Monday, October 5, 2020

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹

ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు,
మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజ రూపం.!
నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ,
నీ గురించి మాట్లాడటం మొదలుపెడతారు..!
మీ బలహీనతను ప్రపంచానికి ఎప్పుడూ చూపించవద్దు,
ఎందుకంటే దానితో ఆడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు...

మన మార్గం మంచిదైతే ఫలితం మంచిదవుతుంది..
అడ్డదారిలో సాధించేది అవమానాలతో అంతమవుతుంది..
ఆశ మనుషులను గొప్ప వాళ్ళను చేస్తే,
దురాశ నీచులను చేస్తుంది..
నీతి తప్పిన వ్యవహారం ఏది ఆత్మగౌరవాన్ని ఇవ్వదు..
ఉత్తమ గుణాలు ఎవరినైనా ఉన్నతులను చేస్తాయి..
ఈరోజటి మన అడుగుజాడలు,
మన పిల్లలకు మనం వేసే బాటలు అని మరవద్దు..

☘శుభోదయం🌹🦚
✡సర్వేజనాః సుఖినోభవంతు
🕉లోకా:సమస్తా: సుఖినోభవంతు
☸శుభమ్ భూయాత్
శుభమస్తు.
🌻🌻🌻🌻🌻

Source - Whatsapp Message

మంచి మాటలు

సోమవారం --: 05-10-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు .


మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు . మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తును ఎక్కవగా ప్రేమించు

పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు , ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమ లుండవు నమ్మకం లేనిది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు .

మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం . ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్లే .
అందుకే ఎన్నడూ ఆ విలువను చేజార్చుకోవద్దు .

ఒకరిని కించపరచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం , ఒకరు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్దిమంతుల లక్షణం .

మనం కోరే బంధం కంటే మనల్ని కోరివచ్చే బంధం గొప్పది . ఏ బంధం అయినా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటీకి "నిలిచి ఉంటుంది .

సేకరణ ✒️
మీ ... AVB సుబ్బారావు*

Source - Whatsapp Message

Sunday, October 4, 2020

బహుమతి

Read this beautiful story completely.

🔮బహుమతి


ఉదయం పూజ అయ్యాక, పేపరు చదువుకుంటున్న నేను... ఎవరో కాలింగ్‌బెల్‌ కొడితే వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా ఓ యువకుడు చేతిలో శుభలేఖలతో ‘‘మాస్టారూ, బాగున్నారా?’’ అని పలకరించాడు.
వృద్ధాప్యం వల్ల వచ్చిన మతిమరుపు వల్ల ‘ఎవరా’ అని ఆలోచిస్తూ యథాలాపంగా ‘‘ఆ, బాగానే ఉన్నాను. లోపలికి రా బాబూ’’ అన్నాను.
లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నేను అతడికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని ‘అతడెవరా’ అని ఆలోచిస్తున్నాను. మర్యాద కోసం ‘‘మంచినీళ్ళు కావాలా?’’ అని అడిగాను. వద్దన్నాడు.
గొంతు సవరించుకుని అతడే అడిగాడు- ‘‘నన్ను గుర్తుపట్టారా మాస్టారూ?’’ అని.
నేను తటపటాయిస్తుంటే చిరునవ్వుతో అన్నాడు ‘‘నేను సత్యమూర్తి నీ. మీ స్కూల్లో చదివాను. మా నాన్నగారు ఆ రోజుల్లో జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా చేసేవారు’’ అని.
అప్పుడు గుర్తుకు వచ్చింది. సత్యమూర్తి చాలా మంచి స్టూడెంట్‌. బాగా తెలివైనవాడు. ఎప్పుడూ క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేవాడు. అతడు స్కూల్లో చేరినరోజే వాళ్ళ నాన్నగారు నన్ను కలిసి ‘మాస్టారూ, మావాడు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని నా కోరిక. ఏ తప్పుచేసినా అల్లరిచేసినా జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కొడుకని చూడకుండా దండించండి. నేనేమీ అనుకోను. వాడు బాగా చదువుకుంటే అదే పదివేలు’ అని చెప్పారు. వృత్తిరీత్యా ఎంతోమంది రాజకీయ నాయకులని చూసిన నాకు, ఆయన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఆ రోజుల్లో నేను హెడ్‌మాస్టర్‌గా పనిచేసేవాణ్ణి. పిల్లలకి గణితం, సైన్సు బోధించేవాణ్ణి.
అయితే సత్యమూర్తి దండించే పరిస్థితులు వచ్చేలా ప్రవర్తించలేదు. చాలా బాగా చదివేవాడు. ఏ సందేహం వచ్చినా అడిగి నివృత్తి చేసుకునేవాడు. అతడికి చదువులో, ముఖ్యంగా గణితం మీద ఉన్న అభిరుచి చూసి అతడికి మరింత శ్రద్ధతో కిటుకులు బోధించేవాణ్ణి.
కుశలప్రశ్నలయ్యాక, అతడు వచ్చిన పని చెప్పాడు. ‘‘మాస్టారూ, వచ్చే పదిహేనో తారీఖున నా పెళ్ళి, మా స్వగ్రామంలో. మర్నాడు సాయంత్రం ఈ ఊళ్ళోనే రిసెప్షన్‌. మీరూ అమ్మగారూ పెళ్ళికి తప్పకవచ్చి మమ్మల్నిద్దరినీ ఆశీర్వదించాలని నా ప్రార్థన. మీరు ఎప్పుడు బయల్దేరతారో చెబితే, నేను మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కారు ఏర్పాటు చేస్తాను’’ అంటూ, నా చేతిలో శుభలేఖ పెట్టి, నాకూ మా ఆవిడకీ పాదాభివందనం చేశాడు.
శుభలేఖ చూశాను. అర్ధరాత్రి ముహూర్తం. నేను అతడికి మృదువుగా చెప్పాను- ఆరోగ్యరీత్యా ప్రయాణించలేమనీ వీలైతే రిసెప్షన్‌కి వస్తాననీ చెప్పాను. పెళ్ళికి రాలేమని అనేసరికి అతడి ముఖం కొద్దిగా చిన్నబోయింది. అయితే రిసెప్షన్‌కి ఇద్దరూ తప్పక రావాలని మాట తీసుకుని మరీ బయల్దేరాడు. కారు పంపవద్దనీ మేమే వస్తామనీ చెప్పాను.
పెళ్ళి రెండ్రోజులుందనగా మా ఆవిడ జయ, రిసెప్షన్‌ గురించి గుర్తుచేసి, బహుమతి ఏమిద్దామని అడిగింది. సత్యమూర్తి చాలా ధనవంతుడు. అతడి స్థాయికి తగిన బహుమతి ఇచ్చే తాహతు నాకు లేదు. చాలాసేపు ఆలోచించిన తరవాత నా ఉద్దేశ్యం జయకి చెప్పాను, తనూ అంగీకరించింది.
రిసెప్షన్‌కి నేనూ జయా వెళ్ళాం. సత్యమూర్తి స్నేహితులైన నా పూర్వవిద్యార్థులు కొంతమంది కలిశారు. సత్యమూర్తి తండ్రి వచ్చి పలకరించారు. రిసెప్షన్‌ మొదలయ్యాక నేనూ జయా వేదిక మీదకి వెళ్ళి వధూవరులని ఆశీర్వదించాం. సత్యమూర్తి చేతిలో నేను తీసుకెళ్ళిన కవరు పెట్టాను.
ఆ కవరులో పెట్టిన ఉత్తరంలో ఇలా రాశాను.

చిరంజీవి సత్యమూర్తికి
ఆశీస్సులు.
ఈ సమయంలో ఉత్తరం ఏమిటీ అని ఆశ్చర్యపోతున్నావా? తమ ఉన్నతికి పాటుబడిన ఉపాధ్యాయులని ఏమాత్రం పట్టించుకోని ప్రస్తుత కాలంలో నువ్వు గుర్తుపెట్టుకుని వెతుక్కుంటూ వచ్చి ఎంతో అభిమానంగా మమ్మల్ని నీ పెళ్ళికి ఆహ్వానించినందుకు చాలా సంతోషమైంది.
వృద్ధాప్యం వల్ల ఈమధ్య మా బంధువులలోనైనా ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించినా అంతగా వెళ్ళడం లేదు. నీ విషయంలో ఈ పద్ధతికి విరామం
ఇద్దామని నిర్ణయించుకున్నాను. కారణాలు అనేకం. నువ్వు నా అభిమాన విద్యార్థివి కావడం, మీ తండ్రిగారి మీద నాకున్న గౌరవం... వగైరా.
వచ్చిన చిక్కల్లా ‘నీకు ఏ బహుమతి ఇవ్వాలా’ అన్నదే. మనమిచ్చే బహుమతి అవతలివారికి ఉపయోగపడేలా ఉండాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. నా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో నీకు ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని చాలా తర్జనభర్జనపడ్డాను. ఎంత ఆలోచించినా సరైన వస్తువేదీ నా బుద్ధికి తట్టలేదు. ఏ వస్తువు అనుకున్నా అది నీ తాహతుకి చాలా తక్కువవుతుందనిపించింది లేదా నీ దగ్గర ఇప్పటికే ఉండి ఉంటుందని పించింది. డబ్బే ఇద్దామనుకుంటే, నేనివ్వగలిగిన మొత్తం నీకు చాలా తక్కువవుతుందనిపించింది. అటువంటి సమయంలో నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఉత్తరంతో జతచేసిన కాగితమే నేను నీకు ఇస్తున్న బహుమతి.
నువ్వూ నీ సహధర్మచారిణీ ఎంతో ఆనందంగా మీ భావిజీవితాన్ని గడిపేలా చేయమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం....
దీవెనలతో,
శంకరం మాస్టారు

డిన్నర్‌ చేశాక వద్దంటున్నా మా ఇద్దరికీ బట్టలు పెట్టారు అతడి తల్లిదండ్రులు. తీసుకోకపోతే సత్యమూర్తి బాధపడతాడంటూ బలవంతం చేశారు. చాలా మొహమాట మేసింది మాకు. అలాగే వద్దంటున్నా మమ్మల్ని కారులో మా ఇంటి దగ్గర దిగబెట్టారు.
నెల రోజుల తర్వాత నా పేరున ఓ ఉత్తరమొచ్చింది. తెరిచి చూస్తే అది సత్యమూర్తి రాసినది.

దైవసమానులైన మాస్టారుగారికి,

నమస్కారములు.
నా పెళ్ళికి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ ఆశీర్వదించినందుకు సంతోషం. ఆరోజు నా పెళ్ళి రిసెప్షన్‌లో మీరు ఇచ్చిన బహుమతి చూశాక, దానికి జతచేసిన ఉత్తరం చదివాక చాలాసేపు అలా ఉండిపోయాను. మేధావులు ఎందుకు ప్రత్యేకంగా ఉంటారో అర్థమయింది.
మీరు రూ.1,116 నా పేరున ఓ అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చి, ఆ రసీదు జత చేశారు. నా పెళ్ళికి వచ్చిన అన్ని బహుమతులలో దీన్ని అత్యంత విలువైనదిగా భావిస్తాను.
స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మీరు నాకు ఓ రోల్‌మోడల్‌. చిన్నప్పటి నుండీ నేను ఇతరులని ఆసక్తిగా గమనిస్తూ ఉండేవాణ్ణి. అలాగే స్కూల్లో చదువుతున్నప్పుడు మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాణ్ణి. అందువల్ల నేనుచాలా మంచి విషయాలే నేర్చుకున్నాను.
నేను ప్రస్తుతం ఇంత మంచి స్థాయిలో ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ, మీ బహుమతి నన్ను ఆలోచించేలా చేసింది. మీరన్నట్లు మామూలుగా అయితే రూ.1,116 నాకు చాలా చిన్న మొత్తమే. కానీ మీరు ఆ మొత్తాన్ని ఓ అనాథశరణాలయానికి విరాళంగా ఇచ్చారు- అదీ నా పేరున.
మీరు చేసిన ఈ గొప్పపని నాలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. అనేకసార్లు నేను చేసే అనవసర ఖర్చుల్ని గుర్తుచేసింది. మీరు ఇచ్చిన బహుమతిని నేను అప్పుడే అనుకరించేశాను. నా పెళ్ళయిన మూడు రోజులకి మా కజిన్ పెళ్ళి అయ్యింది. వాడికి లెక్కపెట్టలేనంత డబ్బు ఉంది. అందుకని మేమిద్దామనుకున్న రూ.50,000లని ఓ అనాథ శరణాలయానికి వాడి పేరుమీద విరాళంగా ఇచ్చాం. వాడెంత సంతోషించాడో మాటల్లో చెప్పలేను. మీరు మాకు ఓ కొత్త మార్గాన్ని చూపారు. మేమెందరమో ఈ కొత్త దారిలో ప్రయాణించే అవకాశం కల్పించారు.
ఇలా మీరు మీ చర్యలతో మాకు ఎప్పుడూ బోధిస్తూనే ఉన్నారు- ఉద్యోగంలో ఉన్నప్పుడూ రిటైర్‌ అయ్యాకా కూడా. అదే మీ గొప్పతనం.
పాదాభివందనాలతో,
మీ విద్యార్ది,
సత్యమూర్తి.

అతడి గొప్ప వ్యక్తిత్వానికి మనసులోనే హర్షిస్తూ, ఉత్తరం జయ చేతిలో పెట్టాను


👌👌👌👍👍👍👏👏👏

Source - Whatsapp Message

కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది..

అన్నీ పట్టించుకోకండి...

ఒక పాము వడ్రంగి దుకాణంలో లోకి దూరి,

అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది.

వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది.

ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది.

పాముకు అసలేమి జరుగుతుందో తెలియక,

రంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని
వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని,

తన బలమంతా వుపయోగించి,

రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని,

చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది.


మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా,

ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి‌,

చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము.


అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.


జీవితంలో ప్రశాంతంగా వుండలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని,...
మనుషులను,...
వారి ప్రవర్తనను,...
వారి మాటలను,...
అసూయలను...
మరియు
ద్వేషాలను.... పట్టించుకోకుండా చేయవలసి వుంటుంది.

కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది... !!

Source - Whatsapp Message

మన ఆరోగ్యం పాడవడానికి, మన సోమరితనమే కారణం.ఎందుకంటే

మన ఆరోగ్యం పాడవడానికి
మన సోమరితనమే కారణం.
ఎందుకంటే
మామిడి పండ్లు దొరికే కాలంలో
కూడా మాజా కొని తాగుతాం.
చిప్స్ కోసం బంగాళాదుంపలు
ఉన్న లేస్ కొని తింటాం.
ఎంతో శక్తిని ఇచ్చే నవధాన్యలు , తృణధాన్యాలు ఉన్నా సరే
హార్లిక్స్, బూస్ట్ లు అంటూ
ధర ఎంత ఉన్నా సరే
కొని మరీ తాగుతాం. నిమ్మకాయ నీరు తాగితే ఇమ్మ్యూనిటి పెరుగుతుంది అని తెలుసు కానీ sprite తాగుతాము .
ఈ కార్పొరేట్ సంస్థలను విమర్శించే ముందు
మనము మన జీవన విదానంలో
మార్పు తెచ్చుకోవాలి.
మన ఆరోగ్యాన్నీ మనమే కాపాడుకోవాలి...ముక్యంగా మీరు గమనించండి మన పూర్వీకులు ఎంతో ఆరోగ్య బాండగారం మనకు సంపదగా ఇచ్చారు ...ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థలు వాటి మూలాల వెతుకుతూ టీవీ ల లో రోజు ప్రతి యాడ్ ను ఆయుర్వేదిక్ గా మార్చేశారు చూడండి మీ పేస్ట్ లో ఉప్పు ఉందా నిమ్మకాయ ఉందా...😝 ఇంకో యాడ్ ఉసిరి ,వేప హెయిర్ ఆయిల్ అంటారు, మరొకడు సర్ఫ్ లో ఆయుర్వేదిక్ అట, టీ పొడి లో ఆయుర్వేదిక్ మరి మనము ఎం చేస్తున్నాము వాళ్ళు చెప్పినవి నమ్మి కొనుకుంటున్నాము. మన మూలాలు ఉన్న పెరు చెప్పి వస్తువులను అమ్ముతున్నారు కొద్దిగా ఆలోచించండి ..

Source - Whatsapp Message

అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని..అది తప్పు...ధర్మం దానంతట అదే గెలవదు..

ఈరోజు మంచిమాట. అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని..._
అది తప్పు...ధర్మం దానంతట అదే గెలవదు,,
నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి..
అర్థం కాలేదా...?
ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి
తొంగి చూడు..

కృత యుగం లో
తన భక్తుడైన ప్రహ్లాదున్ని కాపాడడానికి
ధర్మ సంస్థాపనకు భక్తుడి కోసం భగవంతుడు ఉన్నాడు
అని చెప్పడం కోసం సత్యాన్ని స్థాపించడం కోసం
అణువు అణువు లో భగవంతుడు
నృసింహ రూపంలో వ్యాపించి అహోబిల క్షేత్రం లో
ఒక స్తంభం నుండీ వచ్చాడు .
హిరణ్య కశ్యపుడిని సంహరించాడు.
ధర్మాన్ని, సత్యాన్ని స్థాపించడం కోసం భగవంతుడు
ఎన్నో రూపాలు ధరించి, కష్టాలు పడుతూ ఉంటాడు.

'త్రేతాయుగంలో'
రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు,
సరేలే ధర్మమే గెలుస్తుంది కదా,
తన సీత తిరిగి వస్తుంది అని
రాముడు చేతులు కట్టుకొని
గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.
రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు,,
ఆ రాముడికి అఖండ వానరసైన్యం తోడై
ధర్మం వైపుకు అడుగులు వేశారు,
ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి
తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని
బాణాలు చీల్చుకొని వెళ్ళాయి.నరాలు తెగి రక్తం చిందుతున్న సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు.
యద్ధంలో గెలిచాడు... ధర్మం గెలిచింది..!

'ద్వాపరయగంలో'
కురుక్షేత్రం యుద్ధంలో కృష్ణుడు
తను దేవుడు కదా అని ఒక ప్రేక్షకుడిలా యుద్దాన్ని చూడలేదు..
ధర్మం చూసుకున్నాడు పాండవుల పక్షాన నిలుచున్నాడు అర్జునుడికి రధ సారధిగా మారాడు,
గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు,
అబద్ధం ఆడాడు,
చివరకు మోసం కూడా చేసాడు...
అవన్ని ధర్మం కోసమే చేసాడు,
ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు.
అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది,
ధర్మం గెలిచింది...!

'కలియుగం'
ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు
సమస్యలతో పోరాడుతునే వున్నాం..
ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి
యుద్ధం జరుగుతునే వుంది..
నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది..
అదే నువ్వు నా, ని, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం గురించి ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా అలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది,
తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు
నీ వెనకాలా ప్రపంచమే నడుస్తుంది. . !
ధర్మో రక్షతి రక్షిత.
👏👏👏

Source - Whatsapp Message

హోదా Vs జ్ఞానం

🙏🙏🙏🍁🍁🍁🍁☀ హోదా Vs జ్ఞానం ☀

ఒక కారు
తయారీ కంపెనీ యజమాని తన కంపనిలోని ఒక ఇంజనీర్ కు " ఒక మంచి కారును డిజైన్ చేసి తయారు చేయుమని" ఒక పని అప్ప చెప్పాడు.

ఆ ఇంజనీర్ " ఒక అద్భుతమైన కారును "తయారుచేసి సిద్ధంగా ఉంచి యజమానికి కబురుపెట్టాడు.

యజమాని వచ్చి ఆ కారును చూసి ఆశ్చర్యానందాలను వ్యక్తం చేయడంతోపాటు అతని పనితనాన్ని చాలా మెచ్చుకున్నాడు.

ఆ కారును కంపెనీ తయారు ప్రదేశం నుండి షోరూంకు తీసుకొద్దామని చూసేసరికి ప్రవేశ ద్వారం కన్నా కారు ఒక్క అంగుళం ఎత్తుగా ఉంది.

కారును తయారు చేసేముందు ఈ విషయం గమనించలేక పోయినందుకు ఇంజనీర్ లోలొపల చింతించి
తయారీ ప్రాంతం నుంచి వెలుపలకు కారును ఎలా తీసుకోవాలో ఆ యజమానితో కలిసి ఆలోచించసాగాడు.

అక్కడే ఉన్న "పెయింటర్" కారును అలాగే బయటకు తీసుకు వద్దాం! కారు టాప్ పైన కొన్ని గీతలు.. నొక్కులు పడితే తర్వాత సెట్ చేసుకోవచ్చు!! అని సలహా ఇచ్చాడు.

"ప్రవేశ ద్వారం పగులగొట్టి కారు బయటకు తీసుకువద్దాం! తర్వాత ద్వారాన్ని రిపేర్ చేయిద్దాము! " అని అసెంబ్లింగ్ అసిస్టెంట్ ఆ ఇంజనీరుకు సలహా ఇచ్చాడు.

ఈ రెండు సలహాలు విని యజమాని కన్విన్స్ కాలేక పోయాడు. ఎందుకంటే అలా కారుకు నొక్కులూ, గీతలు పడడం కానీ, ద్వారాన్ని పగలగొట్టడం కానీ మంచి శకునంగా అతడు భావించలేకపోయాడు.

జరుగుతున్న విషయమంతా చూస్తున్న అక్కడే ఉన్న "వాచ్ మెన్ " భయం భయంగా సందేహిస్తూనే తన మనసులోని ఐడియా చెప్పాలని " ఒక చిన్న సలహా సార్! "అన్నాడు.

అక్కడున్నవాళ్ళు" నిపుణులే ఇవ్వలేని సలహాని వాచ్ మెన్ ఏమిస్తాడా? " అని ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా..

ఆ వాచ్ మెన్ ఇలా అన్నాడు.కారును బయటకు తీసుకురావడం చాలా ఈజీ సార్! కారు, ద్వారం కన్నా ఒక ఇంచే ఎత్తు ఉందికదా సార్!!!

కారు టైర్లలోని "గాలి" కొంత తీసేసి బయటకు తెచ్చి తిరిగి కారుటైర్లలో గాలినింపితే సరి!!" అన్నాడు.

వాచ్ మెన్ సలహా విని అతన్ని అభినందిస్తూ అక్కడున్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొట్టసాగారు.

కాబట్టి ,కేవలం నిపుణుల అభిప్రాయం తీసుకుని మాత్రమే సమస్యలను విశ్లేషించవద్దు!!

ఒక్కోసారి చదువుకోని తాతనో, నానమ్మనో, అమ్మమ్మనో వంటి తాము సామాన్యంగా భావించే వ్యక్తులు కూడా... "ఎంతో కష్టం అని భావించిన సమస్యను అతి సులభంగా పరిష్కరించవచ్చు.!"

ఈ కథలో నేర్చుకోవలసిన మరో నీతి కూడా ఉంది.

మిత్రులతోనో, బంధువులతోనో.. గొడవ వల్లనో మరే కారణం వల్లనో అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఈ కథలోని కారులా మనం ఎత్తుగా (ఉన్నతంగా అనుకొని) వారి ఇంటి ప్రవేశ ద్వారం చిన్నగా ప్రవేశించలేనిదానిలా కనిపిస్తుంది.

అప్పుడు ఈ కథలోని వాచ్ మెన్ సలహా పాటించాలి!!

కొంత గాలి (ఇగో) తీసివేసి..తగ్గి ఉండాలి.!

ఎత్తును(ప్రవర్తనను) అడ్జెస్ట్ చేసుకోవాలి.

నిజానికి మనమందరం ఆనంద స్వరూపమైన "ఆత్మ" గలవారము!!

కానీ,
అనవసరమైనవి జమ చేస్తూ ఉంటే అశాంతితో బరువెక్కిపోతాము!!!!!

ఈ చెత్తనంతా తొలగించుకుంటున్నకొద్దీ ఆనందంతో తేలికైపోతాము!!!!🙏🙏🙏

Source - Whatsapp Message

జాతి మరచినా..చరిత్ర మరువని ఏకైక నాయకుడు..లాల్ బహుదూర్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే..

►► జాతి మరచినా..
చరిత్ర మరువని ఏకైక నాయకుడు ◄◄
►►ఈ దేశంలో గాంధీలు అయినా
పుడతారేమో కానీ శాస్త్రిలాంటి వారు పుట్టరు◄◄

లాల్ బహుదూర్ శాస్త్రి గారి గురించి చెప్పాలంటే..
ఒక రెండు మాటలో లేక రెండు పేజీలో సరిపోవు..!!
ఎందుకంటే వారే ఒక పెద్ద బాలశిక్షలాంటి వారు..!! వారొక చరిత్ర..!!
.
ఎందుకంటే అసలు అటువంటి వ్యక్తిత్వం.. అంతటి నిబద్దత కలిగిన వారు మనదేశంలో పుట్టడం ఒక అదృష్టం..!!
.
వారి గురించి మచ్చుకు కొన్ని విషయాలు..!!
.
అయన Congress వంశంలో పుట్టలేదనో...!! 🤦🏻‍♂️

లేక కండలు తిరిగిన పెద్ద బలమైన శరీరం ఉన్న వ్యక్తి కాదనో..!!

లేక ఆరడుగుల అందగాడు కాదనో..!!

లేక పెద్ద ధవంతుల కుటుంబంలో పుట్టని వ్యక్తి కాదనో..!!

లేక రైల్వేశాఖ మంత్రిగా ఉన్నపుడు ఎక్కడో జరిగిన ఓ రైలు..దుర్ఘటనకు
నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామ చేసిన బాధ్యతగలిగిన మంత్రి అయినందుకో..!!

లేక దేశానికి అన్నం పెట్టే రైతన్న గురించి.. మరియు దేశ రక్షణలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ..
ప్రాణాలను సైతం పణంగా పెట్టి వృత్తి బాద్యతలు నిర్వర్తిస్తున్న సైనికుల గురించి ఆనాడే ఆలోచించి
"జై జవాన్.. జై కిసాన్..." నినాదంతో ప్రణాళికలు రూపొందించిన జ్ఞాని అయినందుకో..!!

లేక అయన 1965 యుధ్ధం గెలిపించిన వ్యక్తి అయినందుకో..!!

లేక ఆహార ధాన్యాల కొరత ఉందని పెరట్లో నాగలి పట్టి దున్నినందుకో..!!

లేక తన కుటుంబాన్ని వారానికి ఒక రోజు ఉపవాసం ఉంచినందుకో..!!

లేక ప్రధానిగా ఉండి కూడా సొంత Car లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచినందుకో..!!

లేక కేంద్ర Home మంత్రిగా పనిచేసి సొంత Home కూడా లేనందుకో..!!

లేదా ప్రధాని హోదాలో ఉండి కూడా తన కుమారుడు.. రేషన్ షాపులో నిలబడి నిలబడి కళ్ళు తిరిగి పడిపోయినందుకో..!!

