Sunday, April 5, 2020

పంచభూతాల పరోపకారం

పంచభూతాల పరోపకారం

నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేవి పంచభూతాలు. ఇవి భూమండలాన్ని ఆవరించి ఉన్నాయి. ఇవి ఉన్నందువల్లనే మనిషి సుఖంగా జీవించగలుగుతున్నాడు. ఇంతటి మహోపకారం చేస్తున్న పంచభూతాలకు మనిషి కృతజ్ఞుడై ఉండాలి. పంచభూతాలకు హాని చేయకుండా ఉండాలి. వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తే భూమండలం స్వర్గధామం అవుతుంది. కలుషితం చేస్తే నరకంలా మారిపోతుంది.
పంచభూతాలకు మానవులపై అపార కారుణ్యం, దయ ఉన్నాయి. అందుకే మనిషి తమపట్ల అపచారం చేస్తున్నా, ఆకతాయితనంతో కీడు తలపెట్టినా పరమసహనంతో క్షమిస్తున్నాయి. మనిషి మంచిగా మారకపోతాడా, అతడిలో వివేచన కలగకపోతుందా అని ఎదురుచూస్తున్నాయి. మనిషిలో మార్పుకోసం నిరీక్షిస్తున్నాయి. మనిషి సన్మార్గంలో నడవాలని కోరుకుంటున్నాయి.

నేలకు వసుంధర అని పేరు. వసువులు అంటే సంపదలు. వాటిని ధరించి ఉండేది కనుక భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది. నేలకోసం మనిషి తపిస్తాడు. నేలను సొంతం చేసుకొని, పసిడి పంటలు పండించాలనుకొంటాడు. నేలను ఆక్రమించి, ఆకాశహర్మ్యాలను నిర్మించాలనుకొంటాడు. నేలను జయించి సామ్రాజ్యాలను స్థాపించాలనుకొంటాడు. ఎన్ని చేసినా నేలను గెలవడం కష్టం. ఎంత నేలను ఆక్రమించినా, చివరికి మరణం తరవాత తనవెంట భూమిని తీసుకొనిపోలేడు.

నీరు మనిషికి ప్రాణాధారం. నీరు లేకుండా మనిషి బతకలేడు. ప్రపంచంలో అధికభాగాన్ని నీరే ఆక్రమించినా, పానయోగ్యమైన నీరు పరిమితమే. నీటిని స్వచ్ఛంగా ఉంచుకొనకపోతే, భవిష్యత్తు అగమ్యగోచరమే. నీరు మనిషిని కాపాడుతుంది కనుక నీటిని మనిషి కాపాడుకోవాలి. నీటికి జీవనం అనే పేరూ ఉంది. ఇది దీనికి సార్థక నామధేయమే. జలంలోనుంచే బ్రహ్మాండసృష్టి జరిగింది. చివరికి జలంలోనే సమస్తం లయమైపోతుంది. నారాలు అంటే నీళ్లు. వాటికి మూలమైనవాడు కనుక విష్ణువుకు నారాయణుడని పేరు.

మనిషికి నేల, నీరు ఎంత అవసరమో నిప్పూ అంతే అవసరం. భూగోళానికి కావలసిన ఉష్ణం సూర్యుడి నుంచే వస్తుంది. నిప్పు మండాలన్నా సూర్యుడు ప్రకాశించవలసిందే. సూర్యుడు లేకుంటే భూమిపై నిప్పు పుట్టదు. అగ్నిపర్వతాల రూపంలో భూగర్భంలో, బడబాగ్ని రూపంలో సముద్రాల్లో, సూర్యుడు నక్షత్రాల రూపంలో అంతరిక్షంలో తేజస్సు (నిప్పు) మండుతూనే ఉంది. ఇది మానవుల మనుగడకు ఉపయోగపడుతోంది.

మనిషిని బతికించే మరోశక్తి గాలి. ప్రాణవాయువు రూపంలో శరీరంలో, ప్రచండవాయు రూపంలో ప్రపంచంలో గాలి పుష్కలంగా లభిస్తుంది. గాలి లేకుంటే శరీరంలో ప్రాణశక్తి నశిస్తుంది. జీవం నిర్జీవంగా మారుతుంది. గాలివల్లనే రుతుగతులు ఏర్పడి వానలు కురుస్తున్నాయి.పంటలు పండుతున్నాయి. విద్యుత్తు వంటి శక్తులు ఉత్పన్నమవుతున్నాయి. భూగోళం చుట్టూ గాలిపొర ఉన్నందువల్లనే భూమిపై ప్రాణుల ఉనికి క్షేమంగా ఉంది.

ఆకాశం సర్వవ్యాప్తి. ‘ఇందుగలదందు లేదను సందేహము వలదు’ అన్నట్లు ఆకాశం సర్వత్రా వ్యాపించి, జీవుల మనుగడకు అవకాశం ఇస్తోంది. ఆకాశం వల్లనే మనిషి శబ్దాలను వినగలుగుతున్నాడు. నక్షత్రాలు, గ్రహాలు, పాలపుంతలు అనంతాకాశంలో స్వేచ్ఛగా తిరుగుతూ అబ్బురపరుస్తున్నాయి. సూర్యోదయ, సూర్యాస్తమయాలు, చంద్రోదయ, చంద్రాస్తమయాలు, వర్షించే మేఘాలు, రాలిపడే ఉల్కలు... అన్నీ ఆకాశం ఉన్న కారణంగానే సంభవిస్తున్నాయి.
పంచభూతాలు చరాచరాలకు ఎంతో ఉపకరిస్తున్నాయి. వాటికి ఏ స్వార్థమూ లేదు. అన్నీ ఉచితంగా ప్రసాదిస్తున్న పంచభూతాలను మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. వాటి నైసర్గిక స్థితిని, స్వచ్ఛతను తన చేష్టలతో కలుషితం చేస్తున్నాడు. తన శ్రేయస్సును సైతం కాలరాస్తున్నాడు. ఇది మనిషికి ఏమాత్రం వాంఛనీయం కాదు.

అరుణాచల శివాయ గురవేనమః

పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు, మరి పూజలు ఎందుకు?

పుట్టినప్పుడే భగవంతుడు తలరాతని రాసేస్తాడు, మరి పూజలు ఎందుకు?



మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు
 కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి ? అని కొంతమందికి అనుమానం వస్తుంది . 

అయితే బ్రహ్మ నుదుటిని రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాసాడంట . 

"నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను,
మీరు మీ ఉపాసనలతోటి ,మీ అర్చనలతోటి మార్చుకోగలరు" అని రాసారంట . అర్చనలు, ఉపాసనలు ,కర్మఖాండ ద్వారా మీ విధిని మీ చేతుల్లో పెడతున్నాను అని తెలిపారు . 

ఉదాహరణకి ఒక వ్యక్తికి బ్రహ్మ 100 ఏళ్ళు ఆయువు రాస్తే, ఆ వ్యక్తి చేసే పాపాలను బట్టి ఆవ్యక్తి ఆయువు తగ్గుతుంది . 

ఈ తగ్గిన ఆయువుని తిరిగి పూర్చుకునే శక్తి కూడా మనకి కర్మఖాండ ద్వారా చేసుకోమని బ్రహ్మ చెప్పాడు . 
పురాణాలు శ్రద్దగా వింటే ఒక్కొక్క అక్షరం మన పాపాలను తొలగిస్తుంది .

పూర్వం విభుముఖుడు అనే రాజు ఉండేవాడు,
ఇతనికి 50వ ఏట మరణ గండం ఉంది . ఆ మరణ గండాన్ని ఎవ్వరు తప్పించలేరని రాసాడు బ్రహ్మ . 

అతని అదృష్టం బాగుండి ,ఒక గురువుని ఆశ్రయించి, గురువు చెప్పినట్టు అర్చన, మృత్యుంజయ జపం చేసి చావవలసినవాడు బ్రతికాడు . 

జాతకం రాసిన జ్యోతిష్యులు ఆశ్చర్యపోయి , జాతక రీత్యా వీడు చచ్చిపోవాలండి, కాని బ్రతికాడని అనుకుంటే… 
అప్పుడు వశిష్ట మహర్షి ఇలా అన్నాడు…

 ఇతనికి జాతక రీత్యా చావు ఉన్నప్పటికి , గురువుగారి ద్వారా మృత్యుంజయ మంత్రాన్ని ఉపాసనగా పొంది , జపం చేసి దాని ఫలితం వలన మృత్యుగండం నుంచి బయట పడ్డాడని చెప్పాడు . 

కాబట్టి బ్రహ్మ రాసిన రాత ,బ్రహ్మ మార్చడు గాని, మనం ఇలా పురాణాలను శ్రద్దగా వినడం, మంత్రాలను చదవడం, ప్రదక్షణలు చేయడం వలన చాలా వరకు బ్రహ్మరాతలో మార్పు కలుగుతుంది .

ఆపద వచ్చినప్పుడు ఏడుస్తూ కూర్చోకుండా భగవంతుని   పాదాలను  స్మరించాలి . 

128 ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు, ద్రౌపతిని జుట్టుపట్టి ,దుశ్యాసునితో ఈడ్పించడం వలన చేసిన పాపానికి 60 వ ఏట చనిపోయాడు . కాబట్టి ఆయువు ఉన్నప్పటికీ, బ్రహ్మ రాసినప్పటికీ  చేసిన పాపానికి నశించాడు . 

అదే పుణ్యం వలన రాత మార్చుకుని సుఖంగా బ్రతికినవాళ్ళు ఉన్నారు . 

అందుకని ఏ కష్టం వచ్చిన బ్రహ్మ నాకు ఇలా రాసాడు అని కృంగిపోకుండా… ఆ రాతను మార్చుకోవడానికి పూజలు, దానాలు, ధర్మాలు, పేదలకు ,సాటివానికి సహాయం చెయ్యండి .
భగవంతుణ్ణి శరణు వేడండి . 

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

దీపం ఎందుకు వెలిగించాలి?

దీపం ఎందుకు వెలిగించాలి?

హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు . అంతేకాక,శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము.

ఈ దీపం ఎందుకు వెలిగించాలి? కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.

మనము జరిపించు కార్యములు సభలూ పూజలూ మొదలగు అన్నియూ విద్యుద్దీప కాంతులలో చేయుచున్నప్పుడు మరల మరో దీపం వెలిగించుట ఎందుకను సందేహము రావలెను గదా!. సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు మన వాసనలకు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్నప్పుడు అందులోని నూనె/నెయ్యి క్రమీణా తరిగిపోయి కొంతసేపు తరువాత
హరించుకు పోవును. అటులనే మన లోని రాగ ద్వేషాలుకూడా హరించునని చెప్పుటయే దీని భావము. నూనె/నేతి దీపం వెలుగునప్పుడు ఆ జ్వాల ఊర్ద్వముఖముగా ఉందును గదా! అటులనే మన జ్ఞానసంపద కూడా పైపైకి పెరగవలెనను సంకేతము కూడా ఇచ్చుచున్నది.

ఒక చిన్న దీపము మరికొన్ని వందల దిపములను వెలిగించగలదు. అటులనే మన జ్ఞానదీపము కూడా మరికొంత మందిని జ్ఞాన వంతులను చేయునని భావము. ఒక దీపము తో ఎన్ని దీపములు వెలిగించినను ఆ దీపము తరిగిపోదు అటులనే ఎంతమందిని విజ్ఞాన వంతులను చేసిననూ మన మేధా శక్తి తరిగిపోదు. మరియు అది మరింత ప్రజ్వరిల్లి నలు దిశలందు వెలుగులు నింపును.

మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావలెనను ఆదర్శమును అందరికీ తెలియజేయుటయే ఈ దీపారాధన ప్రాముఖ్యము భావము.దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం
ఓం శ్రీ పరమాత్మనే నమః
ॐ దీపం జ్యోతిః పరబ్రహ్మం,దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం,సంధ్యా దీపం నమోస్తుతే
ॐ దీపపు జ్యోతి పరబ్రహ్మ స్వరూపం,దీపం అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుంది,దీపారాధాన అన్నిటిని సాధించిపెడుతుంది.అందుకని నేను సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని పై శ్లోకం అర్ధం.

ॐ ఒక్కో దీపానికి ఒక్కక్క ప్రత్యేకత ఉంటుంది.ఆవునేతితో వెలిగించిన దీపాపు కాంతి రోజు కనీసం 1 గంట సమయమైనా చిన్నవయసు నుండి చూడగలిగినట్లైతే దీర్ఘకాలంలో గ్లూకోమా రాదు(కంటికి సంబంధించిన వ్యాధి.షుగరు వ్యాధిగ్రస్తులకు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ.దీనివల్ల పూర్తిగా కంటి చూపు కోల్పోవచ్చు.దక్షిణ భారత దేశం,ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో షుగరు వ్యాధిగ్రస్తులు చాలా ఎక్కువ).

ॐ నువ్వుల నూనె దీపపు కాంతి కిరణాలు రోజు కనీసం 1 గంట పాటు కళ్ళ మీద పడితే కంట్లో శుక్లాలు(cataract) రావు.ఆవునేయి,నువ్వులనూనెతో వెలిగించిన దీపపు కిరణాలు కళ్ళ దృష్టి(eye sight)ని మెరుగుపరుస్తాయి.
ॐ అందువల్ల మనం చేసే ప్రతి శుభకార్యంలో దీపం తప్పక ఉంటుంది.మనం పూజ సమయంలో దీపం వెలిగించడం చేత ఈ కిరణాలు మన కంటిలోనికి ప్రవేశించి,మనకు మేలు చేస్తాయి.శ్లోకంలో "సర్వ తమోపహం" అంటే అన్ని విధములైన చీకట్లను తొలగిస్తుందని.ఇక్కడ కూడా చూపూ కోల్పోవడం వల్ల జీవితంలో ఏర్పడే అంధకారాన్ని తొలగిస్తొంది దీపం.

ॐ ఒక గది మధ్యలో ఆవునేతి దీపం వెలిగించి,హృద్రోగులు(heart patients),రక్తపోటు(B.P)తో బాధపడేవారు,ఎక్కువగా ఒత్తిడి(stress)కి లొనయ్యేవారు రోజు 1 గంట సమయం కనుక ఆ దగ్గర కూర్చుని చూస్తే కొద్దిరోజులలోనే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని,రక్తపోటు(B.P) అదుపులో ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది.
ॐ మనం చదువుకున్నాం,కాంతి(light)కి విద్యుత్-అయస్కాంత స్పెక్ట్రం(electro-magnetic spectrum) ఉంటుందని,ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత(temperature) ఆ ప్రాంతంలో ఉన్న కాంతికిరణాల రంగు(color of light rays) మీద ఆధారపడి ఉంటుందని,ఒక్కక్క రంగు కిరణానికి ఒక్కక్క ఫ్రీక్వేన్సి(frequency) ఉంటుందని.అలాగే మనం వెలిగించే దీపపు కాంతికి ఉన్న విద్యుత్-అయస్కాంత శక్తి(electro-magnetic force) ఆ ప్రాంతంలో ఉన్న ఉష్ణోగ్రత మీద,వాతావరణం మీద తన ప్రభావాన్ని చూపించి ఆ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని మారుస్తుంది.గాలిలో మార్పులు తీసువచ్చి,దాని ద్వారా మన శరీరంలోనికి ప్రవేశించి,నాడులను శుభ్రపరచి,వాటి ద్వారా రక్తంలోకి ప్రవేశించి దానికున్న దోషాలను తీసివేస్తుంది.ఇది చాలా సూక్ష్మంగా జరిగే ప్రక్రియ(process).

ॐ ఆవునేతి దీపపు కాంతికి,నువ్వుల నూనె దీపపు కాంతికి,మిగితా దీపాల కాంతికి కూడా చాలా సూక్ష్మమైన తేడా ఉంటుంది.అందువల్ల ఒక్కో దీపం ఒక్కొక్క విధమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది.

ॐ కార్తీక దీపాలను చూసిన చెట్లు,జంతువులు,కీటకాలకు కూడా పునర్జన్మ ఉండదంటే ఇక వెలిగించిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది కదా.అందుకని దీపాలను వెలిగించండి.వెలిగించే అవకాశం లేనప్పుడు కనీసం గాలికి కొండెక్కిన/శాంతించిన దీపాలను తిరిగి వెలిగించండి.కుదిరితే కొంచెం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వెలుగుతున్న దీపపు ప్రమిదలలో పోయండి.

మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది.

మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరం ల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టు కున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలి పోతున్నారు.
చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు

5 - 6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతొ 2 -3 నెలలకు పెరిగే విధంగా తయారు చేసే అగ్రికల్చర్ సైంటిస్ట్స్ లది తప్పు. దాని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలది తప్పు. ఈ వంగడల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప, రోగాలను తట్టు కునే ఇమ్మ్యూనిటి రాదు.
Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs .100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేసే కంపెనీ లది తప్పు.
స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్థములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్, బెల్లం లను వాడడం ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరిస్తుంది.
తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు. కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ imblance జరిగి ఇమ్మ్యూనిటి హరించుకు పోతోంది. టీ, కాఫీ లను పండించే కంపెనీలు , వాటిని ప్రమోట్ చేసే sportsmen , సెలెబ్రేటిస్ కూడా దీనికి బాధ్యులే.
వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు రోజుకు రెండు మూడు సార్లు తింటున్నారు. మాంసం తింటే శక్తి, కాలరీస్ వస్తాయి తప్ప వున్న ఇమ్మ్యూనిటి పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్. బీపీ, షుగర్ పెంచుతుంది. ఆరు నెలల్లో పెరగవలసిన కోళ్లను 40 రోజుల్లో పెంచుతున్నారు. Anti Biotics ఇచ్చి పెంచిన కోళ్లు పెట్టె గుడ్లు తింటే ఏమైనా ఇమ్మ్యూనిటి వస్తుందా?
సముద్రపు ఉప్పు కాక iodised ఉప్పు అని విషాన్ని అమ్మే కంపెనీ లు కూడా ఇమ్మ్యూనిటి దెబ్బ తినడానికి బాధ్యులు. ఈ ఉప్పు తిని మన శరీరం హూనం అయ్యి నిర్జీవం అవుతోంది.
మైదా, నూడుల్స్ , పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటి పోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.
సంకరాలు అయిపోయిన స్వీట్ కార్న్, హైబ్రిడ్ కార్న్ , సొయా బీన్ తింటే ఇమ్మ్యూనిటి పోతుంది.
ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న రైతులదీ తప్పు. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు. దీన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ , గవర్నమెంట్ లది తప్పు.
పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి కాయలను పీకి కెమికల్స్ తో మాగిన్స్తున్న బిజినెస్ మాన్ లది తప్పు.
పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.
తియ్యగా వుండే చాకొలేట్, Biscuts , Cakes అయితే శరీరాన్ని కుంగదీస్తున్నాయి. వైరస్ లకు ఆహరం గా ఉంటున్నాయి.
పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియా లను శరీరం నుండి తరిమేస్తుంది. ఇప్పుడు అందరు పెరుగును ఫ్రిడ్జ్ లలో పెడుతున్నారు. 15 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే లాక్టో బాసిల్లస్ చని పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లలో పెట్టి తినే పెరుగు , మజ్జిగ వేస్ట్.

