Wednesday, April 15, 2020

అమృతం

👉 చదవటం మిస్ అవకండి

అమృతం
""""""""""""""""""
ఒరేయ్ నాయనా,
నీకు సమయం ఆసన్నమైంది, ఇంకో కొద్ది క్షణాల్లో తిరిగి రాని లోకాలకు ప్రయాణం కావాలి, సిద్ధంకా!

అంటూ సమవర్తి భటులు,
నా పక్కకొచ్చి పద అంటూ పిలుపునిచ్చారు.

మరీ ఇంత హఠాత్తుగా గానా? విస్తుపోయి అన్నాను.

తప్పదురా! వెళ్ళాలి.

సెకనులో వెయ్యోవంతు కూడా లేటు కాకూడదు.

క్రమశిక్షణలో మాకు మేమే సాటి.

మమ్మల్ని నిలువరించే శక్తి ఎవరికీ లేదు.‌
కాబట్టి వృధాగా మాట్లాడకుండా సిద్ధం కా అన్నారు.

సమయం చాలా కొద్ది గా ఉంది. ఏం చేయను?

అప్పటివరకూ నాలో ఉన్న తాపత్రయాలు, బెంగలు, బాధలు పటాపంచలై పోయాయి.

నేనే శాశ్వతం కాదనుకున్నప్పుడు,
ఏం బంధం నన్ను నిలువరించ లేదనుకున్నప్పుడు చివరి మజిలీలో ఏంచేస్తే బావుంటుందా అని ఆలోచించా.

ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు.

ఆయన లేకపోతే నాజీవితం ఎట్లా వెడుతుందొ వదినా,
పసుపు కుంకాలు లేని బ్రతుకెందుకు? అని భార్య రోదిస్తోంది.

పసుపు కుంకాల రూపంలో నిత్యం ననుమోసే నా భార్య ఏడుపులో నా ఉనికి ఆవిడకెంత అవసరమో తెలుస్తోంది.

అప్పటివరకూ చాకిరీ చేసి అలసిన కొడుకు, డాక్టర్ ఆశ లేదనే విషయం చెప్పాక,

నేను లేని జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తున్నాడు. వాడికి నామీద ఉన్నప్రేమతో పాటు, రేపు అనే దాని మీద వాడికి కలుగుతున్న స్పృహ నాకు ఆనందాన్నిచ్చింది.

చివరి చూపుకొచ్చిన అల్లుడు, మిగతా కార్యక్రమం తొందరగా అయిపోతే తన దైనందిన జీవితంలో పడిపోవచ్చు,
అసలే లీవు తక్కువ శాంక్షనయ్యిందని బాధపడుతున్నాడు.

అతని బాధలో వాస్తవం నాకు అర్థం అవుతోంది. అందుకే బాధ కలగటం లేదు.

ఇంకా బతుకుతాడనే నమ్మకం ఉంటే నిరీక్షించడం సబబుగా తోస్తుంది,
రేపో,మాపో పోతాడని రూఢిగా తెలిస్తే పోవడమే
కరెక్ట్ కదా.

ఇది ఎలాంటిదంటే బాగా ఇష్టమైన వ్యక్తి వేరే చోటుకు వెడుతూంటే బాధ కలుగుతుంది.

వెళ్ళటం తప్పదని తెలిసినపుడు బస్టాండు వరకు వెళ్ళి బస్సు ఎక్కిస్తాం.

బస్సు ఎక్కి సీటులో కూర్చున్నాక బస్సు ఎప్పుడు కదులుతుందా అని నిరీక్షిస్తాం.

ఆ సమయంలో మాట్లాడేది, అక్కడే ఉండి కబుర్లు చెప్పుకునేది పెద్దగా ఉండదు.

అందుకే బస్సు ముందు ఏవ్యాపకం లేకుండా అలా ఊరికే నిలబడే కన్నా బస్సు బయలుదేరితేనే మంచిదనిపించదూ‌!

అంటే దానర్థం వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు,
ఉండి ఏమీ చేయలేనప్పుడు,
వెళ్ళటం మంచిదే కదా అని అనుకోవటం లాంటిది.

ఇదీ అంతే అందుకే అల్లుడి ఆలోచనలో సబబుగా ఉందనిపించింది‌

ఈ గొడవలో పడి పిల్లల ఆలనా పాలనా మర్చిపోయానని తనను తాను నిందించుకుంటూ నా మనవలకు తిండి పెట్టే స్తోంది కోడలు.

ఆలస్యం చేస్తే పెద్దాయన గుటుక్కుమంటాడు,
అపుడు హడావిడి మొదలవుతుంది.

ఆ గొడవలో పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఆ తల్లి మనసు ఆరాటపడుతోంది.
నాకు తప్పనిపించలేదు.

పోయేవాళ్ళతో ఉన్నవాళ్ళు పోలేరు కదా కోడలూ కరెక్టే అనిపించింది.

అమ్మా! తాతకు ఏమయ్యిందీ? తల్లిపెట్టే గోరుముద్దలు తింటూ ఆలోచనగా అడిగాడు‌,
నాపేరు పెట్టిన నా మనవడు.

తాతగారు ఇంకాసేపట్లో దేవుడి దగ్గరకు వెళతారు నాన్నా అంటోంది కోడలు.

మళ్ళీ ఎప్పుడు వస్తారు? అడుగుతున్నాడు‌.

ఇంక రారు.

మరి సెలవల్లో మనం తాతయ్యా వాళ్ళూరు రామా!

లేదు, మామ్మనే మన ఊరు తీసుకుని వెళ్ళిపోతాం.

వద్దమ్మా, తాతను మనతోనే ఉండమను, ప్రతీ సంవత్సరం మనం ఇక్కడికే వద్దాం.

ఈ మాట విన్న నా కూతురు పొగిలి, పొగిలి ఏడుస్తూ, ఇంక ఆ అదృష్టం మనకు లేదంటూ... బాధ పడుతోంది.

బయట గొలుసు వేసి కట్టేసిన నేను పెంచిన కుక్క ఎవరు ఏది పెట్టినా తినకుండా నా కోసం ఎదురు చూస్తోంది.

నేను పెడితేనే తినటం దాని కలవాటు. గొలుసు తెంపుకుని నా దగ్గరకు రావాలని దాని ప్రయత్నం.

ఏడుస్తూ గొలుసు విప్పమని గొడవచేసేస్తోంది.

ఒక మనిషి అస్థిత్వం చుట్టూ ఎన్ని అనుబంధాలు, అనుభూతులు ఉంటాయో కదా అనిపిస్తోంది.

నా ప్రాణం ఇంకా పోలేదు. మెల్లగా నన్ను కిందకు దించి, నేనెప్పుడూ సేదతీరే మా ఇంటి పెరటిలో ఉన్న వేపచెట్టుకింద పడుకో బెట్టారు.

ధనిష్టా పంచకం వస్తోంది. బయటకు తెండని ఎవరో అంటే, నన్ను చాపవేసి పడుకోబెడుతున్నారు.

ముచ్చటపడి కట్టుకున్న ఇంటినుంచి చివరిసారిగా బయటకొస్తున్నట్టు తెలుస్తోంది.

ఇంక దీనికి నాకు ఋణం తీరిందని తెలుస్తోంది.

చెట్టుకింద పుట్టల్లో ఉన్న చీమలు నామీద పాకుతున్నాయి.

ప్రాణం ఇంకా పోలేదు కదా, అవి కుట్టినప్పుడు దేహం విలవిల లాడుతోంది.

ఎవరైనా గుక్కెడు నీళ్ళు పోస్తే బావుండు ననిపిస్తోంది.
మాట పెగలటం లేదు‌ ఎవరి గొడవలో వాళ్ళున్నారు.

అపరకర్మలు చేసే ఆయనకోసం ఒకరు బయలుదేరారు. ఆయన కాస్ట్లీ రా, వేరొకరిని వెతకండి ఎవరో అంటున్నారు.

పోయాక ఏది జరిగినా తెలియదు, ఉన్నవాడికి రేపనేది ఉంటుంది కదా. వాడు బతకాలంటే డబ్బు కావాలి.

ఆ సలహా మంచిదే అనిపించింది.

నా శరీరం సాగనంపడానికి చివరి సారిగా బేరసారాలు జరుగుతున్నాయి.

ఎవరో తులసి తీర్థం పోయమంటున్నారు.
నేను రోజూ సంధ్యావార్చి,
ఏ తులసిలో నీరు పోసేవాడినో ఆ తులసిచెట్టు ఆకులే చివరిసారిగా నా దాహార్తి తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.

రెండు గుక్కలు మింగాక,
నా మనవడు ఒక్కసారి
నా దగ్గరికొచ్చి ఆవకాయ తిన్న చిట్టి చేతులతో నా నోట్లో తనూ నీళ్ళు పోస్తానని పట్టు బట్టాడు.

వాడిని వద్దని సముదాయించడానికి అందరూ నానా తిప్పలు పడ్డాక, విధిలేక వాడితో తులసినీళ్ళు నా నోట్లో పోయించారు.

వాడి చేతినీటితో ఆవకాయ రుచి నా నాలికకు తగిలి ప్రాణం లేచి వచ్చింది.

పోతుందనుకున్న ప్రాణం నాలో చేరేసరికి శరీరంలో చిన్న కదలిక మొదలయ్యింది.

నాకొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి, నాన్న కదులుతున్నాడు అని ఆనందంతో అరిచాడు.

ఒక్కసారి అందరిలో ఆశ్చర్యం. పరుగున వచ్చి నాభార్య నా మనవడిని ముద్దు పెట్టుకుని, డాక్టర్ కి కబురు చేయమంది.

డాక్టర్ వచ్చాడు. చివరిసారిగా ప్రయత్నించాడు.

అప్పటివరకూ గొలుసుతెంపుకునేందుకు తాపత్రయపడ్డ నా కుక్కకి ఎవరో గొలుసు విప్పారు.

అది పరుగున వచ్చి నా వంటిపై పాకుతున్న చీమలని కోపంగా చూసి, నాలుకతో నాకి నాకు ఉపశమనం కలిగించేందుకు సహకరిస్తోంది.

నాన్నని లోపలికి తీసుకొని వెడదామంటోంది నా కూతురు.

డాక్టర్ మందులిచ్చాడు. కాసేపటికి కళ్ళు తెరిచాను. సిలైన్ ఎక్కించాడు. కొద్దిగంటల్లో తిరిగి స్పృహలోకొచ్చా.

మృత్యుంజయుడురా మీ నాన్న అంటున్నారు.

నా కొడుకు ఆనందానికి హద్దులు లేవు.

కొద్దిరోజుల్లో మళ్ళీ మామూలు మనిషినయ్యా.

మళ్ళీ బ్రతుకుతానన్న నమ్మకం కలిగాక అల్లుడితో సహా అందరూ మరికొన్ని రోజులు నాతో ఉన్నారు.

నాకోసం వచ్చిన యమభటులు ఎవో లెక్కలు సరిచూసుకుని, వీడు అమృతం తాగాడు,

శాస్త్ర రీత్యా అది తాగిన వాడికి మృత్యువు రాకూడదు.
అది శాస్త్ర విరుద్ధం అంటూ వెనుతిరిగారు.

చూస్తూండగానే తిరిగి వసంతం వచ్చింది.
నా ఇల్లు పిల్లాపాపలతో కలకలలాడుతోంది‌.

నాకు పునర్జన్మనిచ్చిన అమృతాన్ని తిరిగి తయారుచేయటం మొదలు పెట్టాను.

మామిడికాయలు ముక్కలు కొట్టి, వాటికి ఆవపిండి, గుంటూరు మిర్చి కి, బరంపురం మిర్చి కలిపి ఆడిన కారం, రాతి ఉప్పు, గానుగనూనె కలిపి ఒకజాడీలో ఆ అమృతాన్ని భద్రపరుస్తున్నా.

నిజం చెప్పొద్దూ బ్రతికి ఏం సాధిస్తాం అంటాం కానీ, బ్రతికినప్పుడే కదా ఆనందాన్ని ఆస్వాదించగలిగేది.

వేతకాలేకానీ ఆనందం ప్రతీ దాంట్లో ఉంటుంది.

పెంపుడు జంతువుల సాంగత్యంలో,

పెంచే మొక్కల
సాన్నిహిత్యం లో,

సంతానంతో కలిసి గడపటంలో,

రుచికరమైన వంటలో,

సుందరమైన ప్రకృతిలో,

ఆవకాయ అన్నంలో,

దోరగా కాలిన దొసెలో,
కరకరలాడే గారెలో.......

మక్కువగా ఆస్వాదిస్తే, అన్నింటిలోనూ ఆనందమే!

ఆనందంమైన అనుభవం, ఎన్నటికీ మృతంలేనిదే!

జీవితం అంచులకు చేరిన వాళ్ళకే తెలుస్తుంది,
జీవితం విలువ.

ఎందుకంటే జీవించడం అంటె తెలిసేది అప్పుడే.

అరవైలుదాటిన జీవితం, బోనస్ లాంటిది.

ఏభైల్లో ఉన్నజీవితం, అనుభవించడానికి ఇంకా సమయం ఉందని చెప్పేది.

నలభైల్లో జీవితం,
ఆనందం గురించి అవగాహన కలిగించేది.

ముప్ఫైల్లో జీవితం,
దొరికిన దానిలో ఆనందం వెతుక్కునేది,

ఇరవైల్లో జీవితం,
మన జీవిన విధానమే ఆనందం, అనే భ్రమకలిగించేది,

ఇరవై లోపు జీవితం
ఏది జరిగినా, అదే ఆనందం అని మురిసిపోయేది.

ఆనందం కోసమే జీవితం, దాన్ని
మిస్సవ్వకండి.
ఆనందంగా గడిపిన ప్రతీక్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి.
🙏🙏🌹

Source: whatsapp forwarded message

జన్మలు మూడు రకాలు

జన్మలు :
మానవ జన్మ దుర్లభమైనది మరియు మహోన్నతమైనది కూడా అదేలగు అంటే, అన్ని జన్మలలోనూ మనవ జన్మ మాత్రమే ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది.అసలు జన్మలు మూడు రకాలు.
1) దేవ జన్మ
2) మానవ జన్మ మరియు
౩) జంతు జన్మ.


మానవుడు తన జీవిత కాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి. వాటినే కర్మఫలాలు అంటారు. అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి.అందులో అన్ని పుణ్య కర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచినపుడు ఆ జీవుడు దేవలోకలలో దేవ జన్మ నేత్తుతాడు. అక్కడ ఆ కర్మఫలాల కారణంగా అనేక భోగాలను అనుభవిస్తాడు. అది భోగ భూమి.కనుక అక్కడ అతడికి ఏ కర్మలు చేసే అధికారము లేదు.అందువల్ల పరమాత్మను పొందడానికి తగిన కర్మలాచరించే అవకాశం అక్కడ లేదు.తన కర్మఫలాల ననుసరించి భోగాలనుభవించి, ఆ కర్మఫలాలు క్షయం కాగానే “క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి” అన్నట్లు ఈ మర్త్యలోకాన్ని (మనవలోకాన్ని) చేరుకోవలసిందే. మరల మరల మనవ జన్మనో, జంతు జన్మనో ఎత్తవలసిందే.ఈ దేవా జన్మలో కేవలం మనోబుద్దులు ఉంటాయి కానీ స్థూల శరీరం వుండదు. కనుక భాగాత్సక్షారానికి ఉపయోగపడే జన్మకాదు ఈ దేవజన్మ.


ఇక అన్ని పాపకర్మల ఫలాలు మాత్రమే పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు జంతువులూ, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, మొదలైన జంతువులుగా జన్మిస్తాడు.ఆ కర్మఫలాల కారణంగా అనేక బాధలు, దుఃఖాలు అనుభవిస్తాడు, హింసించబడుతాడు. జంతు జన్మలో కర్మలు చేస్తున్నట్లు కన్పించిన, ఆ కర్మలన్ని బుద్దిపరంగా అలోచించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోనేవికావు. కేవలం ప్రకృతి ప్రేరణతోనే పరతంత్రంగా చేస్తాయి.కారణం ఈ జంతు జన్మలలో శరీరం మరియు మనస్సు వున్నాయి కానీ బుద్ది మాత్రం లేదు. కనుక ఈ జన్మలలో కూడ కేవలం కర్మఫాలలు అనుభవించుటయే కానీ పరమాత్మనందుకొనుటకు తగిన జ్ఞానాన్ని పొందే అవకాశం లేదు.కనుక భాగవత్సాక్షారానికి ఈ జంతు జన్మకూడా ఉపయోగపడదు.


ఇక పుణ్యపాపకర్మల ఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినపుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది. ఈ జన్మలలో పుణ్య కర్మఫలాలు కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.పాపకర్మ ఫలాల కారణంగా దుఃఖాలు , బాధలు, అవమానాలు అనుభవిస్తాడు.అయతే ఇలా కర్మ ఫలాలనుభవించటం మాత్రమేగాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మనవ జన్మలోనే వున్నది. ఎందుకంటే స్వతంత్రంగా బుద్ది అనే సాదనం వున్న జన్మ ఇది. అదే విధంగా పరమాత్మ నందుకోవదడానికి తగిన కర్మలు చేసే అధికారం , జ్ఞానాన్ని పొందే అవకాశం వున్న ఈ మానవ జన్మ ఉత్తమోత్తమమైనది, దుర్లభమైనది అన్నారు. 84 లక్షల జీవరాసులలో పుట్టి గిట్టిన తరువాత లభించే అపురూప జన్మ గనుకనే ఈ మానజన్మను “జంతూనాం నారా జన్మ దుర్లభం” అని శంకరాచార్యులు వారు వివేక చూడామణి గ్రంథంలో తెలియజేయటం జరిగింది. ఇట్టి ఈ అపురూపమైన, దుర్లభమైన, ఉత్తమోత్తమమైన మానవజన్మను పొందిన ప్రతి ఒక్కరు దీనిని సార్థకం చేసుకోవాలి. అదే మనవ జీవిత లక్ష్యం అంతే ఎదో ఇక్కడ సాధించే పదవులు కాదు మరేవియును మనవ జన్మ లక్ష్యాలు కానే కాదు.


