Monday, April 13, 2020

నేను సత్యమైనది కాదు ..అది నేను కాదు ...అది సాంగత్యపు "నేను "మాత్రమే అన్న స్పృహలో వుంటూ,అదే పరిస్థితిని,అదే సందర్భాన్ని అదే నేనుతో నడిపించడమే ఆధ్యాత్మిక జీవితం

పరమాత్మా...

మీ ఇంటి ముందు వీధి ఉంది...
ఆ వీధిలో వీధిలైట్లు ఉన్నాయి...
అయితే ఒక్కొక్క లైటు బల్బ్ ఒక్కో కలర్ లో ఉంది...
చీకట్లో అన్ని బల్బులూ వెలుగుతున్నాయి...
మీరు ఆ వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు...
మొదటి లైటు రెడ్....దానికిందకి వెళ్ళగానే మీరు ఎర్రగా
మారిపోయారు....అలాగని మీరు నిజంగానే ఎర్రగున్నారా...?

తర్వాత ప్రయాణంలో
అలాగ్ పచ్చ బల్బ్ కిందికి వెళ్లారు..మీరు పచ్చగా అయిపోయారు...అలాగని మీరు నిజంగానే పచ్చగా ఉన్నారా...?

తర్వాత ఇంకా ముందుకు వెళ్లారు...
ఇప్పడు బ్లూ బల్బ్ కిందికి వెళ్లారు...
మీరు అంతా బ్లూ అయిపోయారు..అలాగని మీరు నిజంగానే బ్లూ నా...?

ఇంకాస్త ప్రయాణించారు...
ఈ సారి పసుపు కలర్ బలబ్ కిందికి వెళ్లారు..
మీరు అంతా పసుపుగా అయిపోయారు...
నిజంగా మీరు పసుపునా....?

మీరు భయానికి సంబంధించిన ఆలోచనలతో
సాంగత్యం చేసినప్పుడు...ఏర్పడిన నేను ,,,నిజంగా మీరేనా...

వెంటనే మీఇంట్లో ఎదో కామెడీ సీన్ వస్తే చూసి మహా పగలబడి
నవ్వారు....ఇప్పుడు ఆ ఆలోచన కిందికి వెళ్లారు కాబట్టి నవ్వుతున్న నేను గా మారారు...నిజంగా అది మీరేనా...?

వెంటనే మీకీ ఫోన్ వచ్చింది ...ప్రియమైన వారికి యాక్సిడెంట్ జరిగింది అని....భాధకలిగిన ఆలోచనల కిందికి వెళతారు...
భాధకలిగింది....ఆ బాధపడుతున్న నేను నిజంగా మీరేనా...?

సాయంత్రానికి ఇంటికెళుతూ ఉంటే మీకీ ఒక కోటి రూపాయలు దొరికాయి...లేదా లాభం వచ్జింది ...సంతోష పడ్డారు...పోనీ ఈ
నేను శాశ్వతమైందా...నిజమైందా....?

భార్య దగ్గరకు వెళితే భర్త అయ్యారు
అమ్మ దగ్గరకు వెళితే కొడుకు అయ్యారు
బిడ్డ దగ్గరకు వెళితే నాన్న అయ్యారు
తమ్ముని దగ్గరకు వెళితే అన్న అయ్యారు...
కోడలి దగ్గరకు వెళితే మామ అయ్యారు...

ఇన్ని నేనులుగా మనం లేము...
ఆయా ఆలోచనల కిందికి వెళ్ళినప్పుడు
ఆయా నేనులుగా మారినట్టు అనిపిస్తుంది...
ఆ అనిపించడమన్నదే అసత్య0...దాన్నుండి మేల్కొవడమే
జ్ఞానోదయం....

కేవలం మీతో మీరు వున్నప్పుడు....ఏమీ కాదు

ఇలా ఎవరో ఒకరి దగ్గరకు వెళితే
మనం ఎదో ఒకటి అవుతాం...నిజానికి ఆ
అయ్యే ""నేను ""నిజమేనా..?

అలాగే ఎదో ఒక ఆలోచనతో సంగమిస్తే
మనం ఎదో ఒక నేను అవుతూనే ఉంటాం
నిజానికి ఆ ఆలోచన వల్లా ఉత్పన్నమయ్యే
ఆ ""నేను ""నిజమేనా....?

ప్రతి దినం జీవితం మొత్తం ఆయా సందర్భాలననుసరించి ఆయా ఆలోచన కిందికి వెళుతూ ఉండడమే కదా జీవితం.,,,ఆయా ఆలోచనలు బట్టి ఆయా ప్రభావానికి
లోనౌతూ ఏర్పడుతున్న " నేను "" సత్యం మనుకుంటూ
జీవించడం వల్లా...గతం లేదా జ్ఞాపకం ఏర్పడుతుంది...

నిజానికి ఆ విధంగా ఏర్పడుతున్న ""నెనులు""సత్యమైనవా...?
కాబట్టి ప్రతి క్షణం ఆయా పరిస్థితి సందర్భాన్ని బట్టి కలిగే ఆలోచల వల్లా ఏర్పడుతున్న నేను సత్యమైనది కాదు ..అది నేను కాదు ...అది సాంగత్యపు ""నేను ""మాత్రమే
అన్న స్పృహలో వుంటూ,, అదే పరిస్థితిని,,అదే సందర్భాన్ని అదే నేనుతో నడిపించడమే ఆధ్యాత్మిక జీవితం అంటారు..ఇదే .....శాశ్వత పరిష్కారం...

ఆయత్...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

Sunday, April 12, 2020

ముద్రలు - mudralu

యధార్ధ సంఘటన

యధార్ధ సంఘటన

🙏 అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం(త్రివేడ్రం)సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.
ఆ కుర్రవాడు ఈ పెద్దమనిషినితో " ఈకాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన, మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది" అని మాట్లాడము మొదలుపెట్టి, పైగా "మీలాంటి వారు ఇలాంటి పుస్తకాలు కాకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధిని సాధించి ఉండేది" అని ఆవేశంతో అన్నాడు.
ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని గురించి అడిగాడు. అప్పుడా కుర్రవాడు " నేను కలకత్తానుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను" అని గర్వంగా చెబుతూ"మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు కాకుండా సైన్సు పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని" ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.
ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షకదళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని "మీరెవర"ని అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు "విక్రంసారాభాయి" అని చెప్పాడు. ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన ఛైర్మన్ అని అర్ధం అయ్యింది. అప్పటికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది. "ఈ విశ్వంలో ప్రతీ వస్తువు పరమాత్మ చే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును, మహాభారత సమయం కావచ్చును, ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా!! దైవాన్ని ఎన్నడూ మరువకు" అని ఆ కుర్రవానికి బోధించాడు.

ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం చేయవచ్చును. కానీ సైన్సును అభివృద్ది చేసింది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెబుతోంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్ఞానఖని. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభం పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యలన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.

శ్రీమత్భగవద్గీత సకలశాస్త్రాలసారం !.🙏

మానవ సంబంధాలు పెంపొందించుకోవడం ఎలా (ఆత్మ జ్ఞాని)


🌹 మానవ సంబంధాలు పెంపొందించుకోవడం ఎలా (ఆత్మ జ్ఞాని)

🔺మొట్ట మొదటి మానవ సంబంధాలు ఎలా పెట్టుకోకూడదో నేర్చుకుంటే, ఎలాంటి బంధాలు పెట్టుకోకూడదో నేర్చుకుంటే సరైన సంబంధాలు ఏర్పడాతాయి.

🔺 మానవ సంబంధాలు ముఖ్యంగా నాలుగు రకాలు

1. మైత్రి
సుఖంగా ఉండే వాళ్ళు , అంటే డబ్బు ఉన్న వాళ్లు కాదు, ఆస్తి ఉండే వాళ్ళు కాదు. సత్యంతో జీవించేవారు, జ్ణానవంతులు, బాహ్యమైన ఏ కారణం లేకుండా అకారణంగా ప్రతిక్షణం ఆనందంగా ఉండే వాడు. అలాంటి వాళ్ళతో ఎప్పుడు మైత్రి కొనసాగించాలి.

2. కరుణ
ఎప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. అన్నీ ఉంటాయి. కాని చింతిస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళతో మైత్రి అవసరం లేదు. వాళ్ల పట్ల ఎప్పుడూ కరుణ కలిగి ఉండాలి. వాళ్లకి ఓదార్పు ఓదార్పు నివ్వాలి. వాళ్లకి ఎప్పుడు ధైర్యంగా జీవించమని చెప్పాలి.

3. ముదితము .
వీరు ఎప్పుడు ఆనందంగానే ఉండరు. అలాగని దుఃఖంతో ఉండరు. వీళ్లు సామాజిక సేవలో అన్నదానం వస్త్రదానం పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి పట్ల, మంచి పనులు చేస్తునందుకు అభినందిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండాలి. వీళ్ళతో మైత్రి వల్ల మన ఆధ్యాత్మ జీవితం మెరుగు పడదు. వీళ్ళు కరుణ చూపించుకొనే స్థితిలో ఉండరు.

4. ఉపేక్ష
వీరు అందరిని విమర్శిస్తూ, గేలి చేస్తూ, వెనకాల కామెంట్స్ చేస్తూ, ఈర్ష ,అసూయలతో, రగిలిపోతుంటారు. వీరు చెప్పిన వినే స్థితిలో ఉండరు. వీరితో మైత్రి కరుణ. ముద్రితం, అవసరం లేదు. వీరి పట్ల ఉపేక్ష భావన కలిగి (ignore) ఉండాలి. వారిని పూర్తిగా వదిలి వేయాలి

అప్పుడు మాత్రమే అన్ని రకాల సంబంధాలు అద్భుతంగా ఉంటాయి.

🌹 అసలు సంబంధాలు ఎందుకు ఏర్పరచుకోవాలి?

నా ఆనందం కోసమా? వాళ్ళ ఆనందం కోసమా?

మొట్ట మొదటి సంబంధం నాతో నేను ఎలా సంబంధం కలిగి ఉండాలి? అని ఈ క్రింది విధంగా అవగాహన పెంచుకోవాలి
నాకు నేనే గొప్ప మిత్రుడను.
నా చైతన్యమే నాకు ఆప్తమిత్రుడు.
నా అంతర నిశ్శబ్దమే అతి దగ్గర మిత్రుడు.

ఇలా ఉండగలిగినప్పుడు
మానవ సంబంధాలన్నీ సక్రమంగా సరైన విధంగా ఉంటాయి

ధ్యానమే నాకు సరైన మిత్రుడు

నీతో నువ్వు దగ్గరయ్యే కొద్దీ బాహ్యంగా అందరూ దగ్గరగానే ఉంటారు

🌹నీతో నువ్వు దూరం పెంచుకొనే కొద్ది అందరూ దూరంగానే పెంచుకుంటారు

అందుకే ప్రతి రోజూ ధ్యానం చేయండి మీతో మీరు ఉండండి. అప్పుడే అందరూ మీతోనే ఉంటారు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

Reference - whatsapp group

Saturday, April 11, 2020

రతన్ టాటా గారు, నేను ఆస్తులు పెంచుకోవడం కన్న, నా దేశ ప్రజలు సంతోషంగా ఉండడమే నాకు నిజమైన ఆస్తి అని అనుకోకపోతే?

అందరూ రతన్ టాటా గారు,కరోనా నివారణకు 1500కోట్లు ఇచ్చారని, అందుకే ఇకపై టాటా ఉత్పత్తులు మాత్రమే కొనాలి అనుకుంటున్నారు?

నిజానికి అలా ఇవ్వడం ఆయనకి కొత్తేమి కాదు, టాటా గ్రూప్స్ కి ప్రతి ఏటా వచ్చే లాభాల్లో, 66% టాటా గ్రూప్స్ నిర్వహించే స్వచ్ఛంద సంస్థలకే వెలుతుందని మీకు తెలుసా??

6లక్షలకోట్ల టర్నోవర్, 8లక్షల మంది ఉద్యోగులు ఉన్న టాటా గ్రూప్స్ కంపెనీల అధినేత అయిన రతన్ టాటా ఆస్తి, కేవలం 7వేల కోట్ల పైచిలుకు మాత్రమే అంటె నమ్మగలరా??