పై విషయాలు అన్ని మరచి తప్పు చేయడం వాళ్ళ 10 - 20 సంవత్సరం ల నుండి మనిషి ఇమ్మ్యూనిటి (రోగ నిరోధక శక్తి ) తగ్గి పోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి మాస్కు లు , చేతులకు santitizers , సబ్బులు వాడే దుస్థితికి వచ్చాడు. వైరస్ లకు గడ గడ లాడు తున్నాడు. సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన దుస్తిలో వున్నాడు. ఇప్పటికి అయినా మారక పొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది. లేకపోతె డబ్బాలలో కూర్చొని తనను వైరస్ ల నుండి కాపాడు కోవాలి.
మానవ జాతి వెంటనే చేయవలసిన పనులు.

సైంటిస్ట్ లను కొత్త వంగడాలను తయారు చేయకుండా నీరోదించాలి. లేక పొతే వాళ్ళ promotions కోసం ఎదో చేసాం అనిపించు కోవడం కోసం మానవ జాతి ని నిర్వీర్యం చేస్తారు.
గ్లూకోస్ ఎక్కువ గా వుండే రైస్, గోధుమ లను మానేసి ఫైబర్ ఎక్కువ గా వుండే సిరి ధాన్యాలు తినాలి. వాటిని కూడా వంగడం పేరుతొ సంకరం చేస్తున్న సైంటిస్ట్స్ లను ఆపాలి.
ఇవీ కూడా వంగడం చేస్తే అవి తినడం కూడా వేస్ట్.
కెమికల్ లేని పండ్లు , కాయ గూరలు తినండి. Chemicals వి తినడం వల్లే ఇమ్మ్యూనిటి పోతోంది. వీలు అయితే ఇంట్లోనే కొన్ని కాయగూరలు పెంచు కొండి.
ఎక్కువగా కెమికల్స్ వాడే ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ మానివేయండి.
చెక్కర , బెల్లం, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్ మాని వేయండి. రిఫైన్డ్డ్ ఆయిల్ స్టాప్ చేసి, గానుగ నూనెలు వాడండి.
వారం లో ఒక రోజు , లేక పొతే నెలల్లో ఒకసారి అయినా ఉపవాసం ఉండండి. ఇది ఇమ్మ్యూనిటి ని చాలాపెంచుతుంది. ఉపవాసం చేసేటప్పుడు నిమ్మకాయ, తేనే ల రసాన్ని గంటకు ఒకసారి చొప్పున 7 , 8 సార్లు తీసుకోవాలి.
టీ, కాఫీ లు మానివేసి ఇమ్మ్యూనిటి ని పెంచే natural బూస్టర్స్ అయిన కషాయములు తాగాలి.
రోజంతా 4 5 సార్లు తినడం మాని వేయడం వల్ల లోపల జీర్ణ వ్యవస్తత కు ఇమ్మ్యూనిటి పెంచే శక్తి వస్తుంది.
ఒక పూట తింటే యోగి
రెండు పూట్ల తింటే బోగీ
మూడు పోట్ల తింటే రోగి
నాలుగు పూట్ల తింటే కరోనా బాధి.

ఇట్లు
*
ఆరోగ్య అభిలాషి

శ్రీకృష్ణ రహస్యం

🙏 శ్రీకృష్ణ రహస్యం

మహాభారతంలో శ్రీకృష్ణుని మించిన ఆకర్షణీయమైన పాత్ర ఉండదు. మహాభారతం చదివినవారికి అలాంటి శ్రీకృష్ణుడి పాత్రపై కూడా ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి. కృష్ణుడు అండగా ఉన్నా కూడా పాండవులు ఎందుకు అన్ని కష్టాలు పడ్డారు ? ద్రౌపది పిలిస్తే కాని కృష్ణుడు రాకూడదా ? ధర్మరాజుని జూదానికి వెళ్ళకుండా కృష్ణుడు ఆపి ఉండొచ్చు కదా ? సుయోధనుడు శకునితో ఆడించినట్టు, ధర్మరాజు కృష్ణుడితో ఆడించి ఉండొచ్చు కదా ? ఇవన్నీ ఎందుకు జరగలేదు ? ఆపదల్లో కూరుకుపోయినప్పుడు తప్ప ఆపద రాకుండా ఆపలేడా ? ఇలాంటి ప్రలెన్నో సహజంగానే వస్తాయి.

వీటికి సమాధానం కూడా శ్రీకృష్ణుడే చెప్పాడు. మనకు కాదండోయ్.. శ్రీకృష్ణుడి బాల్య స్నేహితుడైన ఉద్దవుడు.. మహాభారతం చివర్లో శ్రీకృష్ణుడిని ఉద్ధవుడు పై ప్రశ్నలే అడిగాడు.. శ్రీకృష్ణుడు ఏం అడిగాడు.. ఉద్దవుడు ఏం చెప్పాడో.. చూద్దాం..

ఉద్ధవుడు : మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా.., ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు లేదా ధర్మరాజు తరుపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా ?

కృష్ణుడు : ఉద్దవా ! గుర్తుపెట్టుకో, ఎప్పుడూ వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటె వేరేలా ఉండేది, కాని అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తున్నాను. అతను పిలవలేదు సరి కదా, నేను అటువైపు రాకూడదని ప్రార్ధించాడు. అతని ప్రార్ధన మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులు అందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కాని నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలిగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా.

ఉద్ధవుడు : అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కాని రావా ?

కృష్ణుడు : జీవితంలో జరిగే ప్రతీది కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మని మార్చలేను, కాని మీ పక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను.

ఉద్ధవుడు : అంటే మా పక్కనే ఉండి, మేము కష్టాలలో, ఆపదల్లో , చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమి చేయవా ?

కృష్ణుడు : ఉద్దవా ! ఇక్కడే నువ్వు ఓ విషయం గమనించడం లేదు. నేను పక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పు ఎలా చేయగలవ్. కానీ మీరు నేను ఉన్నాను అనే విషయం మర్చిపోయి.. నాకు తెలీదు అనుకోని, ప్రతీది చేస్తుంటారు అందుకే ఇబ్బందుల్లో పడతారు.

అదీ కృష్ణుడు చెప్పిన రహస్యం. కృష్ణుడు నిత్యం మన పక్కనే ఉంటాడు. పూజలు గట్రా ఏమీ అవసరం లేదు. ఆయన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు.. మన జీవితం సాఫీగా సాగిపోతుంది. ఇదే ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు చెప్పిన కీలకమైన రహస్యం.🙏

తిలక ధారణలోని పరమార్థం

శ్రీనివాససిద్ధాంతి9494550355


తిలక ధారణలోని పరమార్థం.....

తిలక శబ్దం శ్రేష్ఠతా వాచకం. ఒక వ్యక్తి ధరించే వాటిలో శ్రేష్ఠమైనది అనే అర్థంలో నుదుట ధరించే బొట్టుని తిలకమని అంటారు. ఇది సర్వాంగాల్లో శ్రేష్ఠమైన శిరస్సున ధరించేది. శ్రేష్ఠతను ఆపాదించేది. హిందువులందరు తప్పనిసరిగా నుదుట తిలకాన్ని ధరించేవారు . ఒకవ్యక్తి సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నాడనటానికి గుర్తు బొట్టు పెట్టుకోవటం. భగవంతుణ్ణి నమ్ముతున్నాడనటానికి కూడా బొట్టే నిదర్శనం.

బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. కానీ అదే దాని పరమార్థం కాదు.అది అనునిత్యం జరిపే ఒక గొప్ప సంస్కారం. కనుబొమల మధ్య ప్రదేశంలో వెనుకగా ఆజ్ఞా చక్రం ఉంటుంది. ఆ ప్రదేశాన్ని మధ్య వేలితో సున్నితంగా స్పృశించి ఆజ్ఞాచక్రాన్ని ప్రచోదన చేయటం తిలక ధారణలోని పరమార్థం. శక్తి ప్రసరణ, వితరణ కేంద్రాలైన షట్చక్రాల పైన పెత్తనం చేస్తూ వాటిని తన అదుపులో ఉంచుకునేది, వాటిని ఆజ్ఞాపించి పని చేయించ గలిగినది కనుక భ్రూమధ్యంలో ఉండే ఈ చక్రానికి ఆజ్ఞా చక్రం అనే పేరు సార్థకం. ఇది సరిగ్గా ఉంటే మిగిలిన చక్రాలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఆజ్ఞా చక్రం ప్రచోదనమైతే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుంది. అందుకే గురువు శిష్యునికి ఉపదేశం చేసే సమయంలో బొట్టు పెట్టే నెపంతో భ్రూ మధ్య ప్రదేశాన్ని స్పృశించి ఆజ్ఞా చక్రాన్ని ప్రచోదన చేస్తాడు.

ఈ విధంగా ప్రచోదన చేసినదానికి సంకేతంగా ఏదో ఒక గుర్తుని ఉంచటం ఆచారంగా వచ్చింది. దీని కోసం భారతీయులు ఉపయోగించిన సామాగ్రి వారి భావ విస్తృతిని తెలియజేస్తుంది. తరచుగా వాడేది కుంకుమ . అది పసుపులో కుంకుమ రాళ్ళు వేసి చేసినది కావచ్చు, నిమ్మరసంలో పసుపు కొమ్ములను నానవేసి చేసినది కావచ్చు, ఇంకా సిందూరం, తిరుచూర్ణం , గంధం, అక్షతలు,విభూతి, చాదు [దీన్ని ఎన్నోరకాలుగా తయారు చేస్తారు]. ఇంకా శక్తి ఉంటే కస్తూరి, పునుగు,జవ్వాది, పచ్చ కర్పూరం, నవ రత్నాలు. ఎవరి శక్తి ననుసరించి వారి వైభోగం.

ధరించిన తిలకాన్ని బట్టి ఏ సంప్రదాయానికి చెందిన వారో సులభంగా గుర్తించవచ్చు. ముఖాన బొట్టు ఉండటం మరెన్నో అంశాలని సూచిస్తుంది. బొట్టు లేకపోతే అది పాచి మొహం. ఇంకా స్నానం కాలేదని సామాన్యార్థం. శుభ కార్యాలు చేయటానికి అర్హత లేని సూతక సమయం కూడా కావచ్చు. అంటే, నుదుటనున్న తిలకం శుభ కార్యాలు చేయటానికి, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు నిర్వర్తించటానికి అర్హత ఉన్నదని సూచిస్తుంది. అందుకే స్నానం చేయగానే ముందుగా తమ తమ సంప్రదాయాల కనుగుణంగా తిలక ధారణ చేసి మరీ పూజాదికాలు నిర్వర్తిస్తారు. ముత్తైదువలైన స్త్రీలు ముఖాన బొట్టు లేకుండా ఒక్క క్షణమైనా ఉండరు. అది అయిదోతనానికి చిహ్నం కదా! వివాహ సమయంలో వరుడు తన పంచ ప్రాణాలను వధువు శరీరంలో నిక్షేపం చేసే స్థానాల్లో బొట్టుపెట్టుకునే చోటు కూడా ఒకటి.

బొట్టు పెట్టుకోవటమే కాదు పెట్టటం కూడా మన సంప్రదాయంలో భాగం. బొట్టు పెట్టటం మర్యాదకి చిహ్నం. ఆహ్వానించటానికి బొట్టు పెట్టి మరీ పిలవటం ఆచారమై పోయింది. ఎవరికైనా పని అప్పచెప్పేటప్పుడు చందన మలది కుంకుమ పెడతారు. పిల్లలకి బొట్టు పెడితే దిష్టి తగలదని నమ్మకం. ఒకప్పుడు మంచి రంగు పరిమళం ఉన్న కుంకుమ తయారు చేయటం ఒక కళగా భావించేవారు. తరువాత ద్రవ రూపంలోను , ఆపై పేస్టు రూపంలోను, తిలకాలు వచ్చాయి. ఇప్పుడు బొట్టు బిళ్ళలు రకరకాల రంగులు, ఆకృతులలో వస్తున్నాయి. ఇవి స్త్రీలకే పరిమితం. కాని, తిలక ధారణ మాత్రం స్త్రీ పురుష భేదం లేక అందరు పాటించ వలసినది.

లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
9494550355

మనో ధైర్యాన్ని మించిన మందు మరొకటి లేదు

ఒక అడవి లో ఒక లేడి భారంగా అడుగులు వేస్తూ వెడుతోంది. అది నిండు గర్భిణి.దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి.

అది అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతోంది. ఒక దట్టమైన గడ్డి భూమి కనబడింది. దానికి అటుపక్క నది ప్రవహిస్తోంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు మొదలయ్యాయి.

నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది.. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మాయి. ఉరుములు, పిడుగులు.. పిడుగు పడి కొద్ది దూరం లోనే గడ్డి అంటుకుంది. దూరంగా తన ఉనికిని గమనించి కుడి వైపు నుండి ఒక సింహం వస్తోంది. ఎడమవైపు నుండి ఒక వేటగాడు బాణం సరి చూసుకుంటున్నాడు. ఇంకో వైపు నది వెళ్ళనివ్వదు...!

భగవాన్..!! ఆ లేడి ఇప్పుడు ఏమి చెయ్యాలి..??

ఏమి జరగబోతోంది..?

లేడి బిడ్డకు జన్మ ఇస్తుందా..? బిడ్డ బతుకుతుందా..? సింహం లేడిని తినేస్తుందా..?

వేటగాడు లేడిని చంపెస్తాడా..? నిప్పు లేడి వరకూ వచ్చి లేడి కూనను చంపేస్తుందా..?

ఒకవైపు నిప్పు.. రెండో వైపు నది.. మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపం లో వేటగాడు, సింహం..

కానీ లేడి మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. అది తన బిడ్డను కనడం మీదే దృష్టి పెట్టింది..

అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి..

పిడుగు కాంతికి వేటగాడి కళ్ళు చెదిరాయి.. గురి తప్పి బాణం సింహానికి తగిలింది..

వర్షం పడి సమీపిస్తున్న మంటలు ఆరిపోయాయి..

లేడి పిల్ల తల్లి గర్భం లో నుండిబయటకు వచ్చింది. అది ఆరోగ్యాంగా వుంది. ఏదైతే జరగనీ, నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని.. లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి తప్పటడుగు వేసి వుండి వుంటే ఏమి జరిగేది..??

మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టూ ముడుతూనే వుంటాయి. నెగటివ్ ఆలోచనలతో సతమవుతూనే ఉంటాము.. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. భగవంతుడిపై భారం వేసి మన పని మనం చెయ్యడమే మనం చెయ్యవలసినది. ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కొంత మంది సమస్యలను ఏదుర్కోనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఆత్మవిశ్వాసముతో, ధైర్యముతో, ధృఢనిశ్చయముతో, దేవునిపై విశ్వాసముతో చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యము..
కరోనా గుప్పెట్లో భూగోళం అని, కన్నీటి గాథలను ప్రపంచ వ్యాప్తంగా వింటున్నాం. కాబట్టి మనం కూడా మన రోగనిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేద్దాం ఎలాగో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంటికే పరిమితం అవుతున్నాం. మన ఇంట్లో ఉన్న మన మత గ్రంథాలు అయినా భారతం, భాగవతం, రామాయణం,
శివపురాణం, దేవిభాగవతం లాంటి మంచి ఆధ్యాత్మికమైన పుస్తకాలు పురాణ ఇతిహాసాలు, ఖురాన్ మరియు బైబిల్ వంటివాటిని చదువుతూ భగవన్నామ స్మరణ చేస్తూ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు, మన తర్వాత తరమైన మన పిల్లలకు మంచి నీతి బోద చేస్తూ ప్రశాంతంగా కాలం గడుపుదాం, ప్రశాంతమైన మనస్సు రోగనిరోధక శక్తిని పెంచడంలో మరింత తోడ్పాటు నిస్తుంది వీలైనంత ఎక్కువగా ఈ యోగా, ధ్యానం వంటి వాటిని చేద్దాం మనల్ని మనం రక్షించుకుందాం.
చెట్టుకు నీరు పోసినా దేవుడికి పూజ చేసిన వృధాగా పోదు అంటారు పెద్దలు ప్రయత్నం మన వంతు ఫలితం ఇవ్వడం భగవంతుడు వంతు.
మనో ధైర్యాన్ని మించిన మందు మరొకటి లేదు

సర్వేజనా సుఖినోభవంతు*

దీపం పాపాన్ని హరిస్తుందంటా దీపం వెలిగిద్దాం కరోనా పాపాన్ని తరిమేద్దాం.

బంగారం ... ఒక ఉపాధ్యాయునికి విధ్యార్థినికి మధ్యగల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించిన కథ.

బంగారం ... ఒక ఉపాధ్యాయునికి విధ్యార్థినికి మధ్యగల అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించిన కథ.
డా.ఎం.హరికిషన్ - కర్నూలు - 9441032212

నా మనసంతా జ్యోతి చుట్టే తిరుగుతా వుంది. ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది దాన్ని చూసి. నిన్న రాత్రి ఫోన్‌ చేసి ''సార్‌... రేపే నా ప్రసవం. ఆదోని గోసాసుపత్రికి వెళ్తున్నా. నువ్వు తప్పకుండా రావాల. నిన్ను సూడక ఎన్ని రోజులైందో తెలుసా... నా బిడ్డని సూడ్డానికొచ్చినట్లుగా వచ్చి నన్ను గూడా సూసిపో... మర్సిపోమాకు.. యెదురు సూస్తుంటా. రాలేదనుకో మళ్ళా సచ్చినా మాట్లాడను. ఎప్పటికీ. నీ మీదొట్టు'' అంది. దాంతో పొద్దున్నే బడికి ఒక గంట ఆలస్యంగా వస్తానని చెప్పి ఆసుపత్రికి బైలుదేరా.