సార్థకం చేసుకోవటమంటే ఏమిటి ? : ఇక్కడ మనం అనుభవించే సుఖాలు (అవి ఏవైనను) తత్కాలితమైనవే గాని నిత్యమైన సుఖాలు కాదు. ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించిన ఇంకా ఎదో వెలితి, ఇంకా ఎదో కావాలనే తపన. ఎందుకంటే అవి నిత్యమైన, పరిపూర్ణమైన సుఖాలు కాదు. ఇవి అనిత్యమైన, పరిమితమైన వస్తువుల ద్వార వచ్చే సుఖాలు. నిత్యమైన, పరిపూర్ణమైన శాశ్వతమైన, సుఖం కావాలంటే నిత్యవస్తువు, పరిపూర్ణ వస్తువు, శాశ్వత వస్తువు ద్వారానే సాద్యం (లభిస్తుంది).ఏమిటా ఆ నిత్య వస్తువు ? పరిపూర్ణ వస్తువు? శాశ్వత వస్తువు? ఈ సృష్టికి ములాధారమైన ఏకమైన “పరమాత్మ” మాత్రమే (అయన దివ్య దర్శనాన్ని హృదయాలంలో సాక్షాత్కరించుకోవడమే శాశ్వత సుఖం).”నిత్య వస్త్వేకం బ్రహ్మ తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం” అని “తత్వబోధ” లో శంకరాచార్యుల వారు స్పష్టం చేసారు.అంటే నిత్యమైన వస్తువు ఏకమైన పరమాత్మ మాత్రమే. దానికి వేరుగా ఉన్న సర్వము అనిత్యమైనవే, అని అర్థం.కనుక నిత్యమైన పరమాత్మతో ఐక్యత వలన లభించే సుఖం , ఆనందం అందుకోనేవరకు మనవుడుకి తృప్తి వుండదు. అసంతృప్తి తీరదు.అట్టి శాశ్వతానందాన్ని అందుకోవటమే జన్మను సార్థకం చేసుకోవటమంటే. ఆ శాశ్వతనందాన్నే మోక్షం,ముక్తి అన్నారు.అదే విముక్తి (విముక్తి అంటే దేని నుండి విముక్తి? సర్వ బందనాల నుండి విముక్తి).బంధనాలు అంటే కర్మబంధనాలే(కర్మ బంధనాలు అంటే అనంతకోటి జన్మల నుండి మనం చేస్తూ వస్తున్నా కర్మల ఫలాలే ).ఈ బంధనాలున్నంత కాలం మనం ఎదో ఒక జన్మ ఎత్తుతూ వుండాల్సిందే. అలాగాక మళ్ళీ జన్మ లేకుండా ముక్తిని పొంది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే ఈ కర్మబంధనాలన్ని వదిలించుకోవలసిందే.

మట్టి పాత్రలో ఇంత టెక్నాలజీ ఉందా? - షుగర్ కు విరుగుడా?

మట్టి పాత్రలో ఇంత టెక్నాలజీ ఉందా? - షుగర్ కు విరుగుడా?

మట్టి పాత్రలో అంత టెక్నాలజీ ఉందా? షుగర్ కు దీనికి లింకేమిటి నమ్మలేని నిజమిది!
మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి.

మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు.అయితే అదంతా మట్టి పాత్రలు గొప్ప తనం తెలియకే? నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు. ఇంక కొంతమంది పెద్దలు మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు!కాబట్టి మనం మట్టి పాత్రలు ద్వారా వంటచేయటం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.

నిజానికి మట్టి పాత్రలో వంటచేస్తే చాలా రుచిగా ఉంటుంది.ఎక్కవ కాలం చెడిపోకుండా నిలువ వుంటాయి.కావాలంటే మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి. అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం మన ఆరోగ్యానికి కావలసి18 రకాల ""మైక్రో న్యూక్లియన్స్"" ఈ మట్టిలో వున్నాయి.మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్టు ఏమిటంటే ఈపధార్ధములో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాలలో 7%,13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.మట్టి పాత్రలో మాత్రము 100%మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.ఈ పదార్థాలకి రుచి కూడా అద్బుతంగా వుంటుంది.అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు.ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ప్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి.ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది.

మీకు గుర్తుండే వుంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టిన పుట్టుకతోనే పసిరికలు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటలు పాటు వుంచుతారు.ఆ పరికరంలో వుండేలైట్ లైట్ ద్వారా ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు. కేవలం కొద్ది గంటల్లో నే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఈకిరణాలకే వుంది.

కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ వుందన్నమాట. జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆదారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంటచేసి తినడం ద్వారానే.

చక్కెర వ్యాధి వున్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండిపెడితే కొన్ని నెలలు లోపే డయాబిటీస్ నుండి విముక్తులను చేయండి ఆనందంగా జీవంచనీయండి.
source:whatsapp forward

Tuesday, April 14, 2020

లాక్ డౌన్ అంటే ఏమిటి?

లాక్ డౌన్ అంటే ఏమిటి?
ఉదయం సాయంత్రం వాకింగ్ చెయ్యడమా?

లాక్ డౌన్ అంటే..?
100 మీటర్లకు ఒక్కరి చొప్పున, దూరంగా ఉన్న వాళ్ళను గుంపుగా ఒక్క చోటుకు చేర్చి, టిఫిన్ లు, పట్టెడు అన్నం పెట్టి పుట్టెడు ఫొటోలు దిగడమా..?

లాక్ డౌన్ అంటే..? టెంట్ వేసి వందల మందిని పిలిచి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే నగదును చక్కగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. ఏ ఎలక్షన్ వచ్చినా మీ ఓట్లు నాకే అంటూ బహిరంగంగా పంచడమా?

అసలు కరోన వ్యాధి గురించి కొంచమైనా అవగాహన ఉందా.?
ఎవరికి తాక కుండా ,బండ్ల మీద ఎంతమంది తిరిగినా రాని అంటువ్యాధి అని అనుకుంటున్నారా..?

కరోన అంటే?
దుకాణాలు తెరిచే ఉన్నాయి కదాని ..
ఫార్మాలిటి కోసం ఒక కర్చీఫ్ కట్టుకొని ప్రతిరోజు వెళ్లి ఎప్పటి లాగే గుమిగూడి సరుకులు తెచ్చుకున్నట్టు తెచ్చుకున్నంత మాత్రాన వచ్చే వ్యాధి కాదనుకుంటున్నారా..?

చదువుకున్నా మేధావులారా.😡
నీ దేశం కన్నా ఎన్నో రేట్లు అభివృద్ధి చెందిన దేశాలలో
జనం ఎందుకు పిట్టల్లా రాలిపోతున్నారో తెలిసి..!
దానికి గల కారణాలు ప్రతిరోజు, ప్రతిగంట , ప్రతి నిముషం టీవీల్లో చూస్తూ కూడా ..

30 శాతం మంది రోడ్లమీదకు వస్తున్నారంటే..
మీరు మనుషులు ఎలా అవుతారు

ఒక్క మీటింగ్ కు హజరైన 25 వేల మందివలన దేశం ఇంత ..
అతలా కుతలం అవుతుంటే.?
135 కోట్ల జనాభాలో..
30 శాతం మంది ,అంటే దాదాపు 40 కోట్ల మంది
ప్రతి రోజు రోడ్ల మీదకు వస్తున్నారు..😡
ఇదేనా లాక్ డౌన్ అంటే..?😡

ప్రతిరోజు రోడ్లమీదకు వస్తున్న 40 కోట్ల మందిలో... ప్రతి పదిలక్షల మంది లో ఒక్కడికి వైరస్ ఉన్నా ,

WHO లెక్కల ప్రకారం ఆ ఒక్కడు 45 మందికి వైరస్ తగిలిస్తే... ? అలా ప్రతిరోజు తగిలిస్తే..?

అలా లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు ఒక్కోడు 45 మందికి ఆ 45 మంది ఒక్కొక్కడు 45 మందికి ..అలా 400 మందితో మొదలై ఒక్క నెలరోజుల్లో ఎన్ని లక్షల మంది పాజిటివ్ అవుతారో లెక్కేసుకోండి.?😡

ఇప్పటికైనా మారండి..

లాక్ డౌన్ అంటే ఒక్క కుటుంబం నుండి ఒక్కడు మాత్రమే వారానికి ఒక్కసారి.. బయటకు వెళ్లడం..
రోడ్లు ఏడారుల్లా కనిపించాలి.
రోడ్లపై నిశ్శబ్దం..
స్మశానం లోలా ఉండాలి...
అలా ఉన్న వాతావరణం చూసి...
పరిస్థితి ఇంత గంభీరంగా ఉందా! అని ఇళ్లలో నుండి బాల్కనీలో నుండే చూసే వాళ్లకు ఉచ్చ పడాలి..
అది లాక్ డౌన్ అంటే..
బండ్ల మీద ముగ్గురు ముగ్గురు తిరగడం ఏంటీ?
వాకింగ్ లకు వెళ్లడం ఏంటి..? అరే అంతంత చదువులు చదువుకున్నారు!
సైకాలజికల్ ట్రీట్ మెంట్
అంటే తెలియాదా..?

లేదంటే ఆ!!? 135 కోట్ల జనాభా కలిగి ప్రతి 14 వేల మందికి ఒక్కడే డాక్టర్ కలిగిన మన దేశంలో..
ప్రతి 5 గురికి ఒక్కడు శవం అవుతాడు..
ఇది తథ్యం 😡😡😡

ఈ 20 రోజుల్లో మీరు చేసిన తెలివి తక్కువ పనివల్ల అతి త్వరలో.. పాజిటివ్ కేసులు లక్ష దాటుతాయి

క్రమ శిక్షణకు మారు పేరైన వేదభూమి లో పుట్టారు..

ఇప్పటికైనా దయచేసి లాక్ డౌన్ యొక్క మర్మాన్ని అర్థం చేసుకొని.. దానికి తగినట్టుగా ప్రవర్తించండి..🙏🏼🙏🏼

ఈగల మోత కథ

ఈగలమోత

పూర్వం లలాటరాజ్యాన్ని విచిత్రసేనుడు పాలిస్తుండేవాడు. ఒకసారి అతనికో సమస్య వచ్చింది. గుంపులు గుంపులుగా వచ్చిన ఈగలు సభలో తీవ్ర అసౌకర్యాన్ని కలిగించసాగాయి. ఝుమ్మని మోత చేస్తూ సభికులు, రాజు మొహంపై వాలసాగాయి. ఎంత తోలినా తిరిగి వచ్చేవి. కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిగుండా పొట్టలోకి జారుకునేవి. వాటి దెబ్బకు అందరూ గగ్గోలు పెట్టారు.

పరిష్కారం చూపమని రాజును వేడుకున్నారు. సేవకులు వింజామరలతో వీస్తున్నా అది విచిత్రసేనుడికి ఉపశమనం మాత్రమే కలిగిస్తోంది.

అంతఃపురంలోని రాజపరివారమంతా ఈగల వల్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోసాగారు.

వంద ఈగల్ని చంపితే ఒక బంగారు వరహాను బహుమతిగా ప్రకటించాడు విచిత్రసేనుడు. అది కూడా సరైన ఫలితం ఇవ్వలేదు. పనీపాట లేని వాళ్ళు తప్ప ఇతరులు ఈగల్ని చంపడానికి ఆసక్తి చూపలేదు. దాంతో.. ’ కోటనుంచి ఈగల్ని తక్షణమే తరమగలిగిన వారికి లక్షవరహాలు బహుమతి ఇవ్వబడుతుందని' దండోరా వేయించాడు.

మరుసటిరోజు కిరీటి అనే యువకుడు సభకు వచ్చాడు. ఈగల్ని తరిమేందుకు సిద్ధంగా ఉన్న సంగతి విచిత్రసేనుడికి తెలియపరిచాడు.

"నీవు ఏం చేసినా, ఎలా చేసినా... ఈగలమోత మాత్రం ఇక వినపడకూడదు. నీ పనిని ప్రారంభించు." అని రాజు ఆదేశించాడు.

సభలోంచి బయటకు వెళ్ళిన కిరీటి ఓ అర్ధగంట తర్వాత తిరిగివచ్చాడు. అతను వచ్చిన కొద్దిసేపటికే ఈగలన్నీ బయటకు జారుకున్నాయి. సభలో ఒక్కటి కూడా లేదు! రాజు, సభికులు ఆనందం, ఆశ్చ్యర్యం కలగలిపిన ముఖాలతో ఉన్నారు.

"ఏం మంత్రం వేశావు? లేక ఏదైనా మాయ చేశావా?" విచిత్రసేనుడు అడిగాడు.
"ఇందులో మాయమంత్రాలు ఏమీలేవు... ఏదో నాకున్న కాస్త లోకజ్ఞానఫలితం" వినయంగా అన్నాడు కిరీటి.
"ఎలా చేసినా పెద్ద ఇబ్బందిని తొలిగించావు. ఇవిగో లక్ష వరహాలు.." అంటూ ధనం మూటను ఇవ్వబోయాడు విచిత్రసేనుడు.
"రాజా.. మీ బహుమతిని స్వీకరించలేక పోతున్నందుకు నన్ను క్షమించండి. ఈగలు మళ్ళీ కోటలోకి వచ్చి గతంలో లాగానే మీకు ఇబ్బందిని కలిగిస్తాయి. ప్రస్తుతం నేను వాటిని కోట బయటికి మాత్రమే తీసుకెళ్ళగలిగాను. నాది శాశ్వతమైన పరిష్కారం కాదు."
"ఇంతకీ ఏం చేశావు?" గద్దించి అడిగాడు విచిత్రసేనుడు.

"పెద్ద బెల్లం ముద్దను కోట బయట ఉంచి వచ్చాను. దాంతో ఈగలన్నీ బెల్లం చుట్టూ చేరాయి. ఆ ముద్దను పూర్తిగా జుర్రుకోగానే కోటలోకి రావడం ఖాయం."

ఆ మాటలు వినగానే విచిత్రసేనుడికి కోపం తారాస్థాయికి చేరింది.

"మేము కోరింది శాశ్వతపరిష్కారం, ఇలాంటి చిట్కాలు కాదు. సమయం వృధా చేస్తే నీకు కారాగారశిక్ష తప్పదు." ఉచ్ఛస్థాయి గొంతుతో చెప్పాడు.


"శాశ్వతపరిష్కారం మీదగ్గరే ఉంది. విచక్షణ లేని ప్రజలు రాజ్యాన్ని చెత్తకుప్పలు, ఎరువుదిబ్బలుగా మార్చారు. వాటివల్ల పెరిగిన ఈగలు ఎన్నో రోజుల నుండి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోసాగాయి. పలుసార్లు మీ దృష్టికి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వాటి ప్రభావం అంతఃపురానికి పాకిందనే దండోరా విన్నప్పుడు సమస్య పరిష్కార మవుతుందని సంతోషించాం.

రాజ్యపరిస్థితిని పూర్తిగా తెలిపేందుకే వచ్చానుకాని, బహుమతి కోసం కాదు." వివరంగా చెప్పాడు కిరీటి.

విచిత్రసేనుడికి జ్ఞానోదయమైంది. మూలకారణాన్ని తొలగించాలే గాని, ఉపశమన చర్యల వల్ల సమస్య పరిష్కారం కాదని గ్రహించి...!!!

కిరీటిని మంత్రిగా నియమించుకుని రాజ్యాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే పనిని అప్పగించాడమే"*

కాకుండా...!!

కోన్ని రోజులకు..

తమ తెలివితేటలు
ప్రతిభా శక్తిని చూసి

తన కూతురిని ఇచ్చి వివాహం కూడా చెసాడు..!!

కథ సుఖాంతం..!!

ఉపాధ్యాయులు చదవవలసిన ఓ మంచికథ!!

ఉపాధ్యాయులు చదవవలసిన ఓ మంచికథ!!

బహుమతి

ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను.

ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.

వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను.

లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను.

వద్దన్నాడు.

గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.

నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను వెంకట్‌ని. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.

అప్పుడు గుర్తుకు వచ్చింది. వెంకట్‌ చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు.

అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను.

వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి.

పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే వెంకట్‌ ఎప్పుడూ దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.

కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన.

మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.

శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు.

కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది.

వెంకట్‌ చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. వెంకట్‌ స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు.

వెంకట్‌ తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. వెంకట్‌ చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.

ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.

చిరంజీవి వెంకట్‌కి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.

వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను.

కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది.

అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు

డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే వెంకట్‌ బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.

నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది వెంకట్‌ రాసినది.