అందుకే ఆయన ప్రపంచ, అలాగే దేశంలో కూడ ధనవంతుల జాబితాలో ఆయన పేరు కనపడదు, అదే 66%స్వచ్ఛంద సంస్థలకి ఇవ్వకుండా, ఆయనే తీసుకుంటే,ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండేవారు,,

మనం గొప్పగా మాట్లాడుకునే అంబానీ,ఆదిత్య బిర్లాలు ప్రతిఏటా సేవాసంస్ధలకి ఖర్చుపెట్టేది ఎంతో తెలుసా? ఏడాది ఆదాయంలో కేవలం 2%మాత్రమే, అదే రతన్ టాటా గారి ఆదాయంలో 66% వాటికే ఖర్చుపెడతారు,అందుకే ఆయన ధనవంతుల లిస్టులో ఉండలేక పోయారు,,

రతన్ టాటా గారు ఎప్పుడూ, పేదలకు అందుబాటులో ఉండే వస్తువులనే తయారు చేయాలనే ద్రుడనిశ్చయంతో ఉంటారు, అందుకు ఉదాహరణే నానో కార్, అతి తక్కువ ధరకే,కారు తయారు చేసి పేద,మధ్యతరగతి వాళ్ళ కారులో తిరగాలనే కలని నెరవేర్చడమే ఆయన కల, దురదృష్టవశాత్తు అదంత సక్సెస్ కాలేదనుకోండి అది వేరేవిషయం,,

ఓసారి టాటా ఇండిగో కార్లు కొనమని అమెరికా ఫోర్డ్ కంపెనీని అడిగిన రతన్ టాటా గారిని,హేళన చేస్తూ మాట్లాడితే, కొన్నేళ్ల తరువాత ఫోర్డ్ కంపెనీ తయారుచేసిన జాగ్వార్,ల్యాండ్ రోవర్ కార్లు తీవ్ర నష్టాలు పాలైతే,ఆ కంపెనీని కొని, తరువాత లాభాలో బాటలో నడిపించిన చరిత్ర రతన్ టాటా గారిది,,దట్ ఈజ్ రతన్ టాటా👈👈

1938లో జన్మించిన రతన్ టాటా గారు,అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ పూర్తిచేసారు, మనలో చాలామందికి తెలీని విషయం ఏంటంటే, ఆయన పెళ్ళిచేసుకోలేదు కూడ,,,

150ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్స్ కంపెనీలకి,చైర్మన్ అయిన రతన్ టాటా గారు, నేను ఆస్తులు పెంచుకోవడం కన్న, నా దేశ ప్రజలు సంతోషంగా ఉండడమే నాకు నిజమైన ఆస్తి అని చెబుతారు,అందుకే ధనవంతుల లిస్టులో పేరు లేకపోయినా,ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయనకు స్థానం ఉంటుంది 👏👏👏

లాక్డౌన్ సమయంలో తెరపైకి వచ్చిన నిజాలు..

1. అమెరికా నేడు ప్రముఖ దేశం కాదు.

2. ప్రపంచ సంక్షేమం గురించి చైనా ఎప్పుడూ ఆలోచించదు.

3. యూరోపియన్లు వారు ఉండాల్సినంత విద్యావంతులు కాదు.

4. యూరప్ లేదా అమెరికా వెళ్ళకుండా కూడా మన సెలవులను ఆనందంతో గడపవచ్చు.

5. భారతీయుల రోగనిరోధక శక్తి ప్రపంచ ప్రజల కంటే చాలా గొప్పది.

6. ఏ పూజారి, , రచయిత, మతాధికారి లేదా జ్యోతిష్కుడు ఒక్క రోగిని కూడా రక్షించలేరనేది తెలిసిపోయింది.

7. ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, పరిపాలన సిబ్బంది నిజమైన హీరోలు మాత్రమే... క్రికెటర్లు, సినీ తారలు మరియు ఫుట్‌బాల్ ఆటగాళ్ళు హీరోలు కాదు. బొమ్మలు మాత్రమే.

8. వినియోగం లేకుండా ప్రపంచంలో బంగారం, వజ్రాలు ప్రాముఖ్యత లేదనేది తెల్సింది.

9. ఈ ప్రపంచం కూడా తమకు చెందినదని జంతువులు మరియు పక్షులు మొదటిసారి భావించాయి.

10. నక్షత్రాలు నిజంగా మెరుస్తున్నాయి, ఆకాశంలో చూడంగానే ఈ నమ్మకం మొదట పిల్లలకు నమ్మక కల్గింది.

11. ప్రపంచంలోని చాలా మంది ప్రజలు తమ పనిని ఇంటి నుండే చేయవచ్చు.అనుకున్నారు.

12. మనం మరియు మన పిల్లలు 'జంక్ ఫుడ్' లేకుండా జీవించగలం.అనేది నమ్మకము కల్గింది.

13. పరిశుభ్రమైన జీవితాన్ని గడపడం చాలా కష్టమైన పని కాదు. అనేది అర్థం అయ్యింది.

14. మహిళలకు మాత్రమే ఆహారం ఎలా ఉడికించాలో తెలుసు అనుకున్న రోజులో మొగవాళ్ళు కూడా నేర్చుకుంటే బాగుంటుంది అనే భావం కల్గింది

15. మీడియా అబద్ధాలు లో అబద్దాలు మరియు అర్ధంలేని న్యూస్ లు కూడా ఉంటావి అనేది అన్ని చానల్ చూసిన తరువాత తెల్సింది....

16. నటులు వినోదం మాత్రమే మరియు జీవితంలో నిజమైన హీరోలు కాదు....అనేది సత్యం...

17. భారతీయ మహిళ కారణంగా ఇంటి ఆలయం ఎలా ఉండాలి అనేది పరాయి దేశం నేర్చుకునేతట్టు నిర్మించబడింది....

18. డబ్బుకు విలువ లేదు ఎందుకంటే ఈ రోజు, మీరు పులుసు తో అన్నం తిని కూడా బత్కొచ్చు అనేది నేర్పింది ..

19. భారతీయ ధనికులు లో ఒక కులము డబ్బు లేని వాడిది ఇంకో కులము గ్రామములో ప్రజలు మానవత్వంతో నిండిన మనసు ఉన్న ప్రజలు ఉన్నారు....

20. భారతీయుడు మాత్రమే క్లిష్టమైన సమయాన్ని సరిగ్గా నిర్వహించగలడు.
ఆలోచించి అందరు తెలుసుకోండి

మీ శ్రేయోభిలాషి
🙏🙏🙏🙏🙏
Source:Whatsapp group

రేపు సంకటహర చతుర్థి ‬పూజ వ్రత విధానం మరియు సమగ్ర వివరణ

రేపు సంకటహర చతుర్థి ‬పూజ వ్రత విధానం మరియు సమగ్ర వివరణ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు. మొదటిది వరదచతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి / సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరదచతుర్థి ని వినాయక వ్రతం గా వినాయక చవితి రోజున ఆచరించెదరు

సంకటములను తొలించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు.

ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి (Angarika Chaturthi) నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా, చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు(సూర్యాస్తమయ సమయంలో) చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి.

☘సంకటహర చతుర్థి ‬ వ్రత పూజా విధానం☘

సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి

ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.

వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి.

అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని
పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి.

మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు

ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను.

ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి

తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి.
శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయిన్చుకోనవచ్చును.
సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కడపరాదు.
సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి.
నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి.

☘సంకట హర చతుర్ధి వ్రత కథ:☘

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి (వినాయకుని గొప్ప భక్తుడు) అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు.

అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు… ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్ధి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ.. ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా? అని!! కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్ర్తీ మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్ర్తీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, ‘నిన్నంతా ఈ స్ర్తీ ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది. రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది’ అని చెప్పాడు.

అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి గాని స్వనంద లోకానికి గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు. గణేషుని దూతని అపుడు సైనికు లు ఎంతో బ్రతిమాలారు. ఆ స్ర్తీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు. ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్పో టనం కలిగించింది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పచ్చు.

ఈ కథ సంకష్ట హర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన! ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశిస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు.
గణపతి ప్రార్ధన

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే!!

☘గణనాయకాష్టకం☘

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతమ్
బాలేందుశకలం మౌళీ, వందేహం గణ నాయకమ్

చిత్రరత్నవిచిత్రాంగం, చిత్రమాలా విభూషితమ్
కామరూపధరం దేవం, వందేహం గణనాయకమ్

గజవక్త్రం సురశ్రేష్ఠం, కర్ణచామర భూషితమ్
పాశాంకుశధరం దేవం వందేహం గణ నాయకమ్

మూషికోత్తమ మారుహ్య దేవాసురమహాహవే
యోద్ధుకామం మహావీరం వందేహం గణ నాయకమ్

యక్షకిన్నెర గంధర్వ, సిద్ధ విద్యాధరైస్సదా
స్తూయమానం మహాబాహుం వందేహం గణ నాయకమ్

అంబికాహృదయానందం, మాతృభి: పరివేష్టితమ్
భక్తిప్రియం మదోన్మత్తం, వందేహం గణ నాయకమ్

సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్నవివర్జితమ్
సర్వసిద్ధి ప్రదాతారం, వందేహం గణ నాయకమ్

గణాష్టకమిదం పుణ్యం, యః పఠేత్ సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్

ఇతి శ్రీ గణనాయకాష్టకం

☘సంకటహర గణపతి స్తోత్రం☘

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యమాయు: కామార్ధ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్ధకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తధాష్టకం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననమ్
ద్వాదశైతావి నామాని త్రిసంధ్యం యఃపఠేన్నిత్యం
నచవిఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో
విద్యార్దీ లభతే విద్యాం ధనార్దీ లభతే ధనం
పుత్రార్దీ లభతే పుత్రాన్ మోక్షార్ధీ లభతే గతిమ్
జపేత్ గణపతిస్తోత్రం చతుర్మాసై: ఫలం లభత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయః సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః


☘విఘ్నేశ్వర నమస్కార స్తోత్రం☘


జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో
జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో

మూషిక వాహన! నమోనమో మునిజనవందిత! నమో నమో
మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో

విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో
విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!

గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో
అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!

నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో
నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో*

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?

ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి ? ఏ ముగ్గును ఎక్కడ, ఎప్పుడు వేయాలి ?
మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి?

ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి.

ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు. పండుగల సమయంలో ఈ విధంగా ఖచ్చితంగా వేయాలి. ఏ దేవతపూజ చేస్తున్నా దైవాన్ని ఉంచే పీట మీద మధ్యలో చిన్న ముగ్గు వేసినా, నాలుగు వైపులా రెండేసి గీతలను తప్పక గీయాలి.

నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో వేసిన ముగ్గు భూత, ప్రేత, పిశాచాలను ఆ దరిదాపులకు రాకుండా చూస్తుంది. అంతేకాదు, మనం వేసే పద్మాలు, చుక్కల ముగ్గులలో కూడా మనకు తెలియని అనేక కోణాలు దాగి ఉన్నాయి. అవి కేవలం గీతలే కాదు, యంత్రాలు కూడా. యంత్ర,తంత్ర శాస్త్ర రహస్యాలతో కూడి ఉండడం వలన మనకు హాని కలిగించే చెడ్డశక్తులను దరిచేరనీయవు. అందుకే ఏ ముగ్గునైనా తొక్కకూడదు.

తులసి మొక్క దగ్గర అష్టదళపద్మం వేసి దీపారాధాన చేయాలి. యజ్ఞయాగాదులలో యజ్ఞగుండం మీద నాలుగు గీతలతో కూడిన ముగ్గులేయాలి. దైవకార్యలలో కూడా నాలుగు గీతలతో కూడిన ముగ్గులు వేయాలి.

నూతన వధూవరులు తొలిసారి భోజనం చేసే సమయంలో వారి చుట్టుప్రక్కల లతలు, పుష్పాలు, తీగలతో కూడిన ముగ్గులు వేయాలి.

దేవతా రూపాలను, ఓం, స్వస్తిక్, శ్రీ గుర్తులను పోలిన ముగ్గులు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని తొక్కకూడదు.

ఏ స్త్రీ అయితే దేవాలయంలోనూ, అమ్మవరు, శ్రీ మహావిష్ణు ముందు నిత్యం ముగ్గులు వేస్తుందో, ఆ స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం రాదని, సుమంగళిగానే మరణిస్తుందని దేవి భాగవతం, బ్రహ్మాండపురాణం చెబుతున్నాయి.

పండుగ వచ్చిందా కదా అని, నడవడానికి చోటు లేకుండా వాకిలంతా ముగ్గులు పెట్టకూడదు.

ముగ్గులు రోజు వేయలేక పేంట్ పెట్టస్తాం. దాన్ని ముగ్గుగా శాస్త్రం అంగీకరించదు. ఏ రోజుకారోజు బియ్యపుపిండితో ముగ్గు పెట్టాలి.

నిత్యం ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో ముగ్గు వేయాలి. ముగ్గు పాజిటివ్ / దైవ శక్తులను ఇంట్లోకి ఆకర్షిస్తుంది.

ముగ్గులు ఒకప్పుడు సూచకాలుగా పనిచేసేవి. పూర్వం రోజూ సాధువులు, సన్యాసులు, బ్రహ్మచారులు ఇల్లిల్లూ తిరిగి బిక్ష అడిగేవారు. ఏ ఇంటి ముందైనా ముగ్గు లేదంటే ఆ ఇంటికి వేళ్ళేవారు కాదు. వారే కాదు అడ్డుక్కునేవారు కూడా ముగ్గు లేని ఇళ్ళకు వెళ్ళి అడ్డుక్కునే వారు కాదు. ముగ్గు లేదంటే అక్కడ అశుభం జరిగిందని గుర్తు. అందుకే మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేసే రోజున ఉదయం ఇంటిముందు ముగ్గు వేయరు. శ్రాద్ధకర్మ పూర్తైన వెంటనే, అది మధ్యాహ్నమైనా ముగ్గు వేస్తారు.

ముగ్గులు వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు దాగి ఉన్నాయి. మన ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి.

ఒక"అన్న"మయ్య కథ...

🌹వాస్తవ కథ🌹

ఒక"అన్న"మయ్య కథ...

ఆయనది యాయావార వృత్తి. యాయావారం అంటే ఈ రోజు భాషలో చెప్పాలంటే అడుక్కోవడం.

