Saturday, October 3, 2020

"తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి.

ఈమధ్య మా పెదనాన్న కొడుకు తన కూతురు పెళ్లి చేస్తూ ఆ పెళ్లికి బంధువులను పిలవడానికి పెళ్లి పిలుపులకు నన్ను తోడుగా రమ్మన్నాడు. ఇద్దరమూ కలిసి పెళ్లి పిలుపులకోసం ఒక ఊరిలో మా దూరపు బంధువుల ఇంటికి వెళ్ళాము. అతడు ఒక పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తూ సుమారు మూడు లక్షల రూపాయలు పైనే "నెల జీతం" సంపాదిస్తున్న పెద్ద హోదా కలిగిన అధికారి. ఇక ఆయన భార్య కూడా నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్న అధికారిని. ఆయన ఇద్దరి కొడుకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు కూడా నెలకు లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.

కుశల ప్రశ్నలు, క్షేమ సమాచారాలు, పెళ్ళి పిలుపులు అయిన తరువాత నా కళ్ళు మరో వ్యక్తి కొరకు వెదుక్కుంటున్నాయి. అది ఆ అధికారి తండ్రి కొరకు, ఆయన ఎప్పుడు ప్రొద్దుటూరు వచ్చినా తప్పని సరిగా మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని కలిసి అన్నగారు బావున్నారా అంటూ ఎంతో ఆప్యాయంగా, ప్రేమతో పలుకరించేవారు. దాదాపు పది సంవత్సరాలుగా ఆయన కనిపించట్లేదు.

ఇక ఉండబట్టలేక అడిగేశాను, మీ ఫాదర్ కనిపించట్లేదు అని. ఆ మాటవిన్న వెంటనే అతడి ముఖం కర్కశంగా తయారైంది. ఆ దౌర్భాగ్యుడి గురించి నన్ను అడగకండి, ఆస్తి పంపకాలలో నాకు ద్రోహం చేసిన ద్రోహి అంటూ ఆవేశంగా అనేక రకాల తిట్లు తిడుతూ తన గదిలోకి వెళ్లి పోయాడు. పరిస్థితిని గమనించిన మేము మెల్లగా అక్కడినుండి బయలుదేరి బయటకు వస్తున్న మాకు ఆ ఇంటి పనిమనిషి ఎదురైంది.

ఉండబట్టలేక ఆమెతో ఆ పెద్దాయన గురించి వివరాలు అడుగగా ఆయన గత పది సంవత్సరాలుగా ఊరి బయట ఉన్న అనాధ శరణాలయంలో ఉన్నట్లు తెలిసింది. ఆయన వయసు సుమారు 83 సం ఉండవచ్చు, ప్రస్తుతం ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అనుకుంటూ, నేరుగా అక్కడికెళ్లి ఆయనను కలిశాను. నన్ను చూడగానే ఆయన మొహంలో వెలుగు సూర్యకాంతి వలే ప్రకాశించింది. వెయ్యేనుగుల బలాన్ని పొందినట్లుగా ఎంతో ఉత్సాహంతో నడుచుకొంటూ వచ్చి అమాంతం నా పైన ఒరిగిపోయి నన్ను కౌగలించుకొని కన్నీరు కారుస్తూ నాయనా ! మా అన్నగారిని కలిసినట్లుగా ఉందంటూ ఆనందంతో ఉప్పొంగి పోయాడు.

బాబాయ్ గారు ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఆయన కళ్ళు చమర్చగా "అందరూ ఉండికూడా గత పది సంవత్సరాలుగా అనాధగా బ్రతుకుతూ తను అనుభవిస్తున్న నరకయాతనల గురించి ఆయన మాటల్లో వింటుంటే పగవాడికి కూడా ఇలాంటి దుస్థితి రాకూడదు అనుకుంటూ ", నా పూర్తి వివరాలను ఆయనకు వ్రాయించి ఇచ్చి బయలు దేరబోతున్న నన్ను మరొకసారి ముద్దాడి నాయనా మీ అమ్మ నాన్నలు అదృష్ట వంతులు ఒక్క పైసా కూడా నీకు పంచలేకపోయినా, నీకు ఉద్యోగం, వ్యాపారం లేకపోయినా వారు నిర్వర్థించవలసిన కార్యక్రమాలను నీ బాధ్యతగా నిర్వహించి వారికి ఏ కష్టమూ కలుగకుండా నీవు వారిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకొంటున్నావు. నీవు నిజంగా ధన్యజీవివి నాయనా అంటూ ఆశీర్వదించాడు. అక్కడ నుండి తిరిగి వచ్చిన నాకు ఆ కుటుంబ సభ్యులలో మార్పు తేవాలన్న బలమైన సంకల్పం ఏర్పడింది.

వెంటనే ఒక కథను టైప్ చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి వాట్సాప్ నెంబర్లకు పంపించాను. పది రోజుల తర్వాత బాబాయ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయన ఆనందానికి అవధులు లేవు. నాయనా నీవు వచ్చి పోయిన వారం రోజుల తరువాత ఏ దేవుడి వరమోఏమో గాని నాకొడుకు కోడలు మనవళ్ళు వచ్చి నన్నేంతో గౌరవంగా ఇంటికి తీసుకొచ్చారు. వచ్చిన వెంటనే నా మనవడికి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తున్నాను అంటూ చెబుతున్న ఆయన మాటల్లోనే ఎక్కడ లేని ఆనందాన్ని చూశా... మనసులోనే నాకు జ్ణానాన్ని ప్రసాదించిన ఆ మహా గురువులకు మనసా వాచా కర్మణా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను.

ఆ కుటుంబ సభ్యులలో అంతలా మార్పు తెచ్చిన ఆ కథను మీ ముందుంచుతున్నాను.. అమరావతిలో రాజధాని వచ్చిన తర్వాత వెంకటేష్ అనే అతడు తక్కువ సమయంలో విజయవాడలో రియలెస్టేట్ వ్యాపారంలో కోట్లు సంపాదించిన వారిలో ఇతనొకడు. ఒకసారి గుంటూరుకు దగ్గర లోని ఒక పల్లెలో ఒక పొలం తక్కువధరకు వస్తోందని తెలిసి ఆ ఊరికి కారులో వెళ్ళి, అది చూసుకొని తిరిగి ఇంటికి వస్తున్నాడు వెంకటేష్. కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. వెంకటేష్ ఎంతగా ప్రయత్నించినా అది స్టార్ట్ కాలేదు.

మండుటెండలో ఆదారిలో ఎవరైనా వస్తారేమో అని కొద్దిసేపు వేచి చూశాడు. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, ఎవరూ రాకపోవడంతో విధిలేక కారు లాక్ చేసి నడుచుకొంటూ కొంతదూరం వెళ్ళాక నాలుగు రోడ్ల కూడలిలో ఒక సోడా బంకు కనిపించింది. వెంకటేష్ కు దాహం వేస్తున్నది. ఆ సోడ బంకు వ్యక్తితో తాగడానికి ఒక చల్లని సోడా ఇవ్వమని అడిగాడు. అతను వెంకటేష్ కు తాగేందుకు సోడా ఇచ్చి అతని వివరాలను అడిగాడు.

వెంకటేష్ తానేందుకు అక్కడకు వచ్చాడో తిరిగి ఎక్కడికి వెళ్లాలో అడ్రస్ చెప్పగానే మీ నాన్నగారి పేరు ధర్మారావు గారు కదా అని అడిగాడు. అవుననగానే అతను ఎంతో అభిమానంగా “నువ్వు ఆ మహానుభావుడి కొడుకువా ఇలా నీడలోకి వచ్చి కూర్చోండయ్యా” అని అన్నాడు. “మీరు ఇక్కడే ఉండండి, నేను ఊర్లోకి వెళ్ళి కారు రిపేరు చేయడానికి మెకానిక్ ను పిలుచుకొని వస్తాను “అని సైకిల్ తీసుకొని వెంటనే ఊర్లోకి వెళ్ళి, పది నిమిషాలకు ఒక మెకానిక్ ను వెంటబెట్టుకొని అక్కడికి వచ్చాడు.

సైకిల్ తొక్కడం వల్ల పట్టిన చెమటలు తుడుచుకుంటున్న ఆ వ్యక్తి వైపు వెంకటేష్ ఆశ్చర్యంగా చూస్తూ, అవును “మా నాన్న గారు మీకెలా తెలుసు? నా పని కోసం నీ వ్యాపారాన్ని కూడా వదిలి ఎందుకు వెళ్ళారు? ” అని అడిగాడు. దానికి అతను, “కొన్నేళ్ళ క్రితం నా కూలింగ్ మిషన్ రిపేరి కొరకు మీ ఏరియాకు దగ్గరగా ఉన్న ఆటోనగర్ లో మెకానిక్ దగ్గరకు వచ్చి రిపేరు అయిన కూలింగ్ మిషన్ ని రాత్రి పూట సుమారు పదకొండు గంటల పైనే ఆటోలో తీసుకొస్తున్న సమయంలో మీ ఇంటి ముందే ఆటో టయర్ పగిలిపోవడం వల్ల వచ్చిన శబ్దానికి మీ నాన్న గారు బయటకు వచ్చి స్టేప్నీ టయర్ లో కూడా గాలి లేక అవస్థలు పడుతున్న మిమ్మల్ని గమనించి అప్పటికే పడుతున్న వర్షం తీవ్రకావడంతో మమ్మల్ని ఇంటి వసారాలోకి పిలిచి కూర్చోమన్నాడు.

నేను ఉదయం నుండి కూలింగ్ మిషన్ సామాను కొరకు తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను. మధ్యాహ్నం కూడా భోంచేయలేదు "సమయం లేక కాదు డబ్బు లేక ". ఆకలి కావడంతో, నాకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అక్కడే ఒక చోట కూలబడ్డాను. నన్ను చూసిన మీ నాన్నగారు వెంటనే మీ ఇంట్లోనే నాకు కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఆ రాత్రి పడుకోవడానికి నాకు వసతి కల్పించారు. ఆయన దేవుడయ్యా, నా జీవితాంతం ఆయనని నేనెప్పటికీ మరువలేనయ్యా“ అని అన్నాడు.

