వివాహం చేశాడు.వారిద్దరూ చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా కాపురం చేస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు ఒకనాడు వున్నట్టుండి చనిపోయాడు.ఆ అమ్మాయి గుండెలు పగిలేలా రోదించింది.ఆ యువతీ శోకానికి అందరి గుండెలూ ద్రవించి పోయాయి.ఎవరెంత బాధ

పడినా జరగవలిసిన వి ఆగవు కదా!ఆ శవాన్ని పాడే మీద పెట్టి తీసుకుని పోతుండగా ఆ అమ్మాయి ఎవరు చెబుతున్నా వినకుండా ఆ పాడే వెనకే రాసాగింది.కొంత మంది స్త్రీలు ఆమెను గట్టిగా పట్టుకొని వున్నారు.

శవయాత్ర సాగిపోతున్నది.త్రోవలో తులసీ దాసు ఆశ్రమం ముందుగా వెళుతూ వుంది.ఆ ఆశ్రమము దగ్గరకు రాగానే ఆ అమ్మాయి అందరినీ విడిపించు కొని ఆశ్రమములోపలికి పరుగుతీసింది ఆయనముందు ప్రణ మిల్లింది. ఆయన కన్నులు మూసుకొని వున్నాడు.అందెల,గాజుల శబ్దము విని కళ్ళు తెరచి తనకు ప్రణ మిల్లిన ఆమెను దీర్ఘ సుమంగళీ భవ యని దీవించారు.ఆ యువతీ మరింత బిగ్గరగా ఏడుస్తూ తండ్రీ ఈ నిర్భాగ్యురాలిని దీవించిన తమ లాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్థమేనని దుఖిస్తున్నాను అన్నది.

అప్పుడు ఆయన అమ్మా!రాముడు నానోట అసత్యం పలికించ డే అన్నాడు.బయటకు వచ్చి చూడండి మహాత్మా!నా భర్త విగతజీవుడై వున్నాడు అని చెప్పెను. ఆయన లేచి వెళ్లి అయ్యా!కొంచెం ఆ పాడెను దింపండి అని ఆపించి ఆ శవం కట్లు విప్పి రామనామం జపించి తన కమండలములోని నీళ్ళు ఆ శవము పై

చల్లెను.దానితో ఆ శవము లో చైతన్యము వచ్చి ఆ యువకుడు లేచి కూర్చుండెను.అది చూసిన జనం ఆయనకు జేజేలు పలుకుచూ భక్తీ పూర్వకముగా నమస్కరించిరి.దీనితో ఆయనకు ప్రాచుర్యం పెరిగి ప్రజలు తండోప తండాలుగా వచ్చి ఆయనను దర్శించి రామనామ దీక్ష తీసుకుని రామ నామాన్ని జపించటం ఎక్కువై పోయింది.

మహమ్మదీయ గురువులు ధిల్లీ పాదుష వారి దగ్గర కి వెళ్లి తులసీదాసు రామనామము గొప్పదని అమాయకులైన ప్రజలను మోసగిస్తున్నారని ఫిర్యాదు చేసినారు. దానితో పాదుషావారుతులసీదాసును పిలిపించారు.తులసీ దాసు గారూ మీరు రామనామముఅన్నిటికన్నా గొప్పదని ప్రచారము చేస్తున్నారట నిజమేనా?అని అడిగారు.అందుకు తులసీదాసు అవును ప్రభూ!సృష్టి లో సకలమునకూ ఆధార మయిన

రామనామ మహిమను వర్ణించ నెవరి తరము?అనెను.రామనామము తో సాధించ లేనిది ఏదీ లేదు. అన్నాడు.

.

అయితే మేము ఒక శవము ను తెప్పించేదము దానికి ప్రాణం పోసి మీ మహత్వమును నిరూపించుకోండి.అన్నాడు పాదుషా. అప్పుడు తులసీదాసు క్షమించండి పాదుషా గారూ జనన మరణాలని ఆపేందుకు మన మెవరము?అంతా ఆ ప్రభువు ఇచ్చానుసరముగా జరుగు తాయి.మన కోరికలతోఆయనకు పని లేదు.అన్నాడు.అప్పుడు పాదుషా రామనామము అంతా మోసమని మీరు చెప్పేవి అన్నీ అబద్దాలని ఒప్పుకోండి.లేకపోతె మీకు శిక్ష తప్పదు అని బెదిరించాడు.తులసీదాసు ఒప్పుకోన లేదు.అప్పుడు ఆయనను బంధించమని తన సైనికులను ఆజ్ఞాపించాడు పాదుషా .తులసీదాసు మాత్రము చలించకుండారామనామము జపిస్తూ ధ్యాన నిమగ్నుడయ్యాడు.సైనికులు ఆయుధాలు ధరించి ఆయనను బంధించుటకు రాగా ఎక్కడినుండి వచ్చినాయో వేల కోతులు వచ్చి సైనికుల ఆయుధాలు లాగుకొని వారికే గురిపెట్టి వారిని కదలనీ కుండా చేశాయి.అందరూ ఏ కోతి తమ మీద పడి కరుస్తుంది అని హడలి పోతూ పరుగులు తీశారు.ఈ కలకలానికి కారణ మేమని తులసీదాసు కనులు తెరిచి చూశాడు.ఆయనకు సింహ ద్వారము మీద హనుమంతుడు కనిపించాడు.ఆయన దర్శనముతో పులకించిపోయి 40 దోహాలతో "జయ హనుమాన జ్ఞాన గుణ సాగర "

అంటూ చాలీసానుఆశువు గా గానం చేశాడు.. హనుమంతుడు ఈ స్తోత్రం తో మాకు ఆనందమును కలిగించావు.నీకేమి కావాలో కోరుకో అని అడిగాడు.మహాత్ము లెప్పుడూ తమకోసం గాక పరుల కోసమే బ్రతుకు తారు కనుక ఆయన తండ్రీ ఈ స్తోత్రం తో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమిచ్చి కాపాడాలని నా కోరిక అన్నాడు.

దానితో సంతోషించిన హనుమంతుడు తులసీ! మాకు అత్యంత ప్రీతీ పాత్ర మయిన ఈ చాలీసా తో నన్నెవరు స్తుతించినా వారి రక్షణ భారాన్ని నేను వహిస్తాను అని వాగ్దానం చేశారు.అప్పటినుండీ యిప్పటి వరకూ

హనుమాన్ చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై తీరుస్తూనే వున్నది "జయ హనుమంత మహా బలవంత" " జై శ్రీరాం"

ఆంజనేయ వరభీమ రామదూతా మాంపాహే

Tuesday, February 4, 2020

భీష్ముడి నీతి సూత్రాలు

1. "నదీ ప్రవాహం
ఓడ్డును కోసేస్తూ విస్తరించినట్టు
శత్రువుల్ని కూడా క్రమక్రమంగా
బలహీన పరచాలి.
దెబ్బ తెలియకూడదు -
గాయం మానకూడదు"

2. "ధర్మాల్లో కెల్లా
ఉత్తమ ధర్మం - నిజం చెప్పడం
పాపాల్లోకెల్లా మహాపాపం
అబద్ధాలాడటం"

3. "మృదువుగా మాట్లాడాలి.
మృదువుగా వ్యవహారాన్ని చక్కబెట్టాలి.
మృదువుగా హెచ్చరించాలి.
మృదుత్వాన్ని మించిన
పదునైన ఆయుధం లేదు."


4. "ఉన్నంతలో నలుగురికి పెట్టి తినేవాడు
ఇహంలోనూ పరంలోనూ
గౌరవం పొందుతాడు"

5. "సంపద - స్నేహ సంపద
రెండింట్లో దెన్ని ఎంచుకుంటారని
అడిగితే - స్నేహమే కావాలంటారు
విజ్ఞులు"

6. "జ్ఞానజ్యోతి చాలా గొప్పది.
మననులోని చీకట్లనూ
అది తొలగిస్తుంది."

7. "జీవితం నముద్రం
చంచలమైన ఇంద్రియాలే నీళ్లు ,
అరిషడ్వర్గాలే మొసళ్లు
ధైర్యమే తెప్ప"

8. "క్రోధమే మనిషి పతనానికి తొలి మెట్టు.
ఆ క్రోధం కారణంగానే
కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో
రావణుడు రాముడి చేతిలో
ఓడిపోయారు"

9. "దేశానికి మంచి జరిగినా - చెడు జరిగినా
అందుకు పాలకుడిదే పూర్తి బాధ్యత"

10. "అహింస - సత్యం - దయ
ఇంద్రియ నిగ్రహం
వీటిని మించిన తపస్సు లేదు"

11. "తీరని అప్పు - ఆరని నిప్పు
ఎప్పుడూ ప్రమాదమే"

12. "నాయకుడనే వాడు
ముఖస్తుతికి లొంగకూడదు
పొగడ్తలతో దగ్గర కావాలనుకునే వారిని
దూరంగా ఉంచాలి"

Who is the founder of Hinduism?

Devotee : "Swamiji, who is the founder of Christianity?"

Swami Chinmayananda : "Jesus"

Devotee : "Who is the founder of Islam?"

Swami Chinmayananda : "Mohammed".

Devotee : "Who is the founder of Hinduism?"

Swami Chinmayananda : "................."

Devotee : "What Swamiji, your religion doesn't have a founder?"

Swami Chinmayananda :

"There is no one particular founder for Hinduism as its not an outcome of one personality's knowledge.

Let me put the same question to you. Who is the founder of Chemistry? Physics?

You cannot answer, because these are sciences which had contributions from plenty of scientists.

In Hinduism, our Rishis were the scientists".

Devotee : "..."

Swami Chinmayananda :

"If you ask a Christian to give book on Christianity, he gives you Bible.

If you ask a Muslim to give book on Islam, he gives you Quran.

But if you ask me to give book on Hinduism, I will say, "Welcome to my Library!"

More precisely, it is सनातन धर्म (Sanatan Dharma) with no precise comparable term in English and that is why most of the world is unable to understand the concept. They need to learn some Sanskrit and some of the ancient history of Bharat to understand this.

Closest rough translation in English would be Eternal Character / Properties. It is neither Hindu nor religion. It is an ever evolving science of the character and properties of Universe including lessons for mankind on how to live a complete life aligned to the principles of Universe.

Hence, most of our ग्रंथ (granthas, NOT scriptures, closest translation "volumes") like Vedas, Upanishads, Aranyaks, Brahmanas, have no author, for, the Rishis saw these, not as their creation, but revelations of nature through them, ever evolving.

They also do not have a date for they have evolved over millennia and keep evolving. Date is applied to static things or things with short duration. How does one apply dates to eternal and ever evolving.

And in this sense, every human on earth, irrespective of his/her belief or religion, whether they agree or not, is a Sanatani....

Be proud of being a Sanatani (eternal). 🙏🏼🙏🏼🙏🏼

ప్రేమని అనుభూతించని తాత్వికులు లేరు.

ప్రేమని అనుభూతించని తాత్వికులు లేరు.

బుద్ధుడు ప్రేమలోపడ్డాడంటే. కొందరు ..
ఆశ్చర్యపోయారు..
...ఆమోదించారు
..ఆనందపడ్డారు ..
..ఆసక్తి చూపారు
..అనుమానంగా చూసారు
..ఆగ్రహించారు ..కూడా
ధ్యానమూ; ఎరుకా...చాలామందికి అర్ధంకాలా.అయితే
ప్రేమా; పియురాలూ...అందరికీ బుర్రకెక్కింది.

కారణం బహుశా
ప్రేమ.. బైనరీ కోడ్ లా.. కంప్యూటర్ భాషలా.. యూనివర్సల్ లాంగ్వేజ్. విశ్వపు భాష. కనుకనే ప్రాణులన్నీ ప్రేమకి కనెక్ట్ ఔతాయి.

పశుపక్ష్యాదుల నుండి వృక్షాదుల దాకా..!!ప్రేమే.. వికారానికి నిర్వికారానికి దారితీసింది మాత్రం ఒక్క మానవాళిలోనే..ఎందుకు!?

కృష్ణుడూ బుద్దుడూ ..ఇద్దరూ తాత్వికులే. కృష్ణుడు గురించి మాటాడితే..వికారం
బుద్ధుని గురించి మాటాడితే..నిర్వికారం స్ఫురిస్తుంది.. మనలో చాలామందికి
ఎందుకు..!?

ప్రేమని.. తాత్వికులుగా వారువురు దర్శించిన కోణం తాత్విక అవగాహన లేని మానవాళి దృష్టి ఒకటి కాక పోవటమేనా..!?

జీవితశైలిలో కృష్ణుడూ బుద్దుడూ..
ఇద్దరూ.. Extraordinary..
ఇద్దరూ..Extreme..
ఇద్దరూ రెండూ ధృవాలు
ఐనా... ఇద్దరూ తాత్వికలోకపు ధృవతారలే.
🌷🌷🌷🌷

మాటతీరు

మాటతీరు

🗣 ఈ సృష్టిలో మాట్లాడే శక్తి ఒక్క మానవుడికే ఉంది. అది మనిషికి దేవుడిచ్చిన దివ్యమైన వరం. మాట ఓ అద్వితీయ శక్తి. దాన్ని పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మాటతీరు సంస్కార సంపన్నమైనప్పుడే ఎదుటి హృదయాన్ని ఆకర్షించగలుగుతుంది. మన భావాలు, ఆలోచనలు ఇతరులతో పంచుకొనేందుకు- మాటే ఓ అద్భుత సాధనం.
లోకంలో అర్థం కాకుండా మాట్లాడేవారు, అసమర్థంగా మాట్లాడేవారు ఎంతో మంది ఉన్నారు. అనవసరంగా, అనాగరికంగా మాట్లాడేవారూ ఉన్నారు. ప్రాణికోటిలో మనిషికి పెద్దపీట వేసింది మాటే. మాటతోనే మనిషి వ్యాప్తిచెందాడు. మాటతోనే మనిషి ఎత్తులకు ఎదిగాడు. ముందు తరాలకు మార్గదర్శకుడయ్యాడు.