ఇల్లిల్లూ తిరిగి అడుక్కునేవాడు. తాను తినేందుకు కాదు. ఇతరు లకు పెట్టేందుకు.

ఇతరులెవరు? ఇతరులంటే భక్తులు. ఎక్కడెక్కడినుంచో రామచంద్రస్వామిని చూసేందుకు వచ్చే భక్తులు.

ఆ రోజుల్లో భద్రాద్రి రామయ్యను చూడటమంటే మాటలా?

బస్సులు, కార్లు, రైళ్లు లేని రోజులవి.అశ్వారావుపేట అడవులనో, పాల్వంచ అడవులనో దాటుకుని గోదారి అవతలి ఒడ్డుకు చేరాలి. అక్కడ నుంచి పడవలో విశాల గోదావరిని దాటిరావాలి.

అందుకే భద్రాద్రికి వచ్చే సరికి భక్తులు అలసిపోతారు. సొలసిపోతారు. ఆకలితో అలమటిస్తూంటారు.

ఒడ్డున దిగి స్నానం చేయగానే ఆవిరులు చిమ్మే వేడివేడి అన్నం, కమ్మనిపప్పు, కాసింత మజ్జిగ, అయితే గియితే ఒక అవకాయ బద్ద.... అది దొరికితే చాలు. ఆత్మారాముడు శాంతిస్తాడు. అప్పుడు అసలు రాముడిని ఆత్మశాంతితోచూడొచ్చు.

సరిగ్గా ఒడ్డుకి దగ్గరలో ఆయన అన్నం వండి పెట్టేవాడు. క్రమేపీ భక్త కోటికి ఈ సంగతి తెలిసింది. వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఆయన కూడా వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టేవాడు. ఈ రోజుల ఉడిపి హోటల్ కాదది. అంతా ఉచితమే.

ఒంటిపై ఒక చిన్న కౌపీనం తప్ప ఆయనకు ఇంకో ఆస్తి లేదు. రోజూ యాచించడం, తెచ్చింది వచ్చినవారికి వండి పెట్టడం. ఇదే అతని రామ సేవ. ఏదైనా రాముడే చూసుకుంటాడన్న ధీమా ఒక్కటే ఆయన సంపద.
నిజంగా అంతా రాముడే చూసుకున్నాడు కూడా.

ఒక సారి వంటపాత్రలు చోరీ అయ్యాయి. వంట వాళ్లూ పారిపోయారు. సరిగ్గా భక్తులు వచ్చే సమయం. ఏం చేయాలో పాలుపోలేదు ఆయనకి. రామా లక్ష్మణా మీరే దిక్కు అనుకున్నాడు.

అంతలో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. చేతుల్లో పెద్ద గుండిగలు (అన్నం వండే పెద్ద పాత్రలు). చకచకా అన్నం, పప్పూ వండేశారు. అందరికీ వడ్డించేశారు.

ఇంత రుచి ఇంతకుముందెన్నడూ చూడలేదు అన్నారు భక్తులు.

ఆయన వంటకుర్రాళ్లను చూసే సరికి వాళ్లు మాయమైపోయారు. కనుచూపుమేరలో కనిపించలేదు. ఎంత వెతికినా దొరకలేదు. గుండిగలు మాత్రం మిగిలిపోయాయి.

ఆయనకిఅర్థమైపోయింది. వచ్చినవాళ్లు అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు. అన్నం అంత రుచిగా ఎందుకుందో ఆయనకి తెలిసిపోయింది.

శ్రీరామ నీనామమేమి రుచిరా అనుకున్నాడు ఆయన.

భక్తులుపెరిగిపోతున్నారు. యాచించింది సరిపోవడం లేదు. రామా నీవే దిక్కు అనుకున్నాడు.

హఠాత్తుగా ఒక వాహనం వచ్చి సత్రం ముందు ఆగింది. అందులోనుంచి ఒక ధనవంతుడు దిగాడు.

అయ్యా... నాకు రాత్రి కల వచ్చింది. ఆ కలలో చనిపోయిన నా తల్లి కనిపించింది. మీ సత్రానికి నా భూములన్నిటినీ ఇచ్చేయమని చెప్పింది. నా నాలుగు వేల ఎకరాలు ఇదిగో మీకు రాసిచ్చేస్తున్నాను అని పత్రాలు ఇచ్చి వెళ్లిపోయాడు.

ఆయన ఒక పెద్ద వకీలు. హనుమకొండ ఆయన ఊరు. తుంగతుర్తి నరసింహారావు ఆయన పేరు.
ఇక ఆ సత్రానికి ఏలోటూ లేదు. నాలుగువేల ఎకరాలూ ఆ సత్రానివే.

సత్రం నడిపిస్తున్న ఆయన కొంతకాలానికి వృద్ధుడైపోయాడు.అన్నం పెట్టీ పెట్టీ పున్నెం గడించాడు. అంతా రాముడికే వదిలేశాడు. నాలుగువేల ఎకరాల్లో అంగుళం కూడా ముట్టుకోలేదు. దేవుడే ఇచ్చిన గోచీపాతను కూడా వదిలేసి ఒక రోజు ఆయన ఆ దేవుడి దగ్గరకే వెళ్లిపోయాడు.

ఇప్పుడు భద్రాచలానికి రోడ్డు వచ్చింది. కొత్తగూడెం దాకా రైలూ వచ్చింది. ఇప్పుడు క్షణాల్లో భద్రాచలంలో వాలిపోవచ్చు. దేవుడిని చూసి వెళ్లిపోవచ్చు. ఆకలేస్తే అన్నం పెడతా అని పాడే హోటళ్లు వచ్చాయి . ఇప్పుడు గుడికి దారి కూడా మారిపోయింది. ఎవరూ పడవ దాటాల్సిన అవసరం లేదు. సత్రాన్ని కూడా అందరూ మరిచిపోయారు. సత్రం పాడుపడిపోయింది. గబ్బిలాల్లాంటి వాళ్లు వచ్చి చేరారు. నాలుగు వేల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా మిగల్లేదు. ఆ సత్రం పేరు చెబితే కూడా అదేమిటి అని అడిగేలా అయిపోయింది.

చాలా ఏళ్లయిన తరువాత ఈ మధ్యే కొన్ని సంవత్సరాల క్రితం ఆ సత్రాన్ని శృంగేరీ పీఠం తన అధీనంలోకి తీసుకుంది. శ్రీచక్ర సిమెంటు వారు దీనికి కావలసిన వనరులుసమకూరుస్తున్నారు. ఒక వేద పాఠశాల నడుస్తోంది. వేదవిద్యార్థులకు అక్కడ అన్నం దొరుకుతుంది. అంటే అన్నదాన యజ్ఞం మళ్లీ మొదలైందన్న మాట. ఆ సత్రం ముందు ఈ అన్నదాన యజ్ఞాన్ని ప్రారంభించిన వ్యక్తి విగ్రహం ఉంటుంది.

ఇంతకీ ఆయన పేరు చెప్పనే లేదు కదూ.

ఆయన పేరు పమిడిఘంటం వెంకటరమణ దాసు. 1850 లో పుట్టిన ఈయన ప్రకాశం జిల్లా నుంచి భద్రాచలం వచ్చాడు. ఇక్కడే జీవితమంతా గడిపేశాడు. ఆ సత్రం పేరు అంబ సత్రం.

తెలుగువాడు ఎప్పుడో ఒకప్పుడు భద్రాచలం చూడకపోడు. ఈ సారి రాముడిని, రామదాసును దర్శించుకున్నప్పుడు ఈ రమణదాసుని మరిచి పోకండి. కాస్త ఒపిగ్గా అడిగి అయినా సరే వెతుక్కుంటూ వెళ్లి అంబసత్రాన్ని చూడండి. ఎందుకంటే అక్కడ రెండు గుండిగలున్నాయి.

ఒకటి రామ గుండిగ
ఒకటి లక్ష్మణ గుండిగ.

(భూముల్నయితే దోచేసుకున్నారు కానీ గుండిగల్ని దోచుకునే ధైర్యం ఎవడూ చేయలేదు మరి)

జై శ్రీ రామ్🙏🙏

శ్రీ ధర్మశాస్త సేవాసమితి🐆విజయవాడ🏹7799797799

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు?

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు?

తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు ఆంజనీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. మనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు! శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

మైరావణ వృత్తాంతం: రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.

హనుమంతుని పయనం: రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.

మైరావణుని సంహారం: మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు.
పంచముఖాల ప్రాశస్త్యం: అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది.

స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరూ తయారుచేసినది కాదు.



🌹భద్రాచల శ్రీరామ మహిమ🕉️




☸భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవరూ తయారుచేసినది కాదు.
☸

మరి ఇది ఎలా వచ్చిందంటే..?

భక్తరామదాసు తాను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం పైభాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప లోహ శిల్పులను తెప్పించి వారిచేత సుదర్శన చక్రాన్ని తయార చేయిస్తున్నాడు.


కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో,లేదా సరిగా రాకపోవడమో జరుగుతుంది.


కలత చెందిన రామదాసు కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై "భక్తా..!! సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దాన్ని సామాన్య మానవులు నిర్మించలేరు.అందుకే నేను నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అది గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు" అని చెప్పాడు.


మరుసటి రోజు గజ ఈతగాళ్ళతో రామదాసు వెతికించాడు.కానీ కనిపించలేదు.


మళ్లీ రాముడు కలలో కనిపించి "అది నామీద అమితమైన భక్తిని పెంచుుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది" అని చెప్పడంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది.


☸ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది.☸

ఆచరణ

ఆచరణ

🍁🍁🍁🍁

దానం చేసే గుణమూ,ప్రియముగా మాట్లాడడమూ,ధీరత్వమూ,ఉచితానుచితాల జ్ఞానమూ అభ్యాసం వల్ల రావు. అవి సహజ గుణాలయి ఉండాలి.

తాను చేరదీసి ఆశ్రయమిచ్చిన కర్ణుడే దానకర్ణుడని పేరు పొందడం చూసి ఆ మాత్రం దానం నేను చేయలేనా అని కర్ణుడి దాతృత్వంతో పోటీ పడి అడిగినవారికి లేదనకుండా దానం చేస్తానని ప్రకటించేడు దుర్యోధనుడు.

ఓ రోజు ఓ మునీశ్వరుడు దుర్యోధనుడి వద్దకు వచ్చి " రాజా! నేను ఓ యజ్ఞం చేయ తలపెట్టేను.దానికి చాలా కట్టెలు అవసరం. ఇప్పించమని అడిగేడు." సరే! తమకు కావలసినన్ని కట్టెలు తీసుకుని వెళ్ళండి." అన్నాడు దుర్యోధనుడు.అప్పుడా మునీశ్వరుడు " రాజా! ఇప్పుడు కాదు. యజ్ఞం ప్రారంభించేముందు వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు. "సరే" అన్నాడు దుర్యోధనుడు.

కాలగమనంలో ఋతువులు మారేయి.వర్షఋతువు వచ్చింది.మునీశ్వరుడు వచ్చి తనకిస్తానన్న కట్టెలు ఇప్పించమని అడిగేడు." స్వామీ! నేను ఇస్తానన్నప్పుడు తమరు తీసుకు వెళ్ళలేదు. మరి ఇప్పుడేమో వర్షాకాలం. ఈ సమయంలో మీకు కావలసినన్ని ఎండు కట్టెలు లభించడం కష్టం కదా! మరోసారి వచ్చి తీసుకు వెళ్ళండి." అన్నాడు దుర్యోధనుడు.

" సరే!" అని ఆ మునీశ్వరుడు కర్ణుడి వద్దకు వెళ్లి తన అవసరాన్ని తెలిపేడు. వెంటనే కర్ణుడు దుర్యోధనుడు తనకిచ్చిన భవంతిని కూలగొట్టించి అందులోని కలపను తీసుకోమన్నాడు. కర్ణుడి దాతృత్వం తెలుసుకుని దుర్యోధనుడు సిగ్గుపడి తన దాన ప్రతిజ్ఞను ఉపసంహరించుకున్నాడు.

తనకు అక్కర్లేని దానిని దానం చేయడం అధమం.తనకున్నదానిలో దానం చేయడం మధ్యమం.దానం చేసేస్తే తనకు లేకపోయినా సరే చేసే దానం ఉత్తమం.ఈ గుణమే కర్ణుడికి దానకర్ణుడిగా పేరు తెచ్చింది.ఇలాంటి ఉత్తమ గుణమే సక్తుప్రస్థుడి ఆతిథ్యంలో చూసిన ఓ ఉడత ధర్మరాజు చేసిన రాజసూయ యాగ ఆతిథ్యంలో చూడలేకపోయింది.

అలాగే ప్రియ వక్తృత్వం అంటే ప్రియంగా మాట్లాడడం కూడా సహజ గుణమే.ఓ వరమే.మాట్లాడడం కూడా ఓ కళే.నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందంటారు. అది మన వాక్కు ప్రభావం అన్న మాట.