చివరికి అయన ఎలా ఎందుకు మరణించారో కూడా తెలుసుకోకుండా ఆయన శరీరానికి పోస్టమార్టం కూడా నిర్వహించకుండా దేశానికి తీసుకొచ్చి సమాధి చేసినందుకో..!! 🤷🏻‍♂️
.
ఇలాంటి ఎన్నో కారణాలతో అయన..
ప్రజలకి,పార్టీలకి,ప్రభుత్వాలకి గుర్తులేకపోవడానికి ఎన్నెన్నో చెప్పుకోవచ్చు..!!
.
కాని..
ఆయనకి తెలిసింది ఒక్కటే..
నీతి నిజాయితీగా ప్రజలకి సేవ చెయ్యడం..!! ఒక్క రూపాయి కూడా వెనకేసుకోకుండా.. తన చివరి నిముషం వరకు దేశానికి సేవ చేస్తూనే చనిపోవడం..!!
.
చరిత్ర తెలిసిన వారు ఎవరైనా..
అయన గురించి చెప్పమంటే "ఒక్క"మాటే చెపుతారు..
.
గాంధీలు అయినా పుడతారేమో కాని...
లాల్ బహుదూర్ లాంటి వ్యక్తి ఈ దేశంలో మళ్ళి పుట్టరు అని..!!
.
ఆ మాట ఎంత గొప్పదో.. అయన వ్యక్తిత్వం అంకితభావం ఏంటో.. ఈ ఒక్క మాటతో మనం అర్ధం చేసుకోవచ్చు..!!
.
జాతి మరచినా.. చరిత్ర మరువని ఏకైక నాయకుడు అయన..!!
.
వారికి గొప్ప నివాళి..!!* 🙏💐

Source - Whatsapp Message

మనిషి విలువ

👤❗( మనిషి విలువ )❗👤

మనిషికి ఆ మనిషిలో ఏమి చూసి విలువ ఇస్తారు?⁉️😊

1⃣మనిషి " రంగూ , రూపూ " చూసి మాత్రం " విలువ " ఇవ్వరు.!!✅❗కేవలం బాగున్నారు అన్న " ప్రశంస " దక్కుతుంది .!!❗

2⃣ అంగ బలం , ఆర్ధిక బలం ఉన్నా ఇవ్వరు.!!❎❗వీడితో ఎప్పుడైనా అవసరం ఉంటుందేమో అని " అణుకువ " నటిస్తారు.☺ అంతవరకే.!!!😄❗

3⃣పదవి , పలుకుబడి , చూసినా , అవి ఉన్నన్ని రోజులూ చుట్టూ తిరుగుతారు. " విలువ " ఇవ్వటానికి కాదు ❎ వాడుకుందామని ✅😃❗పదవి పోయిన పూటకే " వెనుతిరిగి " చూస్తే ఒక్కడూ ఉండడు.😃ఇది నిజం✅❗

4⃣ కొంత మంది కబుర్లు చెప్పి " కడుపు " నింపినంత గొప్పగా చెబుతారు.!👌❗కాసేపు కబుర్లు చెపుతారు కాని " విలువ " మాత్రం ఇవ్వరు .!!!❎

❗మనిషి " విలువ " పొందాలంటే ఉండవలసినవి
1 కరుణ,
2 దయ,
3 ప్రేమ ,
4 జాలి
,5 సేవాభావం
,6 సాయపడాలనే తపన
,7 మంచి మనసు
,8 తెగింపు ,
9 విశాలహృదయం , ఉండాలి.!!!✅


❗👏👏👏 " విలువ " మనం పిలవకుండానే మన దగ్గరకు వస్తుంది.!!!✅

🌸 Dream Shelters 🌸

Source - Whatsapp Message

బాబా బోధన

బాబా బోధన

👌 ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య ఆ స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి "స్వామీ! అబద్దాలు చెప్పకుండా, పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా, ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు?" అని అడిగాడు.

"ఆ సంగతి అలా ఉంచు. సరిగ్గా ఏడు రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశముంది" అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు, వసూళ్ళ గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడపసాగాడు.

ఏడవ రోజు రాఘవయ్య స్వామీజీని కలిసాడు. స్వామీజీ రాఘవయ్యతో "నాయనా! ఈ ఏడు రోజుల్లో ఎన్ని పాపాలు చేసావు?" అని అడిగాడు. "స్వామీ! మృత్యువుని ఎదురుగా ఉంచుకుని ఎలా పాపాలు చెయ్యగలను?" అన్నాడు రాఘవయ్య.

నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్ప లేదు కదా! మీ ఇంట్లో ఇవాళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నువ్వే జవాబు చెప్పావు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మరిచిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా, ప్రశాంతంగా జీవించగలం" అన్నాడు స్వామీజీ. 🙏



Source - Whatsapp Message

పద్మము యొక్క విశిష్టత

పద్మము యొక్క విశిష్టత


🌸 సృష్టిలో తొలి పుష్పంగా పద్మాన్ని భావిస్తారు. పద్మం నుంచి పుట్టిన బ్రహ్మ పద్మసంభవుడయ్యాడు. బ్రహ్మ ఆయుర్దాయంలో మొదటి సగాన్ని పద్మకల్పంగా పురాణాలు చెబుతున్నాయి.

‘పద్మం’ అనే పదానికి పారమార్థిక, యౌగిక, వాస్తుపరమైన అర్థాలున్నాయి. పద్మం దేహంలోని ఒక నాడీచక్రం. కుబేరుడి నవనిధుల్లో ఒకటి.

వాస్తురీత్యా నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు ఉన్న ఇంటిని కూడా పద్మమంటారు.పద్మం ముందు పుట్టి ఆ తరవాత సృష్టి పుట్టిందని పురాణోక్తి.

శేషతల్పంపై మహావిష్ణువు శయనించి ఉన్న సమయాన స్వామి నాభి నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణ కథనం. పద్మం పేరున ఓ పురాణమే వెలసింది. అదే పద్మపురాణం. అష్టాదశ పురాణాల్లో అది రెండోది. 50వేల శ్లోకాలు కలిగి విస్తృతిలో స్కాందపురాణం తరవాత రెండో బృహత్‌ పురాణం.

విష్ణువు మహత్వాన్ని తెలిపే పురాణం. పద్మాలు సరస్సులో, చెరువుల్లో, జలం సమృద్ధిగా ఉండేచోట వికసిస్తుంటాయి. తామర, కమలం, నలిని, పంకజం మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.ఎందరో దేవతలకు పద్మం ఆసనం. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మంపై కూర్చుని హస్తాల్లో పద్మాన్ని ధరించి ఉంటుంది.

‘కమల’ శబ్దానికి లక్ష్మీదేవి అనికూడా అర్థం ఉంది. ఆ దేవిని ‘కమలాత్మిక’ అంటారు. కమలం ఆత్మగా కలిగిన దేవత అని అర్థం.

పంకమంటే బురద. బురదలో పుట్టిన పద్మం పంకజమైంది. బురదలో పుట్టినా ఎలాంటి మలినాలు అంటకుండా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తుంది.

మనం కూడా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యం చెదరకుండా చూసుకోవాలని, నిర్మలంగా ఉండటానికి ప్రయత్నించాలని గుర్తుచేస్తుంది పద్మం. ఎప్పుడూ నీళ్లలోనే ఉన్నా తామరాకుకు తడి అంటుకోదు.

‘తామరాకు మీది నీటిబొట్టులా’ ఉండాలంటారు. జ్ఞాని దుఃఖంలో,సుఖంలో, విపరీత పరిస్థితుల్లో సైతం చలించకుండా ఆత్మానందంలో లీనమై ఉంటాడనడానికి ప్రతీకగా ఈ విషయం నిలుస్తుంది.

శుభసూచకమైన ‘స్వస్తిక్‌’ చిహ్నం తామర పువ్వు నుంచే ఉత్పన్నమైందని భావిస్తున్నారు. సూర్యుడు పద్మినీప్రియుడు. సూర్యభగవానుడికి ప్రీతికరమైన పద్మానికి సాహిత్యంలోనూ విశేషమైన స్థానం ఉంది.

యోగశాస్త్రం ప్రకారం మన దేహాలు శక్తి కేంద్రాలైన కొన్ని చక్రాలను కలిగిఉన్నాయి. ప్రతిచక్రం నియమిత దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనం ఆమోదయోగ్యమవుతుంది.శరీరంలోని చైతన్య కేంద్రాల్ని చక్రాలంటారు.

మూలాధార చక్రం భౌతిక చైతన్యానికి కేంద్రం. నాభివద్ద చైతన్యకేంద్రం నీలం వర్ణంలో, ఉదరం వద్ద చైతన్యకేంద్రం ఎరుపు వర్ణంలో పదిరేకుల పద్మంలా ఉంటాయి. దానికి పైన హృదయం వద్ద చైతన్యకేంద్రం గులాబి, బంగారు రంగులు కలిసిన ఛాయలో పన్నెండు రేకుల పద్మంలా ఉంటుంది. కంఠం వద్ద చైతన్యకేంద్రం బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటుంది.

కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు వర్ణంలో రెండు రేకుల పద్మంలా ఉంటుంది. తలపై భాగంలో చక్రం స్వర్ణకాంతుల మధ్య నీలిరంగులో వెయ్యిరేకుల పద్మంలా ఉంటుంది.శుక్రవారం మహాలక్ష్మిని పద్మాలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం.

తామరాకు, దుంప, కాడ, పువ్వు వైద్యానికి ఉపయోగం. పద్మకాష్ఠం ఔషధీ విశేషం. తామర తూళ్లు హంసలకు ఆహారం. పద్మకోశం నాట్యంలో ఒక అభినయ హస్తవిశేషం.

మహాభారత యుద్ధంలో ‘పద్మవ్యూహం’ ఉంది. పద్మరాగం జాతిరత్నం. పద్మ నాయకులు మధ్యయుగాల్లో తెలుగుగడ్డపై కొన్ని ప్రాంతాలను పాలించిన ప్రభువులు. పద్మం జ్ఞానవికాసానికి, చైతన్యానికి ప్రతీక. పద్మం మన జాతీయ పుష్పం.

మనకి లక్ష్మీ దేవి పద్మ పీఠం మీద నెలకొని పద్మ హస్తయై కనిపిస్తూ ఉంటుంది.ఇక లలితా త్రిపురసుందరి మహాపద్మాటవి లోనే విహరిస్తుంది.ఐతే ఈ పద్మానికి ఆద్యాత్మిక భౌతిక ప్రాముఖ్యం ఎంతగానో ఉంది.
నిజానికి అసలు ముందు పద్మం పుట్టి సృష్టి తర్వాత జరిగిందని చెప్పుకోవచ్చు.

ఎందుకంటే పురాణయుగంలో శేషతల్పంపైన శయనించిన మహా విష్ణువునాభి కమలం నుంచి ఒక పద్మం అవతరించిందనీ, ఆ పద్మంలో నుండి సృష్టికర్త బ్రహ్మ దేముడు ఆవిర్భ వించాడనీ, అందుకే ఆ సమయంలో ఆ కాలాన్ని పురాణాల్లో "పద్మ కల్పం" అన్నారనీ ఆ పద్మం పేరునే "పద్మ పురాణం" అనీ లోకవిదితం.

అందుకే పద్మం నుంచి పుట్టిన వాడు గనుక బ్రహ్మ "పద్మ సంభవుడుగా పేరుగాంచాడు".ఐతే ఈ పద్మం ఎందరో దేవతలకి ఆసనంగా అందంగా అలరారుతుంది. ముఖ్యంగా స్త్రీల అందచందాలని కవులు "పద్మాక్షి... పద్మనయన... పద్మానన... పాద పద్మాలు" ఇలా వర్ణిస్తూ ఉంటారు. అంతే కాదు,"పద్మినీ జాతిస్త్రీలు" అని ఒక తెగ [నాలుగు జాతుల్లో].

వికసించిన పద్మం జ్ఞనానికి చైతన్య వికాసానికి ప్రతీక ఇక కవుల హృదయాలకి శిరీష కుసుమమే. చైతన్య కేంద్రాలను "చక్రాలు" అంటారు.

ఉదాహరణకు మొదటిదైన మూలాధారం భౌతిక చైతన్యానికి కేంద్రం.ఇది ఎరుపు రంగుతో నాలుగు రేకుల పద్మంలా ఉంటుంది. ఉదరం వద్ద చైతన్య కేంద్రం గాఢమైన ఎరుపు, నీలం రంగు కలిసి ఆరు రేకుల పద్మంలా ఉంటుంది.

ఆ పైన నాభి వద్ద ఊదా రంగులో[చైతన్య కేంద్రం ] పది రేకుల పద్మం లా ఉంటుంది.ఇక కంఠం వద్ద బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటే కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు రంగులో రెండు రేకుల పద్మం లా ఉంటుంది.

చివరిగా తల భాగంలో బంగారు కాంతుల మధ్య నీలి రంగులో వేయి రేకుల పద్మంలా ఉంటుంది.అమ్మవారి నెలవు అదే. కేవలం కావ్యాలలోనే గాక ఆధ్యాత్మిక పరంగా పద్మానికి గల ప్రాముఖ్యత ఎంత గొప్పదో దీన్ని బట్టి విదితమౌతుంది.

ఐతే ఈ పద్మం కేవలం మన దేశానికే కాదు, మన దేశంలోనే దేవతలకు పూజా పుష్పంగా ఆసనంగ కవులకు వర్ణనీయంగా భావించటమే కాదు,ఇతర దేశాల్లో కూడా పద్మ ప్రియులు చాలా చాలా ఉన్నారు.

"జపాన్, చైనా, టిబెట్, ఈజిప్టు" వంటి అనేక చోట్ల ఈపద్మాలు పెరుగుతాయి.
అనాదిగా ఈ పూలు పెరగడమే గాక అతిపవిత్రమైన పుష్పంగా ఆరాధించడం, బౌద్ధ మతంలో కూడా దీన్ని ఆధ్యాత్మికప్రాముఖ్యతతో పూజించడం ఆచారంగా ఉంది.ఈ పద్మాలు చెరువుల్లోను,సరస్సులోను ఎక్కువగా వికసిస్తాయి.ఇంచు మించు ఒకే ఆకారం గల ఈ నీటిపూలను సంస్కృతంలో "పద్మం, కమలం, పంకజం" అని అనేక రకాలుగా పిలుస్తారు.