మహనీయుల మాట మౌనం అనే మూసలో పోసిన బంగారంలా ఉంటుంది. అందుకే వారి మాటలకు ఎంతో విలువ సమకూరుతుంది. అదుపులేకుండా వాగడం మహాతప్ఫు మాటను తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడమంటారు విజ్ఞులు. కటువుగా, అతిగా మాట్లాడేవారి పట్ల ఎవ్వరికీ గౌరవం ఉండదు. చెడ్డ మాటలు వెలువడకుండా ఉండాలంటే దానికి మౌనమే సరైన మందు అంటారు తత్త్వవేత్తలు.' ఎదుటివారు మనల్ని అర్థం చేసుకొనేందుకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడండి.అధిక ప్రసంగం తగదు’ అంటూ రామకృష్ణ పరమహంస తనను కలిసేందుకు వచ్చిన భక్తజనంతో చెబుతుండేవారు.

మాటకు ప్రాణం సత్యం. ఇది యుగాల పూర్వమే హరిశ్చంద్ర చక్రవర్తితో నిరూపితమైంది. సత్యవచనం కారణంగానే ఆయన పేరు సత్యహరిశ్చంద్రుడని శాశ్వతంగా నిలిచిపోయింది.

మాటల్లో అబద్ధాలు దొర్లకూడదు. అబద్ధం మాట్లాడి నోరు కడుక్కోవడం కన్నా మౌనంగా ఉండటమే ఉత్తమం అన్నది జ్ఞానుల ఉవాచ. మాట ప్రభావం అద్భుతం. అది మనిషి మనసుకు అద్దం పట్టగలదు. అడ్డంగా నిలువగలదు. కొంపలు కూల్చగలదు. కుటుంబాలను రక్షించగలదు. శిశిరంలో వసంతాన్ని సృజియించగలదు. పెదవి వదిలితే పృథివి దాటిపోగలదు. ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్నయినా వెనక్కి మళ్ళించవచ్చునేమోగాని- పెదవి దాటిన మాటను బ్రహ్మదేవుడైనా వెనక్కి మళ్ళించలేడు. మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలని పెద్దలు హెచ్చరించి మరీ చెబుతుంటారు. సందర్భశుద్ధి కలిగిన మాటకే విలువ, మన్నన ఉంటుంది. మాట, దాని అర్థం ఎలా పెనవేసుకొని ఉంటాయో మహాకవి కాళిదాసు ఓ శ్లోకరూపకంగా వివరించి చెప్పాడు. ఔచిత్యం అనే తక్కెడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ. నోటికి వచ్చినట్లు వాగడం ఓ రోగం. చెడ్డ మాటలతో చెడు ఫలితమే వస్తుంది. మంచి చేకూరదు.

రామాయణంలో మంథర మాటలకు చెవొగ్గిన కైకేయి ఆ తరవాత ఎంత పశ్చాత్తాపం చెందిందో తెలియనిది కాదు. తీయని మాటలతో మన వెనకాలే గోతులు తీసేవారు ఎంతో మంది ఉంటారు.

మాటతీరు మనిషి సంస్కారానికి సూచిక. కార్యసాధనకు పనిముట్టు. ఆకర్షణకు అద్భుత మంత్రం. అందుకే మనిషి మంచి మాటతీరును అలవరచుకోవాలి. మనం చెప్పిన మాట ఎదుటివారికి అర్థం కాకపోతే చక్కటి సామెతల రూపంగా అర్థమయ్యేలా వివరించవచ్ఛు అప్పుడే మాటతీరుకు మంచి ఆకర్షణ, స్పష్టత, పటిష్ఠత సమకూరుతుంది.

కొందరి సంభాషణల్లో అబద్ధాలు, అపశబ్దాలు, అసభ్య పదాలు, అహంకారపు కథలు దొర్లుతుంటాయి. మన మాటతీరు ఎదుటివారికి కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా బాధపెట్టే విధంగా ఉండకూడదు. మంచి గంధం పూసినంత హాయి కలిగించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మంచి మాటకు మన్నన ఉంటుంది! 🙏

ఋతంభరా ప్రజ్ఞ

ఋతంభరా ప్రజ్ఞ


🙏 ఋతంభర ఒక విశ్వ జ్ఞాన కోశం. ఋతంభర అన్ని దివ్య సంకేతాలకి, అనుభూతులకి మూలం. ఋతంభర ఆధ్యాత్మిక దూరవిద్యా విజ్ఞానం.

అది అన్ని చోట్లా విశ్వమంత వ్యాపించిన చైతన్యం. ఎక్కడైనా ఉండి, ఎక్కడినించైనా మాట్లాడ గల అతీత పరబ్రహ్మని సృష్టితో అనుసంధానం చేసే ప్రక్రియ ఋతంభర. దేవతలు, మహర్షులు, సాధకులు, మానవులు, జంతువులూ, ఇంకా జీవరాశుల, నిర్జీవ రాశుల చైతన్యమంతా ఇమిడి ఉండి వాటిని నిర్దేశించే ఓ దివ్య శక్తి జాలం ఋతంభర. ఇది కేంద్రీకరించబడి ఒక్కో వ్యక్తిలో స్థిరమైతే అతను తన గురువుతోనూ, దేవతా శక్తితోనూ 'కనెక్ట్ ' అవుతాడు. ఆ సాధకుడి భ్రూ మధ్యం, అంటే మూడో నేత్రం ఉండే (కనుబొమ్మల మధ్య) చోట నిండి సృష్టి సంకేతాలు వస్తూ, పోతూ ప్రయాణించడం ప్రారంభిస్తాయి. అతను లేక ఆమె భూత, భవిష్యత్, వర్తమానాలకతీతంగా విషయాలను దర్శించగలరు, వినగలరు, ఏదైనా తెలుసుకోగలరు. ఆజ్ఞాచక్రం తెరుచుకుని, అంతర్ముఖమైన జ్ఞాన చక్షువులు విచ్చుకుని, తానున్న చిన్న 'నేను ' అనే వృత్తం నించి బయటికి, తన దైనందిన సాధారణ జీవన పరిధినించి బయటకి వచ్చి, విశ్వవ్యాపక అసాదృశ శక్తి అనుభూతి చెందుతూ, అప్పుడప్పుడు ఆ మహా దివ్య కాంతులను అనుభవాన్ని పొందుతూ మళ్ళీ మామూలు పరిధిలోకి వస్తూ ఉంటాడు. అతి మామూలు మాటల్లో ఇది ఒక పైలట్ దిన చర్యలా ఉంటుంది...... కొంత సేపు ఆకాశ విహారం, ఎగరనప్పుడు కొంత ఇహలోకపు విహారం.

ఇలాంటి ఋతంభర శక్తి ఏ ప్రత్యేక వ్యక్తులకో కేటాయించింది కాదు. ఇది సృష్టిలో ప్రతి జీవికి సొంతం. వారి వారి స్థాయిని బట్టి వారు వాడుకోవచ్చును, ఆ శక్తిని పెంచుకోవచ్చును. యోగులు కళ్ళు మూసుకుని ఎదైనా చూడాలనుకున్నప్పుడు ఆ దర్శనాన్ని అందించే ప్రజ్ఞ ఋతంభర. ఎక్కడో ఉన్న పుత్రిక ఏడిస్తే నిద్రపోతున్న తల్లిని లేపి ఏదో జరుగుతోందని తెలిపే శక్తి ఋతంభర. అన్నిటిని మరిచి తాదాత్మ్యతతో ఇష్ట దేవత జపం చేస్తున్నప్పుడు ఆ దేవత వచ్చిందని తెలిపే సూచనలందించే నిశ్శబ్ద శక్తి ఋతంభర.

మానవ శరీరంలో నరనరమూ, చర్మమూ, అణువణువూ ఏకమై ఒక మనిషిగా ఉండి ఎక్కడో కాలి గోటికి దెబ్బ తగిలితే తల దాకా మెదడుకి నొప్పి తెలిసేలా ఎలా 'ఏకత్వం' ఉందో అలాగే సృష్టి అంతటా వ్యాపిస్తూ ఉండే 'తెలివి ' ఋతంభర. నిజానికి ఋతంభరకి ఏ పేరూ లేదు. పేరు పెట్టడం వల్ల దాని గురించి మాట్లాడు కోవడం సులువవుతుంది. పేరు పెట్టడం అయినంత మాత్రాన ఒక విషయం అర్ధమయిపోదు. అర్ధం చేసుకోవడం మొదలవుతుంది. కొత్తగా పుట్టిన బిడ్డకి పేరు పెడితే జీవితం మొదలువుతుంది ఆ పేరు మీద. ఇంకా కధ ఎంతో ఉంటుంది - ఇదీ అలాగే. పేరు తెలియగానే అర్ధం కూడా అర్ధం అవదు. మంత్రం తీసుకోగానే సిద్ధి వచ్చేయదు, సాధన మొదలవుతుంది. సృష్టి బడిలో, అమ్మ వడిలో మళ్ళీ కూచుని యోగి తన తపస్సుని మొదలు పెడతాడు. ఋతంభరని అనేకులు అనేక సార్లు దర్శించారు. ఒక్కో కోణంలోంచి ఒకలా పిలిచారు. అన్నీ కలిపినా ఆ ఋతంభర పూర్తి కాదు. 'డేజా వూ ' (daejawoo) అంటే ఏమిటి ? 'దివ్య దృష్టి ' అంటే ఏమిటి ? 'ప్రకృతి ' మాట్లాడడం అంటే ఏమిటి ఇలా ఎన్నో ఇన్నాళ్ళూ ఈ వ్యాసాల్లో కొద్ది మాటలు స్పృశించాం. అన్నీ కలిపినా, ఆ దివ్య శక్తిని ఎలా చెప్పలేవో అలాగే ఋతంభరనీ!


కొందరు ఋతంభర ని 'ఆకాషిక్ రికార్డ్స్' గా భావిస్తారు. కొన్నిసార్లు మనం మన 'గోల' తగ్గించి తపో తలంలో వింటే వినిపించే సంగీతం ఋతంభర. మన చలనాలని తగ్గించి సృష్టి చలనాలని అర్ధం చేసుకోవడం మొదలు పెడితే కలిగే అవగాహన, కనిపించే చిన్ని, సూక్ష్మ తంత్రులు - సంఘటనలకి వెనకాల, ఆలోచనలకి అవతల అపుడపుడు స్పష్టంగా కనిపించే తంత్రుల్లా ఋతంభర. ఈపని చెయ్యొద్దు, అది చెయ్యి అని మంచి మార్గంలో నడిపిస్తూ మనలోంచే మాట్లాడే దక్షిణామూర్తిలా ఋతంభర


అసలు ఋతంభర అంటే ఏమిటి .....?
ప్రతి పదానికి మనకి అర్ధమయ్యే అర్ధం వెనకాల అర్ధం వెనకాల ఒక మూల తత్వం ఉంటుంది. ఋతంభర అనేది ఇంగ్లీషులో 'రిథం ' అంటాం కదా! దానికి సంబంధించినది అని. రిథం అనేది కంపనాన్ని (వైబ్రేషన్) సూచిస్తుంది. అది తరంగాలని సృష్టిస్తుంది. అవి ప్రయాణించి మన చెవిని చేరితే అవి మన వినికిడి పరిధిలో పడితే, మన చెవులు విని, మెదడు అర్ధం చేసుకుని చెపుతోంది, ఇదీ సంగతి అని. ఇవి విద్యుదయస్కాంత తరంగాలైతే కాంతి అంటున్నాం. చూస్తున్నాం. అంటే మన చూసినా విన్నా అన్నీ తరంగాలే. అన్నీ రిథం జనితాలే! మనసుతో ఆలోచించి, మెదడుతో దానికి రూపాన్ని, భాషని ఇచ్చి ఇంకోళ్ళ మెదడుకి శబ్ద తరంగాలుగా పంపుతున్నాం. ఈ పనంతా మెదడు నించి మెదడుకి 'లాజికల్ ' గా జరుగుతుంటే అది ఆలోచనల మార్పిడి. చిత్రమేమంటే ఋతంభర మనసు మాట్లాడే ప్రక్రియ. మనసుతో వినాలి. మనసు ఇంద్రియంగా ఆలోచనలని 'ప్రోసెస్ ' చెయ్యాలి. బుద్ధి వేరు, మనసు వేరు (అందుకే హస్త సాముద్రిక శాస్త్రంలో లైన్ ఆఫ్ మైండ్ వేరు, లైన్ ఆఫ్ హార్ట్ వేరు - ఋతంభర వినాలంటే హార్ట్ పూర్ణత్వం చెంది ఉండాలి, మీకు తెలుసు నేను చెప్పేది భౌతికమైన హృదయం కాదు అని). మనసుకి చేరే ఈ ప్రకంపనాలు, మన మూల తత్వమైన సృష్టి కర్తతో అనుసంధానంలో ఉంటాయి. ఇవి హృదయ స్థానమైన అనాహత చక్రానికి చెందినవి గా చెప్పవచ్చు (అందుకే తల్లి శిశువుతో తన హృత్ స్పందన వినిపించే ఎడంవైపు ఉంచి పడుకుబెడుతుందా?). మనసు పూర్ణత్వాన్ని చెందే కొద్ది సాధకుడి ఋతంభర ఉన్నత స్థితిని చేరి శబ్దం అక్షరాలుగా మారే విశుద్దిని దాటి మహా జ్ఞాన త్రిపురము, 'మహా కాళేశ్వర ' స్థానము, అతీంద్రియ శక్తికి ఉన్నత సోపానము ఐన ఆజ్ఞా చక్రాన్ని చేరి అక్కడినించి సంకేతాలు పంపడం, తెలుసుకోవడం చేయగలుగుతాడు. కనుబొమ్మల మధ్య ఉన్న అజ్ఞా చక్రంలో నామము, విబూది, కుంకుమ పెట్టుకున్నప్పుడల్లా ఆ శక్తిని ప్రేరేపిస్తున్నామన్న మాట............🙏