దైవసమానులైన మాస్టారుగారికి,

నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం.

ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.

మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను. దీని గురించి చర్చించేముందు నాకు మీ గురించి ఉన్న అభిప్రాయాలని తెలియజేయాలని అనుకుంటున్నాను.

స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి.

మిమ్మల్ని మరీ విసిగించకుండా ఉదాహరణగా స్కూల్లో జరిగిన ఒకటి రెండు సంఘటనల్ని మీకు గుర్తుచేస్తాను.
ఓరోజు మాకు సోషల్‌ స్టడీస్‌ క్లాసు జరుగుతుండగా మీరు రౌండ్సుకి వచ్చారు.

ఆ సమయంలో మేమంతా సోషల్‌ స్టడీస్‌ మాస్టారు వెంకట్రావుగారు పెట్టిన స్లిప్‌టెస్ట్‌ రాస్తున్నాం. మీరు వచ్చిన సమయానికి వెంకట్రావు మాస్టారు చిన్న కునుకు తీస్తున్నారు.

పాపం అంతవరకూ ఆయన మాకు బోధిస్తూనే ఉన్నారు. మీరు క్లాసులోకి వచ్చి మాస్టారుని ‘‘ఏమిటిది మాస్టారూ, క్లాసులో ఇలా నిద్రపోతున్నారు?’’ అని గట్టిగా మందలించారు. పాపం ఆయన సంజాయిషీ ఇవ్వబోతుంటే, ‘వద్దు, తర్వాత వచ్చి కలవమని’ కాస్త కటువుగా చెప్పారు.

వెంకట్రావు మాస్టారి ముఖం చిన్నబోయింది. మాకూ కొద్దిగా బాధ అనిపించింది. ఆయన చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు.

ఆ రోజుల్లో ఏ మాస్టారుదైనా పుట్టినరోజైతే, ఆ ఉదయం అసెంబ్లీ సమయంలో మీరు వారికి పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరించి, వారి గురించి రెండు మంచిమాటలు మాట్లాడేవారు.

అది మన స్కూల్లో ఆనవాయితీ. పై సంఘటన జరిగిన మర్నాడు వెంకట్రావు మాస్టారి జన్మదినం. ఆరోజు అసెంబ్లీ సమయంలో మీరు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చిన తర్వాత చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

‘వెంకట్రావు మాస్టారు మనకున్న మంచి ఉపాధ్యాయుల్లో ఒకరు.

పూర్వవిద్యార్థులెవరైనా నాకు బయట ఎక్కడైనా కనిపిస్తే ముందుగా ఆయన కుశలాన్ని గురించి తప్పక అడుగుతారు. ఇక్కడ నిన్న జరిగిన ఓ సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలి.

నేను రౌండ్సులో భాగంగా ఆయన క్లాసుకి వెళ్ళాను. పిల్లలంతా స్లిప్‌టెస్ట్‌ రాస్తున్నారు. మాస్టారు చిన్న కునుకులో ఉన్నారు. నేను ఆయనను మందలించి తర్వాత వచ్చి కలవమన్నాను.

ఆయన నన్ను కలిశాక తెలిసిందేమిటంటే, మొన్న రాత్రి మాస్టారుగారి అమ్మాయికి తీవ్ర అస్వస్థత చేసిందట. అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఉదయం ఆరుగంటలకికానీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.

మాస్టారికీ ఆయన భార్యకీ రాత్రంతా నిద్రలేదు. ఆవిడని వాళ్ళమ్మాయికి తోడుగా ఆసుపత్రిలో ఉంచి, ఆయనమటుకు మామూలుగానే స్కూలుకి వచ్చేశారు. ఆయనకి సెలవులు చాలా ఉన్నాయి. ‘మాస్టారూ, సెలవు తీసుకోపోయారా’ అని నేనంటే, ఆయన ఏమన్నారో తెలుసా- ‘పిల్లల ఫైనల్‌ పరీక్షలు దగ్గరబడ్డాయి.

వాళ్ళని బాగా ప్రిపేర్‌ చేయాలిగదా సార్‌. ఆసుపత్రిలో నేనుండి చేసేపని ఏదీలేదు. మా ఆవిడ చూసుకుంటుంది’ అని. ఎంతమందికి ఇలా పనిమీద భక్తి ఉంటుంది చెప్పండి?


దురదృష్టంకొద్దీ ఆ నిద్రలేమి ప్రభావం ఓ క్షణం ఆయన మీద పడింది. కాకతాళీయంగా నేను అదే సమయంలో వెళ్ళాను. అనవసరమైన ఆవేశంతో ఆయన్ని పిల్లలముందు మందలించినందుకు నేను ఆయన్ని మన్నించమని కోరుకుంటున్నాను’
అని ఆయనవైపు చేతులు జోడించారు.

వెంకట్రావు మాస్టారు కళ్ళల్లో మెదిలిన చిన్న కన్నీటితెర, మీ తప్పేమీలేదన్నట్లుగా మిమ్మల్ని వారిస్తూ మీకు చేసిన ప్రతి నమస్కారం నేనెప్పటికీ మర్చిపోలేను.


ఆరోజు మీ మాటలు విన్నాక నాకు అర్థమైన విషయమేమిటంటే, మనం తెలిసిచేసినా తెలియకచేసినా తప్పు చేస్తే, అది ఒప్పుకునే ధైర్యం ఉండాలి.

నలుగురిలో మీరు మాస్టారుని మందలించారు కాబట్టి, పదిమందిలో క్షమాపణ కోరారు. ఆ విధంగా చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. అలాగే ఎవరైనా మంచిపని చేస్తే వెంటనే మెచ్చుకోవాలి.

అది వారికి మరింత స్ఫూర్తినిస్తుంది అని అర్థమయింది. ఆరోజు నేను నేర్చుకున్న ఆ పాఠాలు, ఇవాళ నా వృత్తిలో ఎదగడానికీ నా సహోద్యోగులతో మంచి సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకోవడానికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి.

బహుమతి
స్కూల్లో ఆటలపోటీలు జరిగినప్పుడు గెలుపొందినవారికి కప్పులూ మెడల్సూ ఇచ్చేవారు. అదే క్విజ్‌, వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో గెలుపొందినవారికి మీరు పుస్తకాలు బహుమతిగా ఇచ్చేవారు.

ఆ పుస్తకాలు జనరల్‌నాలెడ్జికి సంబంధించినవో మహనీయుల జీవితచరిత్రలూ లేదా ఆత్మకథలో అయి ఉండేవి. ఓ వారం, పదిరోజులయ్యాక మీరు ఆ బహుమతి పొందిన విద్యార్థిని ఆ పుస్తకంలోని విషయాల గురించి అడిగేవారు. ఇచ్చిన పుస్తకం చదివామా లేదా, అందులోని ఏ మంచి విషయాలు మమ్మల్ని ప్రభావితం చేశాయో తెలుసుకోవాలని మీ యోచన. మొదట్లో అది మాకు కొంత ఇబ్బందిగా ఉండేది.

బహుమతి ఎందుకు వచ్చిందా అనుకునేవాళ్ళం. కానీ రానురాను దానివల్ల మంచి పుస్తకాలు చదవాలన్న ఆసక్తి మాలో కొంతమందికి కలిగింది. నేను ఇప్పుడు ఉద్యోగరీత్యా చాలా ప్రయాణాలు చేస్తూ ఉంటాను.

ఆ సమయాన్ని నేను మంచి పుస్తకాలు చదవడానికి వెచ్చిస్తాను - ఆ పుస్తకాల ప్రేరణతో నేను చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను.

అవి నా ఉద్యోగంలోనూ నిత్య జీవితంలోనూ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్న ఇంకో విషయం- సమయపాలన. మీరు స్కూలుకి ఎప్పుడూ అందరికంటే ముందు వచ్చేవారు. సాయంత్రం ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడైనా పని ఉండి స్కూలు వదిలిన తర్వాత కూడా ఉండి, పనిచేసుకుంటూ ఉంటే మీకు అవసరం లేకపోయినా ఆయనకి తోడుగా ఉండేవారు. అది మీ సహోద్యోగులకి మీరిచ్చే ఓ భరోసాలా ఉండేది.

ఈ విషయంలో కూడా మిమ్మల్ని నేను అనుకరిస్తూనే ఉన్నాను.
ఇవన్నీ ఎందుకు రాస్తున్నానంటే, మిమ్మల్ని గమనించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను అనేకంటే, మీరు మీ ప్రవర్తనతో మాటలతో మీకు తెలియకుండానే మాకు ఎన్నో బోధించారు అనడం ఉత్తమం. అప్పుడే కాదు... ఇప్పుడు కూడా.

బహుమతులు చాలామంది ఇస్తారు. కొద్దిమంది ఆ ఇచ్చిన బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలని ఆలోచిస్తారు. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే.

కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది.

మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం.

వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ వెంకట్‌.

అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను``.

Congratulations on being a teacher. Remember you are a role model to many youngsters, be careful in your style of living, language, bodylanguage, approach etc...

Be proud to be a teacher🙏🙏🙏

కోరికలను సరైన దిశలో ఎలా నడిపించాలో సద్గురు వివరణ

🙏 సద్గురు వాఖ్యలు

మనం మన కోరికలతో పోరాడటం ఎందుకు వృధాప్రయాసనో, అదే సమయంలో వాటిని సరైన దిశలో ఎలా నడిపించాలో సద్గురువివరిస్తున్నారు.

సద్గురు: గౌతమ బుద్ధుడు ‘ఆశలేనితనం’ గురించి మాట్లాడారు అని సాధారణంగా అంటుంటారు. ఆయన ‘ఆశలేనితనం’ అని అన్నప్పుడు జనాలు కోరికలు లేకుండా బ్రతకగలరు అని అనుకునే మూర్ఖుడు కాదు ఆయన. కోరిక లేకుండా మనుగడే లేదు అనేది ఆయనకు తెలుసు. ఆశలేనితనంగా ఉండాలి అని మీరు అనుకునేది కూడా ఒక పెద్ద కోరికే.

కోరికలు లేకపోవటం అంటే అర్ధం మీ కోరికలతో మీకు ఎటువంటి గుర్తింపు లేదనే. అప్పుడు కోరికలు కేవలం మీరు ఆడుకునే వస్తువులు మాత్రమే. కోరిక లేకుండా అస్సలు ఆటే లేదు. కానీ ఇప్పుడు ఈ కోరికలు ఇక మీ గురించి కాదు. ఈ క్షణానికి, ఈ పరిస్థితికి అనుగుణంగా అవి ఉంటాయి. ఏది ఎలా ఉండాలో అలా ఉంది. దాని గురించి మీరు ఏమి చేయగలుగుతారో అది మీరు చేస్తారు. మీరు అన్నిటిలో ఎంతో లోతుగా నిమగ్నమవ్వవచ్చు కానీ మీరు ఇక దేనితో గుర్తించబడరు.

ఈ అవగాహన ఒకసారి వస్తే, ఈ కోణంలో మీరు కోరికలు లేని వారు అయితే ఆ వ్యక్తికి కర్మబంధం ఉండదు. వారు ఒక యుద్ధం చేసినా కూడా వారికి కర్మ ఉండదు ఎందుకంటే వారికి అటువంటిది ఏదైనా చేయాలని కోరిక లేదు. అది దేని మీద అయినా వారి ప్రేమ నుంచో ద్వేషాన్నుంచో వచ్చేది కాదు. అది అలా జరగటానికి కారణం ఏమిటంటే ఉన్న మార్గం అదే కనుక.

గీతలో చెప్తుంది అంతా ఇదే. కృష్ణుడు ఎప్పుడూ నిష్కర్మ గురించి మాట్లాడతాడు కానీ ఆయన, అర్జునుడు కర్మ చేయాలి అని పట్టుబడతాడు. ఆయన మాట్లాడుతుంది అదే ఆశలేనితనం గురించి కానీ వేరే బాషలో, వేరే సందర్భంలో కానీ చివరికి మాట్లాడుతుంది దాని గురించే.


మీకు కోపం వస్తే మీరు ఉన్నతమైనదిగా అనుకునేదాని వైపు దాన్నీ తిప్పండి. మీ కోరికలను పెరగనివ్వండి.

మీ కోరికలను ఒకే దిశగా పంపించండి

మీ కోరికలతో,ఆశలతో పోరాడటానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. మీరు ఎంత ఎక్కువగా పోరాడితే అవి అంత ఎక్కువగా వస్తాయి. పురాణాలలో, ‘ఒక అసురుడిని చంపేటప్పుడు ఒక బొట్టు రక్తం నేల మీద పడితే, దానిలో నుంచి ఒక వెయ్యి మంది అసురులు పుడతారు’ అని చెప్తారు. మీ ఆశలు, కోరికలూ అటువంటివే. మీరు ప్రయత్నం చేసి పోరాడితే, వాటిని నరికేస్తే అవి రక్తాన్ని చిందిస్తాయి. ఒక్కో చుక్కకూ ఒక వెయ్యి కోరికలు, ఆశలు పుడతాయి. వాటితో పోరాడటం పనికి రానిది, దాని వల్ల మీ జీవితం వృధా అవుతుంది. మీరు వాటితో ఎప్పటికీ పోరాడలేరు. మీ కోరికలను, ఆశలను సరైన దిశలో వెళ్ళేటట్లు మీరు శిక్షణ ఇవ్వాలి అంతే.

మీకు కోపం వస్తే దాన్ని మీరు ఉత్తమమైనది అనుకునే దాని వైపుకు మరల్చండి. మీ ఆశలను పెరగనివ్వండి.

మీ కోరికలు, మీ ఆశలు అన్నీ కూడా కేవలం సాధారణమైన శక్తి మాత్రమే. వాటిని కోరికలుగా లేక భయాలుగా లేక కోపంగా లేక మరొకటిగా చేస్తుంది మీరే. బహుశా ఇప్పుడు అవి మీ చేతుల్లో లేవేమో. బహుశా ఇప్పుడు మీకు ఆ అవగాహన లేదేమో. కానీ వాటిని అలా చేస్తుంది మాత్రం మీరే. భావాలు ఏవైనా, మీ కోరికల స్వభావం ఏదైనా, అదంతా మీరు మీ జీవితంలో ఇంకా లోతుగా పాతుకుపోవాలి అని మీ జీవ శక్తి చేసే ప్రయత్నం మాత్రమే. మీ జీవ శక్తి మీ జీవితానుభవాన్ని మరింత పెంచటానికే ప్రయత్నిస్తుంది. అది ఈ ప్రపంచంలోని బాహ్యమైన వాటిపై దృష్టి పెడితే, ఎప్పుడైతే ఎవరైనా లేక ఏదైనా దాన్ని పూర్తిచేయటంలో అడ్డుపడితే మీరు బాధపడతారు. అదే ఒకే ఒక్క దిశలో దృష్టిపెడితే, ఫలితాలు చాలా త్వరగా వస్తాయి. కనుక మీరు కోరుకునేటప్పుడు జీవితంలోని అత్యుత్తమమైన దాన్నే కోరుకోండి. మీరు కోపంగా ఉన్నపుడు ప్రేమగా ఉండలేకపోవచ్చు. మీరు కోపాన్ని వెంటనే ప్రేమగా మార్చలేకపోవచ్చు, కానీ మీరు మీ కోపాన్నే ఒక దిశలోకి మరల్చవచ్చు. మీకు కోపం వస్తే మీరు ఉన్నతమైనదిగా అనుకునేదాని వైపు దాన్నీ తిప్పండి. మీ కోరికలను పెరగనివ్వండి. వాటిని ఒక దిశలో పెట్టటం మీ చేతిలోనే ఉంది.

కోపం ఒక బ్రహ్మాండమైన శక్తి. వ్యామోహము కూడా ఒక బ్రహ్మాండమైన శక్తి. దాన్ని సరైన దిశలోకి మలచండి. మీకున్న శక్తినంతా, మీ వ్యామోహాలను, మీ ప్రతీ భావాన్ని, ప్రతీ ఆలోచనను మీరు ఒకే దిశలో కేంద్రీకృతం చేస్తే, ఫలితాలు చాలా త్వరగా వస్తాయి.

Source: message received from whatsapp

మన ఇంట బయట జరుగుతున్నదే రామాయణం ఎలాగంటే -

🚩మోక్షపధం - రామ దర్శనం🚩

ఆధ్యాత్మిక సాధకుల దృష్టిలో రామాయణ అంతరార్ధమిది. మన ఇంట బయట జరుగుతున్నదే రామాయణం
ఎలాగంటే -
అయోధ్య నగరం :
ఏ విధమైన సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు ఏవీ లేనటువంటి; సామాన్య జనునిచే జయింప వీలులేనటువంటి నగరం అయోధ్య. అనగా ఏ వాసనలు అంటని ఆనంద హృదయమే అయోధ్య.
ఆ అయోధ్య అధిపతి దశరధుడు. దశరధుడు అంటే దశేంద్రియములను (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) జయించినవాడు. ఆ దశరధమహారాజుకు సత్వ, రజో, తమో గుణములనే కౌసల్య, సుమిత్ర, కైకయి అనే ముగ్గురు భార్యలు.