ఈ పద్మ పత్రాలు గుండ్రంగా ఎనభై సెంటీమీటర్ల చుట్టు కొలతతో నీటి మీద తేలుతున్నట్లుగా వ్యాపించి చెరువంతా గొడుగుల్లా అందంగా కనిపిస్తాయి.ఈపద్మపత్రాల వేళ్ళు తెలుపు లేదా ఎరుపు రంగులో ఉంటాయి.ఇవి ఒకోసారి మీటరు ఎత్తుగా లేదా పదిహేను సెంటీ మీటర్ల వరకు అడ్డంగా విస్తరిస్తాయి.వీటి చుట్టుకొలత ఇంచు మించు తొమ్మిది సెంటీ మీటర్ల వరకు ఉంటుంది.

ఇవి అందానికే కాదు, తినడానికి కూడా ఉపయోగించు కుంటారు.తాజావేళ్ళను వేయించుకుని ఎండ బెట్టిన వేళ్ళను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూరల్లోకి కలుపుకుని తింటారు.చైనా,జపాన్ లాంటి ఇతర దేశాల్లో ఈ వేళ్ళతో ఊరగాయలు పెట్టి శీతాకాలంలో తినడం కద్దు.

ఈ వేళ్ళ నుంచి తయారు చేసే పాలపొడిలో ఎన్నో పోషక విలువలుంటాయి. ఇది చిన్న పిల్లల్లో అతిసారం వంటి వ్యాధులను నివారిస్తుంది.

ఈ వేళ్ళతో తయారు చేసిన పేస్టు చర్మ రోగాల నివారిణి.అంతే కాదు పూల మధ్య లో ఉన్నకర్ణికను ఎండబెట్టి చైనా వారు వాసన కోసం "టీ" లో ఉపయోగిస్తారు. ఇంకా చెప్పాలంటే పద్మాల నుంచి సేకరించిన తేనెలో బలవర్ధక లక్షణాలుంటాయి.

కంటిసమస్యలకు ఈ తేనె బాగా ఉపయోగ పడుతుంది.ఇక విత్తనంలో ఆకుపచ్చ రంగులో ఉండే బీజాకారం చాలా విష పూరితంగా చేదుగా ఉంటుంది.కానీ దాని చుట్టూ ఉన్న తొనల్లో అపారమైన పోషక విలువలుంటాయి,"సి" విటమిన్ ఉంటుంది.ఈజిప్టులో ఈవిత్తనాలను పిండి చేసి పాలతోగాని నీటితోగాని ఆ పిండి తడిపి రొట్టెలు చేసుకుని తింటారట.అంతే కాదు, ఈ విత్తనాలను పచ్చిగా గాని వేయించి గాని ఉడకబెట్టిగాని తినవచ్చు.

సృష్టికి ముందే అవతరించిన ఈ పద్మం కనువిందు చేసే కాంతివంతమైన రూపంతో పాటు దైవికంగా సాహితీ పరంగా ఆధ్యాత్మికంగా భౌతిక చైతన్య కేంద్రంగా ఎన్నో అంద చందాలను సుమ సౌరభాలను విరజిమ్ముతూ ఇన్ని సుగుణాలను కలిగి ఉంది.మనకు ప్రకృతి పరంగా లభించిన వర ప్రసాదం ఈ అందమైన పద్మం.🌸



Source - Whatsapp Message

వైదిక సంస్కారాలు,షోడశ కర్మలు అంటే ఏమిటి?

వైదిక సంస్కారాలు,షోడశ కర్మలు అంటే ఏమిటి?
🌻🌺🍀🌻🌺🍀🌻

సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము, తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.

సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.

వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:

1.గర్భాదానము

స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి పుత్రుని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి.

2.పుంసవనం

స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.

ఇది, సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.

3.సీమంతం

తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.

4.జాతకర్మ

బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:

మేథాజనన:
బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.

ఆయుష్య:
దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.

శక్తి:
తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.

5.నామకరణం

నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.

పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:

మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;
రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;
మూడవది ఇలవేలుపును బట్టి;
నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.
చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను పెడతారు.

6.నిష్క్రమణ

బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

7.అన్నప్రాశన

మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాశన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.

8.చూడాకరణ

పుట్టు వెండ్రుకలు తీయించడం.
పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.

9.కర్ణవేధ

ఇదే చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:

క్షత్రియులకు బంగారంతో,
బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,
దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొన్నాడు.

10.అక్షరాభ్యాసం

బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని నిర్దేశించారు.

11.ఉపనయనం

అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.

ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది.

తగిన వయస్సు:
బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;
క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;
వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;

గరిష్ఠ వయోపరిమితి:
బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;
క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;
వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;
కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం (జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.

12.వేదారంభం

అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది

రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,
మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,
నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.

13.కేశాంత

పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.

14.సమావర్తన

చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.

సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

15.వివాహం

హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల (రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.

వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:

వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)

వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం

కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం

వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం

పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం

హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం

సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు

అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం

సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం

ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధ్రువనక్షత్రాన్ని చూడడం

త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం

చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

16.అంత్యేష్టి

హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.

మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.

అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.

పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.

అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.

అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.

దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.

దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.

ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.

ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.

అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).

అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం.

శాంతికర్మ

స్మారకం

శ్రాద్ధం

సపిండాకరణ.
🙏🙏💐💐🙏🙏

Source - Whatsapp Message

నేటి చిట్టికథ (స్కాంద పురాణము నుండి)

✍️... నేటి చిట్టికథ

(స్కాంద పురాణము నుండి)

ఒకసారి బ్రహ్మదేవుని ఉపదేశంపై ఇంద్రాది దేవతలు మహర్షులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు.

మహదానందంతో వారెన్నో తీర్థాలు దర్శించినారు.

ఒకచోట బాగా ఎండిపోయిన వృక్షం ఒకటి వారికి కనబడింది.

ఆ చెట్టు తొఱ్ఱలో ఓ శుష్కించిన చిలుక కాపురమున్నది.

అది చూచి ఇంద్రాది దేవతలు “పక్షీశ్వరా! ఈ వృక్షం బాగా శుష్కించియున్నది. పూలూ ఆకులు పండ్లు ఏమీ లేకుండా ఉన్నది. ఐనను నీవెందులకు ఈ వృక్ష ఆశ్రయాన్ని విడువలేదో తెలుసుకోవాలని ఉన్నది మాకు” అని అడిగినారు.

చిలుక ఇలా బదులిచ్చింది

“ఓ దేవతలారా! ఇది చాలా పురాతనమైన వృక్షం. ఇది ఓ కల్పవృక్షం. అమృత మాధుర్యంగల దీని ఫలములు భుజించి నేను చిరకాలం జీవించాను. కాలగమనం వల్ల ఈ కల్పవృక్షం ఈనాడు ఇలాగున్నది. కాలగతిని ఆపడం ఎవరి తరమ్? ఒకప్పుడు నాకు ఆశ్రయమిచ్చి నన్ను ఎండ వాన నుండి కాపాడి నాకు మంచి ఆహారం ఇచ్చిన ఈ వృక్షమును నేనీనాడు శుష్కించినదని విడనాడలేను. అట్లు చేసిన అది కృతఘ్నత అవుతుంది. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు కదా! నిజాశ్రయమైన ఈ కల్పవృక్షమే నాకు సర్వలోకాలున్నూ”.

ఇలా ధర్మ్యం మాట్లాడిన శుకరాజుని చూచి దేవేంద్రుడిలా అన్నాడు “ఓ శుక రాజమా! నీకు ఇంతటి విజ్ఞానం ధర్మం ఎలా తెలిసినాయో వినాలని ఉంది మాకు”.

అప్పుడు చిలుక ఇలా చెప్పింది “నేను ఎన్నడూ మిత్రద్రోహం చేయలేదు. తల్లిదండ్రులయందు అనురాగం కలవాడను. నా భార్యను బాగా చూసుకుంటాను. నాతో సహజీవనం చేస్తున్నవారిని ఎన్నడూ అవమానించను. ఈ కారణాలవలన నాకు నిర్మలజ్ఞానం కలిగింది”.

చిలుక మాటలకు సతోషించి దేవేంద్రుడు తన అభీష్టం కోరుకోమని అడిగాడు. “అయ్యా! నేను ఏ లోకాలనీ కోరను. నాకు ఈ వృక్షమే కైవల్యం. అయితే నాకు ఈ చెట్టు ఇవ్వడమేకాని నేన్నడును దీనికేమీ ఇవ్వలేదు. ఈ చెట్టుని మళ్ళీ సజీవంగా చేయండి” అని శుకం బదులిచ్చింది.

🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜

దేవేంద్రుడు చిలుక యొక్క సద్భావాన్ని కృతజ్ఞతాభావాన్ని మెచ్చి ఆ కల్పవృక్షాన్ని సర్వగుణాన్వితంగా చేశాడు.

ఇలా ఆ శుకరాజమును ఆశీర్వదించి అందరు తీర్థయాత్రలు కొనసాగించి చివరకు లక్షీకటాక్షం సంపాదించారు.

తన నిజాశ్రయాన్ని పరిత్యజించని చిలుకకు తన ధర్మవర్తనం వలన కడకు బ్రహ్మలోకం ప్రాప్తించింది.

🍁🍁🍁🍁

మనకు నీడనిచ్చిన ఇంటిని మనకు అన్నంపెట్టిన నేలతల్లిని ఎన్నడూ పరిత్యజించకూడదని ఈ కథ మనకు చెబుతున్నది. అట్లు త్యజించినవాడు కృతఘ్నుడౌతాడని శుకరాజం చెప్పింది.

అలాగే మనం మనకు ప్రత్యంక్షంగా పరోక్షంగా సహాయపడ్డ వారందరితో కృతజ్ఞతా భావంతో మెలగాలని శుకరాజు మనకు చెప్పాడు.

🍁🍁🍁🍁

Source - Whatsapp Message

డబ్బుతో కొనలేని సంతోషం

డబ్బుతో కొనలేని సంతోషం

👌ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది. ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది. సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది.

వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్ర్తిని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు.
తన చేతిలో చీపురుని ఓ మూలన పడేసి ఆ స్ర్తి ఆ యువతి ముందు వున్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది.

‘‘నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను. అంతా దుఃఖం. ఏమీ తినలేకపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతో వారిని పలకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గినె్నలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గినె్నను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది. అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది. కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది.

నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.
ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను. వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను. ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది.

డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు. కాని సంతోషాన్ని కొనుక్కోలేరు. అది మనకి మనం పొందాల్సి ఉంటుంది.’’ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది.
నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది.
నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది.
సంతోషం అనేది గమ్యం కాదు అది ఒక ప్రయాణం.సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది
సంతోషం పరాధీనత కాదు అది ఓ నిర్ణయం.

Source - Whatsapp Message

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు….?

దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు….?

🙏 ఈ సృష్టి మొత్తం వ్యాపించి వుండి, దాని ఉత్పత్తి, పెంపు, లయములకు ఎవరు కారణమవు తున్నారో…, అతనినే ‘దేవుడు’ అని అన్నారు మన ఋషులు. మరి ఆ దేవుడు మన కళ్ళకు ఎందుకు కనబడడు…అనే సందేహం మనలో చాలా మందికి కలగవచ్చు. నిజాన్ని పరిశీలిస్తే… పాంచభౌతికమైన మన శరీర అవయవాలకు వున్న శక్తి చాలా పరిమితం. ఉదాహరణకు…

– మన కాళ్ళు…ఈ విశ్వాన్ని మొత్తం నడచి రాలేవు. వాటికి అంత శక్తి లేదు.

– మన చేతులు..కైలాస పర్వతాన్ని ఎత్తిపట్టుకుని మోయలేవు. వాటికి అంత శక్తి లేదు.

– మన కళ్ళు…అతి విసృతమైన పదార్ధాన్నిగానీ.. అతి సూ‌క్ష్మమైన పదార్ధాన్నిగానీ… చూడలేవు. వాటికి అంత శక్తి లేదు.
ఆకాశం మన కంటికి కనిపించదు. చూస్తున్నామని అనుకోవడం మన భ్రమ. అతి సూక్ష్మక్రిమి అయిన ‘అమీబా’ని సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్) సాయంతో చూస్తున్నాం కదా అని మీరు అడగవచ్చు. మన కళ్ళకు అంత శక్తి లేదు కనుకనే… మనం సూక్ష్మదర్శినిని ఆశ్రయించవలసి వస్తుంది.
మరి ఈ కళ్ళతో ‘దేవుని’ చూచిన ఋషులు వున్నారుకదా..అని మీరు అడగవచ్చు.

– కళ్ళు భౌతికమైన పదార్ధాలను మాత్రమే చూడగలవు.

– మనోనేత్రం అభౌతికమైన పదార్ధాలను దర్శిస్తాయి.
‘దేవుడు’ మనోనేత్రానికి దర్శనమిస్తాడు. తను సంకల్పించినప్పుడు మాత్రం మన భౌతిక నేత్రాల ముందు ప్రత్యక్షమౌతాడు. చూడడానికి, దర్శించడానికి ఉన్న తేడా అది.
మరి మనోనేత్రంతో ‘దేవుని’ దర్శించడం ఎలా? అన్నదే ఈనాటి మన ప్రశ్న.
పంచభూతాల శక్తుల సమ్మిళితమే…భూలోక జీవుల శరీర నిర్మాణం. అందుకే… ఈ లోకంలోని జీవులన్నీ భూమిని ఆశ్రయించి జీవిస్తూంటాయి. పంచభూతాల తత్త్వాలు మన శరీరాన్ని ఆవహించి ఉన్నంత వరకూ…,వాటికి అతీతంగా ఉండే ‘పరమాత్మ’ మన కళ్ళకు దర్శనమివ్వడు. ఆ దేవదేవుని దర్శించాలంటే…పంచభూత తత్త్వాలనూ, వాటి గుణాలనూ, త్యజించాలి. ఏమిటి వాటి గుణాలు, తత్త్వాలు…అంటే….