దైవం అంటే ఎవరోకాదు ,దైవమ్ ఆంటే చైతన్యం

దైవం అంటే ఎవరోకాదు ,దైవమ్ ఆంటే చైతన్యం .చైతన్యం ప్రాణరూపంలో ఉంది .ప్రాణము మానవదేహంలో ఉంది .చైతన్యం ప్రాణరూపంలో మానవదేహంలో స్థితమై ఉంది . అంటే దైవం మనవదేహంలో ఉంది . అని మీరు తెలుసుకోవాలి .మరి దైవం మనవదేహంలో స్థితమై ఉన్నప్పుడు మనము ఏవిధంగా ఉంచాలి ,ఈ దేహాన్నీ ? ఈ దేహాన్ని దేవాలయంగా ఉంచాలి . దేహమే దేవాలయం ,జీవుడే దేవుడు ,ఆత్మే పరమాత్మ . .అంటే దేహమనే దేవాలయంలో దేవుడు జీవుడిగా నడియాడుతున్నప్పుడు .ఈ దేహమనే దేవాలయాన్ని పరిశుబ్రముగా ఉంచుకోవాలి .అంతేగాని ఈ దేవాలయాన్ని అపరిశుభ్రంగా వుంచుకోరాదు .బాహ్యంగా మనముంటున్న ఇల్లే అపరిశుబ్రముగా ఉంటె మనము ఇంటిలో ఉండలేము .వెంటనే శుభ్రపరుచుకుంటాము .ఎందుకు శుబ్రపరుచుకుంటాము ?అపరిశుబ్రంగా ఇల్లు ఉంటే అనారోగ్యాలు వస్తాయని .మరి బాహ్యంగా ఉండే ఇంటిని శుభ్రపరుచుకుంటున్నారు కానీ ,దేవుడు ప్రాణరూపంలో ఉన్నప్పుడు మరి ఈ దేహాన్ని మత్తు పానీయాలతోను , జీవహింసతో జీవులను చంపి తింటూ , ఈ దేహంలో వుండే భగవంతుని మలిన పరుస్తున్నప్పుడు భగవంతుడు ఈ దేహాన్ని వదిలి పోవడానికి సిద్దపడుతుంటాడు .సిద్దపడి తానూ ప్రతిష్ఠచేసిన దేహంలో ఉండే అవయవాలను క్షిణింప చేస్తుంటాడు .మరి ఈ దేహదారి పాడైపోతున్న అవయవలను బాగుచేసుకోవడానికి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాడు .తిరగవలసినది హాస్పిటల్ చుట్టూ కాదు , భగవంతుని చుట్టూ తిరగాలి .మరి భగవంతుని చుట్టూ తిరగడానికి భగవంతుడు ఎక్కడున్నాడని ,తిరుగుతావు ,?భగవంతుడు ఎక్కడో బయట ఉండడు .భగవంతుడు ఈ దేహములోనే ఉన్నాడు .మరి ఈ దేహంలో ఉన్న భగవంతుని సేవించుకుంటే నీకు భగవంతుడు నీకు ప్రసన్నుడవుతాడు .మరి భగవంతుడు దేహంలో నీకు ప్రసన్నుడవాలనుంటే దేహాన్ని పరిశుబ్రముగా ఉంచుకుంటూ ,నీలో ఉన్న భగవంతుని నిరంతరం చూస్తూ ,బయట ప్రపంచాన్ని ,బంధాలను ,బంధువులను మానసికముగా వదిలి నిరన్తరం భగవంతుని సేవిస్తున్నప్పుడు నీ అవయవాలు అన్ని బాగుపడుతుంటాయి .నీవు ఆరోగ్యముగా ఉంటావు .నీవు భగవంతునితో ఉంటావు .నీవు భగవంతునిగా మారుతావు .నీవు భగవంతునిగా మారినరోజు నీకు ఈ దేహంపై మొహం పోతుంది .నీకు ఇతరదేహాలలో భగవంతుడు కనిపిస్తాడు .ఇతర దేహాలలో భగవంతుడు కనిపిస్తున్నప్పుడు ,ఇతర పదర్థాలలో భగవంతుడు కనిపిస్తాడు .ఇతర పదర్దాల్లో భగవంతుడు కనిపిస్తున్నప్పుడు నీకు ఏవిధమైన అజ్ఞానం ఉండడానికి అవకాసమ్ లేదు .......

బ్రహ్మయజ్ఞము లేక జ్ఞానయజ్ఞము, దైవ యజ్ఞము అంటే?

🌷. బుద్ధిని ఆత్మలో లీనం చేయడమునే బ్రహ్మ యజ్ఞం లేక జ్ఞాన యజ్ఞం అంటారు. నిరంతర ఆత్మిక ధ్యాసను కలిగి ఉండడమే మోక్ష మార్గం. 🌷

కొంత మంది దైవ యజ్ఞము చేస్తారు. దైవ యజ్ఞము అంటే దేవతలను పూజించడం, అరాధించడం, దేవతలను ఉపాసించడం, ధ్యానం చేయడం, వివిధ వస్తువులను కైంకర్యం చేయడం, దేవతలను ప్రార్ధించడం మొదలగు కార్యములన్నీ దైవయజ్ఞాలే.

కాకపోతే ఇవన్నీ భక్తితో శ్రద్ధతో, కర్తృత్వభావము విడిచిపెట్టి, ఫలాపేక్ష లేకుండా, భగవంతుని పరంగా కర్తవ్య నిష్టతో చేయాలి. వీరినే కర్మయోగులు, భక్తియోగులు అని అనవచ్చు.

ఇంక రెండవ యజ్ఞం పేరు బ్రహ్మ యజ్ఞము. దీనినే జ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు. ధ్యానంలో కూర్చోవడం. మనస్సును బుద్ధిని ఆత్మయందు నిలపడం. తానే బ్రహ్మగా భావించడం. చివరకు బ్రహ్మలో ఐక్యం కావడం..

నిరంతరం బ్రహ్మను గురించి ఆలోచిస్తూ, విచారిస్తూ, మనస్సు బుద్ధి పవిత్రంగా ఉంచుకుంటే. తుదకు బ్రహ్మగా మారిపోవడం సులభమే. అప్పుడు మనోబుద్ధి అహంకారాలకు ప్రతిరూపమైన చిత్తము పరమాత్మవైపు మళ్లుతుంది. చిత్తము పరమాత్మలో లీనం అవుతుంది. దానినే మోక్షమార్గము అంటారు.

నిరంతరం పరమాత్మను గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ పరమాత్మ గురించి మాట్లాడు కుంటుంటే మనసు బుద్ధి ప్రాపంచిక విషయముల నుండి పరమాత్మ వైపుకు మళ్లుతుంది. చిత్తము సాత్వికంగా మారి పోతుంది. దుష్ట ఆలోచనలు మనసులోకి రావు. మనం ఏ వస్తువు అగ్గిలో వేసినా అది అగ్గిరూపాన్ని పొందుతుంది. ఒక ఇనప గుండు వేసినా అది కాలి ఎరగా అగ్గిగోళం మాదిరి అవుతుంది.

అదే ప్రకారము మనము ప్రాపంచిక విషయములలో మునిగి ఉన్న మనసును, అహంకారమును, పరమాత్మ వైపు మళ్లించి పరమాత్మ అనే అగ్గిలో హెమం చేస్తే, పాపంచిక విషయములు, పూర్వజన్మ వాసనలు అనీ కూడా ఆ అగ్గిలో పడి, తమ అస్తిత్వాన్ని కోల్పోయి, పరమాత్మ స్వరూపంగా మారిపోతాయి.

సూక్ష్మంగా చెప్పాలంటే మనసును, బుద్ధిని ఆత్మలో లీనం చేయడం. దానినే బ్రహ్మయజ్ఞము లేక జ్ఞానయజ్ఞము అని అంటారు.

🙏 కృష్ణం వందే జగద్గురుమ్ 🙏
🌷 🌷 🌷 🌷 🌷

Monday, February 3, 2020

ఒక వ్యక్తికి మనం ఇచ్చే గౌరవం అతని గుణాన్ని బట్టి ఇవ్వాలి కానీ అతని దగ్గర ఉన్న ధనాన్ని బట్టి కాదు.

కూటికి పేద అయినా కులానికి పేద కాదు, అని ఒక సామెత ఉండేది.

నిజానికి అక్కడ కులం అంటే మనిషి యొక్క వ్యక్తిత్వం.

మనిషి వ్యక్తిత్వానికి అంత విలువ ఇచ్చేవారు కాబట్టే ఆ సామెత పుట్టింది.

నేటి రోజుల్లో మాత్రం బహుశా ఆ సామెతకు ఉన్నంత ప్రాధాన్యత కూడా మనిషి గుణానికి ఉండడం లేదు.

ఒక వ్యక్తి కోటీశ్వరుడు కాబట్టి అతన్ని గౌరవించి తీరాల్సిందే అన్నట్టు ప్రవర్తిస్తుంది లోకం,

విచిత్రం ఏమిటంటే ఎంత ధనవంతుడైనా చివరికి మంచి గుణం గలవారినే గౌరవిస్తాడు.

పెద్ద పెద్ద రాజ్యాలు, ఎంతకీ తరగని ధనాగారాలు, రత్న మకుటమైన కోశాగారాలు కలిగిన మహారాజులు సైతం సన్యాసి అయిన బుద్ధుడి పాదాలకు నమస్కరించారు

అంటే మంచి గుణం కలిగిన వ్యక్తి ముందు ధనం ఎంత తుచ్చమైనదో అర్ధం అవుతుంది.



ధనం ఎవరి దగ్గరా శాశ్వతంగా ఉండదు.

కానీ మనిషి అలవరచుకున్న గుణం ప్రాణం పోయేవరకూ అతనితోనే ఉంటుంది.

ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అతని జీవితానికి పునాది లాంటిది, ఆ పునాది ఎంత దృఢంగా ఉండాలంటే ఆ వ్యక్తికి గుణం అంత అవసరం.

జీవితానికి అవసరమైన పునాదులను ఎన్నటికీ డబ్బుతో నిర్మించలేము.

కేవలం ధనానికి గౌరవం ఇచ్చేవారి ఇంట్లో కూడా జీవితం విలువ చెప్పిన బుద్ధుడు లాంటి ఉన్నతమైన వారిని పూజిస్తారే కానీ డబ్బు సంపాదించి మహాధనవంతులను పూజించరు.

గుణం కలిగిన వారిని పూజించి,
ధనం కలిగిన వ్యక్తులకు గౌరవం ఇస్తున్నామంటే తప్పు మనలోనే ఉంది.

మన మనఃసాక్షిని మనమే మోసగించుకుంటున్నట్టు.

సంపాదించేవరకూ నాన్నకు గౌరవం,వండిపెట్టే వరకూ అమ్మ విలువ,

అడిగింది ఇచ్చేవరకూ భర్తకు గౌరవం,

చెప్పేది వినేవరకు భార్యకు విలువ.

ఇలాగే కొనసాగుతూ పోతే చివరకు మనిషి అనే పదానికి కూడా విలువ లేకుండా పోతుంది.

జీవితంలో విలువ ఇవ్వవలసిన వాటికి విలువ ఇచ్చినప్పుడే మన జీవితానికి కూడా విలువ ఉంటుంది,

ఆ విలువే లేని రోజు జీవితం పాతాళానికి దిగజారిపోతోంది.

దేన్నయినా జయించాలన్నా, దోషాలను పరిహరించాలన్నా ముందు నేనేమి చేయాలి ?

మొదట నీలోని దుర్గుణాలను జయిస్తే సమాజంలో దేన్నైనా జయించటానికి అర్హత లభిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే అదే. జీవనంలో ధర్మాచరణ ద్వారానే మనం దోషాలన్నింటిని పరిహరించగలం. పురాణాలు, ధర్మశాస్త్రాలు, అవతార పురుషుల జీవితాలు మనకు సహనాన్ని బోధిస్తున్నాయి. భారతీయ హృదయానికి ఆయువుపట్టులాంటి సహనాన్ని వదిలి ధ్యానం మాత్రమే చేయాలనుకోవటం అత్యాశే అవుతుంది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. తన 12వ ఏటనే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు. బ్రహ్మకు సైతం అంతుచిక్కని శక్తిని ప్రదర్శించాడు. అయినా ఆయన వచ్చిన పనులన్నీ పూర్తి చేయటానికి 120 సంవత్సరాల కాలం జీవించాల్సి వచ్చింది. మన జీవన పరమార్థమేమిటో, వచ్చిన పనేమిటో, మనకు తెలియకపోవచ్చు ! కానీ అవతరించిన దైవానికి అన్నీ తెలుసు. సహనం నేర్పటం కూడా అవతార రహస్యంలో భాగం కాబట్టి వారు కూడా కాలానుగుణంగానే వ్యవహరించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మనసులు వేరైనా అనుసరించిన ధర్మం, ఆచరించి చూపిన సచ్ఛీలం ఒక్కటే. శ్రీరాముని పూజించడం అంటే ఆయన సద్గుణాలను అలవర్చుకోవటం. సద్గుణ సంపత్తితో దేన్నైనా జయించవచ్చు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

పని మన వంతు ఫలితం ఇవ్వడము పరమేశ్వరుని వంతు

అది రాంచీ. జార్ఖండ్‌లోని రాజ్రప్ప సీసీఎల్ టౌన్‌షిప్... 30 ఏళ్లుగా ఇక్కడి వీధులు శుభ్రం చేసిన ఓ పెద్దావిడ పదవీ విరమణ చేస్తోంది... ఆమె చివరి పనిదినం రోజున గౌరవంగా వీడ్కోలు చెప్పేందుకు తోటి పారిశుద్ధ్య సిబ్బంది, స్థానికులు కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఓ నాలుగవ తరగతి ఉద్యోగిగా రిటైరవుతున్నఆమె చివరి పనిదినం ఇంత ప్రత్యేకంగా ముగుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఉన్నట్టుండి అక్కడికి మూడు కార్లు రావడంతో ఈ కార్యక్రమం వాతావరణమే మారిపోయింది. మొదట ఓ జిల్లా కలెక్టర్ బుగ్గకారు దిగివచ్చి ఆమె పాదాలకు నమస్కారం చేశాడు. ఆ వెంటనే మరో రెండు కార్లలో వచ్చిన పెద్దమనుషులు ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. తీరా వీళ్లంతా ఆమె కుమారులని తెలిసి ఆమె తోటి సిబ్బంది, స్థానికులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సుమిత్రా దేవి అనే పారిశుద్ధ్య కార్మికురాలి విజయగాథ ఇది...

ఆమె పెద్ద కుమారుడు వీరేంద్ర కుమార్ రైల్వే ఇంజినీర్‌గా పనిచేస్తుండగా... రెండో కుమారుడు ధీరేంద్ర కుమార్ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇక మూడో కుమారుడు మహేంద్ర కుమార్ బీహార్‌లోని సివాన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా తన కుమారులను చూసి సుమిత్రా దేవి భావోద్వేగానికి గురైంది. ‘‘సార్, 30 ఏళ్ల నుంచి నేను ఈ కాలనీ వీధులు శుభ్రంచేశాను. కానీ నా కుమారులు మీలాగే పెద్ద సార్లు అయ్యారు..’’ అని ఆనంద భాష్పాలు రాలుస్తూ వారిని పై అధికారులకు పరిచయం చేసింది. ఓవైపు ఆమెలాంటి ధీరవనితతో కలిసి పనిచేయడం తమకు గర్వకారణంగా ఉందంటూ తోటి సిబ్బంది పేర్కొనగా... తల్లి తమను విజయతీరాలకు ఎలా చేర్చిందో గుర్తుచేసుకుంటూ కుమారులు ఉప్పొంగిపోయారు.