రాముడు (ధర్మం) భరతుడు (శ్రద్ధ) లక్ష్మణుడు (భక్తి) శత్రుఘ్నుడు(శక్తి) అనే నలుగురు పుత్రులు.
భగవత్ తత్వాన్ని మానవాళికి అందించడానికి మాధవుడే మానవరూపములో వచ్చిన ధర్మావతారమూర్తి శ్రీరామచంద్రమూర్తి అందరిలో వున్నా ఆత్మారాముడు.
ఆత్మారాముడైన శ్రీరాముడు వ్యక్తమై అర్ధంకావాలంటే దానికి సంకల్పమనెడి మనస్సు అవసరం. ఆ మనస్సే సీత.
సీతారాములకు వివాహం జరిగింది. అటుపై కొంతకాలమునకు కైకయి కారణముగా శ్రీరాముడు అయోధ్యను విడిచి సీతతో కల్సి, లక్ష్మణుడు వెంటరాగా అరణ్యములకు వెడలెను. అనగా ఆనందముగా అయోధ్యలో వున్న ఆత్మరాముడు మనస్సనెడి సీతతో కూడి సుఖదుఃఖాలుతో కూడిన జీవితమనే అరణ్యములో ప్రవేశించాడు. వీడి వుండలేని భక్తి (లక్ష్మణుడు) ఆత్మను (రామున్ని) అనుసరించింది.

సీత రామున్నే చూస్తూ, రామున్నే తలస్తూ, రామున్నే జపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ - అంతా రాముడే అన్న భావనతో వున్నంతకాలం రామునితోనే కూడి ఆనందముగా ఉంది. అయోధ్య, అరణ్యము రెండునూ ఆమెకు ఒకేలా ఆనందమును ఇచ్చాయి. అంటే మనస్సు(సీత) ఆత్మతో(రామునితో) కూడి అంతర్ముఖురాలై వున్నంతకాలం అయోధ్యలోనూ, అరణ్యములోను ఆనందస్థితిలోనే వుంది.
ఒకరోజు సీత బంగారులేడిని చూసింది. ఆ లేడి కావాలని రామున్ని కోరింది. బంగారులేడి ఏమిటీ? ఇది రాక్షసమాయల వుందని రాముడు వారించినను వినక ఆ లేడిపై ఆశపడి తీసుకురమ్మని రామున్ని పంపింది. అనగా అంతవరకు అంతర్ముఖమై ఆత్మారామున్ని కూడి ఆనందముగా వున్న మనస్సుదృష్టి బహిర్ముఖమై బంగారులేడి రూపములో వున్న మాయలో పడి, ముందు ఆత్మని వదిలేసింది.

రాముడు వెళ్ళాకా తన దగ్గరే వున్న లక్ష్మణుడుని కూడా వెళ్ళమని దుర్భాషలాడి పంపేసింది. బహిర్ముఖమైన మనస్సు మంచిని, విచక్షణను మరిచి ప్రవర్తిస్తుందని అనడానికి ఈ ఘటనో దర్పణం. లక్ష్మణుడు వెళ్తూ గీసిన లక్ష్మణరేఖనూ దాటేసింది. దశకంఠుడు చేతికి చిక్కింది. పరమ దుఃఖితురాలైంది. లంకకు చేరింది. అంటే ఆత్మనెడి రామున్ని మొదట వదులుకున్న మనస్సు తర్వాత భక్తిత్వమనే లక్ష్మణుని విడిచిపెట్టింది. దశకంఠుడుకి బందీ అయి తీవ్ర బాధకు లోనైంది. కోరికలకు, రాగద్వేషాలకు, కోపతాపాలకు మనస్సులో స్థానం ఏర్పడితే బాధలు తప్పవు.

లంకా పట్టణం :
సుఖదుఃఖాలు, గెలుపోటములు, రాగద్వేషాలు, కోపతాపాలు... ఇత్యాదులకు నిలయం లంకాపట్టణం. అన్ని వాసనలను అంటిపెట్టుకున్న పట్టణం లంకా. దీనికి తొమ్మిది ద్వారములు. ఈ లంకాపట్టణం మానవ శరీరం. మానవ శరీరమునకు కూడా నవద్వారలున్నాయి.

లంకకు రాజు దశకంఠుడు. దశకంఠుడు అంటే దశేంద్రియములకు (5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు) లోబడినవాడు. లంక చుట్టూ సాగరము అనగా మానవుని చుట్టూ వున్న ఈ మాయాసంసార సాగరమే.
లంకలో వున్న సీత తన దుఃఖమునకు కారణం గ్రహించి, ఏకవస్త్రముతో వుంటూ రామునికై తపిస్తూ, రామున్నే ధ్యానిస్తూ, రాముడు వచ్చి తనని రక్షిస్తాడనే నమ్మకముతో వుంటుంది. అనగా తను బహిర్ముఖమై మాయలేడిపై ఆశపడి ఆత్మానందమును కోల్పోయి, దైవానుగ్రహం లక్ష్మణుని రూపేణ వున్న, దానిని వదులుకున్నందుకే తనకింత దుర్గతి పట్టిందని, తన దుఃఖమునకు కారణం తనేనని గ్రహించి తిరిగి రామున్ని చేరాలని ఏకధ్యాసతో అంతర్ముఖురాలైంది.

ఇక ఇక్కడ రాముడు సీతకై విలపిస్తూ (రాముడు భగవంతుడు అయినప్పటికీ పూర్తిగా మానవుడిగానే జీవించాడు), సీతను అన్వేషించడం ప్రారంభించాడు. అంటే భక్తుడు దారితప్పి తిరిగి తనకై పరితపిస్తుంటే భగవంతుడు కూడా అంతలానే ఆ భక్తునికై పరితపిస్తాడని ఇక్కడ అర్ధమోతుంది.
ఆంజనేయుడు :
ఆంజనేయుడు పవనతనయుడు. అంటే ఉచ్చ్వాస నిశ్శ్వాస స్వరూపమైన ప్రాణాయామ స్వరూపుడు.
మనస్సువేగం వాయువేగమునకు సమానం (మనోజవం మారుతతుల్య వేగం). అలా పరుగులు తీసే మనస్సుని నియంత్రించగలగడం శ్వాసతోనే సాధ్యం. ప్రాణాయామమే మనోనియంత్రనకు ఔషదం. ఈ ప్రాణాయామం ఎలా సాధ్యమౌతుందంటే ఇంద్రియములను జయించినప్పుడు (జితేంద్రియం) చక్కగా సాధ్యమౌతుంది.

ఈ ఇంద్రియములను ఎలా జయించ గలమంటే బుద్ధితో (బుద్ధిమతాం) జయించాలి. అప్పుడే ప్రాణాయామం చక్కగా జరుగుతుంది. ఈ ప్రాణాయామం స్వరూపుడు ఆంజనేయుడు. అంటే మూలాధారచక్రం మొదలుకొని సహస్రారం వరకు వ్యాపించగలిగిన
వాడు ఆంజనేయుడు. కుండలినీజాగృతి చేసి ఆత్మను పరమాత్మ దరికి చేర్చగల శక్తిమంతుడు ఆంజనేయుడు. భక్తునికి భగవంతునికి మద్య వారధి నిర్మాణకర్త ఆంజనేయుడే.
ఇక కధ లోనికి వస్తే -
సముద్రమును దాటి లంకలో ప్రవేశించాడు ఆంజనేయుడు.

అనగా సంసారసాగరమనే మాయను దాటి లంక అనెడి శరీరం లోనికి ప్రవేశించాడు. సీతను దర్శించి రాముని అంగుళీయకం ఇచ్చి, త్వరలోనే రాముడు వచ్చి నిను రక్షిస్తాడని చెప్పి ఆనంద పరుస్తాడు. అంటే ప్రాణాయామం శుద్దమనస్సును చూసి పరమాత్మ అనుగ్రహం నీకు కల్గుతుందన్న అభయమిచ్చి పరమాత్మదర్శన యోగ్యత నీకు త్వరలోనే కల్గుతుందని చెప్పి ఆనందపరుస్తాడు. అనగా ప్రాణాయామం వలన సాధకుని మనస్సుకు తెలుస్తుంది ఆత్మసాక్షాత్కారం కలగబోతుందన్న అనుభూతి కల్గి ఆనందస్థితిలో వుంటుంది.

ఆంజనేయుడు కొంతవరకు లంకాదహనం చేశాడు. అనగా లోపలున్న దుర్గుణాలు, వాసనలను కొంతవరకు దహనం చేశాడు. అయినా 'నేను' అనే అహంకారంతో రావణుడు హుంకరిస్తూనే వున్నాడు. అప్పుడు ఆంజనేయుడు మరింతగా తన తోకని పెంచి చుట్టలుచుట్టిన తోకనే ఆసనముగా చేసుకొని రావణుని ఎదుట కూర్చొని రామసందేశం వినిపించాడు. అనగా ప్రాణాయామ స్వరూపుడు అయిన ఆంజనేయుడు మరింతగా తన శక్తిని జాగృతి చేసి సహస్రారంవరకు ఎదిగి అక్కడ కూర్చొని లౌకికమైన కోరికలు, స్వార్ధం, అహంకారం విడిచి స్వస్థానంనకు మనస్సుని పంపేస్తావా, మరణిస్తావా అని సందేశం వినిపించాడు.
ఇటుపై కధ అందరికీ తెల్సిందే.

భగవత్ తత్వం అర్ధంకాక రావణుడు పతనమౌతాడు.
అగ్నిప్రవేశం చేసిన సీత రామున్ని చేరింది. అనగా సంపూర్ణముగా వాసనలన్నీ హరించబడి శుద్ధమనస్సు ఆత్మారామున్ని చేరింది.
తిరిగి అయోధ్యకి రావడం, పట్టాభిషేకం జరగడం అంటే అంతర్యామి అయిన రామునితో శుద్ధమనస్సనెడి సీత అయోధ్య అనెడి హృదయంలో కలిసివుండడమే పట్టాభిషేకం.
కొంతకాలమనంతరం సీతను అడవిలో విడిచిపెట్టేయడంలో ఆంతర్యం ఏమిటంటే -

శుద్ధమనస్సు అలానే హృదయంలోనే ఆత్మారామున్ని చూసుకుంటూ వుండిపోతే శుద్ధమనస్సు స్థాయిలోనే వుంటుంది. భగవంతుడు శుద్దమనస్సులను ఉద్ధరించి తనస్థాయిలో (చైతన్యంలో) పూర్తిగా లయం చేయాలని భావిస్తాడు కాబట్టి, ఎక్కడనుండి వచ్చిందో అక్కడ లయమౌతానే చైతన్యంలో కలుస్తుంది కాబట్టి సీత అనెడి శుద్ధమనస్సును విడిచిపెట్టడం జరిగింది. అప్పుడుకూడా సీత అంతర్ముఖురాలై దైవధ్యానంలో వుండి కొంతకాలం తర్వాత ఎక్కడ నుండి వచ్చిందో అక్కడే లయమైంది. పుడమి నుండి వచ్చి పుడమిలోనే లయమై చైతన్యస్వరూపిని అయింది.
మనోజవం మారుతతుల్యవేగమ్
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్
వాతాత్మజం వానరయూధ ముఖ్యమ్
శ్రీరామ దూతం శరణం ప్రపద్యే//
మనస్సమాన గతిలో వాయుసదృశ్య వేగంతో పరమజితేంద్రియుడై శ్రీమంతుల్లో(బుద్ధిలో) శ్రేష్టుడైన పవన నందనుడు వానరాగ్రగణ్యుడు అయిన శ్రీరామ దూతను శరణువేడుతున్నాను.


శ్రీ రామ చంద్ర చరణౌ మనసా స్మరామి!!
శ్రీ రామ చంద్ర చరణౌ వచసా గృణామి!!

శ్రీ రామ చంద్ర చరణౌ శిరసా నమామి!!

శ్రీ రామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే!!

శ్రీరామచంద్రుని చరణములను నేను మనసా స్మరించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములను వాక్కు ద్వారా కీర్తించుచున్నాను. శ్రీరామచంద్రుని చరణములకు శిరస్సు వంచి నమస్కరించు చున్నాను. శ్రీరామచంద్రుని చరణములను నేను శరణువేడుచున్నాను.🙏

Monday, April 13, 2020

బ్రాహ్మణులు

#బ్రాహ్మణులు పని చేతకాని వారనీ, శ్రమ చేయకుండా బతికేస్తారని... #లెఫ్టిస్టులు, దొంగ #అభ్యుదయవాదులు ప్రచారం చేస్తుంటారు... కాని...

బ్రాహ్మణులు అందరూ మంత్రాలు చదువుతూ #పౌరోహిత్యం చేసుకుంటూ ఎప్పుడూ కూర్చోలేదు!

బ్రాహ్మణులు ఉత్తరాదిలో చాలా రాజ్యాల్ని పరిపాలించారు. అంటే రాజులుగా కూడా ఉన్నారు ...

బ్రాహ్మణులు దాదాపూ ప్రతీ రాజుకి,బాధ్యతగల #మంత్రులుగా వుండేవారు! మంత్రులుగా వుండటం అంటే #శ్రమ చేయకుండా బతకటం కాదు. అదే నిజమైతే ఈనాటి ఐఏఎస్ లు, ఐసీఎస్ లు కూడా పని చేయటం లేదనే అర్థం!

బ్రాహ్మణులు చాలా ఊళ్లలో లెక్కలు చూడటం, #పత్రాలు రాయటం లాంటి క్లరికల్ వర్క్ చేసేవారు. వీళ్లని ఉత్తరాదిలో #కాయస్థులని అంటారని విన్నాను. మన దగ్గర #కర్ణీకం అంటారనుకుంటా...కరణాలు అంటారు

బ్రాహ్మణులు వేద కాలం నుంచి #గురుకులాల్లో పాఠాలు చెప్పేవారు. అంటే ఇప్పటి భాషలో టీచర్స్ అన్నమాట!
శరీరక కష్టం అందరూ చేస్తారు.... మానసిక శ్రమ బ్రాహ్మణులు మాత్రమే చేయగలరు.

ఓ సారి వీలుంటే ఢిల్లీ లోని స్వామినారాయణ్ కొలువైన #అక్షరధామ్ AksharDhaam వెళ్లి చూడండి అక్కడ వేదకాలంనుండే మన సంస్కృతీ సాంప్రదాయాలను బ్రాహ్మణునులు ఎలా కాపాడుతూ వచ్చారో చిత్ర రూపకంగా దృశ్యరూపం గా మలచి మనకు కనువిందు చేస్తారు నేను పోయినేడు వెళ్లి,మా కుటుంబసహితంగా నా కళ్లారా చూశాను కూడా

బ్రాహ్మణులు #ఆర్యభట్ట, #సుశ్రుతుడు, #చాణక్యుడు, #వాత్స్యాయనుడు లాంటి వారు కూడా! వీళ్లంతా రకరకాల విజ్ఞానాల్లో ఆరితేరిన వారు. అంటే సైంటిస్టులు, ఎక్స్ పర్ట్స్ అన్నమాట!

బమ్మెరపోతన లాంటి బ్రాహ్మణులు వ్యవసాయం కూడా చేశారు. సంఖ్య తక్కువై వుండొచ్చు.
ఆయుర్వేదం, యోగా, పంచాంగ శాస్త్రం, భారతదేశ భౌగోళిక స్వరూపం తెలిపే పురాణాల్లోని విజ్ఞానం... ఇదంతా కూడా ప్రధానంగా బ్రాహ్మణులే కాపాడుతూ వచ్చారు వేల సంవత్సరాలుగా!

సంగీతం, సాహిత్యం, వివిధ గ్రంథాలు , వాటి ద్వారా ఇవాళ్ల మనం తెలుసుకుంటున్న చరిత్ర, చారిత్రక ఆధారాలు కూడా అత్యధిక శాతం #బ్రాహ్మణులు పరంపరగా కాపాడినవే.

కేరళలోని #కలరిపయట్టు లాంటి అద్భుతమైన వ్యాయామ, యుద్ధ కళ కూడా బ్రాహ్మణులు 'శ్రమ' చేసి మాత్రమే భద్రంగా కాపాడారు!

భారతంలో కనిపించే ద్రోణాచార్యుడు మొదలు #సుభాష్
చంద్రబోస్, #బాలాగంగధర్ తిలక్ లాంటి స్వాతంత్ర్ర్య సమరయోధుల వరకూ చాలా మంది బ్రాహ్మణులు ఈ రణరంగంలో కూడా రక్తానికి భయపడకుండా ఎదురు నిల్చారు!

చివరకు.... ఈనాటి ఆధునిక భారతదేశంలో కూడా ఇస్రో నుంచి ఆర్మీ,,నేవీ, ఎయిర్ ఫోర్స్ దాకా బ్రాహ్మణులు అన్ని రంగాల్లో శ్రమ చేసే బతుకుతున్నారు! అఖరుకి, కొందరు గతిలేక పబ్లిక్ టాయిలెట్స్ వద్ద దుర్వాసన పీల్చుకుంటూ కూర్చునేది కూడా #జంధ్యం ధరించిన శ్రమ చేసే బ్రాహ్మణుడే!

అంతెందుకు!
1992లో మనదేశ రాష్ట్రపతి (శంకర్ దయాళ్ శర్మ), ప్రధానమంత్రి(పి. వి. నరసింహారావు), ప్రధాన ప్రతిపక్ష నాయకుడు (L. K.అద్వానీ) అంతేగాకుండా, చివరికి జాతీయ ఎన్నికల కమీషనర్ (T.N. శేషన్)వీరంతా బ్రాహ్మణులే.మన దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో ముందుకు నడిపిన వారే. దేశాన్ని ఆర్థిక సంస్కరణతో బలోపేతం చేయడం లో ప్రత్యక్షంగా, పరోక్షంగా తమవంతు కృషి చేశారు. వారి ఆనాటి కృషిఫలం, మనం ఈనాడు అనుభవిస్తున్నాం కదా !