– ఆకాశానికి ఉన్న ఒకే ఒక గుణం…శబ్దం.

– వాయువు కు ఉన్నగుణాలు రెండు…శబ్దము, స్పర్శ.

– అగ్ని కి ఉన్న గుణాలు మూడు…శబ్ద, స్పర్శ, రూపములు.

– జలము కు ఉన్న గుణాలు నాలుగు…శబ్ద, స్పర్శ, రూప, రసము(రుచి)లు.

– భూమి కి ఉన్న గుణాలు ఐదు…శబ్ద, స్పర్శ,రూప, రస, గంథాలు.
ఈ ఐదు గుణాలూ…పాంచభౌతిక తత్త్వాలు గల మన శరీరానికి ఉన్నాయి కనుకనే మనం భూమిని ఆశ్రయించి జీవిస్తున్నాం.

– జలము…‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము. నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ.., మనం బంధించలేము.

– అగ్ని…‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.

– వాయువు…‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము. వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.

– ఆకాశం…‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.

కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు…, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు? అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే…, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా…ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి. అప్పుడు నీవు ‘నిర్గుణుడ’వు అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మ’వు అవుతావు. నిన్ను నీలోనే దర్శించుకుంటావు. అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.🙏



Source - Whatsapp Message

బ్రహ్మ దేవుడు "పంచభూతాలను" పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు.

🌹🙏బ్రహ్మ దేవుడు "పంచభూతాలను" పిలిచి ఒక్కో వరం
కోరుకోమన్నాడు.

🌹వరం కోసం తొందర పడిన "ఆకాశం"🙏 అందరికంటే పైన ఉండాలని కోరింది. ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు
బ్రహ్మ.

🌹ఆకాశం మీద కూర్చునే వరాన్ని "సూర్యుడు"🙏 కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు.

🌹వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన "జలం"🙏 మేఘాల రూపంలో మారి... ఆకాశం మీద
పెత్తనం చలాయిస్తూనే.. కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది.

🌹పై ముగ్గురినీ జయించే శక్తిని "వాయువు"🙏 కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి
మేఘాలు పటాపంచలవడం....
సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి.

🌹చివరివరకు సహనంగా వేచి చూసింది 🌹భూదేవి🙏
పై నలుగురూ నాకు సేవచేయాలని కోరడంతో
బ్రహ్మ అనుగ్రహించాడు.

🌹అప్పటినుండి ☁️ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది.
☀️వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు.
🌧వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం.
సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు.

🌹సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి ..
మిగతా భూతాలు సేవకులయ్యాయి.

🌹సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు.

🌹సహనానికి ప్రతిరూపం స్త్రీ🌹

🌹అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు.

🌹సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు
ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం.

🌹బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి.

🌹కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది.

🌹సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని🙏
ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది.

శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
శ్రీరామ జయ రామ జయజయ రామ
🌺🍀🌺🍀🌺🍀🌺

Source - Whatsapp Message

నేను ఎందుకు పేదవాడను?బుద్ధుడు సమాధానం చెప్పాడు.

ఒకసారి చాలా పేదవాడు బుద్దుడి వద్దకి వచ్చాడు. అతను అడిగాడు..
నేను ఎందుకు పేదవాడను?

👌 బుద్ధుడు సమాధానం చెప్పాడు: మీరు ఎందుకు పేదవారు అంటే మీరు ఎటువంటి ఔదార్యము కలిగి లేరు మరియు దాన ధర్మాలు చేయరు.

నేను ఇతరులకు దానం చేయడానికి నావద్ద ఏమున్నది?అని ఆ పేదవాడు అడిగాడు.

అప్పుడు బుద్ధుడు ఈ విధంగా చెప్పాడు

మీరు ఇతరులతో పంచుకోగల ఐదు నిధులను💰 కలిగివున్నారు.

మొదట మీ ముఖం👩🏼 ఉంది. మీరు ఇతరులతో మీ ఆనందాలను (నవ్వులను) 😀పంచుకోవచ్చు .. ఇది ఉచితం ... ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది ..

రెండవది మీ కళ్ళు👀 మీకు ఉన్నాయి. మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూడవచ్చు .. నిజం.. మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు .. వాటిని మంచి అనుభూతిగా చేయండి ..

మూడవది మీ నోరు👄మీకు ఉంది. ఈ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలు చెప్పవచ్చు .. మంచి చర్చించండి .. వాటిని విలువైనదిగా భావించండి .. ఆనందం మరియు సానుకూలత వ్యాప్తి చెందుతాయి ..

నాలుగవది మీకు గుండె 💗ఉంది. మీ ప్రేమగల హృదయంతో మీరు ఇతరుల ఆనందాన్ని కోరుకోవచ్చు .. ఇతరుల భావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు.. వారి జీవితాలను తాకవచ్చు..

మీరు కలిగి ఉన్న చివరి సంపద మీ శరీరం ..🏋‍♀ ఈ శరీరంతో మీరు ఇతరులకు అనేక మంచి పనులు చేయగలరు ..👍అవసరమైనవారికి సహాయం చేయగలరు ..

సహాయం చెయ్యడానికి డబ్బు అవసరం లేదు ..

ఒక చిన్న శ్రద్ధ ,సంజ్ఞలు జీవితాలను వెలిగించగలవు.
భగవంతుడు మనకిచ్చిన జీవితం..
కలకానిదీ ! విలువైనదీ ! సర్వోత్తమమైనదీ !

ప్రతిక్షణం ఆనందంగా ఉంటూ, పదిమందికి సహాయపడుతూ, జన్మను చరితార్థం చేసుకుందాం.🙏



Source - Whatsapp Message

మంచి మాటలు

ఆదివారం --: 04-10-2020 :--
నేటి AVB మంచిమాటలు ......
నా జీవితంలో నేను చాలా కోల్పోయాను నాకు ఇష్టమైనవన్నీ కోల్పోయాను ఇష్టమైన వారికి కూడా నేను ఇప్పుడు భారమైపోయాను .

జీవితం లో సంతోషంగా ఉండాలంటే కారులు , బంగ్లాలు ఉండవలసిన అవసరం లేదు మన బాధను పంచుకుని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధముంటే చాలు .

జీవితంలో ఎవ్వరినైనా క్షమించండి కానీ ! మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్నే వెన్నుపోటు పొడిచే వాళ్ళను మాత్రం ఎప్పటికీ క్షమించకండి .

మనలో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు ఒకరిని ఒకరు గౌరవించుకోకపోతే ప్రేమలుండవు నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు .

మనమంటే విలువలేనివాళ్ళ దగ్గరికి వెళ్లి పదే పదే అవమానపడే బదులు కొన్ని బంధాలను వదిలించుకోవడమే మంచిది .

సేకరణ ✒️*మీ ... AVB సుబ్బారావు 💐🤝🌹🕉️

Source - Whatsapp Message

Saturday, October 3, 2020

మోక్షమార్గం

🌸మోక్షమార్గం🌸

500 రూ౹౹ నోటు ఓ చేత పట్టుకొని, చాక్లెట్ ఓ చేత పట్టుకొని చినబాబు దగ్గరికి వెళ్లి రెండు చేతుల్లో ఉన్న చాక్లెట్,500రూ చూపిస్తే ఏమి తీసుకుంటాడు? చాక్లెట్ మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే అతడికి 500రూ౹౹ నోటుతో బోలెడు చాక్లెట్లు కొనవచ్చని తెలియదు గనుక..

అలానే జ్ఞానం ఓ ప్రక్క అర్థకామాలు ఓ ప్రక్క పెడితే అర్థకామాలు మాత్రమే కావాలని కోరుకుంటారు అజ్ఞానులు. ఎందుకంటే జ్ఞానం వల్ల సకలం మన సొంతం అవుతాయని తెలియక. 500రూ నోటు వంటి మోక్షం కోరుకోవడం లేదు. అందుకే ఎక్కువగా వృద్ధులు తప్ప యువకులు ఆధ్యాత్మిక ప్రభోదాల సభలలో ఉండరు.

శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. విద్యలలో నేను బ్రహ్మవిద్య అని. నన్ను తెలుసుకోగోరేవారు బ్రహ్మవిద్య అభ్యాసం చేయమని చెప్పాడు. పరమాత్మని వివిధ రూపాలలో కొలుస్తారు. కానీ పరమాత్మ చెప్పింది మాత్రం చేయరు.

ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మ మీద చూపిన అనన్య భక్తిని మనం చూపాలి. ద్రౌపది వేరే మార్గాలన్ని మూసుకుపోయాయని గ్రహించగానే రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణపరమాత్మ ను వేడుకుంది. దీన్నే సర్వస్య శరణాగతి అంటారు. శాస్త్రం మీద, గురువు మీద కూడా మనకి అంత భక్తి ఉండాలి. మోక్షమార్గం గురుశాస్త్ర ఉపదేశం మాత్రమే అని గ్రహించాలి. కేవలం బ్రహ్మ విద్య ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది. కర్మవల్ల మోక్షం రాదు.

ఆత్మ మదింపు లో చైతన్యం సంపూర్ణంగా వికసించి స్వాత్మానుభూతి చెంది అహంబ్రహ్మష్మి స్థితి చేరుకోవడమే లక్ష్యం. పరమేష్టి తానొచ్చిన ప్రతీసారి తనకో ఉపాధి కాగలందులకు, మానవున్ని తన ప్రతిరూపంగ, స్రృష్టి పరిణామక్రమంలో రాతి నుండి 7 దశల్లో తీర్చిదిద్దాడు, తన ఇఛ్ఛాశక్తిని బుధ్ధిని అందించి 84 లక్షల జన్మలతో, జన్మలో ఉత్కృష్టమైనది చేసాడు.

మోక్షమార్గంలోఆత్మానుభూతి పొందడానికి అనుభవమనె వాహనం ద్వంద్వం యొక్క రెండు పార్శ్వాలు రెండు చక్రాలుగ ఆత్మ ప్రయాణం చేస్తే గమ్యం చేరుతుంది. ఇహం పరం రెండు పరస్పర పూరకాలు .పరానికి కావలసిన మూలాలు ఇహం లోనే ఉందన్నారు రమణ మహర్షి. కనుక జ్ఞానం అర్ధకామాలు రెండూ కావాలి, అవి నాణేనికి రెండు పార్శ్వాలు. సాధారణ జీవితం భగవత్ ప్రసాదం అందులోంచే ఆధ్యాత్మికత పండాలి.

గీతలోకూడా: " జ్ఞాని కానివాడు సదా కర్మల నాచరించాలని చెప్పబడింది".