ధీరత్వం కూడా జన్మతః లభించే గుణమే.ఉత్తరకుమారుడు ఎని ప్రగల్భాలు పలికినా,ఎంత ధీరుడనని చెప్పుకున్నా అభిమన్యుడిలా,అర్జునుడిలా కాలేకపోయేడు.ఇంక ఉచితజ్ఞత ఇది చాలా క్లిష్టమైనది.ధర్మసంకటమైనది.ఒక విషయంలో ఉచితమైనది మరొక విషయంలో అనుచితం కావచ్చు.అది సమయం,సందర్భాలనుబట్టి ఉంటుంది.కప్పను మ్రింగబోతున్న పాము బారినుండి కప్పను కాపాడడం ఉచితమా?పాము ఆహారం చెడగొట్టడం ఎందుకని ఊరుకుండడం ఉచితమా? కప్ప పాముకు బలి అవుతుండడం చూస్తూ ఊరుకోవడమూ దోషమే.పాము ఆహారం చెడగొట్టడడమూ దోషమే. అయితే ఆహారమా?ప్రాణమా? ఏది ముఖ్యం?అనేది ఇక్కడ చర్చనీయాశం.

ఇలాంటి ఉచితానుచితాల జ్ఞానం ధర్మ సూక్ష్మాల నెరిగిన మహానుభావులకే ఉంటుంది.మహా కావ్యమైన రామాయణమూ,గొప్ప ఇతిహాసమైన భారతమూ,ఘన పురాణమైన భాగవతమూ వాటి గాథలూ,కథలూ,ఘట్టాలలోని పాత్రల ద్వారా మనకిలాంటి ధర్మ సూక్ష్మాలని తెలుపుతాయి.వాటిని కేవలం కీర్తించడం,పఠించడం,పారాయణ చేయడం వరకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టినప్పుడే మన జన్మ తరిస్తుంది.చరితార్థమవుతుంది.ధన్యమవుతుంది.


🍁🍁🍁🍁

Friday, April 10, 2020

హిందూ ధర్మం మరియు ఆచారాల యొక్క గొప్పతనం

హిందూ ధర్మం మరియు ఆచారాల యొక్క గొప్పతనం ఇప్పటికైనా ప్రపంచదేశాలకు మరియు దానిని అవహేళన చేసే వాళ్లకు తెలిసి వస్తుంది. నాకు తెలిసిన కొన్ని ప్రశ్నలు సమాధానాలు...
(హిందూ ధర్మం లో కూడా కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి నేను కాదనను)

Q1. మృతదేహాన్ని ఎందుకు కాలుస్తారు?
Ans: మృత దేహం లో కొన్ని వైరస్ లు బ్యాక్టీరియాలు ఉంటాయి. కాల్చేస్తే దాహనం అయిపోతాయి. పూడ్చి వేస్తే ఆ వైరస్ లు మట్టిలో కలిసి మళ్లీ మానవాళి మీద లేదా జంతువుల మీద లేదా మొక్కల మీద దాడి చేయవచ్చు. ఇప్పుడు కరోనా వైరస్ సోకి చనిపోయిన వారిని కూడా ఇలాగే కాల్చేస్తున్నారు...

Q2. కొత్త వ్యక్తులు కానీ ఇంట్లోని వారు కానీ బయటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కాళ్లు మొహం చేతులు కడుక్కొని ఇంటిలోపలికి వస్తారు ఎందుకు?
Ans: మన శరీరం మీద దుమ్ము ధూళి కొన్ని ప్రాణాంతక వైరస్ లు చేరి ఉంటాయి. అలాగే ఇంటిలోపలికి వస్తే ఇంట్లో వారికి కూడా అవి అంటుకుంటాయి Eg: కరోనా వైరస్

Q3. తుమ్మినప్పుడు కొంచెంసేపు ఆగుతారు ఎందుకు?
Ans: తుమ్మిన వ్యక్తికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే.. ఆ వ్యక్తి శరీరంలో నుంచి కొన్ని వైరస్ లు లేదా బ్యాక్టీరియాలు బయటకు వచ్చి గాల్లో ఉంటాయి మనం వాటి గుండా వెళ్తే అవి మన శరీరం లోకి ప్రవేశిస్తాయి.. eg. కరోనా వైరస్ లాంటివి.

Q4. రెండు చేతులు జోడించి నమస్కారం ఎందుకు చేస్తారు?
Ans : ఇదేం పిచ్చి ప్రశ్న తెలుసు కదా!?

Q5. హిందువులు చాలా వరకు శాఖాహారం తింటారు. ఎందుకు?
(ఇప్పుడు చాలామంది మాంసాహారం తింటున్నారు)
Ans: ఎక్కువ వైరస్లు బ్యాక్టీరియాలు జంతువులను ఆవహించి ఉంటాయి. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలు ఆకుకూరలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

Q6. హిందువులు యోగా ధ్యానం చేస్తారు ఎందుకు?
Ans: యోగా చేస్తే, శరీర ధారుఢ్యం ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ధ్యానం చేస్తే కాన్సెంట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. మెదడు పీస్ ఫుల్ గా తయారవుతుంది.

Q7. భోజనం చేసేటప్పుడు ప్లేట్ చుట్టూ నీళ్లు చల్లుతారు ఎందుకు?
Ans: ప్లేట్ చుట్టూ ఉన్న dust ప్లేట్లోకి రాకుండా ఉంటుంది.

Q8. ఇంతకుముందు బ్రాహ్మణులు వైశ్యులు లాంటి వారు ఎవ్వరినీ ఇంటి లోపలికి రానిచ్చేవారు కాదు దీనినే అంటరానితనం అన్నారు. ఎందుకు?
Ans : శుభ్రత పరిశుభ్రత. మడి.

Q9. ఆవుపేడతో కల్లాపి చల్లి ఇంటిని అలుకుతారు. పసుపు గుమ్మానికి రాస్తారు. ఇంటి ముందు తులసి చెట్టును ఉంచుతారు. ఇంటి పెరటిలో వేప చెట్టును పెంచుతారు. ఎందుకు?
Ans : ఇవన్నీ యాంటీబయాటిక్ గా పనిచేస్తాయి.

Q10. వారానికి ఒకరోజు దేవుని పేరు చెప్పి ఉపవాసం ఉంటారు అంటే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినరు. ఎందుకు?
Ans: మన శరీరంలో ఆరు రోజులు తిన్న ఆహారం ఏమైనా అరగకుండా ఉంటే ఏడవ రోజు అది పూర్తిగా అరిగిపోతుంది. కడుపు ఖాళీ అవుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు డాక్టర్లు కూడా ఇదే చెబుతున్నారు.

Q11. మట్టి పాత్రలు ఆ తర్వాత రాగి పాత్రలు ఉపయోగించేవారు ఎందుకు?
Ans : మట్టిలో ఉన్న కొన్ని ఖనిజాలు సూక్ష్మ రూపంలో మన శరీరంలోకి ప్రవేశించుతాయి. అవి మన శరీరానికి ఎంతో అవసరం. రాగి పాత్రలో నీరు తాగితే డైజషన్ బాగా అవుతుంది. కరోనా వైరస్ కూడా రాగి పాత్ర మీద నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం బ్రతకదు అని ఈమధ్యనే సైంటిఫిక్ గా రుజువు అయినది.

Q12. గుమ్మానికి మామిడి ఆకులు వేపాకులు కడతారు ఎందుకు?
Ans: ఇంటి లోపలికి వచ్చే గాలి ఆ ఆకులను తాకి లోపలికి వస్తుంది అది ఆరోగ్యానికి చాలా మంచిది.

Q13. హిందువులు అరటి ఆకులో భోజనం ఎందుకు చేస్తారు?
Ans: అరిటాకును పచ్చిగా ఉన్నపుడే ఉపయోగిస్తారు.పచ్చి ఆకులో ఆహారం తింటే తొందరగా జీర్ణమవుతుంది. అరిటాకులు దొరికితే దాంట్లోనే అన్నం తినడం శ్రేయస్కరం. ఆకుపచ్చని అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి. శరీరానికి బలం చేకూరుతుంది. బాగా ఆకలివేస్తుంది. ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి వస్తుంది.

Q14. హిందువులు ఇంట్లో దీపం ఎందుకు వెలిగిస్తారు?
Ans : కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞానానికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.

Q15. పెళ్లి అయిన హిందూ మహిళలు కాలి వేలికి రింగ్స్ ఎందుకు ధరిస్తారు?
Ans: హిందూ మతంలో వివాహం అయిన మహిళల కాలికి తప్పనిసరిగా రింగ్స్ ఉంటాయి. ఇది కేవలం అలంకరణ కోసం కాదు. సాధారణంగా కాలి రింగ్ ను రెండవ కాలి వేలి మీద ధరిస్తారు. ఈ కాలి వేలి నరాలు గర్భాశయం మరియు గుండెకు నేరుగా కలుపుతుంది. రెండవ కాలి వేలికి రింగ్ ధరించటం వలన గర్భాశయం బలపడుతూ,ఋతు రక్త ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

Q16. నుదుటిపైన కుంకుమను ఎందుకు పెట్టుకుంటారు?
Ans: తిలకధారణ చేయటం అనేది ప్రతి ఇంట్లోనూ జరిగే సాధారణ పద్ధతి. నిజానికి నుదుటిపైన ఈ ప్రాంతంలో అజ్ఞా చక్ర ఉంటుందని చెబుతారు. ఈ విధంగా తిలకంను వర్తింపచేసినపుడు ఈ చక్రం స్వయంచాలకంగా యాక్టివేట్ అవుతుంది.ఇది శరీరం నుండి శక్తి నష్టంను నిరోధిస్తుంది. అలాగే ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

Q17. హిందువులు రావి చెట్టును ఎందుకు పూజిస్తారు?
Ans: రావి చెట్టు సాధారణంగా ఒక పనికిరాని చెట్టుగా పరిగణిస్తారు. దీనిలో ఉపయోగకరమైన పండ్లు లేదా శక్తివంతమైన కలప ఏమి ఉండదు. అయితే దీనిని చాలా మంది హిందువులు పూజిస్తారు. కానీ ఆసక్తికరంగా,రావి చెట్టు రాత్రి పూట ఆక్సిజన్ ఉత్పత్తి చేసే చెట్లలో ఒకటి.కాబట్టి, ఈ చెట్టును సురక్షితంగా ఉంచడానికి పవిత్రంగా గుర్తించబడుతుంది.

Q17. హిందూ అమ్మాయిలు పెళ్లప్పుడు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు?
Ans: చేతులకు గోరింటాకు పెట్టుకొనుట డెకరేషన్ కోసమే కాకుండా అది ఒక శక్తివంతమైన ఔషధ హెర్బ్. సాదారణంగా వివాహ సమయములో వధువు ఒత్తిడితో ఉంటుంది. గోరింటాకు శరీరమును చల్లబరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది. కాబట్టి చేతులకు కాళ్ళకు కూడా పెడతారు.

Q18. హిందువులు నేలపై కూర్చొని ఎందుకు భోజనం చేస్తారు?
Ans: మనం సాధారణంగా నేలపై సుఖాసనం యొక్క భంగిమలో కూర్చుని తింటూ ఉంటాము. ఈ భంగిమ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి,మనం సుఖాసనంలో కూర్చొని భోజనం చేస్తాము. అప్పుడు మనం తినే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

Q19. హిందువులు సూర్యున్ని ఎందుకు పూజిస్తారు? Ans: ఎందుకంటే ఉదయాన్నే వచ్చే సూర్యు కిరణములు చాలా మంచివి. శరీరంలో డి విటమిన్ తయారవడానికి దోహదపడుతాయి. తొలి ఉదయం నడవటం కూడా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Q20. ఆలయంలో గంటను ఎందుకు మ్రోగిస్తారు?
Ans : ఆలయం గంటలను కాడ్మియం,జింక్, సీసం,రాగి,నికెల్,క్రోమియం,మాంగనీస్ వంటి వివిధ లోహాల మిశ్రంమతో తయారుచేస్తారు. ఒక దేవాలయ గంటను సృష్టించడానికి ప్రతి లోహంను ఒక నిష్పత్తిలో కలపటానికి దాని వెనక ఒక శాస్త్రం ఉంది. ఈ లోహాలను ప్రతి ఒక్కటి గంట మ్రోగే మార్గంలో కలుపుతారు. ప్రతి లోహం ఉత్పత్తి చేసే విభిన్న శబ్దం మీ ఎడమ మరియు కుడి మెదడు ఐక్యతను సృష్టిస్తుంది. అందువలన మీరు గంట మోగించినప్పుడు ఏడు సెకన్ల పాటు చురుకైన మరియు దీర్ఘకాల ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. గంట నుండి వచ్చే ధ్వని యొక్క ప్రతిధ్వని శరీరం యొక్క మీ ఏడు హీలింగ్ కేంద్రాలు లేదా చక్రాలను తాకుతుంది. ఈ విధంగా గంట యొక్క ద్వని,మీ మెదడు కొన్ని సెకన్ల పాటు బ్లాంక్ అయ్యి మళ్లీ మీరు ట్రాన్స్ దశకు చేరుకుంటారు. ట్రాన్స్ లో ఉన్న ఈ స్థితిలో,మీ మెదడు గ్రాహక మరియు అవగాహన శక్తి బాగా పెరుగుతుంది.

హిందూ అనేది ఒక జీవన విధానం ఇది మతం కాదు.
చాలామంది ఈ జీవన విధానం నుంచి పాశ్చాత్య జీవన విధానంలో కి వెళ్తున్నారు. కానీ అతి త్వరలో హిందూ జీవన విధానానికి ఉన్న గొప్పతనం ప్రపంచ దేశాలు గ్రహిస్తాయి. ఇప్పటికే కొన్ని గ్రహించాయి కూడా..