‘‘మా అమ్మ మాకోసం చాలా త్యాగం చేసింది. మమ్మల్ని ఎప్పుడూ ఓడిపోనివ్వలేదు. బాగా చదువుకోవాలని, బాగా చదివితే మంచి ఆఫీసర్లు కావచ్చంటూ నిత్యం ప్రోత్సహించేది. ఆమె కుమారుడిగా నేను గర్విస్తున్నాను..’’ అని సివాన్ కలెక్టర్ మహేందర్ కుమార్ పేర్కొన్నారు. మంచి చదువులు చదివించడం కోసం ఆమె కష్టపడి పనిచేసేదని గుర్తుచేసుకున్నారు. తమ తల్లి కష్టాన్ని చూసిన తర్వాత సమాజానికి ఏదైనా మంచి చేయాలని ముగ్గురు కుమారులం నిర్ణయించుకున్నామన్నారు. ‘‘జీవితంలో ఏ ఉద్యోగమూ కష్టం కాదు. నిజాయితీగా కష్టపడి పనిచేస్తే అన్ని సాధ్యమే. మా తల్లి, మేము మా జీవితాల్లో చాలా కష్టకాలాన్ని ఎదుర్కొన్నాం. అయినప్పటికీ ఆమె ఎప్పుడూ మాకు ఇబ్బంది తెలియనివ్వలేదు. నిరాశ దరిచేరనివ్వలేదు. ఆమె కష్టానికి తగినట్టుగా మేమంతా ఉన్నత స్థాయిలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను...’’ అని కలెక్టర్ పేర్కొన్నారు.

కాగా తన పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ.... ఆమె ఇప్పటివరకు వీధులు శుభ్రం చేయడం మానుకునేందుకుగానీ, ఉద్యోగాన్ని వదిలిపెట్టేందుకు గానీ ఇష్టపడకపోవడం గమనార్హం. ‘‘ నా పిల్లల్ని చదివించేందుకు ఈ ఉద్యోగమే ఆసరాగా నిలిచింది. నా కలలు నిజం చేసిన ఈ ఉద్యోగాన్ని ఎలా వదిలిపెడతాను..?’’ అంటూ సుమిత్రాదేవి తన వృత్తిపట్ల కృతజ్ఞత వెలిబుచ్చింది.

నీతి: పని మన వంతు ఫలితం ఇవ్వడము పరమేశ్వరుని వంతు

మన పనే మన దైవం అది లేక పోతే మరణమే శరణం,
ఈ భూమి మీద నీవు గతం లో చేసిన, వర్తమానం లో అనుభవించావలసిన ఖర్మ ను మరియు సుఖం ను బట్టి నీవు చేయవలసిన పని నిర్ణయించ బడుతుంది, అందు చేత నీ పని ని నీవు ఇష్టం తో చేయవలను అంతే కాని కష్టం అని భావించి చేయరాదు, అలా చేస్తే నీ ఖర్మ పూర్తి కాదు, నీ సత్ ఫలితం లబించాదు.
👏👏👏

కామం ఆత్మకథ

నేను కాముణ్ణి. నేను అత్యంత శక్తమంతుణ్ణి. నేను
గొప్ప ధీరులను కూడా ఓడించగలిగాను. నేను
మనుష్యులకు ఎంతో దగ్గరగా ఉన్నప్పుడు వారి మనస్సుల
లోనే ఉంటున్నప్పటికీ, వాళ్ళు నన్ను కనిపెట్టలేరు.
జ్ఞానవంతులైన వారికి కూడా నేనెక్కడి నుండి పుట్టుకు
వస్తున్నానో తెలియదు. నేను కొన్నిసార్లు వారిని నేరుగా
అటకాయిస్తాను. నన్ను కనిపెట్టాలని ప్రయత్నించినప్పుడు
ఎవ్వరూ ఊహించలేని క్రొత్త త్రోవలో నేను వారిని
పట్టుకుంటాను. వారికి ఏ మాత్రం తెలియకుండా, కరుణ,
జాలి, ప్రేమ మొదలైన ఇతర రూపాలను ధరించి వారికి
ఎదురుపడతాను. తర్వాత నెమ్మదిగా నా అసలు రూవాన్ని

బయట పెడతాను. కొందరు జ్ఞానులు ఆ రూపంలో కూడా
నన్ను కనిపెట్టగలుగుతారు. అప్పుడు నేను వారి
మనస్సులలో నుండి పూర్తిగా వెళ్ళిపోయినట్టు కనిపిస్తాను.
కానీ నేను వెళ్ళిపోయాననుకుని, వాళ్ళు అతి
విశ్వాసం(Over-Confidence)లతో అజాగ్రత్తగా వ్యవహరిస్తే
చాలు, నేను మళ్ళీ వారికి తెలియకుండా వారి మనస్సులలో
ప్రవేశిస్తాను. నాకు జాలి లేదు. నా బాధితులు పరిస్థితి
ఏమవుతుందని నేను లెక్క చేయను. అది నా పని కాదు.
నా పని వీలైనంత మందిని పొట్టనబెట్టుకుని, సజీవంగా
దహించి వెయ్యడమే! నేను రాక్షసుల వంశస్థుణ్జి. మా
దానవుల జాతిలో సంబంధ బాంధవ్యాలకు విలువ లేదు.
నేను మనుష్యుల మనస్సులలో ప్రవేశించినప్పుడు మొట్ట
మొదటిగా వారిని రాక్షసులుగా మార్చివేస్తాను. అన్ని
వావివరసలు మర్చిపోయి, నీచమైన పాపాలకు ఒడిగట్టేలా
చేస్తాను. నా వశంలో ఉన్న ఒక తండ్రి తన కూతురు పట్ల
తనకున్న సంబంధాన్ని కూడా మర్చిపోతాడు. మనుష్యుల
మనస్సులలో సందేహాన్ని, అనుమానాలను పుట్టిస్తాను;
కుటుంబాలను ముక్కచెక్కలు చేస్తాను. పూర్వం
మనుష్యులు భగవంతుణ్ణి మరింతగా నమ్మేవారు కాబట్టి
నా పూర్వీకులు అంత శక్తిమంతులుగా ఉండేవారు కాదు.
కానీ కలియుగంలో నాకు వేటాడడం చాలా సులభం
అయిపోయింది. ఈ రోజులలో దైవశక్తి మీద మనుష్యు
లకు ఏ మాత్రం నమ్మకం లేదు. మనుష్యులు భగవంతుడి
ఆశ్రయంలో రక్షణ పొందినప్పుడు నేను పూర్తిగా

నిస్సహాయుణ్ణి అయిపోయి, వారి దగ్గరికి ఏ మాత్రం
పోలేను. మనుష్యులకు బాగా తెలిసిన భగవన్నామం అనే
ఆయుధం నన్ను బలహీనుణ్ణిగానూ, శక్తిహీనుణ్జిగాను
చేసివేస్తుంది. నేను రావణుణ్జి భ్రమలో పడవేశాను.
అతడు నా జాతికి చెందినవాడే. చాలా పొగరుబోతు,
అధికారం చెలాయించేవాడు. అతడికొక గుణపాఠం
నేర్పాలని సీతాదేవిని చెరపట్టేలా అతణ్ణి ప్రేరేపించి అతణ్ణి
నాశనం చేశాను. మహాపురుషుడైన విశ్వామిత్రుణ్జి నేను
మైమరపించి మేనక యొక్క అందానికి సాగిలపడేలా
చేశాను. కానీ అతడు దృథఢసంకల్పం కలిగినవాడు.
నిజమైన ధీరుడు. చివరికి నేను ఓడిపోక తప్పలేదు.
ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్రుడయ్యాడు. నా మాయలో పడి
గొప్పగొప్ప రాజులు, మంత్రులు వారి రాజ్యాలనే
పోగొట్టుకున్నారు. వారి సుఖలాలసత్వం వారిని బలహీనులు
గానూ, నిర్లక్ష్యంతో వ్యవహరించేలాగానూ చేసి శత్రువుల
చేతిలో ఓడిపోయేలా చేసింది. దేవతలలో ఒకడైన ఇంద్రుణ్ణి
కూడా నేను నాశనం చేశాను. నా మాయలోపడి మహర్షి
గౌతముడి భార్య అయిన అహల్యపట్ల ఇంద్రుడు ఘోరమైన
అపచారం చేశాడు. శూర్చుణఖ రూపంలో ఎదురుపడి
శ్రీరామచంద్ర ప్రభువునే లొంగదీసుకోవాలని ప్రయత్నిం
చాను. కానీ రాముడు శూర్చుణఖ రూపంలో ఉన్న నన్ను
కనిపెట్టడంతో నా పరాజయాన్ని అంగీకరించక తప్పలేదు.
కానీ నా అల్లరివల్ల పాపం ఆ శూర్చణఖ కష్టాలపాలయింది.
గాఢతపస్సులో మునిగివున్న మహాశివుడి మనస్సును

ఆకర్షణలకులోను చెయ్యాలని చూశాను. కానీ ఆయన నా
ఉనికిని కనిపెట్టి తన మూడవ కన్ను అయిన జ్ఞాననేత్రాన్ని
తెరిచి నన్ను కాల్చి బూడిద చేశాడు. నాకు ఆయనను చూస్తే
మహాభయం. సాధారణంగా నా జాతివారిని నాశనం
చెయ్యడం నాకు ఇష్టముండదు. కానీ మహావిష్ణువు ఆదేశం
మేరకు, ఆయనే మోహినీ రూపాన్ని ధరించిన సందర్భంలో
నేను భన్మాసురుణ్ణి నాశనం చెయ్యవలసి వచ్చింది.

నేనొక మనిషి మనస్సును పట్టుకున్నప్పుడు అతణ్జి
గుడ్డివాణ్ణి చేసేస్తాను. అందుకే "ప్రేమ గుడ్డిది!" అని
నానుడి. నేను మనిషి మనస్సులో చేరినప్పుడు ఆ
కామాంధుడైన మనిషికి వికారమైన ముఖం కూడా గొప్ప
అందమైనదిగా కనిపిస్తుంది. నేనెక్కడకు వెళ్లినా
నాతోపాటు నా స్నేహితులు ఉంటారు; వారు నా శక్తిని
మరింతగా పెంచుతారు. నేను అగ్నిలాంటివాణ్ణి అయితే
వారు దాన్ని మరింత మండించే నెయ్యి, వెన్న
లాంటివారు. నా స్నేహితులు - కోపం, అసూయ,
లోభం, ద్వేషం, అహంకారం, భయం, మమత,
అనురాగం మొదలైనవారు.

నేరస్థులలో అధికభాగం నా బాధితులే. ఈ
ప్రపంచమంతా నా గుప్పెట్లో ఉంది. ఈ ప్రపంచం
భగవంతుడి సృష్టి అని, ఆయనే దీనిని పాలిస్తున్నాడని
నేను మర్చిపోయి, అహంకారంతో నేనే ఈ ప్రపంచాన్ని
సృష్టిస్తున్నానని, నేనే ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నానని
భావించినప్పుడు, భగవంతుడు మానవరూవాన్ని ధరించి

ఈ భూమి మీదకు అవతరిస్తాడు; నా అహంకారాన్ని
అణచివేసి అతడే పరిపాలిస్తున్నాడు కానీ, నేను కాదన్న
విషయాన్ని తెలిసేలా చేస్తాడు. ఆ పరమాత్మ అంటే నాకు
భయం. ఎంతవరకూ మనుష్యులు ఆయన బోధనలను
అనుసరిస్తూ, భక్తిని పెంపొందించుకుని ఆయననే
శరణువేడి ఉంటారో, అంతవరకూ నేను వారికి
దూరంగా ఉంటాను. ఎప్పుడైతే వాళ్ళు దేవుడి శక్తిని
మరచిపోయి ఆయన ఉనికినే అనుమానిస్తారో నేను నా
భువనసమ్మోహన రూపంలో కనిపించి వారి మీద
నిర్ధాక్షిణ్యంగా దాడి చేస్తాను. అందుకే యుగావతారుడైన
శ్రీరామకృష్ణులు, "ఓ సాధూ! సావధాన్‌! కామలోభాలపట్ల
అప్రమత్తుడవై ఉండు!" అని ప్రబోధించారు.



This content is captured from book -

యువతా!
లెండి! మేల్కోండి!
మీ శక్తిని తెలుసుకోండి !

ఆంగ్లమూలం :
స్వామి శ్రీకాంతానంద

అనువాదం :
అమిరపు నటరాజ

రామకృష్ణ మఠం
దోమలగూడ, హైదరాబాదు-500 029

Book page Number - 116

Sunday, February 2, 2020

లార్డ్ మెకాలే బ్రిటిష్ పార్లమెంట్ లో 1835 ఫిబ్రవరిలో యిచ్చిన ప్రసంగం



కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు... ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!

కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు... ప్రతి తల్లి ఇలాగే చెప్పగలిగితే అంతా శుభమే!

1.నీ భార్యను ఎప్పుడూ అమ్మతో పోల్చవద్దు...ఎందుకంటే మీ అమ్మకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నీ భార్యకు నీలాగే ఇది కొత్త అనుభవం.
నిన్ను నేను ఎలా పెంచానో తనని వారి తల్లిదండ్రులు అలాగే పెంచి ఉంటారు కదా!
తనకు అలవాటు అయ్యేదాకా నువ్వే మంచిగా చూసుకో.తప్పకుండా తను కూడా మంచి గృహిణి గా,మంచి తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తుంది.

2.నీ భార్యను ఒక మంచి స్నేహితురాలిగా భావించి అన్ని విషయాలను తనతో పంచుకో...
నీ తల్లికి నిన్ను చూసుకోవడమే పని..నీవు మమ్మల్ని,నీ భార్యను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకుని ప్రేమగా ఉండాలి.