🙏

Source - Whatsapp Message

నేటి కథ సువర్ణ సాహసం

✍🏼 నేటి కథ ✍🏼


సువర్ణ సాహసం


అవంతీపురాన్ని అశోకవర్మ అనే రాజు పరిపాలిస్తూండేవాడు. చక్కని పరిపాలకుడిగా అతనికి పేరుండేది. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. పేరు రవి వర్మ. అతనికి ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు, ఓసారి రవివర్మ స్నేహితులతో కలిసి ఆడుకుంటూండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చింది. అందరూ కళ్ళు మూసుకుని, తెరచేటప్పటికి, అక్కడ రవివర్మ లేడు! రాజు రాణి అతనికోసం వెదకని ప్రదేశమంటూ లేదు. అయినా ఏమీ ఫలితం లేకపోయింది. పిల్లవాడు ఏమైనాడో ఏమో, ఇక దొరకనే లేదు. రాజుగారు ఆ బెంగతో రాజసభకే వెళ్ళటం మానుకున్నారు.
ఆ తరువాత రాణి ఒక పాపకు జన్మనిచ్చింది. కొడుకును కోల్పోయిన దు:ఖంలో ఉన్న రాజు, రాణిలకు ఆ పాప దేవుడిచ్చిన వరమే అనిపించింది. వారు ఆమెకు సువర్ణ అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా పెంచసాగారు. అశోకవర్మ ఆమెకు అన్నిరకాల యుద్ధవిద్యలు, శాస్త్రాలు నేర్పించాడు. తల్లినుండి ఆమెకు సౌకుమార్యమూ, కళలూ అబ్బాయి. పద్దెనిమిది సంవత్సరాలు నిండేసరికి సువర్ణ అందచందాలతోబాటు, మంచి గుణాలు, ధైర్యసాహసాలు కలిగిన యువతిగా తయారైంది.అయినా సందర్భం వచ్చినప్పుడల్లా రాజు, రాణి సుడిగాలి ఎత్తుకెళ్లిపోయిన తమ కొడుకును గురించే బాధపడుతూ ఉండేవారు. సువర్ణకూడా ఈ విషయమై చాలా ఆలోచించేది. చివరికి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి, అన్నను వెతికేందుకై ఒక గుర్రం ఎక్కి బయలుదేరింది.
అలా వెళ్ళిన సువర్ణ కొన్ని రోజుల ప్రయాణం తర్వాత ఒక పట్టణానికి చేరుకున్నది. అక్కడి ప్రజలంతా దు:ఖంలో మునిగినట్లు కనిపించారు. సువర్ణ ఒక పూటకూళ్లవ్వ ఇంట ఆగి, అక్కడి విశేషాలను కనుక్కున్నది: "ఒక రాక్షసుడు ఏరోజుకారోజు అక్కడి పిల్లలను ఎత్తుకు పోతున్నాడు. నగరమంతా హాహాకారాలు అలుముకున్నాయి. ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు."
"అయితే నేను వెళ్లి వాడి పనిపడతా"నన్నది సువర్ణ.
"నీకెందుకమ్మా? అదీకాక ఆడపిల్లవు. నీ వల్ల ఏమి అవుతుంది?. మా మహారాజే ఏమీ చేయలేక ఊరుకున్నాడు కదా!" అంది అవ్వ. కానీ సువర్ణ తన పట్టు విడువలేదు. గుర్రం ఎక్కి నేరుగా రాక్షసుడునాడంటున్న అడవిలోకే పోయింది. కానీ ఎంత వెతికినా రాకాసి జాడ లేదు.
అలసిన సువర్ణ ఒక చెట్టుకిందకు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక పాము, ముంగిస తీవ్రంగా పోట్లాడుకుంటూ కనిపించాయి ఆమెకు. మంచితనం కొద్దీ ఆమె ఆ రెండింటి పోరునూ ఆపాలని చూసింది. కాని ముంగిస చాలా పొగరుబోతని త్వరలోనే తెలుసుకున్న సువర్ణ దాన్ని చంపి, పామును కాపాడింది. పాము సువర్ణకు తన కృతజ్ఞతను తెలిపి, ఏదైనా సహాయం కావాలేమో అడిగింది. రాక్షసుని సమాచారం కావాలన్నది సువర్ణ.
"ఆ రాక్షసుడు ఉండేది ఇక్కడకాదు. వాడు ఉండే చోటు చాలా భయంకరంగా ఉంటుంది. దానికి రక్షణగా చుట్టూతా సముద్రం ఉంటుంది. ఆ సముద్రానికి కాపలాగా దాని చుట్టూతా కొరివిదెయ్యాలు ఉంటాయి. నువ్వు రాక్షసుడి దగ్గరికి వెళ్లాలంటే ముందుగా ఆ కనబడే గుహలోని దయ్యాలను దాటుకొని పోవాలి. అందుకుగాను నేను ఈ పాదరక్షలు ఇస్తాను. వీటిని ధరిస్తే నువ్వు ఇక దెయ్యాలకు కనిపించవు. ఆ దెయ్యాలను దాటిన తరువాత నువ్వు గుహకు అవతల ఉన్న సముద్రాన్ని దాటాల్సి ఉంటుంది. కానీ ఆ సముద్రంలో చాలా భయంకరమైన పాములు ఉంటాయి. వాటిని దాటటం సాధారణ మానవులకు సాధ్యం కాదు. అందుకే నేను నీకు ఈ మణిని ఇస్తాను. దీనిని ధరిస్తే పాములు నిన్నేమీ చేయవు" అని పాదరక్షల్నీ, మణినీ సువర్ణకిచ్చింది పాము. సువర్ణ వాటిని తీసుకొని, పాముకు కృజ్ఞతలు చెప్పి అక్కడినుండి గుహవైపుకు బయలుదేరింది.
గుహను చేరుకొని, ముందుగా పాము తనకిచ్చిన పాదరక్షల్ని ధరించింది సువర్ణ. ఇక ఆమె దెయ్యాలకు కనిపించలేదు. ఆపైన ఆమె గుహను దాటి ధైర్యంగా సముద్రంలోకి దూకింది. సముద్రంలోని పాములు ఆమెను చూసి కూడా ఏమీ అనలేదు- ఆమె మెడలోని మణిప్రభావం చేతనే!
అలా రాకుమారి సువర్ణ సముద్రం దాటి ఒక ద్వీపాన్ని చేరుకుంది. మూసిన తలుపులున్న ఒక కోట తప్ప, అక్కడ జనసంచారమనేదే లేదు. సువర్ణ ధైర్యంగా ఆ కోట తలుపులు తట్టింది. చాలాసేపటికి ఒక పండుముసలి అవ్వ కోట తలుపులు తీసింది. ఆమె సువర్ణను చూసి ఆశ్చర్యపడుతూ "అమ్మా పాపా! ఇంత వరకూ తమంతట తాముగా ఇక్కడికి ఏ నరపురుగూ రాలేదు. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. నీచేతిలో ఈ రాక్షసుడి చావు ఖాయం అని నాకు తోస్తున్నది. ముందుజాగ్రత్తగా నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తాను. మొదటిదాన్ని చదివితే నువ్వు చిన్న పాపగా మారిపోతావు. రెండో మంత్రం చదివితే నీ మామూలు రూపం ధరిస్తావు" అని ఆ మంత్రాల్ని ఉపదేశించింది.
కోట లోపలచూస్తే ఒక్కరు తక్కువగా పదివేలమంది పిల్లలున్నారు. సువర్ణ మొదటి మంత్రాన్ని చదివి చిన్నపిల్లగా మారిపోయి వారిలో కలిసిపోయింది. ఆరోజు సాయంత్రం రాక్షసుడు వచ్చీరాగానే అవ్వను "పదివేలమందీ పూర్తయ్యారా?" అని అడిగాడు. "అయ్యార"న్నది అవ్వ. "అయితే బలికి అన్నీ సిద్దం చేయమన్నాడు రాకాసి. అవ్వ అన్నీ సిధ్ధంచేసి, మొదటగా సువర్ణను ముందుకు తెచ్చి నిలబెట్టింది.
రాక్షసుడు సురర్ణను చూసి వికవికా నవ్వాడు. "పాపా, నువ్వు స్వర్గం చేరుకునే సమయం వచ్చింది. ముందుగా నిన్ను కన్న ఈ మాతకు మోకరిల్లు" అన్నాడు కత్తిని పక్కనే ఉంచుకొని.
సువర్ణ రెండు చేతులూ జోడించి అమ్మకు మొక్కింది. "అలాకాదు పాపా, వంగి, నేలబారుగా పడుకొని నమస్కరించాలి" అన్నాడు రాక్షసుడు ప్రేమను నటిస్తూ. "నాకు తెలియదు, నువ్వే చేసి చూపించు" అన్నది సువర్ణ. "అయ్యో! ఆ మాత్రం తెలీదా, ఇలా పడుకొని, ఇలా మొక్కాలి" అని రాక్షసుడు నేలబారున పడుకోగానే, ప్రక్కనున్న కత్తిని తీసుకొని, సువర్ణ ఒక్కవేటుతో అతని శిరస్సును ఖండించివేసింది.
రాక్షసుడు చనిపోగానే, అనేక సంవత్సరాలుగా వాడు ఎత్తుకొచ్చి పెట్టిన పదివేలమంది పిల్లలకూ వాళ్ల వాళ్ల రూపాలు లభించాయి. అవ్వకుకూడా దాస్య విముక్తి లభించింది. ఎదిగిన ఆ పిల్లలందరికీ తమ తమ కుటుంబ వివరాలు గుర్తున్నాయి! అవ్వ మహిమతో అలా వారంతా ఎవరి తావులకు వారు చేరుకున్నారు.
ఆ పిల్లల్లోనే ఒకడు, రవివర్మ! అలా అనుకోకుండా తన అన్నను కాపాడుకోగలిగినందుకు సువర్ణ చాలా సంతోషించింది. పోయిన కొడుకు దక్కినందుకు, ధీరురాలైన కుమార్తె తమకు కలిగినందుకూ వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దానధర్మాలు చేసి, ఉత్సవాలు నిర్వహించారు. అందరూ సువర్ణ సాహసాన్ని కొనియాడారు.

Source - Whatsapp Message

పాప_పుణ్యాలు అంటే ఏమిటీ ..?

పాప_పుణ్యాలు అంటే ఏమిటీ ..?

మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు... కాని పుణ్య ఫలాన్ని మాత్రం ఆశిస్తారు., పాప ఫలితాన్ని ఆశించరు.
కాని పాప కార్యాలను మాత్రం ప్రయత్న పూర్వకం గానే చేస్తారు..., అని ధర్మనీతి శాస్త్ర నిర్వచనం...

ఇంతకీ పాపం అంటే ఏమిటి..., పుణ్యం అంటే ఏమిటి..?

"పరోపకారాయ పుణ్యాయ..,
పాపాయ పరపీడనం" ..అంటే, ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం...

తెలియక చేయడం, అజ్ఞానంతో చేయడం ఒక విధంగా ప్రారబ్ద ఖర్మలను అనుభవిoచడం అవుతుంది..... కానీ తెలిసి చేస్తే అది మహా పాపం అవుతుంది...

పూర్వజన్మ ల్లో చేసిన పాప దోషాల వల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడుస్తున్నాయి అని మనం గ్రహించాలి... చేసుకున్న పాప,పుణ్యాల అనుభవం కోసమే ఈ జన్మ అనునది ఆధ్యాత్మికమైన జవాబు. అయితే... ఎంతకాలం ఈ అనుభవం? అనేదీ ప్రశ్నే... దానికీ జవాబు ఉంది.

చేసిన పాప, పుణ్యాల గురించి ఈ లోకంలో తలచుకున్నంత కాలం...ఆ పాప, పుణ్య ఫలాన్ని అనుభవించ వలసిందే. ఇదేం తీర్పు..... దీనికేదైనా నిదర్శనముందా...అనే సందేహం కలగచ్చు... ఏ సందేహానికైనా సరైన జవాబు చెప్పే సామర్థ్యం మన రామాయణ, భారత, భాగవతాలకే ఉంది. దీనికి సంబంధించిన కథ ఒకటి మహాబారతంలో ఉంది. ఆ కథ ఏమిటంటే....

కృతయుగకాలంలో., ఇంద్రద్యుమ్నుడు అనే చక్రవర్తి ఈ భూలోకాన్ని ధర్మబధ్ధంగా, ప్రజారంజకంగా పరిపాలిస్తూండేవాడు. ఆయన గొప్ప దాత. దశ మహాదానాలే కాక షోడశ మహాదానాలు విరివిగా చేసాడు. అంతేకాక ఎన్నో పుణ్యకార్యాలు కూడా చేసాడు. ఇంద్రద్యుమ్నుడు చేసిన పుణ్యకార్యాల వల్ల, అతను మరణించాక దేవదూతలు వచ్చి అతన్ని సరాసరి స్వర్గలోకం తీసుకెళ్లారు... ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో సుఖభోగాలు అనుభవిస్తూ ఆనందిస్తున్నాడు... అలా ఎంతకాలం అయిందో అతనికే తెలియదు.

ఒకరోజు ఇంద్రద్యుమ్నుని దగ్గరకు దేవదూత లు వచ్చి, ‘నీవు చేసుకున్న పుణ్యఫలం అయిపోయింది... నీవు స్వర్గంలో ఉండే అర్హత లేదు. భూలోకానికి వెళ్లిపో’ అన్నారు. ‘అదేమిటి.. నా పుణ్యఫలం అప్పుడే తీరిపోవడమేమిటి... ఇంకా చాలా ఉంది’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు... ‘నిరూపిస్తావా’ అని అడిగారు దేవదూతలు. ‘నిరూపిస్తాను.. నన్ను భూలోకం తీసుకొని వెళ్లండి’ అన్నాడు ఇంద్రద్యుమ్నుడు. దేవదూతలు అతన్ని భూలోకం తీసుకు వచ్చారు.

ఇంద్రద్యుమ్నునకు భూలోకం చాలా కొత్తగా కనిపించింది. అతనికి తెలిసున్న వారెవరూ కనిపించలేదు. ఆ కాలంలో భూలోక వాసులందరిలోకి అతి వృద్ధుడు మార్కండేయుడు ఒక్కడే అని తెలిసి.. దేవదూతలతో అతని దగ్గరకు వెళ్లి ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ప్రావారకర్ణుడు’ అనే గుడ్లగూబ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు మార్కండేయుడు.

అందరూ కలిసి ఆ గుడ్లగూబ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘నాళీజంఘుడు’ అనే కొంగ ఉంది. వెళ్లి దాన్ని అడుగుదాం రండి ’ అన్నాడు ప్రావారకర్ణుడు.

అందరూ కలిసి ఆ ఆ కొంగ దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు. ‘మీరెవరో నాకు తెలియదు. అయితే నాకన్న వృద్ధుడు ‘ఆకూపారుడు’ అనే తాబేలు ఉంది... వెళ్లి దాన్ని అడుగుదాం రండి అన్నాడు నాళీజంఘుడు. అందరూ కలిసి ఆ తాబేలు దగ్గరకు వచ్చారు. ‘నేనెవరో తెలుసా’ అని అడిగాడు ఇంద్రద్యుమ్నుడు..

‘మీరెవరో నాకు బాగా తెలుసు.... మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను.., మీరు ఇంద్రద్యుమ్న చక్రవర్తి. మీరు ఎన్నో యఙ్ఞాలు చేసారు. నన్ను ఎన్నోసార్లు కాపాడారు. దానాలు చెయ్యడం లోనూ మీరు చక్రవర్తే... ఆ కాలంలో మీరు చేసిన గోదానాలు అనంతం... దానగ్రహీతలైన బ్రాహ్మణులు ఆ గోవులను తోలుకుంటూ వెడుతూంటే.. ఆ గోవుల కాలి గిట్టల తొక్కుడు చేతనే కదా ఈ కొలను ఏర్పడింది ... అందుకే ఈ కొలనుకు ‘ఇంద్రద్యుమ్నము’ అని నీ పేరే పెట్టారు ప్రజలు... నా సంతతి వారంతా ఈ కొలనులోనే ఇప్పటికీ నివసిస్తున్నారు’ అన్నాడు ఆకూపారుడు.

దేవదూతలు ఆ సమాధానంతో తృప్తిచెంది.. ఇంద్రద్యుమ్నుని తిరిగి స్వర్గానికి తీసుకుని వెళ్లారు...... ఇదీ కథ.

కనుక కలకాలం అందరూ చెప్పుకునే విదంగా పుణ్యకార్యాలే చెయ్యాలి. అలాకాక పాపకార్యాలు చేస్తే.. ప్రజలు తలుచుకున్నంత కాలం నరకబాధలు తప్పవు...