Whats App నందు భక్తి సమాచారం పొందుటకు 9490221020 నెంబర్ కు వేదమయీ అని మీ WhatsApp నుండి Message చేయగలరు.

మహాభారతం యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే బర్బరీకుడు తనను తానే బలిదానం ఎందుకు చేసుకున్నాడు?

మహాభారతంలో మహా మహులను అందరినీ ఒక్క నిముషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిముషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ: ఎన్ని రకాల కేరక్టర్లు, ఎన్ని రకాల తత్వాలు. మహాభారతం తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకూ మహాభారతమే. మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన కేరక్టర్ ఒకటి ఉంది. తన పేరు బర్బరీకుడు. బహుశా ప్రస్తావనపూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో. కానీ తన గురించి ఇంకా తెలుసుకోవాలి. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా. తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగులబడ్డాక, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఓ రాక్షస యువతిని పెళ్లిచేసుకుంటాడు భీముడు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఓ యాదవ రాజు మురు బిడ్డ మౌర్విని (అహిలావతి) పెళ్లాడతాడు. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యామ్జీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుడిని. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకెళ్లాయి. తను చిన్నప్పటి నుంచే తల్లి దగ్గర యుద్ధవిద్యలు నేర్చుకుంటాడు. దేవీ ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాల్నే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు, కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిశాక, భారత చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకూ చేరుతున్న వేళ, బర్బరీకుడు ఆ యుద్దాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను. ఓడిపోయేవారిని గెలిపిస్తాను అని. తర్వాత తన ధనుస్సు, నీలి గుర్రం, తన మూడు బాణాలు తీసుకుని బయల్దేరతాడు. యుద్ధం ప్రారంభం కావటానికి ముందు ప్రతి యోధుడినీ శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు? ఇదీ ప్రశ్న. 20 రోజులు చాలునని భీష్ముడు అంటే, 25 రోజులు కావాలని ద్రోణుడు చెబుతాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెబుతారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుడిని గమనిస్తాడు శ్రీకృష్ణుడు. ఒంటరిగా తనను ఓ బ్రాహ్మణవేషంలో సమీపించి శ్రీకృష్ణుడు అందరినీ అడుగుతున్నాడు కదా, నీకూ ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా? అని అడుగుతాడు. నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్కక్షణం దిగ్భాంతికి గురై, అదెలా సాధ్యం అనడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తి వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని, వాళ్లందరినీ గుర్తించి పెడుతుంది. (టార్గెట్స్ ను ఐడెంటిఫై చేస్తుంది. రెండో బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. మూడో బాణం వేస్తే రక్షించాల్సిన వాళ్లను విడిచిపెట్టి, మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్నీ ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్లీ నా దగ్గరకు వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను, నేనే కాదు, ఈ సృష్టిలో ఎవరూ దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏదీ, ఆ రావిచెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలేముందు దేవీ ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్లు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు వెళ్తుంది. ఇదేమిటి అనడుగుతాడు అమాయకంగా శ్రీకృష్ణుడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది. అందుకే అదక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి. లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్లి మరీ ఆ ఆకును గుర్తిస్తుంది అది అంటాడు బర్బరీకుడు. తప్పనిసరై పాదం తీసేస్తాడు. మరో బాణం వెళ్లి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది. (రక్షింపబడాల్సినవి). తరువాత బాణం ఆ ఆకులన్నింటినీ రాల్చేసి, ఒక్క దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరినీ దాచలేమనీ, కాపాడలేమనీ అర్థమవుతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పుందని, గందరగోళం ఉందనీ గమనిస్తాడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవపక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేననీ గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనమడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్యదృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు. ఏమోయీ, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా? అని అడుగుతాడు. నేను ఘటోత్కచుడి కుమారుడిని. యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చాను. పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన పదకొండు అక్షౌహిణులు. అంటే పాండవులే బలహీనులు కదా. అవును, అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు. కౌరవులు బలహీనులు అవుతారు కదా. అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దాని వల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులు అవుతారు కదా. మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగానే మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటూ స్థిరంగా నిలబడలేనని అటూఇటూ మారితే చివరకు ఇరుపక్షాలూ సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అనీ. విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ ఎవరు మహాశయా మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకు ఓ వాగ్దానం చేయి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపిస్తాడు. తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా. ఇంత భారీ జనహనన యుద్దాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ. నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలను తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలి ఇవ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా. పైగా వాళ్లంతా ప్రాణాలకు తెగించి వచ్చినవాళ్లు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. బర్బరీకా నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి భూమి మీద అధర్మం పెరిగిపోయింది నువ్వే కాపాడాలి శ్రీమహావిష్ణు అంటూ బ్రహ్మదేవుడిని వెంటేసుకుని ఓసారి దేవుళ్లంతా నా దగ్గరకు వచ్చారు. దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా అని ఒకింత పొగరుగా మాట్లాడావు. దానికి నోచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి. అంతేకాదు నీ శాపవిమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్దాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలను ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తనే నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలను ఓ గుట్టపైకి తీసుకెళ్లి, మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయ గర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు. భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు. వత్సా! ఈ మొత్తం యుద్దంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వు ఒక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావో? స్వామీ! ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని చూశాను. మహాకాళి వేల నాలుకలతో పాపులను బలితీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ద కారకులు, యుద్ధకర్తలు, మిగతావాళ్లంతా కేవలం పాత్రధారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్ష రూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్లిపోతాడు. ఇదీ మహాభారతంలోని బర్బరీకుడి కథ. 🙏🙏🙏

దైవాన్ని కోరిక ఎలా కోరాలి?

దైవాన్ని కోరిక ఎలా కోరాలి

1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.

2. నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.

3. నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..

4. నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.

5. నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..

6. భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...

7. కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..

8. చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.

మామిడి ఆకులతోనే తోరణాలు ఎందుకు కట్టాలి?

మామిడి ఆకులతోనే తోరణాలు ఎందుకు కట్టాలి

హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకస్థానముంది. ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని వుంటుంది. ముఖ్యంగా.. పండగలు, పబ్బాలతో పాటు శుభకార్యాలు జరిగినపుడు ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు
హిందూ సంప్రదాయంలో మామిడి ఆకులకు ప్రత్యేకస్థానముంది. ఇంట్లో ఓ శుభకార్యం జరిగినా మామిడి ఆకులతో పని వుంటుంది. ముఖ్యంగా.. పండగలు, పబ్బాలతో పాటు శుభకార్యాలు జరిగినపుడు ఇంటి ద్వారాలకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే, ఇంటి ద్వారాలకు కేవలం మామిడి ఆకులతోనే ఎందుకు తోరణాలు కడతారో చాలా మందికి తెలియదు. ఆ కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం.

1. సాధారణంగా మామిడి ఆకుల్లో ల‌క్ష్మీదేవి కొలువైవుంటుందని పెద్దలు చెపుతారు. అందుకే ఆ ఆకుల‌తో చేసిన తోరణాలు క‌డితే ఆ ఇంట్లోకి ధనం వ‌చ్చి చేరుతుంద‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయ‌ట‌.

2. ఇంటి ప్రధాన గుమ్మానికి, ఇంటి ఆవరణంలోని ద్వారానికి మామిడి ఆకుల తోర‌ణాలు క‌డితే ఆ ఇంట్లోని వాస్తు దోషం పోతుంద‌ట‌. అంటే ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రసారమవుతుందట. ఈ కారణంగా అన్నీ శుభాలే క‌లుగుతాయి.

3. మామిడి ఆకులు శుభానికి చిహ్నాలు. అందుకే వాటి తోర‌ణాల‌ను ఆల‌యాల్లో కూడా క‌డుతుంటారు. అలాంటిది ఆ తోర‌ణాలు గృహాల్లో కూడా క‌డితే అంతామంచే జ‌రుగుతుంద‌ని మ‌న పూర్వీకుల న‌మ్మ‌కం. పురాణాలు కూడా ఇదే విష‌యాన్ని చెబుతున్నాయి.

4. ఇంట్లో ఏవేని దుష్టశక్తులు ఉండివున్నట్టయితే ఆ శక్తులన్నీ వెళ్లిపోయి.. దేవ‌త‌లు అనుగ్ర‌హిస్తార‌ట‌. అలాగే, మామిడి ఆకులు ప్ర‌శాంత‌త‌కు చిహ్నాలు. మామిడి ఆకుల తోర‌ణాల‌ను చూస్తే ఎవ‌రికైనా మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ట‌.

5. ఇంట్లో ఉండే గాలి శుభ్ర‌మ‌వుతుంద‌ట‌. త‌ద్వారా చ‌క్క‌ని ఆరోగ్యం క‌లుగుతుంద‌ట‌. ఇంట్లో ఉండే ఆక్సిజ‌న్ శాతం పెరిగి స్వ‌చ్ఛమైన గాలి
మ‌న‌కు లభిస్తుంది.🙏

కర్మ ఫలం

♦కర్మ ఫలం♦

కర్మ ఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు.

👉🏼మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది..ఎందుకంటే..కర్మ బలీయమైనది.

♦రాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు.
కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు - మంత్రవేత్త రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు ఇంకోకవైపు నుంచి - దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.

♦తక్షకుడు కూడా బ్రహ్మణవేషధారియై, కశ్యపుని చూసి "మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం?" అని అడిగాడు.
"ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను" అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.

♦"అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో - బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు - తక్షకుడే స్వయంగా అయితేనో?" అన్నాడు,

♦"తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో - విషకీటక మంత్రమో అనుకుంటున్నావా?" అని ప్రశ్నించాడు కశ్యపుడు.

♦"అంతగొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని" అని నిజరూపం చూపించాడు తక్షకుడు.

♦అంతటా కశ్యపుడు, "సర్పరాజా! నీకిదే నా ప్రణుతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢ విశ్వాసం" ఆని అన్నాడా కశ్యపుడు.

♦అపుడా తక్షకుడు, "తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో - మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విష శక్తి చూడు!" అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.

♦కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు!" అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశినుంచే తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి
ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు.

♦చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహా వృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది.

♦వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని "మహామంత్ర ద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసిన నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో - లేదో! నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మ మూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలి ప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు.

♦ఇంతకూ తమకు కావలసింది...." అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా "ధనమయ్యా! ధనం" అన్నాడు నాలాంటి బీద భాస్కర బ్రాహ్మణుడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను" అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపేశాడు.

ఇంత వరకూ కథ బాగుంది.....ఇక్కడనే మనం అర్థం చేసుకోవాల్సినది చాలా వున్నది.*

♦మన తల వ్రాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు...
ఓక వేళ నాబోటి వాడు బయలుదేరినా వాడిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. అదే మనం చేసుకొన్న పాపం..కర్మఫలం...
పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికా భగవంతుడు కూడా....

♦ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి..... కౌశికుడు బయలుదేరినా, పరీక్షిత్తు యొక్క పాప కర్మ అడ్డు పడినది....ఏమిటి ఆ పాప కర్మ? ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. మహా సాధువులతో చెలగాడటం....కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.......

♦రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, కేవలం తన కర్మ చేత చనిపోయినాడు.

♦పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు....ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అంతే విధముగా గ్రహములు కూడా!! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది.

♦మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి....నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.....మన పాప కర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది...కర్మ బలీయమైనది....

♦గోవిందా....
నారాయణా....రామా....శివా....కాపాడు...కాపాడు...అని ప్రార్ధిస్తూ ఉంటాం.ప్రాణాపాయం లో వున్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు.....
ఓరేయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా, నీ భార్య చేసిందా, నీ బిడ్డలు చేసినారా, నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? మీ గురువుల అనుగ్రహం వున్నదా? నీకు పుణ్యం లేదు, నీకు ధారపోసిన పుణ్యం లేదు....మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేదిరా? అనుభవించు నీ కర్మ .....అని అంటాడు.....

♦మనపుణ్యపపలం మన జాతకంలో గురు రూపంలో కనిపిస్తుంది....గురు అనుగ్రహం వున్నదా? గురు దృష్టి వున్నదా? శుభ గ్రహ దృష్టి వున్నదా? వుంటే బ్రతికిపోతావు.....లేదా బాధ పడాలి, తప్పదు.....పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.....మనసు బాధ పడితేనే పాప కర్మ క్షయం అవుతుంది...

♦మనసు సుఖ పడితే పుణ్య కర్మ క్షయం అవుతుంది.....
పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే... ఆ మనసు చలించకుండా వుంటే పుణ్యమూ లేదు, పాపమూ లేదు....అదే అకర్మ....వికర్మ...సుకర్మ......కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు...
తాత ముత్తాతలు చేసిన పుణ్య ఫలం, పాప ఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చితీరుతుంది.... .
ఆ పుణ్యమే నీ మనుమలన్ని కాపాడుతుంది కూడా...మీ వంశాన్ని కాపాడుతుంది.....ఇదే మన జాతకంలో రెండవ స్తానం, తొమ్మిదవ స్తానం స్పష్టంగా చెబుతుంది.....