ఇది విన్న వెంకటేష్ కి కొద్దిసేపు నోట మాటలు రాలేదు. ఎప్పుడో మా నాన్నగారు ఒక్కసారి అన్నం పెట్టి పడుకోవడానికి చోటు కల్పించిన విషయాన్ని ఇంకా ఇప్పటికీ గుర్తు పెట్టుకొని మా నాన్న గారి పైన ఇతను ఇంతగా ఆప్యాయతను చూపుతున్నాడే మరి అలాంటి తండ్రిని తనేం చేశాడో అనేది తలుచుకొని ఉద్వేగానికీ లోనయ్యాడు. ఇంటికి వచ్చినా తన తండ్రి పైన "అతని కృతజ్ఞతా భావాన్ని తలుచుకుంటూ, ఆ రోజు రాత్రంతా వెంకటేష్ కు అదే ఆలోచనతో నిద్ర పట్టలేదు. ఇంతలో తన ఏసీ రూమ్ లో తనతో పాటు తన పక్కనే పడుకొన్న తన పెంపుడు కుక్క మూలుగు విని ఆతురతతో దాన్ని నిమిరిన అతడిలో ఆలోచన రేగింది ఈ కుక్క కోసం తాను కల్పిస్తున్న సౌకర్యాలలో, దానికోసం పెడుతున్న ఖర్చులో కేవలం పదిశాతం కంటే ఎక్కువ ఖర్చు కూడా కాదు కదా తన తండ్రికి తాను పెట్టే ఖర్చు అని అనిపించింది..

ఏ సంబంధమూ లేని “ఎవరో బయట వ్యక్తి మా నాన్నగారు ఒక్క పూట అన్నం పెట్టి విశ్రాంతి తీసుకోవడానికి ఒక్క రాత్రి చోటు ఇచ్చిన ఆ పనిని గుర్తుంచుకొని దానికి కృతజ్ఞతగా నన్ను అంతలా ఆత్మీయంగా చూసుకున్నాడే, ఒక వీధి కుక్కకు ఒకపూట అన్నం పెడితే తరువాత కనిపించిన ప్రతి సారి విశ్వాసంతో తోకాడిస్తూ మన కాళ్ళచుట్టూ తిరుగుతూ విశ్వాసం చూపిస్తుందే. మరి నా చిన్నప్పటి నుండి మానాన్న గారు నా ఆకలి తీర్చడం కోసం నాకు ఎన్ని సార్లు అన్నం పెట్టాడో, నా సుఖం కోసం ఎన్నోరకాల సౌకర్యాలను నాకు కల్పించడం కోసం ఎన్నెన్ని కష్టాలూ పడి నన్నీ స్థితిలోకి తీసుకువచ్చాడో అలాంటి నా కన్నతండ్రిపైన నేను ఎలాంటి విశ్వాసం చూపించాను, కనీసం ఒక వీధి కుక్క చూపించే విశ్వాసం, కృతజ్ఞత కూడా చూపించకుండా నిర్దాక్షిణ్యంగా ఆయనను అనాధ ఆశ్రమంలో వదిలి ఎంతటి తప్పు చేసాను” అని వెంకటేష్ తీవ్రంగా మదనపడ్డాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. వెంటనే ఆశ్రమానికి వెళ్ళి తన తండ్రిని ఇంటికి తీసుకువచ్చి, చేసిన తప్పుకు క్షమించమని పాదాల మీద పడి వేడుకున్నాడు.

మిత్రులారా ! ఇవేవీ అభూత కల్పనలు కాదు. నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు. ఈ కథే మా బంధువులకు కనువిప్పు కలిగించింది.

చివరగా నేను చెప్పేదేమిటంటే "తల్లిదండ్రులు నాకేమి పంచిచ్చారని కాకుండా, ఇంత గొప్ప జన్మనిచ్చిన వారిని నీవెలా చూసుకొంటున్నావనేదే ముఖ్యమైన అంశం " అని తెలుసుకోండి. దయచేసి ఎవ్వరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకండి.. అలాగే "తల్లిదండ్రులను చక్కగా చూసుకొంటున్న వారికి నేను నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, ఈ కథనాన్ని వారికి అంకితమిస్తున్నాను "

సర్వే జనా సుఖినోభవంతు 🙏

Source - Whatsapp Message

ఓ.. ప్రేమవెన్నెలా...!!

 

🌾🌿🌾🌿🌾🌿🌾🌿🌾🌿🌾

ఓ.. ప్రేమవెన్నెలా...!!

ఎలా స్నేహం చేశావు అంత ప్రేమా పంచావు..!!

ఏంతో భరోసా నిచ్చావు మనసు మొత్తం పరిచావు..!!

ఎంత ధైర్యం నింపావు ఎన్నెన్ని అనుభూతులనిచ్చావు..!!

కలలన్నీ సాకారం చేశావు నాలో నేనే లేకుండా చేసేసావు నన్నే నీలా మార్చేసావు..!!

వలపుగాలి వీస్తుంటే వరమేనని

వలపులోన తీపుంటే చెలిమేనని అనుకున్నా..!!

చూపులతో గాలమేసి చూడకుండా నువ్విప్పుడు

మలుపు దారి దాటేస్తే వగపేనని అనుకున్నా..!!

వర్షించే కళ్ళనెప్పుడు చూడవెందుకు మనసా..!!

మరణమిపుడు మరుగైతే గెలుపేనని అనుకున్నా..!!

దూరమెపుడు భారమవదు సిరిమువ్వలా మ్రోగుతోంది గుండెలోన ..!!

ఆ సవ్వడి నీ పేరుగా వినిపిస్తే తలపేనని అనుకున్నా..!!

మౌనంగా మారిపోయి శిలనేనని అనుకున్నా.!!

Source - Whatsapp Message

బంధాలు భారమై'పోయా'యా

 

🕉 బంధాలు భారమై'పోయా'యా 🕉

మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు మూడు రోజులు ఉండేవారు. వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి. ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు. ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం...కబుర్లు చెప్పుకుని పడుకోవడం...మూడు పూటలా అన్నమే తినడం...మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు. ఇల్లంతా వెతికినా కనిపించవు. అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది. అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు. కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు. ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు.

రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది. ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి. ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది. ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది. డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది. ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ, అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు.

ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు. మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది. ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము. మనుషుల మధ్య ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది.

సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు. వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు.

అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి. చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు! అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే అమృతం లాంటిది.

కొందరికి తల్లితండ్రులను పలకరించే తీరికలేని సంపాదనలో ఉన్నారు. అది చాలా దుర్భరమైన స్థితి.

ఆలోచించండి బంధాలను బలపరుచుకోండి 😊🙏🏼

Source - Whatsapp Message

మంచి మాటలు

 

శనివారం --: 19-09-2020 :-- ఈరోజు మంచి మాటలు ...

మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్లతోనే మన జీవితం బాగుంటుంది . అందరం బాగుండాలి అందలో మీరు మీ కుటుంబసభ్యులు మరీ బాగుండాలి .

కరోనా వైరస్ కి విరుగుడు పాలల్లో అల్లం మిరియాల పొడి బెల్లం కలిపి తాగాలి రోజు రాత్రి పడుకునే ముందు ఒక లవంగం నోట్లో వేసుకుని పడుకుంటే ఏలాంటి వైరస్ లు మీ దగ్గరకు రాదు .

ఈ రోజుల్లో మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను నేను నమ్ముకున్న వాళ్ళని నెనెప్పుడు మోసం చేసింది లేదని .

వదిలేస్తే జారిపోయేవి ఎన్ని ఉంటాయో పట్టుకుంటే మనతో ఉండిపోయేవి కూడా అంతకు మించి ఉంటాయి . అది జీవితమైనా , బంధాలైనా , మిత్రులైనా , ఇంకేమైనా ? .

మనం నిజాయితీగా ఉండడం కూడా ఓ యుద్దం లాంటిదే ! . యుద్దంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా కష్టం .

మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కధలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్లు బతికేయడం మంచిది .

సేకరణ 🖋️*మీ ..AVB సుబ్బారావు 🕉️💐🌹🤝.

Source - Whatsapp Message

మంచి మాటలు

 

శుక్రవారం --: 18-09-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు ...
ఈ రోజు కష్టపడితే రేపు సుఖపడొచ్చు అని చాలామంది అంటారు కానీ ఇదే మాట చచ్చే. వరకు అనుకుంటూ పోవడమే తప్ప ఆ సుఖపడే రోజు మాత్రం ఎప్పటికి రాదు .

మనం బాధపడితే ఓదార్చే వాళ్ళు కొందరు మనం ఎప్పుడూ బాధ పడతామా అని ఎదురు చూసేవాళ్ళు మరికొందరు మనతో ఏ బంధం లేక పోయినా మన ఆనందాన్ని తమ ఆనందంగా భావించే వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు , అలాంటి వారు మనకు తారసపడుతే ఎంత కష్టమొచ్చినా వాళ్ళని వదులుకో కూడదు .

ఎవ్వరు ఎంత హేళన చేసిన నీవు తొందరపడకు , హేళన చేసిన వారితో సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికే ఉంది . ఓర్పుతో ఉండు నీ నేర్పు తప్పక ప్రపంచానికి తెలుస్తుంది .

ఒక్కొక్క సారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు . ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది . అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియక పోవచ్చు . కానీ ! సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది . అన్నింటికి కాలమే సమాధానం చెప్తుంది కొంచెం ఓపిక పట్టు నేస్తమా .

తప్పులు అందరం చేస్తాం సరిదిద్దుకునే వారే గొప్పవారు సహాయం అడిగితె చేసేవాడు మనిషి ,అడగకుండానే కష్టం తెలుసుకుని చేసేవాడు నిజమైన స్నేహితుడు

గాలి నీరు చెట్టు భూమి ని దేగ్గెర ఏమి ఆశించకుండా ప్రకృతి నీకు సహకరిస్తుంది ,కానీ మనం దానిని వ్యాపారం చేసి స్వార్థపరులం అవుతున్నాం

సేకరణ 🖋️*AVB సుబ్బారావు 💐🌹🕉️🤝

Source - Whatsapp Message

మంచి మాటలు

 



బుధవారం --: 16-09-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ..

మన క్షేమాన్ని కోరేవాళ్ళు వీధి దీపాల్లాంటివారు గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయ పడతారు .

మిత్రమా ! నీవు అందరితో కలిసి ఉండు అందరిలానే నవ్వుతూ ఉండు అంతే కానీ ! అందరిని అయినవాళ్లం అనుకోకు . అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఈ ప్రపంచం నటనతో కూడిన ప్రేమ . ఆది విషం కంటే ప్రమాదం గుర్తుంచుకో నేస్తమా .

ఈ జీవితం చాలా చిన్నది ఎంత కాలం వుంటామో , ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు . ఉన్న కొద్దీ రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం .

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది . డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో అదుకుంటుంది . సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకోక సుస్థిర స్థానాన్నిస్తుంది .