జ్యోతి వొట్టి మాటలపుట్ట. నోరు తెరిస్తే చాలు తుంగభద్రా ప్రవాహంలా పదాలు పరవళ్ళు తొక్కుతాయి. ఒకటే సందడి. జాతరలా వుంటాది. నల్లగా వున్నా చూడముచ్చటైన రూపం. నేను కనబడితే చాలు దాని చక్రాళ్ళాంటి కళ్ళలో ఇంద్రధనుస్సులు ప్రత్యక్షమవుతాయి. మొగమంతా అప్పుడే విచ్చిన ముద్దబంతిలా వెలిగిపోతాది. చెంగుచెంగున ఉడుతపిల్లలా గంతులేస్తూ వురుక్కుంటూ వచ్చి ''శుభోదయం సా'' అంటాది. ఆ మాట వినబడని రోజు నా కళ్ళు బడంతా జల్లెడ పట్టేస్తాయి. ఏదో దిగులు. ఏమైందో దానికని. ఏ పిల్లనైనా అడుగుదామా అంటే ''ఎప్పుడూ ఎందుకు దాని గురించే అడుగుతావు. మేం కనబడమా'' అంటారు మూతి మూడు వంకర్లు తిప్పుతా.

కొన్నిసార్లు సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ''సా... రేపు పొద్దున ఏమీ తినకుండారా.. ఉగ్గానీబజ్జీ సేసుకోనొస్తా. ఉడుకుడుకుగా తింటే భలే కమ్మగా వుంటాది'' అంటుంది. పొరపాటున ఏదో ఆలోచనల్లో మర్చిపోయి తినేసొస్తే... మొగమంతా గంటు పెట్టుకొని, గులాబీమొగ్గలా పెదాలు ముడిచి ''ఏం సెయ్యాల దీన్ని. తీస్కపోయి దిబ్బలో పాడేస్తాలే'' అంటూ చెమ్మగిల్లిన కళ్ళతో కోపంగా విసవిసా పోతాది. రెండ్రోజులదాకా నవ్వినా నవ్వదు. పలకరించినా పలకదు. కొరకొరకొర చూస్తుంటాది. అందుకే తిన్నా తినలేదని అబద్ధం చెప్పేస్తా. అదిచ్చిన క్యారియరు తీసుకొని తిని బైటకు రాగానే వురుక్కుంటా వచ్చి ''ఎలా వుంది సా... నచ్చిందా'' అంటుంది ఆతృతగా కళ్ళెగరేస్తా. '' నీ చేత్తో ఏం చేసినా అమృతమే... నిన్ను కట్టుకునేటోడు గొప్ప అదృష్టవంతుడులే'' అంటే '' పోసా.... నువ్వు'' అంటూ సిగ్గుపడుతూ తుర్రున మాయమవుతుంది.

చాలాసార్లు ఆలోచిస్తాను. ఎట్లా ఏర్పడింది ఈపాపతో నాకింత అనుబంధం అని. ఐదోతరగతి ముగించుకొని, ఆరో తరగతికి హైస్కూల్లో చేరే పిల్లలు మొదట్లో తుమ్మెదల్లా స్వేచ్ఛగా, మహానంది కోనేట్లా స్వచ్ఛంగా వుంటారు. ఉపాధ్యాయుల చుట్టూ పిల్లిపిల్లల్లా రాసుకోని పూసుకోని తిరుగుతుంటారు.

ఒకసారి పిల్లలందర్నీ తీసుకొని కౌతాళం ఖాదరలింగస్వామి దర్గాకీ, అట్లే దగ్గర్లోనే వున్న ఉరుకుంద ఈరన్నస్వామి గుడికీ పోయినా. మధ్యాన్నం దాకా తిరిగీ తిరిగీ అలసిపోయి ఒక చెట్టు కిందికి చేరుకున్నాం. తెచ్చుకున్నేవి ఇప్పుకోని తిన్నాక ''సార్‌.. ఏదయినా ఒక మంచి కత చెప్పుసా'' అంటూ వెంటబన్నారు పిల్లలు. సరే అని ''కిర్రు... కిర్రు... లొడ్డప్పా'' అనే జానపద కథ చెప్పి '' మీకెవరికైనా వస్తాయా ఇట్లాంటి కథలు'' అనడిగా. అందరూ బెల్లం కొట్టిన రాళ్ళలెక్క గమ్మునుండిపోయారు. అప్పుడు వెనుక నుంచి ఒక పిల్ల ''సా... నాగ్గూడా ఒక కతొచ్చుసార్‌.. సెబ్దునా'' అంది సిగ్గుసిగ్గుగా లేచి నిలబడి. అదే ఆ పిల్లని మొదటిసారి సూటిగా, పరిశీలనగా చూడ్డం. ఆరో తరగతిలో కొత్తగా చేరింది. '' చెప్పు'' అన్నా. అప్పుడు చెప్పింది బుడంకాయంత బుడ్డోని కథ. ముద్దుముద్దుగా ముత్యాలు రాలినట్టుగా విన్నంత సేపూ నేనూ, పిల్లలూ ఒగటే నవ్వు. అంతా అయిపోయాక దాని చేయి పట్టుకుని దగ్గరకు తీసుకొని ''భలేగుంది కథ. ఇంకా ఇట్లాంటివి ఏమన్నా వస్తాయా'' అనడిగా. అప్పుడా పిల్ల '' మా జేజికి శానా కతలొస్తాయిసా... ఇనేటోళ్ళు కరువయిపోయినారు గానీ కూసుంటే గంటలు గంటలు సెబుతాది ముత్యాల్లాంటివి'' అంది. నేను ఎదురు చూసేది గూడా అట్లాంటి పచ్చని కతల చెట్టు కోసమే గదా. వెంటనే ''ఐతే... ఆ ముత్యాలన్నీ ఏరుకోనొచ్చి నా దోసిట్లో పోస్తావా'' అన్నా ఆశగా. '' నిజ్జంగా '' అంది కళ్ళు టపటపమని ఆర్పుతూ. '' ఆ... నిజ్జంగా ... నువ్వు కత చెబుతా వుంటే ఎంత కమ్మగా వుందో తెలుసా... వేడివేడి రొట్టె మీద వెన్నపూస, గోంగూర పప్పూ రాసుకోని తిన్నట్టు'' అన్నా.

అట్లా ఏర్పడింది అనుబంధం. వారానికో, పదిరోజులకో ఏదో ఒక కథ పట్టుకొచ్చేది. కొన్నిసార్లు నాకు తెలిసినవే అయినా అదంత కష్టపడి సంపాదించుకొచ్చింది గదాని వింటూ వుంటా. అట్లా ఆ పాప చాలా దగ్గరైపోయింది. ఎంత దగ్గరంటే దాన్ని చూడకుండా వుండలేనంత. ఇట్లాంటి కూతురుంటే ఎంత బాగుండేది గదా అనుకునేంత. దాన్ని ఎప్పుడూ ''బంగారూ'' అని ముద్దుగా పిలుచుకునేవాన్ని. తరగతి గదిలో పిల్లలు గూడా '' మీకు అందరికన్నా మీ బంగారమే ఎక్కువైంది. ఇంగ మాతో యెందుకు మాట్లాడ్డం. ఆ పిల్లనొక్కదాన్నే కూసోబెట్టుకోని పాటాలు సెప్పుకో... మేం బైటకు పోతాం'' అంటారు అల్లరిగా దాన్ని ఉడికిస్తూ. దానికి అది వాళ్ళని చూపుల్తోనే కాల్చేస్తూ ''ఆళ్ళకు కుళ్ళులే సార్‌ వూకే ఏదో వొగటి వాగుతుంటారు ఉత్త డబ్బాల్లెక్క. పట్టిచ్చుకోమాకు'' అంటూ వాళ్ళకెళ్ళి తిరిగి ''పోతే... పోండే... నాసారు... నాఇష్టం'' అనేది చేతిని లతలా గట్టిగా అల్లుకుపోయి... అచ్చం మా పాపగదా '' మానాన్న'' అన్నట్లుగా. అట్లా ఒక్కొక్క సంవత్సరమే గడుస్తా తొమ్మిదవ తరగతిలోకి అడుగు పెట్టింది. అప్పుడప్పుడే వసంతం ఆ పిల్లని ఆవహించడంతో దాని శరీరమంతా ఆ చిరువెలుగులు మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. వయసు పెరుగుతున్నా నా దగ్గర మాత్రం అట్లాగే పసిపిల్లలా వయ్యారాలు పోతూనే వుండింది.

ఒకసారి జ్యోతి వరుసగా రెండువారాలు బడికి రాలేదు. ఎదురుచూసి... ఎదురుచూసి... వుండబట్టలేక దాని స్నేహితురాలిని పిలిచి ''ఎందుకురా జ్యోతి రావడం లేదు'' అని ఆరా తీశా ఆరోగ్యమేమన్నా బాగాలేదేమోనని.

ఆ పాప రహస్యం చెబుతున్నట్లుగా దగ్గరకు వచ్చి ''నీకు తెలీదా సా... జ్యోతి వాళ్ళక్క లేచిపోయింది'' అంది గుసగుసగా.

'' ఎప్పుడు'' అన్నా కుతూహలాన్ని ఆపుకోలేక.

'' పదైదు రోజులైంది సా'' అంది.

'' ఎవరితో'' అన్నా వివరాల కోసం.

'' ఆదోని పిల్లోడంట. ఎవరికీ తెలీకుండా బట్టలు, నగలు సర్దుకోని కాలేజీకని పోయి అట్నించి అట్నే యెళ్ళిపోయింది. వూళ్ళో అందరూ ఆళ్ళ కోసమే బుడుకుతున్నారు. ఆళ్ళ నాన్నయితే అది నా కూతురే గాదు. దొరికితే దాన్ని సంపకుండా వదలను అంటూ సెగలు కక్కుతున్నాడు. కులమోళ్ళు గూడా మన కులంలో ఇంతవరకూ ఎవరూ ఇట్లా సేయలా. ఈ రోజు నీ కూతురు. రేపు నా కూతురు. ఇట్లాంటిది మళ్ళీ జరగకుండా వాన్ని ఏదో ఒకటి సేయాల అని ఒగటే ఎగదోస్తున్నారు. వూళ్ళో యెవరి నోట్లో సూసినా ఆళ్ళ గురించే. దాంతో తలెత్తుకోలేక ఆడోళ్ళెవరూ ఇంట్లో నుండి బైటకు రావడం లేదు'' అంది.

ఆ తరువాత జ్యోతి మరలా ఎప్పుడూ బడికి రాలేదు. కొంతమంది సార్లతో వెళ్ళి ఎంత నచ్చచెప్పినా వాళ్ళ నాన్న వినలేదు. ప్రతిరోజూ నా కళ్ళు ఆపాప కోసం ఆశగా వెదుకుతూనే వుండేవి. నల్లగా, పొడవాటి జడతో, గుండ్రని కళ్ళతో, కొశ్శని ముక్కుతో, నుదుటన ఎర్రని బొట్టు పెట్టి ఏ పిల్ల కనబన్నా జ్యోతే కళ్ళ ముందు మెదిలి మనసంతా బాధతో ఒక్కసారి మెలిబెట్టేది. బడిలో అంతకు ముందులా పిల్లల్తో చలాకీగా వుండలేకుంటున్నా. అలా ఎదురు చూస్తానే దిగులుదిగులుగా ఆరునెళ్ళు గడిచిపోయింది.

ఒక రోజు రాత్రి చదువుతున్న కథల పుస్తకం పక్కన పెట్టేసి పడుకోడానికి సిద్ధమయ్యాను. కన్నులు మూసుకు పోతున్నాయి. అంతలో సెల్‌ మోగింది. ఇంత రాత్రప్పుడు ఎవరబ్బా అని విసుగ్గా అందుకున్నాను. అవతల నుంచి కాసేపు నిశ్శబ్దం. 'ఎవరూ' అన్నా చిరాగ్గా మాటలేవీ లేవు. అంతలో ఫోన్‌ మూగవోయింది. బంగారం లాంటి నిద్ర చెడగొట్టినందుకు పీకలదాకా కోపం వచ్చింది. పడుకోబోయాను. అంతలో మరలా రింగయ్యింది. ఎవరైనా ఆట పట్టిస్తున్నారా అనుకుంటూ ఫోనెత్తాను.

''సా... బాగున్నావా'' అంటూ గుసగుసగా వినీ వినబడనట్లుగా ఒక పరిచితమైన కంఠం అలలు అలలుగా...

'' ఎవరూ... సరిగ్గా వినబడ్డం లేదు'' అన్నా నిటారుగా కూర్చుంటూ.

'' నేనేసా.. మీ బంగారాన్ని'' అంది.

ఒక్కసారిగా నిద్రమబ్బు ఎగిరిపోయింది. ఎన్నిరోజులైంది ఆ కమ్మని కంఠం విని. నరనరాల్లో ఏదో ఆనందం. ''ఏమైపోయావురా బంగారం... ఇన్ని రోజులు'' అన్నా ఆప్యాయంగా. అంతలో అవతలి నుంచి సన్నని ఏడుపు. ''ఈ బంగారం ఇంగ నీకు ఎప్పుడూ కనబడనంత దూరమైపోతాది సా'' అంది వెక్కిళ్ళు పెడుతూ. నాకర్థం కాలేదు. ''ఏయ్‌ ... ఏమైందిరా... ఎందుకలా మాట్లాడుతున్నావ్‌'' అన్నా అమ్మలా ఆప్యాయంగా. కాస్త కంగారుగా. కాసేపు నిశ్శబ్దం. ''సా... నా పెండ్లిసా... ఎల్లుండే... ఆలూరు సంబంధం. ఏం బాలేడు. శానా పెద్దోడు. నేనెంత మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. మా అక్క లేసిపోయింది గదా.. అందుకే నాకు ముందరగానే మూడుముళ్ళు వేయించేస్తున్నారు. నువ్వే ఆపాలి సా... సిన్నపిల్లలకు పెండ్లి సేయగూడదనీ, సేస్తున్నట్టు తెలిస్తే లోపలేస్తారనీ యెప్పుడు సెబ్తుంటివి గదా.. ఎట్లాగయినా ఆపుసా'' అంది. దాని గొంతు అంత విషాదంగా వినడం అదే మొదటిసారి. అంతలో ''సా.. ఇక వుంటసా... ఎవరైనా సూస్తారు. అందరూ పడుకున్నాక పైకొచ్చి సప్పుడు గాకుండా సేస్తున్నా. ఆపుతావు గదాసా... నిన్నే నమ్ముకున్నా'' అంది. ఆ గొంతులో ఏదో ఆశ నాపై. మునిగిపోతూ చివరి ప్రయత్నంగా ఎవరైనా అందుకుంటారేమోనని చేయి పైకి లేపినట్లుగా.

'' అలాగే బంగారం. జాగ్రత్త'' అంటూ ఫోన్‌ పెట్టేశాను.

మనసంతా అల్లకల్లోలంగా వుంది. నిద్ర ఎగిరిపోయింది. ఏవేవో ఆలోచనలు. చుట్టూ చీకటి. అనంతంగా... వెలుతురును కబళించి... చిదిమేసి... విజయానందం పొందుతూ...

ఆలోచనలతో అలసిన మనసు ఎప్పుడు నిద్రపోయిందో. ఉదయం రెప్పలు బలవంతంగా తెరిచాను. కళ్ళు ఎర్రగా మండుతున్నాయి. మనసంతా బంగారమే మెదులుతూ వుంది.

'' ఎలా ఆపాలి'' ఆలోచిస్తూ వున్నాను. పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేస్తే ఆగిపోతాది. కానీ వూరోళ్ళతో గొడవ. తరువాత చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తాది. బాలకార్మికులు, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, బసివినీ వ్యవస్థ ఎక్కువగా వున్న మండలాలు ఆదోని చుట్టూ అనేకం. తెలుగు, కన్నడ కలగలిసి ఏ అధికారులూ తొంగి చూడక, పెత్తందారుల పాలనలో, అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిన సరిహద్దు ప్రాంతం ఇది. అంతలో 'చేయూత' సంస్థ గుర్తుకొచ్చింది. ఆడపిల్లల అక్షరాస్యతపై పని చేస్తున్న సంస్థ. దాని అధ్యక్షుడు నా స్నేహితునికి మంచి స్నేహితుడు. వెంటనే నా స్నేహితునికి ఫోన్‌ చేసి నా పేరు బైటకు రాకుండా ఈ పెళ్ళి ఆపమని ప్రాధేయపడ్డాను.

వాడు కాసేపు ఆలోచించి ''ఏ కులం'' అన్నాడు.

'' ఎందుకురా '' అడిగాను.

'' పెద్దకులమోళ్ళయితే కష్టం. అదీగాక వాళ్ళ సంస్థ మీ వూళ్ళో గూడా పని చేస్తోంది. దాన్ని తవ్వుతే ఆపైన పీక్కోవడం కష్టం'' అన్నాడు.

'' బీసీల్లే'' అన్నా కులం పేరు చెబుతూ.

'' సరే... నేను మాట్లాడ్తాలే'' అంటూ ఫోన్‌ పెట్టేశాడు.

ఉదయం తొమ్మిదికంతా బండేసుకొని ఎప్పటిలాగే ఆదోని నుంచి బైలుదేరా. బడికి చేరాలంటే అరగంట పైన్నే పడుతుంది. దారంతా కూలీల ఆటోలు, వ్యాన్లు. దాన్ల నిండా బడిఈడు మొగ్గలే. ఎక్కువగా ఆడకూతుర్లే. కెనాల్‌ కింద వూర్లలో పత్తి, మిరప విరగబడి కాస్తాయి. కూళోళ్ళకు కొరత. దాంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కుప్పలు కుప్పలుగా వెళ్తూ వుంటారు. వాళ్ళనే చూస్తూ నిదానంగా బండి నడపసాగాను. మనసంతా ఆందోళనగా వుంది. ఏమి జరుగుతుందా అని. కాసేపటికి ఒక పోలీసు జీపు, దాని వెనుక చేయూత సభ్యులు, పత్రికా విలేఖరులున్న మరో జీపు నన్ను, ఆటోలను దాటుకుంటా సర్రున గ్రామం వైపు దూసుకుపోయాయి. వాటిని చూడగానే నా పెదాలపై చిరునవ్వు మెరిసింది.

బడికి పోయిన కాసేపటికి ఒక పాప వురుక్కుంటూ నా దగ్గరకు వచ్చి '' సా... జ్యోతి పెండ్లి ఆగిపోయింది సా'' అంది గసబెడతా.

'' ఏం జరిగింది. గొడవేమన్నా అయిందా'' అన్నా అమాయకంగా ఆరా తీస్తా.