అగ్రకులంలో పుట్టిన కారణంగా ఎంతో ప్రావీణ్యం ,ప్రతిభా పాటవాలున్నా రిజర్వేషన్ల కారణంగా కుమిలి కుమిలి చనిపోయిన నిర్భాగ్యులెందరో కూడా ఉన్నారు.

వీళ్లంతా పోనూ... వేదంపై ఆధారపడి మంత్రాలు చదవుతూ శ్రమ లేకుండా ( అని సో కాల్డ్ లెఫ్ట్ మేధావులు, దొంగ అభ్యుదయవాదులు చెప్పుకుని తిరిగే.. ) పురోహితం చేసే బ్రాహ్మణులు ఎప్పుడైనా ఒక్క శాతానికి మించరేమో!

వాళ్లని కూడా ప్రభుత్వాలు ఆదుకున్న పాపాన పోలేదు!
తమకు పూజలు అవసరం అయినప్పుడు పరుగెత్తుకుని వాళ్ల వద్దకు పోయే సామాన్య హిందువులు కూడా ( డబ్బున్న బ్రాహ్మణులతో కలిపి ) మిగతా సమయాల్లో వాళ్ల గతని పట్టించుకోలేదు!
కాని... నానా తంటాలు పడి బతుకుతోన్న పేద బ్రాహ్మణుల్ని శ్రమతెలియని వారు అని ఓ కామెంట్! దీన్నేమనాలి?

పోనీ...ఇంత క్లిష్ట సమయంలో...వీధిలో బిచ్చగాళ్లకు,పేదలకు, అన్ని వర్గాల్లోని కులాలకు అన్ని రాయితీలిచ్చింది గాక అధిక సదుపాయాలు అన్నదానాలు చేస్తుంది ... చెయ్యాలి కూడా

కానీ...బ్రాహ్మణ సమాజాన్ని అటు ప్రభుత్వాలు...ఇటు సామాన్య ప్రజానీకం,దనికవర్గం వీళ్ళ స్థితిగతుల గురించి కొంచమైనా ఆలోచిస్తున్నారా???

ఈ మధ్య కొందరు మనుధర్మ వ్యతిరేకులు ,మూర్ఖపు హేతువాదభావజాలమున్న కొన్ని సంఘాలవాళ్ళు పనిగట్టుకొని అంతా బ్రాహ్మణ వాదాన్ని తిడుతున్నారు అంటేనే అర్ధం చేస్కొండి వాళ్ళ మీద ఈ కమ్మిగాల్లకి ఇతర మతాలవారికి ఎంత కక్ష వాళ్ళ మీద ఉందొ ....

వీళ్ళే కదా హైందవ జాతిని,సంస్కృతీ సాంప్రదాయాలను ముందు ఉండి నడిపించింది ...కచ్చితంగా వాళ్ళే అని చెప్పవచ్చు ...

తిండి లేక అడుక్కుoటూ కూడా తమకి బిక్ష వేసిన వారిని మనసారా దీవించి పంపుతారు ....

ఒకరి పాప కర్మలని దానం రూపం గా వాళ్ళు మోస్తారు/భరిస్తారు ....

బ్రాహ్మణులను తిట్టేవాడి చేత, ఆ దానాలు తీస్కోమనండి చూద్దాం! దాని ఫలితం ఎలా ఉంటుందో? ..

దేవుని దగ్గర ఉండి తనకోసం కాకుండా భక్తుల కోర్కెలు తీర్చమని దేవుణ్ణి వేడుకునే వాడు
అలా చెయ్యడంవల్ల తనకి లభించే ఫలితాన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసం వదులుకున్నవాడు బ్రాహ్మణుడు ...

వాళ్ళు చేసే యజ్ఞాలు యాగాలు , క్రతువులు కేవలం తమ కడుపునింపు కొవడం మాత్రమె కాదు,
ఆ ద్రవ్యాల మీద ఆదారపడి బ్రతికే మనుషులకి/వ్యాపారులకు చివరకి దేవతలకి కూడా ఆదారం అయిన వాడు బ్రాహ్మణుడు ...

హైందవజాతి ఇంకా దృడంగా నిలబడాలి అని ఆశిస్తే సద్ బ్రహ్మనులని కాపాడండి.
వాళ్ళ సంతతి వృద్ది చెందే విదంగా చుడండి,వేద పాటశాలలకి సహాయం చెయ్యండి ...

సనాతన హైందవజాతి పునాదులు ఎవ్వరూ కదపలేరు ...ఇది వేదం చెప్పిన మాట , మన చెరిత్ర ఆదారాలతో సహా చాలాసార్లు నిరూపించిన సత్యం...

అందుకే బ్రాహ్మణవాదం అంతరించిపోవాలి అని, రాక్షసాంస వెతిరేకులు జీవితాంతం పోరాడుతూ ఉంటారు.

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు మరియు భగవద్గీత వంటి వేద మరియు పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.

( ఈ పోస్ట్ ఉద్దేశం బ్రాహ్మణులు అంతా మంచి వారే అనీ కాదు...,అందరూ చెడ్డవారే అనీ కాదు )

వాళ్లలోని కొందరు గతంలో చేసిన మడి,ఆచారం పేర కొంతవరకు కొంత తప్పులు ఉంటె ఉండవచ్చును గాక .

అప్పుడు అంటరానితనం అంట గట్టారు అంటారు గానీ...ఇప్పుడు కరోనా భయంతో అందరూ చేస్తున్నా భౌతిక దూరం మాటేంటి???
అంటే...అప్పుడు కూడా ఈ కరోనా లాంటి ఏదో మాయరోగం #గత్తర లాంటిదే వచ్చి ఉండొచ్చును కదా!
అలాగే ఇప్పటికీ చింత చచ్చినా పులుపు చావనివారు కూడా అక్కడక్కడా మిగిలి ఉండవచ్చు !...అలాగే కూటికి గతిలేక చెప్పుకోలేక బ్రతుకుతున్నవారూ ఉండవచ్చు

కాని, వాళ్లల్లో కొందరు అప్పటి చాందసులు చేసిన దానికి .. ఇప్పుడు ఈ తరమువారు బాధపడుతుంటే చూడాలని చెప్పే సిద్ధాంతం మాత్రం మానవత్వం అనిపించుకోదు! )

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ లో ఉన్నాకూడా తెల్లవారు జామున నిద్రలేచి తలస్నానం చేసి దేవాలయాలలో భక్తులు రాకున్నా సరే భగవంతునికి నిత్యారాధనలు చేస్తూ నిత్య నైవేద్యాలు సమర్పించి సమస్త మానవాళి మనుగడ క్షేమానికై లోకహితానికై సర్వేజనాః సుఖినో భవంతు అనీ భగవంతుణ్ణి ప్రార్థించే బ్రాహ్మణులు సోమరిపోతులే మరి.

బ్రాహ్మణత్వం మీద పడి ఏడ్చేజాతి
పిచ్చి వేదవళ్ళరా... అనాదిగా హైందవధర్మానికి,ఇక్కడి ఆచారవ్యవహార సాంప్రదాయాలకు,
కొన్ని సంకరజాతులకూ పుట్టు పునాదులు బ్రాహ్మణులే. లేరా..
వాళ్లే ఇక్కడ లేనినాడు నీజాతే లేదు...ఈదేశమే లేదు.

అట్లనీ... నేను బ్రహ్మణుడిని కాదురోయ్....ఓ #విశ్వకర్మని
మీ కర్త'వ్యాన్ని... నీ కర్మని ...నీ క్రియని గుర్తుచేసే హిందువుని...

Note:
ఇటువంటి ప్రశ్నలు బ్రాహ్మలు కూడా ఇతరుల పైన వెయ్యగలరు. కానీ వేయలేరు ఎందుకంటె వాళ్ళు నేర్చుకున్న సంస్కారం బాధ్యత వద్దంటుంది
ఆమాటకొస్తే... ప్రతివాడు మరో ఇతర కులాల మీద అపవాదులు ప్రశ్నలూ వెయ్యగలరు. ఈ ప్రశ్నలేందుకు ఉద్భవించాయో తప్పులెక్కడ జరిగాయో సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉంటె అందరికీ మంచిది
ఈ కులాల కుళ్లు కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే చాలామంది ని మనం దూరం చేసుకోవాల్సివస్తుంది.

..నేను రాసే ఈ పోస్ట్ లు కొందరు మహానుభావులనుండి ,వివిధ పుస్తకాలనుండి, కొన్ని మాధ్యమాలనుండి సేకరించి ,నా సొంతగా రాస్తున్నవే అయితే #నాపేరుని లేదా ఇంకొకరి సమాచారమైతే #వారి
పేరుని పోస్ట్ కిందా రాస్తాను అది మర్యాద/ సభ్యత కూడా .
{నా పోస్ట్లు గత ఐదేళ్లుగా కొందరు మంచిఉద్దేశ్యంతో watsaap లో మరియు మెస్సేజ్ ల్లో పంపిస్తూ వారి పేర్లను కింద రాసుకుంటున్నారు పరవాలేదు తిరిగి నన్నే Copy Cat అంటే బాధేస్తుంది }

ఎవరు సమాజసేవ చేసినా ఒకటే .. సమాచారం అందరికీ చేరడం ముఖ్యం కానీ ఇంకొకరిని దూషించడం తప్పు పట్టడం సభ్యత కాదేమో ?

ఇందులోని #అతికొన్ని_విషయాలు సేకరణ శ్రీ Chaturvedi గారి నుండి
source:whatsapp message 🙏

అన్ని బంధాల నుంచి విముక్తిని ప్రసాదింపచేసేదే మంత్రపుష్పం

🕉️అన్ని బంధాల నుంచి విముక్తిని ప్రసాదింపచేసేదే మంత్రపుష్పం🕉️ 

🌸 దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు కదా.. ఆ పరమాత్మ సర్వత్రా వున్నాడని చెప్పటమే ఆ మంత్రపుష్పం ఉద్దేశ్యం. మన లోపల, బయట కూడా వ్యాపించి వున్న ఆ దేవదేవుడు మన శరీరంలో ఏ రూపంలో వున్నాడో చెబుతుంది మంత్రపుష్పం.

🌸 ‘‘మన శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడని వర్ణించబడింది’’

🌸 చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత, ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందిట.

🌸 మనలోనే వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి నేను, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని ఈసారి విన్నప్పుడు కళ్ళు మూసుకుని మీలోని ఆ పరమాత్మని దర్శనం చేసుకోండి

ఇంకొక వర్ణన:
🌸 మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రాలున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్రమైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు.

🌸 మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగుతాయని అధర్వ వేదం చెబుతోంది. ‘మన్‌’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది. విస్తృత అర్థంలో, మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం!

🌸 యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఆరణ్యకంలో మంత్రపుష్పం వివరాలున్నాయి. సర్వసామాన్యంగా యజ్ఞయాగాల సమయంలో మంత్రపుష్పాన్ని చదువుతారు. జీవజాలానికి జలం ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైందో మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని మంత్రంలో ఉంది. జలం భగవంతుడితో సమానం. అది జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది మంత్రపుష్పం!

🌸 నీరు ఇహానికి, పరానికి సంబంధించింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది మంత్రపుష్ప సారాంశం.

🌸 పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడట. మోక్షమార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే! అందుకే ‘దైవం పరంజ్యోతి’ అంటారు. ఆయనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.

🌸 సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటానుకోట్లు ఉన్నాయని, వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తిమంతుడినని భావిస్తాడు. అతడి కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్యకుటుంబం మరెంతో పెద్దది. అలాంటి కుటుంబాలే కోట్లలో ఉన్నాయంటే... బ్రహ్మాండంలో మనిషి స్థానమెంత? పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకొంటే, మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ శ్రీమన్నారాయణుడు భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

🌸 మంత్రపుష్పం ప్రకారం- జఠరాగ్ని మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగసి ఉంటుంది. దాని నీలి జ్వాల మధ్య, ఉరుములోని వెలుగురేఖలా అణువుతో సమానంగా మెరుపు ఉంటుంది. అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని, ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞానశాస్త్రమూ వెల్లడిస్తోంది. మానవాళికి సంతోషాన్ని కలగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. ఆయన సముద్ర మథనం సందర్భంలో ఉద్భవించాడు. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి.

🌸 పడవకు నీటికి ఉన్నట్లే, దైవానికి-మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా, భక్తులు ఏ దైవానికి నమస్కరించినా, అది కేశవుడికే చెందుతుందని మంత్రం చెబుతోంది. పరబ్రహ్మమే గొప్పవాడని, జగదానంద కారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే అన్ని బంధాల నుంచీ విముక్తి లభిస్తుందని వివరిస్తుంది మంత్రపుష్పం.

ఇంతకి రాక్షసులంటే ఎవరు?

ఇంతకి రాక్షసులంటే ఎవరు?

ఒకప్పుడు రాక్షసులంటే ప్రత్యేకంగా కొమ్ములు, కోరలతో భయంకరంగా ఉండేవారని మనకు తెలుసు. వాళ్ళను చూస్తేనే జనం హడలి చచ్చేవాళ్ళు. ఇప్పుడు యుగాలు మారాయి, కనుక వారు కూడా రూపాంతరం చెందారు. అసలు రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయో, ఈ కాలంలో ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో పరిశీలిద్దాము. ఇవన్నీ మన శ్రీ మద్భాగవతం మొదలైన పురాణాల్లో చెప్పబడిన విషయాలు.

1) సాధారణ జనులు త్రాగే నీటి వనరులైన నదులను, చెఱువులను, కాలువలను విషతుల్యం చేసి, అవి వినియోగానికి పనిరాకుండా చేసేవారు. విషతుల్యమైన వనరులను ఉపయోగించిన అమాయకులు మరణించేవారు. ఆ విధంగా హింసించి ఆనందించేవారు.

2) ఆహార పంటలను ధ్వంసం చేసేవారు. ఆహారన్ని విషతుల్యం చేసేవారు. భూమి వ్యవవసాయానికి పనిరాకుండా చేసేవారు.

3) గాలిలోకి విషవాయువులను పంపించి, జనుల మృతికి కారణమయ్యేవారు.

4) ప్రకృతిని కలుషితం చేసేవారు. అడవులను నరికి, ఉద్యానవనాలను నాశనం చేసి నిప్పు పెట్టేవారు. హిరణ్యకశిపుడు ఈ విధంగానే చేశాడని శ్రీ మద్భాగవతం చెబుతోంది.

5) జీవహింస చేసేవారు. లక్షల సంఖ్యలో గోవులు మరియు సకల జీవరాశి యొక్క మృతికి కారణమయ్యేవారు.

6) అవసరమైన దానికంటే అధిక సంఖ్యలో వనరులను వినియోగించి, భూమిని పీల్చి, పిప్పి చేసి, గుల్ల చేసేవారు. హిరణ్యాక్షుడు చేసిందాంట్లో ఇది కూడా ఉంది.

7) జనులను మానసికంగా, శారీరింగా హింసించేవారు, భయభ్రాంతులకు గురి చేసేవారు. రావణుడికి ఆ పేరు రావడానికి కారణం ఇదే. అనసవరంగా జనాల్లో భయం కలిగించేవాడు.

8) యజ్ఞయాగాదులను విమర్శించేవాళ్ళు, వాటి మధ్యలోనే ఆపివేయడానికి విఘ్నాలు కలిగించేవారు, వాటిని భగ్నం చేసేవారు. సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసేవారు. మంచి పనులు చెద్దామనుకున్నవారికి ఆటంకాలు కలిగించేవారు.

9) తమ ఆలోచనతో అంగీకరించనివారిని హింసించి చంపేవారు. అందరూ తమవలె ఆలోచించాలని, తమనే దైవంగా పూజించాలని బలవంతపెట్టేవారు.

10) కొందరు రాక్షసులు దేవుడిని నమ్మేవారు, కొందరు దేవుడిని నమ్మేవారు కాదు, కొందరేమో తామే దేవుడని ప్రచారం చేసుకునేవారు.

ఇప్పుడు పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయో చూడండి. బాంబులు వేసి జనాల మృతికి కారణమయ్యేవాడు ఉగ్రవాది అయితే, భూసారం క్షీణించడానికి, నదులు కలుషితమై జనులు అనారోగ్యం పాలవడానికి కారకులయ్యేవారు ఉగ్రవాదులు కారా? తేడా ఒకటే, ఒకరు హింసతో అధికారం చెలాయించాలని చూస్తుంటే, వెరొకరు వ్యాపారం పేరుతో అధికారం చెలాయిస్తూ విధ్వంసం చేస్తున్నారు, మిగితావారు నిర్లక్ష్యంతో చేస్తున్నారు. ప్రపంచ జనాభాకు రెండింతల ఆహారం భూమి ద్వారా లభిస్తుంటే, ఆ మొత్తాన్ని జంతువులకు పెట్టి, ఆ జంతువులను తింటున్నారు మనుష్యులు, వెరొకరి ఆకలి చావుకు కారణమవుతున్నారు. భూమిని పిండి మొత్తం వనరులు ఒక తరంలోనే ఖాళీ చేసేస్తున్నారు.

ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చూడండి. మానవుల కార్యకలాపాలన్నీ స్థంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకృతి ఊపిరి పీల్చుకుంటోంది. ప్రకృతి తిరిగి తన పూర్వస్థితికి వస్తోంది. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, కాలుష్యం తగ్గింది. మనుషులంతా ఈ విపత్తు తొలగించమని దేవుడిని వేడుకుంటుంటే, ప్రకృతి ఇదే బాగుందని ఆనందిస్తోంది. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్ధన వినాలి ? (ఈ విపత్తు తొలగిపోతుంది, అయినప్పటికీ ఒకసారి ఆలోచన చేయండి) దీనిబట్టి ఇన్నాళ్ళు ప్రకృతిని హింసించిన రాక్షసులు ఎవరో చెప్పకనే చెబుతోంది ప్రకృతి. ఆత్మవిమర్శ (Self-introspection) చేసుకుని ప్రకృతి హిత జీవనానికి బాటలు వేయడానికి ఇదే సరైన సమయం. బహుసా! మనకు భగవంతుడు చెబుతున్నది కూడా అదేనేమో ! మనం వింటున్నామా ?! మనం మారతామా ? ప్రభుత్వాలు ప్రకృతి హితమైన అభివృద్ధి దిశగా బాటలు వేస్తాయా ? ఇప్పుడున్న విధానాలు మారుతాయా ? సామాన్యులు సైతం ఈ దిశగా తమ జీవితాలను రూపుదిద్దుకుంటారా?

మనం దైవీ లక్షణాలను ప్రదర్శించనవసరంలేదు. రాక్షసగుణాలు వదిలి, మనుష్యులుగా బ్రతకడం నేర్చుకుంటే చాలు. అందుకే వేదం 'మనుర్భవ' - ముందు మనుష్యులుగా మారండి అని సందేశం ఇచ్చింది. కనీసం ఇప్పుడైనా వింటామా ?

గర్వం ఉన్న వ్యక్తి ఎలా పతనం అవుతాడు?

గర్వం

🍁🍁🍁

గర్వం ఉన్న వ్యక్తి ఎలా పతనం అవుతాడు?


1) విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు

గర్వం ఉన్నందు వల్ల మనం పూర్తి గా భౌతిక మనస్సు చెప్పినట్టు వింటాము, భౌతిక మనస్సు కు ఆధ్యాత్మిక నియమాలు తెలియవు, ఇతరులు మన గురించి ఏమనుకోవాలను కుంటామో దాని గురించి ఆలోచించి వారి మెప్పు కోసం పనులు చేస్తూ, అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం.

2) ఆధ్యాత్మికం గా పతనం చెందుతాడు

గర్వం పెరగడం వల్ల వారు దేవుడున్నడని నమ్మరు, ఉన్నత శక్తి వుండే అవకాశం లేదంటారు, వారి చేష్టల వల్ల వారి ఉప చేతనాత్మక మనస్సు ని నిద్రాణo చేసుకుంటారు.

3) తక్కువ స్థాయి స్పందనలు వస్తాయి

మనం ఏదైనా వ్యతిరేక మయిన పని చేస్తే మన తల చుట్టూ నల్లని మేఘం లా వ్యతిరేక శక్తి కమ్ముకుని వెలుతురిని రానివ్వ కుండా ఒక చక్రం సృష్టింప బడుతుంది, దాని వల్ల మనం బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము.

4) అసూయ వస్తుంది

అసూయ వల్ల మనం ఇతరులతో పోల్చు కుంటాం, మనకు జరిగిన మంచి విషయాలను గమనించ కుండా మన కేమి జరగలేదో అవే గుర్తు తెచ్చుకుని బాధ పడుతూ, ఇతరులకు జరిగిన మంచి విషయాలు చూసి సహించ లేరు.

6) ఎప్పుడు అసంతృప్తి తో ఉంటాడు

భూ లోకం లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం తృప్తి తో జీవించడం, భౌతిక మనస్సు మాట వినడం వల్ల అహం ఏర్పడుతుంది, అది మనల్ని ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది, మనం ఆ కోరికలకు లోబడి పోయి సంపద, అధికారం, కీర్తి, సంపాదిస్తాం, కానీ అవేమి మనకు తృప్తి ని ఇవ్వవు.

7) శత్రువులు అధికం అవుతారు

గర్వాన్ని అదుపు లో ఉంచు కోకుండా అనాలోచితం గా మూర్ఖం గా మాట్లాడడం వల్ల శత్రువులు ఏర్పడతారు.

8) బంధుత్వాలు నష్టపోవడం జరుగుతుంది

గర్వం వల్ల ఆధిక్యతా భావం వస్తుంది, దీని వల్ల బంధుత్వాలు నిలబడవు.

9) ఆశలు ఎక్కువ అవుతాయి

అహం ఉన్నందు వల్ల ఇది నేనే చెయ్యాలి, ఇది నాకే దక్కాలి, అనుకుంటాం, దీని వల్ల ఆశ , ఆశ వల్ల వత్తిడి, ఆశ వల్ల ఇతరుల నుండి ఏవేవో కావాలనుకుంటారు.

ఏ వ్యక్తి అయితే వీటిని గమనించి అతడు అతని దృష్టి ని మరలుస్తాడో అతను ఆధ్యాత్మికం గా ఎదుగుతాడు.

గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు ..

💐💐గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు ..💐💐
పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .

ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు , వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు.

1.పాగేలమ్మ
2.ముత్యాలమ్మ
3 .గంగమ్మ
4.గంగానమ్మ
5.బంగారమ్మ
6.గొంతెమ్మ
7.సత్తెమ్మ
8.తాళమ్మ
9.చింతాలమ్మ
10.చిత్తారమ్మ
11.పోలేరమ్మ
12.మావుళ్లమ్మ
13.మారెమ్మ
14.బంగారు బాపనమ్మ
15.పుట్టానమ్మ
16.దాక్షాయణమ్మ
17.పేరంటాలమ్మ
18.రావులమ్మ
19.గండిపోచమ్మ
20.మేగదారమ్మ
21.ఈరినమ్మ
22.దుర్గమ్మ
23.మొదుగులమ్మ
24.నూకాలమ్మ
25.మరిడమ్మ
26.నేరెళ్లమ్మ
27.పుంతలో ముసలమ్మ
28.మాచరమ్మోరు
29.మద్ది ఆనాపా అమ్మోరు
30.సొమాలమ్మ
31.పెద్దయింట్లమ్మ
32.గుర్రాలక్క
33 .అంబికాలమ్మ
34.ధనమ్మ
35.మాలక్షమ్మ
36.ఇటకాలమ్మ
37.దానాలమ్మ
38.రాట్నాలమ్మ
39.తలుపులమ్మ
40.పెన్నేరమ్మ
41.వెంకాయమ్మ
42.గుణాళమ్మ
43.ఎల్లమ్మ
44.పెద్దమ్మ
45.మాంటాలమ్మ
46.గంటాలమ్మ
47.సుంకులమ్మ
48.జంబులమ్మ
49.పెరంటాలమ్మ
50.కంటికలమ్మ
51.వణువులమ్మ
52.సుబ్బాలమ్మ
53.అక్కమ్మ
54.గనిగమ్మ
55.ధారాలమ్మ
56.మహాలక్షమ్మ
57.లంకాలమ్మ
58.దోసాలమ్మ
59.పళ్ళాలమ్మ
60.అంకాళమ్మ .
61.జోగులమ్మ
62.పైడితల్లమ్మ
63.చెంగాళమ్మ
64.రావులమ్మ
65.బూరుగులమ్మ
66.కనకమహాలక్ష్మి
67.పోలమ్మ
68.కొండాలమ్మ
69.వెర్నిమ్మ
70.దే శిమ్మ
71.గరవాలమ్మా
72.గరగలమ్మ
73.దానెమ్మ
74.మహాంకాళమ్మ
75.వేరులమ్మ
76.మరిడమ్మ
77.ముళ్ళ మాంబిక
78.యలారమ్మ
79.వల్లూరమ్మ
80.నాగులమ్మ
81.వేగులమ్మ
82.ముడియలమ్మ
83.రేణుకమ్మ
84.నంగాలమ్మ
85.చాగాలమ్మ
86.నాంచారమ్మ
87.సమ్మక్క
88.సారలమ్మ
89.మజ్జిగౌరమ్మ
90.కన్నమ్మ -పేరంటాలమ్మ
91.రంగమ్మ -పేరంటాలమ్మ
92.వెంగమ్మ -పేరంటాలమ్మ
93.తిరుపతమ్మ
94.రెడ్డమ్మ
95.పగడాలమ్మ
96.మురుగులమ్మ
97.కుంచమ్మ
98.ఎరకమ్మ
99.ఊర్లమ్మతల్లి
100.మరిడమ్మ
101.సుంకాలమ్మవ్వ🙏

మన ఆచారాలు...త‌ల‌స్నానం

మన ఆచారాలు....
🕉️💐🕉️💐🕉️💐🇮🇳
శుక్రవారం వ‌స్తే చాలు ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేసేస్తుంటారు.
అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి.

త‌ల‌స్నానం అంటే న‌లుగు పెట్టుకోవ‌డం,
త‌ల‌కు శాంపులు పెట్టుకోవ‌డం,
దీనిని త‌లంటు అని కూడా అంటారు.
రోజు త‌ల‌స్నానం చేసే వారికి మాత్రం ఇది వ‌ర్తించ‌దు.

వారానికి ఒక్క‌సారి లేదా రెండు సార్లు త‌ల‌స్నానం చేసేవారికి మాత్రం లక్ష్మీవారం తలస్నానం మంచిదికాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా మంగ‌ళ‌వారం, శుక్ర‌వారం ఆడ‌వాళ్ళు త‌ల‌స్నానం చేయ‌రాదు అంటున్నారు పండితులు.

ఒక వేళ శుక్ర‌వారం త‌ల‌స్నానం చేస్తే సౌఖ్యాల‌న్నీ దూర‌మ‌వుతాయని హెచ్చరిస్తున్నారు.

అదే శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే ఐశ్వ‌ర్యం ల‌భిస్తుంది అంటున్నారు.
ఇంకా..తలస్నానం గురించి శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి:

వారము – తలస్నాన ఫలితము.!💐

ఆదివారము -
సంతాపము , కలత, అందముపోవుట

సోమవారము –
కాంతి తగ్గును , భయము , కలవరము

మంగళవారము –
ఆయుక్షిణమూ , విరోధము , భర్తకి కీడు .

బుధవారము –
శుభము , లాభము , బుద్ది , జాడ్యము .
మరియు భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఐక‌మ‌త్యంగా ఉంటారు.

గురు వారము –
ఆశాంతి , ధనవ్యయము , కీడు

శుక్రవారము –
శరీర పీడ , అశాంతి ( ఆడవారు చేయొచ్చు )

శనివారము –
ఆయుర్ వృద్ది , కుటుంబ సౌఖ్యము , లాభము.
శ‌నివారం త‌ల‌స్నానం చేస్తే చాలా మంచిది.

తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు.
ఎందుకంటే..సమస్తమైన భూత ప్రేతాది శక్తులు వెంట్రుకల గుండా ప్రవేశిస్తాయట.
అందుకే తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదట.

స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో ఇంట్లో తిరుగుతూ ఉంటే అనేక దుష్ట గ్రహాలు ఆవహించి ఆడవాళ్లలో
కామ లక్షణాలను ప్రేరేపిస్తాయట.
అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి కామం కలుగుతుందట.

తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా
జుట్టు కొసలను ముడివేసుకొని పూజ/దైవదర్శనం చేయాలి.

విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ,
శుభకార్యాల్లో పాల్గొనడం గాని అశుభం.
అలా చేస్తే లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని
(దరిద్ర దేవత) ఆహ్వానించినట్లే.

ఇప్పటి రోజుల్లో...జడ వేసుకునే వారు కరువయ్యారు..!

ఓం నమః శివాయ..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!!💐

#గర్భములో #శిశువు #పిండ #రూపంలో #భగవంతుని #ప్రార్థిస్తాడా? #ఎలా?

#గర్భములో #శిశువు #పిండ #రూపంలో #భగవంతుని #ప్రార్థిస్తాడా? #ఎలా?:

స్త్రీ గర్భములోనే శేషన దు:ఖముతో జీవుడు ప్రవేశిస్తాడు. ఫలదీకరణము జరిగిన తరువాత శిశువు పరిణామక్రమము.
ఒక రోజుకు ఖలిలమౌతాడు.
ఐదు రోజులకు బుద్భుదాకారము పొందుతుంది.
పది రోజులకు బదరీఫలములాగా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు.
ఒక నెలకు శిరస్సు ఏర్పడుతుంది.
రెండు నెలలకు బాహువులు తదితర అవయవాలు ఏర్పడుతాయి.
మూడు నెలలకు గోళ్లు, రోమాలు, చర్మము, లింగము, నవరంధ్రములు ఏర్పడుతాయి.
నాలుగు నెలలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి.
ఐదు నెలలకు ఆకలి దప్పికలు ఏర్పడుతాయి.
ఆరు నెలలకు జరాయువు, మావిచేకప్పబడి గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు.

మాతృ భుక్తాన్న పానీయాలచే క్రమక్రమంగా వృద్ది చెందుతూ దుర్గంధ భూయిష్టమైన మల మూత్రాల గుంటలో ఉన్న పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కరుస్తూ ఉండగా, ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు. నరకయాతన, నరకాను భవము జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది.

తల్లి తీసుకునే ఆహారములోని, దుస్సాహాలైన కట్వాములు (ఉప్పు) లవణాది పదార్థముల వలన సర్వాంగాల యందు వేదన కలుగుతూ ఉంటుంది. మావి చేత ప్రేవుల చేత చుట్టబడి వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై, అధశిరస్కుడై తల్ల కిందులుగా ఉంటాడు. పంజరంలో పక్షి లాగా జీవుడు గర్భంలో బంధింప బడి ఉంటాడు. అప్పుడు భగవంతుని దయ వలన, పూర్వ జన్మలలో చేసిన పాపములు గుర్తొస్తాయి. అపుడు గత జన్మలో చేసిన పాప పుణ్యముల కారణంగానే కదా ఈ జన్మమునకు వచ్చింది, అని బాధ పడుచూ ఉంటాడు. కర్మ ఫలితం అనుభవించడానికే కదా మరలా ఈ జన్మ అని గుర్తుకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అలా పరితపిస్తూ జీవుడు బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతుని మీద కృతజ్ఞతతో (మరలా మానవ జన్మ ఇచ్చినందుకు) గద్గద స్వరంతో భగవంతుని ప్రార్థించడం గర్భంలోనే ప్ర్రారంభిస్తాడు.

గత జన్మలలో చేసిన పాపపుణ్యముల సంఘాతమే కదా ఈ మానవజన్మ. అని తలంచుచూ భగవంతునికి మాతృ గర్భంలో ఉన్నప్పుడే మాట ఇస్తాడు. ప్రమాణం చేస్తాడు.

నీ మాయచే మోహితుడు కావడం వలన బిడ్డలు, భార్య, అహంకారము, మమకారము, కామము వీటియందు పడి, సంసార నిమగ్నుడనై, సంసారమే బ్రతుకని మంచి, చెడులను విడచి ధర్మము, అధర్మము అని చూడకుండా, ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపములు జరగడానికి కారకుడయ్యాను. అలా సంపాదించిన ధనము, భాగ్యములను నా భార్యాబిడ్డలు అనుభవించుచున్నారే కానీ నన్ను గురించి పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తిపాస్తులు బిడ్డల పాలు పాపములు మాత్రం నా పాలు అయినది.

ఓ భగవంతుడా ఈ దుర్గంధముతో ఈ గర్భములో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడవేయుము. నేను బయటపడితే ఈ సారి పాపకృత్యముల జోలికిపోను. నన్ను నమ్ముము. మీ చరణారవిందములను విడువను. ఎల్లప్పుడూ మీ చరణాలనే స్మరిస్తూ ఉంటాను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నము చేస్తాను. ఈ సారి నాకు సంసారబంధములను కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారము జోలికి పోను. పరాత్పరా ఈ మల మూత్ర కూపములోని దుర్గంధమును భరిచలేక, మరియు జఠరాగ్ని రూపంలోని వేడి వలన మాడిపోవుచున్నాను. భరించలేకున్నాను. నన్ను బయట పడవేయుము. మిమ్ములను మరచిపోను అని ప్రార్థిస్తాడు జీవుడు.
మరి మాతృ గర్భంలో భగవంతునికి ఇచ్చిన మాటను మనము నిలబెట్టుకుంటున్నామా? ఆలోచించండి. మీరే తగు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మనము విజ్ఞులము.
గరుడ పురాణ ప్రధమాధ్యాయ ఇహిక, ఆనుష్మిక, దుఃఖ నిరూపణము నుండి.కానీ పుట్టిన మరుక్షణం గతం మరిచిపోతాడు.

కొత్త యుద్ధం - ప్రస్తుత పరిస్థితి కి అద్దం పట్టే కథ...(కరోనా కథ)

కొత్త యుద్ధం

( ప్రస్తుత పరిస్థితి కి అద్దం పట్టే కథ... తప్పక చదవండి.)