మనకు సమయం పరిస్థితులు ఎపుడూ మారుతూనే ఉంటాయి . చక్కటి బంధం , మంచి స్నేహం ఎప్పటికి మారవు .
మంచిని ప్రేమిద్దాం , మంచిని పదిమందిని చెపుదాం , మంచిని ఆచరిద్దాం , మంచిని ఆచరిస్తే పోయేదేముంది సమాజములో మంచి మార్పు తప్ప

💐సర్వేజనా సుఖినోభవంతు 🌹🤝💐🕉️
సేకరణ 🖋️ *మీ ...AVB సుబ్బారావు 💐🕉️🌹🤝

పంచాంగం కొరకు ఈ లింక్ ద్వారా చుడండి🌹🤝🕉️💐

https://youtu.be/cHegFLoWnHI

Source - Whatsapp Message

మంచి మాటలు

🙏🌹శ్రీరామ 🌹🙏
మంగళవారం --: 15-09-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు ...
మనిషి గొప్పతనం నమ్మడం లోనో నమ్మించడం లోనో ఉండదు . నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది .

జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి . వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దీనిలో గెలువడాలు ఓడిపోవటాలు ఉండవు . పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి .

అహంకారం పెరిగేకొద్దీ పతనం ప్రారంభమవుతుంది . అధికారం , హోదాచూసి వచ్చే సమస్తెలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటేపొరపాటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు , మంచితనమే శాశ్వతం .

నిందించడం తేలిక నిండను భరించడం కష్టం నీతులు చెప్పడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం కష్టం ఇదే మన జీవితా రహాస్యం

మనకు పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు మనముందు నటిస్తారు మరికొందరు నెటుకొస్తారు.

సేకరణ 🖋️*మీ AVB సుబ్బారావు 💐🌹🕉️🤝
https://youtu.be/EkjrCX10VAw

Source - Whatsapp Message

ఈ విషయం తెలుసుకున్న వారు ఎవరూ...ఎవరినీ బాధ పెట్టరు.ఎవరి చేతనూ బాధింపబడరు.

అర్జునా....
మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ...
అవి అన్నీ మట్టి తోటే తయారు చేయబడతాయి.

అలానే జీవుల శరీరాలు వేరైనా...
వాటిలో ఉండేది ఒకే ఆత్మ.
ఈ విషయం తెలుసుకున్న వారు ఎవరూ...
ఎవరినీ బాధ పెట్టరు.
ఎవరి చేతనూ బాధింపబడరు.

ఒకసారి కుండను ఎవరో అడిగారట...
నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా...
ఇది ఎలా సాధ్యం? అని.
అప్పుడు కుండ...
నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను...
నేను వచ్చింది మట్టిలో నుంచి...
వెళ్ళేది మట్టిలోనికే...
మధ్యలో ఆవేశం,
గర్వం,
అహం
అవసరమా?
అని చల్లగా జవాబిచ్చింది.

నాది అనుకుంటే బాధ్యత అవుతుంది...
నాకెందుకు అనుకుంటే...
బరువు అవుతుంది.

స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి.
వెలిగించడం చాలా సులభం...
కానీ ఆరిపోకుండా కాపాడుకోవడం లోనే ఉంది అసలైన గొప్పతనం...

కష్టం విలువ తెలిసినవారు ఎవరినీ కష్ట పెట్టరు.
ఇష్టం విలువ తెలిసినవారు ఎవరినీ వదిలిపెట్టరు.
లోపాలనే పట్టుకుని వేలాడితే...
బంధాలు ఎప్పటికీ మెరుగవ్వవు.

మన మనస్సు విశాలం చేసుకున్న కొద్దీ...
ఎదుటివారి లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి.
ఐనా ఇష్టం ఉన్న బంధంలో ఏదీ కష్టం అనిపించదు.
ప్రేమ ఉన్న బంధం ఎప్పటికీ చెక్కుచెదరదు.
అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని...
ఎవరి గురించీ బాధపడకు.
వాళ్లు చీకట్లో ఉన్నప్పుడు నువ్వు వెలుగులా గుర్తొస్తావని సంతోషించు.

సర్వేజనా సుఖినోభవంతుః...
జై శ్రీ కృష్ణా.....💐🙏

Source - Whatsapp Message

మంచి మాటలు

బుధవారం --: 16-09-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ..

మన క్షేమాన్ని కోరేవాళ్ళు వీధి దీపాల్లాంటివారు గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయ పడతారు .

మిత్రమా ! నీవు అందరితో కలిసి ఉండు అందరిలానే నవ్వుతూ ఉండు అంతే కానీ ! అందరిని అయినవాళ్లం అనుకోకు . అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. ఈ ప్రపంచం నటనతో కూడిన ప్రేమ . ఆది విషం కంటే ప్రమాదం గుర్తుంచుకో నేస్తమా .

ఈ జీవితం చాలా చిన్నది ఎంత కాలం వుంటామో , ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు . ఉన్న కొద్దీ రోజులు నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడిపేద్దాం .

కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది . డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపదలో అదుకుంటుంది . సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మనకోక సుస్థిర స్థానాన్నిస్తుంది .

మనకు సమయం పరిస్థితులు ఎపుడూ మారుతూనే ఉంటాయి . చక్కటి బంధం , మంచి స్నేహం ఎప్పటికి మారవు .
మంచిని ప్రేమిద్దాం , మంచిని పదిమందిని చెపుదాం , మంచిని ఆచరిద్దాం , మంచిని ఆచరిస్తే పోయేదేముంది సమాజములో మంచి మార్పు తప్ప

💐సర్వేజనా సుఖినోభవంతు 🌹🤝💐🕉️
సేకరణ 🖋️ *మీ ...AVB సుబ్బారావు 💐🕉️🌹🤝

పంచాంగం కొరకు ఈ లింక్ ద్వారా చుడండి🌹🤝🕉️💐

https://youtu.be/cHegFLoWnHI

Source - Whatsapp Message

నీ ఆత్మ బలం గుర్తించు

నీ ఆత్మ బలం గుర్తించు
🕉🌞🌎🏵️🌼🚩

తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసిఅందులో జీవనం కొనసాగిస్తుంది.....చెక్కలకు , మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది...కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడుఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి....అయ్యోనన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామరరెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది....అయితే మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యంఆ తామర రేెకులను తొలచలేదా....ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..... గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...లేక నన్నేదోబంధించింది అన్నభావన దాని శక్తిని బలహీన పర్చింది.... ఆ భావననునమ్మడమే దాని బలహీనత.....నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న దాన్ని నమ్మింది...అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...మన జీవితంలో సమస్యలూ అంతే,సమస్య బలమైంది కాదు....మనశక్తినిమనం మర్చిపోవడమే దాని బలం...మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,గుర్తించడమే, నమ్మడమే దాని బలం..."మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...దాని బలం తామర రేకు
అంత....నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత.తెలుసుకోఅదే..జీవిత సత్యం

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

మంచి మాటలు

 


సోమవారం --: 14-09-2020 :--
నేటి AVB మంచి మాటలు ...
ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి ,
మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి ,
చెడిపోతే ఎలా బాగుపడలో నేర్చుకోవాలి ,
గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే
ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే
గొప్ప వారు నేస్తమా !

రాత్రికి పడు కుంటే తెల్లారి లేస్తామన్న
నమ్మకంలేని బతుకులు మనవి ! ప్రాణం ఉంటే ఏంటి ? పోతే ఏంటి ?
ధర్మంగా ఒక్కరోజు బతికిగా చాలు ఈ
జన్మకు అర్థమే మారిపోతుంది .

ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఇవన్నీ వట్టి మాటలే మిత్రమా ! నీ కోసం ఎవరు రారు ఏది చేయరు నీ కోసం నువ్వనుకున్నది నువ్వే చేయ్ అది ప్రయత్నం అయినా పోరాటం అయినా .

అసూయ అహంకారం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి ఈ వ్యాధి సోకిన వారు సుఖపడరు ఇతరులను సుఖపడనివ్వరు .

సేకరణ 🖋️ *మీ ...AVB సుబ్బారావు 🌹💐🤝🕉️

Source - Whatsapp Message

మంచి మాటలు

 

🙏జై శ్రీరామ్ 🙏
ఆదివారం --: 13-09-2020 :--
నేటి AVB మంచి మాటలు ...

🦚 నీ గుండె రూపు దిద్దుకోవడానికి 9 నెలలు పట్టింది . దాన్ని 9 క్షణాల్లో ముక్కలు చేసే అవకాశం ఎవ్వరికీ ఇవ్వకు . 🦚

🦚 నీవు మౌనంగా ఉండటం నీ చేతకానితనం కాదు , నీవు పట్టించుకోకపోవడం నీ పిరికితనం కాదు . నీవు ప్రతిఒక్కరితో పోరాడితే ఒంటికి బురద మనసుకు బాధ తప్ప నీకు చివరికి ఏమి మిగులవు .🦚

🦚నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా అనేది ముఖ్యం కాదు ! మంచి మనసు ఉందా లేదా అన్నది ముఖ్యం రంగులతో కాదు మంచి మనసుతో ముడిపడిఉన్నది జీవితం 🦚

🦚మనం ఎంత గొప్పగా బతుకుతున్నామన్నది కాదు మనం బతికినంత కాలం ఎంత సంతోషంగా బతుకుతున్నామన్నదే ముఖ్యం , సంతోషం డబ్బు లో కాదు మనసు లో ఉంటుంది .🦚

🦚 నీ విజయాన్ని నీ కంటే చిన్న వాళ్ళతో పంచుకో వాళ్లు నిన్ను స్పూర్తిగా తీసికొని పైకొస్తారు . నీ ఓటమిని నీ కంటే పెద్దవాళ్ళతో పంచుకో ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్లు నీకు పాఠాలు నేర్పిస్తారు .🦚

సేకరణ 🖋️ *మీ .AVB సుబ్బారావు 💐🌹🕉️🤝

Source - Whatsapp Message

Never ever give up in life

 

Starting with 2 Stories:
1. Yahoo refused Google
2. Nokia refused Android

Moral:
1. Update yourself with time, else you will become obsolete
2. Taking no risk is the biggest risk. Take risks and adopt new technologies.

2 more stories:
1. Google acquired YouTube and Android
2. Facebook acquired Instagram and WhatsApp

Moral:
1. Become so powerful that your enemies become your allies
2. Grow fast, become big, and then eliminate competition

2 more stories:
1. Barack Obama was a ice cream seller
2. Elon Musk was a worker in a lumber mill

Moral:
1. Don’t judge people based on their past jobs
2. Your present doesn’t decide your future, your courage and hard work does

2 more stories:
1. Colonel Sanders created KFC at the age of 65
2. Jack Ma who was rejected by KFC founded Alibaba

Moral:
1. Age is just a number - you can be successful at any age
2. Never ever give up in life - only those who never give up win

2 final stories:
1. Owner of Ferrari insulted a tractor maker
2. The tractor maker created Lamborghini

Moral:
1. Never underestimate or disrespect anyone
2. Success is the best revenge

You can be successful at any age and from any background.