♦మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృ దేవతలు చేసిన పుణ్య ఫలితం వలన బ్రతికి బయట పడతాము.....వారి పుణ్య ఫలం మనల్ని కాపాడుతుందీ ....
మనం చేసిన పుణ్య ఫలం మన బిడ్డలను కాపాడుతుంది.... అంతటి కృష్ణ కృపాకటాక్షములు వున్నవాడు కూడా మాయలో పడ్డాడు గదా! కలిపురుషున్ని నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు....శ్రీ మహా విష్ణువు చేత రక్షింపబడి, గర్భం నుండి బయట పడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు...అదే కాల మహిమ...

♦కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు...
దీనిలో మీరు మరోకటి కూడా గమనించాలి....
👇👇👇👇👇👇👇👇👇👇
తక్షకుడు విష నాగు అంటే ప్రారబ్ద కర్మ, దానిని కూడా జయించింది మంత్ర శాస్త్రం....కాటు చేత పుష్పించిన మహా వృక్షం కాలి బూడిద అయితే మంత్రం మరలా చిగురింప జేసినది.....అంటే మంత్రం చేత ప్రారబ్ద కర్మ తొలగబడుతుంది అని మనం తెలుసుకోవాలి.....మంత్రం ప్రాణం పోస్తుంది. కానీ ఆ మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి.
💐💐 🙏🙏 జైగురు 💐💐

సేకరణ :- వాట్సప్ గ్రూపు నుండి .

Thursday, April 9, 2020

బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపిన వసంతుడు

బ్రహ్మరాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపిన వసంతుడు

బోధ చేస్తూ ఒక మునిదంపతులు ఉండేవారు. ఆ ముని చాలా ప్రతిభావంతుడు. సకలశాస్త్రాలు, విద్యలు తెలిసినవాడు. ఆ ముని భార్య సాక్షాత్తూ అన్నపూర్ణయే. ఆమె శిష్యులను తన కన్నబిడ్డల్లా చూసుకునేది. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వారి ఆకలిని తీర్చేది. అలా, ఒకనాడు ఆ ముని దంపతుల వద్దకు వసంతుడు అనే ఒక అనాథ వచ్చి శిష్యుడిగా చేరాడు. అతడు బాగా చురుకైనవాడు, తెలివైనవాడు కావడంతో, అతనికి గురువుగారు నేర్పించే విద్యలన్నీ ఇట్టే అబ్బేవి.
వసంతుడు కొన్నాళ్ళకే తన గురువుకు తెలిసిన విద్యలన్నీ పూర్తిగా నేర్చేసుకున్నాడు. ఇక అతనికి నేర్పడానికి తనవద్ద ఉన్న జ్ఞానం సరిపోకపోవడంతో, తనకు గురువులైన వారి వద్దకు పంపించి మరీ విద్యాభ్యాసం చేయించాడు. ఆ గురువర్యుడు. అయితే కొన్నాళ్ళకే అతనికి నేర్పడానికి తమవద్ద ఉన్న విద్యలన్నీ పూర్తయ్యాయని ఆ పెద్ద గురువులైన వాళ్ళు కూడా చెప్పారు.
ఇదిలావుండగా నిండు చూలాలైన గురుపత్ని ప్రసవించే సమయం రావడంతో, వసంతుడు ఆశ్రమంలో అన్ని పనులు తానే చూసుకుంటూ, తల్లితో సమానురాలైన గురుపత్నిని కాలు క్రింద పెట్టకుండా చూసుకుంటున్నాడు. ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. ఆశ్రమంలోపల ప్రసవం జరుగుతుండగా వసంతుడు గుమ్మం బయటకు వచ్చి కూర్చున్నాడు.
కాసేపట్లో లోపలి నుండి చంటిబిడ్డల ఏడుపులు వినవచ్చాయి. గురుపత్ని కవలపిల్లలకు జన్మనిచ్చింది. ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల. ఇంతలో దివి నుండి భువికి దిగివచ్చిన ఒక దివ్యపురుషుడు వడివడిగా ఆశ్రమంలోకి వెడుతూ, గుమ్మం ముందు కూర్చున్న వసంతుడికి కనిపించాడు. మామూలు మనుషులకైతే అతను కనిపించి వుండేవాడు కాదు. కాని వసంతుడు దేవరహస్యాలు కూడా నేర్చుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన అతనెవరో ఇట్టే కనిపెట్టేశాడు వసంతుడు. అతడు ''బ్రహ్మ''. అప్పుడే పుట్టిన పిల్లలకు నొసటి రాత రాయడానికి వచ్చాడని అర్థం చేసుకున్న వసంతుడు ఓపిగ్గా బయట కాచుకుని కూర్చున్నాడు వసంతుడు. బ్రహ్మ బయటకు రాగానే ఆయనకు ప్రణామం చేసి ''స్వామి'' మా గురువుగారి పిల్లల నుదుట ఏమి రాశారో దయచేసి సెలవివ్వగలరు అని వినమ్రపూరితంగా అడిగాడు.
బ్రహ్మ తనను చూడగలిగిన ఈ పిల్లవాడు సామాన్యుడు కాడు అని తెలుసుకొని, వసంతుడు అడిగిన విధానానికి ముచ్చటపడి, ఇతరులకు తెలియజెయ్యరాని రహస్యాన్ని అతనికి చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఇలా చెప్పాడు - నాయనా! ఈ అబ్బాయి నిరక్షర కుక్షి అవుతాడు. ఇతని జీవితకాలమంతా ఇతని వద్ద ఒక మూట బియ్యము, ఒక ఆవు, ఒక పూరిపాక తప్ప మరిక ఏమీ ఉండవు. ఇతడు రోజంతా కష్టపడినా తన రెక్కల కష్టంతో కనాకష్టంగా పెళ్లాన్ని, పిల్లల్ని పోషిస్తాడు అంతే అన్నాడు.
ఇక ఆ అమ్మాయి మాత్రం వేశ్య అవుతుంది. డబ్బుల కోసం రోజుకో పురుషుడితో సంభోగించే వారకాంత అవుతుంది అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు బ్రహ్మ. అది వినిన వసంతుడు నిశ్చేష్టుడయ్యాడు. సాక్షాత్తూ దైవసమానులైన తన గురుదంపతులకి పుట్టిన పిల్లలకు ఇలాంటి రాత రాసాడేమిటా విధాత అని విచారంగా ఆలోచనలో మునిగిపోయాడు. వెంటనే తన గురువుగారిని బ్రహ్మ రాత మార్చగలమా అని అడిగాడు వసంతుడు. దానికి, ఆయన అది సాధ్యం కాదు నాయనా. అది ఎవ్వరికీ సాధ్యం కాదు అని చెప్పాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యే కొద్దీ వాళ్ళ రాత నిజమవడం వసంతుడికి కనిపించసాగింది.
ఆ ఇద్దరికీ చదువులు వంటపట్టడం లేదు. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారి పిల్లలు ఇలా అయ్యారేమిటా? అనే దిగులుతో, వసంతుడికి దేనిమీద ఏకాగ్రత కుదరడంలేదు. దానికితోడు ఆ పిల్లలిద్దరు వసంతుడి వెంటపడి అన్నయ్య, అన్నయ్య అని తిరుగుతూ వుంటే, అతడికి దుఃఖం మరింత ఎక్కువ కాసాగింది. ఒకరోజు గురువుగారితో చెప్పి, ఆయన అనుమతి పొంది దేశం చుట్టి రావడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో చోట్లకు వెళ్ళి ఎందరో పండితులను కలిసాడు.
వారందరిని వసంతుడు ప్రశ్నించాడు. బ్రహ్మ రాసిన రాతను మార్చగలమా? దానికి వసంతుడికి అందరు చెప్పిన సమాధానం బ్రహ్మరాత మార్చడం అసాధ్యం. అది ఎవరితరమూ కాదు అని. అలా అక్కడా ఇక్కడా తిరుగుతూ, తన అన్వేషణను కొనసాగిస్తూ ఇరవై సంవత్సరాలకు పైగా గడిపాడు. అప్పటికి గురువుగారి పిల్లలకు పాతికేళ్ళు వచ్చాయి. వసంతుడికి వాళ్ళు ఎలా ఉన్నారో చూడాలనిపించసాగింది.
ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. అప్పుడు అక్కడి పరిస్థితి గురువుగారి కుమారుడి పేరు శంకరుడు అని, ఆ ఊరిలోనే కూలిపని చేస్తున్నాడని, గురువుగారి కుమార్తె పేరు వసంతసేన అని దగ్గరలోని ఒక పట్టణంలో వ్యభిచార వృత్తిలో ఉందని తెలుసుకున్నాడు. తనకు పుట్టిన పిల్లల దుస్థితి చూసి దిగులుతో మంచం పట్టి, గురు దంపతులు మరణించారని కూడా వసంతుడు తెలుసుకున్నాడు.
వసంతుడు బాగా ఆలోచించాడు. ముందు శంకరుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. వసంతుడిని చూడగానే అన్నయ్యా! అంటూ బావురుమన్నాడు శంకరుడు. చిన్న పూరిపాక, చిరిగిపోయిన దుస్తుల్లో భార్య, ఒక కొడుకు, ఇంట్లో ఎటు చూసినా విలయతాండవం చేస్తున్న కటిక దారిద్య్రం ఇదీ శంకరుడి దుస్థితి. తమ్ముడూ, నువ్వు బాధపడకు. ఇప్పటినుండి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు వసంతుడు. దానికి శంకరుడు, ''సరే అన్నయ్యా! ఇకనుండి నువ్వు ఎలా చెపితే అలానే
చేస్తాను'' అన్నాడు శంకరుడు.
ముందు ఆ ఆవుని తోలుకుని పట్టణానికి వెళదాం పద అన్నాడు వసంతుడు. ఏమి మాట్లాడకుండా ఆవును తోలుకుని వసంతుడిని అనుసరించాడు శంకరుడు. ఇద్దరూ నేరుగా పట్టణంలోని సంత దగ్గరకు వెళ్ళారు. అక్కడ ఒక దళారి దగ్గరకు వెళ్ళి ఈ ఆవుని ఎంతకు కొంటావు అని అడిగాడు వసంతుడు. తరువాత అతను చెప్పిన ధరకు అమ్మేసాడు వసంతుడు. శంకరుడికి ఏమీ అర్థం కాకపోయినా, వసంతుడికి ఎదురు చెప్పలేదు. ఆవును అమ్మగా వచ్చిన డబ్బుతో వంటకు అవసరం అయిన సరుకులను, శంకరుడి భార్యకు, పిల్లలకు కొత్త బట్టలు కొన్నారు. తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఇంటికి రాగానే ఆ సరుకులతో వంట చేయించాడు వసంతుడు. శంకరుడి భార్య, పిల్లలు ఆవురావురుమని తిని ఆకలి తీర్చుకున్నారు.
తర్వాత వసంతుడు శంకరుడితో తమ్ముడూ అన్నదానం చేద్దాం. ఆకలితో ఎవరు వచ్చినా లేదనకుండా వడ్డించు అని చెప్పాడు. శంకరుడు మారు మాట్లాడకుండా అలాగే చేశాడు. కాని శంకరుడు ఆ రోజు రాత్రి వసంతుడితో, అన్నయ్యా! ఇంతవరకు ఆ ఆవు వుంది కదా అన్న ధైర్యం నాకు ఉండేది, ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం కూడా పోయింది. దాన్ని అమ్మగా వచ్చిన ధనం కూడా అన్నదానానికి ఖర్చయిపోయింది. తెల్లవారితే ఎలా గడపాలో అని భయంగా వుంది అని అన్నాడు. దానికి వసంతుడు తమ్ముడూ, నువ్వు ఏమీ ఆలోచించకుండా సుఖంగా నిద్రపో. ప్రొద్దునకంతా సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పాడు.
ప్రొద్దున్నే లేచి తలుపు తెరచి బయటికి వచ్చి చూసిన శంకరుడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. శంకరుడి ఇంటిముందు ఒక ఆవు నిలబడి వుంది. శంకరుడి ఆస్తి ఎప్పుడూ ఒక్క ఆవే అని తను రాసిన రాత పొల్లుపోకుండా ఉండడానికి రాత్రికి రాత్రి బ్రహ్మయే స్వయంగా ఒక ఆవుని తీసుకొని వచ్చి అక్కడ కట్టేసాడు.
ఆ రోజు కూడా ఆవును తీసుకెళ్ళి సంతలో అమ్మి, వచ్చిన ఆ డబ్బుతో అన్నదానం చేయించాడు వసంతుడు. తమ్ముడూ, ఇక ఇలాగే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేస్తూ ఉండు అని చెప్పి వసంతుడు అక్కడి నుండి వసంతసేనను వెతుక్కుంటూ బయలుదేరాడు. అన్ని దానాల్లోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నందున శంకరుడు తన జీవితంలో అనంతమైన పుణ్యాన్ని మూట కట్టుకున్నాడు.
వసంతుడు వాళ్ళని, వీళ్ళని అడుగుతూ వెళ్ళి వసంతసేనను కలుసుకున్నాడు. వసంతసేన ఒక అవ్వతో కలసి ఒక ఇంట్లో ఉంటోంది. ఆమె వసంతుడిని చూడగానే భోరుమని ఏడ్చేసింది. అన్నయ్యా! నేను మహాపాపిని. ఈ పాపపంకిలంలో కూరుకుపోయాను. మీలాంటి ఉన్నతుడిని చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని బావురు మంది. ఊరుకో చెల్లీ! ఊరుకోమ్మా! ఈ పాపపు పంకిలం నుండి నువ్వు బయటపడే మార్గం చెబుతాను. ఇక ఇవాల్టి నుండి నేను చెప్పినట్లు చెయ్యి అని ఆమెను ఓదార్చాడు వసంతుడు. దానికి సరే అని ఒప్పుకుంది వసంతసేన.
ఆ రాత్రికి విటులు ఎవ్వరు వచ్చినా లక్ష వరహాలు చెల్లిస్తేనే లోపలికి ప్రవేశం అని చెప్పమని అక్కడ వసంతసేనతో ఉన్న అవ్వకు చెప్పాడు వసంతుడు. ఆమె ఆశ్చర్యపడుతూ అయ్యా! ఇది జరిగే వ్యవహారం కాదు అని ఏదో చెప్పబోయింది. వసంతుడు ఆమెను మధ్యలోనే వారించి నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ రాత్రి ఇద్దరు, ముగ్గురు విటులు వచ్చి లక్ష వరహాలు అనగానే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అది వాళ్ళు ఊహించలేని మొత్తం.
కాని అర్ధరాత్రి సమీపిస్తూ ఉంది అనగా ఒక మహాపురుషుడు మాత్రం లక్ష వరహాలతో వచ్చి ఆ రాత్రి వసంతసేనతో గడిపి వెళ్ళాడు. ఆ మరుసటిరోజు రాత్రి కూడా అలాగే జరిగింది. తన రాత తప్పకూడదని, లక్ష వరహాలు ఇచ్చి వసంతసేనతో సంభోగించింది సాక్షాత్తూ ఆ బ్రహ్మే నని వసంతుడికి తెలుసు. అలా బ్రహ్మ సంభోగం వలన అప్పటివరకు ఆమె మూటగట్టుకున్న పాపాలన్నీ పటాపంచలయ్యాయి. ఆమె జన్మ చరితార్థమైంది. అలా వసంతుడు వాళ్ళిద్దరి చేత పుణ్యకర్మలు చేయించి, గురుదంపతుల రుణం తీర్చుకున్నాడు.
ఈ ప్రపంచంలో ప్రతి జీవి నుదుట తలరాత రాసేది బ్రహ్మే అయినా దానిని చక్కగా తీర్చిదిద్దుకునే శక్తిని, అవకాశాన్ని మాత్రం ప్రతి జీవికి ఇచ్చాడు అని గ్రహించాడు, దానిని నిరూపించాడు. అలా బ్రహ్మ రాతను సైతం బ్రహ్మాండమైన రాతగా మార్చి చూపాడు వసంతుడు.