(కరోనా కథ)

అది ఒక అందమైన జింకల వనం. అందులో జింక జాతులు ఆనందంగా, నిర్భయంగా జీవిస్తున్నాయి.

ఒకసారి ఆ వనం నుంచి ఒక జింక దారి తప్పి, వేరే అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి ఎన్నెన్నో కొత్త కొత్త జంతువులు కనిపించాయి. తోడేళ్ళనూ, పులులనూ, సింహాలనూ, నక్కలనూ తొలిసారి అక్కడే చూసింది.

అక్కడ ఒక కొమ్ముల జింక ఎదురై- ‘‘ఓ జింక సోదరా! ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే!’’ అంది.

‘‘అవును. మాది జింకల వనం!’’

‘‘ఈ అడవి మీ జింకల వనం లాంటిది కాదు. ఇక్కడ మనల్ని చంపి తినే క్రూరమృగాలు ఉన్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మీకసలు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో!’’ అంటూ ఆ జింక గెంతుతూ వెళ్ళిపోయింది.

‘‘పిరికి జింక! నేనూ జింకనే. అదెలా తప్పించుకోగలదో నేనూ అలాగే తప్పించుకోగలను’’ అనుకుంటూ జింకలవనం జింక ముందుకు వెళ్ళింది.

అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న సింహం కనిపించింది. జింక మెల్లగా దాని దగ్గరకు వెళ్ళి, తన ముంగాలి గిట్టతో సింహం తోకను తొక్కింది.

సింహానికి మెలకువ వచ్చింది. బద్దకంగా లేస్తూ జింకను చూసింది. గర్జించింది. ఆ గర్జన విని, జింకకు గుండె ఆగినంత పని అయింది.. వెను తిరిగి వచ్చిన దారినే పరుగులు పెట్టింది. అడవి దాటి జింకలవనం వైపు పరుగులు తీస్తూనే ఉంది. జింకలవనం సమీపానికి రాగానే సింహానికి చిక్కింది. సింహం దాన్ని చంపి, చీల్చి ఆరగించింది.

తరువాత సింహం లేచి మెల్లగా జింకలవనంలోకి వెళ్ళింది. దానికి అది కొత్త ప్రదేశం. అక్కడ దానికి గుంపులు గుంపులుగా జింకలు కనిపించాయి. సింహం ఆనందానికి అంతు లేదు. దొరికిన జింకను దొరికినట్టు చంపి తినేస్తోంది.

కొత్తగా ముంచుకొచ్చిన ఈ మృత్యువును చూసి జింకలన్నీ భయపడిపోయాయి. చెల్లాచెదురయ్యాయి. పొదల్లో దాక్కున్నాయి. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. పొరపాటున ఏ జింకయినా బయటకొస్తే చాలు... సింహం దాన్ని పడగొట్టేస్తోంది.

అయితే ఆ జింకల్లో తెలివైన కుర్ర జింక ఒకటుంది. దాని పేరు జ్ఞాననేత్ర. జింకల పెద్దలు జ్ఞాననేత్ర దగ్గరకు వచ్చి- ‘‘దీనికి పరిష్కారం ఏమిటి?’’ అని అడిగాయి.

‘‘జింక పెద్దలారా! నేనూ అదే ఆలోచిస్తున్నాను. ఈ క్రూరజంతువును ‘సింహం’ అంటారు. దీని పంజా నుంచి తప్పుకొనే చాకచక్యం మనకు లేదు. ఎటు ఆలోచించినా, ఎంత యోచించినా ఒకే ఒక్క దారి కనిపిస్తోంది. ఈ సింహం ఆహారం లేకుండా 14 రోజులు మాత్రమే బతకగలదు. కానీ మనం 21 రోజులు బతకగలం. కాబట్టి మన జింకలన్నీ తమ పొదల్లోకి దూరి 14 రోజులు బయటకు రాకుండా ఉంచే చాలు. దీని పీడ మనకు విరగడ అవుతుంది. మనలో ఎవరైనా నిర్లక్ష్యంతో బయటకు వచ్చి దానికి చిక్కారా... దాని జీవిత కాలాన్ని మరో 14 రోజులు పెంచినట్టే! ఈ రోజు అమావాస్య. ఇప్పుడే పొదల్లోకి చేరిపోదాం. పున్నమి నాటికి బయటకు వద్దాం. తమ పొద నుంచీ ఏ జింకా బయటకు రాకుండా చూసే బాధ్యత ఆ జింకల పెద్దలదే!’’ అంది.

జింకలన్నీ జ్ఞాననేత్ర మాటలు విన్నాయి. ఆకలితో అలమటించాయి.

పున్నమి వచ్చింది. జింకలన్నీ ఒక్కొక్కటీ భయం భయంగా బయటకు వచ్చాయి. వనం మధ్య చెట్టుకింద చచ్చి పడి ఉన్న సింహాన్ని చూశాయి. ఆనందంతో అరిచాయి. గెంతాయి. జింకల కేరింతలతో వనమంతా పులకరించింది🌱🌴🌳🦚🦚🦜🦜...
సేకరణ ....నగేష్ ...పడమటింటి ..ఎడిటర్ హిస్టారికల్ తెలంగాణ....

అతి శీతల గిడ్డంగిలో పని చేస్తున్న ఓ వ్యక్తి కథ!

అతి శీతల గిడ్డంగిలో పని చేస్తున్న ఓ వ్యక్తి కథ!

🌹 ఆ రోజు పొద్దుపోయి... చీకట్లు ముసురువేళ..ఎవరికి వాళ్లు పని ముగించికొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు! అతను మాత్రం సమయం చూడకుండా ఆ శీతల యంత్రంలో పచ్చిన సాంకేతిక సమస్యను సరిజేస్తూ లోపలే ఉండిపోయాడు! దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసేసారు! గాలి చొరబడిని శీతలగిడ్డంగిలో తాను అనుకోకుండా బంధీనైనాని గ్రహించాడు! గంటలు గడుస్తున్నాయి! బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీప సమాది కాబోతున్నాననుకుంటున్న సమయంలో.... ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి... ఆశ్చర్యం... టార్చ్ లైట్ తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు! బయటకు వచ్చేటపుడు ఈ అధ్భుత ఘటన నుండి తేరుకుంటూనే "నేను లోపలే ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీకు సమాచారం ఎవరిచ్ఛారు?" అడిగాడు గార్డ్ ని!
"ఎవ్వరూ చెప్పలేదు సార్! ఈ సంస్థలో 50 మందికి పైనే పని చేస్తున్నారు... కానీ ప్రతిరోజూ విధి నిర్వహణకు వస్తూ ఉదయం 'హలో' అని.. సాయింత్రం ఇంటికి వెళ్తూ 'బై' అని చెప్పి పలకరించేది మీరొక్కరే సర్! ఈరోజు ఉదయం 'హలో' అని పలకరించిన మీరు.. సాయింత్రం 'బై' చెప్పలేదు.. దాంతో నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్!"

అతనూహించలేదు.. అతనికి ముందుగా తెలియదు! భేషిజం గాని బాన్'ఇజం గాని లేకుండా ప్రతిరోజూ ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపుపూర్వక "సంజ్ఞ" కారణంగా తన ప్రాణాలు కాపాడబడ్తాయి అని!

మనకు తెలియకపోవచ్చు అటువంటి అధ్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చని!

నిజ జీవితంలో పరస్పరం ఉపయోగించే భావజాలం, ప్రవర్తన, చర్యలను బట్టే ఎదుటి వారి వైఖరి ఉంటుంది! అందుకు ఎవరికీ ఏ విద్యార్హతలు ప్రమాణికం కాదు!🌹

గౌతముడి ఏనుగు - మహాభారతము లోని కథ

గౌతముడి ఏనుగు

మహాభారతము లోని కథ

ఒకసారి గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లిలేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. స్వాభావికముగా దయార్ద్రహృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకు వచ్చి పెంచుకున్నాడు. కాలక్రమేణ అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముని వద్దకు వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగినాడు. గౌతముడు “తల్లీ తండ్రీ లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా పెంచుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకు అడివినుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు” అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు “నీవు అడిగినన్ని గోవులు కావలిసినంత బంగారము ఇస్తాను. ఈ ఏనుగును నాకు ఇవ్వు” అని అన్నాడు. “రాజా! దీని చిన్నప్పటినుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులిచ్చినా నాకు అక్కరలేదు. మునివేషములో ఉన్న నాకు హిరణ్యముతో అసలు అవసరములేదు” అని బదులిచ్చాడు గౌతముడు.

ధృతరాష్ట్రుడు “మునులకు అవసరమైనవి గోవులుకాని ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా! రాజునైన నేను స్వయముగా వచ్చి ఏనుగును ఇమ్మనినా కాదంటావా?” అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు “పుణ్యాత్ములు ఆనందించే పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వేళదాము రా! యమసభలోనే న్యాయనిర్ణయం జరుగని” అని అన్నాడు.

ధృతరాష్ట్రుడు: “నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు ఆ దారుణమైన యమలోకములో. నేను రాను.”

గౌతముడు: “సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళదాము. అతనే న్యాయం చెప్తాడు.”
ధృతరాష్ట్రుడు: “అక్కాచెళ్ళెళ్ళను తల్లిదండ్రులను దయతో చూసుకునే వారే ఆయన దగ్గరకు వెళ్ళగలరు. నేను రాలేను.”

గౌతముడు: “అయితే వైకుంఠధామ సమానమైన గంగాతీరానికి వెళదాము. వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అతిథి అభ్యాగతులకు పెట్టి ఆ తరువాత తినే వాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు. నేనెందుకు వస్తాను?”

గౌతముడు: “పోని పవిత్రమైన మేరువనానికి రా!”
ధృతరాష్ట్రుడు: “సత్యము దయ మృదువర్తనము భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు. వేరే చోటు చెప్పు.”

గౌతముడు: “విష్ణుస్వరూపుడైన నారదుని విహారస్థలానికి వెళదాము. పద! అప్సరసలు కిన్నెరులు ఉంటారక్కడ”
ధృతరాష్ట్రుడు: “సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరక్కడికి. నావల్ల కాదు.”

గౌతముడు: “అలాగా! అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభూములకు వెళదాం రా!”
ధృతరాష్ట్రుడు: “కామము హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళతారు. వచ్చుట నా తరము కాదు.”

గౌతముడు: “అమృతకిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయము చేసే చంద్రుని వద్దకు వెళదాము. సరేనా?”
ధృతరాష్ట్రుడు: “దాననిరతులు పరమ శాంతచిత్తులు అక్కడికి వెళ్ళగలరు. వచ్చుట నాకు సాధ్యము కాదు.”

గౌతముడు: “సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్యభగవానుడు. ఆయన వద్దకు వెళదాము. దయలుదేరు.”
ధృతరాష్ట్రుడు: “అమ్మో! తపస్స్వాధ్యాయనిరతులే ఆయన దర్శనము చేయగలరు. నన్ను విడిచిపెట్టు.”

గౌతముడు: “పోనీ వరుణుడి దగ్గరకు వస్తావా?”
ధృతరాష్ట్రుడు: “అగ్నిహోత్రము యాగాలు చేసిన వాళ్ళైతే ఆయన దగ్గరకు వెళ్ళగలరు.”

గౌతముడు: “దేవరాజైన ఇంద్రుని సన్నిధిలో న్యాయం అర్థిద్దాము.”
ధృతరాష్ట్రుడు: “శూరులు సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు. నేను రాను.”

గౌతముడు: “ప్రజాపత్య లోకానికి వెళదాము.”
ధృతరాష్ట్రుడు: “అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకు స్థానమది.”

గౌతముడు: “గోలోకం?”
ధృతరాష్ట్రుడు: “తీర్థాలు సేవించినవారు బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు. నేనెలా రాగలను?”

గౌతముడు: “సరే! అయితే బ్రహ్మసభకు వెళదాము రా!”
ధృతరాష్ట్రుడు: “అసంగులు (లౌకిక బంధాలు లేనివారు) ఆధ్యాత్మవిద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి. నావంటి వాడు ఆ లోకము చూడనే లేడు.”

ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు “మహానుభావా! నీవు దేవేంద్రుడవు. ఏ ఏ పుణ్యాలు చేస్తే ఏ ఏ లోకాలు వస్తాయో దేవేంద్రునికి తప్ప ఇంకెవరికి తెలుసు?” అని పాదాభివందనము చేశాడు గౌతముడు. “అయ్యా! నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజరూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపఱచండి” అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు.

ఒక వ్యక్తిలోని మంచిని చూడాలి కానీ లోపాలను పెద్దవి చేయకూడదు

సింహపురి అనే రాజ్యాన్ని సిద్ధార్థుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు
ఆ రాజుకి ఒక కన్ను ఒక కాలు మాత్రమే ఉండేది కానీ చాలా తెలివైనవాడు అంత కంటే ఎక్కువ దయకలిగిన వాడు
అతని పరిపాలనలో ప్రజలంతా ఎంతో ఆరోగ్యంగాను సంతోషంగానూ జీవిస్తూ వచ్చారు .

ఒకరోజు సంధ్యా సమయాన రాజ్యంలో అలా నడుస్తుండగా అక్కడ రాజు తన పూర్వీకుల చిత్రపటాలను చూసాడు
భవిష్యత్తులో తన పిల్లలు కూడా ఇలా ఇక్కడ తిరిగే సమయాన ఈ చిత్రపటాలను చూసి వారి పూర్వికులగురించి తెలుసుకుంటారు కానీ అక్కడ తన చిత్రం లేకపోవడం కాస్త బాధ అని పించింది
తన అంగవైకల్యం కారణంగా రాజు ఎలాంటి అభిప్రాయాలు వస్తాయో అని కానీ చివరికి ఒక చాటింపు వేయించాడు

ఎవరైనా వచ్చి తన చిత్రపటాన్ని అందంగా గీయాలని
ఎంతో మంది చిత్రకారులు వచ్చారుకానీ రాజు అవిటితనాన్ని ఎలా అందంగా రూపం ఇవ్వగలం అది చూసి రాజుకు కోపం వస్తే ఎవరు బలిఅయ్యేవాళ్ళమని

వారి వల్ల కాదని వెనుతిరిగారు
కానీ ఒక్క కళాకారుడు మాత్రం నేను గీయగలను అని ముందుకు వచ్చాడు
ఆ చిత్రపటం కోసం రాజు తో పాటు మిగిలిన కళాకారులు సైతం ఎదురుచూడసాగారు

సుదీర్ఘ కాలం తరువాత చిత్రపటం పూర్తయింది
ఆ పటం చూడగానే రాజు మిగిలిన చిత్రకారులు చాల ఆశ్చర్యపోయారు

రాజు గారి అవిటితనాన్ని ఎంత అందంగా దాచాడంటే ఆ చిత్రకారుడు
రాజు గారు గుర్రం పైన కూర్చుని ఒక కాలు కనిపిస్తూ విల్లు ఎక్కుపెట్టి ఒక కన్ను మూసినట్టుగా చూపెట్టాడు
రాజు గారు చాల సంతోషించి పెద్ద బహుమతిని అతని ఇచ్చాడు

నీతి: మనం ఎప్పుడు మంచి ఆలోచనలే కలిగివుండాలి
ఒక వ్యక్తిలోని మంచిని చూడాలి కానీ లోపాలను పెద్దవి చేయకూడదు
ఎటువంటి పరిస్థితిలోనైనా మనవల్ల కాదు అని నిరాశపడకుండా ఏదైనా సాధించగలం అనే ఆశ నింపుకుంటే చాలు ఏ సమస్యకైనా పరిష్కారం సులభం.

శీలసంపద - మహాభారతము లోని కథ

శీలసంపద

మహాభారతము లోని కథ

ఖాండవవన దహనమప్పుడు లోకైకవీరుడైన అర్జునుడు తనను రక్షించినందుకు కృతజ్ఞతగా మయాసురుడు మయసభను నిర్మించి ధర్మరాజుకివ్వాలని సంకల్పించుకున్నాడు. మయాసురుడు ఆ భవ్య మయసభను పవిత్ర హిమాలయాలలో నిర్మించి తన మాయశక్తితో ఇంద్రప్రస్థానికి తెచ్చాడు. మయసభలోని అద్భుతాలను పొగడటానికి మాటలుచాలవు. మయసభ అంతా కనక రత్న మణిమయము. మయసభలోని స్తంభాలు ద్వారాలు తోరణాలు వనాలు తటాకాలు అన్నీ మణిమయాలే. రాజసూయ యాగానికి వచ్చిన ఎందఱికీ సంభ్రమాశ్చర్యాలు కలిగించి నభూతో నభవిష్యతి అని పొగడబడినది ఆ మయసభ. మయసభ విభవం పాండవుల అదృష్టం చూసి దుర్యోధనుని అసూయామాత్సర్యాలు మరింత చెలరేగాయి. పాండవుల కీర్తి సంపదలను తలచుకొని తీవ్రంగా దుఃఖిస్తూ తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని వద్దకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు దుర్యోధనుడు. మత్సరమనే ఘోరసర్పముచే కాటువేయబడ్డ తన కొడుకుకి ఇలా హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు

“కుమారా! నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యమున్నదా? ఈ లోకంలో సంతృప్తి ఉన్నవాడే ధనవంతుడు. సంతృప్తి లేకుండా కుబేర సంపద ఉన్నా వాడు సంతోషముగా ఉండలేడు. నాయనా! శీలవంతుడైన ధర్మనందనుని శ్రీలక్ష్మి ఎన్నడూ విడువదు. శీలవంతుని ఆశ్రయించే సకల సంపదలు సుగుణములు ఉంటాయి. కాబట్టి నీవు కూడా ధర్మాత్ములైన పాండవులవలె శీలవంతుడవు కమ్ము. తానుతో సిరిసంపదలు వాటంతట అవే వస్తాయి”. కుమారునికి ఒక ఇతిహాసం చెప్పాడు

“ప్రహ్లాదుడు సర్వగుణ సంపన్నుడు విద్యా పారంగతుడు పరమ విష్ణుభక్తుడు. ధర్మం తప్పకుండా తన ప్రజలను పాలించేవాడు. తన సౌశీల్య ప్రభావం చేత త్రిలోకాధిపత్యం ఇంద్రత్వం ప్రాప్తించింది ప్రహ్లాదునికి. చతుర్భువనాలను జనరంజకముగా పాలించసాగాడు ఆ ప్రహ్లాదుడు. ఇలా ప్రహ్లాదుని వలన పదవీ భ్రష్టుడైన శచీపతి గురువైన బృస్పతులవారిని తనకు మళ్ళీ ఇంద్రపదవి సిద్ధించే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. బృహస్పతి విష్ణు అవతారుడైన పరశురాముని ఆశ్రయించమని చెప్పాడు. గురు ఆజ్ఞపాటించి ఇంద్రుడు భార్గవరాముని శరణుజొచ్చి ఉపాయం బోధించమని ప్రార్థించాడు. “అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతనినే అడుగు. ఆ శక్తిని అతనివద్దనుండే పుచ్చుకో” అని చెప్పాడు భార్గవుడు.