Dream big....
Set goals.....
Work hard.....
&
Never ever give up in life

Source - Whatsapp Message

నేటి మంచిమాట

 

🌹నేటి మంచిమాట🌹
మాటలతో మాయ చేసి,
మాట్లాడే వారిని నమ్మినంత ఈ మనుషులు,
ఆకలి వేస్తుంది అని అడుగు,
పాచి పోయిన మెతుకులు పెట్టి,
పది మందికి డప్పు కొడతారు..!
అందుకే మాయ మాటలు నేర్చుకోవాలి...
నీకు నటించడం రాకపోతే,
కొట్టి మరీ నటించడం ఏలాగో?
నేర్పించే సమాజం మనది.!

నీ లైఫ్‌ని బ్యూటిఫుల్‌ పేయింటింగ్‌ గా,
మార్చుకోడానికి..
అట్రాక్టివ్‌ కలర్‌ ‘రెడ్‌’ కొరకు,
రక్తం మాత్రం ఎవరిదీ ఉపయోగించకు✓
ఈర్ష్య,స్వార్థం,కుళ్ళు లేని వాళ్ళే,
నిన్ను ప్రోత్సహిస్తారు భయ్యా...!
నీవు తెలుసుకుందామని వింటూ పోతూవుంటే, చెడగొట్టేవారు నిన్ను ఓడిస్తారు,
ఎవరు చెప్పిన వినను అంటే,
నిన్ను నీవే చెడగొట్టుకుంటావు..!
అందుకే అందరు చెప్పినది విని నిర్ణయం మాత్రం నువ్వే తీసుకో....

☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు
☸శుభమ్ భుయాత్,
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻
_....✍️ మీ
అంకం బాలకిషన్

Source - Whatsapp Message

మంచి మాటలు

 

శుక్రవారం --: 11-09-2020 :--
నేటి AVB మంచి మాటలు ...

మనిషి గొప్పతనం నమ్మడం లోనో నమ్మించడం లోనో ఉండదు . నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది .

జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి . వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దీనిలో గెలువడాలు ఓడిపోవటాలు ఉండవు . పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి .

అహంకారం పెరిగేకొద్దీ పతనం ప్రారంభమవుతుంది . అధికారం , హోదాచూసి వచ్చే సమస్తెలు పొగడ్తలు శాశ్వతం అనుకుంటేపొరపాటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు , మంచితనమే శాశ్వతం .

నిందించడం తేలిక నిండను భరించడం కష్టం నీతులు చెప్పడం తేలిక ఆచరించడం కష్టం అబద్ధం చెప్పడం తేలిక నిజాన్ని దాచడం కష్టం ఇదే మన జీవితా రహాస్యం

మనకు పైకి కనిపించినంత అందంగా ఏ ఒక్కరి జీవితాలు ఉండవు కొందరు మనముందు నటిస్తారు మరికొందరు నెటుకొస్తారు.

సేకరణ 🖋️ *మీ .. AVB సుబ్బారావు 💐🕉️🤝🌹

Source - Whatsapp Message

చెడును చూసి మంచి నేర్చుకో

 

చెడును చూసి మంచి నేర్చుకో

ఒక ఆశ్రమంలో ఒక గురువు గారి దగ్గర అనేకమంది శిష్యులు పాఠాలు నేర్చుకొంటు ఉండే వారు.

ఒకసారి ఆ ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది.

ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు.

దీంతో వాళ్ళందరూ వెళ్ళి గురువు గారికి ఫిర్యాదు చేశారు. 

అయితే విషయం అంతా విన్న గురువు గారు ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు.

అలా కొన్నాళ్ళు గడిచాయి.మళ్ళీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు.

ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి... "అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి. లేదా మేమే ఆశ్రమాన్ని వదలిపెట్టి వెళ్లపోతాం" అని అన్నారు. 

అప్పుడు గురువు గారు శిష్యులందరినీ సమావేశపరచి... "మీరంతా ఎంతో మంచి శిష్యులు. ఈ లోకంలో మంచి ఏంటో, చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది. మంచి విద్య లభిస్తుంది. కానీ దొంగతనం చేసిన విద్యార్థికి మంచి, చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు" అని అన్నాడు.

ఇంకా......

ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికిగానూ నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు. విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు ...

అంతేగాకుండా.....

తప్పుచేసిన శిష్యుడిని సరి చేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి, అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే... అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. 

దొంగతనం చేసిన శిష్యుడుకి గురువుగారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్ళు గిర్రున తిరిగాయి.

తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు ప్రశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు.

జీవితంలో ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు. 

గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడూ తప్పు పనులు చేయలేదు.

మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి, గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు.

మనలో చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లలు మ మాట సరిగా వినలేదని
బాధ పడుతుంటాం. వీరి అల్లరి భరించలేకున్నాం.తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే గాని వీడికి
బుద్ధి రాదు, ఇలాంటి మాటలు అసహనంతో మాట్లాడుతూ వుంటాం. అన్నీ సరిగా తెలిసినవాడిని మనం దగ్గరుండి చూసుకోవలసిన అవసరం లేదు.

వాడిని వాడు ఉద్ధరించుకోగలడు. అందుకు మంచి ఉదాహరణ ఆదిశంకరాచార్యులు,
రామానచార్యులవారు,
రమణ మహర్షి మొదలైనవారు.

తండ్రి పక్కన ఉండి కూడా సక్రమంగా పెంచలేక పోయాడు అనేందుకు మంచి ఉదాహరణ.దృతరాష్ట్రుడి సంతానం దుర్యోధనుడు.

మనం పిల్లలతో ఏం మాట్లాడుతూ ఉంటే వాటినే వారు అలవాటు చేసుకుంటారు. మన మాటలైనా మన ప్రవర్తన అయినా మనం చేసే పనులు అయినా ఏమైనా సరే మనల్ని పిల్లలు అనుకరిస్తూ ఉంటారు.
కాబట్టి జాగ్రత్తగా ప్రవర్తించాలి.

అందుకే గురుకులంలో ని గురువులు చదువు వచ్చే వారికంటే చదువు రాని వారి పైనే శ్రద్ధ ఎక్కువ చూపిస్తారు.
అందుకు మంచి ఉదాహరణ
పరమానందయ్య శిష్యులు.

మన శరీరంలో కూడా కోని అనవసరంగా పెరిగేవి వున్నాయి. ముఖ్యంగా
గోర్లు, వాటిని పెంచుకోవడం
ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి వాటిని కత్తెరిస్తువుంటాం.
అలాగే మనలో కానీ మన పిల్లల్లో కానీ పెరిగే చెడు ఆలోచనలను తొలగించే ప్రయత్నం చేయాలి అంతేకానీ

జీవితంలో మరి ఎప్పుడు వెనక్కి తీసుకోలేనంతా
పెద్ద శిక్షలు మనకు మనం కానీ అలాగే మన పిల్లలకు కాని
ఎప్పుడు వెయ్యకూడదు.


ఆలోచించాలి ఆచరించాలి నేర్పించాలి అప్పుడే మనం మార్గదర్శకులు అవుతాం, కొందరు జన్మతః తెలివైన వారుగా ఉంటారు, మరికొందరు అనుభవం చేత తెలివైన వారుగాను, జ్ఞానవంతులు గాను మారుతారు. మార్పు అన్నది తద్యం, అది ఎప్పుడు సంభవిస్తుంది అని చెప్పడం కష్టం.

అవకాశం వచ్చే వరకు ఎదురు చూడాలి, వచ్చిన తరవాత చేసి చూపించాలి.బోయవాడు వాల్మీకి గా మారినట్లు,గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినట్లు, కష్టనష్టాల్లో ఉన్న మన జీవితం కూడా అందరికీ వెలుగును, ఆనందాన్ని పంచె గొప్ప మలుపు వున్న రోజును తీసుకోనివస్తుందని ఎదురు చూద్దాం.


Source - Whatsapp Message

మంచి మాటలు

బుధవారం --: 09-09-2020 :--
నేటి AVB మంచి మాటలు
🌹 నీ చిరునవ్వుతో అందరూ బాగుండాలి అందలో మనము ఉండాలి ఒకరు నిన్ను ప్రతిరోజూ పలకరిస్తూన్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా వారి మనసులో మీ స్థానం చాలా ప్రత్యేకమైనది అని అర్థం🌹 .

💐నవ్వుతే కనబడేది అందం నవ్విస్తే కనబడేది ఆనందం నవ్వుతూ నవ్విస్తూ ఉంటే బలపడేది అనుబంధం జీవితంలో విలువఇవ్వని బంధాలను పెంచుకోవద్దు . అలాగే విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు 💐.

🕉️కాలికి తగిలిన ముల్లు ఎలా నడవాలో నేర్పిస్తుంది
మనసుకి తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది .
గుండెకు తగిలిన గాయం బాధలో ఎలా ముందుకు పోవాలో నేర్పిస్తుంది🕉️ .
🤝 మంచి పనికి మించిన పూజ లేదు . మానవత్వానికి మించిన సంపద లేదు.
మనిషికి మరణం ఉంటుంది కానీ మంచి తనానికి మరణం ఉండదు🤝.

😞 మనం కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది . కొమ్మనుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు కానీ ! ఆ కొమ్మబలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా😊
🦚మంచిమనసు ఉన్న వారు మన కోర్కెలనుమొత్తం తీర్చలే డేమో కానీ మన అవసరాలను తప్పక తీరుస్తాడు .🦚

సేకరణ 🖋️*మీ ..AVB సుబ్బారావు 🌹🕉️🤝💐

Source - Whatsapp Message

మంచి మాటలు

 

సోమవారం --: 07-09-2020 :--
నేటి AVB మంచి మాటలు

🕉️ రాత్రి పడుకుంటే తెల్లరికి లేస్తామన్న గ్యారంటీ లేని బ్రతుకులు మనవి , ఆమాత్రం దానికి తోడురాని ఆస్తుల కోసం అడ్డదారులు తొక్కుడం
అవసరమా ! .💐

🕉️నీ చుట్టూ ఉన్న మనషుల్లో చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు లేని వినయాన్ని ప్రేమను నటిస్తారు ఒక్కసారి నీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయటపెడతారు తస్మాత్ జాగ్రత్త .💐

🕉️జీవితంలో పోరాడి గెలవలేని బలహీనులు రాజీ పడతారు గెలుస్తామనే నమ్మకం ఉన్న బలవంతులు యుద్దం చేస్తారు బ్రతకడం కోసం రాజీపడడం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్దం చేయడమే ఉత్తమం .

డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది , అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది 💐.

🕉️జీవితంలో మనకు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి , గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పిస్తుంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పిస్తుంది అందుకే ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు అంటారు💐 .

సేకరణ 🖋️*మీ ..అచ్చుతన వెంకట బాల సుబ్బారావు 💐🕉️🌹🤝

Source - Whatsapp Message

మంచి మాటలు

 

శనివారం --: 05-09-2020 :--
🌹నేటి AVB మంచి మాటలు . 🌹
గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః🙏
గురువులకు పెద్దలకు గురుపూజోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు💐🙏
ప్రతి రోజూ మీరు మీ కుటుంబసభ్యులందరు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ... మన జీవితము లోకి ఎంతమంది వచ్చిన ఎన్ని సిరులు వచ్చిన మనకు అన్నము పెట్టిన వారిని , అన్నిటికి నేను ఉన్నా నీ ముందు నీవు ముందుకు వెళ్లు అని దైర్యము ఇచ్చిన వారిని ఎప్పుడు కూడ మరువ కూడదు .

మనిషికి ఎంత అందముండి ఎం లాభం నీలో మంచి మనసు లేనప్పుడు , నీ దగ్గర ఎంత డబ్బుండి ఎం లాభం మంచి బుద్ది లేనప్పుడు , నీలో ఎంత చదువుండి ఏం లాభం మంచి సంస్కారం లేనప్పుడు , నీ దగ్గర ఎంత పెద్ద పదవి ఉండి ఏం లాభం మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉండి ఏం లాభం మంచివారు నలుగురు నీకు లేనప్పుడు .

పట్టు లేని జీవితం కాలంతో కొట్టుకుపోతున్నది , బ్రతుకులు రాక ప్రతిక్షణం విగటమైనది , కంటికి అందమైనది లేదు , మనసుకి ఆనందమిచ్చేది లేదు , ఆశలు లేని ప్రాణానికి శ్వాసలు అవసరమా ! విలువ లేని బ్రతుకున గుండెకు ఆటు పోటులు అవసరమా ? నేస్తమా ! .

సేకరణ 🖋️*మీ ... అచ్చుతన వెంకట బాల సుబ్బారావు ,వినుకొండ ,💐🌹🕉️🤝🙏

Source - Whatsapp Message

కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..

 

ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.

నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.

ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!

రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా అదిలించాడు. అంతే! రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.
పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"

రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా! ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"

రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!

పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం..

కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...

కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి.. మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.

Source - Whatsapp Message

అమ్మకు సాయం చేయండి,ఒక సారి ఆలోచించండి .మారండి

 

(అమ్మకు సాయం చేయండి )..
ఒక సారి ఆలోచించండి .మారండి.
🤱🤱🤱🤱🤱🤱🤱
ఆ కాలంలో అంటే మా బామ్మ ,అమ్మమ్మ , తాతమ్మ తరంలో మనిషోకో రకం ఐటమ్ వండటం అనేది లేదు.

ఒక కూర , పప్పు , పచ్చడి , రసము లేదా పులుసు ( పెరుగు లేదా మజ్జిగ సిద్ధం చేసి ) ఒకేసారి వండేసి , దేవతార్చన చేసుకుని , వాళ్ళ వరకు విడిగా మడిగా తీసుకుని వంట గదిలో నుండి బయటకు వచ్చేసేవారు.

రాత్రికి అల్పాహారము ఏ ఉప్పు పిండో , దిబ్బరొట్టో వేసుకుని తినేసేవారు.

ఎవరైనా రాత్రి భోజనము చేసేవారుంటే , వారే వేడిగా ఏ కూర ముక్కో వేయించుకుని , పొద్దున తినగా మిగిలిన పదార్ధాలు వేసుకుని వాటితో తినేసేవారు.

మరి ఈ కాలంలో మనిషికో రకం. భర్త తినేది పిల్లలు తినరు. అత్త గారు తినేది భర్త తినడు . పిల్లలు తినేది భర్త , అత్తగారు వేలేసి ముట్టుకోరు . వంట చేయడమంటే ఈ రోజుల్లో అంటే మహా యజ్ఞం చేసినట్లే.

ముఖ్యంగా పిల్లలు చాలామంది ఇళ్ళల్లో భోజనము చేయడానికి చాలా పేచీ పెడుతున్నారు

చచ్చి చెడీ మనిషో కో రకం చేసినా , తీరా భోజన సమయానికి పీజాలు , పానీ పూరీలు , కుర్ కురేలు లాంటి జంక్ ఫుడ్స్ బయట తినేసి ఇంటికి వస్తారు.

అమ్మ భోజనం చేయ మానగానే , నాకాకలిగా లేదు . అన్నం వద్దని మారాం చేస్తారు . ఈ మారానికి ఆడ మగ తేడా అనేదే లేదు.

పిల్లలంటే ఏ పదేళ్ళ లోపు వారంటే మీరు పప్పులో కాలేసినట్లే.

ఇంజనీరింగ్ , పోస్ట్ గ్రాడ్యుయేషన్ , డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుకునే యువతీ యువకులు కూడా ఇందులో ఏమీ మినహాయింపు కాదు.

వాళ్ళమ్మలకు తిండి దగ్గర ఎంత వరకు నరకం చూపించాలో అంత వరకు చూపిస్తారు

రాత్రి 11 దాటినా అన్నం తినరు

వండిన కూరలు అన్నం చూసుకుని తల్లి దిగులుపడి తినమని బ్రతిమలాడితే అమ్మ మీద దయ తలచి "అయితే మాకు ముద్దలు కలిపి పెట్టు. అలా పెడితేనే తింటాం " అని అమ్మకు కండిషన్ పెడతారు.

పగలల్లా గొడ్డులా ఇంటి చాకిరీ సమస్తం చేసి , అర్ధరాత్రి డస్సిపోయి నిద్ర కళ్ళతో తూగుతూ అమ్మ ఈ పిల్లలకు ముద్దలు కలిపి నోట్లో పెట్టాలి

ఈ ముద్దలు కలిపే ప్రహసనం రాత్రే కాదు ఉదయం కూడా . ఒక డిష్ లో కలిపిన అన్నం తీసుకుని , అమ్మ పిల్లల వెనక పిల్లలు స్కూల్ కు , కాలేజీ కి బయల్దేరే దాకా వారి వెనకాల పరిగెత్తుతూనే ఉంటుంది.

ఉద్యోగాలుచేసే మాతృమూర్తులకు మరిన్ని సమస్యలు అదనం

వాస్తవానికి భోజనము చేయడానికి ఎంత సేపు పడుతుంది ?

చాలా విశ్రాంతిగా తిన్నా 20 నిముషాలు మించి పట్టదు

రోజు మొత్తములోని 24 గంటలలో 20 నిముషాలు భోజనము చేయడానికి సమయం పిల్లలకు దొరకదా ? వారు ఆ 20 నిముషాల సమయాన్ని కూడా తమంతట తాము తినడానికి కేటాయించ లేరా ?

సమయం దొరకక పోవడానికి ప్రధాన కారణం , రాత్రి పది లోపు పడుకుని ఉదయం 5 గంటలకు లేవ వలసిన పిల్లలు , రాత్రి ఒంటి గంట దాకా T.V. లో నానా చెత్త ప్రోగ్రాం లు చూసి అప్పుడు పడుకుని ఉదయం 9,10 గంటలు దాటాక లేచి , ఉరుకులు పరుగులు పెడుతూ " టిఫిన్ వద్దు , భోజనము వద్దు , లంచ్ బాక్స్ వద్దు టైం లేదు " అని నానా హడావుడి చేసి అమ్మను నానా హైరాన పెట్టేస్తారు

తర్వాత వీళ్ళకు పెళ్ళిళై , ఉద్యోగాలకు పరిగెత్తుతూ, పిల్లల్ని కని అమ్మ నెత్తిన పడేసి , తమ సంతానానికి కూడా చాకిరీ చేసే అయాగా అమ్మను చేసేస్తారు.

మళ్ళీ అమ్మ కష్టాల కధ ప్రారంభం ..

అప్పటికే ఆ తల్లులకు 60 దాటి పోయి వయస్సు పై బడి , శరీరంలో ఓపిక నశించి , కాళ్ళ నెప్పులు , కీళ్ళ నెప్పులు , బి .పి . , షుగర్ , ఆయాసం , నీరసం , గుండె దడ వంటి వ్యాధులతో పీడించబడి బాధపడుతూ చాకిరీ చేయలేక, చేయడానికి ఓపిక లేదని ఎవరికీ చెప్పుకోలేక తమ లో తామే నా జీవితం ఇంతేనా ? ఈ చాకిరీకి అంతం లేదా ? దేవుడా !! ఏం పాపం చేసాను ? అని శోకించిన తల్లుల గురించి కూడా నాకు తెలుసు. అలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూసాను. వాళ్ళు మాత్రం ఎన్నాళ్ళని చాకిరీ చేస్తారు ?

ఈ బాధలు చాలవన్నట్లు , భర్త ఆఫీసు నుంచి లేటుగా విసుగ్గా వచ్చి అడుగుతాడు భార్యను " పిల్లలు భోంచేసారా ? " అని. " ఇంకా తినలేదండీ " అనగానే కారణం దొరికింది కనుక " పిల్లలకు అన్నాలు కూడా పెట్టకుండా ఇంతవరకు నువ్వు వెలగబెడుతున్న రాచకార్యమేమిటి ?" అని భార్య మీద ఇంతెత్తున ఎగిరి పడతాడు. ఆ సమయానికి ఆ ఇల్లాలు అప్పుడే తీరుబడై ఏ T.V . నో చూస్తూ కూచుని ఉందనుకోండి , ఇక ఆయన ఉగ్ర నరసింహావతారం దాలుస్తాడు.

అంటే వేళకి భోజనము చేయని పిల్లల వల్ల మాటలు పడుతోంది మీ అమ్మ గారు. గ్రహించారా ?

మరి దీనికి పరిష్కారం? -

తన తల్లి పడుతున్న కష్టాన్ని సంతానమైన అబ్బాయి కాని అమ్మాయి కాని గ్రహించాలి. అర్ధం చేసుకోవాలి ..

🤱🤱🤱🤱🤱🤱🤱🤱

తల్లికి సాయంచేసే విషయంలో ప్రతి బిడ్డా భాగం పంచుకోవాలి, వంటలో సాయం చేసే మాట దేవునికి ఎరుక. కనీసం మీ తిండి అయినా మీరు తినక పోతే ఎలా ?