పాపం వల్లనే దుఃఖాలు వస్తాయి, పాపం లేనప్పుడు ఆనందం కలుగుతుంది...ఏ కొంచెం దుఃఖం కలిగినా అది పాప ఫలమే కాక వేరొకటి కాదు...

మనం ఆనందంగా ఉన్నాము కదా అని, పరులను కించపరిచేలా ప్రవర్తిస్తే, అది మహాపాపం, ఎందుకంటే వారి కర్మలు వారు అనుభవిస్తున్నారు... పాపదోషం అనేది అనుభవించితే తప్ప పోదు...

అడవుల్లో ఉన్నప్పుడు, యుద్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్ని మధ్య ఉన్నప్పుడు, సముద్రంలో సాగుతున్నప్పుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో, సంకట పరిస్థితులలో మనలను పూర్వ జన్మలో చేసిన పుణ్యాలే కాపాడతాయి...... అంతే గానీ ఇది నా గొప్ప, నా భక్తి, నా ఒక్కడి పైననే భగవంతుని దయ అనుకోవడం, మన అజ్ఞానం మాత్రమే...

ఉత్తమమైన ధర్మం - విదురుడు చెప్పిన ధర్మం..

" ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగి ఉండకపోవడమే అన్ని ధర్మాల్లోకి కూడా ఉత్తమమైన ధర్మం " అని విదురవాక్కు...

పుణ్యం చేయడం చేతకాకున్నప్పుడు ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు... ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేం.... తాను చేసిన పాపకర్మ వల్లనే దుఃఖం కలుగుతుంది..... తాను చేసిన పుణ్యకర్మ వల్లనే సుఖం కలుగుతుంది.

ఈనాడు మనం నవ్వుతూ చేసిన పాపకర్మకి ( ఒకరిని కించపర్చడం, ఒకరి గూర్చి చెడుగా మాట్లాడుకోవడం, ఇలాంటివి ) రేపు ఏడుస్తూ ఆ దుఃఖాన్ని అనుభవించక తప్పదనే సత్యాన్ని మనం గ్రహించాలి...

అందుకే అవకాశం ఉన్నప్పుడే సత్కర్మలు ఆచరించాలి...., నలుగురి కి సహాయపడాలి , భగవంతుని అనుగ్రహం పొందాలి...

సర్వేజనా సుఖినోభవంతు..

Source - Whatsapp Message

ఆచార్య సద్భోదన - బాహ్యమైన వస్తుసంపదలు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు.

ఆచార్య సద్భోదన

మనకు అనేక వస్తువులు దొరుకుతూ ఉంటాయి కానీ కోరినది దొరకదు. ఒకవేళ అనుకున్నది దొరికినా, అప్పటికి ఆ వస్తువు మీద ఉండే కోరిక మరొక వస్తువు మీదకి మరలి ఉంటుంది.

చాలామంది వారి కోరికల నిజతత్త్వాన్ని తెలుసుకోలేక ప్రాపంచిక విషయాల వెంట పరుగెడుతుంటారు. నిజానికి ఎన్నడూ మార్పుచెందనిది, శాశ్వాతమైనది మాత్రమే యథార్థమైన సంతృప్తిని ఇవ్వగలదు.

ప్రాపంచికమైన కోరికలను తీర్చుకోవడం ద్వారా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలని గాని, పొందగలమని గాని భావించేవారు తమను తాము మోసగించుకుంటున్నారు.

కోరికలు తీరకపోవడం వల్ల కలిగిన లోటు వారి పరిస్థితిని మరింత దుర్భరం చేస్తుంది. బాహ్యమైన వస్తువులలోనూ, స్త్రీ-పురుషుల భౌతిక శరీరాలలోనూ సుఖసంతోషాల కోసం వెతుకుతారు.

కానీ నిజమైన ఆనందం మనలోనే ఉంది. ఆ ఆనందమే మన యధార్థ స్వరూప స్వభావమై ఉంది. బాహ్యమైన వస్తుసంపదలు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవు. ఒకవేళ ఎంతోకొంత సంతోషాన్ని ఇచ్చినా అది లిప్తపాటులో మాయమౌతుంది.

శుభంభూయాత్

Source - Whatsapp Message

Good Quotes

💞❣💞❣💞❣💞❣💞

🔥✨ఆప్పోదీపోభవ✨🔥

BE A LIGHT UN To YOUR SELF

🌞తొలి సంధ్యవేళలో ప్రభవించే ప్రభాతునికి ప్రణామం ప్రణామం 🙏🏼

💗ఆత్మబంధువులందరి శుభోదయం.☀️🌄🌻

🎈మనం ఆనందంగా వుండాలంటే సులువైన మార్గం ఇతరులను ఆనందంగా ఉంచడమే.

🎈వినడంలో తొందర పడాలి కానీ మాట్లాడడం లోకాదు.

🎈చిన్న చిరునవ్వు ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చగలదు.

🎈ఒకవిషయం లో విజయం సాధించాలంటే ముందు దాన్ని ప్రేమించాలి.

🎈శత్రువులోనైనా మంచి గుణాలు వుంటే ప్రశంసించాలి.

🎈కల్మషం లేని వారిని ప్రపంచమంతా గౌరవిస్తుంది.

🎈ఓటమి అనుభవాన్ని ఇవ్వాలి కాని ఆవేశం కాదు.

🎈గుణాలు పుట్టుకతోనే రావు.కానీ అంచెలంచెలుగా మనమే పెంపొందించుకోవాలి.

🔥✨అప్పో దీపోభవ ✨🔥

BE A LIGHT UN TO YOUR SELF

❤🌿❤🌿❤🌿❤🌿❤

Source - Whatsapp Message

ప్రస్తుత వివాహ వ్యవస్థ

 

🌻ఎవరిని కించపరచటానికో వ్రాసింది కాదు. సంఘంలో జరుగుతున్న సంఘటనలు వారి స్పందనలు మాత్రమే. ....🌻

ప్రస్తుత వివాహ వ్యవస్థ

"ఆడపిల్లలు, వారి
తల్లిదండ్రులదే పైచేయి"

కావలసిన అర్హతలు: BTech, Software ,America
అబ్బయికి సొంత ఇల్లు,
తండ్రికి పెన్షన్ వచ్చే ఉద్యోగం.
సిగరెట్, మందు అలవాటు లేకుండా, మంచి పర్సనాలిటీ, ఉన్నత కుటుంబం.
ఆడపిల్లల తల్లితండ్రులకు
సపోర్ట్ గా ఉండాలి.

💥ఇంటర్వ్యూ:

ఫోన్ చేయ్యగానే పిల్ల తల్లి మాట్లాడుతుంది.భర్తకు అవకాశంలేదు.

"అబ్బాయి చదువు,తెలివితేటలూ పరీక్షించి లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తాడు సదరు కంపెనీ వాడు".
కాని,
10th పాస్ కాని తల్లి " మీ అబ్బాయి
ఏ యూనివర్సిటీలో చదువుకొన్నాడు?" అనే ప్రశ్న. ( అంటే ఉద్యోగమిచ్చినవాడు వెధవ అన్నమాట ఈవిడ దృష్టిలో)
మీ అబ్బాయి ఫోటో, వివరాలు whatsapp లో పంపండి , మా అమ్మాయిది పంపుతాము అంటుంది ! మనం పంపిస్తే వారు పంపరు. తరవాత
మనమే ఫోన్ చేయాలి. అడిగితె మొదటి వారం:
"ఇంకా అమ్మాయి చూడలేదండి". రెండవ వారం :
" అమ్మాయి లేట్ గా వస్తోందండి.
ఇంకా చూడలేదు" .
మూడవ వారం:
" ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉందండి".
నాలుగో వారం:
శని,ఆదివారాలలో " అమ్మాయి తలనోప్పని పడుకుందండి" .
ఐదో వారం:
అమ్మాయి పేకేజ్ మీకన్నా 10 వేలు ఎక్కువండి. ఒప్పుకోలేదు" అని కానీ , లేదా " మీరు ఇన్ని సార్లు చెయ్యవలసిన అవసరం లేదండి . మేమే చేస్తాము" అనిఫోన్ పెట్టేసి, తరవాత మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు.

💥అమ్మాయిల విషయానికొస్తే:
తల్లి తండ్రుల గారాబం, తరవాత వారిమాట వినకపోవడం , మితిమీరిన స్వేచ్ఛా జీవితంతో పెళ్లి చూపులనాడు పెళ్ళి కోడుకుతో సంభాషణ ఏకాంతంగా:

"మీ ఇంట్లో బాగేజీ , లగేజి ఉన్నాయా?
మీ ఇంట్లో వీల్ ఛైర్ లు ఉన్నాయా?
మీ ఇంట్లో డస్ట్ బిన్లు ఉన్నాయా?
మీ ఇంట్లో రాహు కేతువులున్నాయా?"
అని అబ్బాయి తల్లితండ్రుల
నుద్దేసించి పై ప్రశ్నలు . తరవాత,

"మీ అమ్మ నాన్నలు మనతో
ఉండడానికి వీలు లేదు,

నా సెల్ నువ్వు ఆన్సర్ చెయ్యొద్దు.
నీ సెల్ నేను ముట్టుకోను!

నేను వంట చెయ్యను.
కర్రి పాయింట్ లో తెచ్చుకుందాము!
లేదా వంటమనిషి పెట్టుకుందాం..

నాజీతం సేవింగ్స్ కోసం బ్యాంకులో ,
నీ జీతం ఖర్చుపెడదాము!"

ఇంకా కొంతమంది " మనకి పిల్లలు వద్దు" అని నిబంధనలు.
కావాలి అని గట్టిగా పట్టుపడితే ఎక్కడైనా తెచ్చి పెంచుకుందాం...

లేకపోతె తాంబూలాలు లేవు.
కొన్ని షరతులు తరవాత చెప్పి కూడా
తాంబూలాలు కాన్సిల్ చేసుకొన్న కేసులు చాలా ఉన్నాయి..

పెళ్ళైన తరవాత ఖర్మకాలి వారికి పడక.. విడాకుల వరకు వస్తే,
విడాకులకై సంతకం పెట్టాలంటే లక్షలు పరిహారం.
అప్పటికే అబ్బాయి క్రెడిట్,డెబిట్ కార్డులు బాలన్స్ జీరో చేసేస్తుంది. కాపురం చేయటం భయమేస్తుంది అంటుంది...
విడాకులైనా ఏ మాత్రము
మార్పు, బాధ లేకుండా
కొత్త పెళ్లి కూతురు లాగ అవే కండిషన్లు.
సర్దుబాటు వ్యవహారం, పశ్చత్తాపం ఏకోశానా ఉండవు.

వీటన్నిటికి వెర్రి తల్లి సపోర్ట్!

ఇలాంటి వాళ్లకు మళ్లీ ఒక బకరా నీ చూసి పెళ్లి చేస్తారు కాని, కాపురం చేయించగలరా?

ఉద్యోగం చేసే ఊరినుండి, లేదా విదేశాలనుండి వచ్చిందంటే సూట్కేసులతో సరాసరి ఎయిర్ పోర్ట్ నుండి అమ్మగారి ఇంటికే. 15 రోజుల తరవాతో లేదా వెళ్ళిపోయే టప్పుడు ఒక వారం ముందరో అత్తగారింట్లో ప్రత్యక్షం.

ప్రమాదమేమంటే,
మగవారికి సంతానోత్పత్తి 90 సంవత్సరాలు దాకా ఉంటుంది. కాని
ఆడవారికి మొనోపోజ్ వచ్చిందంటే కుదరదు. ఇప్పుడు 35 సంవత్సరాలు దాటితే వచ్చేస్తోంది. తల్లితండ్రులు ఈ సంగతి తెలిసో, తెలియకో నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటున్నారు.
ఆడపిల్లల సంపాదన మరిగి వారికి వచ్చిన సంబంధాలు తోసిపుచ్చే తల్లితండ్రులు.... కాపురాలు చెడగొట్టి వాళ్ళ సంపాదనతో జల్సా చేసే... తల్లితండ్రులు కూడా ఉన్నారు అనటానికి ఏమాత్రం సందేహం లేదు. కొంత మంది ఆడపిల్లలు స్వయంగా చెప్పిన వ్యధ ఇది ! (వీళ్ళు కళ్ళు తెరిచేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది)
ఇవండీ! మన మగ పిల్లలకు వివాహం కాకపోవడాని కారణాలు , వాస్తవాలు!
అనుభ వించిన వారు చెప్పిన
నగ్న సత్యాలు!
నేను రాసినవి మాట్రిమొని కన్వెక్షన్లకు వెళ్ళినప్పుడు అక్కడి తల్లితండ్రులు , ఆడపిల్లలు వేదనతో చెప్పిన యదార్ధ సత్యాలు. అంతేకాని, ఆడపిల్లలమీద అభాండాలు వెయ్యడం కోసం మాత్రం కాదు. 👉ఇది కేవలం అటువంటి ప్రవృత్తి కలవారికి మాత్రమె!👈
🌹30 సం. వయసు దాటిఅదృష్టవంతులైన పెళ్లి కాని ప్రసాదులకు ,
🌹పెళ్లి చేసుకొని బాధలుపడి విడాకులు తీసుకొన్న అబ్బాయిలకు,
🌹ఇంకా పెళ్ళి చేయ్యక మంచి , మంచి అని సంబంధాలు వెదుకుతూ
అత్యాశతో వయసు దాటబెట్టిన అమ్మాయిల తల్లితండ్రులకు ,
🌹18 వయసు ఫోటోలు పెట్టి పాకేజీలను , క్వాలిఫికేషన్లు పోల్చుకొని
అత్యాసతో చార్మింగ్ పోయి జుట్టుకు రంగేసుకుని ఇంకా ఎదురు చూస్తున్న అమ్మాయిలు ,
🌹అబ్బాయిలకు
🌹తల్లితండ్రుల స్వార్థ ఆలోచనలకు మనస్పర్థల తో ఉద్యోగాలు మాని కోర్టుల చుట్టూ తిరుగుతున్న అమ్మాయిలకు
ఈ పోస్ట్ అంకితం.👍

🌷పోయిన వయసు రాదు.
🌷"35 వయసు దాటిన అబ్బాయిలు ఇంటర్ కాస్ట్ కి వెళ్ళిపోవడమే ఉత్తమం".