3.నీతో సమానంగా తనని చూసుకో...నీ జీవితంలో నువ్వు తీసుకోబోయే నిర్ణయాలను ఆమెతో కూడా చర్చించి తీసుకో!నీ మంచిచెడులో నీకు జీవితాంతం తోడుగా తనే ఉంటుంది.

4. పుట్టింటి నుంచి వచ్చిన ఆ అమ్మాయికి ఇక్కడ పద్ధతులు, అలవాట్లు కొత్తగా ఉంటాయి. తనని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి...కాస్త మోహమటంగా ఉండచ్చు...నువ్వే తనకి తోడుగా ఉండి తను సంతోషంగా ఉండేటట్లు చెయ్యి.

5.నీ భార్యను మాకంటే ఎక్కువగా నువ్వే ప్రేమించాలి...
ప్రేమించడానికి వయస్సుతో పనిలేదు.చిన్న,చిన్న సర్ప్రైజ్ లు,కానుకలు ఇచ్చి తనని సంతోషంగా ఉండేలా చూసుకో..వారాంతంలో బయటికి తీసుకుని వెళ్లు. పుట్టింటికి తనతో కలసి వెళ్ళు.
నీ లాంటి భర్త, మా లాంటి అత్తమామలు లభించడం తన అదృష్టం అని చెప్పుకునేలా మనం అందరం ప్రవర్తిద్దాం...

ఇవన్నీ నేను మీ నాన్న దగ్గర పొందాను...అనుభవిస్తున్నాను..నా అనుభవాలను నీతో చెపుతున్నాను...నువ్వు కూడా మీ నాన్నలా ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటూ,నువ్వు సంతోషంగా ఉంటూ...మమ్మల్ని సంతోషంగా ఉంచుతావని నమ్ముతున్నాను...నిండు నూరేళ్లు ఆనందంగా మీరు జీవించాలని కోరుకుంటున్నాను...ఇష్టకామ్య ర్థ సిద్ధి రస్తు....❤❤❤❤👩‍👩‍👧‍👧

నేటి మన పెళ్ళిళ్ళలో చేస్తున్న పొరపాట్లు...


1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..
ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,
చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..
భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలో
ఒకరు చూపులు నిలపకపోవటం.. -
ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!
(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)
(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)

3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..
ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం...!

4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..
ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు...!

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి
రావటం వధూవరులని ఆశీర్వదించటం..
ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయి
జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!

6. బఫే భోజనాలు..
ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!

7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..
ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!

ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.
అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని
భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్శంగా నిలవండి....

అందరికి చెప్పండి, చెప్పకపోతే తప్పు, చెప్పినా వాడు పాటించక పోతే వాడి కర్మ. ఇవి శాస్త్రం లో ప్రతి పనీ ఒక నిర్దుష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు.

వాటిని పాటించకుండా వెర్రి తలలు వేస్తే ఏమి జరుగుతుంది అని, ఆలోచనతో ఒక 15000 మంది దంపతులపై గడచిన 20 సంవత్సరాల నుంచి observe చేస్తున్న ఒక పండితుల టీం చేసిన కృషికి అక్షర రూపం ఈ వ్యాసం. అందరికి అందించండి.

అందరూ హిందూ వివాహ వ్యవస్థ నిర్దేశించిన లక్ష్యం
నెరవేరేటట్లుగా తెలియచెప్పి ఆచరింపచేస్తారని ఆశిస్తూ

🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

పసుపు గురించి తెలుసుకుందాం

పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే...

1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క

వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.

పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.
దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి.

గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు?

ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:

1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.

2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.

3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.

4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.

5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.

6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.

7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.

8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.

9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది.
(సేకరణ)

మనసు

💐 మనసు 💐

👉 మనసును స్వేచ్ఛగా వదిలేయకూడదు.

👉దానిలోని భావాల్ని నిత్యం కనిపెడుతుండాలి.

👉అసలు కొన్ని ఆలోచనలు మనిషికి తెలియకుండా లోపలికి ఎలా ప్రవేశిస్తాయా అనిపిస్తుంది ఒక్కోసారి.

👉అప్పుడు అతడు తనను తాను మరచి, వాటికి వశమవుతుంటాడు.

👉 ప్రతి ఆలోచనకూ అవకాశమిస్తే, మనిషి తుపానులో ఇరుక్కుపోతాడు.

👉 తనకు తానే గందరగోళ పరిస్థితి సృష్టించుకుంటాడు.

👉 అందువల్ల అతడు తన మనసును ఎప్పుడూ వేయి కళ్లతో కనిపెట్టాలి.

👉 ఒక భావాన్ని మనసు పట్టుకొని వస్తుంది.

👉దానితో మనిషి స్నేహం చేసి, మరిన్ని భావాలకు ఆస్కార మిస్తాడు.

👉 అవి మంచివైతే మంచి వైపు, లేదంటే చెడు వైపు లాగుతుంది.

👉 మనసు పనిగట్టుకుని అన్నీ మంచి భావాలనే ఇవ్వదు.

👉 అతడే ప్రతి భావనలోనూ మంచిని చూడాలి.

👉 తన మనసుకు నిరంతర ధ్యానం ద్వారా శిక్షణనివ్వాలి.

👉 ఒక్క ప్రతికూల ఆలోచననైనా రానివ్వకూడదు. దానికి అవకాశమూ ఇవ్వకూడదు.

👉 పలు రకాల ఆలోచనలతో, మానవ జీవన ప్రయాణం చిల్లులు పడిన పడవలా మారుతుంది.

👉 ‘నా సాధన అంతా నా మనసుతోనే’ అనేవారు అరుణాచల రమణ మహర్షి .

👉 ప్రతీ మనషీ కూడాను ధ్యానం ద్వారా తన మనసు యెుక్క తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించు కోవాలని ఆయన చెబుతుండేవారు.

👉 గొప్ప భావాలనే మనిషి పోషించాలి.

👉 భ్రమల్లోకి బలవంతంగా నెట్టే వూహల్ని మొగ్గలోనే ధ్యానం ద్వారా తుంచాల్సిన బాధ్యత అతడిదే.

👉 వూహను ఉపయోగించుకునే నేర్పరితనం పెంచుకోవాలి.
👉 వీటన్నింటికీ ముందు, అతడికి తెలియాల్సింది తన మనసు పోకడ !సంపర్కం తీరుతెన్నులు.

👉 మనసు గురించి తెలియకుండా, ఆధ్యాత్మికతపై మాట్లాడే అవకాశమే మనిషికి లేదు.

👉 అతడి సాధన అంతా మనసుతోనే! తను చేసే యుద్దం తన మనస్సుతోనే.

👉 మనసు లోపలికి, తనలోకి తానే అతడు ప్రయాణించాలి.

👉 తన అంతరంగ ప్రయాణం అద్భుతంగా సాగాలి.

👉 అందమైన మనసు. రంగురంగుల మనసు. ఇంతవరకు ఒక ప్రపంచాన్ని చూపించింది.

👉మనసు లో ఎన్ని ప్రపంచాలో! వాటి నుంచి బయటకు వెళ్లాలి మనిషి.

👉 అలా లేనప్పుడు అది పురోగమనం కాదు- తిరోగమనం!

👉 మనసుకు మించిన దేవుడు లేడు.

👉 నేను ను మించిన మంత్రం లేదు.

👉 మనసులోనే అంతరాలయంలో మూల విరాట్టు సేదతీరుతున్నాడు.

👉నీలోపల దివ్యంగా ఉన్నాడు.

👉పాల సముద్రంలో శేషశయ్యపై పవళించి ఉన్నాడు

👉 నీవు ధ్యానం చేసి మేల్కొలుపు.

మంచిగా మల్చుకొంటే

👉 నీ మనసే దైవం

👉 నువ్వే దైవం

👉 అహం బ్రహ్మాస్మి అని ఓంకారం చెట్టుమీద గల ఆత్మపక్షి అరిచి చెబుతోంది.

👉 అదొక దివ్యమైన, అద్భుతమైన, అపురూపమైన దృశ్యం. అనంతమైన అనుభూతి.

👉 దాని కోసమే మనిషి జన్మించాడు.

👉 తన మనసుతోనే అతడు బతుకుతాడు.

👉 ఆ మనస్సును ధ్యానం అనే అద్దంలోనే అన్నీ చూస్తాడు.

👉 అంతరంగంలో అంతర్ముఖుడైనవాడికి ఆకలిదప్పులు ఉండవు.

👉 ఇంతకాలం ఏ మనసైతే అతణ్ని పట్టి పీడించిందో- అదే మనస్సు వేషం, భాషలు మార్చుకొని ‘జ్ఞాన బ్రహ్మ’గా దర్శనమిస్తుంది.

👍 అదే మనసు యెుక్క విశ్వరూపం!

👉 ‘తన ధర్మం వైపు అడుగు వేసే ఉత్తమ మానవుణ్ని దేవుడుగా తయారుచేయడమే దేవతల లక్ష్యం.

👉 ఆ లక్ష్యసాధనకు ముందుగా కావాల్సింది మనస్సును ధ్యానంతో వసుపర్చుకోవడం.

👉 ‘మర్రి విత్తనంలోనే మహావృక్షం ఉంది’ అని పెద్దల మాట.

👉 అలాగే సర్వ లోకాలూ మనిషి మనసులోనే ఉన్నాయి.

👉 ఆలోకాలతోనే అతడికి పని.
👉ఆకాశంలా విశాలత్వం,
వాయువులా సర్వ వ్యాపకత్వం. మనియికి
అవసరమవుతాయి.
👉 మనసు సంపర్కం తేజస్సును అగ్నిలా, స్వచ్ఛతను జలంలా, సుగంధాన్ని మట్టిలా అనుభవంలోకి తెచ్చుకోవాల్సింది మనిషే!

👉 తన మనసును దాటిపోవాల్సింది, హృదయంగా మారిపోవాల్సింది, దివ్యత్వాన్ని నలుదిశలా వ్యాపింపజేయాల్సింది అతడే!

👉 మారిన మనసే ఉదాత్త హృదయం.
👉 ఆ హృదయ నివాసి దైవమే!
👉అలా అన్నింటినీ చూస్తుంటే, మనిషి మనసు నిర్మల మవుతుంది.

👉బుద్ధుడు బోధించినట్లు- తాపీగా ఒడ్డున ఉండండి. మనసును అలాగే నిశితంగా గమనిస్తుండండి.

👉 ఏం జరుగుతుందో అప్పుడు మీరే చూడండి!

👉ఇదియే మనస్సు యెుక్క విశ్వరూపం. 🙏

నల్లపూసలు

🍁నల్లపూసలు🍁

👉🏼స్త్రీ తొమ్మిది నెలల కాలం సంతానాన్ని తన గర్బంలో మోసి మరో ప్రాణికి జన్మనిస్తుంది. అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పధార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు, వాటిల్లో నల్లపూసలు ఒకటి.

👉🏼ముతైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి.
సకలదేవతల సన్నిధానయుల్తమైన, సకలతీర్థాల సన్నిధానం కలిగిన, సౌభాగ్యాలనొసగే తాళి-మాంగల్యం మతైదువకు ముఖ్యమైనది.

👉🏼వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం.

ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ
మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది.

👉🏼ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది.

👉🏼ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి.

ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు.

👉🏼వేరొకరి దృష్టి పడితే మంచిదికాదు.
స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

👉🏼నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగాను, పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది.

👉🏼ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు.

👉🏼వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ 'నలుపు రంగు' ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు.
అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు.

👉🏼వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు. ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే 'నీలలోహిత గౌరి' కి పూజలు చేయిస్తారు. ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
నాకు వివాహమును, భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక, అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే........ బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి.

నీలలోహిత గౌరిని పూజించడం వలన ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది.

👉🏼అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది. 🙏

Welcome to the 21th century, The new generation of humanity.

"welcome to the 21th century".

Where sex is free and love is expensive. Where losing a phone is more painful than losing your virginity. Where modernisation means nudity, where if you don't drink / smoke you're out of fashion, where the boys flirt and pass negative comments to other girls. Where if you don't fool your partner it's because you're not smart or smart. Where the bathrooms have become photography studios. Where temples turn into dating points. Where Worshipping God is difficult. Where lies become realities. Where the ladies fear pregnancy more than h.i.v. where pizza delivery is faster than the emergency response. Where people fear the thieves and the terrorists more than God. Where people become toxic when they tell you your truths or when you resist to change. Where perspectives and clothes decide the value of a person. Where money is more important than family and friends. Where children are ready to leave their families for their love of the moment. Where the boys are afraid of marriage, but they love having sex. Where love is a game. Whoever plays with the mind always gets happiness and who plays with the heart always hurts.
Modernity, love and liquid education...

The new generation of humanity.

పరిశుభ్రత & maintaining healthy habits

1. మీ నోరు నిద్ర లేచిన వెంటనే దుర్వాసన రాకుండా లాలాజలం తియ్యగా ఉంటే, మీలో ఉన్న 70 శాతం నీరు పరిశుభ్రంగా ఉన్నట్లు తెలుసుకోవచ్చు.

2. మీ నాలుక మీద పాచి మందంగా లేకుండా, నాలుక చేదు లేకుండా పరిశుభ్రంగా ఉంటే మీ జీర్ణాశయం పరిశుభ్రంగా ఉన్నట్లు అంచనా వేయవచ్చు.

3, స్నానం చేయకపోయినా సబ్బు పెట్టకపోయినా, మీ చెమట కంపు కొట్టకూడదు. అలా ఉంటే మీ చర్మం పూర్తిగా పరిశుభ్రంగా ఉన్నట్లు లెక్క.

4, మీరు ఎప్పుడు మూత్రం పోసినా, బాత్‌రూంమ్‌లో నీరు పోయక పోయినా మీ బాత్‌రూం కంపు కొట్టకూడదు. మీ మూత్రం ఎప్పుడూ పలుచగా, తెల్లగా వస్తూ ఉంటే, మీ లోపల ఉన్న 5 లీటర్ల రక్తం యొక్క పరిశుభ్రతను గమనించవచ్చు.

5, మీ విరేచనం ఎప్పుడు వచ్చినా ప్లేటుకు అంటకుండా మరకలు పడకుండా, వాసన లేకుండా, క్షణాల్లో బయటకు వచ్చేస్తుంటే, దాన్ని బట్టి మీ లోపల ఉండే కోటానుకోట్ల జీవకణాల పరిశుభ్రతను, ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు.