25 ఏళ్ళు వచ్చినా డిగ్రీలు పూర్తయాక కూడా అమ్మ అన్నం ముద్దలు కలిపి మీ నోట్లో పెట్టాలంటే ఆమెకు ఒంట్లో ఓపిక ఉండవద్దా ?

ఈ విషయాలు కూడా చదువుకున్న వారికి మరొకరు చెప్పాలా .. ?

మాకన్నా ఉన్నతమైన చదువులు చదువుతున్న వారు మీరు,
మీ అంతట మీరే ఆలోచించుకోండి ...

అమ్మ కనిపించే దేవత, ఆమె కంట నీరొలకనివ్వకండి. పువ్వుల్లో పెట్టి చూడండి. నవమాసాలూ‌మోసి, కని, దాసీగా మనలను సాకుతున్న దేవతామూర్తికి మనం ఏమిచ్చినా తక్కువే. ప్రతీ మాతృమూర్తికీ పాదాభివందనం
నా సోదరిలందరికీ నమస్సులు

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

మంచి మాటలు

శుక్రవారం --: 04-09-2020 :--
🌹నేటి ఏ వి బి మంచి మాటలు 🌹
బంధాలు వాటంతటవే దూరం కావు , వ్యక్తిత్వం వల్లనో ప్రవర్తన వల్లనో ఒకరి పట్ల ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్లనో అవి దూరమవుతాయి .

నిజాలు మాట్లాడే వారు ఎప్పుడూ ఒంటరిగా మిగిలిపోతారూ నిజాయితీగా ప్రేమించే వారి ప్రేమను ఎప్పుటికి పొందలేరూ బంధాలు ప్రేమించే వారు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారూ కుటుంబం కోసం కష్ట పడేవారినీ ఎప్పటికి సుఖ పడనివ్వరూ . పదిమంది కోసం పాటుపడే వారు నిందపాలు అవుతూనే ఉంటారు . కానీ మనిషి గా మంచివారి మనస్సులలో శాశ్వతంగా ఉంటారు .

డబ్బు మనిషిని పైకి తీసుకెళ్ళ గలదు , అందులో ఎటువంటి అనుమానం లేదు , కానీ! మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బుని తీసుకెళ్ళలేదు ఇందులోను ఎంటువంటి అనుమానం లేదు ! ఐనా మనిషి ఆకలి కోసం చేసే పోరాటం కన్నా పైసలు కోసం చేసే పోరాటమే ఎక్కువైంది . ఇది పచ్చి నిజం

ఒక వ్యక్తిని అపార్థం చేసుకునే ముందు ఆ వ్యక్తి గతంలో మనతో ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటే నిజానిజాలు అర్థమవుతాయి . ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి . అందుకే గతం మరిచిపోవద్దు నేస్తమా .

సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు , మనషుల విలువలను కూడా సంపాదించాలి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెకించే వారిని సంపాదించాలి భాదల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపే వారిని సంపాదించాలి .

సేకరణ 🖋️ *మీ ... ఏ వి బి సుబ్బారావు 💐🌹🕉️🤝

Source - Whatsapp Message

మనిషి జయించవలసిన 6 దోషాలు

మనిషి జయించవలసిన 6 దోషాలు

వ్యక్తి నిరంతరం తాను ‘ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి’కి చేరడమే అభ్యున్నతి. అదే జీవన సాఫల్యం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అతినిద్ర, బద్ధకం, భయం, క్రోధం, అలసత్వం, ఎడతెగని ఆలోచన అనే ఆరుదోషాలను జయించినప్పుడే లక్ష్యాన్ని చేరగలుగుతాడని భారతం చెబుతోంది. భారతంలోని ఉద్యోగ పర్వంలో విదురుడు చెప్పిన మాటలివి. నిజానికి జీవితం మన భావోద్వేగాలకు అనుకూలంగా నిర్మించబడిలేదు. మన భావోద్వేగాలూ జీవితాన్నీ మార్చలేవు. ప్రతి ప్రయాణం గమ్యాన్ని చేరుస్తుందని చెప్పలేం. కానీ, ప్రయాణించిన దూరం గమ్యాన్ని దగ్గరగా చేస్తుంది. అనుకున్నది జరగడం, జరగకపోవడం సంభవమే. విజయంలో పొంగిపోతే అహంకారం పలకరిస్తుంది. అపజయంలో క్రుంగిపోతే ఆత్మన్యూనత వరిస్తుంది. మన ఉన్నతికి విఘాతం కలిగించే దోషాలను వదిలివేయడం, లోపాలను సవరించుకుంటూ, ముందుకు సాగడం వల్ల పరిణతి ఉన్నతి లభిస్తాయి. ఈ క్రమంలో పైన చెప్పిన ఆరు దోషాలను విశ్లేషించుకుంటే.. నిద్రలో శరీరం విశ్రాంతమౌతుంది. ప్రాకృతిక శక్తి మనలోకి ప్రవేశించి శక్తిమంతులను చేస్తుంది. కానీ.. అతినిద్ర లేదా నిద్ర లేమి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యమే మహాబాగ్యం. అది చెడిపోతే అన్నీ పోయినట్లే. రెండో లక్షణం బద్ధకం.

ఇష్టమయిన దాని కోసం అవసరమైన దానిని వదిలివేయడం బద్ధకం. దానివల్ల వాయిదా వేసే జబ్బు కలిగి, సమయానికి ఏ పనీ పూర్తిచేయలేం. అనుకోని పరిస్థితులు ఎదురైతే వాటిని అనుమోదించలేని సమయంలో కలిగేది భయం. భయం వల్ల ఏ పనిని సంకల్పించినా.. ‘‘ఇది నాకు సాధ్యపడుతుందా.. అపహాస్యం పాలవుతానేమో... అపజయం కలుగుతుందా’’ అనే అనుమానాలు వెన్నాడుతూ ఉంటాయి. అనుమానాల వల్ల ఉత్సాహం తగ్గుతుంది, ధైర్య సాహసాలు సన్నగిల్లుతాయి. బుద్ధి పనిచేయదు, శక్తి సామర్థ్యాలు మందగిస్తాయి. ప్రయత్నం మధ్యలోనే విడిచిపెడతాం. ఇక, క్రోధం అన్ని అనర్థాలకూ మూలకారణం. పరిస్థితులు మనం అనుకున్నట్లుగా లేనప్పుడు కోపం వస్తుంది. కోపం మనలోని భావోద్వేగానికి సంకేతం. కోపం దీర్ఘమైతే క్రోధంగా మారుతుంది. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి తపుఁతుంది. దాని వల్ల బుద్ధి సరిగా పనిచేయదు అలసత్వం వల్ల విద్య దక్కదు. విద్య లేనివానికి ధనం లేదు, ధనం లేక మిత్రులు ఉండరు, మిత్రులు లేకపోతే సుఖమూ ఉండదు. అలాగే.. ఎడతెగని ఆలోచనల వల్ల కార్యరంగంలోకి దిగడం కుదరదు. ఈ ఆలోచనలు ప్రతిబంధకాల వైపు మాత్రమే నడిపిస్తాయి. ప్రణాళికలు రూపొందాలంటే ఆలోచనలు అవసరమే కానీ, అవి ఆచరింపబడితేనే విజయం. ఇలా ఈ ఆరు దోషపు అలవాట్లను వదిలితేనే అభ్యున్నతి అంటుంది భారతం.

Source - Whatsapp Message

సమాజంలో రెండు రకాల మనుషులుంటారు .

మనకు కష్టాలు రావడం కూడా మంచిదే , కష్టాలు వస్తేనే కదా మన కన్నీళ్లు తుడవాడానికి ఎవరు ఉన్నారో తెలుస్తుంది .

నీ జీవితం ఒకడి చేతిలో ఆటబొమ్మ కాకూడదు . ఓట మైన గెలు పైనా బాదైన , బరువైనా , నష్టం అయినా ఎంత కష్టం అయినా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి . ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బ్రతక వద్దు .

ఈ సమాజంలో రెండు రకాల మనుషులుంటారు . మనం సంపాదిస్తే ఓర్వలేని వారు , మనం ఖాళీగా ఉంటే ఎగతాళి చేసేవారు , కొందరు మనం మంచిగా బతికితే అబ్బా వాళ్ళకేంది అని అంటారు , అదేమీ లేకుంటే చులకనగా చూస్తూ నవ్వుతారు . సంపద శాశ్వతం కాదు . మన జీవితం శాశ్వతం కాదు శాశ్వతంగా నిలిచేది ఒక్కటే అదే మన మంచి తనం .

అబద్దం చెప్పేవారు లక్ష చెబుతారు , ఎందుకంటే వారి దగ్గర లక్ష కధలు ఉంటాయి కాబట్టి నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు , ఎందుకంటే నిజమనే ఒక్కటి మాత్రమే ఉంటుంది కాబట్టి .


శ్లో|| పితాధర్మః పితాస్వర్గః
పితా హి పరమంతపః.
పితా ప్రీతి హి మాపన్నే
సర్వాః ప్రీయన్తి దేవతాః.

తా|| తండ్రిని సేవించడమే ధర్మము. తండ్రిని సర్వవిధముల సుఖింపజేయడమే స్వర్గం.

ధర్మవర్తనుడైన తండ్రిని అనుసరించడమే తపస్సు. తండ్రిని ప్రసన్నముగా ఉంచితే సమస్తదేవతలు మనకు ప్రసన్నులు అవుతారు.

తల్లిదండ్రులను పూజించు భగవంతుని ఆరాధించు

మనస్ఫూర్తిగా దైవారాధన చేయి.
ఆ దైవమే నీకు దారి చూపెడుతుంది

Source - Whatsapp Message

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

కష్టాల్లో ఉన్న వందమందిని ఓదార్చి,
ధైర్యం చెప్పే శక్తి నీకున్నా,
నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు,
ఓదార్పు కోసం,
ధైర్యం కోసం,
ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తావు..
వెయ్యిమందికి శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడు కూడా,
తనకు తానే శస్త్రచికిత్స చేసుకోలేడు కదా!

మన సమస్యను మనం ఎదుర్కునే తీరే,
మన వ్యక్తిత్వాన్ని చాటుతుంది...
ఓ సంఘటనలో ఓ దృశ్యాన్ని చూసి భయపడితే,
అనాలోచితంగా స్పందిస్తాం....
భయపడకుండా ఉండగలిగితే ఆలోచించి స్పందిస్తాం....
నీఆత్మాభి'మానాన్ని", గౌరవాన్ని కించపరిచే పొగడ్తలు దేనికిఉపయోగం?
పొగడ్తకోసం క్షమించేసినప్పుడే,
నిన్ను నువ్వు కోల్పోతావు..
ప్రశంసను ఆశించడంలోస్వార్థంలేదుకానీ,
ఆప్రశంసకోసం నిన్నునువ్వు కోల్పోకు!
మనిసన్నాకా,కాస్త బలుపుఉండాలి..
ముందు నువ్వు తర్వాతే ఏదైనా!