ఆవు గురించి...

1) ప్రపంచంలో 172 దేశాలు #ఆవుని తింటున్నారు,ఇండియాలో మాత్రం ఆవుని తినొద్దు...దాని #ఉచ్చ/మూత్రం తాగుతారు అని ఒకడంటాడు!

2) కోడి,మేక,లాగా గోవు కూడా #జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి”...???
అని మరొకడంటాడు!.

3) ఆవుసంతతి సరే మరి #గేదె ఏం పాపం చేసిందీ? ప్రతీవాడూ రోజూ తాగేదీ గేదె పాలే కదా ?

4) ప్రతీ ఒక్కరూ గేదె పై దాని రంగు "నలుపు" అనా? అందరూ #గేదెపై_సవతిప్రేమ చూపిస్తున్నారు ?
అని ఇంకొకడంటాడు!

దీనికి...నా....సమాధానం...
అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా…..
గోవు కూడా జంతువే కానీ….
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ”గోమాత” అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు…
నీ సంస్కారం…
నీ విచక్షణ…
నీ విజ్ఞత…
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే…
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా.....

ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.

అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు…ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.

విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.

వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.

ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.

కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.

గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.అందుకే శుభకార్యాలలో,నూతన గృహప్రవేశ సమయంలో గోపంచకంగా పవిత్రం చేయడానికి వాడుతారు .

గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.

ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.

ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.

ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.

గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
ఇక గేదె విషయానికొస్తే ఈ మధ్య కంచె ఐలయ్య లాంటి మహామేధావులు కొందరు దళితుల్లో వివక్ష / విభేదాలు సృష్టించి, వారికి లేనిపోని మాటలతో హిందువులు... కేవలం ఆవులనే పూజిస్తారు, ,గేదెలను పూజించరు ఎందుకంటే గేదెలు నల్లనివీ అనీ... హిందువులెప్పుడూ "పశుసంతతి పైనకూడా ఇలా వివక్ష కనబరుస్తారని" వేదికలమీద అధిక ప్రసంగాలు దంచారు .

ఒరే అజ్ఞానపు మాటలతో గేదెపాలు టీ ,కాఫీ లకు ఓకే ...,మరి?... చిన్నపిల్లలకు త్రాగడానికి పట్టిస్తే ఎలా?... గేదె పాలకన్నా "ఆవుపాలు" శ్రేష్టమైనవి ,మరియు తేలిగ్గా అరిగే గుణం కలిగినవి .

ఇక్కడ జంతువుల పైనా వివక్ష ఎవరికీ లేదు శాస్త్రీయంగా పరిశీలించిన తరువాతే హిందువులు గోమాతను సకలదేవతలు ఆవాసంగా భావిస్తారు .

అన్యమతస్థులు ముఖ్యంగా మహమ్మదీయులు /ముస్లింలు ఎక్కువగా ఇష్టపడి కోసేదీ బఱ్ఱె/గేదె లను,దున్నలను కాదు ,కక్షతో ఆవులనే ఎక్కువగా వదిస్తారు మరియు తినడానికి ఎక్కువ మక్కువచూపుతారు . అందుకే గోమాత సంతతిని కాపాడాలని ఎన్నో స్వచ్చంధ సంస్థలు పోరాడుతున్నాయి .

అందువల్లనే కొందరు పుణ్యపురుషులు ఇలా అన్నారు .
*
”గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు”.
– గాంధీజీ.

”ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు”.
– మహ్మద్ ప్రవక్త.

”ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే”.
– ఏసుక్రీస్తు.

”గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము”.
– హజరత్ మహమ్మద్.

”గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును”.
– బర్మార్డ్ మేక్ ఫెడన్.

”మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు”.
– హకీల హజ్మల్ ఖాన్.

”గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం”.
– తోహస్-వి-హింద్ బిజహరు.

భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.

నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే….
”నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు”

”నాదేశం, నీదేశం ,ఈ మనదేశం మెచ్చేటట్టు బ్రతకడం”
”వందేగోమాతరం”

దయచేసి ఈపోస్ట్ ను తప్పకుండా Share చేయండి!.

ఒకరోజు పశు వధశాలలో ఒకడు గోవును చంపడానికి దానిని బంధించి కోయడాని కొచ్చినపుడు...

ఒకరోజు పశు వధశాలలో ఒకడు గోవును చంపడానికి దానిని బంధించి కోయడాని కొచ్చినపుడు.....

ఆ గోవు ..
వానిని చూసి నవ్వింది.

దాన్ని చూసి కసాయి,వింతగా అడిగాడు.

నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?
అని అడిగాడు.
.
అప్పుడు గోవు ఇలా చెప్పింది.
.
నేను ఎప్పుడూ...గ్రాసం,గడ్డి తప్ప..ఏ జీవి మాంసాన్ని తినలేదు.
.
అయినా...
నా చావు ఇంత ఘోరంగా ఉండబోతోంది!

ఏ తప్పూ చేయక, ఎవరికీ హాని కలిగించని నన్ను,
నువ్వు చంపి, నా మాంసాన్ని తినే నువ్వు.

నీ చావు ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి... నేను నవ్వాను...అంది.
.
పాలిచ్చి మిమ్మల్ని పెంచాను. మీ జాతి సంతతికి అనాదిగా అనేక రకాలుగా ఆధారమయ్యాను.
మీ పిల్లలకూ పాలిస్తున్నాను. పాడి నీ ఇస్తున్నాను.
కానీ నేను తినేది మాత్రం గడ్డి.

నా సంతతి కడుపు మాడ్చి ,
నాపిల్లలకు #పాలివ్వనీయకుండా ,#మీకోసం మీరు నా నుండి పితుక్కున్నా నా నోరుమూసుకున్నా !

నా పాలతో వెన్న చేసుకున్నారు.ఆ వెన్నతో నెయ్యి చేసుకున్నారు.

నా పేడతో పిడకలు చేసుకుని,మీకోసం వంటకు వాడుకున్నారు.

అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు.

నాకు అనారోగ్యం చేస్తే..సరియైన చికిత్సకు నోచుకోక...ఒక వేళ నేను చచ్చినా కూడా..మీకు నా చర్మంతో,కొమ్ములతో,ఎముకల్తో నానారకాలుగా ఉపయోగపడతా...

ఆ డబ్బుతోమీరు సుఖంగా జీవిస్తున్నారు.
కానీ ....నాకు మాత్రం కుళ్లిపోయిన కూరలను ఎండి పోయిన గడ్డిని,అడ్డమైన దాణా పెట్టారు.

నావిసర్జన మూత్రం #పంచకం పావణంగా భావిస్తారు,మీలోని సర్వరోగాలను #హరింపజేసుకుంటారు.
మీ పాపపు సొమ్ముతో కట్టించుకున్న ఇంటిని #పవిత్రం చేసుకుంటారు.

నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకుని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు.

కానీ... నిన్ను ఎవడో ప్రేరేపించినందుకు...నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావ్.....

నా పాలనుంచి వచ్చిన #శక్తితోనే నన్ను చంపడానికి ఆయుధాన్ని నామీదికి ఎత్తగలిగావ్.

ఆ ఆయుధాన్ని #ఎత్తేశక్తినీకు వచ్చింది...నీ చిన్నప్పుడు నువ్ త్రాగిన నా పాలు #నా_నుంచే. అని మరిచావ్!

నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావ్.

కానీ... నన్ను మాత్రం ఒక గుడిసె/చావడి లో ఉంచావ్.

నిన్ను కన్న నీతల్లికంటే నేనే నీకు ఎక్కువ ఆసరాగా,నిస్వార్ధంగా నిలిచాను.

శ్రీకృష్ణుని ఇష్టురాల్ని నేను.
కామధేనువుని నేను

నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్న నీ గతి ఏమౌను?

నా సంతతిని ,నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే?

మీకు ,
మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో?

ఔనులే !...
మాకే ... భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు ..???
మీ కెక్కడి మనుగడ,???

అందుకే...
నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను.
అని చెప్పింది.

*
(మీకు సాధ్యమైనంతవరకూ మీ బంధుమిత్రులందరికీ
ఇది తెలియజేసి గోమాత ఋణాన్నికొంతైనా తీర్చండి.)

జై గోమాత.!!జై భారత్ !!!

Wednesday, April 8, 2020

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

మిత్రులందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు

హనుమాన్ జయంతి సందర్భంగా

🌺🌺కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ,ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

🌸🍁🌸🍁🌸🍁🌸🍁🌸

హనుమాన్ చాలీసా..

💐💐హనుమాన్ చాలీసా..
తెలుగులో అర్థాలు..!💐💐

అతులిత బలధామం స్వర్ణశైలాభ దేహం
దనుజ వనకృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్
సకల గుణ నిధానం వానరాణా మధీశం
రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి.

అసమానమైన బలము కలవాడా!
బంగారు వర్ణముతో మెరిసిపోయే దేహము కలవాడా! అశోకవనమును నాశనము చేసినవాడా!
జ్ఞానులలో అగ్రగణ్యుడిగా పేర్కొనబడినవాడా!
సర్వ గుణములకు నిధి వంటి వాడా!
వానర శ్రేష్ఠులలో అగ్రగణ్యుడా!
శ్రీరామచంద్రునికి అత్యంత ప్రియమైన భక్తుడా! వాయుపుత్రుడా!నీకు నమస్కారము.!

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్.
రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజమ్.

సాగరమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా! రాక్షసులను దోమలలాగా నలిపినవాడా! రామాయణమనెడి మహామాలలో రత్నము వంటి వాడా! వాయుపుత్రుడా! నీకు నమస్కారము.!

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్
తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్.
బాష్పవారి పరిపూర్ణ లోచనమ్
మారుతిం నమత రాక్షసాంతకమ్.

ఎక్కడెక్కడ రఘునాథుడు కీర్తింపబడతాడో
అక్కడక్కడ నీళ్ళు నిండిన కళ్ళతో శిరస్సు వంచి నమస్కారము చేస్తూ ఉంటావు.
రాక్షసుల అంతు చూసే వాయుపుత్రా!నీకు నమస్కారము!

శ్రీగురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి
వరణౌ రఘువర విమల యశ జో దాయక ఫలచారి |

శ్రీ గురుదేవులు ఆంజనేయస్వామి చరణ ధూళిచే
నా హృదయ దర్పణము శుభ్రపరచి చతుర్విధ పురుషార్థంబులనిచ్చు శ్రీరామచంద్రుని కీర్తిని
గానము చేతును.

బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవనకుమార
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేస వికార |

నా బుద్ధిహీనతను తెలిసినవాడనై ఓ పావనతనయా!
ఓ హనుమా! నిన్ను స్మరింతును.
ఓ ప్రభూ! నాకు బలము బుద్ధి విద్యలను ప్రసాదించి నాలోని పంచ క్లేశములను, షడ్వికారములను హరింపుము.

చౌపాయీ.

జయ హనుమాన జ్ఞానగుణసాగర -
జయ కపీశ తిహు లోక ఉజాగర | 1

అనంతములైన జ్ఞాన గుణముల యందు పరిపూర్ణుడైన
ఓ హనుమా! నీకు జయము.
మూడు లోకాలను ప్రకాశింప చేసే ఓ కపీశ్వరా
నీకు జయము.

రామదూత అతులిత బలధామా -
అంజనిపుత్ర పవనసుత నామా | 2

శ్రీరామచంద్రుని రాయబారీ!
సాటిలేని బలము గలవాడా!
అంజనీదేవి కుమారుడా!
పవన సుతుడను నామము కలవాడా!

మహావీర విక్రమ బజరంగీ -
కుమతి నివార సుమతి కే సంగీ | 3

మహావీరుడా! వజ్రము వంటి దృఢమైన దేహము
కలిగిన పరాక్రమవంతుడా!
దుర్బుద్ధిని తొలగించువాడా!
మంచిబుద్ధి గలవారికి సహాయపడువాడా!

కంచన వరన విరాజసువేసా -
కానన కుండల కుంచిత కేశా | 4

బంగారువన్నెతో మంచి వేషముతో ప్రకాశించువాడా! చెవులకు కుండలములు అలంకారములుగా కలిగి ఉంగరములు తిరిగిన తలవెంట్రుకలు కలిగినవాడా!

హాథ వజ్ర అరుధ్వజా విరాజై -
కాంధే మూంజ జనేవూ సాజై | 5

చేతిలో వజ్రమును ఆయుధమును మరియు జండాను ధరించి విరాజిల్లువాడా!
భుజమందు ముంజ గడ్డితో చేయబడిన యజ్ణోపవీతముతో శోభిల్లువాడా!

శంకరసువన కేసరీ నందన -
తేజ ప్రతాప మహాజగ వందన | 6

పరమేశ్వరుని పుత్రుడా! కేసరీ కుమారుడా!
తేజస్సు ప్రతాపములతో జగత్తంతటిచే పూజింపబడువాడా!

విద్యావాన గుణీ అతిచాతుర -
రామ కాజ కరివే కో ఆతుర | 7

విద్వంసుడా! గుణవంతుడా! అతి చతురుడా!
శ్రీరామ కార్యనిర్వహణలో ఎంతో ఆత్రము,
ఆతురత కలవాడా!

ప్రభు చరిత్ర సునివేకో రసియా -
రామ లఖన సీతా మన బసియా | 8

ప్రభువగు శ్రీరాముని చరిత్ర వినుటయందు
ఆసక్తి కలవాడా!
సీతారామ లక్ష్మణులను హృదయమునందు ధరించువాడా!

సూక్ష్మ రూపధరి సియహిదిఖావా -
వికట రూప ధరి లంక జరావా | 9

సూక్ష్మ రూపమును ధరించి సీతాదేవికి కనిపించితివి. పిదుప భయంకర రూపమును ధరించి లంకాపురిని కాల్చివేసితివి.

భీమ రూప ధరి అసుర సంహారే -
రామచంద్రకే కాజ సంవారే | 10

భయంకర వేషమును ధరించి లంకాపురి యందున్న రాక్షసులను చంపి శ్రీరామచంద్రుని సకల కార్యములను చక్కచేసితివి.

లాయ సజీవన లఖన జియాయే -
శ్రీరఘు వీర హరషి ఉరలాయే | 11

సంజీవనీ మూలిక తెచ్చి లక్ష్మణుని బ్రతికించితివి. అందుకు శ్రీరఘురాముడు సంతోషించి నిన్ను
తన హృదయమునకు హత్తుకొనెను.

రఘుపతి కీన్హీ బహుత బడాయీ -
కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12

శ్రీరామచంద్రమూర్తి నిన్ను గొప్పగా పొగడి
"సోదరా! నీవు నాకు భరతునితో సమానముగా ప్రియమైన వాడవు" అని పలికెను.

సహస్ర వదన తుమ్హరో యస గావై -
అసకహి శ్రీపతి కంఠ లగావై | 13

"నీ కీర్తిని భవిష్యత్తులో అందరూ వేనోళ్ళ గానం చేసి తరించెదరు గాక!" అని పలికి శ్రీరాముడు
నిన్ను కౌగలించుకొనెను.

సనకాదిక బ్రహ్మాది మునీశా -
నారద శారద సహిత అహీశా | 14

సనకాది ఋషులు, మునీశ్వరులు బ్రహ్మాది దేవతలు, నారదుడు సరస్వతీదేవి మరియు ఆదిశేషుడు

యమ కుబేర దిగపాల జహాతే -
కవి కోవిద కహి సకే కహా తే | 15

యముడు కుబేరుడు దిక్పాలకులు నీ మహిమను వర్ణింపజాలనప్పుడు భూలోకమున కవులు పండితులు ఎట్లు సాధ్యమగును.

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా -
రామ మిలాయ రాజపద దీన్హా | 16

నీవు సుగ్రీవునికి ఉపకారమొనర్చితివి.
రామునితో అతనికి సఖ్యము గావింపచేసి
రాజ్యపదవిని ఇప్పించితివి.

తుమ్హరో మంత్ర విభీషణ మానా -
లంకేశ్వర భయే సబ జగ జానా | 17

నీ సలహాను పాటించి విభీషణుడు లంకకు రాజైన సంగతి లోకమంతటికీ తెలిసినదే.

యుగ సహస్ర యోజన పర భానూ -
లీల్యో తాహి మధుర ఫల జానూ | 18

రెండువేల యోజనములు అనగా 16 వేల మైళ్ళ దూరమున ఉన్న సూర్యుని తీయని పండుగా భావించి దానిని మింగితివి.

ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ -
జలధి లాంఘియే అచరజ నాహీ | 19

శ్రీరామచంద్రుడిచ్చిన ఉంగరమును నోట నుంచుకొని (రామ నామమును జపిస్తూ) సముద్రమును దాటితివి. ఇందులో ఆశ్చర్యము లేదు.

దుర్గమ కాజ జగత కే జేతే -
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20

ప్రపంచమునందు కఠినమైన కార్యములు ఎన్నెన్ని ఉన్నాయో అవి అన్నియూ నీ అనుగ్రహము వలన సరళములు కాగలవు.

రామ దుఆరే తుమ రఖవారే -
హోత న ఆజ్ఞా బిను పైసారే | 21

శ్రీరాముని ద్వారపాలకుడవు నీవు.
నీ ఆజ్ఞలేనిదే లోపలికి వెళ్ళుటకు ఎవ్వరికీ వీలులేదు.
(నీ అనుగ్రహము లేకుండా రాముని కృప ఎవరికీ దొరకదు)

సబ సుఖ లహై తుమ్హారీ శరణా -
తుమ రక్షక కాహూ కో డరనా | 22

నిన్ను శరణు పొందిన వారికి సమస్త సుఖములు లభించును.
నీవు రక్షకుడిగా ఉండగా ఎవరికినీ
భయపడవలసిన పనిలేదు.

ఆపన తేజ సంహారో ఆపై -
తీనోం లోక హాంక తే కాంపై | 23

నీ యొక్క ప్రకాశమునకు బలపరాక్రమములను సంభాళించుకొనుటకు నీవే సమర్థుడవు.
నీ పెద్దకేక విని ముల్లోకములు కంపించును.

భూత పిశాచ నికట నహి ఆవై -
మహావీర జబ నామ సునావై | 24

ఓ మహావీరా! నీ నామస్మరణ వింటే భూతప్రేత పిశాచములు దగ్గరకు రావు.

నాసై రోగ హరై సబ పీరా -
జపత నిరంతర హనుమత వీరా | 25

నిరంతరము వీర హనుమంతుని జపించినచో
సమస్త రోగములు నశించును.
అన్ని పీడలు హరించుకుపోవును.

సంకటసే హనుమాన ఛుడావై -
మన క్రమ వచన ధ్యాన జో లావై | 26

ఎవరైతే మనోవాక్కాయ కర్మలచే తనను ధ్యానించినచో వారిని ఆంజనేయుడు సమస్త సంకటముల నుండి
విముక్తి చేయును.

సబ పర రామ తపస్వీ రాజా -
తిన కే కాజ సకల తుమ సాజా | 27

శ్రీరామచంద్రుడు తాపసులకు అందరకు గొప్పవాడు. ప్రభువు వంటివాడు.
ఆయన సకల కార్యములను ఓ ఆంజనేయా!
నీవు చక్కగా సవరించుచుందువు.

ఔర మనోరథ జో కోయీ లావై -
సోయీ అమిత జీవన ఫల పావై | 28

ఎవరు ఏయే కోర్కెలతో శ్రీ హనుమంతుని సేవింతురో వారికి ఆ కోర్కెలు తీరి అనంతమైన జీవన ఫల ప్రాప్తి కలుగును.

చారోం యుగ పరతాప తుమ్హారా -
హై పరసిద్ధ జగత ఉజియారా | 29

ఓ హనుమా! నీ యొక్క ప్రతాపము నాలుగు యుగములలోనూ ప్రసిద్ధమైనవి.
జగత్తంతయు నీ కీర్తి కాంతులతో ప్రకాశమానమై ఉన్నది.

సాధు సంతకే తుమ రఖవారే -
అసుర నికందన రామ దులారే | 30

సాధన చేసేవారికి చక్కగా తపస్సు చేసేవారికి
నీవు రక్షకుడవు. దుర్మార్గులను నాశనము చేయువాడవు మరియు శ్రీరామునికి అత్యంత ప్రియమైనవాడవు.

అష్ట సిద్ధి నవ నిధికే దాతా -
అసవర దీన జానకీ మాతా | 31

అష్టసిద్ధులను నవవిధులను ప్రసాదింపగలుగునటుల జానకీ మాత నీకు వరమొసగెను.

రామ రసాయన తుమ్హరే పాసా -
సదా రహో రఘుపతి కే దాసా | 32

రామరసాయనము నీవద్ద గలదు.
నీవు ఎల్లప్పుడూ శ్రీరామచంద్రుని సేవకుడవై ఉందువు.

తుమ్హరే భజన రామ కో పావై -
జనమ జనమ కే దుఃఖ బిసరావై | 33

నీయొక్క భజన వలన రామానుగ్రహము పొంది
జన్మ జన్మంతారముల దుఃఖముల నుండి
విముక్తి పొందెదరు.

అంత కాల రఘువర పుర జాయీ -
జహా జన్మ హరిభక్త కహాయీ | 34

(నిన్ను భజించినవారు) మరణించిన పిదప వైకుంఠమునకు పోవుదురు.
మరల జన్మించినచో వారు హరిభక్తులుగా
ప్రసిద్ధి చెందుదురు.

ఔర దేవతా చిత్త న ధరయీ -
హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35

ఇతర దేవతలకు తన హృదయము నందు స్థానమీయక శ్రీ హనుమంతునే ధ్యానించు వారికి (ఆంజనేయుడు) సమస్త సుఖములను ఒసంగును.

సంకట కటై మిటై సబ పీరా -
జో సుమిరై హనుమత బలవీరా | 36

మహాబలుడగు ఆంజనేయుని ఎవరైతే స్మరింతురో
వారి సంకటములన్నియు తొలగి పీడలన్నియు నశించును.

జై జై జై హనుమాన గోసాయీ -
కృపా కరహు గురు దేవకీ నాయీ | 37

జితేంద్రియుడైన ఓ ఆంజనేయ!
నీకు జయము జయము జయము.
గురుదేవుని వలె (నాయందు) దయ జూపుము.

జో శత బార పాఠ కర కోయీ -
ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38

ఎవరైతే (ఈ చాలీసాను) నూరుమార్లు పఠనము చేయుదురో వారికి అన్ని బంధనములు వీడి
పరమానంద ప్రాప్తి కలుగును.

జో యహ పఢై హనుమాన చలీసా -
హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39

ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను పఠింతురో
వారికి పార్వతీపరమేశ్వరుల సాక్షిగా సిద్ధికలుగును.

తులసీదాస సదా హరి చేరా -
కీజై నాథ హృదయ మహ డేరా | 40

ఓ నాధా (ఆంజనేయా!) ఈ తులసీదాసు ఎల్లప్పుడూ
హరి సేవకుడే కావున నా హృదయమందు నివసింపుము.

💐దోహా:💐

పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప
రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప |

సమస్త సంకటములను హరింప చేసెడివాడవు.
మంగళ స్వరూపుడవు,
సమస్త దేవతలకు నాధుడవు అయినా ఓ ఆంజనేయా! సీతారామ లక్ష్మణ సహితుడవై నా హృదయమున వసింపుము.

నిజమైన పూజ

నిజమైన పూజ

🙏దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ.

దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.

అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.

అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.

సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.

సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.

భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు.

చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదు.

నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు.

చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.

దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం.

దేహాత్మబుద్ధి వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది.

అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.🙏