"పురుషుడు-స్త్రీ- వయస్సు"
ఇవి మూడే ముఖమైనవి.
జీతం, చదువు కాదు
ఒక వ్యక్తి ఆవేదన.

అందరూ... ఆలోచించండి.
👉పై ప్రవృత్తి కలిగిన... మన గ్రూప్ లో లేని వారికి అందరికీ పంపండి... కొంచమైనా ఆలోచిస్తారు..👈.

💥సర్వేజనాసుఖినోభవంతు .

Source - Whatsapp Message

పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!

 

పిల్లలు చెడిపోవడానికి అస్సలు కారకులు మొబైల్స్ కాదు మీరే (తల్లిదండ్రులే)...!!!

👏👍👋😷


పిల్లల్ని గారాబంగా చూసుకోవడం మంచిదే కానీ, అది మరీ శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది..

పిల్లల పట్ల మనం చూపిస్తున్న అతి ప్రేమనే వారిని చాలా వరకు బద్దకస్తుల్ని చేస్తుంది, ఇది ముమ్మాటికీ నిజం..

వారిని సుకుమారంగా చూసుకోవాలి అనే ప్రీతిలో వారిని సోమరులుగా మారుస్తున్నారు..

ఇప్పుటి తరం పిల్లలు..
(10 సంవత్సరాలు దాటిన వాళ్ళు)

🔥 తల్లిదండ్రుల కారు, బండి తుడవమంటే తుడవరు..
🔥 మంచి నీళ్ళు, పాలు, కిరాణా సరుకుల కోసం బయటికి వెళ్ళమంటే వెళ్లరు..
🔥 లంచ్ బ్యాగ్ లు, స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు..
🔥 కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులలో సహాయం చేయరు...
🔥 రాత్రి 10 గంటల లోపు పడుకుని, ఉదయం ఆరు లేదా ఏడు గంటల లోపు నిద్ర లేవ మంటే లేవరు...
🔥 గట్టిగా మాట్లాడితే ఎదురుతిరగబడి సమాధానం చెబుతారు..
🔥 తిడితే వస్తువులను విసిరి కొడతారు..

ఎప్పుడు అయినా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు, నూడుల్స్ ప్యాకెట్లు, ఫ్రెండ్స్ కి పార్టీలు, ఫ్రెండ్స్ కోసం గిఫ్ట్ లు కొనుగోలు చేస్తున్నారు..

🔥 ఆడపిల్లలు అయితే తిన్న కంచం కూడా కడగటం లేదు..
🔥 ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..
🔥 అతిథులు వస్తే కనీసం గ్లాసుడు మంచి ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడ ఉన్నారు..
🔥 20 సంవత్సరాలు దాటిన చాలామంది ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..
🔥 బట్టలు పద్ధతిగా ఉండాలి అంటే ఎక్కడలేని కోపం వీరికి..
🔥 కల్చర్, ట్రెండ్, టెక్నాలజీ పేరిట వింతపోకడలు..
వారిస్తే వెర్రి పనులు..

మనమే పిల్లలచేత అవన్నీ చేయించడం లేదు,
కానీ కారణం మనమే..
ఎందుకంటే మనకు అహం, పరువు, ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి..
చూసేవాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి, రిచ్ లుక్, స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం..
గారాభంతో పెరిగిన వారు మధ్యలో మారమంటే మారడం అస్సలు జరగదు..
వారిని కష్ట పెట్టమని కాదు ఇక్కడ చెప్పేది..
కష్టం గురించి తెలిసేలా పెంచండి
కష్టo, డబ్బు, సమయం, ఆరోగ్యం విలువ తెలియకపోతే.. వారికి జీవితం విలువ తెలియదు..

ప్రేమతో, గారాబంగా మనం చేస్తున్న తప్పుల వల్లే.. కొందరు యువత 15 ఏళ్లకే సిగరేట్స్, మందు, బెట్టింగ్, దొంగతనాలు, డ్రగ్స్, రేప్ లు, హత్యలు చేస్తున్నారు..
మరికొంతమంది సోమరిపోతులు లా తయారు అవుతున్నారు..

అభినయాలు కనపడడం లేదు, అనుకువగా ఉండటం రాదు, సంస్కృతి, సంప్రదాయాలు పట్టించుకోవడం లేదు..
ఇలాగే ఉంటే కొంత కాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

భార్యకు వంట వండటం సరిగా రాదని నేటి యువత బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంట పడుతూ చిన్న వయసు లోనే గ్యాస్టిక్ అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్ , కిడ్నీ స్టోన్ ల బారిన పడుతున్నారు..

మరొక ఫ్యాషన్ ఏమిటంటే పెరుగు మజ్జిగ తీసుకుంటే వాంతులు చేసుకోవడం..
కొన్ని ఆహార పదార్థాలు ఎంత ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అనవసరం...

కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫెన్, లంచ్ చిన్న బాక్సు రైస్..
చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు...

గర్భవతులు అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం, 100 లో 90 మంది సిజేరియన్ ద్వారా పిల్లల్ని కంటున్నారు అంటే వారి శారీరక పటుత్వం ఎంత పడిపోయిందో ఆలోచించండి..
అలా ఉంటే పుట్టే పిల్లలు కూడాఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు..
3వ తరగతి పిల్లాడికి సోదబుడ్డి లాంటి కళ్ళద్దాలు..
5వ తరగతి వారికి అల్సర్, బీపీ లు..
10 వ తరగతి దాటేలోపు ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చేస్తున్నాయి..

వీటన్నికి కారణం మనం మన పిల్లలను సరైన పద్ధతిలో పెంచకపోవడమే..
అందుకే తల్లిదండ్రులు మారాలి..

రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం...?

ఒక్కసారి ఆలోచన చేయండి...

సంస్కృతి సాంప్రదాయం అంటే ఏమిటి...?

కేవలం గుడికి వెళ్లో, చర్చికి వెళ్లో, మసీదుకు వెళ్ళో
పూజలు, ప్రార్థనలు చేసి మన సంస్కృతి సాంప్రదాయం అని పిల్లలకు అలవాటు చేస్తున్నాము, అది మాత్రమే కాదు సాంప్రదాయం అంటే.. అలా అనుకోవడం కొంత పొరపాటు..

పిల్లలకు..👇

👉 బాధ్యత
👉 మర్యాద
👉 గౌరవం
👉 కష్టం
👉 నష్టం
👉 ఓర్పు
👉 సహనం
👉 దాతృత్వం
👉 ప్రేమ
👉 అనురాగం
👉 సహాయం
👉 సహకారం
👉 నాయకత్వం
👉 మానసిక ద్రృఢత్వం
👉 కుటుంబ బంధాలు
👉 అనుబంధాలు
👉 దైవ భక్తి
👉 దేశ భక్తి

ఈ భావనలు సంప్రదాయాలు అంటే..

కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి..
ఇవన్ని అలవాటు అయితే ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సామాజిక సృహ, ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారమవుతాం..

పిల్లలకు ప్రేమ, భయం తో పాటుగా వాళ్ళు అన్ని విషయాలు మనతో పంచుకునే స్నేహపూర్వక వాతావరణం కల్పిద్ధాం...

మనం కూడా మమేకమవుదాం...

భావి తరాలకు ఒక మానవీయ, విలువలతో కూడిన, సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై బాటలు వేద్దాం..
💐💐💐💐💐

Source - Whatsapp Message

మంచి మాటలు

బుధవారం --: 30-09-2020 :-- ఈరోజు మంచి మాటలు ....

మనకు సంతృప్తి సాధనలో ఉండదు మనం చేసేణ ప్రయత్నంలో ఉంటుంది మనం పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తే మనం విజయం కూడా పూర్తిస్థాయిలోనే అందుతుంది

ఏ మనిషి కూడా పుట్టుకతో శత్రువునో మిత్రుడినో వెంట తెచ్చుకోడు.వారి మాట తీరు , ప్రవర్తనే మంచో చెడో నిర్ణయిస్తుంది ప్రపంచంలో కెల్లా అతి ఖరీదైనది నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది .
పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే పడుతుంది .

నటించడం తెలిసిన వారికి ప్రాణం పోయేంత వరకూ ప్రేమించడం రాదు , ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు ! బలం అంటే ఎదుటి వాణ్ణి క్రింద పడేలా కొట్టడం కాదు , క్రింద పడ్డ వారిని పైకి లేపడం

మనలో మనకు పలకరింపులు లేకపోతే అనుబంధాలు ఉండవు మనం ఒకరిని ఒకరు గౌరవించుకోక పోతే ప్రేమలుండవు మనపై ఎదుటి వారి నమ్మకం అనేది లేకపోతే ఒకరితో ఒకరు ఉండలేరు మనషికి ప్రశాంతతను ఇచ్చేది మాత్రం మనసుకు నచ్చినవారు మాత్రమే .

*మీ ... AVB సుబ్బారావు 👍🤝🕉️💐

Source - Whatsapp Message

'త్రి'మూర్తుల తత్వం - విశిష్ఠత.

 

💐💐💐'త్రి'మూర్తుల తత్వం - విశిష్ఠత.💐💐💐

ఈ సృష్ఠి-రచనలో ఒకే పర బ్రహ్మ తత్వం ప్రధానంగా మూడు రూపాలుగ గోచరిస్తుంది !!
మూడు కార్యాలు చేస్తుంది !!
1 - బ్రహ్మ :
2 - విష్ణువు :
3 - మహేశ్వరుడు:

1 - మహా సరస్వతీ
2- మహా లక్ష్మీ
3 - మహంకాళీ

1- సృష్ఠించే శక్తిని బ్రహ్మ అన్నారు !!

ఏదైన వస్తువు తయారు చేసే వాడికి ఆ వస్తువు సంభంధించి పరి పూర్ణమైన జ్ఞానం వుండాలి కదా !! జ్ఞానానికి అధిష్ఠాన దేవత సరస్వతీ మాత బ్రహ్మ గారి సృష్ఠి రచనకు సహకారం అందిస్తుంది కనుక ఆమె ఆయన భార్య అయింది !!

2 - పోషణ-పాలన శక్తిని విష్ణువు అన్నారు !!

ఎవరినైనా పోషించాలన్నా , ఆలన-పాలన చూడాలన్నా ఎవరికైనా ప్రధానంగా ఏమి కావాలి ధనం,ఐశ్వర్యం కావాలి కదా !! సర్వ సంపదలకు అధిష్ఠాన దేవత లక్ష్మీ దేవి విష్ణుమూర్తి పాదల దగ్గర సేవ చేసుకుంటూ వుంటుంది !! ఈ జగత్తును
పోషించే పనిలో, ఆలన-పాలనలో ఆమె ఆయవకు భార్యగా ఒక గృహ యజమానికి ఒక గృహిణి సహకరించే రీతిన సహకారం అందిస్తుంది అన్నమాట !!

3 - సంహారం చేసే శక్తిని మహేశ్వరుడు అన్నారు !!

ఎవరి నైనా కొట్టాలన్నా దండించాలన్నా ఏమి కావాలి శక్తి - బలం కావాలి కదా !! ఇంత పెద్ద సృష్ఠిని లయం చేయాలంటే ఎంతటి శక్తి
అవసరం !! అందుకే సర్వ శక్తి స్సరూపిణి అయిన పార్వతీ మాత మహంకాళీ రూపంలో ప్రళయ కాలంలో మహేశ్వరునికి అర్ధాంగిగా సహకరిస్తుంది !! ఇదీ తత్వం !!

ఇంగ్లీషులో దేవుడినీ GOD అంటారు !!

G :- Generater సృష్ఠించే వాడు !!
O :- Operater పాలించే వాడు !!
D. : Destroyer సంహారం చేసే వాడు !!

Source - Whatsapp Message

మంచి మాటలు

 

ఆదివారం --: 27-09-2020 :-- ఈరోజు AVB మంచి మాటలు ...

అలిసే వరకూ ఆడితే అది ఆట గెలిచే వరకూ చేస్తే అది యుద్దం చచ్చేంతవరకూ బతికితే అది జీవితం చచ్చినా కూడా బతకగలిగితే అది నీ మంచితనం .

కష్టాల్ని ఎదురించే దమ్ము బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబో తున్నావని అర్థం .

బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సివస్తే వంచేయి కానీ ! ప్రతిసారి నువ్వే తలవంచాల్సివస్తే ఆ బంధం కోసం ఆలోచించాల్సిందే . మనం ఏ పనిని మొదలు పెట్టిన అది పూర్తియినంత వరకు ఆపవద్దు

ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు భానిస అయినట్లుగానే ప్రతి మనసు కొన్ని మనసులకు భానిస అవుతుంది . ఆ మనసులు దూరంగా ఉన్నా , కనిపించక పోయినా , మాట్లాడకపోయినా ఆ మనసు లో లోనే వేదన చెందుతూ ఉంటాడు .

బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా దిగజారి పోవలసిందే . మనసు విలువ తేలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే . విలువ లేని బంధం , మనసు లేని అందం ఎంత ఉన్నా పనికి రానిదే .

*మీ ... AVB సుబ్బారావు 🌹🤝💐🕉️

Source - Whatsapp Message

Good message

 

1. Get married before 30.

when you are ready

2. Retire with enough money.

enough memories.

3. Become Rich

what makes you happy.

4. Fall in love with someone beautiful.

inner beauty.

5. Make parents of how much learn.

how happy I am.

6. Make many friends

real

7. Happiness lies in big moments.

small

8. Find someone you can live with.

can't live without.

Source - Whatsapp Message