☘శుభోదయం🎀🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు
☸శుభమ్ భుయాత్,
శుభమస్తు.
🌻🌻🌻

Source - Whatsapp Message

మంచి మాటలు

సోమవారం --: 24-08-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు ...
ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే . దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనే డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము .

మనిషిని పరిచయం చేసుకోవటం లో గొప్పతనం ఏమీ లేదు ! వాళ్ళ మనసుని అర్థం చేసుకోవటం లోనే మన గొప్పతనం ఉంది నేస్తమా! .

మనిషికి కావలసింది నేర్పు . మనసుకు కావలసింది ఓర్పు . జీవితానికి కావలసింది కూర్పు . బాధలలో కావలసింది ఓదార్పు . ప్రతి జీవితానికి కావలసింది మార్పు .

నీ బలం ఎవరికి తెలియక పోయినా పర్వాలేదు . బ్రతకే యొచ్చు . కానీ ! నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు . బ్రతకనివ్వరు

నీలో ఎన్ని లోపాలున్నా బలహీనతలున్నా నిన్ను నీవ్వు ఎలా ప్రేమిస్తావో అలాగే ఎదుటి వారి లోపాలనూ బలహీనతలను అర్థం చేసుకుంటే అందరూ మంచిగానే కనిపిస్తారు అందరూ నీవారవుతారు .

సేకరణ 🖋️ *మీ ..AVB సుబ్బారావు 💐🤝🕉️🌹

Source - Whatsapp Message

ప్రమాదం కాపుకాసుకుని ఉంది

ప్రమాదం కాపుకాసుకుని ఉంది.

ఈ నాలుగు మాటలు చదవండి! ఆచరించండి! జాగ్రత్తగా ఉండండి!

అందరికీ నమస్కారం🙏

మనం ఇప్పుడు చాలా విషమ పరిస్థితిలో ఉన్నాం. మన చుట్టు ప్రక్కల కరోనా మహమ్మారి దాక్కుని ఉంది.

ఒక సర్వే ప్రకారం.....
మనం టీవీలో టెస్టులు చేసుకున్న వారి సంఖ్య మాత్రమే వింటున్నాం.
టెస్టులు చేయించుకోకుండా వైరస్ సోకి ఉన్న వారు లక్షల్లో మనమధ్యే ఉన్నారు.
అందుచేత.....

దయచేసి ఎవ్వరూ ఎవరి ఇంటికి వెళ్ళకండి!
తెలిసిన వారే కదా అని వెళ్లి, వారిని ఇబ్బంది పెట్టకండి!

చెప్పకుండా చొరవగా వెళ్లి, వాళ్ల ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కూర్చోకండి!
ఏ వస్తువులు పడితే వాటిని ముట్టుకోకండి!

ఒకవేళ బంధుమిత్రులతో మాట్లాడాలనుకుంటే, ఫోన్ కాల్ చేసి మాట్లాడండి!
చూడాలనిపిస్తే వీడియో కాల్ చేసి మాట్లాడండి!

ప్రత్యక్షంగా కలవాలి అనుకుంటే ముందే ఫోన్ చేసి, ఇంటి ముందుకు వెళ్లి, బయటకు పిలిచి, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకొని కాసేపు మాట్లాడిరండి!

అంతేకానీ చొరవతో తగుదునమ్మా అంటూ నేరుగా కిచెన్ లోకి, బెడ్ రూమ్ లోకి వెళ్లి, ఏమిటి కబుర్లు అంటూ అనవసరవిషయాలు మాట్లాడకండి!

వారు మొహమాటంతో, అప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోయినా, మీరు వెళ్లిపోయిన తర్వాత మిమ్మల్ని తిట్టుకోవడం ఖాయం.

వారు మిమ్మల్ని ఇంట్లోకి రమ్మని పిలిచినా, మీరు గౌరవంగా పర్వాలేదు, మరోసారి వస్తానని చెప్పి వెళ్ళండి!అప్పుడే మీరు మర్యాద తెలిసిన వ్యక్తులుగా పరిగణించబడతారు

మీరు వారికి ఎంత ప్రాణ స్నేహితులైనా కావచ్చు! లేక ఎంత దగ్గరి బంధువులైనా కావచ్చు! వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకండి!

ఇక ఇరుగుపొరుగు వారు ఇచ్చే వంటకాలను ససేమిరా తీసుకోకండి!
అలాగే వారికి మీ వంటకాలను ఇతర తినుబండారాలను ఏమీ ఇవ్వకండి!
ఇచ్చి పుచ్చుకోవడాలు కొంతకాలం ఆపేయండి.
ఈ విషయమై వారితో ఒకసారి సౌమ్యంగా చెప్పండి!

స్నేహితులతో కలిసి అన్నిరకాల పార్టీలు కొన్ని రోజులు ఆపేయండి.
ఈ పార్టీల వలన చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

అవసరం లేకపోయినా రోడ్డుమీదకు వెళ్ళకండి!
వాకింగ్ కూడా మానేయండి!
ఇంట్లోనే యోగ, మెడిటేషన్, సూర్య నమస్కారాలు, స్కిప్పింగ్ వంటివి చేయండి!

నువ్వు నీ శ్రేయోభిలాషులకు ఇచ్చే గౌరవం వారిని కలవకపోవడమే. అదే ఇరువురికీ క్షేమదాయకం.

ఇవి యదార్ధములుగా భావించి ఆచరించి, ఆరోగ్యంగా ఉండండి!

సమస్త లోకా: సుఖినో భవంతు!

Source - Whatsapp Message

Friday, October 2, 2020

పెద్దవయసు - గౌరవం

పెద్దవయసు - గౌరవం

పెద్దతనం వచ్చింది అనగానే కొన్ని విషయాలు మనం వదిలి వేయాలి.
పట్టుకోవటం కష్టం కానీ వదిలివేయటంలో బాధ ఏమిటి చెప్పండి?
అలా అనుమానంగా చూడకండి... ఏమి వదిలివేయాలో చూద్దామా ..
"అమ్మాయి!! గ్యాసు కట్టేసావా!! గీజర్ ఆఫ్ చేసావా?? ఏ.సి. ఆన్ లో ఉన్నట్లుంది.. పాలు ఫ్రిజ్ లో పెట్టావా ?? కరెంట్ బిల్లు కట్టారా !!!" లాంటి ఎంక్వయిరీలు వదిలి వేయండి !!!
"మా కొడుకు కోడలు పట్టించుకోరు" అని హైరానా పడకండి..

ఇలా పట్టించుకుంటూ.. 60..70 ఏళ్ళు గడిపారు, ఇంకా ఎంతకాలం ?? ఇది వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం .. కష్టనష్టాలు కూడా వాళ్ళవే !! చూడండి అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండగలరో.. "నా అభిప్రాయం ఏమిటంటే" అని అనటం తగ్గించి..
"నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిద్దామా!!

'నాకూ తెలుసు' తో పాటు 'నాకు మాత్రమే తెలుసు' అనే అహం తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ 'నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఠక్కున ఒప్పేసుకోండి.. మీ మంచికేనండీ చెబుతున్నాను ...

"మా కాలంలో",
"మా చిన్నప్పుడు" అంటూ వీలు చిక్కినప్పుడల్లా వారిని ఊదరకొట్టకండి. వారి ముఖాల్లో కనిపించే విసుగుని చూడనట్లు నటించకండి. మన పిల్లలు కోసం వచ్చేవారితో మితంగా మాట్లాడండి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకోండి. కాసేపు మాట్లాడాక లేచి గదిలోకి వెళ్ళిపోగలిగే మనోనిగ్రహం అలవరుచుకోండి ..

పెద్దవారిని పలకరించే మర్యాదతో ఒక ప్రశ్న ఎవరైనా సహజంగా అడుగుతారు... "ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే స్పందించకండి...
మన బి.పి..... షుగర్.. కీళ్ళనొప్పులు .. నిద్ర పట్టకపోవటం,.. నీరసం అంత రసవత్తరమైన విషయం కాదని సదా సర్వదా గుర్తుంచుకోవాలండీ బాబూ !!! మనకి తోచక కాలక్షేపానికి ఎంత ఆలోచించినా ఎదుటివాళ్ళకి దాంట్లో అంతే ఇంట్రెస్ట్ ఏం ఉంటుంది చెప్పండి.. "బాబోయ్ !! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించకండి..

ఇంకొక విషయం...
ఎవరో పెద్దాయన అన్నాడు...
"మన అనుభవం తో వారిని తీర్చి దిద్దాలి కదా!" అని.
కాలం మారింది... మారుతున్నది..
"రోట్లో కందిపచ్చడి రుబ్బటం.. తిరగలితో విసరటం.. కట్టెల పొయ్యి మీద వంట చేయటం, కవ్వంతో మజ్జిగ చిలకటంలో గల నా అనుభవం నేటి తరానికి ఎలా ఉపయోగపడుతుంది ??"

ఉద్యోగాలైనా అంతే ! పద్దతులు మారుతున్నాయి.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది.... విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సు లో సీటు ఎలా పట్టుకోవాలో చెప్పి ఏం ప్రయోజనం ??

చివరగా పెద్దతనంలో మన పరువు కాపాడుకోవటం పూర్తిగా ... పూర్తిగా మన చేతుల్లోనే ఉందండీ !! అనవసరం విషయాల్లో జోక్యం చేసుకోకుండా... మితభాషిగా వుంటూ... మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... జిహ్వ చాపల్యం తగ్గించుకుని... అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటం లేదు" అనే ఆత్మన్యూనతా భావం దరి చేరకుండా జాగ్రత్తపడాలి...

భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము.. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.. పాజిటివ్ గా చూడండి... ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు... మొత్తం సంసారాన్ని లాగే బాధ్యత లేదు... పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది..

హాయిగా పూజలు చేసుకోవచ్చు.. భగవద్గీత, భాగవతం చదువుకోచ్చు.. దైవదర్శనం చేసుకోవచ్చు.. చిన్న చిన్న హాబీలు మనసు కి ఆహ్లాదాన్నిస్తాయి.. వాటికి సమయం కేటాయించవచ్చు..

ఒక మాటని రోజూ అనుకుందాం.. "I love myself... I respect my self " ఇది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది..

చివరగా............ మనం దిగవలసిన స్టేషన్ దగ్గరలోనే వుంది ... Platform అదిగో ..... సమయం దగ్గర పడింది.