ఆ పాప పోలీసులొచ్చిన విషయం చెబుతూ '' వాళ్ళమ్మా నాన్నా పోలీసుల కాళ్ళ మీద బడి... సుట్టాలంతా ఇంటికొచ్చి పందిరేసుకున్నాక ఇట్లా ఆపుసేయమంటే ఎట్లాసా.. పాపకు బంగారు సేపిచ్చినాం. ఇంటి నిండా సరుకులు తెచ్చేసినాం. ఇప్పటికే మొదటి పాపది అట్లయి తలెత్తుకోలేకుంటున్నాం. మళ్ళా ఇది ఇట్లయితే ఏ నుయ్యో గొయ్యో సూసుకోడం తప్ప దారి లేదు. ఈ ఒక్కతూరికి కండ్లు మూసుకోని పోండి'' అంటూ ఒగటే ఏడ్సినారు. కానీ పోలీసులు మాటినలేదు. జ్యోతికి పెండ్లి సేయమని' బడికి పంపిస్తామనీ రాపిచ్చుకోని, ఇంగోతూరి ఇట్లా సేస్తే అందరినీ లోపలేసి మూసేస్తామని భయపడిచ్చి పోయినారు'' అంది.

అయ్యో పాపమని రొంత జాలేసినా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. తరువాత రోజు అన్ని పత్రికల్లో ''చేయూత ఆధ్వర్యంలో ఆగిన బాల్యవివాహం'' అని ఫోటోలు వచ్చేశాయి.

జ్యోతి మొగం కనిపించకపోయినా ఊరు, తల్లిదండ్రుల వివరాలు అచ్చయ్యాయి అందరూ పోల్చుకునేలా.

అది జరిగిన తరువాత జ్యోతిని బడికి తిరిగి పంపిస్తారేమోనని ఎదురు చూశా. పదిరోజులు దాటినా రాలేదు. ఏమైందా అని కనుక్కుంటే రెండ్రోజుల కిందట బ్యాంగుళూరులో వుండే వాళ్ళ పెద్దనాయన ఊరికి వచ్చినాడంట. ఇంట్లో అందరూ దిగులుగా మొగాలు యేలాడదీసుకోని వుంటే '' ఎందుకురా ఏడుస్తారు. ఎన్ని సూళ్ళా ఇట్లాంటివి. చిన్న హోతూరులో మన బంధువున్నాడ్లే నడిపింటి ఎంకటసామని. ఆయన కూతుర్దిగూడా ఇట్లాగే ఆగిపోతే ఏమయింది. నెల తిరక్కుండానే సప్పుడు గాకుండా కాల్వబుగ్గకు తీస్కపోయి మూడుముళ్ళేయించి గమ్మున కాపురానికి అంపిచ్చినారు'' అన్నాడు.

'' కానీ.. పోలీసులు కేసు పెడితే'' అన్నాడు జ్యోతివాళ్ళ నాయన అనుమానంగా, భయంగా.

'' ఆళ్ళకింగేం పని లేదనుకుంటున్నావా... పట్టుకోవాలంటే రోజుకు లారీల్లెక్క దొరుకుతారు. అంతా వుత్తుత్తిదే. నీకంతగా భయమేస్తే వూళ్ళో పాపకు మొగం సెల్లడం లేదని సెప్పి నా యెంబడి బ్యాంగుళూరుకు అంపియ్యి. యేం జెయ్యాల్నో తర్వాత నే జెప్తా'' అంటూ జ్యోతిని తీసుకుపోయాడు.

అట్లా బడికి వస్తాదనుకొన్నది కాస్తా మరింత దూరమై పోయింది.

కొద్దిరోజులు దాటగానే అక్కన్నే ఒక గుడికి తీసుకపోయి మట్టసంగా తాళి కట్టించేసి కాపురానికి పంపించేసినారు.

ఆ విషయం తెలిసి మనసు కళుక్కుమంది.

వెంటనే స్నేహితునికి ఫోన్‌ చేశా. వాడు విషయం విని ''రేయ్‌... వదిలేయ్‌రా ఇంక. పెండ్లయిపోయిందంటున్నావు గదా... ఇవన్నీ ఈడ మామూలే. ఆపిన పెండ్లిళ్ళలో తొంభైశాతం నెల తిరక్కుండానే అయిపోతాయి. అది అందరికీ తెలిసిన రహస్యమే. ఈళ్ళపేరు చెప్పుకోని ఈడ సంస్థలు బలుస్తున్నాయిగానీ పిల్లలు మాత్రం పిట్టల్లా రాలిపోతూనే వున్నారు'' అన్నాడు ఫోన్‌ పెట్టేస్తూ.

జ్యోతి గురించి అప్పుడప్పుడు పిల్లలు సమాచారం అందించేవాళ్ళు. కొంతకాలానికి ఆ పాపతో బాటే చదివే పిల్లలు పదయిపోయి వెళ్ళిపోయారు. జ్యోతి గురించి చెప్పేవారే కరువయిపోయినారు. కాలంతో బాటు నెమ్మదిగా జ్యోతి ఆలోచనల తీవ్రత గూడా తగ్గుతూ వచ్చింది. అట్లా రెండు సమ్మచ్చరాలు గడిచిపోయాయి.

కానీ... ఈ మధ్యే ఆర్నెళ్ళ క్రింద ఒకరోజు బడిలో పాఠం చెబుతా వుంటే ఫోన్‌...

'' సా... బాగున్నావా'' అంటూ.

'' నువ్వు '' అన్నా ఆగొంతును నాదగ్గర చదువుకున్న అనేకమంది అమ్మాయిల గొంతుల్లో జల్లెడ పడుతూ.

'' కనుక్కో...'' కిలకిలకిల నవ్వు.

అదే నవ్వు. వెన్నెల వాన కురిసినట్లుగా, చిరుజల్లులు మొహాన్ని చల్లగా తాకినట్లుగా, మనసును ఊయలలూపే నవ్వు.

'' బంగారం... నువ్వేనా'' అన్నా సంబరంగా.

'' అవుసా... బాగున్నావా'' అంది.

'' బాగున్నారా... ఎక్కడున్నావు... ఎలా వున్నావు. ఒక్కసారి గూడా ఫోన్‌ చేయలేదే... అసలు గుర్తున్నానా'' అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశా.

'' నీ నంబర్‌ లేదుసా... బ్యాంగుళూరు నుంచి అట్లనే అత్తోళ్ళింటికి అంపించినారు. మళ్ళా ఇదో ఇప్పుడే ఇన్ని సమ్మచ్చరాలకి వూళ్ళోకి అడుగుపెట్టడం. నువు రాసిన మెరుపులవాన పుస్తకం ఒకసారి నాకిచ్చినావు గుర్తుందా. దాన్ని అటకపై భద్రంగా దాసిపెట్టుకోనింటి. ఇంటికి రాగానే దేవునికి మొక్కులు మొక్కుకుంటా నే సేసిన మొట్టమొదటి పని అది వెదకడమే. దాంట్లో నీ నంబర్‌ కనబడగానే ఎంత సంబరమేసిందో తెలుసా'' అంది ఆనందంగా.

'' ఏంరా.. చానా రోజులకొస్తివి. పండగనా'' అన్నా.

'' లేదు సార్‌.. కాన్పుకి... ఐదోనెల'' అంది.

'' అప్పుడేనా'' అన్నా.

'' ఏం సెయ్యాల సార్‌... తప్పదు... ఆడదానిగా పుట్టినాక'' అంది పెద్ద వేదాంతిలా.

'' ఎలా చూసుకుంటాడు నీ మొగుడు'' అనడిగితే నవ్వుతా '' పర్లేదు సార్‌. బానే సూసుకుంటాడు. ఇంతకీ మేడం, పిల్లలు ఎట్లా వున్నారు'' అంది మాట మారుస్తా.

అట్లా మళ్ళా మాటలు కలిశాయి. రోజూ ఏదో ఒక సమయంలో ఫోన్‌ చేసేది. ఎన్నెన్నో కబుర్లు చెప్పేది. పదే పదే బడిలో బాల్యాన్ని తలచుకొని సంబరపడేది. తన బాధలూ, సంతోషాలు నాలోకి ప్రవాహంలా వొంపేది. ''నాకు ఏడుపొచ్చినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావుసా. ఎన్ని వందలసార్లు నిన్ను తలచుకొన్నానో తెలుసా. వురుక్కుంటా వచ్చి నిన్ను సూడాలనిపిస్తాది. కానీ అప్పుడు కనబడనంత దూరం. ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చినా గదా... ఐనా ఇంట్లోవాళ్ళు కాలు బైటకి పెట్టొద్దు, కీడు అంటున్నారు. దాంతో నిన్ను సూడలేకుంటున్నా'' అంటూ ఏడ్చేసేది.

ఆలోచనల్లోనే ఆసుపత్రి వచ్చేసింది. లోపలికి అడుగు పెడుతుంటే బైటకొస్తున్న ఒక పదవతరగతి పాసయిన ఓల్డ్‌ స్టూడెంట్‌ కనిపించి ''నమస్తే సార్‌.. యాడికి'' అంటూ పలకరించాడు. ''అదేరా.. జ్యోతిని ఆసుపత్రిలో చేర్చినారంట గదా... చూద్దామని'' అన్నా. వాడు ఒక్క క్షణమాగి ''సార్‌... పొద్దున్నే తీసుకుపోయినారంట ఇంటికి. నేనూ ఆడికే పోతున్నా... వస్తావా.. పోదాం'' అన్నాడు. వాడు వరుసకు జ్యోతికి అన్నవుతాడు. నాకూ దానికీ మధ్యనుండే అనుబంధం గురించి వానికి బాగా తెలుసు. ఇద్దరం బండి మీద బైలుదేరాం. దారిలో వాడు ఒక్కమాటా మాట్లాల్లేదు. మౌనంగా మూగెద్దులెక్క కూచున్నాడు. కౌతాళంలో ఖాదరలింగస్వామి దర్గా దాటి కొంచెం ముందుకు పోగానే ఒక సందు చూపించాడు. అక్కడంతా జనం.

వాని వెనుక నెమ్మదిగా బైలు దేరాను.

ఆ ప్రదేశమంతా ఏదో విషాద వాతావరణం.

ఎవరి మొహాల్లోనూ ఆనందపు జాడ లేదు. మనసు కీడును శంకించసాగింది.

'' ఏమైందిరా'' అన్నా వాని వంక చూసి.

'' కాన్పు కష్టమై ఆసుపత్రిలోనే...'' మాటల మధ్యలోనే అంతవరకు ఆపుకున్న దుఃఖం వాని కళ్ళ నుండి బైటకు దుంకి గొంతు మూగబోయింది.

కాళ్ళ క్రింద భూమి నిలువునా చీలినట్లనిపించింది.

అంతలో వాడు '' వరుసగా మూడుసార్లు మూన్నెళ్ళకే అబార్షన్‌ అయిందంటసా... సిన్న పిల్ల. ఇంకా ఎదగలా. తట్టుకోలేకుంటుంది. కొంతకాలం ఆగండి అని ఎవరు సెప్పినా మొగుడు విన్లేదంట. 'అంత సేతగాకపోతే కనేదాన్నే తెచ్చుకుంట. తీసుకుపోండి.' అంటూ తిట్లూ తన్నులంట. కాపురం నాశనం సేసుకోగూడదని అన్నిట్నీ అట్లనే భరించింది. మందుల మీద మందులు మింగింది. ఆఖరికి నాలుగోసారి నిలబడిందంట. హమ్మయ్య అని అందరూ సంబరపడి సీమంతం సేసి పువ్వులా సూసుకున్నా.. రక్తం తక్కువయిపోయిందంట. దాంతో బిడ్డ బతికింది గానీ పాపం...'' అన్నాడు ఏడ్పును ఆపుకుంటూ.

జ్యోతిని ఇంటి ముందు పడుకోబెట్టి తెల్లని బట్ట కప్పారు. ఒకొక్కరే పోయి చూసి వస్తున్నారు. నా బంగారాన్ని చివరిసారిగా అలా శవంలా చూడ్డానికి నా మనసొప్పలేదు. కళ్ళ ముందు చిరునవ్వులు నవ్వుతున్న రూపమే మెదులుతా వుంది. దాన్ని నాగుండెల్లో అట్లాగే పొదుగుకుంటూ మౌనంగా వెనక్కు తిరిగా.

అంతలో ఇంటి లోపలి నుంచి చిన్నగా పసిపాప ఏడుపు... కమ్మగా ... పిలుస్తూ...

లోపలికి అడుగు వేశా.

ఆడపిల్ల.

నల్లగా ... పెద్ద పెద్ద కళ్ళతో... కొశ్శని ముక్కుతో... అచ్చం నా బంగారం లాగానే.

మెడ క్రింద చేయిపెట్టి అపురూపంగా పైకి ఎత్తుకున్నాను.

పాప ఏడుపు ఆపి చిరునవ్వులతో నావంక చూసింది. దాని శరీరం నా హృదయానికి మెత్తగా, వెచ్చగా, ఆత్మీయంగా తాకుతోంది. అది నా కళ్ళలోకి కన్నార్పకుండా అట్లాగే చూస్తా వుంది.

నా చిటికెన వేలు ఆపాప లేత పిడికిలిలో నలుగుతా వుంది.

డా.ఎం.హరికిషన్ - కర్నూల్ - 9441032212
*
కథ నచ్చితే SHARE చేయండి

పిల్లలు జంక్ ఫుడ్ తినడంతో కలిగే ఫలితాలు

Saturday, April 4, 2020

హలాల్ మాంసం - తురకల మోసం - మైసమ్మ శాపం


హలాల్ మాంసం - తురకల మోసం -
మైసమ్మ శాపం
*

భారతదేశం అనేక వేల సంవత్సరాలుగా
గొప్ప గ్రామీణ సంస్కృతి నాగరికత లతో విలసిల్లింది.

ముస్లిం రాజుల దురాక్రమణ దోపిడీ వల్ల ఈ దేశం పతనం పొందింది. అయితే ముస్లిం రాజు దోపిడీ తో పాటు మన తప్పులు కూడా చాలా ఉన్నాయి.

భారతీయ గ్రామాన జీవనానికి మూలాధారం
గ్రామ దేవతల ఆరాధన. గ్రామదేవతలు లేని గ్రామం భారతదేశంలో లేదు.

ప్రతి గ్రామంలో ఎల్లమ్మ .. మైసమ్మ .. దుర్గమ్మ ., పెద్దమ్మ .. బాలమ్మ .. మావుళ్ళమ్మ .. సమ్మక్క .... సారక్క లాంటి
గ్రామ దేవతలు కొలువై మన గ్రామాలను అనుక్షణం కాపాడుతున్నాయి.

మన పుర్వీకులు వేల సంవత్సరాల నుండి గ్రామ ప్రజలు జంతువులను ఈ దేవీ దేవతలకు బలి ఇవ్వడం ద్వారానే మాంసాహారం తీసుకునేవారు.

ఈ గ్రామ దేవతలకు బలి ఇవ్వని మాంసాహారాన్ని ఎవరూ ముట్టుకునే
వారు కాదు.

అతి క్రూరమైన ఇస్లాం రాజుల పరిపాలనలో మన పద్దతులను కాలారాసీ ముస్లిం మాంస వ్యాపారాన్ని పేంచుకేనేందుకు .. ఇస్లాం పద్ధతిలో వాటిని హలాల్ చేసి, వాటి మాంసాన్ని తక్కవకు అమ్మడం జరిగింది.

అమాయక హిందువులు మేల్లి మేల్లిగా మాంసం ముస్లింల దగ్గర కోనడానికి అలవాటు పడ్డారు.

ఈ హలాల్ వల్ల గ్రామ దేవతలకు
తర్పణ చేయబడలేదు. ఇది ముస్లిం కు సంబంధించిన సాంప్రదాయం.


సాధారణంగా గ్రామాల్లో ఉన్న దేవతలు
ఉగ్ర దేవతలు. దీని వల్ల తీవ్ర అపచారం జరిగింది. ఇది అనేక హిందువులు చేసిన భయంకరమైన టువంటి అపచారం.

ఈ హలాల్ అనేది హిందూ గ్రామానా సంప్రదాయాలను మరియు గ్రామ దేవతలను నాశనం చేసే భయంకరమైన కుట్ర.

ఇలా అజ్ఞానంతో అమాయకత్వంతో మనం వారి ఉచ్చులో పడ్డాం. కాబట్టి ఇకనైనా మేలు కుందాం.

తక్షణం మనందరం మన గ్రామలను అనుక్షణం కాపాడే గ్రామ దేవతలకు బలి ఇచ్చిన మాంసం మాత్రమే మనం తినాలి

ఈ హలాల్ చేసిన మాంసాన్ని ఆపివేయాలి
అంటే మనం కేవలం హిందువుల దగ్గర మాత్రమే మాంసం కొనాలి.

అంతమాత్రమే కాదు అందరు హిందువులు కూడా మన దేవీ దేవతలకు అర్పణ చేసిన మాంసాన్ని మాత్రమే అమ్మాలి.


హలాల్ మాంసం ఆపేద్దాం
దేవీ దేవతలకు బలి ఇచ్చినటువంటి మాంసం మాత్రమే తిందాం !!!

🙏🏻🙏🏻
జై ఎల్లమ్మ తల్లి
జై మైసమ్మ తల్లి
జై బాలమ్మ తల్లి
జై దుర్గమ్మ తల్లి
జై పెద్దమ్మ తల్లి
జై సమ్మక్క తల్లి
జై సారలమ్మ తల్లి
🙏🏻🙏🏻

గత కొన్ని రోజులలో నేర్చుకున్న కొన్ని పాఠాలు

గత కొన్ని రోజులలో నేర్చుకున్న కొన్ని పాఠాలు:

 1. అమెరికా ఇకపై ప్రపంచంలో అగ్రరాజ్యం కాదు.
 2. చైనా మూడవ ప్రపంచ యుద్ధంలో క్షిపణిని ప్రయోగించకుండా గెలిచింది.
 3. యూరోపియన్లు కనిపించినంత వివేకవంతులు కాదు.
4. యూరప్, అమెరికాలను పర్యటించకుండా కూడా మనం సెలవులు గడపగలం.
5. ధనవంతులు నిజానికి పేదల కంటే తక్కువ రోగనిరోధక శక్తి కలవారు.
 6. ధరలు పెరుగుతున్నప్పుడు, మానవులు వారి సామాజిక ఆర్ధిక స్థితితో సంబంధం లేకుండా అవకాశవాదులుగా మారుతారు.
7. పూజారులు, ఫాదర్లు, ప్రవక్తలు, దేవుళ్లు రోగులను రక్షించలేరు.
 8. మానవులే గ్రహం మీద నిజమైన వైరస్ లు.
9. రెడ్ టేపిజం లేకుండా పేదలకోసం కోట్లు ఖర్చు చేయవచ్చు.
10. డాక్టర్లు/ఆరోగ్య శాస్త్రవేత్తలు ఫుట్ బాల్ ఆటగాడి కంటే ఎక్కువ విలువైనవారు.
11. వినియోగంలో లేనప్పుడు చమురు కూడా పనికిరాని వస్తువు.
12. జూలో ఇన్నాళ్లు జంతువులు ఎలా భావించాయో.
13. మనుషులు లేకుండా గ్రహం త్వరగా పునరుజ్జీవమౌతుంది.
14. మెజారిటీ ప్రజలు ఇంటి నుండి పని చేయవచ్చు.
15. పిల్లలు, పెద్దలు జంక్ ఫుడ్ లేకుండా జీవించగలరు.
16. చిన్న నేరాలకు జైలులో ఉన్న ఖైదీలను విడుదల చేయవచ్చు.
17. పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం అస్సలు కష్టం కాదు.
18. మహిళలే కాకుండా ఎవరైనా ఇంటిపని/వంటపని చేయవచ్చు.
19. ప్రపంచంలో మంచి వాళ్లకు కొదవలేదు.
20. ఎక్కువ విద్యాలయాలు, ఉత్తమ విద్య, అత్యుత్తమ పరిశోధన అందిస్తే తక్కువ ఆసుపత్రులు అవసరమవుతాయి.