విద్యార్జన గురుసుశ్రూష వలనే సాధ్యం అని తెలిసిన దేవేంద్రుడు విప్రవేషం ధరించి ప్రహ్లాదునికి శిష్యుడై అతనిని భక్తితో సేవించటం మొదలుపెట్టాడు. అలా ఎంతో కాలం ప్రహ్లాదుని సేవించినాడు వజ్రి. ప్రసన్నుడైన ప్రహ్లాదుడు “నాయనా! ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు?” అని విప్రవేషంలో ఉన్న ఇంద్రుని అడిగాడు. శచీపతి తన అభీష్టం వ్యక్త పఱచినాడు. అప్పుడు ప్రహ్లాదుడు

“కుమారా! నేనెప్పుడూ రాజునని గర్వించను. ఎవఱినీ నొప్పించను. వారికి హితమేచేస్తాను. ఈర్ష అసూయ ద్వేషం పగ మొదలైనవి నా దరి చేరనివ్వను. అడిగినవాడికి లేదనకుండా సంతోషపెడతాను. నా పురాకృత పుణ్యం వలన నాకీ సౌశీల్యం అబ్బినది” అని చెప్పాడు. “ఓ దయామయా! దానశీలా! నీ శీలం నాకు ప్రసాదించు” అని అడిగాడు ఇంద్రుడు. “అయ్యో పాపం!” అని ప్రహ్లాదుడు తన శీలాన్ని దేవేంద్రునికి దానం ఇచ్చి పంపివేశాడు.

ఇంద్రుడు వెళ్ళాడో లేదో ప్రహ్లాదునిలోనుండి ఒక దివ్య తేజఃపుంజము పురుషాకృతిదాల్చి బయటికి వచ్చింది. “నీవెవరు?” అని ఆశ్చర్యాముగా అడిగాడు ప్రహ్లాదుడు.

“నేను నీ శీలాన్ని. ఆ విప్రునికి నన్ను దానం ఇచ్చావు కదా. వెళుతున్నాను” అని చెప్పి వెళిపోయింది శీలము. ఒకతేజస్సు తరువాత ఒకటి ప్రహ్లాదుని వీడిపోయినాయి. ఒక తేజస్సు అన్నది “నేను సత్యమ్. శీలాన్ని ఆశ్రయించి ఉంటాను. శీలంతో పాటూ నేను నిన్ను విడుస్తున్నాను”. మరొక తేజస్సు అన్నది “రాజా! నేను ఋజుప్రవర్తనమ్. సత్యము లేని చోట నేనుండలేను”. “నేను బలమ్. సత్ప్రవర్తన లేనివాడి వద్ద నేనుండను” అని వెళ్ళిపోయింది బలమ్. చివరికి ఆదిలక్ష్మి బయటికి వచ్చి “నేను శ్రీలక్ష్మిని. బలం ఉన్నచోటే నేనుంటాను. వెళుతున్నాను” అని అన్నది. అప్పుడు ప్రహ్లాదుడు “అమ్మా! లోకమాతా! నీవూ నన్ను విడిచిపోతున్నావా? ఈ అభాగ్యునిపై దయ చూపవా? వెళ్ళద్దు తల్లీ! ఆ విప్రుడు ఎవఱు తల్లీ?” అని ప్రార్థించాడు. “అతడు దేవేంద్రుడు. పోగొట్టుకున్న రాజ్యమును సంపాదించడనికి నీవద్దకు వచ్చాడు. అన్ని సంపదలకూ మూలమైన శీలమును నీవు అతనికి దానమిచ్చావు కావున శీలాన్ని అనుసరించి మేమందఱమూ వెళుతున్నాము” అని సర్వాణి చెప్పింది. నిజమైన శ్రీహరి భక్తులకు సాధ్యం కానిదేమున్నది? ప్రహ్లాదుడు మళ్ళీ తన సద్గుణాలను సంపదలను అచిరకాలంలోనే సంపాదించుకున్నాడు. కనుక నీవెల్లప్పుడూ సౌశీల్యుడవై వర్ధిల్లు నాయనా!” అని కుమారునికి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు

Body Energying Physiotherapic Exercises

విశ్వమే తానుగా మీకు ఆవిష్కృతమవుతుంది

విశ్వమే తానుగా మీకు ఆవిష్కృతమవుతుంది

సద్గురు :- ఈ సృష్టి అంతా ఒక రకమైన “జామెట్రీ” అంటే రేఖాగణితం, అలాగే మీ శరీరం కూడా. ఇది శరీరాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మారుస్తుంది.
బహుశా ఈ రోజులలో, ఈ సమస్య ఇక లేదు. కానీ, కొన్ని సంవత్సారాల క్రితం, గాలివాన వచ్చిపోయిన ప్రతిసారీ, పైకి వెళ్లి టీవి యాంటెనాని సరి చేసుకోవాల్సి వచ్చేది. అది ఒకవిధమైన కోణంలో ఉంటేనే మీ టీవిలో ప్రసారాలు వచ్చేవి, లేదా మీరు క్రికెట్ చూస్తున్నప్పుడో లేదా సీరియల్ చూస్తున్నప్పుడో అకస్మాత్తుగా మీ టీవిలో చుక్కలు వచ్చేవి. అప్పుడు మీరు యాంటెనాని సరి చేయవలసి వచ్చేది.
ఈ శరీరం కూడా అలాంటిదే:  మీరు దానిని సరైన పద్ధతిలో ఉంచితే, అది పూర్తి విశ్వాన్ని గ్రహించగలదు.  మీరు దానిని వేరే విధంగా ఉంచితే, మీకు మీ పంచేంద్రియాలు తప్ప ఇంకేమీ తెలియవు.
మన శరీరం ఒక బారోమీటర్(గాలిపీడనం హెచ్చు తగ్గులను తెలియ జేసే ఒక యంత్రం) వంటిది. మీకు దానిని ఎలా చూడాలో తెలిస్తే, అది మీ గురించి, మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి అంతా తెలియజేస్తుంది. మీ శరీరం మీకు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, అందుకనే మనం యోగాలో మన శరీరాన్ని నమ్మటం నేర్చుకుంటాము. యోగా ద్వారా మనం మన భౌతిక శరీరంలో జరిగే కొన్ని నిర్బంధపు ప్రక్రియలను స్పృహతో జరిపే ప్రక్రియలుగా మారుస్తాం. తద్వారా శరీరాన్ని అన్నింటినీ గ్రహంచగలిగే, తెలుసుకోగలిగే ఒక శక్తివంతమైన పరికరంగా మారుస్తాం.
ఈ శరీరాన్ని, కేవలం మనం ఈ భూమి నుండి సేకరించిన ఒక ఆహారపు కుప్పగానో  లేక నిర్బంధపు ప్రక్రియలు జరిగే రసాయనాల సమ్మేళనంగానో లేక రక్త మాంసాలగానో కాకుండా, వాటికి మించిన దానిగా తయారుచేయడానికి ఒక సైన్స్, టెక్నాలజీ ఉంది. మీకు శరీరాన్ని ఎలా చదవాలో తెలిస్తే, అది మీ సామర్ధ్యాన్ని, మీ పరిమితులని – మీ భూత, భవిష్యత్, వర్తమానాలన్నిటినీ మీకు తెలియజేస్తుంది. అందుకనే, ప్రాధమికమైన యోగా, శరీరంతో మొదలవుతుంది.
దీనిని ఇలా వివరించవచ్చు. మీ ఫోన్ లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా పరికరం గురించి మీకు ఎంత ఎక్కువ తెలిస్తే, మీరు దానిని అంత బాగా ఉపయోగించుకోగలరు. కొన్ని సంవత్సరాల క్రితం భారత దేశంలో ఫోన్ కంపెనీలు ఒక సర్వేని చేసి తెలుసుకున్నది ఏమిటంటే 97% మంది తమ ఫోను సామర్ధ్యంలో కేవలం 7% ని మాత్రమే ఉపయోగిస్తున్నారని - నేను నేటి స్మార్ట్ ఫోన్ల గురించి మాట్లాడటం లేదు,  మామూలు డబ్బా ఫోన్ల గురించి మాట్లాడుతున్నాను !
ఆ చిన్న పరికరంలోనే మీరు 7% మాత్రమే వాడుతున్నారు. మరి  మీ శరీరం విషయానికొస్తే, అది అసలైన పరికరం. ఈ ప్రపంచంలోని మిగతా పరికరాలన్నీ కూడా దీని నుండి వచ్చినవే.  మరి మీరు ఈ పరికరంలో ఎంత శాతం వాడుతున్నారని అనుకుంటున్నారు?
1% కంటే కూడా చాలా తక్కువ. ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి, అంటే మీ మనుగడ కోసం, మీ శరీరంలో 1% కూడా మీకు అవసరం లేదు. మనం దీనితో ఎన్నో అల్పమైన పనులు చేస్తున్నాము, ఎందుకంటే ప్రస్తుతం మనం ఉనికిలోని భౌతిక భాగాన్ని మాత్రమే గ్రహించగలుగుతున్నాం. కానీ మీ శరీరానికి పూర్తి విశ్వాన్ని గ్రహించగల సామర్ధ్యం ఉంది. మీరు కనుక దానిని సరిగ్గా సిద్ధం చేస్తే, అది ఉనికిలోని ప్రతి దానిని గ్రహించగలదు, ఎందుకంటే ఉనికిలో జరిగే ప్రతిదీ కూడా ఒక విధంగా మన భౌతిక శరీరంలో కూడా జరుగుతుంది.
మనిషి సాధారణంగా నిముషానికి 12 నుండి 15 సార్లు శ్వాస తీసుకుంటాడు. మీరు కనుక దానిని 11 కి తగ్గిస్తే, మీకు భూగోళపు బాహ్య పొర గురించి తెలుస్తుంది. మీరు దానిని 9 కి తగ్గిస్తే, మీకు ఈ భూమండలంలోని ఇతర ప్రాణుల భాష అర్ధమవుతుంది. మీరు దానిని 7 కి తగ్గిస్తే, మీకు ఏకంగా భూగోళపు భాషే అర్ధమవుతుంది. మీరు దానిని 5 కి తగ్గిస్తే, మీకు ఈ సృష్టి మూలం , భాష అర్ధమవుతుంది. మీ ఏరోబిక్ సామర్ధ్యాన్ని పెంచడం గురించో లేదా బలవంతంగా మీ శ్వాసను బిగపట్టడం గురించీ చెప్పడంలేదు. మీరు హఠ యోగ, క్రియలను కలిపి చేయడం ద్వారా మీ ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని క్రమంగా పెంచుకోవచ్చు. అయితే అన్నిటిని మించి, అవి మీ శారీరక వ్యవస్థలో ఒక విధమైన క్రమం (alignment), ఒక విధమైన సౌలభ్యాన్ని సాధించడానికి దోహదపడుతాయి. దాంతో మీ వ్యవస్ధ ఎటువంటి అలజడులు లేని ఒక స్థిరత్వాన్ని పొందుతుంది; అప్పుడు అది అన్నిటినీ గ్రహిస్తుంది🙏

పంచ పునీతాలు

🙏🦋 పంచ పునీతాలు🙏🦋

మొదటిది..వాక్ శుద్ధి:
వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు
మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి.

రెండవది..... దేహశుద్ధి:
మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.

మూడవది.....భాండ శుద్ధి:
శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.

నాలుగవది.......కర్మశుద్ధి:
అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.

ఐదవది..........మనశ్శుద్ధి:
మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి. 👍

ప్రాయశ్చిత్త ప్రార్ధన

🙏 ప్రాయశ్చిత్త ప్రార్ధన 🙏
-------------------------
🌹ఓం శ్రీగురు దేవాయనమః 🌹

🌻 అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకా ! ఆది మధ్యాంత రహితా ! అనంత కళ్యాణ గుణధామా ! అఖండ పరమాత్మ స్వరూపా ! ఆర్తత్రాణ పరాయణా ! కరుణాసాగరా ! నమో నమః 🌻

🌷 దేవాది దేవా ! దివ్య ప్రభావా ! తండ్రీ నిన్నే నమ్మితిని ; నీవే నాకు రక్షకుడవు ! నిన్ను నమ్మి కొలిచే వారికి కష్టాలు , నష్టాలు తొలగించి సమస్త శుభాలు చేకూర్చెదవని తెలుసు. 🌷

🌻 స్వామీ ! ఏనాడు , ఎప్పుడు , ఏ జన్మలో చేసిన కర్మ ఫలమో తెలియదు. కానీ దాని పర్యవసానంగా ఈరోజు ఈ సమస్యను అనుభవించవలసి వచ్చింది. పరమాత్మా ! నేను ఈ జన్మలో గానీ , గత జన్మలో గానీ , తెలిసి గానీ , తెలియక గానీ , అజ్ఞానంతో గానీ , అహంకారంతో గానీ , ఎవరినైనా ఇబ్బంది పెడితే , ఏ ప్రాణికైనా బాధ కలిగించితే క్షమించు స్వామీ ! 🌻

🌹 శరీరంతో గానీ , వాక్కుతో గానీ , ఇంద్రియాలతో గానీ , మనసుతో గానీ , ఏ ప్రాణికైనా బాధ కలిగితే అది తెలియక చేసిందే స్వామి ! పరమాత్మా ! అజ్ఞానంతో తెలియక చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపంతో వేడుకుంటే మన్నించి అనుగ్రహిస్తానని గీతలో మీరే చెప్పియున్నారు స్వామీ ! అందుకే మిమ్మల్ని ఈరోజు ఈ గురు సన్నిధిలో వేడుకుంటున్నాను. కనుక నా యొక్క దోషపూరితమైన కర్మలన్నింటినీ దగ్దమొనర్చి నన్ను పవిత్రుని చేయుము. తల్లి , తండ్రి , బంధువు , మిత్రుడు అన్నీ నాకు నీవే స్వామీ !🌹

🌷తండ్రీ ఈ క్షణం నుండి ఏ హృదయాన్ని గాయపరచను. ఏ తప్పు చేయకుండా నీవు చెప్పిన ధర్మానికి కట్టుబడి జీవించే విధంగా ప్రయత్నిస్తాను. అనంతమైన నీ శక్తి చైతన్యములు నాలో ప్రసరించి నీ సేవలో తరించేట్లుగా చూడు స్వామీ !🌷

🌻నా పిల్లలు , నా కుటుంబం యొక్క భారము , బాధ్యత నీదే స్వామీ ! చక్కటి ఆరోగ్యము మానసిక ప్రశాంతతను కలిగించుము. క్షేమ , స్థైర్య , విజయ , అభయ , ఆయురారోగ్య , ఐశ్వర్యాభివృద్ధితోపాటు , ఇహపర సౌఖ్యాలను కలిగించి చివరకు మోక్షసిద్ధిని ప్రసాదించి అనుగ్రహించుము. 🌻

🌻ముఖ్యంగా నేను ( మేము )ఈ సమస్యతో బాధపడుతున్నాను. కనుక అపారమైన మీ కృపను వర్షించి , అతి శీఘ్రముగా నా సమస్యను పరిష్కరించమని త్రికరణశుద్ధిగా ప్రార్ధించుచున్నాను. 🌹

💐🙏 సర్వం పరమాత్మ పాదారవిందార్పణమస్తు.🙏💐

- అచల గురువు శ్రీ నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి గారు.🙏🙏🌹🌹

అచల ఆశ్రమం జీడిమెట్ల హైదరాబాద్.

జై గురుదేవా🙏🙏🌹🌹🚩🚩

సామెత కథ - జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

సామెత కథ

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

పూర్వం మన దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!

ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం " అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.

ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు "వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా! " అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు" అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.

తాపసి దయతలచి సరే అన్నాడు.

ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.