ఇక మనకి బోగీలో ఉన్నవారితో తగువులు... మనస్పర్థలు ఎత్తిపొడుపు మాటలు అవసరం అంటారా...
మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది ...

పెద్దతనం మనకి వరంలాంటిది ... అది ముఖ్యంగా మన 'అహం' తగ్గించి, మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో ‌సరియైన అవగాహన కల్పిస్తుంది ... కాబట్టి అందరూ వృద్ధాప్యాన్ని ఆనందంగా స్వాగతించాలి సుమండీ !!!
నస అనిపించుకునే కంటే nice అనిపించుకోవడం మంచిది కదా!

ఇది నాకు ఎవరో పంపారు. బాగుందని మీకు పంపుతున్నాను.
👏👌🙏👍😊

Source - Whatsapp Message

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

ప్రశ్న ఏదైనా సరే
ప్రేమతో బదులు ఇస్తే
మనం గడిపే ప్రతిరోజు
అందంగా ఉంటుంది..
కాకి,కోయిలా రెండు అరుస్తాయి.
కాని కాకిది గోల అంటారు
కోకిలది పాట అంటారు.
ఆలోచించాలి ఎందుకో ?
బదులు ఇచ్చే విదానంతోనే
సగం ప్రపంచాన్నిగెలిచేయోచ్చు.
అలాగే
మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించే వారుంటారు!
కాని మనం ఒకమాట గుర్తుపెట్టుకోవాలి!
ఆటలో... గోలచేసేది ప్రేక్షకులే కాని ఆటగాళ్లు కాదు!


☘శుభోదయం⛱️🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు.
🕉లోకాసమస్తా సుఖినోభవంతు 🕉️
🌻🌻🌻🌻🌻


Source - Whatsapp Message

ముక్కుసూటి మనిషి!

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


ముక్కుసూటి మనిషి!
➖➖➖✍️

ఒక వీధిబడిలో మాష్టారు తెలుగుపాఠం చెబుతున్నారు!

ఒక పిల్లాడు లేచి “సార్ ఈడికి నిన్న ఇచ్చిన పుస్తకం అమ్మేశాడు” అని ఒక అబ్బాయిని చూపుతూ చెప్పేడు.

దానికి మాష్టర్ “ఏమిరా వెధవా నిజమేనా?” అని అడిగితే “నిజమే” అని చెప్పేడు ఆకుర్రాడు.

“ఏమిరా వెధవా ! నీకెలా” అని గద్దించగా “నేను మొత్తం చదవేశానండీ ఆ పుస్తకాన్ని“ అన్నాడు ఆ పిల్లాడు.

దానికి కోపంతో మాష్టర్ “బడుద్దాయ్ నాకే అబద్దం చెబుతావా అయితే చెప్పు 8 వ పేజీలో ఏముంది?” అనగా ,మొత్తం గడగడా చెప్పేశాడాబ్బాయి. ఆశ్చర్యపోయిన మాష్టర్ వివిధ పేజీలలో ఏముందో అడిగేడు. అన్నింటిని చెప్పేడు ఆ కుర్రాడు.

చివరకి 48 వ పేజీలో ఏముందో చెప్పమనగా , “అసలు ఆ పుస్తకంలో 48 వ పేజీ లేదు కదసార్” అన్నాడు.

దానితో మాష్టర్ ఆనందభాష్ఫాలు రాలుస్తూ “నాయనా నువ్వు చాలా గొప్పవాడివవుతావురా” అని దగ్గరకు తీసుకొని దీవించాడు.

ఆ దీవెనలు ఊరకే పోలేదు. ఆ అబ్బాయి గొప్ప బారిష్టర్ అయినాడు. మన రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రి కూడా అయినాడు అతని పేరే తెలుగువారు గర్వంగా ఆంథ్రకేసరి అని పిలుచుకొనే టంగుటూరి ప్రకాశం పంతులు గారు.

1872 ఆగష్టు 23 న ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు పంతులుగారు. వాళ్ళమ్మగారు పూటకూళ్ళు పెట్టేవారు. ఆరోజులలో అలా పెట్టేవారిని చిన్నతనంగా చూసేవారు.

పంతులు గారు కూడా ధనవంతుల ఇళ్ళలో వారాలబ్బాయిగా వుండి చదువుకొనేవారు. అయితే నాటకాల పిచ్చెక్కువ. మెట్రిక్ తప్పాడు. అయితే హనుమంతురావ్ నాయుడు అనే మాష్టర్ సహాయంతో మద్రాస్ లో FCపాసై లా చదివి లాయర్ గా ప్రాక్టీస్ చేసేవారు. మంచి తెలివిగలవారైనందున వాగ్దాటి పఠిమ కలవాడైనందున అనతికాలంలోనే గొప్పలాయర్ అయినాడు. అయినా బారిష్టర్ లేనందున ద్వితీయ శ్రేణి లాయర్ గానే వుండవలసివచ్చింది. అందుకు 1904 లో ఇంగ్లండ్ వెళ్ళి బారిష్టర్ చదివేడు. అప్పుడే అక్కడ దాదాభాయ్ నౌరోజీతో పరిచయం అయింది. బారిష్టర్ అయిపోయిన తరువాత మద్రాస్ హైకోర్ట్ లో ప్రాక్టీస్ మొదలుపెట్టేరు. అప్పటి వరకు ఆంగ్లేయులు,తమిళయన్స్ మాత్రమే హైకోర్టు లాయర్స్ గా పేరుపొందేరు.

తెలుగులో మొదటిహైకోర్టు లాయర్ అవటంతో చాలా కేసులోచ్చాయి. తన వాగ్దాటితో అనతికాలంలో గొప్ప బారిష్టర్ గా పేరు సంపాదించాడు. ఆరోజుల్లోనే లక్షలు సంపాదించాడు.

ఒకరోజు వాళ్ళావిడ డబ్బులు దాచడానికి
ఖాళీ ఎక్కడాలేదండీ అన్నదంటే పరిస్థితి అర్థంచేసుకోండి.

క్రమంగా స్వాతంత్రఉద్యమం వైపు ఆకర్షితులై హోం రూల్ లో ఉద్యమంలో చేరాడు.
స్వరాజ్య అనే పత్రికను తెలుగు,తమిళ భాషలలో నడిపేరు.

1921 సహాయనిరాకరణోద్యమ సందర్భంగా తన యావదాస్థితిని ప్రజలకు అంకితం చేసి , బారిష్టర్ గా రాజనామా చేసి భారతీయకాంగ్రెస్ లో సభ్యునిగా చేరినారు.

1929 లో సైమన్ కమీషన్ రాక సందర్భంగా మద్రాస్ లో నిరసనలు తెలుపుతున్న ప్రజలపై ఆంగ్లేయులు కాల్పులు జరపగా పార్థసారథి అనే యువకుడు మరణించాడు. అతనిని చూడకుండా నిషేదాజ్ఙలు విధించగా ప్రకాశంగారు థైర్యంగా వెళ్ళారు. కాలుస్తామని తుపాకులు ఎక్కుపెట్టగా కాల్చండిరా అంటూ గుండెలు చూపారు. అతని థైర్యానికి మెచ్చిన ప్రజలు ఆంథ్రకేసరి అని బిరుదిచ్చారు.

1937 లో కాంగ్రెస్ మద్రాస్ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలుసుకొనింది. అందరూ ప్రకాశం గారు ముఖ్యమంత్రి అనుకొంటుండగా గాంధీ ,నెహ్రూల ప్రీతిపాత్రుడైన రాజాజీ ముఖ్యమంత్రి అయినాడు.
ప్రకాశం గారు రెవెన్యుమంత్రి అయినారు.

అయితే రెండో ప్రపంచయుద్ధంలో భారత్ పాల్గొనడానికి నిరసనగా ఆ పదవికి రాజనామా చేశారు.

క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.

1946 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. కాని రాజాజీ, కామరాజ్ లాంటి నాయకుల కుయుక్తులను భరించలేక 11 నెలల తరువాత పదవికి రాజీనామా చేశారు. ప్రజా పార్టీ ని పెట్టేరు.

ఆంథ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి ముఖ్యమంత్రి అయినారు.కాని కమ్యూనిష్టులు మద్ధతు ఉపసంహరించుకోవడంతో 1954 నవంబర్ 24 న రాజనామా చేసి రాజకీయాల నుండి విరమించుకొన్నాడు.

ప్రకాశంగారు చాలా ధైర్యస్తుడు.ముక్కుసూటి మనిషి! ఎవరినైనా లెక్కచేసేవాడుకాదు.

అందులో కొన్ని:
1. ఒక ఉద్యమంలో ప్రజల నుండి విరాళాలు సేకరించారు. కాని ప్రకాశం పంతులంటే పడనివారు గాంధీకి మాయమాటలు చెప్పి లెక్కలడగ మన్నారు.గాంధీ లెక్కల అడగగా
"మహాత్మా లక్షలు చూశాను, అలాంటిది వేయిరూపాయలు నాకు లెక్కా? అయినా ప్రతి పైసాకు లెక్కొంది చూపుతా!! మీరు మేకపాలు తాగేందుకు టాటా ల ఖర్చెంతో చెబుతారా?” అని ఘాటుగా బదులిచ్చారు.

2. 1952 లో ప్రత్యేక ఆంథ్రరాష్ట్ర ఉద్యమకాలంలో నెహ్రూ మీద రూపాయి నోటు విసిరేస్తూ దానిలో తెలుగులో రూపాయి అని వుంది. మరి రాష్ట్రం ఎందుకివ్వకూడదో చెప్పమన్నాడు.

3. 1948 లో నెహ్రూ హెచ్చరికలు బేఖాతర్ చేస్తూ హైదరాబాద్ నిజాం దగ్గరకెళ్ళి రజాకార్ల ఉద్యమనాయకుడైన ఖాజింరజ్వీని ఉద్దేశించి “నువ్వు నీ అదృష్టాన్ని దూరం చెసుకొంటున్నావ్” అని హెచ్చరించారు.

అతని దైర్యానికి అబ్బుర పడిన రజాకార్ల సైన్యం అసంకల్పితంగా అతనికి సెల్యూట్ చేశారట. వారి సెల్యూట్ అందుకొన్న తెలుగువాడు ఈఒక్కడే.

పేదరికం అనుభవిస్తూ పెరిగేడు లక్షలు సంపాదించాడు చివరికి పేదరికంలోనే చనిపోయిన మహామనిషి మన ఆంథ్రకేసరి.

ఆ మహానుభావుడికి ఆశ్రువులనిండిన కళ్ళతో నివాళులు అర్పిద్దాం!✍️


🌷🙏🌷


🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

Source - Whatsapp Message