సంతోషకరమైన కుటుంబాల కలయికే సంతోషకరమైన సమాజము, దేశము, తద్వారా సంతోషకరమైన ప్రపంచము



ఒక కుటుంబం యొక్క సంతోషానికి ముఖ్యమైన కారణం డబ్బే అనే అభిప్రాయం చాలా బలంగా మనలో నాటుకొని వుంది.

అలా అనుకుంటే డబ్బు వున్న కుటుంబాలు అన్నీ సంతోషంగా వుండాలి కదా!

మరి ఆ కుటుంబాలు సంతోషంగా ఉన్నాయా?
లేదు కదా.

కాబట్టి ఒక కుటుంబం యొక్క సంతోషం నేరుగా ఆ కుటుంబ సభ్యుల మధ్య వుండే సంబంధ బాంధవ్యాల మీద ఆధారపడి వుంటుంది.

ముఖ్యంగా భార్య భర్తల
మధ్య వుండే సరైన భావాలు, భావనలు, అవగాహన మరియు సంబంధం మీద ఆధారపడివుంటుంది.

కుటుంబాన్ని విడదీయాలన్న, నిలబెట్టాలన్నా లేదా పిల్లల భవిస్యత్తు అయినా అన్నీ ఆధారపదివుండే ప్రధానమైన పునాది “ఈ ఒక్క భార్యా భర్తల మధ్య సంబధమే”.

ఇలాంటి సంతోషకరమైన కుటుంబాల కలయికే సంతోషకరమైన
సమాజము, దేశము,
తద్వారా
సంతోషకరమైన
ప్రపంచము అనే
వసుధైక కుటుంబము🙏🏻

గురుగ్రహ-దోష నివారణకు హయగ్రీవస్తోత్రం

శ్రీనివాససిద్ధాంతి9494550355


గురుగ్రహ-దోష నివారణకు హయగ్రీవస్తోత్రం..

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు మరియు గురుగ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.భక్తి బావనలు, ఉన్నత విద్య,విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు.

సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే

జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది.పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.

హయగ్రీవస్తోత్రం

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః||

ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం||

శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవావతారం ఎంతో విశిష్టమైనది. హయగ్రీవస్వామిని ఆరాధిస్తే అనంత జ్ఞానం లభిస్తుంది. ఆ స్వామి అనుగ్రహం ఉంటే దక్కనిదేదీ ఉండదు... అని వివరించే కథా సందర్భం ఇది. ఇది నారద మహా పురాణం పూర్వభాగం బృహదుపాఖ్యానంలో సనత్కుమార విభాగ అంతర్గతంగా గల తృతీయపాదంలో ఉంది. హయగ్రీవుడిని ఏ మంత్రాలతో ఉపాసించాలి? ఎంత జపం, ఎలా చేయాలి? దానివల్ల ఉపాసకుడు పొందే లాభాలేమిటి? అనే విషయాల్ని సనత్కుమార మహర్షి ఇలా వివరించాడు.

‘ఓం విష్ణవే సురపతయే మహా బలాయస్వాహా’ అనేది హయగ్రీవ స్వామికి సంబంధించిన మంత్రం. దీనికి చంద్రుడు ముని. విరాట్‌ ఛందస్సు. దధివామనుడు దేవత. తారము బీజం, స్వాహా శక్తి. ఈ మంత్రాన్ని సద్గురువు వద్ద స్వీకరించి అంగన్యాస, కరన్యాస పూర్వకంగా గురువు చెప్పిన పద్ధతిలో చేయాలి.

ముత్యాల కాంతితో ఉండే రత్నభూషణాలు కలిగినవాడు, చంద్రస్థుడు, తుమ్మెదల వంటి ముంగురులు కలవాడు, పవిత్ర జలంతో నింపిన కుంభాన్ని, దధ్యోదన(పెరుగన్నం) పాత్రను ధరించిన హయగ్రీవస్వామిని మంత్రజప సమయంలో ధ్యానించాలి. ఈ మంత్రాన్ని మూడులక్షల సార్లు జపించాలి. ఆ తర్వాత జపం చేసిన సంఖ్యలోని పదోవంతులో నేయి కలిపిన పాయసాన్నం, దధ్యోజనంతో యథావిధిగా హోమం చేయాలి. తరువాత స్వామి మూర్తి ఉంచిన పీఠాన్ని పూజించాలి. ఇలా పూజించేటప్పుడు మూలమంత్రంతో మూర్తిని సంకల్పించాలి. ఆ తర్వాత పీఠం మీద ఉన్న పద్మదళాలు, కేసరాలతోను పూజించాలి. కేసరాల్లో షడంగాలను దిక్కుల వైపునకు ఉన్న పద్మదళాల్లో వాసుదేవుడిని, సంకర్షుడిని, ప్రద్యుమ్నుడిని, అనిరుద్ధుడిని, దళాల కోణాల్లో శాంతిని, శ్రీని, సరస్వతిని, రతిని అర్చించాలి. అష్టదళాల్లో ధ్వజాన్ని, గరుత్మంతుడిని, కౌస్తుభాన్ని, వనమాలిని, శంఖ, చక్ర, గద, సారంగ ధనుస్సుల్నీ పూజించాలి. పద్మదళాల అగ్రభాగాల్లో కేశవాదులను, దిక్పాలకుల్ని ఆ తర్వాత వారి అస్త్రాల్ని సంకల్పించి పూజించాలి.

అష్టదిగ్గజాలైన ఐరావతం, పుండరీకం, వామనం, కుముదం, అంజనం, పుష్పదంతం, సార్వభౌమం, సుప్రతీకం అనే గజాల్ని, వరుసక్రమంలో ఆ గజాల పత్నులైన అభ్రం, కపిల, పింగళ, అనుపమ, తామ్రకర్ణి, శుభ్రదంతి, అంగన, అంజనావతి అనే గజాలను పూజించాలి. ఇలా మంత్ర జపాన్ని చేస్తే మనోభీష్టాలు నెరవేరతాయి. హయగ్రీవస్వామిని ఉపాసించటానికి చాలా మంత్రాలు ఉన్నాయి. వాటి జప విధానం, వాటితో చేసే హోమద్రవ్యాలు, హోమాల గురించి సద్గురువులను, పండితులను అడిగి తెలుసుకొని ఉపాసన, హోమాల్ని చేయాలి. వీటిని సక్రమమైన తీరులో చేసినప్పుడు ఉపాసకుడు శాస్త్ర జ్ఞానాన్ని, సంపదలను, మంచి వాక్‌శుద్ధిని పొందుతారని, సర్వ వేద ఆగమ వ్యాఖ్యాతగా ప్రసిద్ధికెక్కుతారని సనత్కుమార మహర్షి వివరించాడు

మీ జాతకమును తెలుసుకొనుటకు ఈ క్రింది నెంబర్ ను సంప్రదించండి.

లక్ష్మీ లలిత వాస్తుజ్యోతిష నిలయం.
స్వర్ణ కంకణ సన్మానిత.
జ్యోతిషరత్నశ్రీనివాస సిద్ధాంతి
9494550355

భారత్ చైనా సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న చనిపోయిన భారత జవాను ఆత్మ కధ

భారత్ చైనా సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న చనిపోయిన భారత జవాను ఆత్మ కధ

ఆత్మని తీసుకెళ్లాలని భారత్‌కు లేఖ రాసిన చైనా ఆర్మీ
అధికారులు....
ఇది నిజం నమ్మలేని నిజం....
మన దేశ సరిహద్దులో ఒక ఆత్మ దాదాపు 50 ఏళ్లగా
కాపాల కాస్తుంది....
మీ ఆత్మను మీరు తీసుకెళ్లండి అంటూ
చైనా ఆర్మీ గగ్గోలు పెడుతుంది..
ఆత్మలు లేవని మనం
నిజంగా నమ్మితే చైనా సైనికులకు ఎలా కనిపిస్తొంది??

సైనికుని ఆత్మకు మనఆర్మీ జీతం, సెలవులు, ప్రమోషన్లను
వర్తింప జేస్తొంది అంటే నమ్ముతారా....
కానీ ఇది నమ్మలేని నిజం....
ఒకసైనికుడు1967లో మరణించాడు, చనిపోయిన
తర్వాత కూడా అతడు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాడు....
భారత్ - చైనా సరిహద్దుల్లో కాపాలాగా ఉన్నాడు....
ఇది కేవలం ఏ ఒక్కరి విశ్వాసమో కాదు, భారత సైనికుల
నమ్మకం కూడా....

ఆ సైనికుడు హర్భజన్ సింగ్
ఆ దేశ భక్తుడి ఆత్మ కథ ఇది....
భారత్ - చైనా సరాహద్దుల్లో కథూవా మార్గంలో ఎతైన
పర్వతాలలో సైనికులు కాపాల కాయడం చాలా
కష్టమైన పని....
చైనా సైనికులు ఆక్రమణలకు ప్రయత్నిస్తుం
డడంతో మన సైనికులు రాత్రిపగలు కాపలా కాస్తుంటారు....
మన సైనికుల సామర్ధ్యాన్ని ఎవరు శంకించరు కానీ
ఈ సైనికుల మధ్యనే కనిపించని ఓ సైనికుడు కూడా
విధులు నిర్వహిస్తున్నాడు....
ఇక్కడ భయంకరమైన
మంచులో ఎక్కువ సమయం డ్యూటీ చేస్తూ కూడా
ఏ జవానుకు కంటి మీద కునుకు రాదు ఒకవేళ పొరపాటున వస్తే వెంటనే చెంప చెల్లుమనిపిస్తాడు, నిద్ర లేపుతాడు....
చైనా సైనికులు ఆక్రమనలకు ప్రయత్నిస్తే
గుర్రపు స్వారీ చేస్తూ వచ్చి వెంటనే హెచ్చరిస్తాడు....
ఆయనే మన భారత సైనికుడు బాబా హర్భజన్ సింగ్

1965లో ఆర్మీలో చేరిన హర్భజన్ సింగ్ ప్రస్తుతం
పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రం గుజర్వాలా
జిల్లా సంద్రాణాలో 1946 ఆగస్టు 30న జన్మించారు, కానీ ఫోస్టింగ్ మాత్రం
సిక్కింలో పడింది. భారత్ -చైనా సరిహద్దుల్లో ఉన్న
నాథూలాలో విధులు నిర్వర్తిస్తున్నపుడు హర్భజన్
అనుకోకుండా మంచు తుఫాన్ లో చిక్కుకున్నాడు.
సముద్ర మట్టానికి 14,500 అడుగుల ఎత్తులో ఉన్న
హిమాలయ పర్వతాలనుంచి కాలుజారి లోయలో పడ్డాడు.
1967 సెప్టెంబర్ 11న మంచులో కూరుకుని ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలు
మాత్రమే. అతన్ని వెతకడానికి సైనికులు చాలా ప్రత్నిం
చారు, కానీ ఎక్కడా అతని జాడ దొరకలేదు. ఒకరోజు
రాత్రి తన సహచరుడి కలలో కనిపించాడు, ఆ తర్వాత
అద్భుతం జరిగింది. ఎందుకంటే అంతవరకు ఎంత
వెతికినా దొరకని అతడి ఆచూకి సహచరుడికి కలలో
కనిపించిన చోటు వెతికారు. ఆశ్చర్యంగా అతడు చెప్పిన
చోటునే పార్ధివ దేహం దొరికింది, శవం పక్కనే రైఫిల్
కూడా లభించింది.
ఖననం చేసిన తర్వాత అంతా ఆయన గురించి మరచి పోయారు.

కొన్ని రోజుల తర్వాత మరో సహచరుడి కలలో
కనిపించాడు. నా శరీరం కాలి పోయింది కానీ నా ఆత్మ
ఎప్పటికి డ్యూటీలోనే ఉంటుందని చెప్పారు. మొదట
దాన్ని అందరు లైట్ తీసుకున్నారు.
కానీ ఆతర్వాత తోటి సైనికులు అద్భుతం జరగడం
చూశారు. ఏదైనా ఆపద రాబోతున్నా, శత్రువులు చొర
బాటుకు ప్రయత్నించినా ముందుగానే తన సహచరుల
కలలో కనిపించి హెచ్చరించేవాడు.
చైనా ఆపరేషన్
చేపట్టబోయే విషయాన్ని ముందుగానే హర్భజన్ సింగ్
కలలో కనిపించి చెప్పేవారు. ఆయన చెప్పింది తర్వాత
అలాగే జరిగేది. ఈవిషయం క్రమంగా అధికారుల చెవిన
పడింది, కానీ మొదట వాళ్లు దీన్ని నమ్మలేదు, పరిక్షించి
చూసి ఆశ్చర్యపోయారు....

మీసైనికుడు తెల్లటి దుస్తులు
ధరించి గుర్రంపై స్వారీ చేస్తున్నాడని అతన్ని వెనక్కి
పిలిపించుకోండి అని చైనా సైనికులు మన ఆర్మీకి చాలా
సార్లు చెప్పారట. ఇక చైనా అధికారులు ఈవిషయంలో
మన సైనిక అధికారులకు లేఖ కూడా రాశారంట. దీని
గురించి బాబా హర్భజన్ సింగ్ మన సైనిక అధికారులకు
ముందే కళలో కనిపించి చెప్పాడంట. దీంతో అధికారులు
కూడా హర్భజన్ ఆత్మపై విశ్వాసం ఏర్పడింది. మంచు
తుఫానులో సైనికులు డ్యూటీ చేస్తున్నప్పుడు వాళ్ల
మధ్యలో అదృశ్య రూపంలో హర్భజన్ సింగ్ ఉంటాడని
భావిస్తారు మన సైనికులు....

హర్భజన్ సింగ్ బాబా హర్భజన్ సింగ్ ఎలా అయ్యాడు....
సరిహద్దుల్లో కాపాల కాస్తున్న జవాను ఆత్మ
బాబా హర్భజన్ సింగ్ పేరుపై ఒక మందిరం కూడా
కట్టించారు మన సైనికులు...
నాథూలా మార్గంలో 13వేల అడుగుల ఎత్తులో ఉంది ఈమందిరం.
ఇక్కడ బాబా హర్భజన్ సింగే దైవం...
ఆయనఫోటో,, యూనిఫాం,, షూతో
పాటు పరుపు మరిన్ని వస్తువులను ఇక్కడే ఉంచి
పూజలు నిర్వహిస్తారు....
ఆమందిరం ఆలనా పాలనా ఆర్మీనే చూస్తొంది....
ఉదయం టిఫిన్ నుంచి రాత్రి బోజనం
వరకు ఈమందిరంలో హర్భజన్ సింగ్ కు పెడతారు.
చీకటి పడినవెంటనే మందిరం తలుపులు మూసివేస్తారు.
ఎందుకంటే బాబా రాత్రివేళ డ్యూటి పై వెళతారు అనేది
వారి విశ్వాసం, బాబా హర్భజన్ సింగ్ డ్యూటిలో ఉన్న సైనికుడిగా భావిస్తారు. అందుకే ఒక సైనికుడికి వర్తించే
నియమాలన్నీంటిని హర్భజన్ సింగ్ కు వర్తింప జేస్తారు.
వేతనం నుంచి సెలవులు, ప్రమోషన్ల వరకు ఆయనకు
వర్తింప జేస్తారు, అదికూడా మరణాంతరం వర్తించడమే
ఇక్కడ విశేషం....
బాబా హర్భజన్ సింగ్ సరిహద్దుల్లో గుర్రంపై స్వారీ చేస్తూ
మనదేశాన్ని కాపాడుతున్నాడు అనేది సైనికులతో
పాటు ప్రజల విశ్వాసం. అందుకే భారత్-చైనా సరిహద్దుల్లో
జరిగే ప్రతి సమావేశానికి ఆయన్ను కూడా భాగస్వామిని
చేస్తారు మన సైనిక అధికారులు. ఆయన గౌరవార్ధం
ఒక ఖాళీ కూర్చీలో ఫోటో పెడతారు, ఇలా చేయడం
అనేది సైనికుల మూఢనమ్మకం కాదు, నియమాలను
పాటించడం అంటారు అధికారులు. హర్భజన్ సింగ్
ఆర్మీలో ఉన్న రోజుల్లో ఎంత హడావిడి ఉండేదో ఇప్పుడు
అలాగే ఉంటుంది.శారీరకంగా హర్భజన్ లేక పోయినా
ఆయన ఆత్మ ఉందని భావిస్తున్నారు...
భారత్-చైనా సరిహద్దుల్లోని నాథూలా మార్గంలో ఉష్టోగ్రతలు
ఎప్పుడు 0 డిగ్రీల కంటే తక్కువగానే నమోదవుతుంది.
ఆ మంచులో అప్పుడప్పుడు కాలు జారుతుంది. శ్వాస
తీసుకోవడం కష్టం అవుతుంది. ఇక్కడ జీవించడం
చాలా కష్టం. కానీ చైనా లాంటి శత్రుదేశం పన్నాగం నుంచి
కాపాడ్డానికి కాపలా కాస్తారు. ఇలాంటి ప్రాంతంలో సైనికలు
ప్రశాంతంగా ఉన్నారు అంటే అది సైనికుల ధైర్య
సాహసాలతో పాటు బాబా హర్భజన్ సింగ్ అండగా ఉండడమే అని భావిస్తారు.
బాబా కష్ట కాలంలో ఆదుకుంటారన్నది సైనికుల నమ్మకం.
అది క్రమంగా జనాల్లోకి వెళ్లింది.
దీంతో సామాన్య జనంకూడా ఆయన దర్శనానికి బారులు తీరుతున్నారు.
సందర్శకుల సంఖ్య పెరగడంతో మందిరాన్ని మరింతగా
విస్తరించి అద్భుతమైన మందిరాన్ని నిర్మించింది ఆర్మీ.
ఈమందిరాన్ని సందర్శించే వారు లోపల నోట్ పుస్తకాన్ని
ఉంచుతారు, అందులో సందర్శకులు తమ కోర్కెలను
రాస్తారు, బాబా హర్భజన్ సింగ్ డ్యూటి నుంచి తిరిగి
వచ్చి రాసి ఉన్న కొర్కెలను చదువుతారని తర్వాత
వాటిని తీరుస్తాడని వారి నమ్మకం. ఇక్కడ ప్రజలు
నీటి బాటిల్స్ ని కూడా సమర్పిస్తారు, ఎవరికైనా అనారో
గ్యంగా ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా మూడు
రోజుల తర్వాత ఆబాటిల్స్ ని తీసుకుని వెళతారు.
అందులోని నీటిని 21 రోజుల పాటు కొంచెం కొంచెం
త్రాగితే సమస్యలన్నీ మటుమాయం అవుతాయనేది
ప్రజల నమ్మకం,ఇంకా సైనికులకు ఈమందిరం శక్తి స్వరూపంతో సమానం.
కొత్తగా ఆర్మీలో చేరిన జవాన్లు
ఈమందిరానికి వచ్చి నమస్కరించి విధుల్లో చేరడం
ఆనవాయితీ. హర్భజన్ సింగ్ కు ప్రతి సంవత్సరం
సెప్టెంబర్ 15న ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీ.
సెప్టెంబర్ నెలలో రెండు నెలల సెలవులపై తన
సొంతూరు పుంకా గావులోని తన ఇంటికి వచ్చేవారు.
అప్పుడు ఊరు ఊరంత ఆయనకు స్వాగతం పలక
డానికి రైల్వే స్టేషన్ కు తరలి వచ్చేవారు సైనికులుకూడా
అక్కడికి వచ్చి ఘనస్వాగతం పలికే వారు, ఇప్పుడు
కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు....
ఎటా సెప్టెంబర్ 15 న రైల్లో సీటును రిజర్వు చేస్తారు దానిపై
హర్భజన్ ఫోటో, వస్తువులు ఉంచుతారు.
సొంత గ్రామానికి రైలు రాగానే జవాన్లు, జనం ఆయన ఫోటోకి
స్వాగతం పలుకుతారు. చనిపోయి కూడా ఆత్మ విధులు
నిర్వర్తిస్తుందని భావించి హర్భజన్ సింగ్ కు ఇచ్చే
అత్యంత అరుదైన గౌరవం ఇది.
ఆయన మరణించి 50 ఏళ్లు కావస్తొంది. ఇప్పటికూడా ఆయన
ఆత్మ రూపంలో భారత్-చైనా సరిహద్దుల్లో విధులు
నిర్వహిస్తున్నట్టు సైనికులు నమ్ముతారు. ఇదేమి మూఢ
నమ్మకం కాదని తమకు ఎదురౌతున్న అనుభవాల
దృష్ట్యా నిజమేనని నమ్మక తప్పని పరిస్థితి అంటారు
సైనికులు, అందుకే శరీరం లేని జవాను బ్రతికున్నట్లుగా
భావిస్తారు.... జైజవాన్ జైహింద్ !!