ఇప్పటి వరకూ చెప్పిన ఐదు విషయాల్లో వాసన లేకుండా గనుక ఉంటే, మీ శరీరం లోపల పరిశుభ్రంగా, ప్రశాంతమైన వాతావరణంలో మీ అవయవాలన్నీ జీవిస్తున్నాయని తెలుసుకోండి. లేదా వాసనలు ఎంత గాఢంగా వస్తూ ఉంటే, మీ లోపల అంత మురుగు గుంట వాతావరణం ఉన్నట్లుగా గ్రహించండి.

పరిశుభ్రత మీ శరీరంలో వచ్చేటట్లు చేయడానికి రోజుకు 4,5 లీటర్లు నీళ్లు తాగడం, 2, 3 సార్లు సాఫీగా విరేచనానికి వెళ్లడం, ఎంతో కొంత వ్యాయామం చేయడం, రోజుకు 50 - 60 శాతం ప్రకృతి సిద్ధమైన ఆహారం (వండని) తినడం, మాంసాహారాన్ని మానడం మొదలగునవి చేయండి. త్వరలో మీరు అలాంటి పరిశుభ్రతను అనుభవించగలరని ఆశిస్తున్నాను.


Let’s keep on maintaining healthy habits.

మన ఇంటికి వాస్తు అవసరం రాకుండా వుండాలంటే... ?


మన ఇంటికి వాస్తు అవసరం రాకుండా వుండాలంటే... ?

హృదయాన్ని తాకిన ఓ చక్కని కథ తప్పక మీ అందరితో పంచుకోవాలని అనిపిస్తోంది!✍

విశాఖపట్నంకి చెందిన మునుస్వామి వ్యాపార వేత్త, వ్యాపారంలో బాగా సంపాదించి స్థిరపడిన పెద్దమనిషి.

సంపాదించిన ఆస్తిలో కొంతభాగంతో వారు విశాఖపట్నం శివారు పల్లెటూరు లో కొంతభూమిని కొని, అక్కడ ఒక 3అంతస్తులఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఆ ఫామ్ హౌస్ దొడ్డి వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 100ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆఆస్తి కొన్నదికూడా ముఖ్యంగా ఆపెద్దమామిడిచెట్టును చూసి ముచ్చట పడే,ఎందుకంటే వారిభార్యకు మామిడి పళ్ళు అంటే చెప్పలేనంత ఇష్టం.

ఆ కొత్త ఇంటికి పనులు చేయిస్తున్న సమయంలో మునుస్వామిగారి శ్రేయోభి లాషులు కొందరు, వాస్తు చూపించుకుని ఇంటికి తగినమార్పులు చేయించుకో మని వారికి గట్టిగా సలహా ఇచ్చారు.

అయితే వాస్తుపై పెద్దగా నమ్మకంలేని వ్యక్తి మునుస్వామి గారు. ఐతే ఈసారి ఆశ్చర్యకరంగా వారి ఆత్మప్రభోదం మేర కు వారు ఒక వాస్తు పండితుని సలహా కొరకు ఆరా తీసి హైదరాబాద్ నుండీ ఒకగొప్పవాస్తు విద్వాన్ ని పిలిపించారు. ఆ వాస్తు పండితులు ఎవరోకాదు- పేరు మోసిన గొప్ప వాస్తు శాస్త్రవేత్త. వాస్తుపై 30ఏళ్లకు మించిన వృత్తిపరమైన గొప్ప అనుభవజ్ఞులు శ్రీవీరారెడ్డిగారు.

వారు వైజాగ్ వచ్చాక భోజనానంతరం మునుస్వామిగారి సొంత డ్రైవింగ్ లో ఇద్దరూ వైజాగ్ శివారు బయలుదేరారు.
కొంతప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో మునుస్వామి గారు కారును కొద్దిగా పక్కకు పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్నకొన్నికార్లకు దారివ్వడం చూసిన రెడ్డిగారు చిరునవ్వుతో "స్వామి గారూ! మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది" అన్నారు.

దానికి స్వామిగారు నవ్వుతూ"అయ్యా! వారికి ఏదోఅత్యవసరపని అయి ఉండ వచ్చు, అందుకే తొందరలో వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం దారి ఇవ్వడం మన ధర్మం కదండీ!" అన్నారు.

అక్కడనుండి చినగంట్యాడ అనే చిన్న పల్లెటూరు సమీపించింది.అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో స్వామిగారు కారు వేగం తగ్గించి స్లోగా నడుపుతున్నారు.

ఇంతలోహఠాత్తుగా ఒకకొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగె త్తాడు.గమనించిన స్వామిగారు అతడ్ని తప్పించి తనకారును మరింత నెమ్మది గా పోనిస్తున్నారు.

అది ఎవరికోసమో ఎదురు చూస్తున్న ట్లుగా ఉంది. ఇంతలో అదే దారిలో మరో కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు

ఈసారి ఆశ్చర్యపోవడం రెడ్డిగారు వంతైంది. ఆయన "సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు?" అని ప్రశ్నించారు.

స్వామిగారు నవ్వుతూ "పిల్లలెప్పుడూ అంతేకదండి! ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు. వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా?" అన్నారు.

ఆ మాట విన్న రెడ్డిగారు ఆనందంగా బ్రొటనవేలుపైకెత్తిచూపిస్తూ మీరు దాన్ని ఊహించి నడపడం నిజానికి మీ గొప్ప దనం" అని స్వామిగారిని అభినం దించారు.

కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది. కారు లోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ ఒక్కసారిగా 7,8 పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఎగిరాయి! అది చూసిన స్వామిగారు, రెడ్డిగారిని ఆపి, "సర్! మీరు ఏమీ అనుకోకపోతే, మనం కొద్ధి సేపు ఇక్కడే ఆగి వెళదాం!ఏమంటారు?"అన్నారు.

రెడ్డిగారు"ఏమండీ ఎందుకు?"

స్వామిగారు నవ్వుతూ.. . "అక్కడ దొడ్డివైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కోస్తున్నట్లుంది.
మనం కనుక హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు. ఎందుకండీ అనవసరంగా అంతలా వాళ్ళని భయ పెట్టి సాధించేదేముంది" అన్నారు.

వీరారెడ్డి గారు కొంతసేపు మ్రాన్పడి పోయారు.ఆపైనెమ్మదిగా ఇలాఅన్నారు.
"ఈఇంటికి ఎటువంటి వాస్తు మార్పు-చేర్పులు అవసరం లేదు !"

ఈసారి ఆశ్చర్యపోవడం స్వామిగారి వంతైంది..."ఏంఎందుకండి?"

"ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజం గానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు." అన్నారు రెడ్డిగారు.

🌷🙏🌷

ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల యొక్క శ్రేయస్సు, సంక్షేమం కోరు కుంటాయో, ఆఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది.

అయితే ప్రత్యేకించి 'ఎల్లప్పుడూ అన్ని
సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి తెలియకుండానే మహోన్నతుడు, సత్పురుషుడుగా మారి పోతాడు.'

నిజానికి సాధువు, సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!

ఇది ఓగొప్ప వాస్తువిద్వాన్ వారి అభిప్రాయం.

మరి మీ అందరికీ కూడా ఇకపై మీ ఇంటికి వాస్తు పండితుని అవసరం రాకూడదని ఆశిస్తున్నా!✍

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

ఆనందంగా ఉండాలనుకుంటున్నారా?

ఆనందంగా ఉండాలనుకుంటున్నారా నిజమా?
అయితే కొన్ని నిమిషాలు మీ కోసం కేటాయించండి.

మంచిదే ఇన్నాళ్ళకు మంచి ఆలోచన వచ్చింది.... మన ఇల్లు శుభ్రంగా, అందంగా, ప్రశాంతంగా ఉండాలనుకుంటే మనం ఏమి చేయాలి..... ఇంటికి పట్టిన బూజు, చెత్త, చెదారం తొలగించాలి. ఇంట్లో సామాన్లు అన్ని ఒక పధ్ధతి లొ ఉంచాలి. పనికి రాని వస్తువులు, ఇంట్లో అడ్డంగా ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులు బయట పడేయాలి అంతే కదా......

మరి మనం ఆనందంగా ఉండాలంటే చేయవలసినది అదే....... ముందు ఇప్పటికే మన మనస్సుల్లో ఉన్న చెత్త.. మన ప్రవర్తనలో ఉన్న చెడు అలవాట్లు జాగ్రత్తగా నేర్పుగా ఓర్పుగా అవతల పారేయాలి..... ఆనందంగా ఉండాలంటే మనలో తొలగించుకోవలసిన మరియు వదిలించుకోవలసిన ఈ చెత్త ఏమిటో చూద్దాం.......

1. పనికిమాలిన మరియు ఇబ్బంది పెడుతున్న బంధాలను, బంధుత్వాలను మనసులోంచి బయటపడేయండి:
అదేమిటండి? అంత మాట అనేసారు అని మీకు అనిపించవచ్చు. కాని తప్పదు . మనకు చికాకులు తెప్పిస్తూ మన ఆనందాన్ని హరించి వేస్తూన బంధాలు .. స్నేహాలు మనసులోంచి బయట పడేయండి. ఎంతకు మారని వారిని మారుతారని ప్రయత్నించడం..... మనం ఎంత సర్డుకుపోతున్న మన గురించి నలుగురికి చెడు ప్రచారం చేసేవారిని పట్టుకొని వేలాడటం వలన మన ఆనందం ఆవిరై పోతుంటుంది. మన కన్నా మనకి ఎవరూ ముఖ్యం కాదు... అటువంటి వారు ఫేస్ బుక్ స్నేహితులైన, వాస్తవ ప్రపంచం లోని స్నేహితులైన, బంధువులైన, రాబందువులైన జాగ్రత్త గా పరిశీలించి ఒకటికి రెండు సార్లు ఆలోచించి సెలెక్ట్ చేసి డిలిట్ బటన్ నొక్కండి.. ఆనందాన్ని కాపాడుకోండి...

2. ఒత్తిడి కి దూరంగా ఉండండి:
జీవితం ప్రెషర్ కుకర్ కాదు. ప్రతీ చిన్న విషయానికి పెద్ద విషయానికి తీవ్ర ఒత్తిడికి లోనవడానికి.... ఒత్తిడికి లోనైతే ఆనందమే కాదు ఆరోగ్యం కూడా అటక ఎక్కుతుంది. మనం ముందు ఉంటేనే కదా... ఆయా పనులు అయ్యేవి లేనివి చూడటానికి... జరిగేవి ఎలాగు జరగక మానవు..... కాబట్టి ప్రతీ విషయానికి తీవ్రంగా స్పందించి ఒత్తిడి తెచ్చుకొనే తత్వాన్ని వీలైనంత త్వరలో తుడిచి అవతల పారేయండి.....

3. ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టె చెడు అలవాట్లకు స్వస్తి చెప్పండి:
సిగరెట్లు గాని. మద్యపానం గాని అతి నిద్ర కాని, బద్ధకం గాని, సోమరితనం గాని, అతి స్నేహాలు గాని, ఫేస్ బుక్ గాని, చాటింగ్ కాని, బాతాఖానీలు గాని , విండో షాపింగ్ కాని , ఇలా ఏవైనా మీకు ఇబ్బంది పెడుతూన అలవాట్లు తాత్కాలికంగా మీకు ఆనందం కలిగిస్తున్న శాశ్వతంగా తీవ్ర ఇబంది కలిగించవచ్చు. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు ఏమిటో గుర్తించి ఫినాయిల్ వేసి కడిగి అవతల పారేయండి......

4. ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలని ప్రయత్నించకండి:
భగవంతుడు ఈ జీవితాన్ని మనకి కానుకగా ఇచ్చాడు. ఆనందంగా జీవిస్తూ నలుగురినీ ఆనందంగా ఉంచడం మంచిదే కాని అందరినీ సంతృప్తి పరచడం వలన మనం ఆనందంగా ఉంటాం అనుకోవడం కన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఆత్మ సంతృప్తిని మించిన ఆనందం ఎక్కడా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆఖరికి ఇంట్లో పనిమనిషిని, వాచ్ మేన్ ని ఆఫీస్ లొ బాస్ ని, కొలీగ్స్ ని, బంధువుల్ని అందరినీ సంతృప్తి పరుస్తూ జీవించాలనే మీ మహా యజ్ఞం మీద చన్నీళ్ళు పోసి హాయి గా ఉండండి.

5. ఎవరో అపార్థం చేసుకున్నారు సరిగా అర్థం చేసుకోలేదు అనే భావాన్ని విడిచి పెట్టండి:
ఉదాహరణకి మీరు కొరియా లేదా జపాన్ సినిమా చూసారు .. మీకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అది ఎవరి తప్పు ఆ సినిమా డైరెక్టర్ దా, హీరో దా, లేదా ఆ సినిమా ఆడుతున్న థియేటర్ దా? ఆ భాష రాకుండా చూసిన మనదే కదా ! అంటే ఎవరో గాడిద మనల్ని సరిగా అర్థం చేసుకోలేక ఓండ్ర పెడుతుంటే ఆ తప్పు ఎవరిదీ. అదేంటండి గాడిద అనేసారు అంటారా ? సారీ గాడిదను అవమాన పరిచినందుకు...... వాళ్లకు మనం అర్థం కాక పొతే మంచి డిక్షనరీ కొనుక్కొని నేర్చుకోమనండి.... ఎవరో అపార్థం చేసుకున్నారని ముక్కు చీదు కొని ఏడుపు మొదలెట్టవద్దు..... ముందు మొహం కడుక్కొని అద్దంలో మీ ముఖారవిందాన్ని ఆనందించండి......

6. ఎవరిని అనవసరంగా అనుకరించవద్దు.:
మీరు మీరే..... ఎవరి నుండైనా ప్రేరణ పొందండి తప్పు లేదు కాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు గుడ్డిగా ఎవరినీ అనుకరించడానికి ప్రయత్నించవద్దు. ఎందువలన అంటే ఒకరిని అనుసరించాలని లేదా ఒకరిలా ఉండాలని ప్రయత్నిస్తే అది లేని పోనీ తలనొప్పులకు దారి తీస్తుంది. అనుకరణ వేరు అనుసరణ వేరు, అనుకరణ అనేది మూర్ఖత్వం మన వ్యక్తిత్వాన్ని , అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. అనుసరణ మన వ్యక్తిత్వానికి కొత్త సొగసులు అద్దుతుంది. మనం మనలా ఉండటం లో ఆనందం. మనలను మనం గా స్వీకరించడంలో ఉన్న ఆత్మ సంతృప్తి దేనిలోనూ ఉండదు.

7. ఎవరిని విపరీతంగా ద్వేషించవద్దు అలా అని ఎవరిని విపరీతంగా ప్రేమించవద్దు:
అతి సర్వత్రా వర్జయేత్ .. ద్వేషం అనర్థదాయకం. ఎవరు పూర్తిగా మంచివారు ఉండరు అలా అని పూర్తిగా చెడ్డవారు ఉండరు. పరిస్థితులు బట్టి వారి అవసరాల బట్టి వారి హోదా బట్టి వారి పరిస్థితి బట్టి రకరకాలు గా మారు తుంటారు... శాశ్వత స్నేహితులు ఉండరు. శాశ్వత శత్రువులు ఉండరు. అతిగా ప్రేమించడం వలన దానికి మించిన శోకానికి బాధకు గురికావాలి. అతిగా ద్వేషించడం వలన అనారోగ్యం కోరి తెచ్చుకోవలసి వస్తుంది. ఈ మహా ప్రయాణం లో తోటి ప్రయాణికులు వస్తుంటారు ..పోతుంటారు.... బంధాల బంధనాలతో స్వేచ్ఛను హరించు కోవద్దు. ఆనందాన్ని ఆవిరి చేసుకోవద్దు.

8. జరిగిపోయిన దానికి , జరగబోయే దానికి ప్రాధాన్యత ఇవ్వవద్దు.
మన ఆనందాన్ని హరించేవి గతం గురించి పశ్చాతాపం మరియు భవిష్యత్తు గురించి ఆందోళన. మన ఆలోచనల్లో 65 శాతం గతం గురించి 30 శాతం భవిష్యత్తు గురించి ఉంటాయట. అంటే కేవలం 5 శాతం వర్తమానం గురించి ఆలోచిస్తామన్నమాట. చిన్న పిల్లలు ఎప్పుడు ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటంటే నూటికి నూరు పాళ్ళు వారు వర్తమానం లొ జీవిస్తారట.
ది పవర్ ఆఫ్ నౌ అనే పుస్తకం లొ ఎకార్ట్ టాలి వర్తమానం లొ జీవించే వారికి ఆనందం వెంటే ఉంటుందని వివరిస్తాడు.

9. ఎప్పుడు తమ గొప్పలు చెప్పుకుంటూ , మనల్ని కించ పరుస్తూ , మనల్ని తక్కువ చేసే మాటలాడే వారికి దూరంగా ఉండండి :
మన స్నేహితుల్లో గాని బంధువుల్లో గాని కొద్ది మంది తమను తాము గొప్ప వారిగా భావించుకుంటూ నిత్యం స్వోత్కర్ష లతో సోది వేయడమే కాకుండా మనల్ని బాగా తక్కువ చేసి మాట్లాడుతుంటారు.... తామేదో అంతర్జాతీయ స్థాయి లో ఉన్నట్టు మనమేదో గల్లీ కి పరిమితం అయ్యేటట్టు మాట్లాడుతారు ..మీరు చేయాల్సిన పని ఏమిటంటే మార్కెట్ కి వెళ్లి ఒక మంచి అద్దం కొని వారికి బహుమతి గా ఇచ్చి ఒకసారి తమ సౌందర్యాన్ని తనివితీరా చూసుకోమని ఒక సలహా ఇచ్చి వారి స్నేహానికి శాశ్వతంగా సెలవు చెప్పండి.

10. పెద్ద పెద్ద కోరికలు పెద్ద పెద్ద కలలు కనడం మానకండి:
కోరిక, ఆశ అనేది మన జీవితం లో చైతన్యాన్ని తెస్తుంది. కలలు కనడం ఆ కలలను సాకారం చేసుకోవడం లో ఉన్న సంతృప్తి వేరు.
పెద్ద పెద్ద కలలు మన ఆత్మా విశ్వాసానికి ఆత్మ ఔన్నత్వానికి నిదర్శనం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకరి కన్నా తక్కువ అనే భావాన్ని మన వలన పెద్ద పెద్ద విషయాలు సాధ్యం కాదు అనే భావనలను ప్రక్కన పెట్టి నిత్యం ఆనందాన్ని వెతుక్కుంటూ మన ఆనందాన్ని దూరం చేసే వాటిని దూరంగా పెడుతూ జీవితం లో ప్రతీ క్షణాన్ని ఆనందించండి.
ఆ ఆనందాన్ని నలుగురికి పంచండి.

విష్ యు ఆల్ ది బెస్ట్

విజ్ఞానం మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తెచ్చిందో చూడండి ...

🔹 మొదట : బావులలో నీరు త్రాగి వందేళ్ళు బ్రతికేవారు
🔸ఇప్పుడు : ఫిల్టర్ నీరు త్రాగుతూ 40 యేళ్ళకే ముసలి వాళ్ళం అయిపోతున్నాము

🔹 మొదట : నూనె గింజలు గానుగ ఆడించిన నూనె తిని వృద్దాప్యములోనూ గట్టిగా వుండేవారు
🔸ఇప్పుడు : డబల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తింటూ కూడా చిన్న వయసులోనే హృదయాఘాతానికి గురి అవుతున్నాము

🔹 మొదట : రాళ్ళ ఉప్పును సేవించినా ఆరోగ్యవంతులుగా వుండేవారు
🔸ఇప్పుడు : అయోడిన్ ఉప్పు సేవిస్తున్నా హై బీ.పి & లో బీ.పి తో బ్రతుకుతున్నాము

🔹 మొదట : వేప పుల్లలు, బొగ్గు, ఉప్పుతో పల్లు తోమి 80 సంవత్సారాలలో కూడా చెరుకుగడలు చీల్చుకుని తినేవారు
🔸ఇప్పుడు : కోల్గేట్ తో పల్లుతోముతూ కూడా డెంటిస్ట్ దగ్గరకు పరుగెత్తుతాం

🔹 మొదట : నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేసేవారు
🔸ఇప్పుడు : అన్ని స్కానింగులు చేసి కూడా రోగం ఏంటో చెప్పలేక పోతున్నారు

🔹 మొదట : 7 లేదా 8 మందికి జన్మనిచ్చిన తల్లి తన 80 వ యేట కూడ పొలం పనులు సునాయాసంగా చేసేది
🔸ఇప్పుడు : మొదటి నెల నుండి వైద్యుల పర్యవేక్షణలో వున్నా ఆపరేషన్ తోనే పిల్లలు పుడుతున్నారు

🔹 మొదట : బెల్లం పిండి వంటలను కడుపు నిండా తినేవారు
🔸ఇప్పుడు : తినక ముందే షుగర్ వచ్చేసి వుంటుంది

🔹 మొదట : వృద్దులకు కూడా కీళ్ళ నొప్పులు వుండేవి కావు
🔸ఇప్పుడు : యవ్వన దశ నుండే కీళ్ళ జబ్బులు, నడుం నొప్పులు మొదలు అయిపోతున్నాయి

చివరగా.. ఇది విజ్ఞానపు యుగమా లేక అజ్ఞానపు యుగమో తెలియడం లేదు... విధి విచిత్రము కాకపోతేనూ!

ఇది నా ఫ్రెండ్ షేర్ చేసాడు నిజమే అనిపించింది. నేను మీతో పంచుకుంటున్నాను.

🥦

మనిషి లో మనీ కోసం కాకుండా,తృప్తి, ఆనందం,సంతోషం కోసం బతకటానికి ప్రయత్నిస్తే !అదే నిజమైన జీవితమౌతుంది!

ఈ రోజు సత్య వాక్కు

అనుదినం అలసి సొలసి ఇంటికి తిరిగొస్తాను ...
ఇప్పటికీ అర్ధం కాదు...

పనిచేయటానికి బ్రతుకుతున్నానా?
లేక బ్రతకటానికి పని చేస్తున్నానా అని !?
జవాబు మాత్రం బ్రతకటానికి అనే మాట నిజమే కదా.

బాల్యంలో అందరూ మరీ మరీ అడగిన ప్రశ్న ...
పెరిగి పెద్దయ్యాక ఏమౌతావని?
ఆ సమాధానం ఇప్పుడు దొరికింది!
మళ్ళీ బాల్యం కావాలని!
మళ్ళీ పిల్లాడిగా మారిపోవాలని
మిత్రుల నుంచి దూరం వెళ్ళాక నిజం తెలిసింది
వాళ్ళు మిత్రులు మాత్రమే కాదు, నాకు జ్ఞానోదయం కలిగించిన దేవుళ్ళని

ఔను...
లోకం లాజిక్కుని చూపింది వాళ్ళే మరి!
జేబు నిండుగా ఉన్నపుడు ... ఈ దునియా ఏమిటో తెలిపింది వాళ్ళే...
జేబు ఖాళీ అయినపుడు ... తన వాళ్లెవరో తెలిపిందీ వాళ్ళే!
డబ్బు సంపాదించేటపుడు తెలిసింది.....

నేను సంపాదించిందంతా కనీస అవసరాలకే సరిపోతుందని

నవ్వాలని అనిపించినా ...
నవ్వలేని పరిస్థితి...
ఎలా ఉన్నావని ఎవరైనా అడిగినప్పుడు ---
ఓహ్ !
నాకేం బ్రహ్మాండంగా వున్నా!!
అని అనక తప్పనప్పుడు.
ఏడవాలన్నా ఏడవలేని పరిస్థితి!
వాడికేందిరా....
దర్జాగా బ్రతుకుతున్నాడని అన్నప్పుడు
ఇది జీవిత నాటకం...
ఇక్కడ అందరూ నటులే...
నటించక తప్పదు....
అవార్డుల కోసం కాదు...
బ్రతకటం కోసం !!
కాదు.. కాదు....
బాగా బ్రతుకుతున్నానని నమ్మించటం కోసం.

రాతి మనిషి నిప్పురాజేయటానికి చాలా కష్టపడ్డాడట....
ఇప్పుడు నిప్పు రాజేయాల్సిన పనే లేదు ...
ఇక్కడ మనిషి మనిషిని చూస్తే భగ్గుమంటాడు...

సైంటిస్టులు పరిశోధనలెన్నో చేస్తున్నారట....
బాహ్య లోకంలో జీవం ఉందా లేదా అని....

మరి మానవ జీవితంలో ఆనందం, తృప్తి, సంతోషం ఉందా లేదా అని మనిషి వెతకడమే లేదు !!!

ఓజోన్ పొర డ్యామేజ్ అయి భూతాపం
పెరుగుతుందని ఆందోళన ...
ఒకరిపై ఒకరికి వుండే ఈర్ష్యా, ద్వేషాల మంటల గురించి పట్టించుకోరే...

పెరుగుతుంది కాలుష్యం మాత్రమే కాదు కర్కశత్వం కూడా !

మట్టిలో మొక్కలు నాటాలి...
మనసులో మానవత్వం నాటాలి
ఇదంతా గట్టిగ అరవాలి.... అందరికి చెప్పాలి....

మళ్ళీ ఒక్క క్షణం...
నాకెందుకులే అని !
సమస్య నా ఒక్కడిదే కాదుగా అని!

నా కష్టం గురించి అందరూ మాట్లాడాలి
పక్కవాళ్ళ కష్టం గురించి పట్టించుకునేంత తీరికెక్కడిది నాకు!
నా పని...
నా ఇల్లు...
నా పిల్లలు...
నా...నా.. నా...
నాతోనే నలిగిపోతున్నా...!
ప్రక్కవాణ్ణి నిందిస్తూ రోజు గడిపేస్తున్నా!

జీవితమన్నది
తనంత తానుగా...
నడచి పోతుంది…
గడచి పోతుంది....
మనకళ్ళముందే.....
మనకు తెలియకుండానే ముగిసిపోతుంది.

చేయడానికి చాలా టైం వుందని
చావు దగ్గర కొచ్చేదాకా చోద్యం చూస్తున్నా!
చివరికి ఉసూరంటూ కాటిదాక నలుగురి కాళ్ళతో నడిచిపోతున్నా కనుమరుగౌతున్నా...

ఎవరినో అడిగాను ...
అసలు నిద్రకు చావుకు తేడా ఏమిటి అని ?
ఎవరో మహానుభావుడు ఎంతో అందంగా సెలవిచ్చాడు !!!
నిద్ర, సగం మృత్యువట!
మరి మృత్యువు,ఆఖరి నిద్రట!!

ఆనందం లేని అందం...
తృప్తి లేని జీవితం....
ప్లాస్టిక్ పరిమళం..
సెల్ ఫోను సోయగం...
వెరసి ఇదీ నా నాగరిక జీవనం!
తెల్లారి పోతున్నది...
రోజుమారుతున్నది..
మన జీవన యాత్ర అలాగే గడచి పోతున్నది....

ఏంటో జీవితం....
రైలు బండి లా తయారయింది!
ప్రయాణమైతే ప్రతి దినం చెయ్యాలి
చేరే గమ్యం మాత్రం ఎండమావి లా అనిపిస్తుంది!

ఒకడు శాసించి ఆనందిస్తాడు
మరొకడు ఆనందాన్ని శాసిస్తాడు.

ఒక రూపాయి విలువ తక్కువే కానీ, అదే ఒక రూపాయిని లక్ష నుండి విడదీస్తే....
అది లక్ష ఎప్పటికీ కాదు...
ఆ లక్ష సంపూర్ణం కాదు...

అందుకే...
మనిషి లో మనీ కోసం కాకుండా,తృప్తి, ఆనందం,సంతోషం కోసం బతకటానికి ప్రయత్నిస్తే !

అదే నిజమైన జీవితమౌతుంది!
👏👏👏👏👏👏👏👏

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ...

ఒక తండ్రి తన పిల్లలకు రాసిన ఒక లేఖ....

నేను ఈ లేఖ రాయడానికి మూడు కారణాలున్నాయి.

1. జీవితం లో అదృష్టం, దురదృష్టం అనేవి చాలా చంచలమైనవి. ఎవరూ వీటిని ఖచ్చితంగా అంచనా వేయలేరు.

2. నీ తండ్రిగా నేను నీకు ఇవి చెప్పకపోతే, ఇంకెవ్వరూ నీకు చెప్పరు.

3.నీకు ఇవి తెలిస్తే బహుశా జీవితంలో చాలా సమయాలలో నీ గుండె గాయపడకుండా ఉంటుంది.