Friday, April 3, 2020

సప్త చిరంజీవుల శ్లోకాలు

సకల వ్యాధి ప్రశమన కవాచ





దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని వినాలి లేదా చదవాలి, అది అన్ని అనారోగ్యాలు పోతుంది.
   
   సకల వ్యాధి ప్రశమన కవాచ

కవాచస్య రుషుర్దేవి మహారుద్రో మహేశ్వర
చందో నాస్తుపా విగ్నియం దేవి సంసారనాసిని
ధర్మార్థ కామ మోక్షం వినియోగస్చ్య సాధన
హేమ్ క్లీమ్ పాతు శిర్షీ మా శక్తిభీజమ్ థా హ్రుధి
హే సోవ్ పాతు నభిధషే సుంధారి కాంత ధేషాత
మహేశ్వరి సర్వగత్రే కౌమరి ధక్షైన్ తధ
విష్ణవి పేదవతా పాతు వతారే సర్వమంగళ
పాస్చిమ్ పాతు వరాహి ఇంద్రాణి పాతు నైరుతే
షున్యే నలే నీలీ క్షేత్రే సర్వత్ర భువనేశ్వరి
ఇతిశ్రీ సకల వ్యాధి ప్రశమన కవాచం సంపూర్ణం

వ్యాధులు మనలను నిలిపివేయవని ఒక మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి.
ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఒకసారైనా చెప్పండి.
మాకు అనారోగ్యం రాదు

భారత దేశం గురించి మీకు తెలుసా ?

✍🌏భారత దేశం గురించి మీకు తెలుసా ?✍

🌹1 . భారత దేశం లో 70 శాతం జనాభా గ్రామాల్లో నివసిస్తున్నారు . 95 శాతం ప్రజల మూలాలు గ్రామాల్లో వున్నాయి

🌹సెలవులు వస్తే పట్టణాలు వదిలి సొంత ఊరికి వెళ్లే వారే పట్టణాల్లో ఎక్కువ
🌹మట్టి లో పని చేసే మనుషులు ఇక్కడ అధికం . గ్రామాల్లో పిల్లలు మట్టిలో ఆడుకోవడం సహజం . దీని వల్ల పిల్లలో వ్యాధి నిరోధకత పెరుగుతుందనేది , ఎప్పుడో శాస్త్రీయంగా రుజువైన అంశం . { అది కరోనా కు రెసిస్టేన్స్ ఇస్తుందా లేదా అనేది వేరే చర్చ }

🌹పాశ్చత్య దేశాల వారు sanitisers , germ కిల్లర్స్ ఎక్కువగా, మోతాదుకు మించి వాడి సహజ వ్యాధి నిరోధకత ను కోల్పోయారు . అద్దాల మేడ లో నివసిస్తున్నారు

🌹2 . సద్ది అన్నం తినడం, ఇక్కడ ఇంకా పల్లెటూళ్ళో కొనసాగుతోంది . అన్నాన్ని రాత్రి పూట నీటిలో ఉంచితే ఫెర్మెంటేషన్ వల్ల శరీరానికి ఉపయోగ కరమైన బాక్టీరియా అందులో చేరుతుంది, ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది

🌹వారానికి సరిపడా వంటలు వండి, ఫ్రిజ్ లో దాన్ని నిల్వయుంచి , అందులో హానికారక సూక్ష్మ జీవులు చేరాక తీసి మైక్రో వేవ్ ఒవేన్ లో వేడి చేసి అందులో ఉన్న పోషక విలువల్ని చంపేసి , కాన్సర్ కారక ఆహారంగా దాన్ని మార్చి తినడం వెస్ట్రన్ సొసైటీ వారికి అలవాటు

🌹మన పట్టణాల్లో దోస ఇడ్లీ సాంబార్ కొబ్బరి చట్నీ .. అప్పటికప్పుడే వేడి వేడి గా చేసి తినడం అలవాటు . సాంబార్ లో అలాగే రసం లో వేసే ఇంగువ పసుపు కొత్తమీరే ఇంకా అనేక పదార్థాలు మనకు పోషక విలువల్ని ఇంకా రోగ నిరోధక శక్తిని ఇస్తున్నాయి
బాగా ప్రాసెస్ చేసిన గోధుమతో ఎండు రొట్టెలు తినడం వారి ఆచారం . రాగులు జొన్నలు కొర్రల సజ్జలు కంబులు తినడం ఇక్కడ అలవాటు

🦋3 . మనది బీద దేశమే కావొచ్చు . పూరి గుడిసె లో లేదా foot పాత్ పై నివసించే వారి దగ్గర కూడా కనీసం పది వేల రూపాయిల బంగారం ఇక్కడ ఉంటుంది . ఇక్కడ ఇల్లాలి తాళి బొట్టే ఆపద సమయాల్లో ఆదుకొనే ఆత్మ బంధువు . పొదుపు ఇక్కడ ఆచారం . రోడ్ పై చని పోయిన బిక్షగాడి వద్ద కూడా రెండు లక్షల కాష్ దొరికిన దేశం ఇది . అనేక కరువులు కాటకాలు చూసి పెరిగిన గతం మన పెద్దలది . "దుబారా చెయ్యకు .. కష్ట కాలానికి దాచుకో "అనే సూత్రం మన బ్లడ్ లో వుంది . రాబొయ్యే పదేళ్ల జీతాన్ని కూడా ముందుగా తాకట్టు పెట్టి , కారు కొనుక్కొని , జీవితాంతం అప్పులతో బతుకుతూ, వారం జీతం రాక పొతే అల్లాడి పోయి, ఆత్మ హత్య చేసుకొనే, లేదా దాడులకు దిగబడే సంస్కృతి వారిది

🦋గ్లోబలీకరణ పేరుతొ తమ సమస్త దారిద్య్రాన్ని మన పై రుద్దిన చరిత్ర వెస్ట్రన్ దేశాల వారిది . ఇప్పుడు మన యూత్ క్రెడిట్ కార్డు సంస్కృతికి , అప్పులో బతికే సంస్కృతికి , జల్సా సంస్కృతికి , పిజ్జా లు బర్గర్ లు లాంటి చెత్త ఫుడ్ తినడం , టాయిలెట్ లు కడగడానికి పనికి వచ్చే కోక్ ను తాగడానికి అలవాడు పడ్డారు
🦋ఇది వారి సాంస్కృతిక దాడి ఫలితం వారి బ్రెయిన్ వాష్ ఫలితం

🦋4 . కానీ మన దేశ భవిషత్తు ఇంకా గ్రామాల్లో ఉంది. కర్ఫ్యూ ప్రకటించేటప్పటికీ వెయ్యి కిలోమీటర్లు అయినా సొంత ఊరికి వెళ్లి పోవాలని మా కష్ట జీవులు ఎందుకు ప్రయత్నించారో మీకు తెలుసా ?

🌸వూళ్ళో అయితే .. ఆకలి చావులు వుండవు . పొలం గట్టు పై పెరిగే ఆకుకూరలు , బుడం కాయలు , ఇంకా ఆయా కాలాల్లో వచ్చే రకరకాల పళ్ళు .. పురుగులు తింటూ బతికే కోడి పెట్టిన గుడ్లు , కోడి మాసం . .. ఆ మాటకు వస్తే రకరకాల పురుగులు { రాయలసీమ లో ఈసుళ్లు అంటారు } ఇలా ఏదో ఒకటి తిని ప్రాణం కాపాడుకోవడం సాధ్య పడుతుంది

✍పక్కోడు ఇబ్బందుల్లో ఉంటే కలో గంజో పోసి కాపాడే సంస్కృతి వెస్ట్రన్ సంస్కృతి దాడి తరువాత కూడా ఇంకా బతికే ఉంది. అసలు కరువు కాటకాలు తట్టు కొనే .. బతికే... జీన్ పూల్ { అంటే జన్యు లక్షణాలు } మనలో వున్నాయి

🌷ఇదేదో ఎమోషనల్ గా చెబుతున్న మాట కాదు. ఎడారి మొక్క నీటి ఎద్దటికి ఎలా తట్టుకొని బతుకుతోందో గ్రామీణ భారతం కరువు కాటకాలకి ఆకలికి ఆలా జైవికంగా గా అలవాటు పడింది

✍ఇది ప్రూవ్ అయిన సైన్స్ . { పోనీ ఒక వేళ ఆకలి చావులే దాపురిస్తే కన్న వూళ్ళో చనిపోవాలని ఆలోచన } ఇక వారిదా ? రెండు రోజుల మాల్స్ మూసేస్తే ఇక ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి

👩‍🎤👧🏻అయ్యా .. మన పిల్లలకు కార్పొరేట్ పాఠశాలలు మా గతాన్ని చెప్పి చదివించి లేదు . వెస్ట్రన్ దేశాల్లో సాఫ్ట్ ware ఉద్యోగులుగా పని చెయ్యడానికి మన చదువులు.. మన విద్యా వ్యవస్థ .. మన ఐఐటీ లు... సర్వం అందు కోసమే తీర్చిదిద్ద బడ్డాయి

📕మాథ్స్ ఫిజిక్స్ తప్పించి మన పిలల్లు మన చరిత్రను , మన భౌగోళిక శాస్త్రాన్ని .. మన ఆర్థిక వ్యవస్థను .. మన వేమన పద్యాలను.. సుమతి శతకాన్ని .. కబీర్ దోహాలను చదవలేదు . పాశ్చత్య నాగరికత మోజులో పడిన కొత్త తరం తల్లితండ్రులు కూడా అదే దారిలో వెళ్లిన మాట నిజం

🌝చందమామ రావే ..అంటూ పిల్లకు గోరు ముద్దులు.. జ్యో అచ్చుతానంద అంటూ జోల పాటలు మరచి పోయాం

🌹తెనాలి రాముడు , బీర్బల్ , నీతి చంద్రిక నీతి కథలు పొయ్యాయి . ఒకటే ఆలోచన ....

అమ్మాయి / అమ్మాయి ఐఐటీ లో చేరాలి . అమెరికా లో స్థిర పడాలి ....

🌹మహా ప్రళయం నుండే జీవం పుడుతుంది అంటారు

🌹నేల కూలిన మొక్క నుండే మళ్ళీ చిగుళ్లు వస్తాయి అంటారు

🌹అమెరికా ఐరోపా దేశాల ప్రస్తుత స్థితి చూసి మేము "ఆ బాగా జరిగింది" అనుకోవడం లేదు . మనం భారతీయులం . సర్వే జనా సుఖినోభవంతు అనేది మన నర నరాల్లో జీరించుకొన్న సంస్కృతి

🌹వారూ బాగుండాలి . కాకా పొతే వారి బ్రెయిన్ వాష్ నుండి బయట పడాలి . వారూ రాతి యుగం లో వున్నప్పుడే నాగరికత కు పుట్టిలు అయిన దేశం మనది . బుద్ధం జైనం సిక్కు మతం లాంటి ఎన్నో మతాలకు విశిష్ట ఆచారాలకు పుట్టిలు మన దేశం

🌷కరోనా పుణ్యమా అంటూ మనకు కుటుంబ వ్యవస్థ
వివాహ వ్యవస్థ
బంధుత్వ వ్యవస్థ
పొదుపు , సంతులిత జీవన విధానం ఇలా ఎన్నో ఎన్నెనో తెలిసి వచ్చింది ( ఇది మన సమాజనికి మేలుకొలుపు

🍀సాంస్కృతిక పునరుజ్జీవన సమయం ఇది . గతం అంతా గొప్ప కాదు . కాలం చెల్లిన విధానాలను వదిలెయ్యాలి . గతం లోని మంచిని గ్రహించాలి . వెస్ట్రన్ దేశాల వారు నేర్పింది అన్నీ చెడు కాదు

🌸గాంధీ గారు చెప్పినట్లు ఎక్కడ ఉన్నా మంచిని గ్రహించాలి . మన మూలలను వదిలి పెట్టకూడదు . globalisation అనివార్యం . రేపు ఉద్యోగాల కోసం చైనా కు వెళ్లాల్సి రావొచ్చు .. జపాన్ కో దక్షిణ కొరియా కు వెళ్లాల్సి రావొచ్చు .. వెళ్ళాలి .. తప్పు లేదు .. లేదా ఆయా దేశాల వారే ఇక్కడికి రావొచ్చు .. మనం ఆహ్వానించాలి .. ఎక్కడ ఉన్నా నీ గతం లోని మంచి విషయాలను మరిచి పోకూడదు

🐧కొత్త వింత కావొచ్చు . కానీ చాల సార్లు ముంచేస్తుంది . పాత లో మంచి ఉంటే రోత పేరుతొ వదిలి పెట్టకూడదు . 2020 - ఒక కోణం లో నుంచి చూస్తే .. పెను సవాళ్ల కాలం .. కానీ మరో కోణం లో నుంచి చూస్తే.. ఎన్నెనో అవకాశాలు .. సరి కొత్త ప్రపంచం .. ఇప్పుడు నాలుగు రోడ్ ల కూడలి లో మనం .. మన పిల్లలు .. భారత దేశమా నీ పయనమెటు ?*

శాకాహార జగత్తు గురించి నాడు నేడు ఒకే మాట

శాకాహార జగత్తు గురించి నాడు నేడు ఒకే మాట

మీకొ వింత విషయం తెలియచేస్తాం.... మీరు నమ్మరు ఈ విషయాలను.. కాని ఇవన్నీనిజాలే. " అన్ని మతాలూ మానవులకు మంసాహారాన్ని నిషేధించాయి."

ప్రపంచంలోని అన్ని గ్రంథాలు ప్రతిజీవి లోను భగవంతుని ప్రతిరూపాన్ని వీక్షించమనీ, అహింస పరమోత్తమైనదని ఉద్భోదించాయి. సర్వ మతాలు అమయక జీవులకు హాని కలిగించడం మరియు చంపడం లాంటివి నిషేధించాయి.
హిందూ మతం:—

భగవద్గీతలో శ్రీకృష్ణుదు 6-32 శ్లోకంలో
"ఓ అర్జునా! ఎవడు సమస్త భూతముల ( ప్రాణుల) యొక్క సుఖ దుఖాలు, తన సుఖ దుఖాలుగా చూస్తాడో అట్టివాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. ఇది నా నిశ్చితాభిప్రాయం. "

భీష్మ:—
"మాంసం తినేవారు, మాంసాన్ని విక్రయించేవారు, మరియు మాంసం కోసం జంతువులను వధించేవారు పాపాత్ములు. "

వీరబ్రహ్మేంద్రస్వామి:—

" జీవులను వధించి జీవికి వేసినా
జీవ దోషములను జిక్కువడును;
జీవహింస చేత చిక్కునా మోక్షంబు !"