ఈ క్రింద విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకో....

1. నీతో సఖ్యంగా లేని వారి పట్ల ద్వేషం పెంచుకోకు.
నేను, మీ అమ్మ తప్ప నీకు తప్పనిసరిగా మంచే చేయాలన్న బాధ్యత ఎవరికీ లేదని బాగా గుర్తెరిగి మసలుకో.
నీతో మంచిగా ఉన్నవారిపట్ల కృతజ్ఞుడివై వుండు.
అలాగే జాగ్రత్తగా గమనించు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చేసే ప్రతి పనికీ ఒక ఉద్దేశం ఉంటుంది.
నీతో ఎవరైనా స్నేహంగా ఉంటే ఎప్పటికీ అలానే ఉండాలని లేదు, జాగ్రత్త, గుడ్డిగా వారిని ఆత్మీయులుగా నమ్మి మనసు గాయపరచుకునేవు సుమా!

2. ఏ ఒక్కరూ తప్పనిసరి కాదు మరియు తప్పక కలిగి ఉండితీరవలసినది ఏదీ లేదని మరచిపోకు.
ఇది నీవు సరిగా అర్థం చేసుకున్న రోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను వద్దనుకున్నా,
నువ్వు బాగా కోరుకున్నది నీకు దూరమైనా నీ మనసు పెద్దగా గాయపడదు.

3. జీవితం చిన్నది.
ఒక్క రోజు వ్యర్థమైనా చక్కగా అనుభవిం చాల్సిన,
మళ్ళీ తిరిగిరాని ఒక రోజుని కోల్పోయావన్న విషయం గుర్తించు.

4. ప్రేమ అనేది ఒక నిలకడలేని, చంచలమైన ఒక భావన.
కాలాన్ని, మూడ్ ని బట్టి వెలసిపోయే ఒక ఎమోషన్.
నువ్వు బాగా ప్రేమించానను కున్నవారు దూరమైనపుడు కుంగిపోకు, ఓపిక పట్టు. కాలం నీ గాయాలను, బాదలను అన్నింటినీ కడిగేస్తుంది.
ప్రేమ యొక్క సౌందర్యాన్ని ,
అలాగే ప్రేమ విఫలమవడాన్ని అతిగా ఊహించుకోకు.
ఇవి ఏమంత పెద్ద విషయాలు కావని కాలం గడిచే కొద్దీ తెలుసుకుంటావని తెలుసుకో.

5. చాలామంది పెద్దగా చదువుకోకుండానే జీవితంలో బాగా పెద్ద స్థాయికి వెళ్లుండచ్చు,
కానీ దానర్థం నువ్వు కష్టపడి చదవకుండానే గొప్పవాడయిపోతావని కాదు.
నువ్వు సంపాదించే జ్ఞానమంతా నీ ఆయుధాలని గ్రహించు.
దీవాళా తీసిన స్థితి నుండి తిరిగి ఉన్నతమైన స్థానం చేరడం సాద్యమే,
కానీ దీవాళా తీసినప్పటి పరిస్థితి దారుణంగా ఉంటుందని మరచిపోకు.

6. నేను వృద్ధాప్యంలో ఆర్థికంగా నీమీద ఆధారపడను, అలాగే జీవితాంతం ఆర్థికంగా నీకు ఆసరా ఇవ్వలేను. నువ్వు పెద్దవాడవుతూనే నా బాధ్యత తీరిపోతుంది. తర్వాత బస్సులో తిరుగుతావా నీ సొంత లగ్జరీ కారులోనా? రిచ్ గానా మామూలు జీవితమా? అన్నది నీవే నిర్ణయించుకో.

7. నువ్వు నీ మాట నిలబెట్టుకో. ఇతరులనుంచి ఏది ఆశించకు.
నువ్వు అందరితో మంచిగా ఉండు,
అందరూ నీతో మంచిగా ఉంటారని అనుకోకు.
ఇది నువ్వు సరిగా అర్ధం చేసుకోకపోతే నీకు అనవసర సమస్యలు తప్పవు.

8. లెక్కలేనన్ని లాటరీ టికెట్లు చాలా కాలం కొన్నా, ఒక్క చెప్పుకోదగ్గ పెద్ద ప్రైజ్ కూడా ఎప్పుడూ రాలేదు. కష్టపడితేనే ధనవంతులవుతాము అన్నదానికి ఉదాహరణమిదే. విజయానికి షార్ట్ కట్ లేదని బలంగా నమ్ము.

9. అది ఎంత తక్కువ/ ఎక్కువ కాలమైనా సరే, మనం కలసివున్న కాలాన్ని జాగ్రత్తగా దాచుకుందాం. వచ్చే జన్మలో మళ్లీ కలుస్తామో లేదో మనకు తెలియదు కదా కన్నా!

........ నాన్న

Heart Touching and very valuable 👍

భారతదేశంలో బ్రిటిష్‌ వారు కట్టించిన ఒకే ఒక హిందూ ఆలయం


కాలం ఎన్నో కబుర్లు చెప్పగలదు. గతాన్ని తవ్వి పోసి మన చరిత్రను మనకు బహుమతిగా ఇవ్వగలదు. మన దేశంలో ఒక్కో మూలకూ ఒక్కో కథ ఉంది. అడుగడుగునా అద్వితీయత ఉంది. ప్రపంచం కంటే ఎన్నో శతాబ్ధాలు ముందు నడిచిన మన పూర్వీకుల మేధస్సు ఉంది. మన కథలు మనం తెలుసు కోవాలి. పది మందికీ చెప్పి తీరాలి. మనల్ని మోస్తోన్న దేశం కథను మనం ఎత్తుకుని తిరగాలి. తలెత్తుకుని తిరగాలి.

యుద్ధానికి వెళ్లిన…
అవి భారతదేశాన్ని బ్రిటిష్‌ వాళ్లు పరిపాలిస్తున్న రోజులు… అది మధ్యప్రదేశ్‌ లోని షాజాపూర్‌ ప్రాంతం. కల్నల్‌ పదవిలో ఉన్న అప్పటి అధికారి పేరు మార్టిన్‌. అక్కడి బ్రిటిష్‌ ప్రభుత్వానికీ, ఆఫ్గన్లకూ యుద్దం జరుగుతోంది. పదిరోజుల క్రితం వచ్చిన ఉత్తరం తప్ప… యుద్ధానికి వెళ్లిన మార్టిన్‌ గురించి తన భార్యకు ఎలాంటి సమాచారమూ లేదు. ఆమె హృదయమంతా భర్త చుట్టూనే తిరుగుతోంది. మార్టిన్ ఎప్పుడొస్తాడా… అని ఆమె కళ్లు గుమ్మం వైపే చూస్తున్నాయి. లెక్కలేనన్ని కన్నీటి చుక్కలు నేల రాలుతూనే ఉన్నాయి. మార్టిన్‌ బతికే ఉన్నాడా లేదా అనే భయం క్రమక్రమంగా పెరిగిపోతోంది. అతడు మరణించాడేమోనన్న ఊహకు కూడా ఆమె వణికిపోతోంది. చెంపల మీద కన్నీరు పారుతూనే ఉంది. భర్త కోసం ఎదురుచూస్తూనే ఉంది.



జోడించి వేడుకుంది…
విషయం తెలుసుకున్న ఒక హిందూ సాధువు నేరుగా మార్టిన్ ఇంటికి వచ్చాడు. ఆమె పడుతోన్న బాధ నుంచి విముక్తి కావడానికీ, మార్టిన్ సజీవంగా ఇంటికి చేరడానికీ తనకో ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం ఆమెలో చిన్ని ఆశను పుట్టించింది. ఆ సాధువు ఇచ్చిన సలహా… నిండా చీకటి పరుచుకున్న ఆమె హృదయంలో ఒక దీపంలా వెలిగింది. కొండంత నమ్మకాన్ని ఇచ్చింది. సాధువు చెప్పినట్టు శివపూజ చేయడానికి నిశ్చయించుకుంది. దగ్గర్లోని ఒక శిధిల దేవాలయానికి చేరుకుంది. బైద్యనాథ మహాదేవ శివుడి ఆలయం. తాను అక్కడికి వెళ్లగానే… ఆ గుడి గంటలు నాట్యం చేస్తున్నట్టు మోగుతున్నాయి. ధూపాల పొగా, హారతి దీపాల వెలుగూ ఆమె నమ్మకాన్ని మరింత పెంచాయి. ఆ ఆలయంలో కొలువైన లింగాకారంలోని శివుడిని చూడగానే, రెండూ చేతులూ జోడించి వేడుకుంది. ఆ మహత్తర రూపాన్ని దర్శించిన క్షణం… అప్పటి వరకూ తానెప్పుడూ చూడని శక్తిని అనుభూతిచెందింది. ఆ ఆలయ పూజారి కూడా విషయం తెలుసుకుని, ఆమెకు అండగా నిలిచాడు. “బైద్యనాథ మహాదేవుడి అండ ఉండగా… ఏ ఆపదైనా సరే చిటికినవేలుని కూడా తాకదు. ఈ దేవదేవుడి ముందు మృత్యువు చాలా చిన్నది. ఈ విశ్వంలో ఏ మూలనున్నా సరే… నమ్ముకున్న వాళ్లను కాపాడుకుంటాడు. గుండెల నిండుగా బైద్యనాధుడిని నింపుకోండి. ఓ నమఃశివాయ అనే మంత్రాన్ని పదకొండు రోజుల పాటు లఘురుద్రి జపం చేయండి. అంతా మంచే జరుగుతుంది” అని చెప్పాడు.

ఆ మరుసటి రోజు నుంచే అన్ని పనులూ పక్కన పెట్టి, జపం మొదలు పెట్టింది. గుండెల నిండా శివయ్యను నింపుకుంది. అన్నపానాలూ మానేసింది. ఆమె నరనరాన ఓం కారం ప్రవహిస్తోంది. ప్రతిరక్తపు బొట్టూ శివయ్యనే తలుస్తోంది. ఓ నమఃశివాయ… ఓ నమఃశివాయ… ఓ నమఃశివాయ… అంటూ జపిస్తూనే ఉంది. మరో ధ్యాస లేదు, ఇంకే ధ్యానమూ లేదు. శివనామం సుముద్రంలా ప్రవహిస్తోంది. అక్కడి గాలి మొత్తం ఓంకారాన్ని పులుముకుంది. రోజులు గడుస్తున్నాయి.



మృత్యవు సిద్ధంగా…
జపం కొనసాగుతోంది. పదకొండో రోజున పంచాక్షరిని జపించింది. అదే రోజు సాయంత్రాన భర్త నుంచి ఉత్తరం వచ్చింది. మెల్లిగా ఉత్తరం తెరిచింది. లేఖ చివర ఉన్న భర్త సంతకాన్ని చూసి ఊపిరి పీల్చుకుని, చదవడం మొదలు పెట్టింది. “డియర్‌… కొద్దిరోజుల క్రితం నీకో లేఖ రాసాను కదా… ఆ తర్వాత రోజే ఆఫ్గన్లు మా సైన్యాన్ని చుట్టుముట్టారు. నలు వైపుల నుంచీ భీకరమైన దాడి చేశారు. ఒక్కరిలోనూ బతకగలమన్న ఆశ లేదు. హత్తుకోవడానికి మృత్యవు సిద్ధంగా ఉంది. మా దగ్గర ఆయుధాలు లేవు. ఆహారమూ లేదు. సైన్యమూ పలచబడింది. వారి చేతులో హతమవ్వడం తప్ప మరేదారీ కనిపించలేదు. అనుకున్నట్టు గానే… ఒకపొడవాటి ఖడ్గంతో ఆఫ్గన్‌ సైనికుడు నా మీదకి దూకబోయాడు. భయంతో కళ్లు మూసుకున్నాను. ఆ క్షణాన నువ్వు తప్ప మరేదీ గుర్తు లేదు. హృదయం నిండా నిన్ను నింపుకుని, ఊపరి వదిలేందుకు సిద్ధపడ్డాను. అంతలోనే అద్భుతం జరిగింది. అప్పటి వరకూ అక్కడ లేని మనిషి మా సైన్యంలోకి వచ్చాడు. ఆఫ్గన్లపై విరుచుకుపడ్డాడు. ఆయన్ని మేమెవ్వరమూ అంతకుమునుపు చూడలేదు. ఒంటి నిండా తెల్లగా ఏదో రాసుకుని ఉన్నాడు. మొలకి సింహం చర్మం కట్టి ఉంది. చేతిలో ఒక పదునైన ఆయుధంతో ఉన్నాడు. ఆ ఆయుధాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. చూడటానికి శూలంలా ఉండి, మూడు కొనలగా చీలి ఉంది. ఆ యోధుడి ధాటికి ఆఫ్టన్‌ సైన్యం చెల్లాచెదురైపోయింది. ఆ వీరుడే కనుక రాకపోయి ఉంటే… ఈ పాటికి నా శెవం ఇంటిని చేరు ఉండేది.” ఈ లేఖ చదివాక ఆమె ఊపిరిపీల్చుకుంది. మరోసారి గుండెల నిండా శివయ్యను నింపుకుని నమస్కరించుకుంది.



చివరి శ్వాస వరకూ
1880 అఫ్గన్‌తో యుద్ధం ముగిసాక… సతీసమేతంగా కల్నల్ మార్టిన్‌ కొండ మీద ఉన్న బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకున్నారు. శిథిలావస్థలో ఉన్న ఆలయానికి కొత్త శోభను తీసుకొచ్చారు. పదిహేనువేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఆ రోజు నుంచీ ఆ గుడి బాధ్యతలను మార్టిన్ దంపతులే చూసుకున్నారు. కాలం గడిచాక… తిరిగి ఇంగ్లడ్‌ వెళ్లిపోయారు. వారి స్వదేశానికి చేరాక కూడా, ఇంట్లో శివుడి విగ్రహాన్ని పెట్టుకుని చివరి శ్వాస వరకూ పూజిస్తూనే ఉన్నారు. మీకూ ఈ ఆలయాన్ని చూడాలనిపిస్తే… బైద్యనాథ్ మహాదేవుడిని దర్శించుకోవాలనిపిస్తే…

మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని అగర్ మాల్వాకు చేరుకోండి. భారతదేశంలో బ్రిటిష్ వారు కట్టించిన మొదటిదీ… చివరదీ… ఒకేఒక్కటీ అయిన హిందూ అలయం ఇదే.