ఇస్లాం మతం:—

" భగవంతుడు మీరు సమర్పించే మాంసాన్ని, రక్తాన్ని ఇష్టపడడు. ఆయన పట్ల మీ విశ్వాసాన్ని మాత్రమే కోరుకుంటాడు " - ఖురాన్ 22:37
ఇస్లాం యొక్క సమస్త సూఫి యోగులు సద్గుణవంతులుగా జీవించడం, త్యాగ నిరతితో మరియు కరుణాంత రంగంతో జీవించడం, సాధారణ ఆహారం భుజించడం మరియు మాంసం వదలటం ప్రముఖంగా పేర్కొన్నారు. వారు స్వయంగా మాంసాన్ని త్యజించారు.
షేక్ ఇస్మాయిల్, ఖాజా మొయినుద్దీన్ చిస్తీ, హజ్రత్ నిజాబుద్దీన్ ఔలియా, ఖలందర్, షా ఇనాయత్, మీర్ దాద్, షా అబ్దుల్ కరీం మున్నగు సూఫీ భక్తులు ధర్మబద్ధంగా జీ వించతం, సకల జనులపై ప్రేమ మరియు ఆదరణ, మరియు శాకాహారం గురించి చెప్పారు.

కబీర్ :—

" ఉపవాసాన్ని ( రోజా ) పాటించే ఉపాసకుడు మాంసం రుచిని ఆస్వాదించేందుకు, జీవుల్ని వధిస్తే, అతని ఉపవాస వ్రతం నిష్ప్రయోజనమవుతుంది, అల్లా ఈ ప్రవర్తనను అంగీకరించడు. "

క్రైస్తవ మతం:—

చంపబడిన జంతువుల మాంసం శరీరంలో ఉంటే ఆ శరీరం సమాధి లాంటిది. ఎవరైతే చంపుతారో వారు నిజానికి తమనే చంపుకుంటున్నారు. చంపబడిన వాటి మాంసం తినేవారు మృ త శరీరాలను తింటున్నట్లే
" ఏ జీవినీ చంపే హక్కు ఎవరికీ లేదు " - జీసస్ క్రైస్ట్

జీసస్ కు సన్నిహిత శిష్యుడైన సెయింట్ మాథ్యు మాంసాహారాన్ని ఆధ్యాత్మిక పతనాననికి సూచనగా భావించేవారు. వారు మాంసం తినేవారు కాదు.

ఇక
జైన మతం మరి బౌద్ధ మతాల్లొ మాంసాహారాన్ని భుజించడమన్న ప్రసక్తేలేదు.

ఇక చివరిగా కొందరు మహాత్ముల అభిప్రాయాలను చూద్దాం:

"సాత్విక ఆహారమే మనిషికి సరి అయినది " - రమణమహర్షి, చాణక్య, తిరువల్లువార్

"మానవుడు ఎలాంటి పరిస్థితిల్లోనూ మాంసం తినడం సరికాదు. మనం పశువుల కన్నా ఉన్నతులం, మాంసం తిని నిమ్న శ్రేణికి చెందిన జీవుల వలె ప్రవర్తించడం మనకు యుక్తంకాదు" - మహాత్మాగాంధీ

"జంతువుల పట్ల క్రూరత్వం చూపటం మూర్ఖత్వమే కాక పరమాత్మను అవమానిచడమే అవుతుంది. మాంసం భుజించదం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది " - స్వామి దయానంద, రజనీష్.

" ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో, చంపుతుంటారో అంతకాలం యుద్ధాలు ఉంటాయి " - జార్జి బెర్నాడ్ షా

" మన కడుపేమీ ' స్మశానం' కాదు, జంతుకళేబరాలను దాచుకోవడానికి ! " - జార్జి బెర్నాడ్ షా

" పక్షులను చంపి వండుకుని తినేవాడు వసుధ చండాలుడు " ! యోగి వేమన, స్వామి దయానంద
ఇల ఎంతోమంది మహానుభావులు శాకాహారముగురుంచి ఇలా తెలియపరిచారు . వీటి గురించి తెలుసుకోవాలి అంటే వారి పుస్తాకాలు చదివి నట్లైతే వారి మనో భావాలు ఇంకా వివరంగ తెలుసుకోవచ్టు.
శాకాహారజగత్ కి జై
జైజై శాకాహారజగత్
జై పత్రీజీ ! జై ధ్యాన జగత్ !

పైన తథాస్తు దేవతలు ఉంటారు అంటారు... ఇవి చూశాక నమ్మక తప్పదు.

పైన తథాస్తు దేవతలు ఉంటారు అంటారు... ఇవి చూశాక నమ్మక తప్పదు. 👇👇👇👇👇👇👇

పిల్లలు :స్కూల్ లేక పోతే బాగుండు రోజు ఎంచక్కా ఇంటి దగ్గర ఆడుకోవచ్చు.
@ తథాస్తు.

గృహిణి: మా ఆయన ఆఫీసు కి వెళ్ళకుండా ఎంచక్కా నాతోనే ఉంటే బాగుండు.
@ తథాస్తు.

మగవారు: చి దీనమ్మ జీవితం .ఈ ట్రాఫిక్.. work from home ఉంటే బాగుండు.
@ తథాస్తు

ఆడవారు: నేను నా భర్త + పిల్లలతో ఎక్కువ సమయం గడిపే బాగుండు.
@ తథాస్తు


విద్యార్థులు: అబ్బా.. ఎగ్జామ్స్ లేకుంటే బాగుండు ర బై
@ తథాస్తు

వృద్ధులు: మా పిల్లలు మాతో కొంత సమయం గడిపితే ఎంత బాగుండు దేవుడా.
@ తథాస్తు

కార్మికులు: అబ్బా...బఈ పని చేసి చేసి చచ్చిపోతున్నం.
కొంత విశ్రాంతి ఉంటే బాగుండు..
@ తథాస్తు


కంపెనీ యజమానులు: ఇంతకాలం కంపెనీ కోసం పని చేస్తున్న. నాకోసం కూడా కొంత సమయం కేటాయించి ఉంటే బాగుండు.
@ తథాస్తు

పశు పక్షులు: ఏంట్రా ఈ జనాలు ఏడ బడితే ఆడ్ తిరుగుతూ మమ్మల్ని తిరగనీయకుండా చేస్తుండృ.
ఈ మనుషుల్ని ఎవరైనా ఆప్తే బాగుండు.
@ తథాస్తు


బోన్ లోని జంతువులు( zoo): మనుషులు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా బందిస్తే చూడాలని ఉంది రా బై.
@ తథాస్తు

భూదేవి: శ్వాస కూడా తీసుకోలేనంత పొల్యూషన్ ఏర్పడింది.. కాస్త గాలి ఫ్రెష్ ఐతే బాగుండు.
@ తథాస్తు

Thursday, April 2, 2020

శ్రీరామచంద్రుడు అంటున్నాం కదా? రాముణ్ణి చంద్రుడితో పోల్చడం ఎందుకు?

ధర్మసందేహం - సమాధానం

సందేహం;- శ్రీరామచంద్రుడు అంటున్నాం కదా? రాముణ్ణి చంద్రుడితో పోల్చడం ఎందుకు?

సమాధానం;- చంద్రుడంత అందంగా ఉన్నాడని కానీ, లేదా చంద్రుడిలా చల్లని గుణాలు కలవాడని గాని రాముణ్ణి చంద్రుడితో పోల్చిఉండవచ్చు. చంద్రుడికి పదహారు కళలుంటాయని పెద్దలు చెప్పారు. అలాగే శ్రీరాముడికి కూడా పదహారు గుణాలుంటాయని నారదుడు వాల్మీకి మహర్షికి చెప్పాడు. అందుకే రాముడు శ్రీరామచంద్రుడయ్యాడు.

ఈ లోకంలో నరుడిగా నడయాడుతున్న దైవం ఎవరు? అని వాల్మీకి ప్రశ్న. పదహారు గుణాలు కలిగిన ఆ ఉత్తమ నరుడు శ్రీరామచంద్రుడే అని నారద మహర్షి సమాధానం. ఈ లోకంలో ఇప్పుడు గుణవంతుడెవడు అని వాల్మీకి ప్రశ్న. పదహారు గుణాలలో గుణం అని చెప్పదగిన గుణం సౌశీల్యం మహతః మందై స్సహనీరంధ్రేణ సంశ్లేషః సౌశీల్యం అని దాని నిర్వచనం. జాతిచేత, విద్యచేత, ఐశ్వర్యంచేత చాలా గొప్పవాడైనా, తనకంటే తక్కువ వారితో అరమరికలు లేక కలిసి ఉండడమే సౌశీల్యం.

రాముని మిత్రులు ముగ్గురు గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు. ఒకడు పడవలు నడుపుకొను పల్లెవాడు. రెండవవాడు వానరుడు. మూడవవాడు రాక్షసుడు. ఉత్తమ నరునికి ఉండవలసిన గుణం వీర్యం. మనసులో వికారం (మార్పు) కలగడానికి కారణాలెన్ని ఉన్నా చలించకపోవడం వీర్యం. అలాగే ఉత్తమ మానవుడు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యసంధుడు, దృఢవ్రతుడు అనగా స్థిర సంకల్పం కలవాడు, మంచి చారిత్రం (నడవడి) గలవాడు, సర్వప్రాణుల హితాన్ని కోరేవాడు, జ్ఞానం కలవాడు, సామర్ధ్యం కలవాడు, సదైక ప్రియదర్శనుడు, ఆత్మవంతుడు అంటే ధైర్యము, వ్యక్తిత్వము గలవాడు, జిత క్రోధుడు అంటే కోపాన్ని జయించి (నిగ్రహించి) తన వశంలో ఉంచుకొనేవాడు, ద్యుతిమంతుడు అంటే తాను వెలుగుతూ, ఇతరులకు వెలుగునిచ్చేవాడు, అసూయ లేనివాడు, యుద్దంలో దేవతలనైనా జయించగలవాడు అయి ఉండాలి.

ఈ షోడశగుణ, కళాప్రపూర్ణుడే శ్రీరామచంద్రుడు.

జైశ్రీరామ్

బలమే జీవితం ధైర్యమే జీవితం

🙏 బలమే జీవితం ధైర్యమే జీవితం 🙏

🌹దేహానికి అనారోగ్యం సంకల్పించినప్పుడు దేహం యొక్క రోగనిరోధక వ్యవస్థ ధ్వంసమైంది అని భావిస్తూ ఉంటారు.

🌹 వాస్తవానికి దేహం ఎలాంటి వ్యాధినైనా నయం చేసుకోగలదు. మీ యొక్క భయాలతో , సందేహాలతో, నిరాశకర దృక్పథంతో, దేహం యొక్క రోగనిరోధక వ్యవస్థ ను ఆటంకం పరుస్తున్నారు.

🌹 ఎటువంటి వ్యాధినైనా దేహం నయం చేసుకోగలదు. ఆత్మ జ్ఞానం లేదా ఆధ్యాత్మిక జ్ఞానం విస్తారంగా ఉన్నప్పుడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా అధిగమించి ఆనందంగా జీవించే విధానం తెలుస్తుంది.

🌹 ఆ జ్ఞానం వెలుగులో జీవితంలోని పరిస్థితులు ఉన్నతమైన రీతిలో మార్పులు చెందుతాయి

🌹 జ్వరం జలుబు వంటి వాటికి కూడా భయాందోళనలకు లోనవుతారు వ్యాధి మరింతగా ముదిరిపోయి ప్రాణం పోతుందేమో అని
భయపడుతుంటారు. ఇలాంటి భయాలు రోగ నిరోధక వ్యవస్థను దెబ్బ తీస్తాయి.

🌹ఎవరికైనా ఏ వ్యాధియైనా వస్తే భయాందోళనలతో ఆ వ్యాధిని మీరు అంటు వ్యాధిగా స్వీకరిస్తున్నారు.

🌹 ఆ విధంగా ఆ వ్యాధి అందరికీ (వ్యాధి వస్తుంది అని నమ్మిన వారందరికీ) ప్రాకుతుంది.

🌹ఒక వ్యక్తికి సంక్రమించిన వ్యాధి నాకు అంటు వ్యాధిగా సంక్రమించదు అని మీరు ప్రగాఢంగా నమ్ముతున్నట్లు అయితే ఆ వ్యాధి మీ దరి చేరదు.

🌹 మీరు భయంతో కానీ, ఆందోళనతో కానీ, నమ్మకాలతో కాని, మీరు ఆహ్వానిస్తే తప్ప ఏ వ్యాధి మిమ్మల్ని తాగదు, ఏ వ్యాధి మీ దరిచేరదు.

🌹 నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడను. నాలోని భయాలు, అనుమానాలు, సందేహాలు, నెగటివ్ నమ్మకాలు, అన్నింటినీ వదలి, నేను నా సమాజం ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాం సంల్పించుకోవాలి

🌹 దేహం యొక్క ఆరోగ్య రక్షణ వ్యవస్థ అపరిమితమైన శక్తి సామర్ధ్యాలు.

🌹 భయంతో ఆందోళనతో అనారోగ్యం పాలవుతున్నారు.

ధైర్యమే జీవితం. బలమే జీవితం
భయమే పాపం బలహీనతే పాపం.
These points are from :మహా ఆరోగ్యశాస్త్రం.
All people have to read this book
Spiritual knowledge only gives power.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

శ్రీరామ నవమి

శుభోదయం 💐

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు శ్రీ రామ నవమి శభాకాంక్షలు

Wishing you all a Happy, Blissfull Sri Rama Navami. Lord Sri Rama Jayanthi (Birthday)

శ్రీరామ నవమి

సకల గుణాభిరాముడు ధరణిపై అవతరించిన శుభదినం.

సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినం చైత్రశుద్ధ నవమిని శ్రీరామ నవమిగా జరుపుకుంటారు.

శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడోది రామావతారం.

దుష్టశిక్షణ కోసం శ్రీహరి మానవరూపంలో ధరణిపై అవతరించి, ధర్మ సంస్థాపన చేశారు.

శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్నాటక లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి.

పద్నాలుగేళ్ల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు.

ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని విశ్వాసం.

ఇదే రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది.

అందుకే చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారామ కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

కాబట్టి ఏటా చైత్ర శుద్ధ నవమిని శ్రీరామ నవమిగా వేడుకలు, శ్రీసీతారామ కళ్యాణం జరుపుతారు.

పితృవాక్య పరిపాలకుడిగా, ప్రజలను బిడ్డల్లా పాలించిన రాజుగా, భార్య ప్రేమ కోసం పరతపించిపోయిన భర్తగా, ఆదర్శవంతమైన కుమారుడిగా ఇలా సకల గుణాభి రాముడిలో 16 ఉత్తమ లక్షణాలున్నాయి.

క్రమశిక్షణ కలిగనవాడు..
వీరుడు,
సాహసికుడు..
వేద వేదాంతాలను తెలిసివాడు.
చేసిన మేలును మరవనివాడు.
సత్యవాక్కు పరిపాలకుడు, గుణవంతుడు,
స్వయం నిర్ణయాలు తీసుకునే విజ్ఞాన వంతుడు.
సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు..
శకల శాస్త్రాల్లోనూ పండితుడు.
సమస్త కార్యాలలోను సమర్ధుడు..
సులక్షణమైన రూపసి (అందగాడు),
అత్యంత ధైరశాలి,
క్రోధాన్ని జయించివాడు,
సమస్తలోకల్లోనూ తెలివైనవాడు,
ఈర్ష్య అసూయ లేని వాడు,
దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి

ఈ లక్షణాలన్నీ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి శ్రీరాముడు.

రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారు.

మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముణ్ని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.

Good morning 😀🙏🌞

Wishing you all a Happy, Blissfull Sri Rama Navami.

Sage Valmiki asks Sage Narada to tell about a person, who possess the qualities

गुणवान् (guṇavān = principled person)

वीर्यवान् (vīryavān = potential one)

धर्मज्ञः (dharmajñaḥ = conscientious)

कृतज्ञः (kṛtajñaḥ = redeemer)

सत्य वाक्यो (satya vākyo = truth-teller)

धृढ व्रतः (dhṛḍha vrataḥ = self-determined in his deed)

चारित्रेण च को युक्तः (cāritreṇa ca ko yuktaḥ = blent with good-conduct)

सर्व भूतेषु को हितः (sarva bhūteṣu ko hitaḥ = benign, in respect of all beings)

विद्वान् (vidvān = adept)

समर्थः (samarthaḥ = ablest)

एक प्रिय दर्शनः (eka priya darśanaḥ = uniquely good-looking)

आत्मवान् (ātmavān = courageous)

जित क्रोधो (jita krodho = one who has controlled his anger)

द्युतिमान् (dyutimān = brilliant one)

अनसूयकः (anasūyakaḥ = not jealous)

बिभ्यति देवाः च जात रोषस्य संयुगे. (kasya bibhyati devāḥ ca jāta roṣasya saṃyuge = even whom do the gods fear, when provoked to war)

The divine person, who posses all the above qualities is one and only SRI RAMA.

Sri Rama is a role model and ideal figure for a being good human being with morals, values and virtues.

Let's stay home and stay safe. Save ourselves and others lives.

😊🙏💐

Wednesday, April 1, 2020

అన్ని రోగాలకూ విరుగుడు మనసే!

అన్ని రోగాలకూ విరుగుడు మనసే!

మన శాస్త్ర నిపుణులు చేసిన వివిధ ప్రయోగాలలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఇంతకాలం మనం గుడ్డిగా నమ్ముతున్న అనేక ఆరోగ్యసమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారంలో లేవని మన జీవించే విధానంలోనే ఉన్నాయని, మనసును హాయిగా ఉంచుకున్న వారికి ఏ రోగాలు రావని వారు తేల్చిచెబుతున్నారు. మరో సర్వేలో కూడా మనసుబాగున్న వారు ఎక్కువకాలం జీవిస్తున్నారని తేల్చారు. మనసు కలతబారితే లేనిపోని ఆలోచనలు చోటుచేసుకుని వాటి నుంచి బైటపడడానికి బలహీనతలు పెంచుకోవడం, వాటికి బానిసలై దురలవాట్ల పాలైపోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు. ఇటీవలకాలంలో ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి జీవన శైలిని సరిదిద్దే పనిలో పడ్డారు.

అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చే పద్ధతి మార్చుకున్నారు. ఇది వరకు తినకూడదు అన్న అన్ని రకాల ఆహారాన్ని నిరభ్యంతరంగా తినమంటున్నారు. అది వరకు ఆకలితో మాడిపోవద్దన్న వారు ఉపవాసాలు చేయండంటున్నారు. పొద్దుపొద్దునే లేచి ఏ గుడికో గోపురానికో వెళ్ళి ఆలయం చుట్టూ వీలైనన్ని ఎక్కువ ప్రదక్షిణలు చేయమంటున్నారు. ఈ మధ్య నవగ్రహాల మంటపం చుట్టూ తిరిగేవారు 9 రౌండ్లు ప్రదక్షిణచేస్తే ఇప్పుడు అర్చకులు 27 రౌండ్లు కొట్టమంటున్నారు. ఇలా చేయడం వల్ల పుణ్యానికి పుణ్యం ఆరోగ్యానికి ఆరోగ్యం కలుగుతుందని వారు చెబుతున్నారు. పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందుకోసం నచ్చిన పాటలు వినమంటున్నారు.

ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయమంటున్నారు. కొందరు వాకింగ్ ఇష్టపడితే మరికొందరు జిమ్‌కు వెళ్ళాలనుకుంటారు. ఇంకొందరు బ్రిస్క్‌వాక్ చేయాలనుకుంటే, ఇంకొందరు స్టురైకేస్ వాక్ చేయాలనుకుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచిపెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయమని సూచిస్తున్నారు. ఒక్కసారిగా వీరి వైఖరి ఇలా మారిపోడానికి కారణం సరికొత్త అధ్యయనాలలో వెలుగుచూస్తున్న అంశాలే కారణం. ఇలా వెల్లడైన అనేక పరిశోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది. దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబుతున్నారో చూద్దాం.

మానసిక ఒత్తిడి వల్ల గ్యాస్: కడుపులో గ్యాస్ సమస్యను వాయువు అంటారు. ఇది రావడానికి, ముదరడానికి కారణం ఆహార లోపాల వల్ల కాదట. మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ వస్తుందట !

ఆవేశ కావేశాల వల్లే అధికరక్తపోటు: ఉప్పు ఎక్కువగా తినే వారికంటే ఆవేశ కావేశాలను అదుపులో పెట్టుకోని వారిలోనే అధికరక్తపోటు ఎక్కువట !

అతిబద్ధకం వల్ల చెడుకోలెస్టరాల్: కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడుకోలెస్టరాల్ ఎక్కువట!

మధుమేహం సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినేవారిలో కంటే, అధికస్వార్ధం, మొండి తనం ఉన్నవారిలో నే ఎక్కువట !

అతివిచారం వల్ల ఆస్త్మా: ఊపిరితిత్తులకు గాలి అందకపోవడం కంటే, అతివిచారం వల్లనే ఊపిరితిత్తులలో మార్పులు వచ్చి ఆస్తామా వస్తుందట.

రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 200 మందికి దగ్గర దగ్గర కరోనా పాజిటివ్ వచ్చింది అంటే దానికి కారణం వైరస్ శక్తి కంటే మన వారి తప్పిదామే ఏక్కవ అని చెప్పక తప్పదు.

ప్రభుత్వాలు ఎంత చెబుతూవున్నా ప్రజలు వాటిని నిర్లక్ష్యం చేయడమే ఇందుకు నిదర్శనం కాబట్టి ఏదైనా మన మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది అని అనాడానికి ఇది కూడా ఒక ఉదాహరణ.

ప్రశాంతత లేక గుండెజబ్బులు: ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టుకోవడంలో మార్పులు వస్తున్నాయట. అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు మూల కారణాలు తరచి చూస్తే ఆహార అలవాట్ల వల్లకాదని లైఫ్‌స్టయిల్ సంబంధమైనవేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు. వారి అధ్యయనం ప్రకారం

50% ఆధ్యాత్మికత లోపంవల్ల
25% మానసిక కారణాల వల్ల
15% సామాజిక, స్నేహబాంధవ్యాల లోపం వల్ల
10% శారీరక కారణాల వల్ల

రోగాలు వస్తున్నాయి. అందువల్ల కడుపుమాడ్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా జీవన శైలిని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండాలంటే
స్వార్ధం, కోపం, ద్వేషం, శత్రుత్వం, ఆవేశం, అసూయ, మొండితనం, బద్ధకం, విచారం, వంటి వ్యతిరేక భావాలను వదిలించుకోవాలి
కారుణ్యం, త్యాగం, శాంతం, క్షమ, నిస్వార్ధం, స్నేహభావం, సేవాభావం, కృతజ్ఞత, హాస్య ప్రియత్వం, సంతోషం , సానుకుల దృక్పథం పెంచుకోవాలి.

అందుకే ఇంటికంటే దృఢమైనది
మనసు కంటే పదిలమైనది ఏదీ లేదు ఈ ప్రపంచం లో
ఆలోచిద్దాం ఆచరిద్దాం

మేమే అదృష్టవంతులo, 1950-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం

మేమే అదృష్టవంతులమ్!
1950-70 లో పుట్టిన మేము ఒక ప్రత్యేక తరానికి చెందిన వాళ్ళం. చాలా సాధారణ స్థాయి బళ్ళో చదువుకున్నా, దాదాపు మా తరం వాళ్ళు అన్ని విషయాలలో నిష్ణాతులుగా కనిపిస్తారు.

ఆంగ్ల మాధ్యమంలో చదువుకోకున్నా, మాకు ఆ భాష మీద ఉండే పట్టు అమోఘం. ఒక్క ఆంగ్లమే కాదు మేము చదువుకొన్న ప్రతి విషయంలో ఎంతో ప్రతిభ చూపించేవాళ్ళము. లెక్కలు, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం ఇంకా అనేక విషయాలు ఎంతో శ్రద్ధతో నేర్చుకునేవాళ్ళము.

పోటీ చాలా ఎక్కువ ఉన్న ఈ రోజుల్లో అదేమంత
గొప్ప విషయంగా కనపడకపోవచ్చు, కానీ ఆనాడు ఉన్న సామాజిక -ఆర్థిక పరిస్థితులకు మేము సాధించింది చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి.

దాదాపు ప్రతీ కుటుంబంలో కనీసం నల్గురు నుండి ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు. ఇంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన పైనే ఆధార పడేది... అంటే అందరికీ కడుపునిండా తిండి దొరకటమే కష్టం అయ్యేది.

పొద్దున్నే చద్దన్నం, మధ్యాహ్నం మామూలు భోజనం ఉండేది. రాత్రికి కూడా అంతే.

పండగ రోజుల్లో మాత్రం కాస్త ప్రత్యేకంగా ఉండేది. బొగ్గుల కుంపటిలోనో, కట్టెల పొయ్యిలోనో వంటలు చేసి, ఇంత మంది పిల్లలను పెంచిన ఆ నాటి తల్లుల ఋణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేము.

దాదాపు అందరం దుంపల బడిలోనో ప్రభుత్వ ఉచిత పాఠశాలలోనో చదువుకొన్న వాళ్ళమే. మాలో చాలా మంది డిగ్రీ చదువులకు వెళ్లేవరకూ చెప్పులు లేకుండా నడిచిన వాళ్ళమే!

ఆ రోజుల్లో చాలా సాధారణంగా ఉండేది. బడి చదువులు అయిన వెంటనే తల్లి-దండ్రులు తమ బిడ్డలకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు.

ఆ రోజులల్లో ప్రభుత్వ డిగ్రీ చేసి PG చేసిన వాళ్ళు తక్కువే.

మా తరం వాళ్లకి సినిమా, రేడియో తప్ప వేరే వినోదం ఉండేది కాదు. మూడు అణాలు ఇచ్చి తెరకు దగ్గరగా కూర్చొని చూసిన సినిమాలు ఎన్నో. అదీ కాకుండా, రేడియోలో పాత కొత్త పాటలు వినటం ఎంతో ఇష్టంగా ఉండేది. ఘంటసాల వెంకటేశ్వరరావు, పిఠాపురం నాగేశ్వరరావు , మాధవపెద్ది సత్యం, సుశీల, లీల, జిక్కీ గార్లు పాడిన తెలుగు పాటలు అంటే పడి చచ్చేవాళ్ళం ఇక హిందీ పాటల విషయానికొస్తే, పాటల ట్యూన్ ని బట్టి సంగీత దర్శకులెవరో చెప్పే వాళ్ళం. SD బర్మన్, నౌషాద్, మదన్ మోహన్, శంకర్ జైకిషన్, లక్ష్మీ కాంత్ ప్యారేలాల్,కళ్యాణ్ జీ ఆనంద్ జీ ... ఒకరేమిటి, ఎన్ని పేర్లు చెప్పుకోవాలో తెలియదు. ఈ సంగీత సామ్రాట్టులు అందించిన పాటలు ఈనాటికీ శ్రోతల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉన్నాయి.

మాకు ఉన్న మరో వినోదం పగలు గూటిబైళ్ల గోళీలాట ఏడుపెంకులాట బుచ్చలాట
రాత్రికి హరికథలు బుర్ర కథలు నాటకాలు చూడటం ఇదే వినోద కాలక్షేపం

ఈ నాటికీ దాదాపు అందరం 48-65సంవత్సరాలు పూర్తి చేసుకున్నవాళ్ళమే. జీవితంలో ఉన్నత ఉద్యోగాలు చేసుకున్నవాళ్ళమే. పిల్లలను పై చదువులు చదివించి ప్రయోజకుల్ని చేసినవాళ్ళమే!

అయినా ఉత్సాహం ఏమాత్రం తగ్గక ఇంకా యువకుల్లా కనిపిస్తున్నవాళ్ళమే. ఈ వయసులో కూడా మన చిన్నప్పటి స్నేహితులను పేరు పేరునా గుర్తుంచుకొని పిలుస్తున్న వాళ్ళమే.

ఇక మాకన్నా అదృష్టవంతు లెవరుంటారు?
ఆహా! జ్ఞాపకాల దొంతర అంటే ఇదీ!! అచ్చంగా మన బాల్యాన్నిమనమే రాసుకున్నట్టుగానే వుంది!!!

అక్షరాభ్యాసం సమయం లో 'ఓం నమః శివాయ' అని ఎందుకు వ్రాస్తారు వడ్డిపర్తి పద్మాకర్ గారు వివరణ

అక్షరాభ్యాసం సమయం లో ఓం నమః శివాయ అని ఎందుకు వ్రాస్తారు వడ్డిపర్తి పద్మాకర్ గారు వివరణ ఈ వీడియో వినండి తప్పకుండా షేర్ చేయండి

అంటురోగం కన్నా... అధైర్యమే ప్రమాదకరం!

అంటురోగం కన్నా... అధైర్యమే ప్రమాదకరం!

మానవాళికి అంటువ్యాధుల ముప్పు ఈనాటిది కాదు. మానవుడు ప్రకృతికి విరుద్ధంగా నడుచుకున్నా, జీవరాశులన్నిటితో స్నేహంగా మెలగకపోయినా ఉత్పాతాలు తప్పవు. ఇది గౌతమ బుద్ధుడు ఏనాడో చేసిన హెచ్చరిక!

బుద్ధుడు మగధ రాజధాని రాజగృహలో ఉన్న రోజులవి. ఒకనాడు కొందరు బాటసారులు ఆయన దగ్గరకు వచ్చి- ‘‘భగవాన్‌! వైశాలి రాజ్య పరిస్థితి ఘోరంగా ఉంది. వైశాలి నగరం అంటురోగాలతో అల్లాడుతోంది’’ అని చెప్పారు.

బుద్ధుడు వెంటనే తన వెంట 500 మంది భిక్షువులను తీసుకొని వైశాలికి వెళ్ళాడు. ఆ ప్రాంతం తీవ్ర అనావృష్టితో విలవిలలాడుతోంది. చెరువులు ఎండిపోయాయి. ఆ బురద నీటినే మనుషులూ, పశువులూ ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. నీటి కొరతతో, ఆహారం కొరతతో ఎన్నో పశువులు మరణించాయి. దుర్గంధం వ్యాపించింది. ఎంతో పశుసంపద, అటవీ సంపద యజ్ఞాలకు ఆహుతయింది. క్రమేపీ ప్లేగు, కలరా లాంటి అంటు రోగాలు ప్రబలిపోయాయి. వేల మంది మరణించారు.

బౌద్ధ సంఘం వైశాలిలో ప్రవేశించిన రోజున... అనుకోకుండా కుంభవృష్టి కురిసింది. ఎన్నో జంతు కళేబరాలు, మనుషుల శవాలు నీటి వేగంలో పడి కొట్టుకుపోయాయి. ప్రజలెవరూ బయటకు రావడం లేదు. రాజు, రాజ పరివారం కూడా ఇళ్ళకే బందీలైపోయారు. నగరాన్ని శుభ్రం చేసేవారెవరూ లేరు.

బుద్ధుడు వచ్చాడని తెలిసి, కొందరు ధైర్యం చేసి బయటకు వచ్చారు. బుద్ధుడు సరాసరి రాజ మందిరానికి చేరాడు. రాజును ఉద్దేశించి ‘‘రాజా! ఏమిటీ పని! ఎందుకీ భయం! ఇలాంటి సమయంలోనే ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రభుత్వం ఆసరా ఇప్పుడే ప్రజలకు అవసరం. మీరూ, మీ రాజోద్యోగులూ, మంత్రులూ... అందరూ నగరంలోకి వెళ్ళండి. ప్రజలను ఉత్సాహపరచండి. వారిలో ధైర్యం నింపండి. అంటురోగాల కన్నా అధైర్యమే ప్రమాదకరం. భయమే ఎక్కువ కీడు చేస్తుంది. ప్రజలు కోలుకోవడానికి యజ్ఞాలూ, యాగాలూ చేస్తే కుదరదు. వారికి ఈ పరిస్థితుల్లో కావలసిన సపర్యలు చేయాలి. వారికి తగిన ఔషధాలు అందివ్వాలి. ఈ విషయంలో మీరు సంచార ఆటవిక జాతుల నుంచి ఎంతో నేర్చుకోవాలి’’ అని చెప్పాడు.


అనంతరం తన భిక్షు సంఘంతో వీధుల్లోకి వెళ్ళాడు. భిక్షువులు నగరాన్ని మధ్యాహ్నానికల్లా శుభ్రం చేశారు. బౌద్ధ వైద్యుడు జీవకుడు తెచ్చిన ఔషధాలు ప్రజలకు అందాయి. భిక్షువులు వైద్యులుగా మారారు. ప్రజలు ధైర్యం తెచ్చుకున్నారు. ఆ రోజు సాయంత్రం బుద్ధుడు వారికి కొన్ని ప్రబోధాలు చేశాడు. అవే ‘రత్న సూత్ర, మైత్రీ సూత్రాలు’గా బౌద్ధ సాహిత్యంలో నిలిచిపోయాయి.

వైశాలీ ప్రజలైన లిచ్ఛవులను ఉద్దేశించి బుద్ధుడు మాట్లాడుతూ, ‘‘వైశాలీ లిచ్ఛవులారా! ఈ భూమిపై జీవించే ప్రతి జీవీ, నేలలో, నీటిలో, గాలిలో జీవించే ప్రతి జీవీ మంచిగా బతకాలి. మంచి మనసుతో బతకాలి. మీరు నా మాట శ్రద్ధగా వినండి. సర్వజీవుల పట్ల మీరు స్నేహంతో ఉండాలి. ఆశ, అసూయలతో వాటికి ఉనికి లేకుండా చేస్తే ఇలాంటి ఉపద్రవాలే వస్తాయి. సర్వజీవుల సుఖంలోనే మన సుఖం కూడా ఉంది. అంతేకాదు, మనిషి నిరాశలో కూరుకుపోయి లేదంటే సోమరితనంలో పడిపోయి పరులకు బరువు కాకూడదు. అలాగని ఎప్పుడూ అవిశ్రాంతంగా ‘పనులు... పనులు’ అంటూ పరుగులు తీయకూడదు. ఇంద్రియాల పగ్గాలు ఇసుమంత కూడా వదలకూడదు. ఆడంబరాలకు పోకూడదు. ఆలోచించుకొని ముందుచూపుతో బతకాలి. సంతృప్తిగా గడపాలి. లేకుంటే మనిషి అలిసిపోతాడు. అర్భకుడవుతాడు. అప్పుడు ఇలాంటి ఉపద్రవాలను ఎదుర్కోలేడు’’ అంటూ అనేక ఆరోగ్య సూత్రాలనూ, జీవన గతులనూ వివరించాడు. ప్రకృతిని ధ్వంసం చేసినప్పుడు, మానవజాతి దాని కన్నెర్రకు గురికావాల్సి వస్తుంది. అలాంటి సందర్భంలో ప్రకృతిని ఆశ్రయించడమే మార్గం.

(సర్వజీవుల సుఖంలోనే మన సుఖం కూడా ఉంది. అంతేకాదు, మనిషి నిరాశలో కూరుకుపోయి లేదంటే సోమరితనంలో పడిపోయి పరులకు బరువు కాకూడదు. అలాగని ఎప్పుడూ అవిశ్రాంతంగా ‘పనులు... పనులు’ అంటూ పరుగులు తీయకూడదు.)

శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రమ్

శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహా స్వామి విరచిత
శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రమ్
🕉🌞🌎🌙🌟🚩
సంకల్పం:-

అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య కొరోనా నామకస్య రోగ విశేషస్య నివారణార్థం. శృంగేరీ జగద్గురు విరచిత శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్ర పారాయణం కరిష్యే.

ॐॐॐॐॐॐॐॐॐॐ

శ్రీ దుర్గా పరమేశ్వరీ స్తోత్రమ్

ॐॐॐॐॐॐॐॐॐॐ

ఏతావంతం సమయం
సర్వాప ద్భ్యోపి రక్షణం కృత్వా ।
గ్రామస్య పరమిదానీం
తాటస్థ్యం కేన వహసి దుర్గాంబ।।1।।


అపరాధా బహుశః ఖలు
పుత్రాణాం ప్రతిపదం భవన్త్యేవ ।
కో వా సహతే లోకే
సర్వాంస్తాన్మా తరం విహాయైకామ్ ।।2।।


మా భజ మా భజ దుర్గే
తాటస్థ్యం పుత్రకేషు దీనేషు ।
కే వా గృహ్ణంతి సుతా-
న్మాత్రా త్యక్తాన్వదాంబికే లోకే ।।3।।


ఇతః పరం వా జగదమ్బ జాతు
గ్రామస్య రోగ ప్రముఖాపదోస్య ।
నా స్యు స్తథా కుర్వచలాం కృపామి-
త్యభ్యర్థనాం మే సఫలీ కురుష్వ ।।4।।


పాపహీనజన తావన దక్షాః
సన్తి నిర్జరవరా‌ న కియన్తః ।
పాప పూర్ణజన రక్షణ దక్షాం -
స్త్వాం వినా భువి పరాన్న విలోకే ।।5।।


ఇప్పటి లాగే పూర్వంలో ప్లేగు మహామారీ ప్రబలమై జనులు ఆపదలో ఉన్నప్పుడు, 33 వ శృంగేరీ పీఠాధిపతి అయిన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ మహా స్వామి వారు మాహామారీ నివారణకై చేసిన దుర్గా స్తోత్రమ్.

🕉🌞🌎🌙🌟🚩